Thursday, December 31, 2020

యక్ష ప్రశ్నలు

ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు:

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహాయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయమువలన)

12. జీవన్మృతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తృణం కంటే దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ఞం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కుమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)

Wednesday, December 30, 2020

అయ్యప్ప మాలాధారణ మంత్రం అర్థ వివరణ

మాలా విసర్జన మంత్రం అర్థ వివరణ

ముందు  మంత్రం అనగానేమీ? మంత్రం అనే పదం సంస్కృతం లో నుండి వచ్చినది. మంత్రాన్ని రెండుగా విడదీస్తే   మన్ + త్ర  అవుతుంది. మన్ (మ్నస్సు) అనగ  “చింతన చేయు(నది)ట” అని అర్థం వస్తుంది.  “త్ర” అనగా  ఉపకరణాలు. ఉపయోగపడునవి.  “చింతన సాధనం” - చింతన సాధించుటకు  ఉపయోగపడునది అని స్థూలార్థముగా చెప్పుకోనవచ్చును.

సకల మంత్రాలకు ఆధారమైనది “ప్రణవమంత్రం” గా పిలువబడే బీజాక్షరం “ఓం”  ప్రతి మంత్రం “ఓం”  తోనే ప్రారంభింప బడుతుంది.  ఒక మంత్రాన్ని పదే పదే  ఉచ్చరించటాన్ని “జపం” అని చెప్పవచ్చు. అటువంటి మంత్రాలను “జప మంత్రం”- అని అంటారు. ప్రతి మంత్రానికి అత్యున్నతమైన అర్థం ఉంటుంది. ప్రతి అక్షరం పలుక వలసిన రీతిలో అనగా నిర్ధిష్టమైన స్వరంతో పలికిన , ఆ పలుకు లో నుండి ఉద్భవించు కాంతికిరణాలు (విద్యుత్ అయస్కాంత కిరణాలు) ప్రభావం తప్పక చూపుతుంది. మన ఉచ్ఛారణ లోపాలు , అవగాహన లోపాలతో చెప్పే మంత్రాలు పనిచేయవు. అందుకే జపించ వలసిన పద్దతి గురు ముఖముగా తీసుకోవాలని , పెద్దలు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

ప్రస్తుతానికి మనం అయ్యప్ప దీక్ష తీసుకొనుటకు చెబుతున్న మంత్రం యొక్క  నిఘాడార్థం  తెలుసుకుందాము

అయ్యప్ప మాలను మాలాధారికి  వేయునపుడు గురుస్వాములు ఈ మంత్రమును చెప్పవలెను. మాలాధారితో చెప్పించవలెను. వారికి వ్రత నియమములతో పాటు , ఈ మంత్రార్థమును కూడా వివరించవలెను. వ్రత నియమము ఆచరించుటకు , మంత్రార్థం వ్రతము యొక్క విశిష్టతను తెలుపుటకు , అందువల్ల ఈ వ్రతమాచరించగా కలుగు శుభములను వివరించుట కొరకు , వారికి చెప్పవలెను.

జ్ఞానముద్రాం శాస్తృముద్రాం గురుముద్రాం నమామ్యహం |

వనముద్రాం శుద్దముద్రాం రుద్రముద్రాం నమామ్యహం |

శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం |

శభర్యాశ్రమ సత్యేన ముద్రాం పాతు సదాపిమే!!

గురుదక్షిణయాపూర్వం తస్యానుగ్రహకారిణే |

శరణాగత ముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహం |

చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం !

శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమోనమః |

అష్టాదశం మహాసారం శాస్త్రుదర్శనకారణం |

విదితం శుద్దముత్కృష్టం సన్నిధానం నమామ్యహం |

ఊరుజం వాపురం చైవ భైరవ ద్వన్న సేవితం |

విష్ణుమాయాన్వితం శాస్తృ పరివారం నమామ్యహం ||

ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ||

గురుస్వామి ఈ మంత్రాన్ని తాను చెబుతూ మాలాధారితో కూడా చెప్పించవలెను. ఒక రకంగా గురువు ద్వారా మంత్రాన్ని గ్రహించుట అగును. అయ్యప్ప మాలా ధారుడు ముందుగా గురువు గారి ద్వారా మంత్రం యొక్క స్థూలార్థం తెలుసుకోవాలి. ఈ మంత్రాన్ని ఎందుకు చెపుతున్నాము అని తెలుసుకోవాలి. అప్పుడే వ్రత దీక్ష యొక్క మహత్వం తెలుస్తుంది. యేదో గురువు గారు చెప్పారు , నేను తిరిగి పలికాను , ఆయన మాల వేశారు , నేను వేయించుకున్నాను అని మనం నేడు చేస్తున్నాము. అది చాలా తప్పు.

మంత్రంలో ప్రతి చరణంలోనూ “ముద్రాం”  --  “ముద్రాం”  అని పలుకుతున్నాం. “ముద్ర” అనగా భక్తుల యొక్క భవ భోధలను పోగోట్టుటకు ఒక నియమం. శ్రీ శాస్తా వారు పట్టబంధనం తో యోగ ముద్ర లో(ధ్యాన) వుంటారు. అనగా ఒక నియమ పద్దతిలో అమరి ఉండుట. అది యోగానికి అత్యవసరమైన అమరిక. అట్లే ఈ మంత్రం లో “నమాంమ్యహం” అని ప్రతి ముద్ర చివరన పలుకుతాము.  అనగా నాయొక్క మనస్ఫూర్తిగా , వినయముగా , భక్తి శ్రద్దలతో నేను ఆచరింతును అని ప్రతిజ్ఞ చేయటం అని తెలుసుకోవాలి. 

అయ్యప్ప స్వామి మూల మంత్రము “ఓం స్వామియే శరణం అయ్యప్ప” అనునది కూడా ఒక మంత్రమే. ఎవరి నోటి నుండి ఈ వాక్కు ( ఈ మంత్రం)  వెలువడునో , వారు శ్రీమంతులు , దయాళులు , విధ్యావంతులు , వినయవంతులు గా మారి పోతారు. ఈ కలియుగంలో – నీటిలో చేపలా నిలకడ లేక సదా చంచల చిత్తులై , అలమటించు వారికి , చిత్త శుద్ది కలిగించుటకు అలనాటి ఋషోత్తములు , మహత్వం నిండిన ఈ మహా మంత్రమును మనకు ఉపదేశించి వున్నారు. “ఓం స్వామియే శరణం అయ్యప్పా” అను మంత్రం ,    నాభికమలమునుండి బయలుదేరు ప్రాణ వాయువును , హృదయ మార్గము ద్వారా పయనింప చేసి నాలుకపై శబ్దముగా తాండవింప చేయవలయును. మనః పూర్వకముగా పలుకవలెను. పలుకునపుడు చిత్త శుద్ది వుండవలెను. 

 కలౌ కల్మష చిత్తానాం పాప ద్రవ్యోప జీవినామ్ ! 

 వీధి క్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తినమ్!! 

ఈ కలికాలంలో కల్మష చిత్తులైన వారు , పాప కృత సంపాదనతో జీవించువారు , విధితమైన వృత్తులను మాని ప్రవర్తించు వారు ,  సద్గతి పొందుటకు భగవన్నామ సంకీర్తన ఒక్కటియే చక్కని మార్గం అని పై శ్లోకం అర్థం. 

 1.జ్ణాణముద్రాం  

శాస్త్ర జ్ణాణము వలన బ్రహ్మమును (పరమేశ్వరుని) తెలుసుకొను జ్ణానము. గురువు ద్వారా ఆయనను ఆశ్రయించి పొందు శాస్త్ర జ్ణాణము , ఈ మాల ద్వారా నాకు కలగాలి. 

 2.శాస్త్ర ముద్రాం , 

 3.గురుముద్రాం

పరమ పూజ్యులైన నా ఈ గురుస్వామి , మాలవేసి మాహా శాస్త్ర వ్రత దీక్షనోసంగి , నన్ను సన్మార్గమున పయనింప , శాస్త్ర యొక్క కరుణా కటాక్షములు నాపై ప్రసరింపచేయ , నాచే నాకు గురు ప్రసాదముగా ఇచ్చిన ఈ వ్రతం నా గురు ఆగ్నేగా స్వీకరించి , శాస్త్రా వ్రతమును నిర్వర్తించేదను.

4.వనముద్రాం: 

సంసారం అనబడు ఈ వనం (అడవి) నుండి బయల్పడి , భగవత్సాక్షాత్కారము (బ్రహ్మ జ్ణానము) పొందుట.  జనన , మరణ , జరాభయాయుతము , ధుఃఖదాయకమైన , సంసార వనము (కాననము) దాటి మోక్షం , ఈ మాల ద్వారా నాకు కలగాలి.

5. శుద్దముద్రాం 

నేను ఈ మాలాధారణచే , నిరంతర సాధనచే , బ్రహ్మ జ్ణానినై , శుద్ద సత్యస్వరూపానంద చిత్తుడై , ఆచరించి , తరించెదను .              

6. రుద్రముద్రాం 

స్వాత్వానంద చిత్తుడై , జ్ణానినై , జనన మరణ దుఃఖ రహితుడనై , ముక్తి పథము నేను  పొందాలి. 

7. శాంతముద్రాం

8. సత్యముద్రాం

9. వ్రతముద్రాం

మాల ధారణ చేసి , నేను నియమిత జీవన వ్రతమాచరించి శాంత చిత్తుడనై, ఆ పరమేశ్వరుడిని (అనగా శ్రీ ధర్మ శాస్తా వారిని) ధ్యానించి , సత్యము , నిత్యము అయిన అ భగవంతుని అనుగ్రహము పొందవలేను. నిరంతర సాధనచే , పంచేంద్రియాలను నిగ్రహింప చేసి , కళ్ళెము లేని అశ్వము వలె పరుగిడు నా మనస్సు స్థిరముగా నుండవలెను. స్థిర చిత్తుడనై అరిషడ్వర్గములను సాధించి , శుద్ద సత్యము , సత్యమ సత్యము , అయిన బ్రహ్మమును గాంచవలెను. 

10. శబర్యాశ్రమ సత్యేన ముద్రాం పాతు  సదాపిమే

సత్యము, నిత్యము, శాస్వితము అయిన ఈ శబరీషుని వ్రత నియమమును స్వీకరించి , సదా నా కర్మేంద్రియాలను (వాక్కు , పాణి , పాదం , వాయువు , ఉపస్త), నా జ్ణానేంద్రియాలను (చర్మం , కన్ను , నాలుక , చెవి , ముక్కు) అదుపులో నుంచుకొని వ్రత దీక్షను కోనసాగింతును. 

11. గురుద్ధక్షిణయా పూర్వం తస్యానుగ్రహ  కారిణే

తల్లి , తండ్రి తరువాత , మూడవ స్థానాన్ని అలంకరించిన మహోన్నతమైన వ్యక్తి  గురువు. వీరు ముగ్గురికి ధక్షిణగా ఏమి ఇచ్చినా రుణము పది జన్మలకైనా తీర్చలేము. వారు మనవద్ద నుండి ఏమి కోరరు , కేవలం మన సత్ప్రవర్తన తప్ప. అదే వారికి మనమొసంగు అపూర్వ ధక్షిణ.  నేను నియమ  , నిష్టలతో పరిపూర్ణ భక్తిశ్రద్దలతో మీ అనుగ్రహాన్ని సంప్రాప్తచేసుకొనుటకు , గురు మూలముగా లభించిన ఈ అవకాశం సద్వినియోగ పరచుకుందును.     

12. శరణాగత ముధ్రాఖ్యం  త్వన్ముద్రాం ధారయామ్యహం

ఈ మయా జగత్తు లో ఏమీ తెలియని అజ్ణానుడిని , నీ పాదాలే నాకు శరణం. అందుకే ఈ వ్రత దీక్ష సంకేత ముద్రను దాల్చి , ఈ ముద్ర తమరు నిర్దేశించిన ముద్రగా నెంచి , ఈ  మహోన్నతమైన ముద్ర ధారియై , మీ పదాలు పలుకుచూ , మీ పాదాలు శరణుజొచ్చు చున్నాను.

