మాలా విసర్జన మంత్రం అర్థ వివరణ
ముందు మంత్రం అనగానేమీ? మంత్రం అనే పదం సంస్కృతం లో నుండి వచ్చినది. మంత్రాన్ని రెండుగా విడదీస్తే మన్ + త్ర అవుతుంది. మన్ (మ్నస్సు) అనగ “చింతన చేయు(నది)ట” అని అర్థం వస్తుంది. “త్ర” అనగా ఉపకరణాలు. ఉపయోగపడునవి. “చింతన సాధనం” - చింతన సాధించుటకు ఉపయోగపడునది అని స్థూలార్థముగా చెప్పుకోనవచ్చును.
సకల మంత్రాలకు ఆధారమైనది “ప్రణవమంత్రం” గా పిలువబడే బీజాక్షరం “ఓం” ప్రతి మంత్రం “ఓం” తోనే ప్రారంభింప బడుతుంది. ఒక మంత్రాన్ని పదే పదే ఉచ్చరించటాన్ని “జపం” అని చెప్పవచ్చు. అటువంటి మంత్రాలను “జప మంత్రం”- అని అంటారు. ప్రతి మంత్రానికి అత్యున్నతమైన అర్థం ఉంటుంది. ప్రతి అక్షరం పలుక వలసిన రీతిలో అనగా నిర్ధిష్టమైన స్వరంతో పలికిన , ఆ పలుకు లో నుండి ఉద్భవించు కాంతికిరణాలు (విద్యుత్ అయస్కాంత కిరణాలు) ప్రభావం తప్పక చూపుతుంది. మన ఉచ్ఛారణ లోపాలు , అవగాహన లోపాలతో చెప్పే మంత్రాలు పనిచేయవు. అందుకే జపించ వలసిన పద్దతి గురు ముఖముగా తీసుకోవాలని , పెద్దలు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
ప్రస్తుతానికి మనం అయ్యప్ప దీక్ష తీసుకొనుటకు చెబుతున్న మంత్రం యొక్క నిఘాడార్థం తెలుసుకుందాము
అయ్యప్ప మాలను మాలాధారికి వేయునపుడు గురుస్వాములు ఈ మంత్రమును చెప్పవలెను. మాలాధారితో చెప్పించవలెను. వారికి వ్రత నియమములతో పాటు , ఈ మంత్రార్థమును కూడా వివరించవలెను. వ్రత నియమము ఆచరించుటకు , మంత్రార్థం వ్రతము యొక్క విశిష్టతను తెలుపుటకు , అందువల్ల ఈ వ్రతమాచరించగా కలుగు శుభములను వివరించుట కొరకు , వారికి చెప్పవలెను.
జ్ఞానముద్రాం శాస్తృముద్రాం గురుముద్రాం నమామ్యహం |
వనముద్రాం శుద్దముద్రాం రుద్రముద్రాం నమామ్యహం |
శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం |
శభర్యాశ్రమ సత్యేన ముద్రాం పాతు సదాపిమే!!
గురుదక్షిణయాపూర్వం తస్యానుగ్రహకారిణే |
శరణాగత ముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహం |
చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం !
శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమోనమః |
అష్టాదశం మహాసారం శాస్త్రుదర్శనకారణం |
విదితం శుద్దముత్కృష్టం సన్నిధానం నమామ్యహం |
ఊరుజం వాపురం చైవ భైరవ ద్వన్న సేవితం |
విష్ణుమాయాన్వితం శాస్తృ పరివారం నమామ్యహం ||
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ||
గురుస్వామి ఈ మంత్రాన్ని తాను చెబుతూ మాలాధారితో కూడా చెప్పించవలెను. ఒక రకంగా గురువు ద్వారా మంత్రాన్ని గ్రహించుట అగును. అయ్యప్ప మాలా ధారుడు ముందుగా గురువు గారి ద్వారా మంత్రం యొక్క స్థూలార్థం తెలుసుకోవాలి. ఈ మంత్రాన్ని ఎందుకు చెపుతున్నాము అని తెలుసుకోవాలి. అప్పుడే వ్రత దీక్ష యొక్క మహత్వం తెలుస్తుంది. యేదో గురువు గారు చెప్పారు , నేను తిరిగి పలికాను , ఆయన మాల వేశారు , నేను వేయించుకున్నాను అని మనం నేడు చేస్తున్నాము. అది చాలా తప్పు.
