శాంతి మంత్రాలన్నీ కూడా చివర్లో ఓం శాంతి ... శాంతి ... శాంతిః అని ముగుస్తాయి .
ఏదో ఒక సందర్భంలో వేద పండితులు ఈ శాంతి మంత్రాల్ని పఠించడం మనందరం వినే ఉంటాం. మనుషులకు మూడు రకాల ఉపద్రవాలనుండీ ప్రమాదం ముంచుకొస్తుంది
మొదటి "శాంతి" పదం శారీరిక , మానసికపరంగా సంభవించే ఉపద్రవం ( అనారోగ్యం ) నుంచీ ఉపశమనం పొందడానికి . దీన్ని "ఆధ్యాత్మికం" అంటారు .
రెండవ "శాంతి" పదం ఇతర జీవరాశులనుండీ , మనుష్యులు నుండీ ఏవిధమైన ఆపదలు / ముప్పు సంభవించకుండా సురక్షితంగా ఉండటానికి . దీన్ని " ఆధిభౌతికము " అంటారు .
మూడవ " శాంతి " పదం ప్రకృతి పరంగా సంభవించే ( భూకంపాలు / అగ్నిప్రమాదాలు / వరదలు / తుఫాన్లు మొదలగునవి ) ఉపద్రవాలు వలన ఏవిధమైన ఆపదలు / ముప్పు కలగకుండా ఉండటానికి . దీన్ని " ఆధిదైవికము " అంటారు.
ఈ మూడు ఉపద్రవాలనుండీ రక్షించమని వేడుకుంటూ
" శాంతి " మంత్రం చివర్లో " శాంతి " పదాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తారు
No comments:
Post a Comment