Tuesday, March 30, 2021

గురు శుశ్రూష ఎన్ని విధాలు?

గురుసేవ - గురుశుశ్రూష 4 విధాలు.

(1) స్థాన శుశ్రూష :- గురువు ఉన్న ఇంటిని, ఆశ్రమాన్ని, ప్రదేశాన్ని శుభ్రం చేయటం. ఆయన పరిసరాలను శుభ్రం చేయటం. ఆయన వాడుతున్న వస్తువులను శుభ్రం చేయటం - (అదీ తప్పనిసరి కర్తవ్యంగా గాక - తనకు అదృష్టవశాత్తు లభించిన అవకాశంగా భావించి చెయ్యాలి)

(2) అంగ శుశ్రూష :- స్వయంగా ఆయన పాదాలొత్తి సేవచెయ్యటం. ఆయన యొక్క ఆరోగ్య విషయాలను స్వయంగా చూచుకుంటూ తగిన ఏర్పాట్లు చెయ్యటం. ఆయన అవసరాలను కనిపెట్టి ఉండటం.

(3) భావ శుశ్రూష :- ఆయన మనస్సులోని భావాలను తెలుసుకుంటూ అందుకనుగుణంగా నడుచుకోవటం. ఆయన కోరకుండానే ఆయన అవసరాలు తీర్చటం. ఆయనకు ఏ లోటూ కలగకుండా చూచుకోవటం.

(4) ఆత్మశుశ్రూష :- తన మాటలు - చేతలతో గురువును నొప్పించకుండా ఆయన నడిచే మార్గంలోనే నడవటం. ఆధ్యాత్మిక చింతనతో ఆయనతో పోటీ పడటం. తన శరీరం - తన ధనసంపదలు - తన మనస్సు సర్వమూ గురువు కోసమేననే భావన మనసులో దృఢంగా ఉండాలి.

Monday, March 29, 2021

వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా

"మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః "  అంటే అర్ధం తెలుసా

SUN'DAY

MO(O)N'DAY

TUESDAY

WEDNESDAY

THURSDAY

FRIDAY

SATUR(N)DAY

అంటే ఏమిటో తెలుసా....? అసలు ఈ వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా? వీటిని కాపీ కొట్టి, ఇవి మావే అని డబ్బా కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా?

సూర్యహోర

చంద్రహోర

కుజహోర

బుధహోర

గురుహోర

శుక్రహోర

శనిహోర - అంటే

ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగము, ఇవి ఎంతో శాస్త్రీయమైనవి కాబట్టే, బ్రిటిష్ వాళ్లు వీటిని తమ క్యాలెండర్ లో పేర్లు మార్చి, వాటిని వారి విజ్ఞానంగానే ప్రపంచాన్ని నమ్మిస్తున్నారు, 

సరే... ఇప్పుడైనా నిజమేమిటో తెలుసుకుందాం!

ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు - అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి! వారము - అంటే 'సారి' అని అర్ధము.

1వ సారి, 2వ సారి... అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము - అని అంటారు!

కాస్త విపులంగా....

భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు. భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని "ఒక వారం" అని పిలిచారు. ఒకసారి అన్నా - ఒక వారం అన్నా ఒకటే.ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.

మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః

అనగా... 

పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి. 

ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి? 

ఆ గ్రహాల వరసకి, ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా?

ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.

భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది. 

ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.

ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక "అహః" ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి. 

ఆ భాగాలను వారు "హోర" అన్నారు.

"అహః ప్రమాణం" అన్నా, "అహోరాత్ర ప్రమాణం" అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే "హోర" అయింది.

దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారు. 

ఈ హోర పదాన్ని అవర్(HOUR) గా మార్చి పాశ్చాత్యులు 24 అవర్స్(HOURS) అన్నారు.

హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని(పోలిక) పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు.

ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమిమీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. 

ఈ భ్రమణంలో చిత్రమేమిటంటే, ఇవాళ - ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర, సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో... ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్ర హోర ఉంటుంది. 

కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.

మళ్లీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది. కనుక ఆ రోజు - మంగళవారం,

ఆ మరునాడు ఉదయానికి బుధహోర - బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది -గురువారం.

ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర - శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర - అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది.

అయితే... ఈ విధానం వినడం కొత్త అయిన హేతువాద, నాస్తిక, పచ్చ బాబులకు... మొదటి రోజు సూర్యోదయ సమయానికి సూర్యహోర అవుతుందనుకుంటే కదా ఈ లెక్కలన్నీ...ఇలా వచ్చేది! 

అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం. 

