Friday, August 20, 2021

నాసాగ్ర దృష్టి


'నాసాగ్ర దృష్టి'తో ధ్యానం చేయమని భగవద్గీతలో ఉంది. 'నాసాగ్రం' అంటే 'ముక్కు కొన' అని అర్థమా... లేక భ్రూమధ్యమా (కనుబొమల నడిమి)... నాసాగ్రే నవమౌక్తికం అనేటప్పుడు 'ముక్కు కొనలో ముత్యమ'నే అర్ధం కదా...

శ్రీకృష్ణుని సౌందర్యాన్ని వర్ణిస్తూ చెప్పిన 'నాసాగ్రే నవమౌక్తికం' అంటే 'ముక్కు కొనపై అలంకరించు కున్న ముత్యం' అనే అర్ధం. కానీ ధ్యానం విషయంలో చెప్పేటప్పుడు మాత్రం 'నాసాగ్ర దృష్టి' అంటే 'కనుబొమల మధ్య (భ్రూమధ్యం) దృష్టి' అనే అర్ధం.

ఎందుకంటే... రెండూ నాసానికి 'అగ్రాలే' (కొనలే). కానీ ధ్యానంలో అధో దృష్టి కూడదు. ఊర్ధ్వ దృష్టే ముఖ్యం. పైగా.. యోగశాస్త్రంలో భూమధ్య దృష్టినే ధ్యానానికి ముఖ్యంగా చెప్పారు. 'అవిముక్తోపాసన' అని ఉపనిషత్తులలో ప్రత్యేకించి చెప్పబడింది. 'భ్రూఘ్రాణంబుల సంధి అవిముక్తం' అని అక్కడ నిర్వచించారు.

అవిముక్త క్షేత్రం మన శరీరంలో కనుబొమల నడుమ ఉంది. అక్కడ బిందు (జ్యోతి) రూపంగా వున్న పరమాత్మను ధ్యానించడమే అవిముక్తోపాసన అని చెప్పారు. ఇలా అనేక యోగశాస్త్రాలలో 'నాసాగ్రం' అనే పదానికి, 'భ్రూమధ్యం' అనే చెప్పబడింది. కనుక గీతలో చెప్పబడిన 'నాసాగ్ర దృష్టి'కి భ్రూమధ్యమనే అర్థం...


Wednesday, August 18, 2021

అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన కలుగు ప్రయోజనాలు

1. ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది.

2. ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామికి తమల పాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబందమైన పీడలు తొలగిపోతాయి.

3. సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది.

4. కొందరు చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. చాలా నీరసంగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు.

5. వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది.

6. ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడుతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది.

7. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది

8. వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి.

9. సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.

10. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్ధించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం కలుగుతుంది.

11. వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్ధించి తమలపాకుల హరాన్ని సమర్పించి, ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది.

12. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది.పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనికి పర్ణ ప్రసాదమనే పేరు.


హనుమాన్ మంత్రాన్ని రోజు ఉచ్చరించడం వల్ల శక్తి, ధైర్యంతోపాటు శారీరక సామర్థ్యం కూడా పొందుతారు.

1.ఓ హనుమంతాయ నమ:,

2.హం పవన నందాయ స్వాహ

అంటూ మంత్రోచ్ఛారణ గావిస్తే ధైర్యంతోపాటు శారీరక సామర్థ్యం కూడా పొందుతారు.

3.హం హనుమంతాయ రుద్రాత్మక హం ఫట్ 

ఈ రహస్య మంత్రాన్ని పఠించడం ద్వారా అపరిమితమైన శక్తిని పొందవచ్చు. 

"ఓ నమో భగవతే ఆంజనేయ మహాబలాయ స్వాహ"

మంత్రాన్ని 21 వేల సార్లు ఉచ్ఛరిస్తే మొండి రోగాలు, దుష్ట శక్తులు పీడనం తొలగిపోవడమే కాదు, జీవితంలో ఎదురైన ఇతర ఆటంకాలు కూడా తొలగిపోతాయి.

Friday, August 13, 2021

శబరిమలకు ఇంతటి జనాకర్షణ శక్తి ఎలా సంక్రమించినది ?

భారతావనిలోని ప్రఖ్యాతిగాంచిన యాత్రాస్థలములకన్న మిక్కిలి విశిష్ఠతలు శబరిగిరికి గలదు. సాధారణముగా పుణ్యస్థలమను వానికి కింద సూచించిన ఏడు విశిష్ఠతలలో ఒకటైనను పొంది యుండవలయును.

1) స్వయంభు విగ్రహ భూమి ..... జనులచేత ప్రతిష్ఠింపబడక స్వయముగా ఆవిర్భవించిన మూర్తిమంతము.

