Friday, April 30, 2021

నారదుడు ఎవరు? జన్మరహస్యం ఏంటి

వీణాతంత్రులు మీటుతూ, నారాయణ నామాన్ని ఉచ్చరిస్తూ త్రిలోక సంచారం చేసే నారదుణ్ని ‘కలహ భోజనుడు’ అని పిలుస్తారు. 

కానీ ఆయన గొప్పతనం, చరిత్ర తెలిస్తే ఎవరూ అలా అనరు, ఆయన ఏది చేసినా లోకహితార్థం, లోకరక్షణ కొరకే ...

పరమాత్మ గుణానుభవంలో తన్మయత్మం పొంది ఎందరినో భగవద్భక్తులుగా చేసినవాడు నారదుడు. 

వాల్మీకి, వ్యాసుడు, శుకుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి మహా పురుషులను, మహా భక్తులుగా మలచినవాడు నారదుడే.

వ్యాసుడు భాగవత రచన చేయడానికి తన కథను చెప్పి ప్రేరణ కలిగించినవాడు. 

‘నేను ఇంతటి వాడిని ఎలా కాగలిగానంటే... గత జన్మలో సన్యాసులు నాకు ఉపదేశించిన జ్ఞానమే. 

కాబట్టి నువ్వు భగవద్భక్తుల సమాహారమైన భాగవతాన్ని చెప్పగలిగితే విన్నవారు కూడా నాలాగే ఉత్తర జన్మలో మహా జ్ఞానులు, భక్తులు కాగలరు, కాబట్టి నువ్వు భాగవతాన్ని రచించు’ అని తన కథను చెప్పాడు.

నారదుడు పూర్వ జన్మలో దాసీపుత్రుడు. తల్లి ఐశ్వర్యవంతుడైన బ్రాహ్మణుడి ఇంటిలో ఊడిగం చేసేది. 

ఆమె వెంటే యజమాని ఇంటికి వెళ్ళేవాడా బాలుడు...

బ్రాహ్మణులు వేద వేదాంగాలను చదువుతూంటే వింటూ ఆ పరిసరాల్లో స్వేచ్ఛగా తిరిగేవాడు. 

ఒకసారి కొంతమంది సన్యాసులు చాతుర్మాస్య దీక్ష గడపడానికి ఆ ఇంటికి వచ్చారు. " వారికి  సేవలు చేస్తుండ " మని యజమాని నారదుడికి పురమాయించాడు...

సన్యాసులు పిల్లవాడైన నారదుడి సేవలకు ముచ్చట పడ్డారు, దీక్షాకాలం పూర్తయి వెళ్ళిపోతూ నారదుణ్ని వాత్సల్యంతో పక్కన కూర్చోబెట్టుకుని ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని, ప్రణవాన్ని ఉపదేశించారు...

మాయ, సత్యం తదితరాల గురించి బోధించారు, ఆ బోధనలు నారదుడి మనసులో బలంగా నాటుకున్నాయి...


పాముకాటుతో తల్లి చనిపోయాక ‘లోక సంచారం చేస్తూ ఈశ్వరాన్వేషణ చేస్తూ జీవనం గడిపేస్తాను’ అనుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. 

అక్కడ క్రూరసర్పాలు, ప్రాణులను చూసినా ‘ఈ లోకమంతటా నిండి ఉండి శాసించే  శ్రీమన్నారాయణుడు అందరికీ అండగా ఉండగా నాకే ఆపదా రాదు. నాకేమిటి భయం?’ అనుకుని ...


ఒక రావిచెట్టు కింద కూర్చుని ద్వాదశాక్షరీ మంత్రాన్ని తదేకంగా జపిస్తున్నాడు. 


ఆ సమయంలో ఒక మెరుపులా శ్రీమన్నారాయణుడి దర్శనం లీలామాత్రంగా అయింది. 

అశరీరవాణి ’ఈ జన్మలో సత్పురుషులతో తిరిగిన అదృష్టం వల్ల, నీకు లీలామాత్ర దర్శనం ఇచ్చాను. 

నీవు చూసిన రూపాన్ని బాగా చూడాలని కోరుకుంటూ, నా గురించే చెబుతూ, పాడుతూ, మాట్లాడుతూ ప్రకృతి ధర్మాన్ననుసరించి ఒకరోజున ఈ శరీరాన్ని వదిలేస్తావు, ఆ తరవాత నీవు  బ్రహ్మదేవుడి కుమారుడిగా జన్మిస్తావు. 

ఆనాడు నీకు ’మహతి’ అనే వీణను బహూకరిస్తాను. దానిమీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకాల్లో విహరిస్తావు’ అన్నాడు శ్రీమన్నారాయణుడు.


ఆయన చెప్పినట్టుగానే కల్పాంతం తరవాత తన కుమారుడిగా నారదుణ్ని సృష్టించాడు బ్రహ్మ. ’మహతి’ అనే వీణను ఇచ్చాడు. ఆ వీణపై నారాయణ నామం చెప్పుకొంటూ లోకమంతటా స్వేచ్ఛగా తిరుగుతూ వైకుంఠం, సత్యలోకం, కైలాసం... 

ఇలా ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమాన్ని ఆవిష్కరించేవాడు. 

భగవంతుడి శక్తి గురించి మాట్లాడేవాడు, దేవతలు, రాక్షసులు అనే తేడా లేకుండా అందరికీ ఉపదేశాలు చేసేవాడు. 


అందువల్ల నారదుణ్ని దేవతలు, రాక్షసులు సైతం గౌరవించేవారు. జగత్కల్యాణం కోసం పాటుపడుతూ అన్ని యుగాల్లో, లోకాల్లో, సమాజాల్లో, కార్యాల్లో నిరాటంకంగా ప్రవేశించి పనులు చక్కబెట్టేవాడు. ‘భక్తి సూత్రాలు’ రచించి దాని గొప్పతనాన్ని లోకానికి చాటాడు.


ఆ కథ విన్న వ్యాసుడు పొంగిపోయి ‘నారదా’ మంచిమాట చెప్పావు. 

ఇప్పుడు నేను భగవంతుడి గురించి, ఆయన విశేషాలు, ఈ బ్రహ్మాండాల ఉత్పత్తి, ఆయన్ను నమ్ముకున్న భాగవతుల గురించి, వారి వెంట నడిచిన భక్తుల వృత్తాంతాల గురించి రచన చేస్తాను. 


వీటిని చదివిన, విన్నవారు నీలాగే తరించిపోవాలి’ అని ఆచమనం చేసి కూర్చుని తన ఆశ్రమంలో భాగవత రచన ప్రారంబించాడు...

పదకొండు ఇంద్రియాలు

సృష్టిలో మానవజన్మ ఎంతో క్లిష్టమైనది. అతడు పుట్టడంతోనే అతనిలో మమేకమై ఉన్నవి పదకొండు ఇంద్రియాలు. అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు.

ఆ పదకొండులో....

1. అయిదు జ్ఞానేంద్రియాలు,

2. అయిదు కర్మేంద్రియాలు, మనసు ఉన్నాయి.


1.శ్రోత్రం (చెవి),

2.త్వక్‌ (చర్మం),

3.చక్షుషీ (కన్నులు),

4.జిహ్వా (నాలుక),

5.నాసికా (ముక్కు) అనేవి జ్ఞానేంద్రియాలైతే,


1.పాయు (మలద్వారం),

2.ఉపస్థ (మూత్రద్వారం),

3.హస్త (చేతులు),

4.పాద (కాళ్లు),

5.వాక్‌ (మాట) అనేవి కర్మేంద్రియాలు.

ఈ పదింటికి చివర మనసు.


ఇదీ ఇంద్రియ సమూహం.

ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి.

ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి.

ఇంద్రియనిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య.

ఇంద్రియాలు గుర్రాల వంటివని, రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తాయని, అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయని,

కనుక సారథి వంటి మనిషి ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనువు.


1.మనిషి సంయమనాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలనే వింటాయి.

2.చర్మం పనికిరాని స్పర్శను కోరుతుంది.

3.కళ్లు అశ్లీలాన్ని చూస్తాయి.

4.నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది.

5.ముక్కు దుర్గంధాలనే స్వీకరిస్తుంది.

6.మల, మూత్రద్వారాలు పనిచేయకుండా పోతాయి.

7.కాళ్లూ చేతులూ హింసను ఆచరిస్తాయి.

8.మాట అదుపు తప్పుతుంది. ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తయితే,

9.మనసు అనే పదకొండో ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు.


అసలు పది ఇంద్రియాలను మంచిగాను, చెడుగాను మార్చేది మనసే.

మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి.

అందుకే వాల్మీకి- ‘ఇంద్రియాల సత్‌ప్రవర్తనకు, అసత్‌ప్రవర్తనకు మనసే మూలకారణం’ అని రామాయణ మహాకావ్యంలో అంటాడు.

చెడు వినకుండా, చెడు కనకుండా, చెడు అనకుండా, చెడు తినకుండా, చెడు ఆఘ్రాణించకుండా ఉండగలిగేవాడే జితేంద్రియుడని శాస్త్రాల ప్రబోధం.

ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి. జ్ఞానం లేని కర్మాచరణ పిచ్చివాడి చేతిలో రాయి వంటిదే.

అది ఎవరిమీదనైనా పడవచ్చు. నిప్పును తాకితే కాలుతుందని తెలిసిన జ్ఞాని, నిప్పును తాకడానికి సాహసించడు. 

ఆ విషయం తెలియని బాలుడు నిప్పును తాకి చేతులు కాల్చుకుంటాడు.

కనుక ఏ పనిచేసే సమయంలో అయినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం.

లేకుంటే ఇంద్రియాలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి.

ఇంద్రియాలు అదుపులో ఉన్నంతవరకు మనిషి ఉజ్జ్వలంగా వెలిగిపోతాడు.

ఇంద్రియాల్లో ఏ ఒక్కటి అదుపుతప్పినా, అన్ని ఇంద్రియాలూ క్రమంగా పట్టుతప్పిపోతాయి.

పర్యవసానంగా మనిషిలోని ప్రజ్ఞ నశించిపోతుంది.

ప్రకృష్టమైన (విశిష్టమైన) జ్ఞానమే ప్రజ్ఞ. అంటే అన్నింటినీ చక్కగా గుర్తించే గుణం. 

అది ఉన్నంతకాలం మనిషి మెదడు అనే యంత్రం పనిచేస్తుంది.   

మెదడును చక్కగా ఉంచుకోవడానికి ‘ఆయుర్వేదం’ ఇలా మార్గోపదేశం చేస్తోంది-

’పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం స్వీకరించాలి. అలా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడంవల్ల ఇంద్రియాలన్నీ పటిష్ఠంగా ఉంటాయి. అవి దృఢంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి వర్ధిల్లుతుంది’ 

ఇంద్రియాల వెనక ఉన్న ఇంతటి సాంద్రమైన విషయాన్ని మనిషి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

అందువల్ల జితేంద్రియుడు (ఇంద్రియాలను జయించినవాడు) కావాలో, ఇంద్రియజితుడు (ఇంద్రియాలతో ఓడిపోయినవాడు) కావాలో తేల్చుకోవలసింది మనిషే!


ప్రవర ఎలా చెప్పాలి...?

1) భగవంతుని ముందు ప్రవర చెప్పేటప్పుడు కుడి చేత్తో కుడి చెవిని, ఎడమ చేత్తో ఎడమ చెవిని పట్టుకొని ముందుకు వంగి చెప్పవలెను.

2) మానవుల ముందు ప్రవర చెప్పేటప్పుడు కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకొని ముందుకు వంగి చెప్పవలెను.

3) చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు /సజ్జనేభ్యః శుభం భవతు. ఆయా సందర్భానుసారంగా చెప్పవలెను.

ఋషి1____, ఋషి 2__,ఋషి 3____త్రయార్షేయ ప్రవరాన్విత, ___గోత్రద్భవస్య, ___సూత్రం ___ శాఖాధ్యాయిః ____(పేరు) శర్మణ్ అహంభో అభివాదయే, అభివాదయామి.

కొన్ని బ్రాహ్మణ  గోత్రాలు మరియు వాటి ప్రవరలు..

1. భరద్వాజ : ఆంగీరస, భార్హస్పత్స్య, భరద్వాజ త్రయా ఋషేయ ప్రవరాణ్విత భారద్వజాస గోత్రస్య

2. వాథూలస : భార్గవ, వైతాహవ్య, శావేదస త్రయా ఋషేయ ప్రవరాణ్విత వాథూలస గోత్రస్య

3. శ్రీవస్త లేక శ్రీవత్స : భార్గవ, చ్యవన, ఆప్నవాన, ఆర్వ, జామదఘ్నేయ పంచా ఋషేయ ప్రవరాణ్విత శ్రీవత్సస గోత్రస్య

4. శ్యాలంకాయన : విశ్వామిత్ర, ఆఘమర్షన, దేవరత త్రయా ఋషేయ ప్రవరాణ్విత శ్యాలంకాయనస గొత్రస్య

5. షతమర్షన: ఆంగిరస, ఫౌరుకుత్స, త్రాసతస్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత షతమర్షనస గోత్రస్య

6. ఆత్రేయ: ఆత్రేయ, ఆర్చనాస, శ్యావాస్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆత్రేయ గోత్రస్య

7. కౌషిక: విశ్వామిత్ర, ఆఘమర్షన, కౌసిక త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌషిక గొత్రస్య


8. ఖలబొధన/ఖలభవస (రెండు రకాలు)

1. ఖలబొధన: విశ్వామిత్ర, ఆగమర్షన, ఖలబొధన త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఖలబొధన గోత్రస్య

2. ఖలభవస: విశ్వామిత్ర, ఆగమర్షన, ఖలభవస త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఖలభవస గొత్రస్య


9. విశ్వామిత్ర: విశ్వామిత్ర, దేవరత, ఔతల త్రయా ఋషేయ ప్రవరాణ్విత విశ్వామిత్ర గోత్రస్య

10. కౌండిన్య: వాసిష్త, మైత్రావరుణ, ఖౌందిన్యస త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌండిన్యస గోత్రస్య

11. హరితస: ఆంగిరస, అంబరిష, యువనశ్వ, త్రయా ఋషేయ ప్రవరాణ్విత హరితస గోత్రస్య

12. గౌతమస: ఆంగిరస, ఆయస్య, ఆఔశిద్యస, కాక్షివత, వమదెవ, గ్రిహదుగ్ద, గౌతమస – సప్తా ఋషేయ ప్రవరాణ్విత గౌతమస గోత్రస్య


13.ఔద్గల్య (మూడు రకాలు)

1. ఆంగిరస, భర్మ్యశ్వ, ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య

2. తర్క్ష్య, భార్మ్యశ్వ, మౌద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య

3. ఆంగిరస, ఢవ్య, ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య


14. శందిల్య (మూడు రకాలు)

1. కాశ్యప, అవత్సార, దైవల త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

2. కాశ్యప, ఆవత్సార, శాందిల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

3. కాశ్యప, దైవల, ఆసిత త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య


15. నైత్రువకాశ్యప: కాశ్యప, ఆవత్సర, నైత్రువ త్రయా ఋషేయ ప్రవరాణ్విత నైత్రువకాశ్యపస గోత్రస్య

16. కౌత్స: ఆంగిరస, మాంధత్ర, కౌత్స త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌత్సస గోత్రస్య


17. కన్వ (రెండు రకాలు)

1. ఆంగిరస, ఆజమీద, కన్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కన్వస గోత్రస్య

2. ఆంగిరస, కౌర, కన్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కన్వస గోత్రస్య


18. పరాసర: వాశిష్త, శాక్త్య, పరాసర త్రయా ఋషేయ ప్రవరాణ్విత పరాసరస గోత్రస్య

19. అగస్త్య: అగస్త్య, తర్ధచ్యుత, శౌమవహ త్రయా ఋషేయ ప్రవరాణ్విత అగస్త్యస గోత్రస్య


20. ఘర్గి (రెండు రకాలు)

1. ఆంగిరస, బర్హస్పత్య, భారద్వజ, ఉపాధ్యయ త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగిరసస గోత్రస్య

2. ఆంగిరస, శైన్య, గార్గ్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగిరసస గోత్రస్య


21. బాదరాయణ: ఆంగిరస, ఫార్షదశ్వ, ఋతితర త్రయా ఋషేయ ప్రవరాణ్విత బాదరాయణ గోత్రస్య


22. కశ్యప (మూడు రకాలు)

1. కాశ్యప, ఆవత్సార, దైవల త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

2. కాశ్యప, ఆవత్సార, నైత్రువ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

3. కాశ్యప, ఆవత్సార, నైత్రువ, రేభ, రైభ , శాందిల, శాందిల్య సప్తా ఋషేయ ప్రవరాణ్విత కాశ్య్పస గోత్రస్య


23. సుంక్రితి లేదా శాంక్రిత్య గోథ్ర (రెండు విధాలు)

1. ఆంగిరస, కౌరవిధ, శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య

2. శధ్య ,కౌరవిధ, శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య


24. ఆంగీరస: ఆంగీరస, ఫురుకుత్స్య, ఠ్రాసదస్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగీరస గోత్రస్య

25. గౌతం/గౌతమస: అంగీరస, ఆయస్య, గౌతమస త్రయా ఋషేయ ప్రవరాణ్విత గౌతమస గోత్రస్య

26. అగ్నివైవశ్వత: ఆంగీరస, భార్హస్పత్స్య, భారద్వాజ, శ్రుక్వ, ఆగ్నివైవశ్వత పంచాఋషేయ ప్రవరాణ్విత అగిన్వైవశ్వత గోత్రస్య

27. శాంఖ్యాయన: విశ్వామిత్ర, ఆఘమర్షన, దేవవ్రథ శాంఖ్యాయన త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాంఖ్యాయన గోత్రస్య

28. విశ్వామిత్ర: శ్రౌమిత, ఖామకయన, దేవతరస, దేవరత,పంచా ఋషేయ ప్రవరాణ్విత విశ్వామిత్ర

29. కపి: ఆంగీరస, అమాహైయ, ఔరుక్షయ, త్రయా ఋషేయ ప్రవరాణ్విత కపిస గోత్రస్య

శ్రీ సూక్తం అర్థసహితం

శ్రీ సూక్తం తెలుగు లో అర్థసహితం తెలుసుకోండి జన్మ చరితార్థం చేసుకోండి.