వస్తున్నా... అక్కడికే వస్తున్నా...

ఎందుకనుకోవాలంటే - సూర్యుడి(ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్ధం కావడం కోసం మన ఋషులు సూర్యున్ని గ్రహం గా తీసుకున్నారని గమనించాలి) - ఆధిపత్యంలో... సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. 

దీన్నే మరోరకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆగ్రహం పేరే ఆదిత్యుడు. అంటే మొదటివాడు.

అదే మొదటిరోజు. 

అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది.

ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా ఒకటే. 

అక్కడినుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం, హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - ఈ విధంగా వస్తుంది.

అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి.

ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరస వేరుగా, వారాల వరస వేరుగా అయింది. 

ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా, ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా " ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి?" అనే విషయం తెలియదు. 

అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం! 

కాబట్టి హేతువాదులని చెప్పుకునే కుహనా మేధావులారా! అన్యమత సంస్కృతులను మూఢాచారాలని నమ్మే కమ్మే వారాల పేర్లు ఇతరమత గ్రంథాల్లో ఇమడవు కదా! 

మరి ఆ మాక్స్ ముల్లరూ, విలియం జోన్సూ, రిస్లే బాస్టెడూ ఎందుకు వీటిని తీసెయ్యలేకపోయారూ? 

పేర్లు మార్చి, కాపీ కొట్టి ఇవి మావేనని ఎందుకు జబ్బలు చరుచుకుంటున్నారు??? ఎందుకంటే ఇవి బైబిల్ చట్రంలో ఇమడలేదు, తీసెయ్యడానికి కుదరలేద!

అదీ...భారతీయ ఋషుల గొప్పదనం! 

నేటికైనా తెలుసుకోండి.. తెలియకపోయినా పాటించండి! సనాతన ధర్మ సంస్కృతిలో ప్రతీదీ మనిషికి పనికొచ్చే సైన్సే తప్ప వేరే కాదు.

Tuesday, March 9, 2021

నిరంతర జపం

గురువులు వారి శిష్యులకు , భక్తులకు , ఒక్క శ్వాసకూడా వృధా కాకుండా ప్రతీ శ్వాసతో జపం చేయాలని చెబుతారు. ప్రతీ శ్వాసతో మంత్రాన్ని జపించాలి. పనిచేస్తూ , తిరుగుతూ , ప్రయాణం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, ఇలా ప్రతి నిత్యం మంత్రాన్ని జపం చేయాలి.! ఈ విధంగా ఉదయం రాత్రి విరామం లేకుండా చేస్తే , నిద్రలో కూడా జపం కొనసాగుతునే ఉంటుంది. ఇలా ప్రతి నిమిషం మనం మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే అది మనకు ఓ బలమైన రక్షణ కవచం లా పనిచేస్తుంది. ప్రతీ శ్వాసతో జరిపే జపం సహజ ప్రాణాయామానికి దారితీస్తుంది. దాని వల్ల కుండలినీ శక్తి సహజంగానే జాగృతం అవుతుంది. అది సహజ ఆనందానుభూతి ఇస్తుంది. 


ఇలా మనం నిరంతరం ధ్యానావస్థలో ఉండాలంటే :-


👉🏿 మన మీద మనకు విశ్వాసం ఉండాలి.


👉🏿 దీక్ష ఇచ్చిన గురువు మీద విశ్వాసం ఉండాలి.


👉🏿 గురు మంత్రం మీద విశ్వాసం ఉండాలి.


👉🏿 ఆ మంత్రదేవతపై పరిపూర్ణమైన విశ్వాసం, భక్తి, శ్రద్ధలు కలిగి ఉండాలి. 


ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా పంచదశి, షోడశి, లలితా సహస్రనామ, త్రిశతి అన్నీ చేస్తున్నా , నిరంతరం చేస్తూ ఉన్నా, ఎందుకు సరైన ఫలితాలు రావడం లేదు !? అంటే మనం ఒక మంత్రం కూడా పూర్తి స్థాయిలో విశ్వాసం తో ఉచ్చరించడం లెదు !! విశ్వాసం ఫలదాయకం. మనం విశ్వాసం తో మంత్రం ఉచ్చరించాలి. మనం గురువు ఉపదేశం ఇచ్చిన మంత్రాలను యాంత్రికంగా చేస్తున్నాము. అలా చేస్తే , మనకి , టేప్ రికార్డర్ కి పెద్ద తేడా లేదు కదా !! టేప్ రికార్డర్ కి మోక్షం లభించదు. టేప్ రికార్డర్ లాగా మనం మంత్రాలను యాంత్రికంగా జపం చేయకూడదు. 