2) యజ్ఞ భూమి...... యడతెగని యజ్ఞయాగాదులు జరిగిన - జరుగుచున్న స్థలము.

3) బలి భూమి...... భక్తిమార్గ యుద్ధములు జరిగిన స్థలము.

4) యోగ భూమి...... ఋషులు , రాజులు , యోగ విద్యనభ్యసించిన స్థలం.

5) తపో భూమి..... యోగీశ్వరులు , మునిపుంగవులు తపమొనర్చిన స్థలము.

6) దేవ భూమి...... దేవతలు దిగివచ్చి పూజలు సలిపి వెళ్ళిన స్థలము.

7) సంగమ భూమి...... పుణ్యనదులు సంగమించే స్థలము.


ఈ ఏడింటిలో ఏ ఒకటి యుండినను ఆ స్థలము పుణ్యతీర్థా స్థలముగా లెక్కించ బడును. ఆ స్థలమునకు యాత్ర వెళ్ళుట వలనను , అచ్చటి దేవతామూర్తిని దర్శించుట వలనను జీవుల సర్వపాపములు తొలగి అనంతకోటి పుణ్యము కలుగునని శాస్త్రము నందు చెప్పబడియున్నది.

పై చెప్పబడిన ఏడు అంశములు (విశిష్ఠతలు) శబరిమలకు కలిగి యున్నందున ఇచ్చటికి విచ్చేసి తీర్థస్నానమాడి స్వామి అయ్యప్పను దర్శించుకొనువారి పాపములన్నియు నశించి ఎనలేని పుణ్యము లభించును. పాపములన్నియు నశించుట వలన  మోక్షప్రాప్తియు లభ్యమగును.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

మహిమాన్విత చలం అరుణాచలం

పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలసిన అతి మహిమాన్విత క్షేత్రం తిరువణ్ణామలై అనబడే అరుణాచలం. 


అనేక మహిమలు కలిగిన అరుణాచల  గిరిని ప్రదక్షిణం చేయడం వలన కలిగే శుభ ఫలితాలు అనేకం.


🔱సోమవారంనాడు ప్రదక్షిణలు

చేస్తే లోకాలను ఏలే  శక్తి

లభిస్తుంది.


🔱మంగళవారం ప్రదక్షిణం చేస్తే

పేదరికం తొలగిపోతుంది. సుభిక్షంగా వుంటారు. జనన మరణాల

చక్రం నుండి విముక్తి లభిస్తుంది. మహాత్ములు

శేషాద్రి స్వాములు వంటి సిధ్ధులు మంగళవారంనాడే గిరి ప్రదిక్షణలు చేసేవారు.


🔱బుధవారం   గిరి

ప్రదక్షిణం చేస్తే  లలితకళలలో రాణింపు,

విజయం లభిస్తుంది.


🔱గురువారం గురువారం

ప్రదక్షిణం చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది.


🔱ప్రతి శుక్రవారం గిరి ప్రదక్షిణం చేస్తే వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది.


🔱శనివారాలలో గిరి ప్రదక్షిణం చేస్తే

నవగ్రహాల కటాక్షం సిధ్ధిస్తుంది.


🔱 ఆదివారం నాడు అరుణాచలగిరి ప్రదిక్షణలు చేస్తే కైలాసప్రాప్తి కలుగుతుంది.

  

           🌸


🔱 సంతానహీనులైన భార్యాభర్తలు 48 రోజులపాటు భక్తితో

సరిగంగస్నానాలు చేసి గిరి ప్రదక్షిణలు

చేస్తే సంతానభాగ్యం కలుగుతుంది.

            🌸


🔱గిరిని ప్రదక్షిణం చేయడానికి

వేసే మొదటి అడుగుతోనే

ముల్లోకాలు చుట్టివచ్చిన పుణ్య

ఫలం లభిస్తుంది.

రెండవ అడుగులో పవిత్ర  తీర్ధాలలో స్నానం చేసిన

పుణ్యఫలం లభిస్తుంది.

మూడవ అడుగు వేయగానే అశ్వమేధ యాగం చేసిన

పుణ్యం లభిస్తుంది.

నాలుగవ అడుగు వేయగానే

అష్టాంగ యోగం  చేసిన

ఫలితం లభిస్తుంది.


🌺

తిరువణ్ణామలైలో  జరిగే

కార్తీక దీపోత్సవం నాడు

ఐదు సార్లు గిరికి ప్రదక్షిణలు

చేసి వస్తే పాప విమోచనం 

లభిస్తుంది.