13. చిన్ముద్రాం

స్థిర చిత్తుడై , నిరంతర సాధన చేయు వాడినై ,  శాస్తా భక్తుడనై  త్రీగుణ రహితుడనై ( సత్వ , రాజ , తమో గుణములు), విశ్వవ్యాప్తుడై యున్న ఆ శాస్తా యందు లీనమై , అధ్వైతమయుడనై , ముక్తిని పొందుదునుగాక !  

14. ఖేచరీముద్రాం

ఈ మాలాధారణ ముద్రతో సాధన గావించి , కాకివలే ప్రాపంచిక విషయ వాంచలను , దానిచే చిక్కుపడిన మనస్సును , నా పంచేంద్రియములను అదుపులో నుంచుకొని , ఆత్మ స్వరూప పరబ్రహ్మను ( శ్రీ ధర్మశాస్తాను) దర్శించి ,  పరవశించెదెను.

15. భద్రముద్రాం

జీవన కాలమందు యమయాతన దుర్భర జీవితం , జనన మరణముల భాధలు పొందక , శాశ్విత భద్రత కలిగిన జీవితమును పొందవలెనన్న , స్థిర చిత్తుడనై ,  గురువు యొక్క అనుగ్రహం పొంది , ఆయన చూపించే సన్మార్గమున పయనించి , భద్ర చిత్తుడై , చిత్తమును ఆత్మ సంధానం గావించి ఆనందమయడనుగుటకు , నాకు ఈ మాలే ఆధారం.

16. శబర్యాచల ముద్రాయై: 

ఈ పుణ్య పంబా , శబరిమల దర్శన కారకమైన ఈ పవిత్ర ముద్ర మాలధారినై , అరుదెంచి మీ దివ్య పాద దర్శనం గావించుకొనెదను. మీకు  నా వినయ భక్తి ప్రవృత్తుల ప్రణామాలు.  దీన రక్షకా మీకు నమోన్నమః !

17. అష్టాదశం మహాసారం శాస్త్రుదర్శనకారణం

విదితం శుద్దముత్కృష్టం సన్నిధానం నమామ్యహం* 

18 ధశల అనగా 18 అష్టాదశ శక్తుల పీఠం పై అమరి వున్న జగథ్విఖ్యాత వేదవేదాంగ సార గ్రహీతుడైన స్వామి ధర్శనంచే అతి మహోత్కృష్టమైన ఈ సన్నిధానం ప్రభావముచే పుణీతుడను గా  అగుతాకు ,  నేను మీ శరణాగతి కోరుతూ నమస్కరించి ప్రార్థిస్తున్నాను. 

18. ఊరుజం వాపురం చైవ భైరవ ద్వన్న సేవితం

విష్ణుమాయాన్వితం శాస్త్ర పరివారం నమామ్యహం: 

స్వామి , తన రెండు మోకాళ్ళను దగ్గరగా చేర్చుకొని తన ఉరువులపై (తొడలపై) నుండి బంధించుకొని “యోగముద్ర”లో కూర్చిని వుంటారు. ఆయన చుట్టూ వున్న భైరవ , భూతగణములైన, కటుశబ్దుడు , వాబరుడు( వావరు కాదు),  కడూరవుడు , కూపకర్ణుడు , ఘంటాకర్ణుడు , కూపనేత్రుడు , సింహనేత్రుడు , మహాబలుడు , వీరభద్రుడు , మరియు ఇతర భూత , భైరవ , శైవ గణములు స్వామిని సేవించుతుంటారు.  అందు స్వామికి ప్రీతిపాత్రులు మహాబలుడు , కడూరవుడు. ఇదంతయు ఆ జగన్నాటక సూత్రధారుడైన విష్ణుమాయ. ఆ మాయనే నిర్ధేశించి ఈ పరివార సేవితుడైన శాస్తా వారికి నా నా యొక్క నమాంమ్యాహం !     

మాలాధారి పైవిధముగా వ్రత దీక్ష తీసుకొనుటకు చేయు పద్దెనిమిది ప్రతిజ్ఞలకు ,  అతడు , అతని జీవితాంతము కట్టుబడి వుండవలెను. నియమ నిష్టలనుండి ,  మాలా విసర్జన చేసిన తరువాత కొంత సడలింపు వుండును కానీ , పూర్తి విమోచన వుండదు.   ఇది గుర్తెరిగి , తన మనఃపూర్వకముగా ఒక స్వామి మాల ధరించ వలెను.  మాలా విసర్జన అయిపోయినది , ఇక నాకు ఏ అడ్డంకులు , ఏ నియమ నిష్టలు , ప్రత్యేక విధులు లేవని తలంచుట మహా ఘోరమైన పాపము. అలా వుండలేని వారు మాల ధరించక పోవటమే ఉత్తమము. 

మాలా విసర్జన మంత్రం అర్థ వివరణ

అపూర్వ మచలా రోగా  ద్ధివ్య  ధర్శన కారణ! 

 శాస్త్ర ముధ్రాధ్మహాధేవ ధేహిమే వ్రతవిమోచనం!!

మహోత్రుష్టమైన మహా మహిమాన్వితమైన , ఆ శబరిమలను అధిరోహించి , ఆ దివ్య స్వరూపుని దర్శనం భాగ్యం కలిగించి అద్దానికి కారణ హేతు భూతమైన , ఈ మహిమాన్విత శాస్త్ర ముద్ర పరివేష్టిత మాల , ఆ మహా దేవ దేవుడైన శ్రీ శాస్తా ను దర్శించుకొనిన నా ఈ  ధేహమును మాత్రము ,  వ్రత దీక్షనుండి తప్పించుగాక. 

అనగా వ్రత దీక్ష నుండి , ఈ  పంచభూత నిర్మితమైనది , ఆశాశ్వితమైనది , కర్మచక్షువులతో నిండినది , ప్రాపంచిక విషయాలపై ఆశక్తి , కొర్కేలు కలదానిని మాత్రం , వ్రత దీక్ష నుండి విరమింప చేయమని ప్రార్థన.  ఈ వ్రత దీక్ష వలన మనం శాశ్విత సన్యాసత్యం పుచ్చుకొనలేదు. కేవలము ఒక మండలకాలము , వ్రత నియమము లో వున్నాము. కానీ మనపై ఆధార పడ్డ వారు , మన సహాయమునకై ఎదురు చూచువారు , మన యొక్క ధనార్జన , సంపాదన పై ఆధారపడ్డ వారికి కూడా మనము మన విధ్యుథ్ధర్మం నిర్వర్తించ వలసిన  విధి మనకున్నది.  అందువలన ఈ భౌతిక ప్రపంచమున మనం చేయవలసిన విధులకు ఈ శరీరాన్ని వినియోగించక తప్పదు. నియమ నిష్టలనుండి బయల్పడక పోతే ఈ కలికాలమున ఏదీ సాధ్యపడదు. అందుకు ఈ దేహాన్ని మాత్రం విడుదల చయమని ప్రార్థిస్తున్నాము.

ఒక ముఖ్య విషయం. 

మనం మాలా విసర్జన చేయునపుడు , మనం ధీక్షా వ్రత నియమాలనుండి దేహమును మాత్రము విడుదల చేసుకొంటున్నాము. మనలో నెలకొని వున్న మన ఇతర వాసములను విడుదల చేయటము  లేదు.  అనగా మన  భౌతిక శరీరమును మాత్రం వ్రత దీక్షనుండి బయల్పడినది. మన అంతఃకరణములు , మన సూక్ష్మ శరీరము ఒకసారి మాల వేసికొనిన మన వూపిరి వున్నంత వరకు వ్రత దీక్ష లోనే వుండును. అది గుర్తెరిగి మాలా విసర్జన చేసుకొని ,  మనం వ్రత దీక్షలోనే ,  ఆత్మ అంతరాత్మ ను కొనసాగించ వలసి వస్తుంది.   వ్రత దీక్ష మనలను వీడి పోదు.

శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ

శ్రీ ధర్మశాస్తవే శరణం అయ్యప్ప

అఖిలాండ కోటి బ్రహామ్మండ నాయకనే శరణం అయ్యప్ప

లోకాః సమస్తా సుఖినోభవంతు

From: కలియుగవరదన్ అయ్యప్ప గ్రూప్

Monday, December 28, 2020

నారాయణ స్తోత్రమ్

నారాయణ నారాయణ జయ గోవింద హరే ‖

నారాయణ నారాయణ జయ గోపాల హరే ‖

కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ ‖ 1 ‖

ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ ‖ 2 ‖

యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ ‖ 3 ‖

పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ ‖ 4 ‖

మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ ‖ 5 ‖

రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ ‖ 6 ‖

మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ ‖ 7 ‖

బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ ‖ 8 ‖

వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ ‖ 9 ‖

జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ ‖ 10 ‖

పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ ‖ 11 ‖

అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ ‖ 12 ‖

హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ ‖ 13 ‖

దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ ‖ 14 ‖

గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ ‖ 15 ‖

సరయుతీరవిహార సజ్జన^^ఋషిమందార నారాయణ ‖ 16 ‖

విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ ‖ 17 ‖

ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ ‖ 18 ‖

జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ ‖ 19 ‖

దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ ‖ 20 ‖

ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ ‖ 21 ‖

వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ ‖ 22 ‖

మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ ‖ 23 ‖

జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ ‖ 24 ‖

తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ ‖ 25 ‖

గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ ‖ 26 ‖

సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ ‖ 27 ‖

అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ ‖ 28 ‖

నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ ‖ 29 ‖

భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ ‖ 30 ‖

Thursday, December 24, 2020

యజ్ఞోపవీత మహిమ

వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. 

దీనినే తెలుగులో ‘జ్యంద్యం’ అంటాం. 

ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. 

ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ, కొందరు ఆచారం మీద మక్కువతోనూ, కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం, మరికొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు. 

యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. 

దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.

’సూచనాత్ బ్రహ్మతత్త్వస్య 

వేదతత్త్వస్య సూచనాత్

తత్సూత్రముపవీతత్వాత్ 

బ్రహ్మసూత్రమితి స్మృతమ్’!!

బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.  

యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. 

అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని

‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’

అనే మంత్రం చెబుతోంది.  

యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి.  ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం - 


‘ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ 

వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ 

ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ

తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా 

పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః

సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ 

సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః’!!


మొదటి తంతువులో ఓంకారం,

 రెండవ తంతువులో అగ్నిదేవుడు, 

మూడవ తంతులో నాగదేవత, 

నాలుగవ తంతువులో సోమదేవుత, 

ఐదవ తంతువులో పితృదేవతలు, 

ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, 

ఏడవ తంతువులో వాయుదేవుడు, 

ఎనిమిదవ తంతువులో సూర్యుడు, 

తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం. 


‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది. 

’తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్

కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’

ఈ శ్లోకంలో తాత్పర్యం ఇది. 

తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. 

అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం.

‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది. 

’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ

తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్’

నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. 

అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. 

గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం. 

యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది. 

’పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్

తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్

ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్

యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’!!

అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. 

దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.

బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.

యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. 

యజ్ఞోపవీతం ధారణ మంత్రం:-

“ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్

ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజః”

ఈ విధంగా జపిస్తూ క్రొత్త జంద్యం వేసుకోవాలి.


యజ్ఞోపవీతం విసర్జన మంత్రం:-

 ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితం విసృజామి యశోబ్రహ్మవర్భో దీర్ఘాయురస్తుమే 

------------------------^--------

ఈ విధంగా జపిస్తూ పాత జంద్యం తీసి వేయాలి.

తీసువేసేటప్పుడు పాదాలకు తగలకుండా

నడుము నుంచి క్రిందకు తీసివేసి ఇంటి చూరుపై గాని చెట్లపై గాని ఎవరూ త్రొక్కకుండా ఉండేవిధంగా కానీ లేక ఏదైనా నదిలో గాని విసర్జన చేయాలి.

యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. 

ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు. 

ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి. 

ఇదే యజ్ఞోపవీత మహిమ!

ఓం తత్సత్......

సర్వేజనా సుఖినోభవంతూ.......

పురాణమంటే అర్థమేమిటో చూద్దాం

 పురాణం అంటాం కదా!