ఓం || హిర'ణ్యవర్ణాం హరి'ణీం సువర్ణ'రజతస్ర'జాం | చంద్రాం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ ఆవ'హ ||

ఓ అగ్నిదేవా! బంగారు మేని ఛాయ గల, పాపాలను నాశనము చేసే, బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడిన, చంద్రుని వలె చల్లగా ఆహ్లాదకరంగా, సువర్ణమయమైన యున్న మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. 

తాం మ ఆవ'హ జాత'వేదో లక్ష్మీమన'పగామినీ''మ్ |

యస్యాం హిర'ణ్యం విందేయం గామశ్వం పురు'షానహమ్ ||

ఎవరి కరుణ, కటాక్షములతో నాకు బంగారము, ఆవులు, గుర్రాలు, బంధువులు సంప్రాప్తమైనవో ఆ మహాలక్ష్మిని నా వద్దకు ఆవాహనము చేయుము. ఆమె నా వద్ద నుండి వీడిపోకుండా చూడుము.

అశ్వపూర్వాం ర'థమధ్యాం హస్తినా''ద-ప్రబోధి'నీమ్ |

శ్రియం' దేవీముప'హ్వయే శ్రీర్మా దేవీర్జు'షతామ్ ||

గుర్రాలతో ఉన్న రథం మధ్యలో ఆసీనమైనది, తన రాకను ఏనుగు ఘీంకార నాదంతో సూచిస్తున్న ఆ శ్రీదేవిని ఆహ్వానిస్తున్నాను.తల్లీ నీవు నా వద్ద సంతోషముగా నెలకొని ఉండుము.

కాం సో''స్మితాం హిర'ణ్యప్రాకారా'మార్ద్రాం జ్వలం'తీం తృప్తాం తర్పయం'తీమ్ |

పద్మే స్థితాం పద్మవ'ర్ణాం తామిహోప'హ్వయే శ్రియమ్ ||

చక్కని చిరునవ్వుతో, బంగారు కోటలో నివసించే, కరుణ, తేజస్సు, ఆనంద రూపిణియై, ఆనందము ప్రసాదించునది, పద్మములో ఆసీనురాలై, పద్మము వంటి ఛాయకలది అయిన ఆ శ్రీదేవిని ఇక్కడ సాక్షాత్కరించమని ప్రార్థిస్తున్నాను

చంద్రాం ప్ర'భాసాం యశసా జ్వలం'తీం శ్రియం' లోకే దేవజు'ష్టాముదారామ్ |

తాం పద్మినీ'మీం శర'ణమహం ప్రప'ద్యేఽలక్ష్మీర్మే' నశ్యతాం త్వాం వృ'ణే ||

చంద్రుని పోలినది, తేజోవంతమైనది, తన కీర్తి చంద్రికలతో ప్రకాశించుచున్నది, దేవతలచే పూజిన్చబడుచున్నది, కరుణా స్వరూపిణి, పద్మమును ధరించినది, 'ఈం' అనే బీజమంత్రానికి భావంగా ఉన్నది అయిన మహాలక్ష్మిని నేను శరణు వేడుతున్నాను.ఓ దేవీ! నిన్ను ప్రార్థిస్తున్నాను, నా దారిద్ర్యం పోయేలా కరుణించు

ఆదిత్యవ'ర్ణే తపసోఽధి'జాతో వనస్పతిస్తవ' వృక్షోఽథ బిల్వః |

తస్య ఫలా'ని తపసాను'దంతు మాయాంత'రాయాశ్చ' బాహ్యా అ'లక్ష్మీః ||

సూర్యుని తేజస్సు కలిగిన ఓ తల్లి! వనానికి అధిపతియైన బిల్వవృక్షం (మారేడు చెట్టు) నీ తపోమహిమచే ఉద్భవించినది. నీ తపస్సు వలన కలిగిన దాని ఫలాలు అజ్ఞానము మనే లోని ఆటంకాన్ని, అమంగళకరమైన బయటి ఆటంకాన్ని తొలగిస్తాయి గాక!

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణి'నా సహ |

ప్రాదుర్భూతోఽస్మి' రాష్ట్రేఽస్మిన్ కీర్తిమృ'ద్ధిం దదాదు' మే ||

కుబేరుడు, కీర్తి ఐశ్వర్యాలతో నన్ను వెన్నంటి రావాలి. నీ అనుగ్రహం పూర్తిగా నిండిన ఈ దేశంలో నేను జన్మించాను. సకల సంపదలను నాకు ప్రసాదించు!

క్షుత్పి'పాసామ'లాం జ్యేష్ఠామ'లక్షీం నా'శయామ్యహమ్ |

అభూ'తిమస'మృద్ధిం చ సర్వాం నిర్ణు'ద మే గృహాత్ ||

ఆకలి దప్పికలతో కృశించినది,శ్రీదేవి కంటే ముందుగా జన్మించిన జ్యేష్టాదేవిని (అలక్ష్మి)నేను నాశనం చేస్తాను.

నా గృహము నుండి అభాగ్యము, కొరతలను పూర్తిగా నిర్మూలించి నన్ను అనుగ్రహించు.

గంధద్వారాం దు'రాధర్షాం నిత్యపు'ష్టాం కరీషిణీ''మ్ |

ఈశ్వరీగ్^మ్' సర్వ'భూతానాం తామిహోప'హ్వయే శ్రియమ్ ||

సుగంధానికి నిలయమైనది, జయింప అలవికానిది, ఎల్లప్పుడూ పుష్టినిచ్చేది, సకల సంపదలు కలిగిన, సమస్త జీవులకు అధినాయిక యైన మహాలక్ష్మిని ఇక్కడ ఆవాహన చేస్తున్నాను.

మన'సః కామమాకూతిం వాచః సత్యమ'శీమహి |

పశూనాం రూపమన్య'స్య మయి శ్రీః శ్ర'యతాం యశః' ||

ఓ శ్రీదేవి! మనస్సులో జనించే ఉత్తమమైన కోరికలూ, సంతోషము, వాక్కులో సత్యము, గోసంపద చే, ఆహార సమృద్ధిచే కలిగే ఆనందాన్ని నేను చవి చూడాలి. నాకు కీర్తి కలుగచేయుము

కర్దమే'న ప్ర'జాభూతా మయి సంభ'వ కర్దమ |

శ్రియం' వాసయ' మే కులే మాతరం' పద్మమాలి'నీమ్ ||

కర్దమ మహర్షి! నీకు పుత్రికగా జన్మించిన మహాలక్ష్మి నాకు సాక్షాత్కారించాలి. తామరపువ్వుల మాల ధరించిన, సిరిసంపదలకు అధిదేవత, తల్లి అయిన ఆమెను నా కులములో ఎల్లప్పుడూ నివసింప చేయాలి. 

ఆపః' సృజంతు' స్నిగ్దాని చిక్లీత వ'స మే గృహే |

ని చ' దేవీం మాతరం శ్రియం' వాసయ' మే కులే ||

మహాలక్ష్మి పుత్రుడవైన ఓ చిక్లీత! నీరు, చక్కని ఆహారపదార్థాలను ఉత్పత్తి చేయుగాక! నా ఇంట నీవు నివసించాలి. దేవీ, నీ మాత అయిన ఆ మహాలక్ష్మి నా కులములో నిరంతరమూ నివసించేలా అనుగ్రహించు. 

ఆర్ద్రాం పుష్కరి'ణీం పుష్టిం సువర్ణామ్ హే'మమాలినీమ్ |

సూర్యాం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ ఆవ'హ ||

ఓ అగ్నిదేవ! కరుణ కలిగిన మనసు కలది, పద్మవాసిని, లోకానికి ఆహారము ఇచ్చి పోషించేది, కుంకుమ రంగు కలది, తామరపువ్వుల మాల ధరించినది, చంద్రునివలె ఆహ్లాదకరమైనది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము.

ఆర్ద్రాం యః కరి'ణీం యష్టిం పింగలామ్ ప'ద్మమాలినీమ్ |

చంద్రాం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ ఆవ'హ ||

అగ్నిదేవా! దయకలిగినది, గంభీరముగా యుండెడిది, దండము చేత బూనినది, అందమైన శరీరచాయ కలిగినది, సూర్యునివలె ప్రకాశించునది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము

తాం మ ఆవ'హ జాత'వేదో లక్షీమన'పగామినీ''మ్ |

యస్యాం హిర'ణ్యం ప్రభూ'తం గావో' దాస్యోఽశ్వా''న్, విందేయం పురు'షానహమ్ ||

అగ్నిదేవా! ఎవరి వలన నేను అంతులేని బంగారుము, గోవులు, సేవకులు, గుర్రాలు ప్రాప్తించుకుంటానో , అట్టి మహాలక్ష్మిని నన్ను వదలి వెళ్లిపోకుండా కృప చూపుము. ఎవరు లక్ష్మీదేవి కృప కొరకు ప్రార్తిస్తున్నారో, వారు ఇంద్రియాలు నిగ్రహించి, ప్రతిరోజూ ఆజ్యముతో హోమము చేయాలి. పైన తెలిపిన పదిహేను మంత్రాలను సదా జపిస్తూ ఉండాలి

ఓం మహాదేవ్యై చ' విద్మహే' విష్ణుపత్నీ చ' ధీమహి | తన్నో' లక్ష్మీః ప్రచోదయా''త్ ||

మూడు లోకాలను తన కుటుంబముగా చేసుకున్నది, తామర కొలనులో ఉద్భవించినది, మహావిష్ణువుకు ప్రియమైనది అయిన నీకు నమస్కరిస్తున్నాను.

శ్రీ-ర్వర్చ'స్వ-మాయు'ష్య-మారో''గ్యమావీ'ధాత్ పవ'మానం మహీయతే''

| ధాన్యం ధనం పశుం బహుపు'త్రలాభం శతసం''వత్సరం దీర్ఘమాయుః' ||

సుప్రసిద్ధులు, ఋషులు అయిన ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు ముగ్గురు ఈ సూక్తంలోని ఋషులు, మహాలక్ష్మియే దేవత. పద్మము వంటి ముఖము, ఊరువులు, కన్నులు కలదానా! పద్మము నుండి ఉద్భవించిన తల్లి!, నేను దేని వలన సుఖాన్ని పొందుతానో దాన్ని ప్రసాదించు. గుర్రాలను, గోవులను, సంపదలను ఇచ్చే, ధనానికి అధిదేవతయైన మహాలక్ష్మి! కోరికలన్నీ నెరవేరేటప్పుడు కలిగే సుఖాన్ని ఇచ్చే సంపదను నాకు ప్రసాదించు

ఓం శాంతిః శాంతిః శాంతిః' ||

అందరు శాంతి సుఖాలతో ఉండాలి శాంతి , శాంతి, శాంతి

శివ అభిషేకం

తరచుగాశివాభిషేకంచేయిస్తూఉండండి శివానుగ్రహంసకలశుభాలూచేకూరుస్తుంది

శివపూజలో ప్రధానమైన అంశం ‘అభిషేకం’. శివుడు అభిషేక ప్రియుడు. హాలాహలాన్ని కంఠమందు ధరించాడు. ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను, చంద్రవంకను తలపై ధరించాడు శివుడు.

అభిషేక్రపియుడైన శివుడ్ని ఇలా అభిషేకించి తరిద్దాం.

ధారాభిషేకం: కంచిలో గల ఏకామ్రేశ్వర శివలింగం ‘పృధ్వీలింగం’.ఈ  పృధ్వీరూపధారియైన శివునకు ధారాభిషేకం ప్రీతి. ఈ అభిషేకంతో సకల పాపాలు నశిస్తాయని శివుని వరం.

ఆవృత్త్భాషేకం: జంబుకేశ్వరంలోని జంబుకేశ్వర లింగం ‘జలలింగం’. జల రూపధారియైన శివునికి ఆవృత్త్భాషేకం ఎంతో ప్రీతి. ఆవృత్త్భాషేకం చేస్తే సుఖ సంతోషాలు మానవుల పరం చేస్తాడు భక్తవత్సలుడు.

రుద్రాభిషేకం: తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరడు ‘తేజోలింగం’. తేజోరూపధారి అయిన శివునకు రుద్రాభిషేకం ఇష్టం. రుద్రాభిషేకం చేస్తే సర్వసంపదలూ చేకూర్చుతాడు పరమదయాళువు.

శతరుద్రాభిషేకం: చిదంబరంలోని చిదంబరేశ్వరుడు ‘ఆకాశలింగం’. ఆకాశరూపధారియైన శివునకు శతరుద్రాభిషేకం ప్రీతి. శత రుద్రాభిషేకం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధిని ఫాలనేత్రుడు అనుగ్రహిస్తాడు.

ఏకాదశ రుద్రాభిషేకం: శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వరుడు ‘వాయులింగం’. వాయురూపధారియైన శివునకు ఏకాదశ రుద్రాభిషేకం ఇష్టం. ఏకాదశ రుద్రాదాభిషేకం చేస్తే శివునితో పాటు లక్ష్మీ అమ్మవారి కటాక్షం దొరుకుతుంది.

లఘురుద్రాభిషేకం: ఒరిస్సాలోని కోణార్క్‌లోని శివలింగం ‘సూర్యలింగం’. సూర్యరూపధారియైన శివునకు లఘు రుద్రాభిషేకం ప్రీతి. లఘురుద్రాభిషేకం చేస్తే పునర్జన్మ ఉండదని శాస్త్ర వచనం.

మహారుద్రాభిషేకం: భటగావ్‌లోని శివలింగం చంద్రనాధ లింగం. ‘చంద్రలింగం’. చంద్రరూపధారియైన శివునకు మహా రుద్రాభిషేకం ఇష్టం. మహారుద్రాభిషేకంతో జ్ఞానాభివృద్ధి అనుగ్రహిస్తాడు.

అతిరుద్రాభిషేకం: ఖట్మండువద్ద త్రినాధ క్షేత్రంలోని పశుపతి లింగం ‘యజలింగం’ సర్వరూపధారియైన శివునకు అతి రుద్రాభిషేకం ప్రీతిని కలిగిస్తుంది. అతిరుద్రాభిషేకంవల్ల అఖండ పుణ్యం, ముక్తి చేకూరుతుంది.

శివలింగానికి ఆవుపాలతో సంతాన ప్రాప్తి , బిల్వపత్రం ఉంచిన నీటితో ఆయువు ఆరోగ్య అభివృద్ధి స్వచ్ఛమైన నీటితో సకాల వర్షాలు, కొబ్బరినీరు, తేనె, పండ్లరసం, చెరుకురసం, నేయి లాంటివాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం.

శివాభిషేకంలో మహన్యాసం, లఘున్యాసం, నమకం, చమకం, పురుష సూక్త, శ్రీసూక్త, మన్యుసూక్త మంత్రాలు, దశ శాంతుల మంత్రాలు అది ఏకవార అభిషేకం అయినా, ఏకాదశ రుద్రాభిషేకమైనా విధిగా చెప్పాలి.

శివపూజకు బిల్వపత్రాలు వినియోగించాలి. మారేడు చెట్టునే బిల్వవృక్షమని, శ్రీ వృక్షమని అంటారు. కాని ఎండిపో యిన బిల్వపత్రిని కూడా శివుడు ఆనందంగా స్వీకరిస్తాడు. ఈ బిల్వపత్రాలతో శివపూజ చేసిన వారికి మరుజన్మ ఉండదు. ఒక్క మారేడు దళం లక్ష బంగారు పువ్వులకు సమానమని శివపురాణంఅంటుంది. బిల్వ వృక్షాన్ని పెరట్లో పెంచితే అశ్వమేధ యాగం చేసిన ఫలం చేకూరుతుంది. వెయ్యిమందికి అన్నదాన ఫలం లభిస్తుంది. నిత్యం బిల్వపత్రితో శివుని పూజిస్తే ఐశ్వర్యవంతులవుతారు.

మారేడు చెట్టుకింద కూర్చుని ‘నమఃశివాయ’ పంచాక్షరీ మంత్రం జపం చేస్తే మంత్రసిద్ధి లభ్యం అవుతుంది.

ఆరోగ్యరీత్యా మారేడు చెట్టు వేరు, ఆకు రసము, కషాయం చలువ, మేహశాంతి, పైత్యశాంతి, జఠర దీప్తిని కలిగిస్తుంది. జ్వరము హరిస్తుంది. మూత్రరోగాలు నయం చేస్తుంది. గుండె దడ నివారిస్తుంది. విరేచన మందం పోగొడుతుంది. దోరగా పండిన మారేడు పండు గుజ్జు పంచదార కలిపి తీసుకుంటే గ్రహణి, రక్తగ్రహణికి ఎంతో మేలు చేస్తుంది. పండు రసం పుండ్లను మాన్పుతుంది.