🌺

భరణీ దీపం  రోజున ప్రాతఃకాలమున మూడున్నర

ఘంటలకు ఒక సారి,

ఏడు గంటలకు ఒకసారి, పగలు 11 గంటలకు ఒకసారి సాయంకాలం

దీపదర్శన  సమయాన  ఒకసారి రాత్రి 11గం.లకు

ఒకసారి అని ఐదు సార్లు

గిరి ప్రదక్షిణలు చేస్తే

ఘోర పాపాలన్నీ హరిస్తాయి.


🌺

గిరి ప్రదక్షిణం చేసి రాగానే

స్నానం చేయడమో..

నిద్రపోవడమో చేయకూడదు.

వాటివల్ల పుణ్యఫలం 

తగ్గి పాపం ఫలం కలుగుతుంది. భగవన్నామ స్మరణలోనే గడపాలి.

Wednesday, August 11, 2021

మనిషి పాటించాల్సిన దశవిధ సూత్రాలు

1. పూజ మధ్యలో మాట్లాడితే,  ఎవరితో మాట్లాడతామో వాళ్ళకి మన పూజ ఫలితం వెళ్తుంది అని శాస్త్ర వాక్కు.* 


2. జపం చేసేటప్పుడు జపమాల పొరపాటు గా కూడా కింద పడకూడదు.. 


*3. అగ్ని ఎక్కడ ఉన్న అది పవిత్రమైన భగవంతుడి శక్తి.  దాన్ని నోటితో ఊదడం దోషం.* 


4. మన శరీరం లో ఒక్కో అంగానికి ఒక్కో దేవత ఉంటారు. అవయవాల్ని తిట్టుకోవడం,  కొట్టుకోవడం దోషం. అలాగే పంచ భూతాల్లో వేటిని కూడా తిట్టడం కానీ కోపంగా తన్నడం కానీ, దాటడం కానీ చేయకూడదు. 


*5. అరుణాచలం పుణ్యక్షేత్రం లో గిరి ప్రదక్షిణం రోడ్ కు ఎడమవైపు నుండే నడవాలి. కుడి వైపు ఎప్పుడూ దేవతలు ప్రదక్షిణ చేస్తుంటారు.*

 

6. జున్ను పాలు తినరాదు. ఆవు ఈనిన 11 రోజుల లోపు, ఆవు దగ్గర పాలు తీసకోకూడదు. 


*7. పడుకునేటప్పుడు దైవ నామస్మరణ చేస్తూ  పడుకుని, లేచేటప్పుడు, అదే నామం చెబుతూ లేస్తే పడుకున్నoత సేపు కూడా దైవనామ స్మరణ ఫలితం వస్తుంది.* 


8. వినాయకుడికి తులసి,  సూర్యనారాయణ స్వామి కి మారేడు వేయకూడదు. 

ఏకాదశి,  అమావాస్య, పౌర్ణమి, ద్వాదశి దినాలలో తులసిని తుంచరాదు.  పూజకి,  దేవుడి పూజకి వేర్వేరుగా తులసి ని పెంచుకోవాలి. 


*9. మన చుట్టూ ఎన్నో సూక్ష్మ శరీరాలుంటాయి. అవి అన్నం లోని సారాన్ని తీసుకోవడానికి ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాయి.  అందుకే దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినడం ,  అన్నం ప్లేట్ లో పెట్టాక చాలా సేపటికి తినడం,  ప్లేట్ పెట్టి, గట్టిగా అన్నం పెట్టాను రమ్మని పిలవడం,  మూతలు పెట్టకుండా ఉంచడం,  ఎండిపోయినవి తినడం నిషిద్ధం. అయితే ఏమౌతుంది అని, అవి కూడా జీవులే కదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.  అయితే అవి అన్నం లోని సారమంతా తీసుకున్నాక,  మనము తింటే శక్తి రాదు,  మనసు పై ప్రభావం పడి, పాపపు ఆలోచనలో,  లేక మానసిక ఒత్తిడి కో దారి తీయొచ్చు.  అందుకే ఎప్పుడూ అన్నం భగవత్ నైవేద్యంగాపెట్టి, కాకి కి పెట్టి తినడం వల్ల వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి.*  


10. తడి కాళ్లతో పడుకోకూడదు.  అన్నం తినే ముందు తిన్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి.

తులసి దళాలను ఎలా త్రెంపాలి, తులసి పూజ ఎలా చేయాలి,?

తులసీ దయాపూర్ణకలశీ - తులసి పూజ, దళచయనం


కార్తీక మాసం కదా? తులసి పూజ, తులసి వివాహం ఈ నెలలో వచ్చిన విశేషమైన పూజలు. తులశమ్మ విశేషాలు కొన్ని తెలుసుకుందాం.


తులసి - స్వయంగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకలసంపదలకు లొంగక, రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు మన సనాతన ధర్మంలో. తులసిలేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. 