అసలీ పురాణమంటే అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం….

పురాణాలలో సర్వశాస్త్రాలు ఇమిడి ఉన్నాయని పెద్దలంతా చెబుతూ ఉంటారు. అసలీ పురాణమంటే అర్థమేమిటి? పురాణాలు ఎన్ని ఉన్నాయి? వాటన్నిటినీ ఎవరితో పోల్చి చెబుతారు? అనే విషయాలను గురించి వివరించి చెబుతుంది ఈ కథా సందర్భం. పద్మపురాణం ఆది ఖండంలో దీనికి సంబంధించిన వివరణ ఉంది.

పురాణాలు మొత్తం పద్దెనిమిది. వీటికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఈ పురాణాలన్నీ శ్రీ మహావిష్ణువు స్వరూపంతో సరిపోతాయి. అందుకే శ్రీమహావిష్ణువును పురాణ పురుషుడని అంటూ ఉంటారు. ఆ నారాయణుడి యొక్క…..

1) హృదయం - పద్మపురాణం

2) చర్మం - వామన పురాణం

3) తొడలు - భాగవత పురాణం

4) మెదడు - మత్స్యపురాణం

5) పృష్ణభాగం - కూర్మపురాణం

6) కుడికాలు చీలమండ - వరాహ పురాణం

7) బొడ్డు - నారదపురాణం 

8) వెంట్రుకలు - స్కందపురాణం

9) ఎడమ భుజం - శివపురాణం

10) కుడి భుజం - విష్ణుపురాణం

11) ఎడమపాదం - అగ్నిపురాణం

12) కుడిపాదం - మార్కండేయ పురాణం

13) కుడి మోకాలు - భవిష్యపురాణం అని పద్మపురాణంతోపాటు ఇతర పురాణాలు కూడా వివరించి చెబుతున్నాయి.

పురాణానికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఆ లక్షణాలున్నదే పురాణం అవుతుంది. ప్రధానంగా పురాణానికి అయిదు లక్షణాలను పేర్కొన్నారు. కాలక్రమంలో కొంతమంది పది లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పారు.

అయిదు లక్షణాలలో

1) సర్గం

2) ప్రతిసర్గం

3) వంశం

4) మన్వంతరం

5) వంశాను చరితం

పురాణానికి ఈ అయిదు లక్షణాలు ఉంటాయని పురాణాలతోపాటు, నిఘంటువులు కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ అయిదు లక్షణాలు మనకున్న పద్దెనిమిది పురాణాలలో ఒక్కోదానిలో ఒక్కొక్క లక్షణం ఎక్కువగా, మరో లక్షణం తక్కువగా వర్ణితమై కనిపిస్తుంది. ఎక్కువ తక్కువుల మాట ఎలాఉన్నా అయిదు లక్షణాలు మాత్రం ఉండి తీరాల్సిందే.

వీటిలో

1) మొదటిదైన సర్గం అనే దానికి అర్థం సృష్టి అని, ఈ సృష్టి అంతా ఎలా జరిగింది? పంచతన్మాత్రలు, పంచభూతాలు ఎలా ఉద్భవించాయి? అని వివరించటమే సర్గం.

2) రెండో లక్షణం ప్రతిసర్గం . సర్గానికి వ్యతిరేకం ప్రతిసర్గం. అంటే సృష్టి ఎలా లయమవుతుంది? ప్రళయాలు ఎన్ని రకాలు? అవి ఎలా ఏర్పడుతాయి? అని వివరించటమే ప్రతిసర్గం

3) మూడో లక్షణమైన వంశంలో సృష్టి ప్రారంభం నుంచి ఎంతమంది రాజులు, వారి వంశాలు, ఆవిర్భవించాయి. వారి వంశాలు వర్ణనతో పాటు ఋషుల వంశాలకు సంబంధించిన విషయ వివరణలు ఈ లక్షణంలో కనిపిస్తాయి.

4) నాలుగో లక్షణం మన్వంతరం . ఇది కాలగణనాన్ని చెబుతుంది. పద్నాలుగు మన్వంతరాల విషయాలు, వాటి అధిపతులు, వారికి సంబంధించిన విషయాలన్నీ దీనిలో వస్తాయి.

5) అయిదో లక్షణమే వంశాను చరితం . దీనిలో సృష్టి మొదలైన దగ్గర నుంచి పాలించిన రాజులు, చక్రవర్తుల, ఋషుల వంశ చరిత్రలు వర్ణితమవుతాయి.

ఇలా ఈ అయిదు ప్రధాన లక్షణాలు పురాణాలకు ఉంటాయని, ఉండాలని పూర్వం నుంచి అందరూ చెబుతున్న విషయమే. కాలక్రమంలో కొంతమంది ఈ అయిదు లక్షణాలను పది లక్షణాలుగా చేసి అలాంటి పది లక్షణాలు వుంటేనే అది పురాణామని చెప్పారు. సర్గ, విసర్గ, వృత్తి, రక్షణ, అంతరాలు, వంశం, వంశాను చరితం, సంస్థ, హేతువు, అపాశ్రయం అనే పది లక్షణాలను అనంతర కాలంలో వచ్చిన వారు పేర్కొన్నారు.

1) సర్గ అంటే ఇక్కడ కూడా సృష్టి అనే అర్థం.

2) విసర్గ అంటే జీవుల సృష్టి అని అర్థం చెబుతారు.

3) వృత్తి అనే పదానికి మనిషి తన జీవితాన్ని సాగించటానికి ఏ ఏ వస్తువులను వాడుతారో వాటిని గురించిన విషయాల వివరణ.

4) రక్షణ అంటే భగవంతుడు ధర్మ రక్షణకోసం అవతరించే తీరు అని అర్థం.

5) అంతరాలు అంటే మన్వంతరాల వివరణ.

6) వంశం అంటే రాజుల, ఋషుల, వంశాల వివరణ.

7) వంశాను చరితం అంటే రాజుల, ఋషుల వంశ క్రమంలో ఉన్న అన్ని తరాల చరిత్ర వివరణ. 

8) సంస్థ అంటే ప్రళయానికి సంబంధించిన వివరణ.

9) హేతువు అని అంటే జీవుడి జనన మరణాలకు మధ్యన ఉన్న కర్మ సంబంధమైన విషయం. జీవుడు చేసే కర్మను బట్టే అతడి జీవితమైనా, సృష్టి అయినా అంతమవుతుందని చెప్పే విషయానికి సంబంధించిన వివరణ.

10) అపాశ్రయం అని అంటే పరబ్రహ్మం అని అర్థం. ఆ పరబ్రహ్మ శక్తినే అపాశ్రయ శక్తి అని అంటారు. దానికి సంబంధించిన వివరాలు దీంట్లో ఉంటాయి.

ఈ పది లక్షణాలు భాగవతం ద్వితీయ స్కందంలో మళ్ళీ కొద్దిపాటి తేడాతో కనిపిస్తున్నాయి. సర్గ, ప్రతిసర్గ, స్థానం, పోషణం, ఊతయం, మన్వంతరం, ఈశాను కథ, నిరోధం, ముక్తి, ఆశ్రయం... ఈ పది లక్షణాలు పేర్లలో తేడా ఉన్నా అర్థం మాత్రం ఒకటేనని పురాణజ్ఞులు వివరించి చెబుతున్నారు.

Wednesday, December 23, 2020

గోమాత గొప్పదనం

 ఆవుదూడ పుట్టిన మొదటి రోజునే పేడ వేస్తుంది. అప్పుడే పుట్టిన లేగ దూడ మొదటి సారివేసిన పేడ పదివేల రూపాయలకు కూడ ఎక్కడా దొరకదు. అది బ్లడ్‌ క్యాన్సర్‌కు అత్యుత్తమ ఔషధం. ఫిట్సుకు కూడ ఇది ఉపయోగపడుతుంది. దూడ మొదటిసారి పేడ వేయగానే ఆవు దానిని తినివేస్తుంది. అందువలన అది దొరకుట చాలా కష్టం.

పడక కురుపు, పుండు వున్న ఒక స్త్రీకి ఆవు పిడకల బూడిద (కచ్ఛిక) పొడి పుండుకు పట్టించుట మొదలు పెట్టగా నెల రోజులలో పుండు నయమైనది. ఆ పుండు ఎముక కనిపించేంత లోతైనది

ఆవు పేడతో అగరు వత్తులు తయారవుతాయి. ఆ అగరు వత్తుల బూడిదను ఔషధంగా వాడవచ్చు. పిల్లలకు దెబ్బ తగిలిన, ఆ పొడి రెండు రోజులు వాడిన అది తగ్గుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్థులకు దెబ్బలు, పుండ్లు కూడ ఆవు పేడ బూడిద వ్రాసిన త్వరగా తగ్గుతాయి.

ఏవైనా విష క్రిములు కుట్టినప్పుడు, (తేనెటీగ, కందిరీగ మొదలగునవి) ఈ బూడిద వేసిన 1 నిమిషంలో తగ్గుతుంది.

వరదలు, తుఫానులు వచ్చినప్పుడు, ఇతర సమయాలలో నీరు బురదగా వున్నప్పుడు, నీరు కాచి త్రాగుతారు. ఒక బిందెడు నీటిలో ఆవు పిడకల బూడిద 1 స్పూను కలిపిన ఆ నీటిని కాయవలసిన పనిలేదు. ఆ నీరు 

త్రాగిన వారికి కలరా, తలనొప్పి, జ్వరము, విరేచనములు రావు. కావున వరద సమయాలలో ఆ బూడిదను పంచిన రోగాలు రావు.

ప్రయాణాలు చేసే వారు ఆవు కచ్చికల బూడిదను వెంట తీసుకువెళ్ళి బయట నీరు త్రాగవల్సి వచ్చిన బాటిలు నీటిలో 1 చిటికెడు బూడిద కలిపి వాడిన ఎలాంటి రోగాలు రావు. (అగర వత్తుల భస్మం) సేకరించి వుంచుకోండి. ఆవు పేడతో చేసినవి మాత్రమే.

ఆవు పేడతో చేసిన అగరు వత్తులు వాడిన ఆ ధూపము ఇల్లంతా వ్యాపించి, ఆ ఇంటి దారిద్య్రము తొలగిపోతుంది.

ఆవు పిడకల పొడితో పళ్ళపొడి తయారు చేసిన, పంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. పంటినొప్పి, కదులుట తగ్గుతుంది. పళ్ళు గట్టిపడతాయి.

ఆవు పేడతో చేసిన పండ్లపొడిని నోటిలో ఉంచి 5 నిమిషముల తర్వాత పండ్లు వేలితో రుద్దాలి. చిగుళ్ళను వేలితో మర్ధన చేయాలి. బ్రష్‌ను వాడవల్సిన పనిలేదు. వ్రేలితో తోమినప్పుడే పళ్ళు బాగా గట్టిపడతాయి.

ఈ ఆవు పిడకల పొడి క్రిమిసంహారిణి. అందువలన దీనితో చేసిన పండ్లపొడి ప్రపంచంలోనే ఉన్నతమైన శాస్త్రీయమైన పండ్లపొడి. 

నాలుకను టంగ్‌క్లీనర్‌ను వుపయోగించి శుభ్రం చేస్తాము. అలా కాకుండా రెండు వేళ్ళతో బాగా రుద్దిన, గొంతులోని ప్రాతం కూడా శుభ్రపడుతుంది.

ఆవు పేడతో చేసిన సబ్బులు వుపయోగించిన చర్మవ్యాధులు రాకుండా, ఒకవేళ వున్నచో తగ్గుటకు, చెమటలు పట్టుట తగ్గుటకు తోడ్పడుతుంది. ఇతర సబ్బులలో కెమికల్స్‌ కలియుటచే చర్మానికి మంచిది కాదు.

ఆవు పేడ విషనాశకము. విష పదార్థములు తీసుకున్నప్పుడు, ఆవు పేడతో చేసిన బూడిద నీళ్ళలో కలిపి త్రాగిన విషం విరుగుతుంది. నీటిలో బూడిద కలిపి స్నానం చేయించిన విష ప్రభావము తగ్గుతుంది. 