రుద్రుడు, శంకరుడు, భవుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు, ఇలా శివునకు ఎన్నెన్నో నామాలున్నాయ. వీటిలో ఏది పిలిచినా శివుడు అభయం ఇచ్చితీరుతాడు. అసలు శివా అనే రెండు అక్షరాలు పలికితేచాలు శివసాయుజ్జం లభించినట్లే.

ఈశ్వరుడు పంచకృత్యపారాయణుడని వాయుపురాణం అంటుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం అనేవి ఈ పంచకృత్యాలు.

భక్తసులుభుడైన శివుడిని అటు మానవులు ఇటు దానవులే కాదు శ్రీరాముడు అనుక్షణం శివధ్యానం చేస్తుంటాడు.

శివలింగం మీద నీళ్లు చిలకరించి కొద్దిగా పత్రి భక్తితో పడవేసిన వారు కల్పవృక్షానికీ,  కామధేనువుకూ అథిపతి అవుతారని శివభక్తులంటారు.

ప్రదోషకాలంలో శివుని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది. ప్రదోష కాలంలో దేవతలందరూ శివుని సన్నిధిలోనే ఉండి శివతాండవం వీక్షిస్తూ ఉంటారు. ఆ సమయంలో శివపూజ మహాఉత్కృష్టమైనదని శివపురాణం చెప్తోంది.

Tuesday, April 20, 2021

దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఎక్కడ వెలిశారో తెలుసుకుందామా...

1.శైలపుత్రి 

ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో శైలపుత్రి ఆలయం ఉంది. నవదుర్గలలో దుర్గాదేవి మొదటి అవతారం శైలపుత్రి అని చెబుతారు. దుర్గామాత, శైల రజగు హిమవంతుని కుమార్తెగా జన్మించినది. ఈ అమ్మవారు వృషభ వాహనం పైన ఉండి కుడిచేత త్రిశూలం, ఎడమచేత పద్మం ధరించి ఉంటుంది. శరన్నవరాత్రులలో ఈ దేవిని ఉత్సవ మూర్తిగా అలంకరించి తొలినాడైనా పాడ్యమినాడు పూజించి, ఉపవాస దీక్షలు చేసి భక్తులు తరిస్తారు.

2. బ్రహ్మచారిని 

ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉంది. దుర్గామాత రెండవ అవతారం ఇదేనని చెబుతారు. ఈ అమ్మవారు తెల్లటి వస్త్రాలను ధరించి ఉంటారు. శివుడిని భర్తగా పొందటం కోసం నారదుడి ఆదేశానుసారం ఘోర తపస్సు చేసినది. ఈ అమ్మవారిని ఆరాదిస్తే విజయం లభిస్తుందని చెబుతారు.

3. చంద్రఘంట 

శ్రీ దుర్గామాత మూడవ అవతారం చంద్రఘంట అవతారం. ఈ అమ్మవారు గంటాకృతితో ఉన్న అర్ద చంద్రుడిని శిరస్సున ధరించి ఉంటుంది. ఈ అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారి ఆలయం వారణాసి లో ఉంది. ఈ అమ్మవారు దశభుజాలతో దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారిని ప్రార్థిస్తే భయం, అపజయం దారికి రావు అని నమ్మకం.

4. కూష్మాండ 

శ్రీ దుర్గామాత నాలుగవ అవతారం కూష్మాండ. ఈ అమ్మవారు సింహవాహనం పైన అష్టభుజాలతో దర్శనం ఇస్తుంది. అందుకే ఈ అమ్మవారిని అష్టభుజి దేవి అని కూడా అంటారు. ఈ అమ్మవారి ఆలయం కాన్పూర్ లో ఉంది. ఈ అమ్మవారిని ఆరాదిస్తే శ్రీగ్రంగా కటాక్షించి రక్షిస్తుంది.

5. స్కందమాత

నవదుర్గలలో ఐదవ అవతారం స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి అని అర్ధం. స్కందుడి తల్లి కనుక ఈ దేవిని స్కందమాత అని అంటారు. ఈ దేవి బాలస్కందుడిని తన ఒడిలో కూర్చుబెట్టుకొని మాతృమూర్తిగా భక్తులకి దర్శనం ఇస్తుంది. ఈ దేవిని ఆరాదిస్తే పతనం లేకుండా కనుకరిస్తుంది.

6. క్యాత్యాయని

నవదుర్గలలో ఆరవ అవతారం క్యాత్యాయని. కోత్స అనే ఒక ఋషి పార్వతీదేవి తనకి కూతురిగా జన్మించాలంటూ ఘోర తపస్సు చేయగా అతడిని కూతురిగా జన్మించింది. అందువలనే ఈ దేవికి క్యాత్యాయని అనే పేరు వచ్చింది. ఈ అవతారంలో దర్శనమించే ఆ దేవి ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది.

7. కాళరాత్రి 

నవదుర్గలలో ఏడవ అవతారం కాళరాత్రి. ఈ దేవి శరీరం ఛాయా చీకటి తో నల్లగా ఉంటుంది. అందుకే ఈ దేవిని కాళరాత్రి అనే పేరు వచ్చినది. ఈ దేవి వాహనం గాడిద. ఎల్లప్పుడూ శుభ ఫలితాలు ఇస్తుంది కనుక ఈ దేవిని శుభకరీ అని కూడా అంటారు. ఈ దేవి ఆలయం కూడా వారణాసి లో ఉంది.

8. మహాగౌరి 

నవదుర్గలలో ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈ దేవి హిమాచలం కంటే తెల్లని ధవళ కాంతితో శోభిస్తుంటుంది. అయితే శివుడిని భర్తగా పొందాలని పార్వతీదేవి ఘోర తపస్సు చేయగా ఆమె శరీరం నల్లబడుతుంది. ఇక ఆ దేవి భక్తికి మెచ్చిన స్వామివారు గంగా జలంతో ఆమె శరీరాన్ని ప్రక్షాళన చేస్తారు. అప్పటినుండి ఆమె మహాగౌరి గా ప్రసిద్ధి చెందింది.

9. సిద్ధిధాత్రి

శ్రీ దుర్గా మాత అవతారాలలో తొమ్మిదొవ అవతారం సిద్ధిధాత్రి. ఈ దేవతని దేవతలు, సిద్దులు, మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తారు. ఈ దేవి బుద్ది, విద్య, భోగ భాగ్యాలను ప్రసాదిస్తుంది.

ఈవిధంగా శ్రీ దుర్గాదేవి తొమ్మిది అవతారాలు ఉండగా. ఈ తొమ్మిది అవతారలకు సంబంధించిన ఆలయాలు అన్ని కూడా వారణాసి లో ఉన్నాయి.

సర్వేజనా సుఖినోభవంతు 

వివిధ జీవన సమస్యలకు, గ్రహదోషాలకు దేవతా మంత్ర పరిష్కారాలు

మంత్ర తంత్రాలు మనిషి జీవితంలోని గ్రహదోషాలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయి. దేనికి ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి పరిష్కార మార్గం లభిస్తుందో మీ కోసం. ఇవి ఇక్కడ ఇచ్చినంత మాత్రాన చేశేయమని కాదు. ఎందుకంటే ఇక్కడ మంత్రాలూ అన్ని బీజాక్షరాల తో ఉన్నవి. అందుకని ఇవి అన్ని గురు ముఖతః నేర్చుకుని గురువు ఆజ్ఞతో చేసుకోవాలి. అప్పుడు సరిఅయిన ఫలితం వస్తుంది. వ్యాకరణ దోషాలు ఉంటే మంచిది కాదు. 

తెలుగు సరిగా వచ్చిన వారు దోషాలు లేకుండా చూసుకోగల్గితే, గురువు లేని పక్షంలో, మీకు నచ్చిన మంత్రము ఒక కాగితం మీద రాసి, దానికి పసుపు, కుంకుమ పెట్టి,  దేవుడి ముందర ఉంచి, నమస్కారము చేసి, సంకల్పం చెప్పుకుని, మంత్రము చదువుకోండి. తప్పని సరిగా కనీసం రోజుకి 18 సార్లు ఐన చదవండి. 


వ్యాపార లాభాలకు మంత్రం

1. దుర్గే శివే భయనాశిని మాయే నారాయణి సనాతని జయే మే పత్య దేహేదేహిన్‌ రక్షరక్ష కృపాకరీ

2. ఓం నమో ప్రీం పీతాంబరాయ నమః 

మంత్రం:

శివశక్తి కామక్షితి రధ రవి శ్శీతకిరణం స్మరో హంస శక్రస్త

ధనుజ పరామార హరయః

అమీ హృల్లేకాభిఃతి స్వభావ రసానేషు ఘటితా

భజన్తే వర్ణాస్తే తవ జననీ నామావయవతాం


హనుమాన్‌ శత్రుంజయ మంత్రం:

ఓం నమో భగవతే మహాబల పరాక్రమాయ మహా విపత్తి నివారణాయ

భక్తజన మనోభీష్ట కల్పనాకల్ప ధ్రుమాయ

దుష్టజన మనోరథ స్తంభనాయ

ప్రభంజన ప్రాణప్రియాయ శ్రీం



ధనప్రద శ్రీ లక్ష్మీ కుబేర మంత్రం:

కుబేరో ధన దః శ్రీ దః రాజరాజో ధనేశ్వరః

ధనలక్ష్మీ ప్రయతమో ధనాడ్యో ధనిక ప్రియః

ఓం శ్రీం క్లీం శ్రీం కార్యసిద్థి కుబేరాయ నమః

ఓం శ్రీం క్లీం శ్రీం లక్ష్మీ కుబేరాయ నమః

ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం యుక్తేశ్వరాయ నమః

ఓం యక్షాయవిద్మహే వైశ్రవణాయ ధీమహే

తన్నో కుబేర ప్రచోదయాత్‌



విద్యా విజయానికి మంత్రాలు.

1. ఆనంద తీర్థ వరదే దానవారణ్య పావకే

జ్ఞానదాయనే సర్వేశే శ్రీనివాసేస్తు మే మనః

2. శ్రీవేంకటేశా శ్రీనివాసా సర్వశత్రు వినాశకా

త్వమేవ శరణం స్వామిన్‌ సర్వత్ర విజయం దిశా


సంతాన గోపాల మంత్రం:

ఓం హ్రీం కృష్ణాయ హూం శ్రీం క్లీం గోవిందాయ ఫట్‌ స్వాహా

ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణా గోవిందా గోపీజన వల్లభా మమ పుత్ర దేహీ స్వాహా

దేవకీ సుత గోవిందా దేవదేవ జగత్పతే దేహిమే తనయే కృష్ణా తవమహం శరణం గతః


విద్యాప్రాప్తికి సరస్వతీ స్తోత్రం:

సరస్వతీ మాం దృష్ట్యా వీణా పుస్తక ధారిణీం

హంస వాహన సమాయుక్తా విద్యాదాన కరే మమ

ప్రథమం భారతీనామా, ద్వితీయంచ సరస్వతీ

తృతీయ శారదాదేవీ, చతుర్థం హంస వాహిని

పంచమం జగతీ ఖ్యాతా, షష్ట్యం వాణీశ్వరీ తథా

కౌమారీ సప్తమం ప్రోక్తా, అష్టమం బ్రహ్మచారిణి

నవమం బుద్ధి ధాత్రీచా, దశమం వరదాయని

ఏకాదశం క్షుద్ర ఘంటా, ద్వాదశం భువనేశ్వరీ

ద్వాదశైతాని నామాని త్రిసంధ్య యః పఠేన్నరః

సర్వసిద్ధి ఖరీతస్య ప్రసన్న పరమేశ్వరీ

సామేవసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతీ



విజయానికీ సకల దోష నివారణకూ తగిన మంత్రాలు, స్తోత్రాలు..


లక్ష్మీగణపతి:.

సర్వవిజ్ఞ హరం దేవం సర్వవిజ్ఞ వివర్జితం

సర్వసిద్ధి ప్రదాతారం లక్ష్మీగణపతిం భజే


క్షమాపణకు:.

నారాసింహానంత గోవిందా భూతభావన కేశవా

దురుక్తం దుష్కృతం ధ్యాతం శమయాషు జనార్దనా


సర్వఫలప్రదభైరవ స్తోత్రం:.

ఓం భైరవాయ అనిష్ట నివారణాయ స్వాహా

మమ సర్వేగ్రహ అనిష్ట నివారణాయ స్వాహా

జ్ఞనం దేహి ధనం దేహి మమ దారిద్య్రం నివారణాయ స్వాహా

సుతం దేహి యశం దేహి మమ గృహక్లేశం నివారణాయ స్వాహా

స్వాస్థ్యం దేహి బలం దేహి మమ శత్రు నివారణాయ స్వాహా

సిద్ధం దేహి జయం దేహి మమ సర్వ రుణాం నివారణాయ స్వాహా


దీర్ఘాయువుకూ, చిరంజీవత్వానికి:

అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంచ్ఛ విభీషణః

కృపః పరశురామాచ్ఛ సప్తైతే చిరంజీవి నమః

సప్తైతాన్‌ సంస్మరే నిత్యం మార్కండేయ మదాష్టకం

జీవేద్వర్ష శతంశోపి సర్వవ్యాధి వివర్జితః


విద్యావిజయంకరీ మంత్రం:

ఓం ఐం హ్రీం హ్రీం క్లీం క్లీం హౌం సః

నీల సరస్వతే నమః

(ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం కనీసం 11సార్లు లేదా 108సార్లు జపిస్తే సత్వర విద్యాభివృద్ధి కలుగుతుంది)


సత్వర వివాహానికి - దాంపత్య దోష నివారణకు.


1. కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్‌ యతీశ్వరీ

నందగోప సుతం దేవీ పతిమే కురుతే నమః

2. అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః

కామేశ బద్ద మాంగల్య సూత్ర శోభిత కందర

3. విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే

4 సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే

గమనిక: రుక్మిణీ కల్యాణం పారాయణం చేయటం కూడా మంచిది



మంగళచండికా స్తోత్రం:

రక్షరక్ష జగన్మాతా దేవీ మంగళ చండికే

హారికే విపదం రక్షే హర్ష మంగళ కారికే

హర్ష మంగళ దక్షేచా హర్ష మంగళ దాయినే

శుభే మంగళ దక్షేచా శుభే మంగళ చండికే

మంగళే మంగళా ర్హేచా సర్వమంగళ మంగళే

సదా మంగళాదేవీ సర్వేశాం మంగళలయే


భార్యాభర్తల పరస్పర ఆకర్షణకు.

ద్రాం ద్రవిణే బాణాయ నమః

ద్రీం సంక్షోభణ బాణాయ నమః

క్లీం ఆకర్షణ బాణాయ నమః

బ్లూం వశీకరణ బాణాయ నమః

సం సమ్మోహన బాణాయ నమః


పురుషత్వం,సంతాన ప్రాప్తికి.

కథాకాళేమాతః కథయా కళితాలక కరశం

పిబేయం విద్యార్థీ తవచరణ నిర్లేజన జలం

ప్రకీర్తా మూకనామ పిచకలితాకారణ తయా

యథాదత్తే వాణీముఖ కమల తాంబూల రసతాం


శీఘ్ర వివాహానికి..

కన్య నిత్యం స్నానానంతరం తులసి చెట్టుకు 12 ప్రదక్షిణాలు చేసి గౌరీమాతను ప్రార్థిస్తూ సౌందర్యలహరిలోని 4,11,27

శ్లోకాలలో ఏదో ఒకదాన్ని పఠించాలి. ఇలా 120 రోజులు చేస్తే త్వరగా వివాహమవుతుంది.

ఓం  శ్రీ శ్రీ శ్రీ అష్టలింగేశ్వరస్వామియే నమః

దైవసంపద 26 సుగుణములు

1. భయము లేకుండుట 

2. అంతఃకరణశుద్ధి 

3. జ్ఞానయోగమునందుండుట 

4.దానము 

5.బాహ్యేంద్రియనిగ్రహము 

6. (జ్ఞాన) యజ్ఞము 

7.( వేదశాస్త్రముల ) అధ్యయనము 

8.తపస్సు 

9.ఋజుత్వము 

10.ఏప్రాణికిన్ని బాధ గలుగజేయకుండుట ( అహింస ) 

11. సద్వస్తువగు పరమాత్మ నాశ్రయించుట, లేక , నిజము పలుకుట (సత్యము), 

12.కోపము లేకుండుట 13.త్యాగబుద్ధిగలిగియుండుట 

14. శాంతిస్వభావము 

15.కొండెములు చెప్పకుండుట 

16. ప్రాణులందు దయగలిగియుండుట

17.విషయలోలత్వము లేకుండుట 

18.మృదుత్వము (క్రౌర్యము లేకుండుట)

19. (ధర్మ విరుద్ధ కార్యములందు) సిగ్గు 

20.చంచల స్వభావము లేకుండుట 

21.ప్రతిభ (లేక, బ్రహ్మతేజస్సు )

22. ఓర్పు(కష్ట సహిష్ణుత) 

23. ధైర్యము 

24.బాహ్యాభ్యంతర శుచిత్వము

25.ఎవరికిని ద్రోహముచేయకుండుట (ద్రోహచింతనము లేకుండుట) 

26. స్వాతిశయము లేకుండుట (తాను పూజింపదగినవాడనను అభిమానము, గర్వము లేకుండుట) - అను నీ సుగుణములు దైవసంపత్తియందు పుట్టిన వానికి కలుగుచున్నది. (అనగా దైవసంపత్తిని పొందదగి పుట్టినవానికి కలుగుచున్నవని భావము).