మరి తులసి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టటం మన కనీస ధర్మం. అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలది. మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తులసి పత్రాలు అమృతముతో సమానము


అనన్యదర్శనాః ప్రాతః మే పశ్యంతి తపోధన

జగత్త్రితయ తీర్థాని తైర్దృష్టాని న సంశయః


ఉదయము నిద్రనుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది.


తులసిచెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరిక, మానసిక ఆరోగ్యమునిస్తుంది.


*తులసి పూజ ఎలా చేయాలి?


తులసికోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించాలి. దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాపప్రక్షాళన జరుగుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. 


తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు.


ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి.


నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే!

నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే!

బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ!

పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!


ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం

యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్


అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి.


యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః

యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం


అని చెంబులోని నీళ్లను తులసిచెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి.


తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే

నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే


అని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి.


పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.


తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః - పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కాందపురణం చెప్పింది.


తులసి చెట్టునుండి దళాలను మంగళ, శుక్ర, ఆది వారములలో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు. ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది. 


తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు. ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి. 


సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధము వర్తించదు. సాలగ్రామమున్నవారు అన్ని తిథివారములయందు తులసి దళములను త్రెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం. శ్రీమహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలూ వర్తించవు. ఇది ఆహ్నిక సూత్రావళిలో చెప్పబడింది. “స్నానము చేయకుండా మరియు పాద రక్షలు ధరించి” తులసి చెట్టను తాకరాదు, దళములను త్రెంపకూడదు. ఇది పద్మపురాణంలో చెప్పబడింది.


 తులసి దళాలను ఎలా త్రెంపాలి?


తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు. రెండేసి ఆకులు కలిగిన దళముతో కూడిన కొసలను త్రెంపాలి. అన్ని పుష్పాల కన్నా తులసీ మంజరులు (అంతే తులసికి వచ్చే పుష్పాలు) అత్యంత శ్రేష్ఠమని, ఈ మంజరులను కోసేటప్పుడు వాటితోపాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్పింది.


తులసిమొక్కకు ఎదురుగా నిలబడి, రెండు చేతులు జోడించి, కింది మత్రాన్ని చదువుతూ పూజా భావంతో మొక్కను కదిలించకుండా తులసి దళాలను త్రెంపాలి. దీనివలన పూజాఫలం లక్షరెట్లు అధికంగా లభిస్తుంది అని పద్మపురాణం చెప్పింది.


మాతస్తులసి గోవింద హృదయానందకారిణి

నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే 


తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియా

చినోమి కేశ్వస్యార్థే వరదా భవ శోభనే


త్వదంగసంభవైః పత్రై పూజయమి యథా హరిం తథా కురు కురు పవిత్రాంగి! కలౌ

మలవినాశిని

(ఆహ్నిక సూత్రావళి)


శ్రీహరికి ఆనందాన్ని కలిగించే తులసీ మాతా! నారాయణుని పూజ కొరకు నీ దళములను కోస్తున్నాను. నీకు నా నమస్కారములు. అమృతమునుండి జన్మించిన, ఎల్లప్పుడు శ్రీహరికి ప్రియమైన తులసీమాతా! ఆ కేశవుని పూజ కొరకు నీ దళాలను త్రెంపుతున్నాను. నాకు అభయమునివ్వు శుభకరీ! నీ శరీరమునుండి జన్మించిన పత్రములతో ఆ శ్రీహరిని పూజిస్తాను. కలియుగంలో సమస్త దోషములు తొలగించే పవిత్రమైన శరీరము కల తల్లీ! నేను తలపెట్టిన హరిపూజను సాఫల్యము చేయుము.


పూజ చేసిన తరువాత ఒక తులసీదళాన్ని "అచ్యుతానంతగోవింద" అని స్మరిస్తూ నోట్లో వేసుకొని తినాలి. ప్రతిరోజు భక్తిభావంతో ఒక తులసిదళాన్ని సేవించటం వలన సకల రోగాలు నశిస్తాయి, రాబోయే రోగాలు నిరోధించబడుతాయి.


తులసి


తులసిని స్త్రీ కోయరాదు. పురుషుడే కోయాలి. పూజ మాత్రం ఇరువురూ చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కలనుంచి తుంచుకోవాలి. కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు.


ఆద్యాత్మిక పరంగా ,ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలననే తులసి భూలోక కల్ప వృక్షం గా దేవతా వృక్షం గా పేరు పొందింది. భగవంతుని పూజకు తులసి అతి ప్రసస్తము .తులసి గా శ్రీ మహాలక్ష్మి ఏ స్వయముగా అవతరించినట్లు పురాణములు చెబుతున్నాయి .