మంత్రంలో ప్రతి చరణంలోనూ “ముద్రాం” -- “ముద్రాం” అని పలుకుతున్నాం. “ముద్ర” అనగా భక్తుల యొక్క భవ భోధలను పోగోట్టుటకు ఒక నియమం. శ్రీ శాస్తా వారు పట్టబంధనం తో యోగ ముద్ర లో(ధ్యాన) వుంటారు. అనగా ఒక నియమ పద్దతిలో అమరి ఉండుట. అది యోగానికి అత్యవసరమైన అమరిక. అట్లే ఈ మంత్రం లో “నమాంమ్యహం” అని ప్రతి ముద్ర చివరన పలుకుతాము. అనగా నాయొక్క మనస్ఫూర్తిగా , వినయముగా , భక్తి శ్రద్దలతో నేను ఆచరింతును అని ప్రతిజ్ఞ చేయటం అని తెలుసుకోవాలి.
అయ్యప్ప స్వామి మూల మంత్రము “ఓం స్వామియే శరణం అయ్యప్ప” అనునది కూడా ఒక మంత్రమే. ఎవరి నోటి నుండి ఈ వాక్కు ( ఈ మంత్రం) వెలువడునో , వారు శ్రీమంతులు , దయాళులు , విధ్యావంతులు , వినయవంతులు గా మారి పోతారు. ఈ కలియుగంలో – నీటిలో చేపలా నిలకడ లేక సదా చంచల చిత్తులై , అలమటించు వారికి , చిత్త శుద్ది కలిగించుటకు అలనాటి ఋషోత్తములు , మహత్వం నిండిన ఈ మహా మంత్రమును మనకు ఉపదేశించి వున్నారు. “ఓం స్వామియే శరణం అయ్యప్పా” అను మంత్రం , నాభికమలమునుండి బయలుదేరు ప్రాణ వాయువును , హృదయ మార్గము ద్వారా పయనింప చేసి నాలుకపై శబ్దముగా తాండవింప చేయవలయును. మనః పూర్వకముగా పలుకవలెను. పలుకునపుడు చిత్త శుద్ది వుండవలెను.
కలౌ కల్మష చిత్తానాం పాప ద్రవ్యోప జీవినామ్ !
వీధి క్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తినమ్!!
ఈ కలికాలంలో కల్మష చిత్తులైన వారు , పాప కృత సంపాదనతో జీవించువారు , విధితమైన వృత్తులను మాని ప్రవర్తించు వారు , సద్గతి పొందుటకు భగవన్నామ సంకీర్తన ఒక్కటియే చక్కని మార్గం అని పై శ్లోకం అర్థం.
1.జ్ణాణముద్రాం
శాస్త్ర జ్ణాణము వలన బ్రహ్మమును (పరమేశ్వరుని) తెలుసుకొను జ్ణానము. గురువు ద్వారా ఆయనను ఆశ్రయించి పొందు శాస్త్ర జ్ణాణము , ఈ మాల ద్వారా నాకు కలగాలి.
2.శాస్త్ర ముద్రాం ,
3.గురుముద్రాం
పరమ పూజ్యులైన నా ఈ గురుస్వామి , మాలవేసి మాహా శాస్త్ర వ్రత దీక్షనోసంగి , నన్ను సన్మార్గమున పయనింప , శాస్త్ర యొక్క కరుణా కటాక్షములు నాపై ప్రసరింపచేయ , నాచే నాకు గురు ప్రసాదముగా ఇచ్చిన ఈ వ్రతం నా గురు ఆగ్నేగా స్వీకరించి , శాస్త్రా వ్రతమును నిర్వర్తించేదను.