Friday, April 16, 2021

శతగాయత్రి మంత్రావళి విశిష్టత

బ్రహ్మ గాయత్రి :-

1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//

2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//

3. సురారాధ్యాయ విద్మహే వేదాత్మనాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. //


విష్ణు గాయత్రి :-

4. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //

5. లక్ష్మీనాధాయ విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్//

6. దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //


శివ గాయత్రి :-

7. శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //

8. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.//

9. సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్//

10. పంచవక్త్రాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ //

11. గౌరీనాధాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //

12. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //


వృషభ గాయత్రి :-

13. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//

14. తీష్ణశృంగా విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//


చండీశ్వర గాయత్రి :-

15. ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//

16. చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//


భృంగేశ్వర గాయత్రి :-

17. భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నోభృంగి ప్రచోదయాత్.//


వీరభద్ర గాయత్రి :-

18. కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//

19. చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//

20. ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//


శిఖరగాయత్రి :-

21. శీర్ష్యరూపాయ విద్మహే శిఖరేశాయ ధీమహి తన్న స్థూపః ప్రచోదయాత్.//


ధ్వజగాయత్రి :-

22. ప్రాణరూపాయ విద్మహే త్రిమేఖలాయ ధీమహి తన్నోధ్వజః ప్రచోదయాత్.//


దత్త గాయత్రి :-

23. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్.//


శాస్త [అయ్యప్ప] గాయత్రి :-

24.భూతనాధాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నశ్శాస్తా ప్రచోదయాత్.//


సుదర్శన గాయత్రి :-

25. సుదర్శనాయ విద్మహే జ్వాలాచక్రాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//

26. సుదర్శనాయ విద్మహే యతిరాజాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//


మత్స్య గాయత్రి :-

27. జలచరాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నోమత్స్యః ప్రచోదయాత్.//


కూర్మ గాయత్రి :-

28. కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నోకూర్మ: ప్రచోదయాత్.//


వాస్తుపురుష గాయత్రి :-

29. వాస్తునాధాయ విద్మహే చతుర్బుజాయ ధీమహి తన్నో వాస్తుః ప్రచోదయాత్.//


శ్రీ గణపతి గాయత్రి :-

30. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//

31. ఆఖుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//


శ్రీ కృష్ణ గాయత్రి :-

32. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//

33. గోపాలకాయ విద్మహే గోపీ ప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//

34. వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//


శ్రీ రామ గాయత్రి :-

35. దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//

36. ధర్మ రూపాయ విద్మహే సత్యవ్రతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//


శ్రీ ఆంజనేయ గాయత్రి :-

37. ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//

38. పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//


శ్రీ హయగ్రీవ గాయత్రి :-

39. వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హగ్ం సహః ప్రచోదయాత్.//


శ్రీ స్కంద గాయత్రి :-

40. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//

41. తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//

42. షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//


శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి :-

43. భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//

44. కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//


శ్రీ గరుడ గాయత్రి :-

45. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.//


శ్రీ అనంత గాయత్రి :-

46. అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి తన్నో నంతః ప్రచోదయాత్.//


శ్రీ ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి :-

47. దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రః ప్రచోదయాత్.//

48. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్.//

49. కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్.//

50. ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్థితాయ ధీమహి తన్నో నిఋతిః ప్రచోదయాత్.//

51. జలాధిపాయ విద్మహే తీర్థరాజాయ ధీమహి తన్నో పాశిన్ ప్రచోదయాత్.//

52. ధ్వజహస్తయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్.//

53. శంఖ హస్తయ విద్మహే నిధీశ్వరాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్.//

54. శూలహస్తయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఈశః ప్రచోదయాత్.//


శ్రీ ఆదిత్యాది నవగ్రహ గాయత్రి :-

55. భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.//

56. అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్న శ్చంద్రః ప్రచోదయాత్.//

57. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్.//

58. చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్.//

59. సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్.//

60. భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్.//

61. రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్.//

62. శీర్ష్యరూపాయ విద్మహే వక్రఃపంథాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్.//

63. తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్.//


శ్రీ సాయినాథ గాయత్రి :-

64. జ్ఞాన రూపాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్.//


శ్రీ వేంకటేశ్వర గాయత్రి :-

65. శ్రీ నిలయాయ విద్మహే వేంకటేశాయ ధీమహి తన్నోహరిః ప్రచోదయాత్.//


శ్రీ నృసింహ గాయత్రి :-

66. వజ్రనఖాయ విద్మహే తీష్ణదగ్ ష్ట్రాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్.//


శ్రీ లక్ష్మణ గాయత్రి :-

67. రామానుజాయ విద్మహే దాశరధాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్.//


శ్రీ క్షేత్రపాల గాయత్రి :-

68. క్షేత్రపాలాయ విద్మహే క్షేత్రస్థితాయ ధీమహి తన్నః క్షేత్రః ప్రచోదయాత్.//


🌱🌱🌱🔥🔥🔥🌱🌱🌱


భగవద్ గీత పై చాగంటి వారి ధర్మ సూక్ష్మ సహితమైన అద్భుత ప్రవచనం 


🌱🌱🌱🔥🔥🔥🌱🌱🌱


యంత్ర గాయత్రి :-

69. యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.//


మంత్ర గాయత్రి :-

70. మంత్రరాజాయ విద్మహే మహా మంత్రాయ ధీమహి తన్నోః మంత్రః ప్రచోదయాత్.//


శ్రీ సరస్వతీ గాయత్రి :-

71. వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.//


శ్రీ లక్ష్మీ గాయత్రి :-

72. మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//

73. అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//


శ్రీ గౌరి గాయత్రి :-

74. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//

75. మహా దేవ్యైచ విద్మహే రుద్ర పత్న్యై చ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//


శ్యామలా గాయత్రి :-

76. శుకప్రియాయ విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి తన్నః శ్యామలా ప్రచోదయాత్.//

77. మాతంగేశ్వరి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్.//


భైరవ గాయత్రి :-

78. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో భైరవీ ప్రచోదయాత్.//


శక్తి గాయత్రి :-

79. త్రిపురాదేవి విద్మహే సౌః శక్తీశ్వరి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//


శ్రీ కన్యకాపరమేశ్వరీ గాయత్రి :-

80. బాలారూపిణి విద్మహే పరమేశ్వరి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//

81. త్రిపురాదేవి విద్మహే కన్యారూపిణి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//


శ్రీ బాలా గాయత్రి :-

82. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరిచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్.//


శ్రీ సీతా గాయత్రి :-

83. మహాదేవ్యైచ విద్మహే రామపత్న్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్.//


శ్రీ దుర్గా గాయత్రి :-

84. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్.//


శ్రీ శూలినీ దుర్గా గాయత్రి :-

85. జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్.//


శ్రీ ధరా గాయత్రి :-

86. ధనుర్దరాయ విద్మహే సర్వసిద్దించ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్.//


శ్రీ హంస గాయత్రి :-

87. హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్.//


శ్రీ ముక్తీశ్వరీ గాయత్రి :-

88. త్రిపురాదేవి విద్మహే ముక్తీశ్వరీ ధీమహి తన్నో ముక్తిః ప్రచోదయాత్.//


శ్రీ గంగా దేవీ గాయత్రి :-

89. త్రిపధగామినీ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//

90. రుద్రపత్న్యై చ విద్మహే సాగరగామిని ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//


శ్రీ యమునా గాయత్రి :-

91. యమునా దేవ్యైచ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమునా ప్రచోదయాత్.//


శ్రీ వారాహీ గాయత్రి :-

92. వరాహముఖి విద్మహే ఆంత్రాసనిచ ధీమహి తన్నో వారాహీ ప్రచోదయాత శ్రీ చాముండా గాయత్రి :-

93. చాముండేశ్వరి విద్మహే చక్రధారిణి ధీమహి తన్నః చాముండా ప్రచోదయాత్.//


శ్రీ వైష్ణవీ గాయత్రి :-

94. చక్రధారిణి విద్మహే వైష్ణవీ దేవి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//


శ్రీ నారసింహ గాయత్రి :-

95. కరాళిణిచ విద్మహే నారసింహ్యైచ ధీమహి తన్నః సింహేః ప్రచోదయాత్.//


శ్రీ బగాళా గాయత్రి :-

96. మహాదేవ్యైచ విద్మహే బగళాముఖి ధీమహి తన్నో అస్త్రః ప్రచోదయాత్.//


శ్రీ సాంబ సదాశివ గాయత్రి :-

97. సదాశివాయ విద్మహే సమాస్రాక్షాయ ధీమహి తన్నః సాంబః ప్రచోదయాత్.//


శ్రీ సంతోషీ గాయత్రి :-

98. రూపాదేవీచ విద్మహే శక్తిరూపిణి ధీమహి తన్నస్తోషి ప్రచోదయాత్.//


శ్రీ లక్ష్మీ గణపతి గాయత్రి :-

99. తత్పురుషాయ విద్మహే శక్తియుతాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//

100. దశభుజాయ విద్మహే వల్లభేశాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//


Thursday, April 15, 2021

తెలుగు సంవత్సరాల పేర్లు... వాటి అర్థాలు

1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక.

2. విభవ - వైభవంగా ఉండేది.

3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.

4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.

5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.

6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.

7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.

8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.

9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.

10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.

11. ఈశ్వర... పరమేశ్వరుడు.

12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.

13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.

14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.

15. వృష ... చర్మం.

16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.

17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం

18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.

19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.

20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.

21. సర్వజిత్తు.... సర్వాన్ని జయించినది.

22. సర్వధారి -...సర్వాన్ని ధరించేద.

23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.

24. వికృతి... వికృతమైనటువంటిది.

25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.

26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.

27. విజయ... విశేషమైన జయం కలిగినది.

28. జయ.... జయాన్ని కలిగించేది. 

29. మన్మథ... మనస్సును మధించేది.

30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.

31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.

32. విలంబి... సాగదీయడం.

33. వికారి.... వికారం కలిగినది.

34. శార్వరి... రాత్రి.

35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.

36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.

37. శోభకృత్... శోభను కలిగించేది.

38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.

39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.

40. పరాభవ ... అవమానం.

41. ప్లవంగ... కోతి, కప్ప.

42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.

43. సౌమ్య... మృదుత్వం.

44. సాధారణ... సామాన్యం.

45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.

46. పరీధావి... భయకారకం.

47. ప్రమాదీచ... ప్రమాద కారకం.

48. ఆనంద... ఆనందమయం.

49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.

50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.

51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.

52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.

53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.

54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.

55. దుర్మతి... దుష్ట బుద్ధి.

56. దుందుభి ... వరుణుడు.

57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.

58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.

59. క్రోదన... కోప స్వభావం కలది.

60. అక్షయ... నశించనిది.

Wednesday, April 14, 2021

గ్రామదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు

పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం .

ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు అని వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు .వారిలో కొందరు.

1.పాగేలమ్మ

2.ముత్యాలమ్మ

3 .గంగమ్మ

4.గంగానమ్మ

5.బంగారమ్మ

6.గొంతెమ్మ

7.సత్తెమ్మ

8.తాళమ్మ

9.చింతాలమ్మ

10.చిత్తారమ్మ

11.పోలేరమ్మ

12.మావుళ్లమ్మ

13.మారెమ్మ

౧౪.బంగారు బాపనమ్మ

15.పుట్టానమ్మ

౧౬.దాక్షాయణమ్మ

17.పేరంటాలమ్మ

18.రావులమ్మ

19.గండిపోచమ్మ

20.మేగదారమ్మ

21.ఈరినమ్మ

22.దుర్గమ్మ

23.మొదుగులమ్మ

24.నూకాలమ్మ (అనకాపల్లి ,విశాఖజిల్లా )

25.మరిడమ్మ

26.నేరెళ్లమ్మ

27.పుంతలో ముసలమ్మ (మెయ్యెరు ,అత్తిలిదగ్గర ,పశ్చిమగోదావరిజిల్లా )

28.మాచరమ్మోరు

29.మద్ది ఆనాపా అమ్మోరు

30.సొమాలమ్మ

31.పెద్దయింట్లమ్మ

32.గుర్రాలక్క (అంతర్వేది ,తూర్పుగోదావరిజిల్లా గుర్రాలమ్మ )

33 .అంబికాలమ్మ

34.ధనమ్మ

35.మాలక్షమ్మ

36.ఇటకాలమ్మ

37.దానాలమ్మ

38.రాట్నాలమ్మ

39.తలుపులమ్మ

40.పెన్నేరమ్మ

41.వెంకాయమ్మ

42.గుణాళమ్మ

43.ఎల్లమ్మ (విశాఖపట్నం )

44.పెద్దమ్మ

45.మాంటాలమ్మ

46.గంటాలమ్మ

47.సుంకులమ్మ

48.జంబులమ్మ

49.పెరంటాలమ్మ

50.కంటికలమ్మ

51.వణువులమ్మ

52.సుబ్బాలమ్మ

53.అక్కమ్మ

54.గనిగమ్మ

55.ధారాలమ్మ

56.మహాలక్షమ్మ

57.లంకాలమ్మ

58.దోసాలమ్మ

59.పళ్ళాలమ్మ (వానపల్లి ,తూర్పుగోదావరిజిల్లా )

60.అంకాళమ్మ .

61.జోగులమ్మ

62.పైడితల్లమ్మ

63.చెంగాళమ్మ

64.రావులమ్మ

65.బూరుగులమ్మ

66.కనకమహాలక్ష్మి (విశాఖపట్నం )

67.పోలమ్మ

68.కొండాలమ్మ

69.వెర్నిమ్మ

70.దే శిమ్మ

71.గరవాలమ్మా

72.గరగలమ్మ

73.దానెమ్మ

74.మహాంకాళమ్మ

75.వేరులమ్మ

76.మరిడమ్మ

77.ముళ్ళ మాంబిక

78.యలారమ్మ

79.వల్లూరమ్మ

80.నాగులమ్మ

81.వేగులమ్మ

82.ముడియలమ్మ

83.రేణుకమ్మ

84.నంగాలమ్మ

85.చాగాలమ్మ

86.నాంచారమ్మ

87.సమ్మక్క

88.సారలమ్మ

89.మజ్జిగౌరమ్మ

90.కన్నమ్మ -పేరంటాలమ్మ

91.రంగమ్మ -పేరంటాలమ్మ

92.వెంగమ్మ -పేరంటాలమ్మ

93.తిరుపతమ్మ

94.రెడ్డమ్మ

95.పగడాలమ్మ

96.మురుగులమ్మ (బండారులంక ,తూర్పుగోదావరిజిల్లా )

97.కుంచమ్మ విశాఖపట్నంలో

98.ఎరకమ్మ

99.ఊర్లమ్మతల్లి

100.మరిడమ్మ

101.సుంకాలమ్మవ్వ ఉన్నారు .


నుసకపల్లి ,పామర్రమండలం తూర్పుదోదావరిజిల్లాలోని గ్రామదేవతలు .


1.నుసకపల్లమ్మ

2.వెలగలమ్మ

3 .ఊర్లమ్మతల్లి (గణపవరం ,కర్లపాలెం మండలం ,గుంటూరుజిల్లా )

4.పైళ్లమ్మతల్లి

5.బల్లమ్మతల్లి

6.లొల్లాలమ్మతల్లి

7.ఊడలమ్మ తల్లి

8.కట్వాలాంబిక

9.నాగాలమ్మ నాంచారమ్మతల్లి

10.సింగమ్మతల్లి

11.ఘట్టమ్మతల్లి

12.అంజారమ్మతల్లి .

౧౩. మంత్రాలమ్మ తల్లి

౧౪.పాతపాటేశ్వరి తల్లి

౧౫.కుంకుళమ్మ ద్వారకా తిరుమల

౧౬.చౌడమ్మ నందవరం కర్నూల్ జిల్లా


అలాగే ఖమ్మం ,నల్గొండ జిల్లాలలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కానవస్తుంది .


జై అమ్మలగన్న అమ్మలు ఆదిపరాశక్తిలు గ్రామదేవతలకు జై

🙏🙏🙏🙏🙏🙏


మన గ్రామదేవతలు

ఎలా వెలిశారు ?

మనం రకరకాల పేర్లతో

పిలిచే గ్రామదేవతల

నామ విశేషాలేమిటి?


గ్రామదేవతా వ్యవస్థ:


గ్రామాలలో వెలిసే

దేవత...దేవుళ్ళను

ముఖ్యముగా

స్త్రీ దేవతా రూపాలను

గ్రామదేవతలని అంటారు.


సంప్రదాయాలను

అనుసరించి

గ్రామ రక్షణగా

ఈ దేవతలను

ఊరి పొలిమేరలలో

ఏర్పాటు చేసేవారు.


ప్రాచీన కాలములో

మానవుడు ఎంతో

తెలివైనవాడు,

ఇంట్లోవున్న

చిన్నా, పెద్దా,

ఆడా, మగా -

అందరూ దేవీనవరాత్రుల

కాలములో

ఎక్కడోవున్న

మధుర మీనాక్షమ్మ వద్దకో,

కంచి కామాక్షమ్మ దగ్గరికో,

బెజవాడ కనకదుర్గమ్మ

చెంతకో వెళ్ళాలంటే

కుదరకపోవచ్చు.


ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా

వెళ్ళే వీలుండక పోవచ్చు.


వీలుచిక్కినా అందరికీ

ఒకేసారి వెళ్ళడము

సాద్యపడకపోవచ్చు.


ఇలాంటి సందర్భాలలో

అలాంటి వాళ్ళు

అమ్మ దర్శనానికి

వెళ్ళలేక పోయామే

అని నిరాశ పొందకుండా

వుండేందుకు

ఎక్కడో వున్న తల్లిని

ఇక్కడే దర్శించు కొన్నామనే

తృప్తిని పొందేందుకు

గ్రామదేవత వ్యవస్థని

ఏర్పాటు చేసారు పెద్దలు.