పాముకాటుకు గురైన వ్యక్తి చనిపోయినట్లు డాక్టరు చెప్పగా, ఒక యోగి అతని శరీరానికి పలుమార్లు పూర్తిగా ఆవు పేడ పట్టించగా, లోనవున్న విషమంతా విరిగి రెండోరోజుకు అతను శ్వాస పీల్చుకోవడం జరిగింది. అందువలన ఆవుపేడ అద్భుతమైన విష నాశని.

ఆవు పిడకల పొడిని నీళ్ళలో కలిపి స్నానం చేయాలి. ఒంటికి నలుగు పెట్టవచ్చు. పుల్లటి మజ్జిగలో కలిపి తలకు పట్టించండి. పొడిబారిన చర్మం గల వారు పాలలో కలిపి ఫేస్‌ప్యాక్‌గా వాడవచ్చు. చర్మము స్వచ్ఛమై మృదువుగా తయారవుతుంది. 

దెబ్బతగిలి నొప్పి వున్న చోట, ఇతర నొప్పులకు నీటిలో కలిపి పట్టీ వేయించండి. బాగా అలసినచో, లలాట భాగంలో మందముగా ఆ లేపనాన్ని పూసిన 30 నిమిషాల్లో అది ఆరిపోయి తాజాగా తయారవుతారు.

ఆవు మలం కాదు. దానిని గోమయం అంటారు. దానిని పూజల్లో, యజ్ఞాల్లో, వాకిట్లో కళ్ళాపిగాను, పవిత్ర కార్యాలలోను ఉపయోగిస్తాము. అందువలన అది విశిష్టమైనది.

పొలాల్లో ఆవు పేడను ఎరువుగా ఉపయోగించిన ఆహారపదార్థాలు అద్భుతమైన రుచిని కలిగిస్తాయి. పండ్లు మంచి వాసన కలిగి వుంటాయి. పంజాబ్‌లో రసాయనిక ఎరువులు వాడుట వలన అచట ఎక్కువ మంది క్యాన్సర్‌ వ్యాధికి గురైనారు.

Tuesday, December 22, 2020

Bhagwan SriMahavishnu with SriMahalaksmi


Very rare picture drawn in 1967 seen in Sringeri library Bhagwan SriMahavishnu with SriMahalaksmi kanakavarshini ,see both Bhagwan and SriLakshmi thayar showering gold thru their right thirukaram, SriMahavishnu holding surya in right hand and Chandra in left hand sitting on garuda. Drawing based on sloka of SriVishnupuran.

జంబుద్వీపే - భరతవర్షే - భరతఖండే

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి ?

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:

1) కేతుముల వర్ష 

2) హరి వర్ష 

3) ఇలవ్రిత వర్ష 

4) కురు వర్ష 

5) హిరణ్యక వర్ష

6) రమ్యక వర్ష 

7) కింపురుష వర్ష 

8 ) భద్రస్వ వర్ష

పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.

మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.

మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం (Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. తమ సొంత ప్రయోజనాల కోసం దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.

Monday, December 21, 2020

కాలభైరవాష్టమి

 శ్రీ కాలభైరవస్వామి ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమి గా సంభావిస్తారు. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం చెబుతుంది.

ఒకసారి శివబ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్తా వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు 'నేను సృష్టికర్తను... పరబ్రహ్మ స్వరూపుడను... నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి' అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు.

దాంతో వారి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హుంకరించాడు. ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో , మూడు నేత్రాలతో , త్రిశూలము , గద , డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీకాలభైరవుడు.


హుంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు. శివుడి ఆజ్ఞమేరకు కారభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు.

'నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి..' అని శివుడు సలహా ఇచ్చాడు. దీనితో కాలభైరవుడు బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయన్ను ప్రార్థించుతాడు.

అందుకు ''కాలభైరవా ! నీవు శివుని పుత్రుడివి. కనుక శివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం అణచడానికి జన్మించిన వాడవు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నీవు కాశీ క్షేత్రానికి వెళ్లు . కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యాపాతకం భస్మమై పోతుంది' అని  మహావిష్ణువు సలహా  ఇచ్చాడు.


దీనితో కాలభైరవుడు కాశీచేరుకున్నాడు. ఆయనబ్రహ్మహత్యాదోషం పోయింది. బ్రహ్మ కపాలాన్ని కాశిలో పూడ్చి పెట్డాడు. బ్రహ్మ కపాలం పూడ్చి పెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని 'కపాల మోక్ష తీర్థం'


తర్వాత కాలభైరవుడిని చూసి శివుడు 'కాలభైరవా ! నీవు ఇక్కడే కొలుదీరి క్షేత్రపాలకుడుగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి. నీ తరువాతనే నాకు పూజలు జరుగుతాయి.' అని శివుడు పలికాడు.  శ్రీ కాలభైరవుడు కాశీక్షేత్రంలో కొలువు దీరి క్షేత్రపాలకునిగా పూజలందుకొంటున్నాడు. కాశీక్షేత్రాన్ని దర్శించినవారు శ్రీ కాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీనుంచి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారం అయింది.


కాశీ క్షేత్రానికి వెళ్లి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతోపాటు వడలను చేసి వాటితో మాలను తయారు చేసి పూజానంతరం శునకమునకు పసుపుకుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు. ఆ ఆచారాలు శ్రీ కాలభైరవ స్వామి వారి మాహాత్మ్యానికి నిదర్శనం.

ఈ కాలభైరవుని జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తరువాత షోడశోపచారాలతోను , అష్టోత్తరాలతోను శ్రీకాలభైరవ స్వామిని పూజిస్తారు. మినపవడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకపూట ఉపవాసం చేస్తారు.


ఈ మార్గశిర అష్టమి కాలభైరవజన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన కాలభైరవాష్టకం ను పారాయణ చేస్తారు. ఇలా కారభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామిని స్మరించడం , పూజించడం వల్ల సకల పుణ్యఫలాలు కలుగుతాయి. శ్రీ కాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్నభయాలు దూరమవుతాయ. గ్రహదోషాలు తొలగిపోతాయి.



 కాలభైరవాష్టకం



☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


 

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం

వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |

నారదాదియోగిబృందవందితం దిగంబరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||


భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం

నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |

కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||


శూలటంకపాశదండపాణిమాదికారణం

శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||

 

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం

భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |

నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||


ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం

కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |

స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||


రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం

నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |

మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||


అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం

దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |

అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||


భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం

కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |

నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||


కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం

జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |

శోకమోహలోభదైన్యకోపతాపనాశనం

తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||


ఇప్పుడు తీక్ష్ణదంష్ట్రకాలభైరవాష్టకం  పఠించండి.


తరువాత శ్రీ రుద్ర కవచం పఠించండి.


 తీక్షణదంష్ట్రకాలభైరవాష్టకం




☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️



అవమానాలు అపనిందలతో నీ గుండె బాధతో నలిగి పోతున్నప్పుడు , జీవనం సమస్యలుగా సాగుతున్నప్పుడు , అగమ్య మార్గాలలో అశాంతి వచ్చినప్పుడు , అనవసర భయాలు మిమ్మల్ని చుట్టిముట్టి నప్పుడు , కుజ దోషం , సర్ప దోషం , నాగదోషం , కాలసర్పదోషం వెంటాడుతున్నప్పుడు -

ఈ తీక్షణదంష్ట్ర కాలభైరవాష్టకం నిత్యపఠనం సర్వరక్షాకరమై , సర్వ దోషాలనుండి  మిమ్మల్ని కంటికిరెప్పలా కాపాడుతుంది.  దీనికి కోట్లాది భక్తుల అనుభూతులే ప్రత్యక్ష తార్కాణాలు.. ఎందుకంటే సమస్త కాలనాగులన్నిటికీ (సర్పాలన్నీటికి) అధిపతి - ఈ కాలనీకి అధిపతి కాలభైరవుడు కనుక.....



తీక్షణదంష్ట్రకాలభైరవాష్టకం



🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳



ఓమ్ యంయంయం యక్షరూపం దశదిశి విదితం భూమి కంపాయమానమ్ ! 

సంసంసం సంహారమూర్తిo శిరముకుట జటా శేఖరం చంద్రబింబమ్ ! 

దందందం దీర్ఘకాయం వికృతనఖ ముఖం చోర్ధ్వ రోమం కరాళమ్ ! 

పంపంపం పాప నాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((1))

రంరంరం రక్తవర్ణం కటికటితతనుం తీక్షణదంష్ట్రాకరాళమ్ ! 

ఘంఘంఘం ఘోషఘోషం ఘఘఘఘ ఘటితం ఘర్జరం ఘోరనాదమ్ ! 

కంకంకం కాలపాశం ధ్రుకధ్రుకధ్రుకితం జ్వాలితం కామదే హమ్ ! 

తంతంతం దివ్యదేహం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((2))

లంలంలం వదంతం లలలల లలితం దీర్ఘజిహ్వాకరాలం ! ధుoధుoధుo ధూమ్రవర్ణం స్పూటవికటముఖం భాస్కరం భీమరూపమ్ ! 

రుంరుంరుంరుం రుండమాలం రవితను నియతం తామ్రనేత్రం కరాళమ్ ! 

నంనంనం నగ్నభూషం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((3))

వంవంవం వాయువేగం నతజనసదయం బ్రహ్మపారం పరం తమ్ ! 

ఖంఖంఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయం భాస్కరం భీమరూపమ్ ! 

చంచంచం చలిత్వా చలచలచలితా చ్చాలితం భూమిచక్రమ్ ! 

మంమంమం మాయిరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((4))

శంశంశం శంఖహస్తం శశికర ధవళం మోక్షసంపూర్ణతేజం ! 

మంమంమంమం మహంతం కులమకుళకులం మంత్ర గుప్తం సునిత్యమ్ ! 

యంయంయం భూతనాధం కిలికిలికిలితం బాలకేళిప్రధానమ్ ! 

అంఅంఅం అంతరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్!! ((5))

ఖంఖంఖం ఖడ్గభేదం విషమమ్రుతమయం కాలకాలం కరాళమ్ ! 

క్షంక్షంక్షం క్షీప్ర వేగం దహదహనం తప్తసందీప్యమానమ్ ! హౌoహౌoహౌoహౌoకారనాదం ప్రకటిత గహనం గర్జితైర్భుమికంపమ్ ! 

వంవంవం వాలలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((6))

సంసంసం సిద్ధియోగం సకలగుణమఖం దేవ దేవం ప్రసన్నమ్ ! 

పంపంపం పద్మ నాధం హరిహర మయనం చంద్ర సూర్యాగ్నినేత్రం ! 

ఐoఐoఐo ఐశ్వర్యనాధం సతత భయహరం పూర్వదేవం స్వరూపమ్ ! 

రౌంరౌంరౌం రౌద్రరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((7))

హంహంహం హంసయానం హపితకలహకం ముక్తయో గాట్టహాసమ్ ! 

ధంధంధంధం నేత్రరూపం శిరముకుటజాటాబంధ బంధాగ్రహస్తమ్ ! 

టంటంటంటంకార నాదం త్రిదశల టలటం కామగర్వాపహారమ్ ! 

భ్రూoభ్రూoభ్రూo భూతనాధం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((8))

ఇత్యేవం కామయుక్తం ప్రపఠతి నియతాం భైరవస్యాష్టకమ్ ! 

యో నిర్విఘ్నం దుఃఖనాశం సురభయహాణం డాకీనీ శాకీనీనామ్ ! 

నశ్యేద్ధి వ్యాఘ్ర సర్పోహుతవహసలిలే రాజ్యశంసస్య శూన్యమ్ ! 

సర్వానశ్వంతి దూరం విపద ఇతి భ్రుశం చింతనాత్సర్వ సిద్ధిమ్ !!(9)

భైరవస్యాష్టకమిదం శాన్మాసం యఃపఠ్ న్నర్ర: ! 

స యాతి పరమం స్థానం యంత్ర దేవో మహేశ్వరః !!