తులసి విష్ణువు ప్రియురాలు కనుక విష్ణువును తులసి దళాలతో పూజించేటప్పుడు పాదాల వద్దనే తులసి దళాలను వుంచవలెను .


పవిత్ర దినములలో తులసి కోయరాదు. , గోళ్ళతో తుంచ రాదు .సూర్యాస్తమయము తర్వాత తులసి కోయరాదు . మిట్ట మద్యాహ్న్నం ,అర్ధ రాత్రి వేల లో గాని తులసిని త్రుంచ రాదు . ఒకవేళ అలా చేస్తే బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుందని  పురాణాలు చెబుతున్నాయి .


ఎవరి గృహములో తులసి మొక్క వుంటుందో ,వారి గృహం తీర్ధ స్వరూపముగా వుంటుంది. తులసి దళా ల తో శివ కేశవులను పూజించిన వానికి మరల జన్మ ఉండదు, ముక్తిని పొందుతాడు.నర్మదా నదిని చూడడం ,గంగా స్నానము చేయడం,తులసి వనాన్ని సేవిచడం ఈ మూడు సమాన ఫలములను ఇస్తాయి .ఆషాడ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక సుద్ధ పౌర్ణమి వరకు చాత్రుమాస దీక్ష కావున ఈ సమయములో తులసి మొక్కను చోటు మార్చి పాత రాదు.


తులసి సన్నిదానము నందు విష్ట్ను మూర్తి ఏకాంతముగా ఉండును కనుక స్త్రీలు దళములు కోయరాదు .పురుషులు మాత్రమె కోయవలెను .


తులసి ఆకును కోసిన లగాయతు ఒకసంవస్త్సరము ,మారేడు మూడు సం. ,తామర పూలు ఏడు రోజుల వరకు పూజకు పనిచేస్తాయి .


తులసి మాల ఎక్కువుగా రాముడికి ,కృష్ణుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది.బుద్ధిని ,మనస్సును ప్రశాంతముగా ఉంచుటకు ఈ మాల ఎంతో ఉపయోగాదాయకం .తులసి మాలను ధరించడం వలన సర్వ పాపాలు నసిస్తాయి.


తులసి చెట్టు ఉన్న మట్టిలోనూ, తులసి చెట్టుమీదా అధికంగా పసుపు,కుంకుమ,అక్షతలు వేయడం వలన అక్కడ ఉన్న పోషకాలు నశించి తులసిచెట్టు ఎక్కువకాలం నిలువదు. కనుక పసుపు, కుంకుమ, అక్షతలు వేయవలసి వచ్చినప్పుడు చెట్టు మొదటిలో కాక, తులసి కోట మొదటిలో వేయడం ఉత్తమం.


స్త్రీలు ఎన్నడూ తులసీ దళాలను కోయరాదు. పురుషులచేతనే కోయించాలి. ఆపురుషులు కూడా బహుళ పక్షంలోని అష్టమీ,చతుర్దశీ, అమావాస్యా తిథులలో గానీ - పౌర్ణమినాడుగానీ – ఉభయ పక్షాలలో ఏకాదశీ,ద్వాదశీ తిథులలోగానీ – ఆది,మంగళ,శుక్రవారాలలో గానీ అస్సలు కోయకూడదు. ద్వాదశినాడు తులసిని తాకకూడదు. తులసీ దళాలను ఒడిలోకి కోయకూడదు. ఆకులోకి కానీ, ఏదైనా పళ్లెంలోకి కానీ కోయాలి. తులసీ దళాలను ఒట్టి నేలమీద ఉంచకూడదు.

Sunday, August 8, 2021

100 నిత్య సత్యాలు - ధర్మఆచారములు

0. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు. 

2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు. 

3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి. 

4. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి

5. భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు.

6. తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు. 

7. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు. 

8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది. 


9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. 


10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.


11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు. 


13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.

 

14. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.

 

15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. 


16. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు . 


17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. 


18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. 


19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. 


20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.


21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. 


22. కాళ్ళు కడుక్కొన్నాక తుడుచుకోకుండా, తడి కాళ్ళతో భోజనం చేయరాదు.

 

23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. 


24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. 


25. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు


26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను. 


27. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. 


28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. 


29. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు. 


30. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.


31. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. 


32. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా మనం స్వర్గానికి పోతాము. 


33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు. 


34. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు. 


35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.


36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.


37. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.


38. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి. 


39. తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు. 


40. వికలాంగులను వేళాకోళం చేయరాదు.


41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. 


42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు. 


43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.

 

44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.


45. ఏడవటం వలన దారిద్ర్యం, సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి. 