ఈ దేవతా ప్రతిష్ఠ

గొప్ప విద్వాంసులైన

వేద, స్మార్త,

ఆగమ శాస్త్ర పండితుల

చేతనే జరుగుతుంది.


ఎవరికి నిజమైన

భక్తి ప్రపత్తులతో పాటు

అర్చకునిగా వుండే

తీరిక, ఓపిక వుంటాయో

అలాంటి వారిని

వారి కోరిక మేరకు

అర్చకులుగా

నియమించారు పూర్వీకులు.


అప్పటినుంచి

ఆ అర్చకుని

వంశము వాళ్ళే

ఆ గుడి బాధ్యతలను

నిర్వహిస్తూ వస్తున్నారు.


దేవతా విగ్రహప్రతిష్ఠ

శాస్త్రీయంగా

నిర్వహించబడింది

కాబట్టి,

ఆ దేవతల కింద

బీజాక్షరాలున్న

యంత్రము

సరైన

మూహూర్తములోనే

వేయబడింది

కాబట్టి

గ్రామదేవతలంతా

శక్తివున్న

దేవతలే అవుతారు-


భక్తుల కోర్కెలు

తీర్చగలవారవుతారు.


అయితే

ప్రతి సంవత్సరము

ఆలయప్రతిష్ఠ జరిగిన

ఆ నెల, ఆ తిథినాడు

ఖచ్చితముగా

విద్వాంసులను పిలిచి

పవిత్రోత్సవాన్ని

చేయించాల్చిందే.


అలా చేయడమువలన

అమ్మకి మన ద్వారా

ఏదైనా అపవిత్రత

కలిగివుంటే తొలగుతుంది.


గ్రామదేవతల

ఆవిర్భావము:


పంచభూతాలు

అనగా

గాలి, నీరు, అగ్ని,

భూమి, ఆకాశము

కారణముగానే

ఈ ప్రపంచము ఏర్పడినది.


అందుకని

ఈ పంచ భూతాలకి

ప్రతీకలుగా ఐదుగురు

గ్రామదేవతలను

ఏర్పాటు చేసారు

తొలి దశలో.


పృధ్వీ దేవత:

మొదటిది పృధ్వీ

అంటే నేల,

ఇది పంటకి ఆధారము,

కుంకుల్లు బాగా పండే

ప్రాంతములో ప్రతిష్టించిన

పృధ్వినీ దేవతను

కుంకుళ్ళమ్మ అన్నారు.


గోగులు బాగా పూచే

ప్రాంతములో

ఆ గోంగూర, గోగునార

ఇవే వారి జీవన ఆధారము

కాబట్టి ఆపేరుతో

గోగులమ్మని

యేర్పాటు చేసారు.


జొన్నలు పండేచోట

జొన్నాళమ్మ అని,

నూకలు అంటే వరి పండే

ప్రాంతాలలో నూకాళమ్మ

అని పిలుచుకున్నారు.


మొదటిసారిగా పండిన

పంటను ఆతల్లికే

నివేదన చేయడము,

అర్చకునిగా వున్నవానికి

అందరూ ఆ పంటను

యిస్తూ వుండడము,

దాన్నే సొమ్ముగా

మార్చుకొని

అతడు జీవించడము.

ఇలా సాగుతూ వుండేదీ

వ్యవస్థ.


పంట వేసేటప్పుడుకూడా

ఈ తల్లిని ఆరాదిస్తేగాని

చేనుకి వెల్తూండేవారు

కాదు.

అన్నాన్ని పెట్టే తల్లి

కాబట్టి అన్నమ్మ

అని కూడా

ఒక దేవత వుంది.


ఇక పంటలన్నీ చేతికందాక

సుఖసంతోషాలతో

జాతర చేస్తూండేవారు.

అదే ఇప్పటికీ

అనేక గ్రామాలలో

కొనసాగూతూండడం

జరుగుతూ ఉన్నది.


జల దేవత:

రెండవది జలానికి

సంబంధించిన తల్లి

గంగమ్మ–గంగానమ్మ.

ఈ తల్లి భూమి మీద కాక

భూమిలోపల ఎంతో

లోతుగా వుంటుంది.

గుడి ఎత్తుగా కట్టినా

తల్లిని చూడాలంటే

మెట్లుదిగి కిందికి

వెళ్ళ వలసి ఉంటుంది.


అగ్ని దేవత:

మూడవది తేజస్సు(అగ్ని).

పగటిపూట

తేజస్సునిచ్చే సూర్యునికి

ప్రతీకగా సూరమ్మనూ,

రాత్రిపూట తేజస్సు నిచ్చే

చంద్రునికి ప్రతీకగా

పున్నమ్మ నీ

దేవతలుగా చేసారు.


సూరమ్మను ప్రతి

అమావాస్యనాడు,

పున్నమ్మను ప్రతి

పౌర్ణమినాడు

పూజించే విధముగా

ఏర్పాటు చేసుకొని

తమ కులవృత్తిని ఆరోజు

మానేయడం చేసేవారు.


ఇక అమ్మకి కుడి కన్ను

సూర్యుడుగానూ

ఎడమ కన్ను చంద్రుడిగాను

ఆతల్లికి పెట్టిన పేరు

ఇరుకళలమ్మ (సూర్య,చంద్రుల

కళ వున్న అమ్మ).


వాయు దేవత:

నాలుగవది వాయువు

కరువలి అంటే పెద్ద గాలి.

కొండ ప్రాంతములో

వుండేవారికి

విపరీతమైన కొండగాలి

వీచినప్పుడు

ఏ ఉపద్రవము

ఉండకుండా రక్షించేందుకు

కరువలమ్మను

యేర్పాటు చేసుకున్నారు.


ఆకాశ దేవత:

ఐదవది ఆకాశము

ఎత్తులో వున్నందున

కొండమ్మ ను

ఆకాశ దైవానికి ప్రతీకగా

తీసుకున్నారు.

పిడుగులు, మెరుపులు,

గాలివాన.

ఇలాంటి వాటి నుండి

రక్షించేందుకు ఈ తల్లిని

యేర్పాటు చేసుకున్నారు.


గ్రామదేవతా

నామ విశేషాలు:


మనం రకరకాల

పేర్లతో పిలిచే

ప్రతి గ్రామదేవత

పేరు వెనుక

ఒక పరమార్ధం ఉంది


సొంతవూరిని విడిచి

పొరుగూరు వెళ్ళే వ్యక్తుల

రాకపోకల్ని గమనిస్తూ

వూరి పొలిమేరలో

వుండేతల్లి పొలిమేరమ్మ

క్రమముగా

పోలేరమ్మ అయింది.


ఎల్ల' అంటే సరిహద్దు

అని అర్దము

అందుకే 'ఎల్లమ్మ' కూడా

ఈ పనిని చేసేదన్నమాట.


ఒక వ్యక్తికి జీవన భృతి

కలిగించి పోసించే తల్లి

'పోచ+అమ్మ=పోచమ్మ'

అన్నమాట.

ఎల్లమ్మ తల్లి

తన భక్తులకి

ఎటువంటి వ్యాధులు

రాకుండా నివారించేదైతే,

పోచమ్మ

పోషణ కలిగిస్తుంది.


ప్రతి వ్యక్తికీ

ఇంతకాలము జీవించాలనే

ఓ కట్ట (అవధి)

ఏదుందో

ఆ కట్టని మేయగల

(ఆ అవధినించి

రక్షించగల) అమ్మే 'కట్టమేసే+అమ్మ=

కట్టమేసెయమ్మ

కాలక్రమములో

కట్టమైసమ్మ అయింది.


స్వచ్ఛమైన అమ్మ

అనే అర్దములో

(స్వచ్ఛమని)సు+అచ్చ=

స్వచ్ఛ అనే

రెండు పదాలు కలిపి

అచ్చమ్మగా అయ్యింది.


సాధారణముగా

15 వూళ్ళకో

దేవత వుంటుంది.

'మా వూళ్ళన్నింటికీ

అమ్మ' అనే అర్దములో

ఆమెను మావూళ్ళమ్మ

అని పిలుస్తూంటే

క్రమముగా అది

మావుళ్ళమ్మ' అయింది.


ప్రజల మనసులో

పుట్టే ఏ కోర్కెనైనా

మంచిదో కాదో తానే

నిర్ణయించి

కోరిన కోర్కెని తీర్చే

బాధ్యతని స్వీకరించి

భక్తులకు అండగా నిలిచే

తల్లి తలుపులమ్మ.

తలపు అంటే ఆలోచన. వాటిని తీర్చే తల్లి

తలపులమ్మ క్రమముగా

'తలుపులమ్మ'గా మారింది.

ఇంట్లో నుండి బయటికి

వెళ్ళేటపుడు తల్లికి

లేదా భార్యకి

ఎలా చెప్తామో అలాగే

ఆ తల్లిని ప్రార్థించి

వెళ్ళడం చేస్తారు.


శంకరునితో కలసి

అర్దనారీశ్వర రూపముతో

అమ్మవారుండేది.

ఆకారణముగా

శంకరుని మెడమీద

(గళము) మచ్చ

(అంకం) కారణముగా

అంకగళమ్మ,

అంకాళమ్మ గా

మారిపోయింది.


పొలిమేరలో వుండే

మరొక తల్లి శీతలాంబ.

ఈమె చేతుల్లో చీపురు,

చేట ఉంటాయి.

తన గ్రామములోని

ప్రజలకు వ్యాధులను

కలిగించే క్రిమి కీటకాలని,

భయాన్ని కలిగించే

భూత ప్రేత

పిశాచ గణాలను

గ్రామములోనికి రాకుండా

వూడ్చి చేటలోకి ఎత్తి

పారబోసేది ఈ దేవతే.


పాములు బాగా సంచరించే

చోటులో వుండే

దేవత తల్లి పుట్టమ్మ

ఈమె గుడిలో అనేక

పుట్టలుంటాయి.

అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి

అందరూ పుట్టలో

పాలు పోస్తారు.

ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ'

అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ

అని కూడా అంటారు.


సుబ్రహ్మణ్యేశ్వరుడు

పేరుమీదే

'సుబ్బ+అమ్మ=

సుబ్బమ్మ కూడా

దైవముగా ఉంది.

బతుకుకి కావలసిన

వర్షాన్ని పంటనీ

ఇచ్చే తల్లి బతుకమ్మ.


గ్రామప్రజల మంచిని

చూసే (కనే) అమ్మ

కన్నమ్మగా

ఎప్పుడూ సత్యాన్ని

(నిదర్శనాలని)

చూస్తూవుండే తల్లి

సత్య+అమ్మ= సత్తెమ్మ.


అలాగే పుల్ల

(వికసించిన కళ్ళున్న)

అమ్మ పుల్లమ్మ.

ప్రతి విషయాన్ని

ఎంతో శ్రద్ధగా పరిశీలించి

చూస్తుంది

కాబట్టి ఆమె పుల్లమ్మ

అయ్యింది.


ఇక ప్రతి శుభకార్యానికి

నైవేద్యాన్ని

అర్పించుకొనే

చోటవున్న తల్లి

అర్పణ+అమ్మ =

అర్పణలమ్మ క్రమముగా

అప్పలమ్మ అయినది.


బెల్లము

బాగా వున్న ప్రాంతాలలో

ఈ తల్లికి అప్పాలు

బాగా ఇష్టమంటూ

భావించే భక్తులు

అప్పాల+అమ్మ=

అప్పలమ్మ అన్నారు.


అమ్మవార్ల వూరేగింపులో

అన్నిటికన్న చిన్నది

బాలా త్రిపుర సుందరి

విగ్రహానికి సమమైన వుజ్జీ

అయినది

పెంటి (బాల)+అమ్మ=

పెంటమ్మ.


భోజనాన్ని అందించగల

తల్లి అనే అర్దములో

బోనముల

(భోజనమనే

పదానికి వికృతి)+అమ్మ=

బోనాలమ్మ.


అయ్య అయిన

శంకరునికి

అమ్మ (భార్య)

కాబట్టి

ఈమెను 'అయ్యమ్మ'

అని కూడా కొన్ని చోట్ల

పిలుస్తారు.


లలితాంబ,

భండాసురుణ్ణి చంపేందుకు

గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ

సైనికుల సైన్యముతో

వెళ్ళినది

కాబట్టి గుర్రాల+అమ్మ=

గుర్రాలమ్మ అయినది.


ఊరు పేరుని బట్టి

పీల్చుకొనే

దేవతలు కొందరున్నారు. సోమప్రోలు+అంబ=

'సోమపోలమాంబ'

అన్నారు.

సోమప్రోలు అనే గ్రామము

ఉత్తరాంధ్ర శ్రీకాకుళం

జిల్లాలోని సోంపేట..!!


పేర్లు ఏవైతేనేమి,

ఆ తల్లి ఎప్పుడూ

మనకు తోడుగా,

అండగా నిలిచి

మనందరినీ

కంటికి రెప్పలా

కాపాడుతుంది...

Sunday, April 11, 2021

మహాశివుడికి ప్రీతకరమైన ప్రదోష వ్రతం , దీక్ష

ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము.  ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా , చంద్రుడి గతి వలన , ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే , అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే , అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. అయితే అన్నిరోజులలో కలిగే ప్రదోషాలపైకి , మూడు ప్రదోషాలకే ప్రాముఖ్యత ఉంది. అవి , చతుర్థి , సప్తమి , త్రయోదశి లలో కలిగే ప్రదోషాలు. వీటిలో కూడా త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు . 

ఈ ప్రదోష కాల గణనము ఇలా ఉండును:

ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత తొమ్మిది ఘడియల లోపల చతుర్థి తిథి వచ్చునో , ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే , ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత చతుర్థి రెండు ఘడియలైనా ఉంటే ఆ దినము ప్రదోషము. 

ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత పదిహేను ఘడియల లోపల సప్తమి తిథి వచ్చునో , ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే , ఏ దినమైనా  సూర్యాస్తమయము తర్వాత  సప్తమి ఒక్క ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము. 

ఏ దినమందు సూర్యోదయము తర్వాత అరవై ఘడియల లోపల త్రయోదశి తిథి వస్తుందో , ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే , ఏ దినమైనా  సూర్యాస్తమయము తర్వాత  త్రయోదశి అర్ధ ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము . 

ఈ త్రయోదశీ ప్రదోషము సమయాన్ని యిలాలెక్క కడతారు. సాయంత్రం నాలుగున్నర గంటలనుండీ ఇంచుమించు అర్ధరాత్రి వరకూ ప్రదోషమే. కొందరు సూర్యాస్తమయమునకు ముందర రెండున్నర ఘడియలూ , తర్వాత రెండున్నర ఘడియలూ అంటారు. ( ఒక ఘడియ = 24 నిమిషాలు ) 

ఈ ప్రదోష దినము అనధ్యయనము. సర్వ విద్యలకూ గర్హితమైనది . సూర్యాస్తమయ కాలము మనకు తమోగుణ ప్రధానమైనది . ఆ సమయములో ప్రదోషమైతే , కొన్ని అనుష్ఠానములు చేయాల్సిఉంటుంది. మామూలుగా చతుర్థి , సప్తములలో ధ్యానము , గాయత్రీ జపము చేయవచ్చును. ప్రదోష సమయముపై శివుడికొక్కడికే అధికారము గలదు , కాబట్టి శివ పూజ మాత్రమే చేయవలెను అన్నది కొందరి మతము. మామూలుగా ప్రతి పక్షములోనూ ప్రదోషము వస్తుంది. కానీ కృష్ణ పక్షములో చతుర్దశి రోజు మాసశివరాత్రి వస్తుంది. దాని వెనుకటి రోజు  త్రయోదశిలో  మహా ప్రదోష కాల శివపూజ విధించబడినది. శుక్ల పక్షములో కూడా త్రయోదశికి ప్రత్యేకత కలదు. ఆరోజు కూడా శివ పూజనే చేయాలి.

ప్రదోషమంటే పాప నిర్మూలన అని తెలుసుకున్నాం. మనము రోజూ ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని , మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే , దానికి తగ్గ పుణ్య కర్మలు చేయాలి. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము. పరమ శివుడు తన ప్రమథగణాలతో కొలువై మన పూజలు అందుకోడానికి సిద్ధంగావుండే సమయమది. మన పాపకర్మల ఫలాన్ని పటాపంచలు చేసి గరళము వలె మింగి ,  మనకు సాత్త్విక గుణమును కలిగించి మన కష్టములను తగ్గించును .

ఈ త్రయోదశి శనివారమొస్తే దాన్ని శని త్రయోదశి అనీ , సోమవారమొస్తే దాన్ని సోమప్రదోషమనీ పిలుస్తారు. ఇవి కాక , గురువారమునాడు వచ్చే ప్రదోషము కూడా అత్యంత ప్రాముఖ్యము కలది. అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి అయినా , ఈ మూడు రోజులూ మాత్రము మరింత విశేషమైనవి.

శని త్రయోదశినాడు చేసిన శివపూజ వలన జాతకములోని శని ప్రభావము కూడా తొలగింపబడుతుంది. శని మహాత్ముడు కర్మలకు ప్రతినిధి అని పిలవబడుతాడు. మన కర్మల ఫలితాన్ని నిర్దేశించి మనకు పాఠాలు నేర్పువాడు ఇతను. అట్టి శని ప్రభావమును కూడా ఈ ప్రదోషపూజతో పోగొట్టుకొనవచ్చును .