(10)

సిందూరారుణగాత్రం చ సర్వ జన్మ వినిర్మితమ్ !! (11)

ఇతితీక్షణదంష్ట్ర కాలభైరవాష్టకం సంపూర్ణం



శ్రీ రుద్ర కవచం



🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


 

ఓం అస్య శ్రీ రుద్ర కవచ స్తోత్ర మహామంత్రస్య దూర్వాసఋషిః అనుష్ఠుప్ ఛందః త్ర్యంబక రుద్రో దేవతా హ్రాం బీజం శ్రీం శక్తిః హ్రీం కీలకం మమ మనసోఽభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః

హ్రామిత్యాది షడ్బీజైః షడంగన్యాసః ||


ధ్యానం |

శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం |

శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం |

నాగం పాశం చ ఘంటాం ప్రళయ హుతవహం సాంకుశం వామభాగే |

నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ||

 

దూర్వాస ఉవాచ |

ప్రణమ్య శిరసా దేవం స్వయంభుం పరమేశ్వరం |

ఏకం సర్వగతం దేవం సర్వదేవమయం విభుం || ౧ ||


రుద్ర వర్మ ప్రవక్ష్యామి అంగ ప్రాణస్య రక్షయే |

అహోరాత్రమయం దేవం రక్షార్థం నిర్మితం పురా || ౨ ||


రుద్రో మే జాగ్రతః పాతు పాతు పార్శ్వౌ హరస్తథా |

శిరో మే ఈశ్వరః పాతు లలాటం నీలలోహితః || ౩ ||


నేత్రయోస్త్ర్యంబకః పాతు ముఖం పాతు మహేశ్వరః |

కర్ణయోః పాతు మే శంభుః నాసికాయాం సదాశివః || ౪ ||


వాగీశః పాతు మే జిహ్వాం ఓష్ఠౌ పాత్వంబికాపతిః |

శ్రీకంఠః పాతు మే గ్రీవాం బాహూన్-శ్చైవ పినాకధృత్ || ౫ ||


హృదయం మే మహాదేవః ఈశ్వరోవ్యాత్ స్తనాంతరం |

నాభిం కటిం చ వక్షశ్చ పాతు సర్వం ఉమాపతిః || ౬ ||


బాహుమధ్యాంతరం చైవ సూక్ష్మ రూపస్సదాశివః |

స్వరం రక్షతు సర్వేశో గాత్రాణి చ యథా క్రమమ్ || ౭ ||


వజ్రశక్తిధరం చైవ పాశాంకుశధరం తథా |

గండశూలధరం నిత్యం రక్షతు త్రిదశేశ్వరః || ౮ ||


ప్రస్తానేషు పదే చైవ వృక్షమూలే నదీతటే |

సంధ్యాయాం రాజభవనే విరూపాక్షస్తు పాతు మాం || ౯ ||


శీతోష్ణా దథకాలేషు తుహినద్రుమకంటకే |

నిర్మనుష్యే సమే మార్గే పాహి మాం వృషభధ్వజ || ౧౦ ||


ఇత్యేతద్ద్రుద్రకవచం పవిత్రం పాపనాశనం |

మహాదేవ ప్రసాదేన దూర్వాస మునికల్పితం || ౧౧ ||


మమాఖ్యాతం సమాసేన న భయం తేనవిద్యతే |

ప్రాప్నోతి పరమాఽరోగ్యం పుణ్యమాయుష్యవర్ధనమ్ || ౧౨ ||


విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం |

కన్యార్థీ లభతే కన్యాం న భయం విందతే క్వచిత్ || ౧౩ ||


అపుత్రో లభతే పుత్రం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ |

త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహి త్రయీమయ || ౧౪ ||


త్రాహిమాం పార్వతీనాథ త్రాహిమాం త్రిపురంతక |

పాశం ఖట్వాంగ దివ్యాస్త్రం త్రిశూలం రుద్రమేవ చ || ౧౫ ||


నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర |

శత్రుమధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాంతరే || ౧౬ ||


గమనాగమనే చైవ త్రాహి మాం భక్తవత్సల |

త్వం చిత్వమాదితశ్చైవ త్వం బుద్ధిస్త్వం పరాయణం || ౧౭ ||


కర్మణామనసా చైవ త్వం బుద్ధిశ్చ యథా సదా |

సర్వ జ్వర భయం ఛింది సర్వ శత్రూన్నివక్త్యాయ || ౧౮ ||


సర్వ వ్యాధినివారణం రుద్రలోకం స గచ్ఛతి

రుద్రలోకం సగచ్ఛత్యోన్నమః ||


ఇతి స్కందపురాణే దూర్వాస ప్రోక్తం శ్రీ రుద్రకవచం సంపూర్ణం ||

Saturday, December 19, 2020

దేవభాష

 సంస్కృతం దేవభాష. అత్యంత ప్రాచీన భాష.దాని చరిత్ర ,మూలాలు, పరిణామం తెలియదు కానీ.... సంస్కృతం మూలాలే లాటిన్,ఇంగ్లీష్ లలో ఉన్నాయనేది కొన్ని పదాలు చూస్తే తెలుస్తుంది.(వెల్దండ రఘుమారెడ్డి పరిశోధన నుండి).

Sanskrit            English


1.లప్                  lip


2.దంత               dent


3.నాసిక              nose


4.బ్రాత                brother


5.మాత              mother


6.సూనుః            son


7.దుహిత           daughter


8.నక్తం                night


9.లఘు              light


10.వాహక         vehicle


11.వహతి         weight


12.తరు             tree


13.హోమ          home


14.మూషి         mouse


15.మృత          mortal


16.గ్రాసము       grass


17.బంధ           bond


18.నవ             new


19.మధ్య         mid


20.ఉపరి          upper


21.అదః           under


22.హోరా         hour


23.పథ్            path


24.క్రూర          cruel


25.ఉక్షా          ox


26.గౌ             cow


27.సర్ప         serpent


28.వమితం   vomit


29.ఇతర       other


30.పరమానంత permanant


31.న             no


32.అ +హం     I am


33.ఇతి         it


34.తత్        that


35.సా          she


36.సః           he


37.వయం    we


38.తే           they


39.అస్        is


40.యూయం    you


41.మానవ        man


42.అంగార        anger


43.జ్ఞా               know


44.అగ్రిమకులచర

      Agriculture


45.దామ           dam


46.స్థాన్             station


47.దానం          donation


48.సంత్           saint


49.దివ్య            divine


50.అగ్ని            ignite


51.వాక్కు         vocal


52.వస్             bus


53.సర             car


54.సర్వేక్షణ      survey


55.షష్టి             sixty


56.శత పర శత  cent per cent


57.ధీక్షపాల    discipline


58.శూర్పనఖ   sharp nails


59.దశ              deci


60.నవ             nona


61.అష్ట             octa


62.సప్త              septa


63.షష్ఠ             hexa, hepta


64.పంచ           penta


65.త్రయం         three, trio


66.ద్వయం,ద్వి   dual, dia


67.అస్థిక             osteo


68.చర్మ                derma


69.పాదచారి         pedestrian


70.కృష్ణ                Christna


71.  గోళం             globe


72.దత్త                  debt


73.విధవ               widow


74.పరిమితి           perimeter   


75.భ్రూ                brow


76.తార              star


77.అంతర          inter


78.అంత్            end


79.స్విస్టం           sweet


80.సీవతి            sewing


81.తిథి               date


82.క్రమేల            camel


83.పురోగం         programme


84.చోష్             juice


85.ప్రచార         preacher


86.మనస్తర్       minister


87.సంపన్న       champion


88.అర్కొదది  arctic ocean


89.అతులాంతకోదది. Atlantic ocean


90.ప్రశంతోదది  Pacific ocean 


91.అస్త్రాలయ్  Australia


92.అంధమానవ ద్వీపం Andaman 


93.హిందూ ఆసియా  Indonesia


94.ఋషీయా  Russia


95.కాశ్యపసముద్రము  Kaspean sea.


96.ఆముస్తారదామ  Amsterdam


97.అగ్నిఖండ్,అంగళ గ్రంధి  England


98.బ్రహ్మాంగ దామ  Bermingham


99.మరీచిక  Mauritius


100.లాస్యంజలి LosAngels.

Friday, December 18, 2020

నిద్ర - దిశా ఫలితాలు

ప్రతి రోజూ ఇంటిలో నిద్రించే దిశ ఫలితాలు:

తూర్పు దిశకు తల ఉంచి నిద్రిస్తే - సుఖం

సంతోషం ఉత్తర దిశకు తల ఉంచి నిద్రిస్తే - అనారోగ్యం

మరణం పడమర దిశకు తల ఉంచి నిద్రిస్తే - అలాంటి

ఆందోళలు దక్షిణ దిశ తల ఉంచి నిద్రిస్తే - కీర్తి, విద్య, శాంతి

ఈశాన్యం తల ఉంచి నిద్రిస్తే - కలహాలు, రుణాలు

ఆగ్నేయం తల ఉంది నిద్రిస్తే - రుణబాధలు

నైరుతి తల ఉంచి నిద్రిస్తే - అభివృద్ధి

వాయవ్యం తల ఉంచి నిద్రిస్తే - పిచ్చి ఆలోచనలు

ఆచరించి ఫలితాలు తెలుసుకోండి


భగవద్గీతలో ఈ ఐదు శ్లోకాలు ఎప్పుడు గుర్తు చేసుకుంటే చాలు

మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ప్రతిఫలం అందుకుంటున్నాం? అందుకు ప్రతిగా ఏం చేయాలి? కన్ఫ్యూజన్ లేకుండా భగవద్గీతను మూడు ముక్కల్లో చెప్పాలంటే- ఇంతకంటే పెద్ద సెంటెన్సులు లేవు. కొందరు అనుకున్నట్టుగా, భగవద్గీత ఎట్టిపరిస్థితుల్లో మతగ్రంథం కానే కాదు. కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ చంపడం అధర్మం అనే చింత. అందరూ చచ్చిపోతారనే బాధ. ఈ రెండింటి గురించి మథనపడే అర్జునుడికి- శ్రీకృష్ణుడు విడమరిచి చెప్పిన సారాంశమే భగవద్గీత

బేసిగ్గా ఒక సినిమా పాట-మూడు నెలలకు పాతదైపోతుంది. ఒక కథ-ఆర్నెల్లకు పాచిపోతుంది. ఒక నవల-ఏడాది తర్వాత కనుమరుగైపోతుంది. కానీ వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై, దారిమరిచిన బాటసారికి కరదీపికై, సమస్త భూమండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక గ్రంథం - ఇగిరిపోని గంధం- భగవద్గీత. ఇదేదో మతోద్బోధ అనుకునే వాళ్ల మైండ్ సెట్ మార్చలేం.

ఆధ్యాత్మిక ప్రవచనమైనా, వ్యాపార సూక్తులైనా, మేనేజ్మెంట్ కోర్సులైనా, వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులైనా, ఆటలో గెలవాలన్నా, పరీక్షలో పాస్ కావాలన్నా, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా, ఎక్కడో చోట ఏదో సందర్భంలో గీతను కోట్ చేస్తాం. గీత గురించి చర్చిస్తాం. ఆది శంకరాచార్య దగ్గర్నుంచి స్వామీ వివేకానంద, మాక్స్ ముల్లర్ దాకా భగవద్గీత గొప్పదనాన్ని వేనోళ్లా చాటినవారే.

వందల శ్లోకాలు ఔపోసన పట్టాల్సిన పనిలేదు. బట్టీ పట్టి కంఠశోష తెచ్చుకోమనడం లేదు. ఒక నాలుగైదు శ్లోకాలు చాలు.

ప్రతి వ్యాపారి , ఉద్యోగి అనుసరించవలసిన విద్యుక్త్ధర్మాలు భగవద్గీత లోని 5 simple management skills

✿భగవద్గీతలో ఈ ఐదు శ్లోకాలు డీకోడ్ చేసుకుంటే చాలు✿

1.కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |

మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోఅస్త్వకర్మణి ||

అంటే, నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే. ఆ కర్మఫలాలకు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో ఎట్టిపరిస్థితుల్లో కర్మలు చేయకు. అలాగని చేయడం మానకు అని అర్ధం.