4.వనముద్రాం:
సంసారం అనబడు ఈ వనం (అడవి) నుండి బయల్పడి , భగవత్సాక్షాత్కారము (బ్రహ్మ జ్ణానము) పొందుట. జనన , మరణ , జరాభయాయుతము , ధుఃఖదాయకమైన , సంసార వనము (కాననము) దాటి మోక్షం , ఈ మాల ద్వారా నాకు కలగాలి.
5. శుద్దముద్రాం
నేను ఈ మాలాధారణచే , నిరంతర సాధనచే , బ్రహ్మ జ్ణానినై , శుద్ద సత్యస్వరూపానంద చిత్తుడై , ఆచరించి , తరించెదను .
6. రుద్రముద్రాం
స్వాత్వానంద చిత్తుడై , జ్ణానినై , జనన మరణ దుఃఖ రహితుడనై , ముక్తి పథము నేను పొందాలి.
7. శాంతముద్రాం
8. సత్యముద్రాం
9. వ్రతముద్రాం
మాల ధారణ చేసి , నేను నియమిత జీవన వ్రతమాచరించి శాంత చిత్తుడనై, ఆ పరమేశ్వరుడిని (అనగా శ్రీ ధర్మ శాస్తా వారిని) ధ్యానించి , సత్యము , నిత్యము అయిన అ భగవంతుని అనుగ్రహము పొందవలేను. నిరంతర సాధనచే , పంచేంద్రియాలను నిగ్రహింప చేసి , కళ్ళెము లేని అశ్వము వలె పరుగిడు నా మనస్సు స్థిరముగా నుండవలెను. స్థిర చిత్తుడనై అరిషడ్వర్గములను సాధించి , శుద్ద సత్యము , సత్యమ సత్యము , అయిన బ్రహ్మమును గాంచవలెను.
10. శబర్యాశ్రమ సత్యేన ముద్రాం పాతు సదాపిమే
సత్యము, నిత్యము, శాస్వితము అయిన ఈ శబరీషుని వ్రత నియమమును స్వీకరించి , సదా నా కర్మేంద్రియాలను (వాక్కు , పాణి , పాదం , వాయువు , ఉపస్త), నా జ్ణానేంద్రియాలను (చర్మం , కన్ను , నాలుక , చెవి , ముక్కు) అదుపులో నుంచుకొని వ్రత దీక్షను కోనసాగింతును.
11. గురుద్ధక్షిణయా పూర్వం తస్యానుగ్రహ కారిణే
తల్లి , తండ్రి తరువాత , మూడవ స్థానాన్ని అలంకరించిన మహోన్నతమైన వ్యక్తి గురువు. వీరు ముగ్గురికి ధక్షిణగా ఏమి ఇచ్చినా రుణము పది జన్మలకైనా తీర్చలేము. వారు మనవద్ద నుండి ఏమి కోరరు , కేవలం మన సత్ప్రవర్తన తప్ప. అదే వారికి మనమొసంగు అపూర్వ ధక్షిణ. నేను నియమ , నిష్టలతో పరిపూర్ణ భక్తిశ్రద్దలతో మీ అనుగ్రహాన్ని సంప్రాప్తచేసుకొనుటకు , గురు మూలముగా లభించిన ఈ అవకాశం సద్వినియోగ పరచుకుందును.
12. శరణాగత ముధ్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహం
ఈ మయా జగత్తు లో ఏమీ తెలియని అజ్ణానుడిని , నీ పాదాలే నాకు శరణం. అందుకే ఈ వ్రత దీక్ష సంకేత ముద్రను దాల్చి , ఈ ముద్ర తమరు నిర్దేశించిన ముద్రగా నెంచి , ఈ మహోన్నతమైన ముద్ర ధారియై , మీ పదాలు పలుకుచూ , మీ పాదాలు శరణుజొచ్చు చున్నాను.
