పగటి కలలకు ఫలితం ఉండదు. పైత్య, అజీర్ణ, వాతముల వలన వచ్చే స్వప్నాలకు ఫలితం ఉండదు. రాత్రి వేళల్లో మొదటి ఝాములో వచ్చే కలలకు ఫలితం ఒక సంవత్సరం లో జరుగుతుంది. రాత్రి రెండవ ఝాములో వచ్చే స్వప్నాలకు ఫలితం మూడు నెలల్లో కనిపిస్తుంది. రాత్రి మూడవ ఝాములో వచ్చే కలలకు ఫలితం ఒక నెలలో , సూర్యోదయానికి ముందు వచ్చే కలలు ఫలితాలు పది రోజుల్లో, వేకువజామున వచ్చే కలల ఫలితం అదేరోజున జరుగుతుంది అని అంటారు. మంచి స్వప్నం వచ్చిన తర్వాత మళ్లీ నిద్ర పోకూడదు. చెడు కల వస్తే చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. ఇష్ట దైవాన్ని ధ్యానం చేసి నిద్రించాలి.
స్వప్నాలు 7 రకాలు :-
దృష్ట :- పగలు చూసిన విషయములను రాత్రి వేళల్లో కలలో కనిపించడం.
శృత :- పగలు విన్న , చదివిన మాటలు రాత్రి కలలో కూడా వినేవి.
అనుభూత:- పగలు అనుభవాన్ని రాత్రి కలలో కూడా అనుభవించడం.
ప్రార్థిత :- అధికంగా ఆలోచించిన ఏదైనా కోరిక రాత్రి వేళల్లో కలలో తీరడం.
కల్పిత :- తనకు తెలియని విషయం పై రాత్రి కల రావడం.
భావిక :- అత్యంత సూక్ష్మమైన విషయం పై వచ్చే కలలు.
దోష :- అనారోగ్యం కారణంగా రాత్రి కలలో అప్రయత్నంగా అరవడం, మూలగటం మొదలైనవి.. సాధారణంగా అజీర్ణం వలన వాత పిత్త దోషాల వలన వస్తాయి
No comments:
Post a Comment