ప్రతీ ఆంట్రప్రెన్యూర్ కు ఈ శ్లోకం వర్తిస్తుంది. చేయాల్సిన పని గురించి రెండే రెండు ముక్కల్లో నిక్షిప్తమైన సార్వజనీన సత్యం ఇది. ప్రతీ వ్యాపారి లేదా ఉద్యోగి ఇదే సూత్రం మీద పనిచేయాలి. ప్రతిఫలం గురించి ఆశించకుండా చేసుకుంటూ పోవడమే. ప్రాసెస్ ఎంజాయ్ చేసుకుంటూ తీరం చేరుకోవాలే తప్ప.. ఎంతసేపూ ఫైనల్ ఔట్ పుట్ మీదనే ఏకాగ్రత చేయొద్దు. అలా అని పూర్తిగా ఆశావాదం లేకుండా పనిచేయమని కాదు. ఆశ పడటం తప్పు కూడా కాదు. కానీ ఎలాంటి చర్యా లేకుండా- గాల్లో దీపం పెట్టే దేవుడా నీవే దిక్కు అంటే మాత్రం కష్టం. చేయాల్సింది చేయాలి. ఫలితం సంగతి తర్వాత. ముందు ధైర్యంగా అడుగేయాలి.

2.వాసంసి జీర్ణాని యథా విహాయ 

నవాని గృహ్ణాతి నరోపరాణి |

తథా శరీరాణి విహాయ జీర్ణాని

అన్యాని సంయాతి నవాని దేహీ ||

అంటే,"చిరిగిపోయిన బట్టలను పడేసి, మనం కొత్తబట్టలు ఎలా కట్టుకుంటామో, జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కూడా- మరోకొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది" అని అర్ధం.

ఆంట్రప్రెన్యూర్లు కూడా అంతే. వెర్సటాలిటీ చూపించాలి. దేన్నయినా స్వీకరించేలా ఉండాలి. అవే సక్సెస్ రుచి చూపిస్తాయి. ముఖ్యంగా మార్పును ఎప్పటికప్పుడూ గమనించాలి. కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాలి. నా ఇష్టం- నాకు ఇదే ఇష్టం అంటే- వాళ్లు అక్కడే ఉండి పోతారు. అలా కాకుండా కొత్తదాని కోసం అన్వేషించాలి. కొత్తదనాన్ని చదివేయాలి. కొత్త అవకాశాల కోసం ఎదురుచూడాలి. అదే నిజమైన ఆంట్రప్రెన్యూర్ లక్షణం. బిజినెస్ అంటేనే నిరంతర ప్రయాణం. వ్యాపారి నిరంతర పథికుడు. నాలుగు గోడల మధ్యనే ఉంటే ప్రపంచం ఏనాటికీ అర్ధం కాదు. మొండిగా ఉండొద్దు. ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి. సంకుచిత భావాలు వదిలేయాలి. స్పాంజి నీళ్లను పీల్చుకున్నట్టు అనుభవాల్ని పాఠాలుగా మలుచుకోవాలి. అప్పుడే గమనం వేగం అందుకుంటుంది.

3.క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ

స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్దినాశాత్‌ప్రణశ్యతి||

అంటే, కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషే నాశనం.

ఇదొక యాంగర్ మేనేజ్‌మెంట్ లాంటిది. ఆంట్రప్రెన్యూర్లకు మస్టుగా ఉండాల్సిన లక్షణం. లేకుంటే చెప్పుడు మాటలు విని, వాస్తవాలతో పనిలేకుండా ఆలోచించి బుర్రపాడు చేసుకుంటారు. మైండ్ లో ఒకరకమైన కన్ ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దాంతో సహజంగానే మతిమరుపు వస్తుంది. ఆటోమేటిగ్గా లక్ష్యం నుంచి తప్పుకుంటాం. అందరిముందు నవ్వుల పాలవుతాం. అందుకే కోపాన్ని జయించాలి. టెంపర్ ని అదుపులో ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దు.

4.తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచార |

ఆసక్తో హ్యాచరన్ కర్మ పర మాప్నోతి పూరుష: ||

కాబట్టి, చేసే పని, దాని ఫలితము మీద అదే పనిగా ఆసక్తి ఉండొద్దు. కర్మ ప్రకారం చేసుకుంటూ పోవాలంతే అంటాడు శ్రీకృష్ణ భ‌గ‌వానుడు

వ్యాపారమూ అంతే. ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. అవసరమైతే జత కలవాలి. బలం పెంచుకోవాలి. అత్యాశకు పోవద్దు. వీలైనంత.....

క్రీయేటవివ్ గా ఉండాలి. ఇన్నవేటివ్ గా ఆలోచించాలి. మార్కెట్ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనించాలి. అంతేగానీ బైనాక్యులర్ పట్టుకుని ఎలుకను వేటాడినట్టుగా ఉండొద్దు.

5.

ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|

యథోల్యేనావఈతో గర్భస్తథా తేనేదమావృతమూ ||

అంటే- పొగ చేత నిప్పు, ధూళి చేత అద్దం, మావి చేత గర్భస్త పిండం కప్పబడినట్లే, కోరికల చేత జ్ఞానం కూడా కప్పబడినట్లే, కోరికల చేత జ్ఞానం కూడా కప్పబడి వుంటుంది అని అర్ధం.

ఆంట్రప్రెన్యూర్లు వెతుక్కోవాలే గానీ ఇందులో బోలెడంత నిగూఢార్ధం దాగివుంది. కప్పేసే ప్రతీదీ మనల్ని మిస్ లీడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్.. ఒకచోట మంట అంటుకుంది అనుకుందాం. వెంటనే పొగ దాన్ని కప్పేస్తుంది. ఎదురుగా వుండే అద్దం మీద ధూళి- నిప్పును, పొగను రెండింటినీ దాచేస్తుంది. అంతులేని కోరికలు నాలెడ్జ్ ని కిల్ చేస్తాయి. అంతేకదా మరి.

ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి అన్న విచక్షణా జ్ఞాన‌మే ఉద్యోగమైనా లేదా వ్యాపారమైనా...

Wednesday, December 16, 2020

శ్రీగోదాష్టకం

1) శ్రీకృష్ణదేవరాయవిరచితఆముక్తమాల్యదప్రథాననాయికాం 

   నిరంతరశ్రీవిష్ణునామస్మరణతత్పరశ్రీవిష్ణుచిత్తతనూజాం 

   శ్రీరంగనాథహృత్కమలస్థితశోభాయమానశ్రీరంగనాయకీం 

   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||


2) రత్నమణిమాణిక్యకేయూరవైఢూర్యభూషోజ్జ్వలాం

   చందనహరిద్రాకుంకుమచర్చితభవ్యాంఘ్రితేజోమయీం

   సాంద్రానందకరుణాప్రపూర్ణదివ్యమంగళవిగ్రహాం  

   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||


3) సంభ్రమాశ్చర్యజనకవిచిత్రకిరీటవేషధారిణీం 

   బ్రహ్మజ్ఞానప్రదాయకప్రపన్నార్తిహరకమలనయనాం 

   సంతతశ్రీరంగనాథగుణగానమత్తచిత్తమహాపతివ్రతాం 

   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||


4) త్రిభువనైకపాలకసంసారార్ణవతారకమోక్షమార్గనిశ్శ్రేణికాం 

   భక్తజనావళిసముద్ధరకారణశ్రీతులసీకాననసముద్భవాం 

   భూదేవీస్వరూపఅష్టాక్షరమంత్రరాజభవ్యోపాసినీం 

   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||


5) యజ్ఞహవ్యకవ్యఫలదాయకస్వాహాస్వధాస్వరూపిణీం 

   సంగీతసాహిత్యవేదశాస్త్రజ్ఞానప్రదాయకకుశాగ్రబుద్ధిం 

   అష్టైశ్వర్యప్రదాయకసత్సంతానదాయకమహారాజ్ఞీం 

   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||


6) సంక్షోభకల్లోలదుఃఖభరితజనజీవనశాంతిప్రదాయినీం 

  శాకసస్యప్రదాయకబలోత్సాహప్రదకరుణాంతరింగిణీం 

  సకలగ్రహపీడానివారకసత్ఫలప్రదాయకవిశ్వమాతరం 

 యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||


7) గార్హపత్యఆహవనీయదక్షిణాత్యశ్రౌతాగ్నిస్వరూపిణీం 

   సహస్రకిరణప్రజ్వలతేజోమయద్వాదశాదిత్యస్వరూపిణీం  

   నిరంతరఆరోగ్యభాగ్యదాయకఅశ్వినిదేవతాస్వరూపిణీం 

   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||


8) బ్రహ్మతేజప్రదాయకత్రికాలసంధ్యాస్వరూపిణీం 

   మృదుమంజులభాషణమందగజగామినీం 

   గోపీచందనతిలకాంచితబహుసుందరవదనాం 

   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||


 సర్వం శ్రీగోదాదేవిదివ్యచరణారవిందార్పణమస్తు

నేటికి థాయిలాండ్ లో రామ రాజ్యమే ఉంది..

థాయిలాండ్ లో రాజ్యాంగ ప్రకారం ఒక రామ రాజ్యం ఉంది అనే మనలో చాలా మందికి తెలియదు.. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్" అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు..

సంక్షిప్తంగా ఇతిహాసాలలో శ్రీరాముని చరిత్ర:

వాల్మీకి మహర్షి రచించిన రామాయణం మనకు మతగ్రంథమే కాదు, చారిత్రక గ్రంథం కూడా.. వాల్మీకి మహర్షి బాలకాండ లోని 70, 71 &73 సర్గలలో రాముని వివాహాన్ని, తమ్ముల వివాహాలను కూడా వర్ణించడం జరిగింది.. దాని సారాంశం ఏమిటంటే -

మిథిలకు రాజు సీరధ్వజుడు.. ఆయనకు విదేహరాజు అన్న పేరు కూడా ఉంది.. ఆయన భార్య సునేత్ర లేక సునయన.. ఆయన పుత్రిక అయిన జానకికి రామునితో వివాహం జరిగింది.. జనకుడికి కుశధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు.. అతని రాజధాని సాంకశ్యనగరం.. అది ఇక్షుమతీనది ఒడ్డున ఉంది.. ఈ కుశధ్వజుడు తన పుత్రికలైన ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తి లను లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు.. కేశవదాసు రచించిన రామచంద్రిక అనే గ్రంథం ఆధారంగా (పేజీ 354), సీతారాములకు లవకుశులు , ఊర్మిళాలక్ష్మణులకు అంగద చంద్రకేతులు, మాండవీభరతులకు పుష్కరుడు - తక్షుడనే వాళ్ళు, శృతకీర్తిశతృఘ్నులకు సుబాహువు - శతృఘాతకుడనే వాళ్ళు జన్మించారు..

శ్రీరాముని సమయంలోనే రాజ్యవిభజన జరిగింది..

పశ్చిమంలో లవునకు లవపురం (లాహోర్), తూర్పున కుశునకు కుశావతి, తక్షునకు తక్షశిల, అంగదునకు అంగదనగరం, చంద్రకేతునకు చంద్రావతి లను ఇవ్వడం జరిగింది.. కుశుడు తన రాజ్యాన్ని తూర్పు దిక్కుగా విస్తరింపజేసాడు.. ఒక నాగవంశపు కన్యను వివాహం చేసుకున్నాడు.. థాయిలాండ్ లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే.. ఈ వంశాన్ని #చక్రీ వంశము అంటారు.. చక్రి అంటే విష్ణువనే అర్థం కదా.! రాముడు విష్ణుభగవానుని అవతారం.. అదీగాక, రాజు విష్ణు స్వరూపమే కదా.! అందువలన వీళ్ళు తమ పేర్లచివర #రామ్ అన్న పేరు తగిలించుకుని, వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.. ప్రస్తుతం 9వ రాముడు రాజ్యం చేస్తున్నాడు.. అతని పేరే #భూమిబల్అతుల్యతేజ్..