46. భోజన సమయంలో మాట్లాడుట, నవ్వుట పనికిరాదు. 


47. పెద్దన్న గారు, పిల్లనిచ్చిన మామ గారు, గురువు ఈ ముగ్గురు కన్నతండ్రితో సమానం కనుక వీరు ముగ్గురినీ తండ్రిలాగే పూజించాలి. 


48. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత వత్తిని మళ్ళీ వెలిగించరాదు.

 

49. ఒక చెట్టును నరికేముందు మూడుచెట్లు నాటితే కాని ఆ దోషం పోదు. 


50. అన్నమును తింటున్నపుడు ఆ అన్నమును దూషించుట కాని, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టుటకాని చేయరాదు.


51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం

52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

 

53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు. 


54. నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట, చిల్లర డబ్బులు వేయుట దోషం. 


55. ఒడిలో కంచం పళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు. అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక, వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు

56. చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట, అవమానించుకొనుట, తక్కువ వేసికొనుట చేయరాదు. 


57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి. 


58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు. 


59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.

 

60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.


61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు

.

62. ఎంతకోపం వచ్చినా తల్లిదండ్రులను, గురువును కొట్టరాదు. వారిపైకి చేయి ఎత్తరాదు. ఇంటి నుండి గెంటివేయరాదు. వారికి పెట్టకుండా పదార్థాలేవీ తాను తినరాదు. 


63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు. 


64. మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్టును నాటుట, మామిడి పళ్ళు దానం అశ్వమేథ యాగ ఫలితాన్ని ఇస్తాయి.


65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు. 


66. పాడయిపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కాని, చెరువులో కాని, సముద్రంలో కాని కలుపవలెను. ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతిపెట్టవలెను. 


67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు. 


68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి. 


69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి. 


70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.


71. కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఆ కుమారుడు మరణించినట్లైతే తండ్రితో పాటు అందరూ కట్టు బట్టలతో స్నానం చేయాలి. 


72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాక్ భంగం చాలా దోషం.


73. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు. 


74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.


75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.


76. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు. 


77. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి. 


78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు. 


79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.


80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.


81. నిత్యం తామువాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం, కనుక ఆకులలోకాని, క్రొత్త పాత్రలలోకాని వారికి ఆహారం పెట్టాలి. 


82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది. 


83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి. 


84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు. 


85. రేపు చేయవలసిన పనిని ఈ రోజు, ఈ రోజుపని ఈ క్షణమే చేయాలి. వాయిదాలు పనికిరావు. 


86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.


87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు. 


88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే. 


89. పుష్కర సమయాలలో స్నానం, శ్రాద్ధకర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే. 


90. ప్రదక్షిణలు చేసేటపుడు, మంత్ర పుష్పం ఇచ్చేటపుడు ఆసనాలపై నిలబడరాదు. కింద నిలబడి చేయాలి. పూజా సమయాలలో కొందరు చాపలు పీకుట, దర్భాసనాలు తుంచటం చేస్తారు. ఇవి మహా పాపాలు.


91. గణపతి గరికపూజ మహాప్రీతి ఏ పరిస్థితులలోనూ తులసితో పూజ చేయరాదు(వినాయక చతుర్థినాడు కుడా తులసిని సమర్పించరాదు.


92. మనుష్యుని పాపం వాడి అన్నం లోనే ఉంటుంది. అందువలన పాపాత్ముల ఇంటి భోజనం చేయరాదు. మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికీ మోక్షంరాదు.


93. జపమాల మెడలో వేసుకొనరాదు. మెడలో వేసుకొన్న మాలతో జపం చేయరాదు. 


94. బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు. దాని వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దొరికిన బంగారం వెంటనే దానం చేయుట కాని, లేదా దేవాలయాలకు ఇచ్చివేయుట కాని చేయాలి. 


95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు. 


96. భోజనసమయంలో వేదములు చదువుట, గిన్నె మొత్తం ఊడ్చుకొని తినుట పనికిరావు. ఏడుస్తూ అన్నం తినరాదు. 


97. దేవాలయం నీడను, దేవతల నీడను, యజ్ఞం చేసే వారి నీడను, గోబ్రాహ్మణుల నీడను దాటరాదు. 


98. శ్రాద్దములో భోక్తగా మిత్రుడు పనికిరాడు. అతిథులుగా భోజనం పెట్టుకొనవచ్చు. 