13. చిన్ముద్రాం
స్థిర చిత్తుడై , నిరంతర సాధన చేయు వాడినై , శాస్తా భక్తుడనై త్రీగుణ రహితుడనై ( సత్వ , రాజ , తమో గుణములు), విశ్వవ్యాప్తుడై యున్న ఆ శాస్తా యందు లీనమై , అధ్వైతమయుడనై , ముక్తిని పొందుదునుగాక !
14. ఖేచరీముద్రాం
ఈ మాలాధారణ ముద్రతో సాధన గావించి , కాకివలే ప్రాపంచిక విషయ వాంచలను , దానిచే చిక్కుపడిన మనస్సును , నా పంచేంద్రియములను అదుపులో నుంచుకొని , ఆత్మ స్వరూప పరబ్రహ్మను ( శ్రీ ధర్మశాస్తాను) దర్శించి , పరవశించెదెను.
15. భద్రముద్రాం
జీవన కాలమందు యమయాతన దుర్భర జీవితం , జనన మరణముల భాధలు పొందక , శాశ్విత భద్రత కలిగిన జీవితమును పొందవలెనన్న , స్థిర చిత్తుడనై , గురువు యొక్క అనుగ్రహం పొంది , ఆయన చూపించే సన్మార్గమున పయనించి , భద్ర చిత్తుడై , చిత్తమును ఆత్మ సంధానం గావించి ఆనందమయడనుగుటకు , నాకు ఈ మాలే ఆధారం.
16. శబర్యాచల ముద్రాయై:
ఈ పుణ్య పంబా , శబరిమల దర్శన కారకమైన ఈ పవిత్ర ముద్ర మాలధారినై , అరుదెంచి మీ దివ్య పాద దర్శనం గావించుకొనెదను. మీకు నా వినయ భక్తి ప్రవృత్తుల ప్రణామాలు. దీన రక్షకా మీకు నమోన్నమః !
17. అష్టాదశం మహాసారం శాస్త్రుదర్శనకారణం
విదితం శుద్దముత్కృష్టం సన్నిధానం నమామ్యహం*
18 ధశల అనగా 18 అష్టాదశ శక్తుల పీఠం పై అమరి వున్న జగథ్విఖ్యాత వేదవేదాంగ సార గ్రహీతుడైన స్వామి ధర్శనంచే అతి మహోత్కృష్టమైన ఈ సన్నిధానం ప్రభావముచే పుణీతుడను గా అగుతాకు , నేను మీ శరణాగతి కోరుతూ నమస్కరించి ప్రార్థిస్తున్నాను.
18. ఊరుజం వాపురం చైవ భైరవ ద్వన్న సేవితం
విష్ణుమాయాన్వితం శాస్త్ర పరివారం నమామ్యహం:
స్వామి , తన రెండు మోకాళ్ళను దగ్గరగా చేర్చుకొని తన ఉరువులపై (తొడలపై) నుండి బంధించుకొని “యోగముద్ర”లో కూర్చిని వుంటారు. ఆయన చుట్టూ వున్న భైరవ , భూతగణములైన, కటుశబ్దుడు , వాబరుడు( వావరు కాదు), కడూరవుడు , కూపకర్ణుడు , ఘంటాకర్ణుడు , కూపనేత్రుడు , సింహనేత్రుడు , మహాబలుడు , వీరభద్రుడు , మరియు ఇతర భూత , భైరవ , శైవ గణములు స్వామిని సేవించుతుంటారు. అందు స్వామికి ప్రీతిపాత్రులు మహాబలుడు , కడూరవుడు. ఇదంతయు ఆ జగన్నాటక సూత్రధారుడైన విష్ణుమాయ. ఆ మాయనే నిర్ధేశించి ఈ పరివార సేవితుడైన శాస్తా వారికి నా నా యొక్క నమాంమ్యాహం !
