Friday, August 20, 2021

నాసాగ్ర దృష్టి


'నాసాగ్ర దృష్టి'తో ధ్యానం చేయమని భగవద్గీతలో ఉంది. 'నాసాగ్రం' అంటే 'ముక్కు కొన' అని అర్థమా... లేక భ్రూమధ్యమా (కనుబొమల నడిమి)... నాసాగ్రే నవమౌక్తికం అనేటప్పుడు 'ముక్కు కొనలో ముత్యమ'నే అర్ధం కదా...

శ్రీకృష్ణుని సౌందర్యాన్ని వర్ణిస్తూ చెప్పిన 'నాసాగ్రే నవమౌక్తికం' అంటే 'ముక్కు కొనపై అలంకరించు కున్న ముత్యం' అనే అర్ధం. కానీ ధ్యానం విషయంలో చెప్పేటప్పుడు మాత్రం 'నాసాగ్ర దృష్టి' అంటే 'కనుబొమల మధ్య (భ్రూమధ్యం) దృష్టి' అనే అర్ధం.

ఎందుకంటే... రెండూ నాసానికి 'అగ్రాలే' (కొనలే). కానీ ధ్యానంలో అధో దృష్టి కూడదు. ఊర్ధ్వ దృష్టే ముఖ్యం. పైగా.. యోగశాస్త్రంలో భూమధ్య దృష్టినే ధ్యానానికి ముఖ్యంగా చెప్పారు. 'అవిముక్తోపాసన' అని ఉపనిషత్తులలో ప్రత్యేకించి చెప్పబడింది. 'భ్రూఘ్రాణంబుల సంధి అవిముక్తం' అని అక్కడ నిర్వచించారు.

అవిముక్త క్షేత్రం మన శరీరంలో కనుబొమల నడుమ ఉంది. అక్కడ బిందు (జ్యోతి) రూపంగా వున్న పరమాత్మను ధ్యానించడమే అవిముక్తోపాసన అని చెప్పారు. ఇలా అనేక యోగశాస్త్రాలలో 'నాసాగ్రం' అనే పదానికి, 'భ్రూమధ్యం' అనే చెప్పబడింది. కనుక గీతలో చెప్పబడిన 'నాసాగ్ర దృష్టి'కి భ్రూమధ్యమనే అర్థం...


No comments:

Post a Comment

నవగ్రహ స్తోత్రములు (తాత్పర్య సహితము)

🙏 నవగ్రహస్తోత్రం 🙏 ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః!! ꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂ 🕉️ 01. రవి (ఆదిత్య): 🙏 ...