సోమ ప్రదోషము నాడు చేసిన పూజ వలన మనసు శుద్ధమై త్రికరణ శుద్ధి కలుగుతుంది. సోమవారము శివుడికి ప్రీతి పాత్రమైనది. ఆరోజు చేసిన శివపూజ సర్వ పాపహరము , సర్వ పుణ్యదము.

ఇక గురువారము త్రయోదశీ ప్రదోషము వస్తే , ఆనాడు చేసిన పూజ వలన గురు అనుగ్రహము కలిగి , విద్యాబుద్ధులు , సంపదలు కలుగుతాయి. గురువు వాక్పతి , బుద్ధిని ప్రేరేపించువాడు , మరియు ధన కారకుడు. జాతకములో గురు దోషములకు రుద్రారాధన విరుగుడుగా చెప్పడము మనకు తెలిసినదే . 

ఈ త్రయోదశీ ప్రదోషమునాడు ఎవరికి వీలైనంతగా వారు , మహాన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకమో , ఏకవార రుద్రాభిషేకమో , లఘున్యాస నమక చమక పఠనమో , ఉత్త పాలతో అభిషేకమో , మారేడు దళములతో అర్చననో , ఏదో ఒకటి చేసి అనంత ఫలము పొందండి. భక్తితో ఉద్ధరిణెడు నీళ్ళు పోస్తే చాలు పొంగిపోతాడు , భోళా శంకరుడు

ప్రదోష ఉపవాసముంటే శివుడు ప్రసన్నుడౌతాడా ?

ప్రదోష ఉపవాస దీక్షను (ఇక్కడ ఉపవాసమంటే భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తూ ఉండే నిరాహార స్థితి అని అర్థం చేసుకోవాలి) అనుష్ఠించడం ద్వారా , పరమేశ్వరుడి కటాక్షాన్ని పొందవచ్చని ఋషి వాక్కు. అలా పాటించదలిచిన రోజు ప్రాతఃకాలమే స్నానం ఆచరించి శుభ్రమైన తెల్లని వస్త్రాలు (లేక కాషాయం మొదలుగునవి) ధరించి , శరీరంలో వివిధ భాగాలలో విభూతిని , రుధ్రాక్ష మాలను ధరించి పరమ పావనమైన పంచాక్షరి మంత్రం ‘ఓ నమఃశివాయ' శక్తి మేర జపం చేయండి. పద్దతి ప్రకారం తయారు చేయబడిన విభూతి మరియు ధరించిన రుధ్రాక్షమాలలు మన మనో శరీరాలపై అనుకూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇలా రోజంతా శివధ్యానంలో వుండి సూర్యాస్త సమయంలో స్నానమాచరించి ఇంటిలో పూజ ముగించి శివాలయాన్ని ధర్శించాలి. అయితే రోజంతా భక్తి సాధనలోనే ఉండాలన్న విషయం మీరు మరవరాదు. అన్యచింత లేని భక్తియే ఈశ్వరుడి కరుణ దృఫటి మీపై ప్రసరించేలా చేస్తుంది. కావున గుడికి వెళుతునప్పుడు , వెళ్ళిన తరువాత కూడా శివ మంత్రాన్ని మనసులొ జపిస్తూనే ఉండాలి.

ఏప్రిల్ 09, శుక్రవారం ప్రదోష వ్రతం తిథి & పూజా టైమింగ్స్

సూర్యోదయం 09 ఏప్రిల్ , 2021 06:15 ఉదయం.

సూర్యాస్తమయం 09 ఏప్రిల్ , 2021 06:41 అపరాహ్నం.

త్రయోదశి తిథి ప్రారంభం 09 ఏప్రిల్ , 2021 03:16 ఉదయం.

త్రయోదశి తిథి ఎండ్ 10 ఏప్రిల్ , 2021 04:28 ఉదయం.

ప్రదోష పూజ సమయం ఏప్రిల్ 09, 06:41 PM - ఏప్రిల్ 09, 09:00 PM


శివ ప్రదోష స్తోత్రం

జయ దేవ జగన్నాథ జయ శఙ్కర శాశ్వత |

జయ సర్వసురాధ్యక్ష జయ సర్వసురార్చిత || ౧ ||


జయ సర్వగుణాతీత జయ సర్వవరప్రద ||

జయ నిత్య నిరాధార జయ విశ్వమ్భరావ్యయ || ౨ ||


జయ విశ్వైకవన్ద్యేశ జయ నాగేన్ద్రభూషణ |

జయ గౌరీపతే శమ్భో జయ చన్ద్రార్ధశేఖర || ౩ ||


జయ కోఠ్యర్కసఙ్కాశ జయానన్తగుణాశ్రయ |

జయ భద్ర విరూపాక్ష జయాచిన్త్య నిరఞ్జన || ౪ ||


జయ నాథ కృపాసిన్ధో జయ భక్తార్తిభఞ్జన |

జయ దుస్తరసంసారసాగరోత్తారణ ప్రభో || ౫ ||


ప్రసీద మే మహాదేవ సంసారార్తస్య ఖిద్యతః |

సర్వపాపక్షయం కృత్వా రక్ష మాం పరమేశ్వర || ౬ ||


మహాదారిద్ర్యమగ్నస్య మహాపాపహతస్య చ ||

మహాశోకనివిష్టస్య మహారోగాతురస్య చ || ౭ ||


ఋణభారపరీతస్య దహ్యమానస్య కర్మభిః ||

గ్రహైఃప్రపీడ్యమానస్య ప్రసీద మమ శఙ్కర || ౮ ||


దరిద్రః ప్రార్థయేద్దేవం ప్రదోషే గిరిజాపతిమ్ ||

అర్థాఢ్యో వాఽథ రాజా వా ప్రార్థయేద్దేవమీశ్వరమ్ || ౯ ||


దీర్ఘమాయుః సదారోగ్యం కోశవృద్ధిర్బలోన్నతిః ||

మమాస్తు నిత్యమానన్దః ప్రసాదాత్తవ శఙ్కర || ౧౦ ||


శత్రవః సంక్షయం యాన్తు ప్రసీదన్తు మమ ప్రజాః ||

నశ్యన్తు దస్యవో రాష్ట్రే జనాః సన్తు నిరాపదః || ౧౧ ||


దుర్భిక్షమారిసన్తాపాః శమం యాన్తు మహీతలే ||

సర్వసస్యసమృద్ధిశ్చ భూయాత్సుఖమయా దిశః || ౧౨ ||


ఏవమారాధయేద్దేవం పూజాన్తే గిరిజాపతిమ్ ||

బ్రాహ్మణాన్భోజయేత్ పశ్చాద్దక్షిణాభిశ్చ పూజయేత్ || ౧౩ ||


సర్వపాపక్షయకరీ సర్వరోగనివారణీ |

శివపూజా మయాఽఽఖ్యాతా సర్వాభీష్టఫలప్రదా || ౧౪ ||


ఇతి ప్రదోషస్తోత్రం సమ్పూర్ణమ్ ||

దేవతలు వాహనములు

1) విష్ణువు –గరుడుడు

2) లక్ష్మీదేవి –గుడ్ల గూబ

3) రతి మన్మదులు=కీరం(చిలుక)

4) హనుమంతుడు=ఒంటే

5) శివుడు =వృషభం

6) పార్వతి దేవి=సింహం

7) వినాయకుడు=మూషికం

8) కుమారస్వామి=నెమలి

9) బైరవుడు=శునకం

10) బ్రహ్మ=హంస

11) సరస్వతి=హంస

12) అశ్వినినులు=కంచర గాడిదలు

13) రావణుడు=గాడిదలు.

14) లలితాదేవి=వరాహం (కిరిచక్ర రధారూఢ)

15) శీతలా దేవి=గాడిద

16) గంగాదేవి=మకరం

17) యమునాదేవి=కూర్మం

18) అయ్యపస్వామి=పులి

19) కాలునుకి=మహిషం

20) నముచి=ఉచ్చైశ్రవము

21) అలమేలుమంగ అమ్మవారు=చాతకం

22) వాస్తుపురుషుడు=గండభేరుండం

23) కల్కి=గుఱ్ఱం

24) చండి=వరాహం

25) చాముండి=గుడ్లగూబ

26) విశ్వకర్మ=నక్క 

27) మానసా దేవి=సర్పం

28) ఇంద్రుడు=ఐరావతం

29) అగ్ని=మేషం/గొర్రె 

30) యముడికి=మహిషం

31) నైరుతి=శవ వాహనం

32) వరుణుడు=మకరం

33) వాయువు=కృష్ణ మృగం

34) కుబేరుడు=నర వాహనం

35) ఈశానుడు=వృషభం

36) సూర్యుడు=సప్త అనే పేరు గల అశ్వం

37) చంద్రుడు=జింక/10 శ్వేత అశ్వములు 

38) కుజుడు=మేషం

39) బుధుడు=గుఱ్ఱం

40) గురుడు=ఏనుగు

41) శుక్రుడు=గుఱ్ఱం / మకరం

42) శని=కాకి

43) రాహువు=పులి

44) కేతువు=చేప

 సంకలనం:-గొడవర్తి సంపత్కుమార్ అప్పలాచార్య

Friday, April 9, 2021

విద్యలు

విద్య నాలుగు విధములు


1. సాంకేతికము : 

మానవుని జీవితావసరములను తీర్చుచు, తద్ద్వారా సమాజాభివృద్ధికి అవసరమైన వృత్తులకు సంబంధించిన విద్య.


2. శారీరకము : 

శరీర ఆరోగ్యమునకు అవసరమైన వ్యాయామము, ఆహార నియమము, యోగాభ్యాసములకు సంబంధించిన విద్య.


3. నైతికము : 

సమాజము భౌతికముగా ఎంత పురోగమించినను, సంఘములోని వ్యక్తులు శీలవంతులై యుండుట, పురాణేతిహాసములలోని మహానుభావుల జీవితములను ఆదర్శముగా చూపుచు బోధించు విద్య.


4. ఆధ్యాత్మిక విద్య : 

అధి అనగా అత్యధికమైన సత్యము. ఆత్మ అనగా నేనుగా ప్రాకటమైనది. విద్య అనగా తెలుసుకొనవలసినది. ఈ మూడు అర్థములు కలిసినది తనను తాను సత్యస్వరూపమనే బ్రహ్మగా తెలుసు కొనుటకు అవసరమైన బోధ. దివ్యత్వమును గుర్తింపజేసి, పూర్ణానుభవమును అందించునది. అన్ని విద్యలలోకెల్లా గొప్పది. అన్ని విద్యలకు పునాది వంటిది. వివేకము, అర్పణ, కర్తవ్యములను మేళవించి, శిక్షణతో కూడిన విద్య ఆధ్యాత్మిక విద్య.


విద్య కొఱకు త్రివిధ విచారణ : 

1. పరబ్రహ్మ స్వరూప నిశ్చయము. 2. మాయా స్వరూప నిశ్చయము 3. ధర్మస్వరూప నిశ్చయము.


అన్వీక్షకీ విద్య : 

తర్క వేదాంతమునకు సంబంధించిన విద్య.


విద్యకు శత్రువులు : 

పెద్దల సేవ చేయకుండుట, తొందరపాటు, రజో గుణము, ఆత్మ స్తుతి, పరనింద - ఇవన్నీ విద్యార్జనకు ప్రతిబంధకములు, శత్రువులు.


వార్త : అర్థ, అనర్థములను బోధించు విద్యను వార్త అందురు. వార్త అనగా శ్రమ, వ్యవసాయము, ఉపాయములను అవలంబించి, సత్ఫలితమును సాధించుటను తెలియజేయు విద్య.


భగవద్గీతలోని విద్యలు : 

1. అభయ విద్య 2. సామ్య విద్య 3. బ్రహ్మ విద్య 4. భగవత్‌ విద్య.


విద్య (జ్ఞానము) : జీవుడే ఈశ్వరుడు, జీవుడే పరమాత్మ అనెడి అఖండ, అభిన్న, అద్వితీయ తత్త్వమును బోధించు శబ్దములు, వాక్యములు, వాక్యార్థములు.


వైశ్వానర విద్య : ఛాయా పురుష లక్షణము గురించిన విద్య.


వారుణీ విద్య : వరుణుడు భృగువునకు బోధించిన విద్య


భార్గవీ విద్య : భృగువు వరుణుడి ద్వారా సంపాదించిన విద్య


హార్ద విద్య : ఆత్మ గురించి హృదయ సమీపమునకు చేర్చబడిన విద్య


బ్రహ్మ విద్య : 1. బ్రహ్మ పరమాత్మ నుండి సంపాదించిన విద్య 2. బ్రహ్మ నుండి అధ్వరుడికి, అతడి నుండి సర్వులకు చేరిన విద్య 3. బ్రహ్మము గురించిన విద్య 4. శ్రేష్ఠమైనది, గొప్ప దానికంటే గొప్పదైన విద్య - అని నాలుగు అర్థములు.


ముక్తి విద్య : పై నాలుగు అర్థములతో ఉన్న బ్రహ్మ విద్య పరంపరగా వచ్చి జీవులకు బంధ విముక్తి కలిగించే విద్య.


నయ విద్య : శాస్త్రము ధర్మము చెప్పువారు 'ఇది ఇంతే' అని ప్రమాణమువలె చెప్పరాదు. ఎంత తెలిసినవాడైనా 'ఇప్పటికి నాకు తెలిసినది ఇంత మాత్రమే' అని చెప్పవలెను. కొన్ని విషయములను ప్రమాణము అని చెప్పినచో అపార్థము, అపకారము జరుగవచ్చును. వినయము, విశిష్ఠత, నేర్పుతో చెప్పగలవానిని నయవిద్య తెలిసినవాడని అందురు.


త్రయీ విద్య : వాయుమధనములో ఊర్థ్వ గతిని ప్రాణగతి అనియు, అధోగతిని అపానగతి అనియు, సమానత్వమును మధ్యగతి అనియు మూడు గతులుగా విభజించి వాయుమధనమును చేయు నేర్పును త్రయీ విద్య అందురు.

         ఈ వాయు మధనమునుండి ఉద్భవించు దానిని అశనము అందురు. అశనమనగా అన్నము. ఈ సాధనతో అశనమును గ్రహించిన ప్రాణుడు బలపడుచున్నాడు. ఇది యోగము.

              త్రయీవిద్య అనగా ధర్మ, అర్థ, కామములనెడి మూడింటిని తెలుసుకొని అర్థ కామములను ధర్మయుతముగా పొందే వివేకము.


పంచాగ్ని విద్య : ఆకాశము, మేఘము, భూమి, పురుషుడు, స్త్రీ అనేవి పంచాగ్నులు. వీటియందు శ్రద్ధా, సోమ, వృష్టి, అన్నము, రేతస్సు అనే పంచ ద్రవ్యములను, లేక పంచ ఆహుతులను హోమము చేయగా రేతో రూప ఆహుతియందు ఉదకములు పురుష రూపము చెందుచున్నవి. జీవుడు శరీర బీజములైన సూక్ష్మ బీజములతో చేరి క్రమముగా ఆకాశమున శ్రద్ధా రూపములో చేరి, వర్ష రూపములో భూమిపైబడి, అన్న రూపములో పురుషునిలోనికి చేరి, రేతస్సు రూపములో స్త్రీ గర్భమందు ప్రవేశించి, అక్కడనుండి పురుషుడుగా వ్యక్తమగుచున్నాడు. శ్రద్ధ అనగా జీవుడు జీవరూపముగా ఉండుటలో గల ధర్మము.


దహర విద్య : బ్రహ్మ రంధ్రమందు చిన్న కమలము, ఆ కమల మధ్యమున సూక్ష్మమైన శూన్య స్థానము, ఆ శూన్యమే దహరాకాశమనబడును. దీనిని తెలుసుకొన్నవాడు బ్రహ్మను తెలుసుకొనును. ఈ తెలుసుకొనే విద్యను దహర విద్య, లేక ప్రాణ విద్య అందురు.


సంవర్గ విద్య - వాయు సంవర్గ విద్య : వాయువు అనగా హిరణ్య గర్భుడు. ఇతడిలోనే ప్రపంచమంతయు పుట్టి, స్థితిని కలిగి, లయించుచున్నది. సంవర్గమనగా ప్రవిలయము. అనగా అతడిలో చేరి యుండుట అని అర్థము. సకల దేవతలు, జీవులు, జడ ప్రకృతి అంతా ప్రలయకాలములో ఈ వాయువును చేరి అవ్యక్తమగుచున్నవి. ఇట్టి వాయు సంవర్గమును ఉపాసన చేయుచు, తానుకూడా లేనివాడుగా అవ్యక్తమగుటను వాయు సంవర్గ విద్య అందురు. వాయువులో చేరి యుండుట వలన వాయువే సంవర్గుడు. కేవలము సంవర్గ విద్య అన్నను అదే.


మధు విద్య : సర్వ దేవతలలో ఉండే దైవత్వమును మధువు అందురు. త్రిగుణాత్మకమైన నామరూప క్రియా నటనలను వదలి, అందలి సారమైనట్టి ఆత్మ చైతన్యమును గ్రహింపజేయునది మధువిద్య. ఆ సారమే దైవత్వము, లేక మధువు లేక అమృతము. మధు విద్యోపాసకులకు బ్రహ్మానందము సిద్ధించును.


అపరవిద్య: గడ్డిపరక మొదలు సృష్టి కర్త వరకు గల ప్రకృతి గుణములను, ధర్మములను వివేకముతో సరిగా గ్రహించి, కార్యసిద్ధి బడయుట, ధర్మాధర్మములను తెలుసుకొనుట - ఈ రెండింటికి సంబంధించిన విద్యను అపరవిద్య అందురు.


