Thursday, June 24, 2021

పితృదేవతలు ముగ్గుదాటుకుని రాలేరట

ఏ ఇంటిముందు ఉదయాన్నే కళ్లాపిచల్లి ముగ్గుపెట్టి వుంటుందో ఆ ఇంటికి రావడానికే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. ఈ కారణంగానే ఉదయాన్నే వాకిలి శుభ్రంగా ఊడ్చి ఆవుపేడతో కళ్లాపిచల్లి బియ్యపు పిండితో ముగ్గు పెడుతుంటారు. 

ఇక పండుగ రోజుల్లో ఈ ముగ్గు మరింత అందంగా ఉండేలా శ్రద్ధ తీసుకుంటూ వుంటారు. పూర్వకాలం నుంచి కూడా ఇది మన ఆచారవ్యవహారాల్లో ఒక భాగమైపోయింది. 

అయితే ఇంట్లో పితృ కార్యాలు నిర్వహించవలసి వచ్చినప్పుడు, ఇంటిముందు ముగ్గు పెట్టాలా వద్దా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంటుంది. శాస్త్రం మాత్రం పితృ కార్యం నిర్వహించే రోజున ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టకూడదని చెబుతోంది. ముగ్గులేని వాకిట్లోకి రాకుండా లక్ష్మీదేవి ఎలా వెనుదిరిగి పోతుందో, ముగ్గువేసిన వాకిట్లోకి రాకుండా పితృదేవతలు కూడా అలానే వెనుదిరిగిపోతారని అంటోంది

పితృదేవతలు ముగ్గుదాటుకుని రాలేరట. అందువల్లనే పితృకార్యం నిర్వహించే రోజున ముగ్గు పెట్టకూడదని పండితులు అంటున్నారు. వాకిట్లో ముగ్గులేని ఇళ్లలోకి ప్రవేశించడానికి దుష్టశక్తులు సిద్ధంగా ఉంటాయని అంటారు.

అందువలన పితృకార్యం నిర్వహణ పూర్తి అయిన తరువాత, వెంటనే వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గుపెట్టాలని చెబుతుంటారు. దీనిని బట్టి ముగ్గు అనేది ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాదు, ఇంటికి రక్షణని కూడా ఇస్తుందని గ్రహించాలి.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...