థాయిలాండ్ యొక్క అయోథ్య

థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో Bangkok అని అంటున్నాము కదా.! అయితే ప్రభుత్వం రికార్డులలో అధికారిక రాజధాని పేరు వింటే మీరు ఆశ్చర్యపోతారు.. ప్రపంచంలో ని అన్ని దేశాల రాజధానులలో ఇదే పొడుగైన పేరు గల రాజధాని.. అంతే కాదండోయ్, ఆ పేరు సంస్కృతంలో ఉంది. ఏమిటో మీరే చదవండి - "క్రుంగదేవ మహానగర 

అమరరత్న కోసింద్ర మహింద్రాయుధ్యా మహా తిలక భవ నవరత్న రజధానీపురీ రమ్య ఉత్తమ రాజ నివేశన అమర విమాన అవతార స్థిత శక్రదత్తియ విష్ణుకర్మ ప్రసిద్ధి.."

థాయిభాషలో పైపేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు.. ఇంకో విశేషం ఏమిటంటే వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు, పాటలా పాడుతారు.. కొంత మంది సంక్షిప్తంగా "మహింద్ర అయోధ్య" అని అంటారు.. ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం.. థాయిలాండ్ రాజులు అందరూ ఈ అయోథ్యలోనే నివసిస్తారు..

థాయిలాండ్ లో నేటికీ రామరాజ్యం ఉంది.

థాయిలాండ్ లో 1932 లో ప్రజాస్వామ్యం వచ్చింది.. ప్రజలు బౌద్ధమతస్తులైనా, రామరాజ్యాన్నే అనుసరిస్తున్నారు.. అక్కడి రాజవంశం వారనెవరినీ విమర్శించడం గానీ, వివాదాలలోకి లాగడంగానీ చేయరు.. వారంతా పూజనీయులని విశ్వసిస్తారు.. రాజవంశం వారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు, వంగి మాట్లాడతారు.. ప్రస్తుత రాజుకి ముగ్గురు కూతుళ్ళు.. అందులో చివరి కూతురికి హిందూ ధర్మశాస్త్ర పరిజ్ఞానముంది..

థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం

థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా, వారి జాతీయ గ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.. థాయి భాషలో దానిని "రామ్ కియేన్" అని పిలుస్తారు.. మన వాల్మీకి రామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి.. ఒకసారి 1767లో రామ్ కియేన్ పాడైపోయినదట.. అప్పుడు రాజైన రామ-1 (1736 -1809) తన స్మరణ శక్తితో తిరిగి రామాయణం అంతా రచించినాడట.. రామాయణం జాతీయ గ్రంథంగా వారు ప్రకటించుకున్నారు.. మనదేశంలో లాగా దిక్కుమాలిన సెక్యులరిజం లేకపోవటం వారి అదృష్టం..

థాయిలాండ్ లో రామ్ కియేన్ (రామాయణం) ని అనుసరించి నాటకాలు, తోలు బొమ్మలాటలు ఉన్నాయి.. వారి నాటకాలలోని పాత్రలు చూద్దాం - 

1. రామ్ ( రాముడు )

2. లక్ ( లక్ష్మణుడు )

3. పాలీ ( వాలి )

4. సుక్రీప్ (సుగ్రీవుడు )

5. ఓన్కోట్ ( అంగదుడు )

6. ఖోంపూన్ ( జాంబవంతుడు )

7. బిపేక్ ( విభీషణుడు )

8. తోతస్ కన్ ( దశకంఠ ) రావణుడు 

9. సదాయు ( జటాయు )

10. సుపన్ మచ్ఛా (శూర్పణఖ )

11. మారిత్ ( మారీచుడు )

12. ఇంద్రచిత్ (ఇంద్రజిత్ ) మేఘనాదుడు.

థాయిలాండ్ లో హిందూ దేవీ దేవతలు

ఇక్కడ బౌద్ధులు అధిక సంఖ్యాకులు.. హిందువులు అల్పసంఖ్యలో ఉన్నారు.. ఇక్కడ బౌద్ధులు కూడా ఈ హిందూ దేవీ దేవతలను పూజిస్తారు..

1. ఈసుఅన్ ( ఈశ్వర్ ) శివుడు

2. నారాయి (నారాయణ్ ) విష్ణువు 

3. ఫ్రామ్ ( బ్రహ్మా )

4. ఇన్ ( ఇంద్రుడు )

5. ఆథిత్ ( ఆదిత్య ) సూర్యుడు

6. పాయ్ ( వాయు )

థాయిలాండ్ జాతీయ పక్షి గరుత్మంతుడు

గరుడపక్షి చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది.. ప్రస్తుతం ఈజాతి లుప్తమైపోయిందని భావిస్తున్నారు.. ఇంగ్లీషులో ఆశ్చర్యంగా దీనిని బ్రాహ్మణపక్షి (The Brahmany Kite) అని పిలుస్తారు.. దీని సైంటిఫిక్ నామధేయం "Haliastur Indus". ఫ్రెంచ్ పక్షి శాస్త్రజ్ఞుడు మాథురిన్ జాక్స్ బ్రిసన్ 1760 లో దీనిని చూసి Falco Indus అన్న పేరు పెట్టాడు.. ఈయన దక్షిణభారత్ లోని పాండిచెరీ పట్టణం వద్ద కొండలలో దీనిని చూసానని తెలిపాడు.. అందువల్ల ఈ పక్షి కల్పన కాదు అని అవగతమౌతోంది.. మన పురాణాలలో ఈ పక్షిని విష్ణుభగవానుని వాహనంగా పేర్కొన్నారు.. థాయిలాండ్ ప్రజలు ఎంతో గౌరవంతో తమ రాజు రాముని అవతారం కనుక, ఆ రాముడు విష్ణువు అవతారమనీ, ఆ విష్ణువు వాహనం కనుక గరుడ పక్షిని తమ జాతీయపక్షిగా చేసుకున్నారు.. అంతే కాదు థాయిలాండ్ పార్లమెంటు ఎదురుగా గరుడుని బొమ్మ కూడా పెట్టుకున్నారు..

థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ పేరు సువర్ణభూమి

మన దౌర్భాగ్యం స్వాతంత్రం అనంతరం పాలకులు సెక్యులరిజం పేరుతో హిందువులతోనూ, హిందూ సంస్కృతితోనూ ఆటలాడుకున్నారు.. కానీ, థాయిలాండ్ లోని రాజధాని లోని ఎయిర్ పోర్ట్ కు చక్కని సంస్కృతంలోని పేరు "సువర్ణభూమి" అని పెట్టుకున్నారు.. వైశాల్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద రెండవ ఎయిర్ పోర్టు ఇదే.. దీని వైశాల్యం 563,000 sq.mt. ఎయిర్ పోర్టు ముందు "సముద్రమంథనం" ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు, రాక్షసులు చేసే క్షీరసాగరమథనాన్ని చూపిస్తుంది..

ఈ వ్యాసం ఉద్దేశ్యం మన పిల్లలకు, రాబోయే తరాలకు మన సంస్కృతిని వారసత్వ సంపదగా మనమే అందించాలి.!! జయ శ్రీరామ!!

సౌజన్యము:- "మనహిందూసంస్కృతి" !!

Monday, December 14, 2020

72 చిక్కు ప్రశ్నలుకు ధర్మరాజు ఇచ్చిన జవాబులు


1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)


2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)


3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)


4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)


5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)


6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)


7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)


8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?

(పెద్దలను సేవించుటవలన)


9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?

(అధ్యయనము వలన)


10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన

సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల

అసాధుభావము సంభవించును.)


11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?

( మౄత్యు భయమువలన)


12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ,

అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)


13. భూమికంటె భారమైనది ఏది? (జనని)


14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)


15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)


16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల

ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో

తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో

అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)


17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)


18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)


19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)


20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?

( యజ్ణ్జం చేయుటవలన)


21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)


22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది? (రాయి)


23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని

రక్షించక పోవడంవలన)


24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)


25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)


26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి

బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి

అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)


27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)


28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)


29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)


30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)


31. మనిషికి దైవిక బంధువులెవరు?(భార్య/భర్త)


32. మనిషికి ఆత్మ ఎవరు? ( కూమారుడు)


33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)


34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)


35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)


36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)


37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)


38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)


39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)


40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)


41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)


42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి,

ఆకాశములందు)


43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ణ్జానం)


44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)


45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు,

ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం,

క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)


46. తపస్సు అంటే ఏమిటి? ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)


47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)


48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)


49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ

దు:ఖాలను సమంగా ఎంచువాడు)


50. జ్ణ్జానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)


51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)


52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)


53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)


54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం కలిగి ఉండటం)


55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)


56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా

చేసుకోవడం)


57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)


58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)


59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)


60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)


61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం)


62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)


63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన

భర్తలో)


64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు;

వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ,

దానం చెయ్యనివాడు)


65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)


66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)


67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది

గొప్పవాడవుతాడు)


68. ఎక్కువ మంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?

(సుఖపడతాడు)


69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు)


70. ఏది ఆశ్చర్యం?

(ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)


71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?

(ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)


72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు)

శ్రీయాజ్ఞవల్క్యకృత సూర్యస్తోత్రం

 సూర్యస్తోత్రం శ్రీయాజ్ఞవల్క్యకృతమ్

ఓం నమో భగవతే ఆదిత్యాయాఖిలజగతాం ఆత్మస్వరూపేణ కాలస్వరూపేణ చతుర్విధభూత-నికాయానాం బ్రహ్మాదిస్తమ్భ-పర్యన్తానాం అన్తర్హృదయేషు బహిరపి చాకాశ ఇవ ఉపాధినాఽవ్యవధీయమానో భవానేక ఏవ క్షణలవ-నిమేషావయవోపచిత-సంవత్సరగణేన అపా-మాదాన-విసర్గాభ్యాం ఇమాం లోకయాత్రాం అనువహతి 

యదుహ వావ విబుధర్షభ సవితరదస్తపత్యనుసవనం అహరహః ఆమ్నాయవిధినా ఉపతిష్ఠమానానాం అఖిల-దురిత-వృజినబీజావభర్జన భగవతః సమభిధీమహి తపనమణ్డలమ్ 

య ఇహ వావ స్థిరచరనికరాణాం నిజనికేతనానాం మన-ఇన్ద్రియాసుగణాన్ అనాత్మనః స్వయమాత్మా అన్తర్యామీ ప్రచోదయతి 

య ఏవేమం లోకం అతికరాల-వదనాన్ధకార-సంజ్ఞా-జగరగ్రహ-గిలితం మృతకమివ విచేతనం అవలోక్య అనుకమ్పయా పరమకారుణికః ఈక్షయైవ ఉత్థాప్య అహరహరనుసవనం శ్రేయసి స్వధర్మాఖ్యాత్మావస్థానే ప్రవర్తయతి అవనిపతిరివ అసాధూనాం భయముదీరయన్నటతి 

పరిత ఆశాపాలైః తత్ర తత్ర కమలకోశాఞ్జలిభిః ఉపహృతార్హణః 

అథహ భగవన్ తవ చరణనలినయుగలం త్రిభువనగురుభిర్వన్దితం అహం అయాతయామయజుఃకామః ఉపసరామీతి ఏవం స్తుతః స భగవాన్ వాజిరూపధరో హరిః యజూంష్యయాతయామాని మునయేఽదాత్ ప్రసాదితః 

ఇతి శ్రీమద్భాగవతే ద్వాదశస్కన్ధే


 శ్రీసూర్యస్తోత్రం సమ్పూర్ణమ్ 


శుభ సూర్యోదయం

Thursday, December 10, 2020

అష్టగణేశావతారాలు

 


1.వక్రతుండావతారం :

'మత్సరా'సురుని సంహరించినది ఈ అవతారం. సింహ వాహనంపై ఉండే గణపతి ఇతడు. జీవుల 'శరీరతత్వం'లోని దివ్యత్వం ఈ గణేశ రూపం. 'దేహబ్రహ్మధారకుడు' అని పురాణం పేర్కొంది. 

2. ఏకదంతావతారం:

'మదా'సురిని పరిమార్చిన ఈ గణపతి మూషికవాహనుడు. మనలో 'జీవ' (దేహి) భావంగా వ్యక్తమయ్యే చైతన్యతత్వం ఈ మూర్తి.

3. మహోదరావతారం:

'మోహాసురు'ని నశింపజేసిన ఈ వినాయకుడు మూషిక వాహనుడు. 'జ్ఞాన'చైతన్యానికి అధిపతి.