పరవిద్య : ఉపాసన, తపస్సు, ఇంద్రియ మనో నిగ్రహము, యోగాభ్యాసము, మొదలగు సాధనలకు సంబంధించి మోక్ష లక్ష్యముగా తెలుపు విద్యను పరవిద్య అందురు.


బ్రహ్మ విద్యలు 32 : శ్రీ రామానుజాచార్యుల వారు తెలిపిన బ్రహ్మ విద్యలు 32 రకములు. 1. సద్విద్య 2. శాండిల్య విద్య 3. అంతరాదిత్య విద్య 4. ఆనంద విద్య 5. ప్రాణి విద్య 6. ఇంద్ర ప్రాణ విద్య 7. భూమ విద్య 8. నచికేత విద్య 9. గాయత్రీ జ్యోతిర్విద్య 10. ఆకాశ విద్య 11. అంతర్యామి విద్య 12. దహర విద్య 13. ఉపకోసల విద్య 14. వైశ్వానర విద్య 15. అక్షర విద్య 16. అంగుష్ఠ ప్రమితి విద్య 17. అజా శారీరక విద్య 18. చాలకీ విద్య 19. మైత్రేయీ విద్య 20. మధువిద్య 21. ప్రణవోపాస్య పరమ పురుష విద్య 22.ఆదిత్య స్థామర్మామక విద్య 23. అక్షస్థ ఆహావన్నామ విద్య 24. ఉషక్తి కహోల విద్య 25. గార్లక్ష విద్య 26. వ్యాహృతి శారీరక విద్య 27. పంచాగ్ని విద్య 28. పురుష విద్య 29. సంవర్గ విద్య 30. దేహోపాస్య జ్యోతిర్విద్య 31. ఈశావాస్య విద్య 32. బ్రహ్మ విద్య.


దండనీతి అనే విద్య : మంచి - చెడు, న్యాయము-అన్యాయము, ధర్మము- అధర్మము వీటి గురించియు, మంచి మొదలగు వారికి రక్షణయు, పురస్కారములను మరియు చెడు మొదలగు వాటిని నివారించుటకును, శిక్షించుటకును అవసరమైన నీతిని బోధించే విద్యను దండనీతి అనే విద్య అందురు.


ప్రతిస్మృతి విద్య : ఈ విద్య వలన అధిక తపోవీర్య సంపన్నుడగును. తక్కువ కాలములోనే ఎక్కువ ఫలితమును సాధించును.


పంచాగ్నులు :


1. ఆకాశాగ్ని సోమ రూపము

2. పర్జన్యాగ్ని వృష్టి రూపము

3. పృథివ్యగ్ని వ్రీహ్య రూపము

4. పురుషాగ్ని రేతో రూపము

5. యోషిదగ్ని పురుష రూపము

         జీవుడు తన శరీర పతనము తరువాత సోమ రూపుడై, వృష్టి రూపుడై, వ్రీహ్య (ధాన్య) రూపుడై, రేతో రూపుడై స్త్రీ యోనిలో చేరి, స్త్రీ గర్భమందు పురుషుడుగా మారుచున్నాడు. పంచాగ్నులలో క్రమముగా పరివర్తన చెందుచు పురుషుడగుచున్నాడు.

              యోగులలో భ్రూమధ్యమందు జ్ఞానాగ్నిగా, పాదకములందు కాలాగ్నిగా, నాభిస్థానమందు క్షుదాగ్నిగా, హృదయమందు శీతాగ్నిగా, నేత్రములందు కోపాగ్నిగా ఉండును. ఈ పంచాగ్నులను జ్వలింప జేసుకొనుచూ పరివర్తన చెందుటకు సాధన చేసే యోగి ముక్తుడగును.


త్రేతాగ్నులు :


1. గార్హ పత్యాగ్ని లేదా జఠరాగ్ని : గృహమనగా శరీరము. శరీరానికి పతిగార్హపతి అనగా జీవుడు. జఠరాగ్ని వలన కలిగే ఆకలి బాధ తీర్చుకొను చున్నప్పుడే శరీరము బలముగా, ఆరోగ్యముగా నుండును. జీవుడు తన శరీర పోషణార్థము మాత్రమే ఈ గార్హపత్యాగ్ని ఉన్నదని, తాను మాత్రము సాక్షిగా నుండవలెను.


2. ఆహవనీయాగ్ని : ఆహవనము అనగా అన్ని వైపులా ఉండే వాటిని తనవైపుకు తెచ్చుకొనుట, మరియు వాటిని తన లోపలకు తీసుకొనుట. విషయములను అన్ని వైపులనుండి తెచ్చుకొనుచు, తన మనస్సులోనికి చేర్చుకొనుట. మనస్సే ఆహవనీయాగ్ని. ఈ మనస్సు యొక్క స్వభావమును తెలుసుకొని, తాను మాత్రము సాక్షిగా నుండవలెను.


3. దక్షిణాగ్ని : హృదయములో ఉండే తేజస్సు, దానివలన కలిగే జ్ఞానమును దక్షిణాగ్ని అందురు. దక్షిణాగ్నియే జ్ఞానాగ్ని. హృదయములో కలిగే జ్ఞానానికి కూడా అతీతమైన పరబ్రహ్మగా సిద్ధిని పొందవలెను.


శ్లో||  విద్యాంచా- విద్యాంచ యస్త ద్వేదో-భయం సహ |

       అవిద్యయా మృత్యుం తీర్థ్వా విద్యయా-మృతమస్నుతే ||


తా|| విద్యను, అవిద్యను రెంటిని తెలుసుకొనవలెను. అవిద్యను తెలిసి విడచుట చేత మృత్యువును అధిగమించును. విద్యను తెలియుటచేత అమృతత్వమును సిద్ధింపజేసుకొనును.

Wednesday, April 7, 2021

అయ్యప్ప స్వామి శరణు ఘోష అర్ధ వివరణ

1. స్వామియే శరణం అయ్యప్ప


అయ్యప్ప స్వామి శరణమ్


2. హరిహర సుతనే శరణం అయ్యప్ప


శివకేశవుల యొక్క కుమారుడు


3. ఆపద్బాంధనవే శరణం అయ్యప్ప


ఆపదల నుండి రక్షించే స్వామి


4. అనాధ రక్షకనే శరణం అయ్యప్ప


అనాధలను రక్షించే స్వామి


5. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకనే శరణం అయ్యప్ప


ఈ చరాచర భూమండలానికి బ్రహ్మాండ నాయకుడు


6. అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప


ఎల్లప్పుడు అన్నమును ప్రసాదించుస్వామి


7. అయ్యప్పనే శరణం అయ్యప్ప


అయ్య - అప్పనే (ధర్మశాస్త్ర వారి కారణ నామము)


8. అరియంగావు అయ్యవే శరణం అయ్యప్ప


యుక్తవయస్సు వచ్చిన స్వామి రూపం ఉన్న ప్రదేశం ,  పుష్కర దీవిలో వున్న ఆలయం , పుట్రాలం , చెంగోట్టి మార్గంలో వున్నది.


9. అచ్చన్ కోవిల్ అరసే శరణం అయ్యప్ప


పర్వతమందలి ఒక ప్రదేశం ఇచ్చట పుష్కలాంబ సమేత -

సంసార రూపునిగా అయ్యప్పస్వామి ఆలయము కలదు.


10.  కుళత్తుపులై బాలకనే శరణం అయ్యప్ప


కుళుత్తపులైలో పసిబాలునిగా స్వామి రూపం ఉన్న ప్రదేశం


11.  ఎరుమేలి శాస్తవే శరణం అయ్యప్ప


మహిషిని సంహరించిన ప్రదేశం , ఆటవికుడిగా స్వామి రూపం.

గరయాతలోనూ శరణఘోషయే శరణ్యం.


12. వావర్ స్వామియే శరణం అయ్యప్ప


ఆటవికుని మార్చి , తన ప్రియ శిష్యునిగా చేసుకొనిన అయ్యప్ప మిత్రుడు-

వావర్ స్వామి. (స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రుడైన శిష్యుడు వావర్ స్వామి) 


13. కన్నిమూల మహా గణపతియే శరణం అయ్యప్ప


పంబలో వున్నటువంటి గణపతి మహరాజు


14. నాగరాజావే శరణం అయ్యప్ప


సుబ్రహ్మణ్యస్వామి అవతారము


15. మాలికా పురత్తులోక దేవిమాతావే శరణం అయ్యప్ప


మహిషి సంహారము అనంతరము స్వామివారిని

వివాహమాడదలచినది. (సాక్షాత్ శక్తి స్వరూపిణి)


16. కరుప్పుస్వామియే శరణం అయ్యప్ప


పదునెట్టాంబడికి కాపలామూర్తిగా ఉండేటటువంటివాడు.


17. సేవిప్పవర్కు ఆనందమూర్తియే శరణం అయ్యప్ప


ఆరాధించు భక్తులకు ఆనందమొసగిడు స్వామి


18. కాశీ వాసియే శరణం అయ్యప్ప


కాశీలో ఉన్నటువంటి స్వామి


19. హరిద్వార్ నివాసియే శరణం అయ్యప్ప


హరిద్వార్ లో ఉన్నటువంటి స్వామి


20. శ్రీరంగ పట్టణ వాసియే శరణం అయ్యప్ప


శ్రీరంగపట్నంలో ఉన్నటువంటి స్వామి


21. కరుప్పత్తూర్ వాసియే శరణం అయ్యప్ప


కరుప్పత్తూర్ లో ఉన్నటువంటి స్వామి


22. గొల్లపూడి శ్రీ ధర్మశాస్తావే  శరణం అయ్యప్ప


గొల్లపూడి పట్టణంలో వెలసి ఉన్నస్వామి


23.  సద్గురు నాధనే శరణం అయ్యప్ప


గురువులలో శ్రేష్టమైన స్వామి


24. విల్లాళి వీరనే శరణం అయ్యప్ప


విల్లంబులు ధరించిన స్వామి


25. వీరమణికంఠనే శరణం అయ్యప్ప


మహిషి సంహారమునకై అవతరించిన వీర మణికంఠుడు


26. శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప


శాస్త్ర ధర్మములును శాసించే సకల ధర్మస్వరూపుడైన స్వామి


27. శరణ ఘోష ప్రియనే శరణం అయ్యప్ప


తన శరణముల ప్రవాహషోషతో ఉప్పోంగు స్వామి


28. కాంతమలై వాసనే శరణం అయ్యప్ప


కాంతమల అనే కొండ మీద ఉన్న స్వామి


29.  పొన్నంబల వాసనే శరణం అయ్యప్ప


పొన్నంబల అనే కొండమీద కొలువైన స్వామి


30. పంబాశిశువే శరణం అయ్యప్ప


పంబానది ఒడ్డున శిశువునిగా దొరికిన స్వామి


31.  పందళరాజకుమారనే శరణం అయ్యప్ప


పందళరాజుకు కుమారుడైన స్వామి


32. వావరితోళనే శరణం అయ్యప్ప


వావరు , స్వామికి శిష్య సహచరుడు


33.  మోహినీ సుతనే శరణం అయ్యప్ప


విష్ణుమూర్తి మోహినీ అవతారమెత్తగా జన్మించిన స్వామి


34. కణకండ్ దైవమే శరణం అయ్యప్ప


మంచి దయార్థ ధృష్టి కలిగి తలచినంతనే పలికే దైవం స్వామి


35. కలియుగ వరదనే శరణం అయ్యప్ప


కలియుగంలో కోరగానే వరమిచ్చు స్వామి


36. సర్వరోగ నివారణ ధన్యంతర మూర్తియే శరణం అయ్యప్ప


అన్ని రోగములు తగ్గించే ధన్వంతరి రూపుడయిన స్వామి


37.  మహిషి మర్ధననే శరణం అయ్యప్ప


మహిషిని వధించిన స్వామి


38.  పూర్ణ పుష్కల నాధనే శరణం అయ్యప్ప


పూర్ణ పుష్కలాంబలను పెండ్లాడిన స్వామి


39.  వన్పులి వాహననే శరణం అయ్యప్ప


పులిని వాహనము చేసుకున్న స్వామి


40. భక్తవత్సలనే శరణం అయ్యప్ప


భక్తులను కాపాడే అయ్యప్ప స్వామి


41. భూలోకనాధనే శరణం అయ్యప్ప


భూలోక మంతటని రక్షించే నాధుడు స్వామి


42.  అయిందుమలై వాసననే శరణం అయ్యప్ప


అయిదు కొండలయందు ఉన్నటువంటి స్వామి

కరిమల , నీలిమల , శబరిమల , పొన్నంబల , కాంతిమల


43.  శబరి గిరీశనే శరణం అయ్యప్ప


శబరి కొండమీద కొలువై వున్న స్వామి


44.  ఇరుముడి ప్రియనే శరణం అయ్యప్ప


ఇరుముడిలో స్వామివారి అభిషేకం నెయ్యి , తేనె , పన్నీరు ,

చందనాలు ఒక ముడిగాను , దారిలో ఆహారం ,

తినుబండారాలు ఒక ముడిగాను వున్న రెండు మూటల సంచి


45. అభిషేక ప్రియనే శరణం అయ్యప్ప


అభిషేకము అంటే స్వామికి ఎంతో యిష్టం


46. వేదప్పొరుళే శరణం అయ్యప్ప


వేదరూపుడైయిన స్వామి


47. శుద్ధ బ్రహ్మ చారియే శరణం అయ్యప్ప


నిత్య బ్రహ్మచారిగా దర్శనమిచ్చే స్వామి


48. సర్వమంగళదాయకనే శరణం అయ్యప్ప


సర్వమంగళాలను అనుగ్రహించు స్వామి


49. వీరాధివీరనే శరణం అయ్యప్ప


వీరులలో గొప్పవాడైన స్వామి


50. ఓంకారప్పొరుళే శరణం అయ్యప్ప


ఓంకారరూపుడైన స్వామి


51. ఆనందరూపనే శరణం అయ్యప్ప


ఆనందరూపుడైన స్వామి


52. భక్తచిత్తాదివాసనే శరణం అయ్యప్ప


భక్తుల మనస్సులలో కొలువైనటువంటి స్వామి


53. ఆశ్రిత వత్సలనే శరణం అయ్యప్ప


ఆశ్రయించిన వారిని అనుగ్రహించు స్వామి


54. భూతగణాధిపతయే శరణం అయ్యప్ప

భూత , ప్రేత , పిశాచగణాలకు అధిపతియైన స్వామి


55. శక్తిరూపనే శరణం అయ్యప్ప


శక్తిరూపుడైన స్వామి


56. శాంతమూర్తియే శరణం అయ్యప్ప


శాంతమే తన స్వరూపంగా వున్న స్వామి


57. పదునెట్టాంబడికి అధిపతియే శరణం అయ్యప్ప


పరశురామునిచే ప్రతిష్టించబడిన పావన 18 మెట్లకు అధిపతి


58. ఉత్తమపురుషనే శరణం అయ్యప్ప


పురుషోత్తముడు అయిన స్వామి


59. ఋషికుల రక్షకనే శరణం అయ్యప్ప


ఋషులను రక్షించిన స్వామి


60. వేదప్రియనే శరణం అయ్యప్ప


వేదములంటే యిష్టపడే స్వామి


61. ఉత్తర నక్షత్ర జాతకనే శరణం అయ్యప్ప


ఉత్తర నక్షత్రంలో జన్మించినస్వామి ,

(మకర జ్యోతి దర్శనమునకు ముందు ఉత్తర నక్షత్రం వస్తుంది)


62. తపోధననే శరణం అయ్యప్ప


తపస్సుతో మహిమాన్వితుడైన స్వామి


63. ఎంగళ్ కులదైవమే శరణం అయ్యప్ప


నా కులదైవమైన స్వామి


64.  జగన్మోహననే శరణం అయ్యప్ప


జగత్తునంతటిని ఆకర్షించు స్వామి


65. మోహనరూపనే శరణం అయ్యప్ప


అందమైన రూపము కలవాడు


66. మాధవసుతనే శరణం అయ్యప్ప


విష్ణుమూర్తి యొక్క కుమారుడు


67. యదుకుల వీరనే శరణం అయ్యప్ప


యదువంశ సంభూతుడు అయిన స్వామి


68. మామలైవాసనే శరణం అయ్యప్ప


అయిదు కొండలయందు కొలువైన స్వామి -

కరిమల , నీలిమల , శబరిమల , పొన్నాంబల , కాంతిమల


69.  షణ్ముఖసోదరనే శరణం అయ్యప్ప


సుబ్రహ్మణ్యస్వామికి తమ్ముడు


70. శంకరసుతనే శరణం అయ్యప్ప


శివుని యొక్క కుమారుడు


71. వేదాంతరూపనే శరణం అయ్యప్ప


సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపుడయిన స్వామి


72. శత్రు సంహారనే శరణం అయ్యప్ప


మన అంతర్ శత్రువులను సంహరించే స్వామి


73. సద్గుణ మూర్తియే శరణం అయ్యప్ప


సద్గుణరూపుడయిన స్వామి


74. పరాశక్తియే శరణం అయ్యప్ప


ఆదిపరాశక్తి 

స్వరూపుడయిన స్వామి


75. పరాత్పరనే శరణం అయ్యప్ప


పరబ్రహ్మస్వరూపుడయి , నిరాకార రూపుడయిన స్వామి


76. పరంజ్యోతియే శరణం అయ్యప్ప


జ్యోతియై ప్రకాశించు స్వామి


77. హోమ ప్రియనే శరణం అయ్యప్ప


హోమములను ప్రేమతో స్వీకరించు స్వామి


78. గణపతి సోదరనే శరణం అయ్యప్ప


వినాయకుని తమ్ముడు


79. కట్టాళవేషధారియే శరణం అయ్యప్ప


ఆటవిక వేషములో ఉన్నటువంటి స్వామి


80. విష్ణుసుతనే శరణం అయ్యప్ప


విష్ణు మూర్తి యొక్క కుమారుడు


81. సకలకళా వల్లభనే శరణం అయ్యప్ప


సమస్తకళలకు నిలయుడైన స్వామి


82) లోకరక్షకనే శరణం అయ్యప్ప


లోకాలంతటిని రక్షించే స్వామి


83. అమితగుణాకరనే శరణం అయ్యప్ప


లెక్కలేనన్ని సద్గుణాలతో శోభిల్లు స్వామి


84. అలంకార ప్రియనే శరణం అయ్యప్ప


అలంకారమనిన మిక్కిలి ఇష్టపడు స్వామి


85. కన్నిమారైకాప్పవనే శరణం అయ్యప్ప


కన్ని అయప్పలను కాపాడు స్వామి


86.  భువనేశ్వరనే శరణం అయ్యప్ప


చతుర్దశ భువనాలను రక్షించే స్వామి


87. మాతా పితా గురు దైవమే శరణం అయ్యప్ప


తల్లి , తండ్రి , గురువు , దైవమైన స్వామి


88. స్వామియిన్ పుంగావనమే శరణం అయ్యప్ప


అయ్యప్పస్వామి ఎరుమేలినుంచి శబరిమల వరకు నడిచిన ప్రదేశం

(వనయాత్ర చేయు ప్రదేశం)