Friday, March 5, 2021

శనీశ్వరుని, శివుని తగాదా


పూర్వము కృతయుగములో కైలాసము లోని పరమశివుని దర్శించవచ్చిన నారదుడు ... పరమేశ్వరునికి  నవగ్రహాలలో శనిగ్రహ ఆధిక్యతను బహువిధాల చెప్పాడు . నారదుడు చెప్పిన శనిగ్రహం పొగడ్తలు శివునికి నచ్చలేదు . ఆ కారణము గా .. ' శని అంతటి శక్తిమంతుదైతే తన ప్రభావాన్ని తనపై (శివునిపై) చూపి , తనను పీడించి శని శక్తిసామర్ధ్యాలను నిరూపించుకోమను ' అని శివుడు అనగా నారదుడు ఆవిషయము శని తో చెప్పెను.

పరమశివుని మాటలకు శనికి అవేశము , పట్టుదల ప్రేరేపించాయి . తను శివుని ఒక క్షణము పట్టి పీడిస్తానని ... ఆ విషయము తెలియజేయమని నారదునిచే వార్త పంపెను . ఈ విధముగా నారదుడు శివ , శని ల మద్య తగాదా సృష్టించాడు .

నారదుడు తక్షణం శని చెప్పిన మాటలు శివునికి తెలియజేసి శనిప్రభావాన పడకుండా జాగ్రత్తపడమని చెప్పి వెళ్ళిపోయెను . 

" శని తనను ఎలా పీడించగలడో చూస్తాను ' అనుకుంటూ కైలాసము నుంచి మాయమై దండకారణ్యము దారిపట్టాడు శివుడు . ఎవరి ద్రుష్టికీ ఊహకు రాని చోటుకోసం ఆలోచించి అడవిలోని ఒక పెద్ద రావి చెట్టు తొర్ర లో దాగున్నాడు. (ఆ అడవి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి అనే గ్రామం నందు కల ఒక పెద్ద రావిచెట్టు తొర్ర అని, అందులో ఈశ్వరుడు దాక్కున్నాడని, తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి.) మరునాడు ఉదయం ఈశ్వరుడు కళ్లు తెరిచేటప్పటికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరునికి నమస్కరించాడు.

అప్పుడు " ఏ మయింది నీ శపథం " అని ప్రశ్నించాడు ఈశ్వరుడు . ఆయన మాటలకు శని మందహాసం  చేస్తూ " పరమశివుడంతటివాడు దేవతలకు , ఋషులకు , మరి ఎందరికో ఆరాధ్యదైవం , చల్లని ప్రశాంతమైన కైలాసము నుంచి పారిపోయి దండకారణ్యములో పరుగులు పెట్టి దిక్కులేని వాడివలె చెట్టు తొర్రలో దాగుకోవడమంటే ... ఆ క్షణము శని పట్టినట్లు కాదా ! "అని అడిగాడు..శని నెమ్మదిగా వినయం గా..

శని సమయస్పూర్తికి , వినయానికి ఆయన ప్రభావానికి , పట్టుదలకు మెచ్చుకున్నాడు శివుడు . . తనను మెప్పించిన శనికి ఆనాటినుండి ఈశ్వర అనేశబ్దము సార్ధకం కాగలదని మానవులు శని ని శనీశ్వరా అని పూజిస్తే .. శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరము ఇచ్చెను . అలా శనిగ్రహం శనీశ్వరడు అయ్యాడు .

శనీశ్వరుడు మరియు  దశరథ మహారాజు..

తన రాజ్యములో నెలకొన్న కరువు మరియు పేదరికానికి శని భగవానుడే కారణమని గుర్తించి ఆయనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డ ఏకైక వ్యక్తి దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ శనీశ్వరుడు "నేను నా భాద్యతలనుండి తప్పించుకోలేను, కాని నీ ధైర్యానికి ముగ్ధుడనయ్యాను". ఋష్యశృంగ మహర్షి నీకు సాయం చేయగలడు. ఎక్కడైతే ఋష్యశృంగుడు నివశిస్తాడో ఆ దేశములో కరువుకాటకాలు ఉండవు" అని చెప్పెను. శని భగవానుని దీవెనలు అందుకున్న తరువాత దశరథ మహారాజు, ఋష్యశృంగుని తన అల్లునిగా చేసుకొని తన సమస్యను తెలివిగా పరిష్కరించుకున్నాడు. ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ అయోధ్యలో ఉండేవిధంగా, దశరథుడు కుమార్తెగా చెప్పబడే 'శాంత'ను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించారు.

ఓం నమః శివాయ

ఓం శనైశ్చరాయ నమః

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...