మాలాధారి పైవిధముగా వ్రత దీక్ష తీసుకొనుటకు చేయు పద్దెనిమిది ప్రతిజ్ఞలకు , అతడు , అతని జీవితాంతము కట్టుబడి వుండవలెను. నియమ నిష్టలనుండి , మాలా విసర్జన చేసిన తరువాత కొంత సడలింపు వుండును కానీ , పూర్తి విమోచన వుండదు. ఇది గుర్తెరిగి , తన మనఃపూర్వకముగా ఒక స్వామి మాల ధరించ వలెను. మాలా విసర్జన అయిపోయినది , ఇక నాకు ఏ అడ్డంకులు , ఏ నియమ నిష్టలు , ప్రత్యేక విధులు లేవని తలంచుట మహా ఘోరమైన పాపము. అలా వుండలేని వారు మాల ధరించక పోవటమే ఉత్తమము.
మాలా విసర్జన మంత్రం అర్థ వివరణ
అపూర్వ మచలా రోగా ద్ధివ్య ధర్శన కారణ!
శాస్త్ర ముధ్రాధ్మహాధేవ ధేహిమే వ్రతవిమోచనం!!
మహోత్రుష్టమైన మహా మహిమాన్వితమైన , ఆ శబరిమలను అధిరోహించి , ఆ దివ్య స్వరూపుని దర్శనం భాగ్యం కలిగించి అద్దానికి కారణ హేతు భూతమైన , ఈ మహిమాన్విత శాస్త్ర ముద్ర పరివేష్టిత మాల , ఆ మహా దేవ దేవుడైన శ్రీ శాస్తా ను దర్శించుకొనిన నా ఈ ధేహమును మాత్రము , వ్రత దీక్షనుండి తప్పించుగాక.
అనగా వ్రత దీక్ష నుండి , ఈ పంచభూత నిర్మితమైనది , ఆశాశ్వితమైనది , కర్మచక్షువులతో నిండినది , ప్రాపంచిక విషయాలపై ఆశక్తి , కొర్కేలు కలదానిని మాత్రం , వ్రత దీక్ష నుండి విరమింప చేయమని ప్రార్థన. ఈ వ్రత దీక్ష వలన మనం శాశ్విత సన్యాసత్యం పుచ్చుకొనలేదు. కేవలము ఒక మండలకాలము , వ్రత నియమము లో వున్నాము. కానీ మనపై ఆధార పడ్డ వారు , మన సహాయమునకై ఎదురు చూచువారు , మన యొక్క ధనార్జన , సంపాదన పై ఆధారపడ్డ వారికి కూడా మనము మన విధ్యుథ్ధర్మం నిర్వర్తించ వలసిన విధి మనకున్నది. అందువలన ఈ భౌతిక ప్రపంచమున మనం చేయవలసిన విధులకు ఈ శరీరాన్ని వినియోగించక తప్పదు. నియమ నిష్టలనుండి బయల్పడక పోతే ఈ కలికాలమున ఏదీ సాధ్యపడదు. అందుకు ఈ దేహాన్ని మాత్రం విడుదల చయమని ప్రార్థిస్తున్నాము.
ఒక ముఖ్య విషయం.
మనం మాలా విసర్జన చేయునపుడు , మనం ధీక్షా వ్రత నియమాలనుండి దేహమును మాత్రము విడుదల చేసుకొంటున్నాము. మనలో నెలకొని వున్న మన ఇతర వాసములను విడుదల చేయటము లేదు. అనగా మన భౌతిక శరీరమును మాత్రం వ్రత దీక్షనుండి బయల్పడినది. మన అంతఃకరణములు , మన సూక్ష్మ శరీరము ఒకసారి మాల వేసికొనిన మన వూపిరి వున్నంత వరకు వ్రత దీక్ష లోనే వుండును. అది గుర్తెరిగి మాలా విసర్జన చేసుకొని , మనం వ్రత దీక్షలోనే , ఆత్మ అంతరాత్మ ను కొనసాగించ వలసి వస్తుంది. వ్రత దీక్ష మనలను వీడి పోదు.
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ
శ్రీ ధర్మశాస్తవే శరణం అయ్యప్ప
అఖిలాండ కోటి బ్రహామ్మండ నాయకనే శరణం అయ్యప్ప
లోకాః సమస్తా సుఖినోభవంతు
From: కలియుగవరదన్ అయ్యప్ప గ్రూప్
No comments:
Post a Comment