99. విశిష్ట వ్యక్తులను, మహాత్ములను అగౌరవపరచి, నిందించు దుర్మార్గుని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు


100. దేవాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు

ఆషాఢ అమావాస్య

ఆషాఢ మాసపు అమావాస్యను నక్షత్ర అమావాస్య, చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య నాడు దేవతలను ఒక్కసారి తలచినా, పూజించినా వేయి జన్మలు విడువకుండా అర్చించిన ఫలితం లభిస్తుంది. పితృశ్రాద్ధం, దానం, హోమం చేస్తే అక్షయఫలం లభిస్తుంది. 

పితృదేవతలు సోమపథం అనే లోకంలో నివసిస్తుంటారు. వీరంతా మరీచి అనబడే ప్రజాపతి కుమారులు. వీరికి అగ్నిష్వాత్తులు అని పేరు. వీరి మానసపుత్రిక పేరు అచ్ఛోద. ఈమె నదీరూపంలో కూడా ప్రవహించేది. ఒకప్పుడు ఈమె వెయ్యేళ్ళు స్త్రీ రూపంలో, తానే నదీ రూపంలో ప్రవహిస్తున్న తన తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలో కోరుకోమన్నారు. వారంతా మారు రూపాలలో, దివ్యరూపాలలో ఉన్నారు. అందులో ఒకాయన "మావసుడు". 

అచ్ఛోద ఆయనను తన తండ్రిగా గుర్తించలేక భర్తవు కమ్మని వరం కోరింది. తండ్రిని కామించిన దోషంతో ఆమె మానవ స్త్రీ అయిపోయింది. కాని మావసుడు మాత్రం ఆమెను ఏమాత్రం కామించలేదు. మావస్య కాలేదు కనుక ఆమెకు అమావాస్య అని పేరు వచ్చింది. అనగా మావసునికి ప్రియురాలు కానిది అని అర్థం. ఆమె తపస్సుకు మెచ్చిన పితృదేవతలు ఆమె పేరుతో అమావాస్యా తిథిని ఏర్పాటు చేసి ఆరోజు పితృతర్పణాలు ఇచ్చే వారికి అనంత సుఖాలు ఇస్తామని వరాలిచ్చారు. 

అచ్ఛోద మానవ స్త్రీ అయిపోయి పితృదేవతలను కరుణించమని కోరగా, వారు ఇరువది ఎనిమిదవ ద్వాపరంలో చేప కడుపు నుండి పుట్టి మత్స్యగంధిగా, సత్యవతిగా పరాశరుని వల్ల కృష్ణ ద్వైపాయన మునిని పుత్రునిగా పొంది, కన్యగానే ఉంటావనీ, శంతనమహారాజ పత్నివౌతావనీ, ఆపై వ్యాసుని వల్ల తరిస్తావని వరమిచ్చారు. ఆమెయే సత్యవతిగా జన్మించింది.

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు కవయిత్రి శ్రీమతి శ్రీ విద్యగారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించబడినది. )

Friday, August 6, 2021

హృదయార్పణo

మనిషి తనకు మానవజన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు. 

పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో 

పత్రమో, 

పుష్పమో, 

ఫలమో, 

జలమో సమర్పించుకుంటూ ఉంటాడు. 

ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమోగానీ, అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా? 

ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు.

 భగవంతుడిదే ఆ యావత్‌సృష్టి. అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే.

 కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు.

పూర్వం ఒక యోగి భగవంతుణ్ని అర్చించడానికి సిద్ధమయ్యాడు.

అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది.

పూజలో ఒక్కొక్క ఉపచారాన్నీ చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు- 'పరమేశ్వరా !

నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు. కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలి? 

అన్నింటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి? 

నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లెందుకు?

 పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా?

 నిత్యనిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి?

 ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి? 

గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అవసరమా? 

ఏ లేపనాలూ అవసరం లేని నీకు గంధం ఎలా పూయాలి? 

నిత్య పరిమళుడవైన నీకు పూలు పెట్టడం ఎందుకు? 

మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు తొడగాలా?

 నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరి అయినదేనా? 

జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా?

 నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు? 

విశ్వానికే ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తిపరచగలనా?

 అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి?

 అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి? 

వేదాలే నిన్ను స్తుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్తుతించాలి?'


ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు. 

భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యల్పుడే. 

వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణనలోకి రానే రాదు. 

అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది.

 నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు.

 వస్తువులు అంతకన్నా కావు. 

ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరతాడు. 

భక్తితో స్మరిస్తే చాలునంటాడు.

 కానీ మనిషి మనసు చంచలం. చపలం. స్థిరంగా ఒకచోట ఉండదు. 

లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు. 


అందుకే.......

 శంకరభగవత్పాదులు- 


'ఓ పరమేశ్వరా! 

నా మనసు ఒక కోతి వంటిది. 

అది ఎప్పుడూ సంసారవాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది.