89. అళుదానదియే శరణం అయ్యప్ప


మహిషి మరణసమయమున పశ్చాతాప కంటినీరు అళుద నది


90. అలుదామేడే శరణం అయ్యప్ప


అళుద నది ప్రక్కన ఉన్న కొండ


91.  కళ్ళాడుంకుండ్రే శరణం అయ్యప్ప


పశ్చాతాపంతో సేద తీరిన మనస్సుతో తిరిగి పాప ప్రవృత్తి

తిరిగి లేవకుండా అళుదా నదిలో నుంచి తీసి ఉంచే

రాళ్ళ ప్రదేశం


92. కరిమలై ఏట్రమే శరణం అయ్యప్ప


కరిమలకొండ ఎక్కడం (ఏనుగులు సంచరించే ప్రదేశం)


93. కరిమలై ఎరక్కమే శరణం అయ్యప్ప


కరిమలకొండ దిగడం


94. పెరియాన వట్టమే శరణం అయ్యప్ప


పెరియాన అను విశాల ప్రదేశం (పెద్ద గుంపులతో ఏనుగులు

ఉండు ప్రదేశం)


95. చెరియాన వట్టమే శరణం అయ్యప్ప


చెరియాన అను చిన్న ప్రదేశం (చిన్నగుంపులుగా ఏనుగులు

ఉండు ప్రదేశం)


96.  పంబానదియే శరణం అయ్యప్ప


పాపముల హరించు పంబా నదియే శరణం


97. పంబయల్ విళక్కెశరణం అయ్యప్ప


పంబనదిలో వెలిగించే దీపం


98.  నీలిమల యేట్రమే శరణం అయ్యప్ప


నీలిమలకొండ ఎక్కడం


99. అప్పాచిమేడే శరణం అయ్యప్ప


అప్పాచికొండ


100. శబరిపీఠమే శరణం అయ్యప్ప


శబరి పీఠమ్ వద్ద జ్యోతి దర్శనం తర్వాత ,

మహిషి కన్నెస్వాములు వచ్చినారా అని చూసే స్థలము


101.  శరంగుత్తిఆలే శరణం అయ్యప్ప


స్వామివారు , పరివారములు ఆయుధములు ఉంచిన

గుచ్చే ప్రదేశం


102.  భస్మకుళమే శరణం అయ్యప్ప


వృక్షము అదియే నేటి శరంగుత్తి (కన్నెస్వాములు శరములను

స్వామివారి భస్మకుళము ఇది మాలికాపురత్తమ్మ గుడికి ఉత్తరమున కలదు.

అశ్వద్ధ)

(పూర్వము అభిషేక

జలం ఇచ్చటనే కొలనుగా వుండేది)


103.  పదునెట్టాంబడియే శరణం అయ్యప్ప


శబరిమల సన్నిధానం ముందు వుండే పద్దెనిమిది మెట్లు.


104. నెయ్యాభిషేక ప్రియనే శరణం అయ్యప్ప


నెయ్యితో అభిషేకం స్వామికి ఇష్టం


105. కర్పూరజ్యోతి స్వరూపనే శరణం అయ్యప్ప


కర్పూరజ్యోతి స్వరూపునిగా వెలుగొందు స్వామి


106.  జ్యోతి స్వరూపనే శరణం అయ్యప్ప


జ్యోతి రూపంలో దర్శనం యిచ్చే స్వామి


107. మకరజ్యోతియే శరణం అయ్యప్ప


మకర సంక్రాంతినాడు దర్శనం యిచ్చే స్వామి


108. ఓం శ్రీహరిహర సుతన్ అనందచిత్తన్ అయ్యన్ అయ్యప్ప

స్వామియే శరణం అయ్యప్ప


శివకేశవుల సంతానమైన ఆనంద రూపుడైన అయ్య

అయ్యప్పస్వామి🙏


కలియుగవరదన్ అయ్యప్ప | Telegram


https://t.me/kaliyugavaradhan_ayyappa_18


హరిహర


శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ


ఓం ️శ్రీ స్వామియే శరణం అయ్యప్ప


శ్రీ ధర్మశాస్తవే శరణం అయ్యప్ప


అఖిలాండ కోటి బ్రహామ్మండ నాయకనే శరణం అయ్యప్ప


హర హర మహాదేవ్., జై శ్రీ రామ్ 


లోకాః సమస్తా సుఖినోభవంతు

Tuesday, April 6, 2021

యంత్రం


ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్న పరాశక్తిని కూడా దర్శించగలిగారు మన మహర్షులు. వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి. అయినా వేటికి అవి ప్రత్యేక పని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులన్నమాట. మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము, పని ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశించి ఉన్నాయి.

ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే అట్టి దేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు. వేదమునకు మూలము నాదము. దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి, మంత్రములుగా శక్తిని సంతరించుకున్నాయి.

యంత్రమంటే ఏమిటి...

యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క (శక్తి) స్వరూపమే. ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి మూడు రకాలుగా భావించారు.. అవి..

1) ఇచ్ఛాశక్తి,

2) జ్ఞానశక్తి

3) క్రియాశక్తి.

ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే 'ఇచ్ఛ' (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే.

ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే.

నేటి శాస్త్రజ్ఞులు కూడా, ఏ పదార్థమైనా శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు. నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తుజాలమంతా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరమే.

విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే 'ప్రకృతి' అని, 'పరాశక్తి' అని, 'అవ్యక్తం', 'శుద్ధమాయ' అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి వారికి అందిస్తోంది.

శ్రీ చక్ర ఆవిర్భావం...

ఉండేది బ్రహ్మమొక్కటే. ఈ బ్రహ్మం సత్‌, చిత్‌, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది, నిశ్చలమైనదైనప్పటికి, చేతనం అనే బీజం కలిగి ఉండుటం దానిలోని విశేషం. కేవలం కాంతి (ప్రకాశ) రూపముగానున్న బ్రహ్మము నందు ఏర్పడిన మొదటి కదలికను 'విమర్శ' (ఆలోచన) అన్నారు. తాంత్రికులు కాంతిని పరమ శివుడు గాను, విమర్శను పరాశక్తి గాను భావించారు. కాంతి (ప్రకాశ) స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలిక వల్ల నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది. ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు.

దీనినే "పరాబిందువు" అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి. దీనికే సర్వానందమయ చక్రమని పేరు. ఈ బిందువే శ్రీ చక్రమునకు ఆధారము. ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది. సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము (గింజ) లో రెండు పప్పులు (బద్దలు) ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈ పరాబిందువు నందు శివశక్తులొకటిగా ఉంటాయి.

శ్రీ చక్రం - పరాశక్తి వేర్వేరు కాదు. అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి..

1) శివశక్తులొకటిగా నున్న 'బిందువు',

2) అచేతనంగా ఉన్న 'శివుడు',

3) 'చేతనా స్వరూపమైన శక్తి'.

..ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వరతత్వాన్ని సూచిస్తోంది.

మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేం, కనీసం ఊహించలేం. కనుక శక్తి మాత తన మొదటి రూపంగా శ్రీ చక్రాన్ని నిర్మించింది. తదుపరి అనేక దేవీ రూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీ చక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థము లకు సమన్వయం కలుగుచున్నది.

పరాశక్తికి శ్రీ చక్రానికి ఏ మాత్రం భేదం లేదు. శ్రీ దేవియే శ్రీచక్రము. శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.

శ్రీ చక్రం నందు లలితా దేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది. ఇటువంటి శ్రీవిద్యను, శ్రీచక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుమంది, పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవ తంత్రము తెలుపుచున్నది.

|| ఓం నమః శివాయ ||

హిందూ సనాతన ధర్మమునకు సంభదిత విషయములు తెలుసుకొనుటకు కొరకు టెలిగ్రామ్ యాప్ వాడే వారు ఈ క్రింది లింక్ ద్వారా మన సమూహం నందు జాయిన్ అవచ్చును.....

Monday, April 5, 2021

ముక్తినిచ్చే ఏడు ముఖ్య స్థలాలు

 'అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికాపురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః’- ఈ శ్లోకం జగత్‌ ప్రసిద్ధం.... 

దీని అర్థం: అయోధ్యా , మధుర , మాయ ( హరిద్వార్) , కాశీ , కాంచీపురం, అవంతిక (ఉజ్జయిని), ద్వారక ... ఈ ఏడు ముక్తినిచ్చే స్థలాలు ( నగరాలు). ఈ ఏడు ముక్తి క్షేత్రాల గురించి క్లుప్తంగా తెలిసికుందాం.

1) అయోధ్య:-

అయోధ్య అంటే శత్రువులు చొరబడటానికి వీలులేని సురక్షిత స్థానం అని అర్థం. ఇది మానవోత్తముడు, మర్యాదాపురుషోత్తముడూ అయిన శ్రీరాముడి జన్మభూమి. సరయూ నదీతీరంలో వెలసిన ఈ మోక్షధామం దర్శనమాత్రంగా జన్మను చరితార్థం చేస్తుందంటారు.

2) మధుర:-

మాధుర అంటే తీయనైన అని అర్థం. పూర్ణావతార పురుషుడైన శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్రస్థానం.

3)మాయ:-

దీనినే హరిద్వార్‌ అని పిలుస్తారు. విష్ణువు సన్నిధికి చేర్చే ముఖద్వారం ఈ పుణ్యస్థలం. హిమవత్పర్వతాల నుంచి ప్రవహించే గంగానది మొట్టమొదట నేలపై అడుగు మోపే విశిష్ట పుణ్యక్షేత్రం ఈ మాయానగరం.

4)కాశీ:-

భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం పవిత్ర గంగానదీ తీరంలో వెలసిన పరమ శివసన్నిధానం. వరుణ, అసి అనే రెండు నదులు ఇక్కడే గంగా నదిలో సంగమించడం వల్ల ఈ పట్టణానికి వారణాసి అని కూడా పేరు.

5) కాంచీపురం:-

దక్షిణ భారతంలోని పవిత్ర నగరం ఇది. కంచి, కాంచీపురం, కాంజీపురం అనే పేర్లతో అలరారే ఈ పుణ్యధామం శివుడికి, విష్ణువుకు, శక్తికి నెలవు. అద్వైత తత్త్వాన్ని ప్రవచించిన ఆదిశంకరులు స్థాపించిన కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మోక్షం సంప్రాప్తి స్తుందని ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్న విశ్వాసం.

6)అవంతిక:-

భారత భూమిలోని మధ్యప్రదేశంలో విరాజిల్లే ఉజ్జయినీ నగరానికే అవంతిక అనిప్రాచీననామం. శిప్రా నదీతీరంలో వెలుగొందే ఈ పట్టణం మహాకాళనాథు డైన శివుడికి నిలయం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఈ నగరాన్ని గురించి మహాకవి కాళిదాసు ఎంతో అద్భుతంగా వర్ణించాడు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి.

7) ద్వారవతి:-

అంటే ద్వారకానగరం. శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన దివ్యధామం ఇది. కృష్ణుడు నివసించిన ద్వారకానగరం సముద్రంలో కలిసిపోయింది. తీరంలో నూతనంగా నిర్మించిన ఆధునిక ద్వారకానగరం ద్వారకానాథ్‌గా ప్రసిద్ధం. ఇక్కడ ద్వారకాధీశుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి స్వర్గద్వారం ద్వారా ప్రవేశించిన భక్తులు మోక్షద్వారం ద్వారా వెలుపలికి వస్తారు. ఈ కారణంగా ఇది ముక్తిదాయక నగరంగా ప్రసిద్ధి చెందింది.

Saturday, April 3, 2021

రాహు దోషం

జాతక రీత్యా  రాహుదోషం గోచారరిత్యా రాహచెడుప్రభావం అధికమైయిబ్బందులుకల్గుచున్నప్పుడుమానసికరోగాలు,మెదడు,నరాలుకు సంభదించిఅనారోగ్యబాధలు,మానసికరోగాలుతో ఉన్మాదం కల్గినప్పుడూ రాహుకాలంలో దుర్గా దేవి ని తలచుకొని పూజ చేస్తే  తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. ప్రతీరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది. రోజు చేయడం కుదరనివారు, మంగళ / శుక్రవారలలో రాహుకాల సమయంలో పూజ చేయాలి. ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం చాల మంచిది. అలా వీలు కానివారు ఇంట్లోనే శుచిగా  దీపారాధన చేసి, శ్రీ దుర్గా స్తోత్రం చదివి మినపగారెలునైవేద్యం పెట్టాలి. రాహుకాల సమయంలో పసుపు రంగులో నైవేద్యం అంటే, ఓ రోజు నిమ్మకాయ పులిహొర మరొక రోజు అటుకుల పులిహొర నైవేద్యం పెట్టి ఎదైన పని మనసులో అనుకొని రాహుకాలపూజ మొదలుపెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ కార్యక్రమం జరుగుతుంది. కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు కూడా వెలిగిస్తారు. ఇది కూడా చాలా మంచిది. 

రాహుకాల సమయం :

సోమవారం - ఉ 7:30 -9:00

మంగళవారం - మ 3:00 -4:30

బుధవారం - మ 12.00 - 1:30

గురువారం - మ 1:30 - 3:00

శుక్రవారం - ఉ 10:30 - 12:00

శనివారం - ఉ 9:00 - 10:30

ఆదివారం - సా 4:30 - 6:00

Thursday, April 1, 2021

జ‌ప‌మాల ప్రాముఖ్య‌త

జ‌ప‌మాల ప్రాముఖ్య‌త అంద‌రికీ తెలిసిందే. హిందూ ధ‌ర్మంలో పూజ‌ల స‌మ‌యంలో... శ్లోకాలు, మంత్రాలు చ‌దివేట‌ప్పుడు జ‌ప‌మాల‌ను ఉప‌యోగిస్తుంటారు. ఇందులో 108 పూస‌లుంటాయి.

 జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయి ? 

ఇంత‌కూ జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా.. దాని వెన‌క కొన్ని ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. ఒక‌వ్య‌క్తి ఒక‌రోజులో అంటే 24 గంట‌ల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటాడ‌ట‌.

అంటే 12 గంట‌ల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే ఒక మ‌నిషి దేవుడి స్మ‌ర‌ణ‌లో జ‌ప‌మాల చేసేట‌ప్పుడు 10800 సార్లు చేయ‌డం క‌ష్టం కాబ‌ట్టి... చివ‌రి రెండు సున్నాల‌ను తీసేసి 108 ను నిర్ధారించార‌ని చెబుతారు.

108 వెన‌క మ‌రో క‌థ ప్ర‌చారంలో ఉంది. మొత్తం 12 రాశులున్నాయి. ఈరాశుల‌తో తొమ్మిది గ్ర‌హాలున్నాయి. రాశుల సంఖ్య‌ను గ్ర‌హాల‌తో గుణిస్తే వ‌చ్చేది 108. అందుకే జ‌ప‌మాల‌లో 108 పూస‌ల‌ను నిర్థారించార‌ట‌.

ఈ 108 పూస‌లు మొత్తం విశ్వానికి ప్రాతినిధ్యం వ‌హిస్తాయ‌ట‌. జ్యోతిష్య శాస్త్రంలో 27 న‌క్ష‌త్రాలుంటాయ‌ని భావిస్తారు. ఒక్కో న‌క్ష‌త్రానికి 4 పాదాలుంటాయి. అంటే 27 న‌క్ష‌త్రాల‌కు క‌లిపి మొత్తం 108 పాదాల‌వుతాయి.

జ‌ప‌మాల‌లోని ఒక్కో పూస ఒక్కో పాదానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ట‌. అన్నింటికి మించి 108ని అదృష్ట సంఖ్య‌గా భావిస్తారు. హిందూ ధ‌ర్మ శాస్త్ర ప్రకారం 108 సార్లు ఏదైనా స్తోత్రాన్ని చ‌దవాల‌ని చెబుతారు. \

108 సార్లు కొలిస్తే దేవుడి క‌రుణ ఉంటుంద‌ని అంటారు. దానికి అనుగుణంగా 108 పూస‌ల‌ను నిర్ధారించార‌ని ప్ర‌చారంలో ఉంది.

From నారాయణం వెంకటరెడ్డి

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...