 భార్యాపుత్రుల ప్రేమ అనే చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. 

క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది.

 అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను. 


దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకో' అని ప్రార్థిస్తారు.

సామాన్య భక్తులను తరింపజేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది.

'ఓ పరమేశ్వరా! బంగారుకొండ మేరుపర్వతమే 

నీ చేతిలో ఉంది. 

అపార ధనవంతుడైన కుబేరుడు 

నీ పాదదాసుడై ఉన్నాడు. 

కల్పవృక్షం, కామధేనువు, చింతామణి 

నీ ఇంటిలోనే ఉన్నాయి.

 షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు.

 సమస్త మంగళాలనూ కలిగించే పార్వతీదేవి సర్వమంగళయై నీ పక్కనే ఉంది. 

కనుక నీకు నేనేమీ ఇవ్వలేను. 

నా దగ్గర ఉన్నది ఒక్క మనసే. 

అది నీకు సమర్పిస్తున్నాను!' 

అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు.


Thursday, August 5, 2021

వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా ?

"మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః "  అంటే అర్ధం తెలుసా ?

SUN'DAY

MO(O)N'DAY

TUESDAY

WEDNESDAY

THURSDAY

FRIDAY

SATUR(N)DAY

అంటే ఏమిటో తెలుసా....? అసలు ఈ వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా? వీటిని కాపీ కొట్టి, ఇవి మావే అని డబ్బా కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా?

సూర్యహోర

చంద్రహోర

కుజహోర

బుధహోర

గురుహోర

శుక్రహోర

శనిహోర - అంటే

ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగము, ఇవి ఎంతో శాస్త్రీయమైనవి కాబట్టే, బ్రిటిష్ వాళ్లు వీటిని తమ క్యాలెండర్ లో పేర్లు మార్చి, వాటిని వారి విజ్ఞానంగానే ప్రపంచాన్ని నమ్మిస్తున్నారు, 

సరే... ఇప్పుడైనా నిజమేమిటో తెలుసుకుందాం!

ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు - అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి! వారము - అంటే 'సారి' అని అర్ధము.

1వ సారి, 2వ సారి... అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము - అని అంటారు!

కాస్త విపులంగా....

భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు. భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని "ఒక వారం" అని పిలిచారు. ఒకసారి అన్నా - ఒక వారం అన్నా ఒకటే.ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.

మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః

అనగా... 

పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి. 

ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి? 

ఆ గ్రహాల వరసకి, ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా?

ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.

భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది. 

ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.

ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక "అహః" ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి. 

ఆ భాగాలను వారు "హోర" అన్నారు.

"అహః ప్రమాణం" అన్నా, "అహోరాత్ర ప్రమాణం" అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే "హోర" అయింది.

దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారు. 

ఈ హోర పదాన్ని అవర్(HOUR) గా మార్చి పాశ్చాత్యులు 24 అవర్స్(HOURS) అన్నారు.

హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని(పోలిక) పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు.

ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమిమీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. 

ఈ భ్రమణంలో చిత్రమేమిటంటే, ఇవాళ - ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర, సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో... ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్ర హోర ఉంటుంది. 

కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.

మళ్లీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది. కనుక ఆ రోజు - మంగళవారం,

ఆ మరునాడు ఉదయానికి బుధహోర - బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది -గురువారం.

ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర - శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర - అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది.

అయితే... ఈ విధానం వినడం కొత్త అయిన హేతువాద, నాస్తిక, పచ్చ బాబులకు... మొదటి రోజు సూర్యోదయ సమయానికి సూర్యహోర అవుతుందనుకుంటే కదా ఈ లెక్కలన్నీ...ఇలా వచ్చేది! 

అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం. 

వస్తున్నా... అక్కడికే వస్తున్నా...

ఎందుకనుకోవాలంటే - సూర్యుడి(ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్ధం కావడం కోసం మన ఋషులు సూర్యున్ని గ్రహం గా తీసుకున్నారని గమనించాలి) - ఆధిపత్యంలో... సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. 

దీన్నే మరోరకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆగ్రహం పేరే ఆదిత్యుడు. అంటే మొదటివాడు.

అదే మొదటిరోజు. 

అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది.

ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా ఒకటే. 

అక్కడినుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం, హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - ఈ విధంగా వస్తుంది.

అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి.

Wednesday, August 4, 2021

పంచాంగం తెలుసుకొంటే ప్రయోజనములు ?

ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.

తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) 

వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , 

నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) 

యోగము -రోగనివారణము(27 యోగములు) 

కరణం - కార్యసిద్ధి(11 కరణములు)

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...