4. గజాననావతారం:

సాంఖ్య (పరబ్రహ్మ) తత్వానికి అధిష్ఠానదేవతగా కొలిచే ఈ స్వామి జ్ఞానప్రదాత. 'లోభా'సురుని సంహరించిన ఈ గణపతీ మూషికవాహనుడే. 

5. లంబోదరావతారం:

'క్రోధాసురుని మర్దించిన అవతారం. 'శక్తి' బ్రహ్మగా ఈయనను పురాణం కీర్తించింది. 'దేవీతత్వ' స్వరూపం- గణపతి అని పురాణ భావం.

6. వికటావతారం:

'కామా'సురుని సంహరించిన స్వరూపమిది. మయూర వాహనంపై ఉన్న స్వామి ఇతడు. 'సూర్యబ్రహ్మ'గా పూజలందుకుంటున్నాడు.

7. విఘ్నరాజావతారం:

ఆదిశేషుని వాహనంగా స్వీకరించిన గణేశమూర్తి ఇది. 'మమతా'సురుని సంహరించిన ఈ స్వరూపాన్ని 'విష్ణుబ్రహ్మ'గా విష్ణుతత్వంగా చెబుతారు. 

8. ధూమ్రవర్ణావతారం:

'అభిమానాసురు'ని సంహరించిన ఈ అవతారం

Wednesday, December 9, 2020

దానం..

ఏదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాల కోసం ఇవ్వడం. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ, వస్తు సహాయమును కానీ.. ‘ధర్మం’ అంటారు. ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది🙏

‘ధర్మం’ చెయ్యడానికి పరిథులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. కానీ, ‘దానం’ చెయ్యడానికి కొన్ని పరిథులు ఉన్నాయి. ఏదిపడితే 

అది దానం చెయ్యడానికి వీలులేదు. అలాచేయడానికి మీరు సిద్ధంగాఉన్నా., తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు. శాస్త్రనియమానుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటినే దానం చెయ్యాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు. ఇవి మొత్తం పది దానాలు.🙏

🙏గో భూ తిల హిరణ్య ఆజ్య వాసౌ ధాన్య గుడానిచ రౌప్యం లవణ మిత్యాహుర్దశదానాః ప్రకీర్తితాః🙏

🙏దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవునెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు...ఈ పదింటిని దశ ధానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మరి, ఏ ఏ దానంవల్ల ఏ ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాం..🙏


🙏గోదానం..🙏

🙏గోవు అంగములందు పదునాలుగు లోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి వయసులోనున్నది, దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతోపాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావథిగి దానం చెయ్యాలి. గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు.🙏


🙏భూదానం..🙏

🙏కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా భూమి శూన్యంలోకి దొర్లిపోతూంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రము, సమస్త సస్యసమృద్ధము అయిన భూమిని దానం చేయుటచేత అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై, దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.🙏


🙏తిలదానం..🙏

🙏తిలలు అంటే నువ్వులు. శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చెయ్యడంవలన సమస్త పాపములు నశిస్తాయి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై., దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు🙏


🙏హిరణ్య(సువర్ణ)దానం..🙏

🙏హిరణ్యము అంటే బంగారం. బ్రహ్మదేవుని గర్భం నుండి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వలన, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై., దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.🙏


🙏ఆజ్య(నెయ్యి)దానం..🙏

🙏ఆజ్యము అంటే ఆవునెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాలనుండి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అట్టి ఆజ్యాన్ని దానం చేయడం వలన సకల యఙ్ఞఫలం లభిస్తుంది. ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై., దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు🙏

🙏వస్త్రదానం..🙏

🙏శీతోష్ణములనుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలం అలంకారినికే కాకుండా, మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన, సర్వ దేవతలు సంతోషించి, సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.🙏


🙏ధాన్యదానం..🙏

🙏జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యము. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణము. అట్టి ధాన్యాన్ని  దానం చేయుట వలన, సకల దిక్పాలకులు సంతృప్తిచెంది, దాతకు ఇహలోకమందు సకలసౌఖ్యము అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.🙏


🙏గుడ(బెల్లం)దానం..🙏

🙏రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుండి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంప్రీతులై., దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.🙏


🙏రజత(వెండి)దానం..🙏

🙏అగ్నిదేవుని కన్నీటి నుండి ఉత్పన్నమైనది వెండి. ఈ వెండి దానంతో శివ, కేశవులు., పితృదేవతలు సంప్రీతులై., దాతకు సర్వసంపదలను, వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు.🙏


🙏లవణ(ఉప్పు)దానం..🙏

🙏రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై., దాతకు ఆయుర్దాయమును, బలాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు..🙏


🙏ఇతర దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు..🙏


1. బియ్యాన్ని దానం చేస్తే.........పాపాలు తొలగుతాయి.


2. వెండిని దానం చేస్తే........... మనశ్శాంతి కలుగుతుంది.


3. బంగారుని దానం చేస్తే.........దోషాలు తొలగుతాయి.


4.పండ్లను దానంచేస్తే.......... బుద్ధి, సిద్ధి కలుగుతాయి.


5. పెరుగును దానం చేస్తే.......ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.


6. నెయ్యి దానం చేస్తే......రోగాలు పోతాయి..ఆరోగ్యంగా ఉంటారు.


7. పాలు దానం చేస్తే......నిద్రలేమి ఉండదు.


8. తేనెను దానం చేస్తే...... సంతానం కలుగుతుంది.


9.ఉసిరికాయలు దానం చేస్తే.... మతిమరుపు తగ్గి జ్ణాపక శక్తి పెరుగుతుంది.


10. టెంకాయ దానం చేస్తే...... అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.


11. దీపాలు దానం చేస్తే...... కంటిచూపు మెరుగుపడుతుంది.


12.గోదానం చేస్తే......ఋణ విముక్తులౌతారు. ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.


13. భూమిని దానం చేస్తే...... బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది. ఈశ్వరలోక దర్శనం కలుగుతుంది.


14. వస్త్ర దానం చేస్తే...... ఆయుషు పెరుగుతుంది.


15. అన్నదానం చేస్తే...... 

పేదరికం తొలగిపోయి, ధనవృద్ధి కలుగుతుంది.


సర్వేజనా శుఖినోభవంతు.


భారత దేశాన్ని ఎవరూ ఏమీ చేయలేరు..

భారత దేశాన్ని ఎవరూ ఏమీ చేయలేరు , హిందూ ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని అతిఉత్సాహ పడేవారు ఈ వీడియో చూడండి

1.ఆఫ్ఘనిస్తాన్ :  గాంధార రాజ్యంగా ఒకప్పుడు పిలవబడేది... ఇప్పుడు అక్కడ హిందువులు లేరు , దేవలయాలు లేవు.ఇప్పుడు అది ఇస్లామిక్ దేశం.

2.పాకిస్థాన్ : సింధుదేశంగా పిలవబడేది.ఇప్పుడు అది ఇస్లాం మరియు భారత శత్రుదేశం.తీవ్రవాదులను తయారుచేసే కర్మాగారం

3.బంగ్లాదేశ్ : ఒకప్పుడు వంగ దేశంగా పిలవబడేది.ఇప్పుడది ఇస్లాం దేశం

4.నేపాల్ : ఇది ఒకప్పుడు దేవ్ ఘర్ పేరుతో మరియు మిథిలా నగరం పిలవబడేది.సీతా దేవి పుట్టిన ప్రదేశం.ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశం.కమ్యూనిస్టుల ప్రభావం చేత అది కూడా సెక్యూలర్ దేశం అయింది.

5.భూటాన్ : ఇప్పుడు ఇది బౌద్ధదేశం

6.టిబెట్ : ఇది ఒకప్పుడు త్రివిష్ఠానపురంగా పిలవబడేది. ఇది చైనా చేత ఆక్రమించబడి, ఇప్పుడు బౌద్ధ దేశంగా ఉంది.

7.మయమ్నార్ : ఇది బ్రహ్మపురం పేరుతో పిలవబడేది.ఇప్పుడు బౌద్ధదేశంగా ఉంది.

8.శ్రీలంక : ఇది త్రేతాయుగంలో రావణ , విభీషణ రాజ్యంగా , ద్వాపర యుగంలో పాండు రాజు జనపథంగా వుండేది. ఇప్పుడు బౌద్ధదేశంగా ఉంది.

9.మలేషియా : మలయ గిరుల పక్కన ఉండే ద్వీపం కావున మలేషియా గా పిలవబడుతుంది. ఇప్పుడు ముస్లిం దేశంగా ఉంది.

10.సింగపూర్ : ఒకప్పుడు సంహపురిగా పిలవబడేది. ఇప్పుడు బౌద్ధ దేశం.

11.థాయిలాండ్ : ఇది ఒకప్పుడు సామ్ దేశ్ పిలవబడేది.ఇది ఇప్పుడు బౌద్ధ దేశం.

12.కంబోడియా : ఒకప్పుడు కాంభోజ రాజ్యం ఇప్పుడు బౌద్ధదేశంగా ఉంది.ప్రపంచంలో అతి పెద్ద హిందూ దేవాలయం ఇక్కడే ఉంది.

13.వియత్నాం : ఒకప్పుడు ఇది చంపా దేశంగా పిలవబడేది. ఇది ఇప్పుడు బౌద్ధ దేశం.

ఇప్పుడు చెప్పండి...హిందూ ధర్మంను కాపాడుకోవాల్సిన అవసరం ఉందా..?లేదా..?

మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం - రుద్రం !

శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది.

రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. ఇది వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చేది మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వలన దీనిని చమకం అంటారు.

నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ |

నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||


నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతి దినం ఎవరు చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం  ప్రాప్తిస్తుంది.


నమకం విశిష్టత :


నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయుధాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.


అనువాకం – 1:

*****

తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.


అనువాకం – 2 :

******

ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.


అనువాకం – 3:

*****

ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారణకు కూడా చదువుతారు.


అనువాకం – 4:

*****

ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:


అనువాకం – 5:

*****

ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా – సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.


అనువాకం – 6:

******

ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.

ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు.


అనువాకం – 7:

******

నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.


అనువాకం – 8:

*****

ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.


అనువాకం –9:

*****

ఈ అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ శక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.


అనువాకం – 10:

*****

ఈ అనువాకంలో మరలా రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, పినాకధారియైన, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.


అనువాకం – 11:

******

ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్థ దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.

చమకం విశిష్టత:

*******

నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు

అంతులేని ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే..

రుద్రాభిషేకం

శివ.. శివ అంటే చాలు మంగళం, శుభం, సర్వకార్యజయం, సర్వపాపహరం అని వేదార్థాలు. మహాదేవున్ని శివుడని పరమశివుడని పలు పేర్లతో పిలుస్తారు. పండితుడు నుంచి పామరుడు వరకు, మహా చక్రవర్తి నుంచి కటిక పేదవాడి వరకు మనఃపూర్వకంగా ఒక్కసారి శివ అంటే చాలు కోరిన కోర్కిలు తీర్చే భోళాశంకరుడు ఆయన. శివున్ని అభిషేక ప్రియుడు అంటారు. శివునికి నిత్యం అభిషేకం చేస్తే చాలు అన్ని ఉన్నట్లే. శివలింగం చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. దేశం శాంతిగా ఉంటుందని వేదోక్తి. అయితే శివుడికి అభిషేకాలు చేస్తుంటాం....

అభిషేకాలు ఎన్నిరకాలు ఏ విధంగా శివాభిషేకాలు చేస్తారో తెలుసుకుందాం…..

శివాభిషేకాలు మంత్రపూర్వకంగా అంటే రుద్రభిషేకాలుగా వర్ణిస్తారు. అదేవిధంగా చేసే ద్రవ్యాలను బట్టి అభిషేకాలకు పేర్లు ఉన్నాయి. 

కానీ శాస్త్రం ప్రకారం రుద్రాభిషేకాలు రకాలనే పరిగణనలోకి తీసుకుంటాం. పదార్థాలు మన కామ్యాలు అంటే కోరికలు తీరడానికి ఆయా పదార్థాలతో, పుష్పాలతో చేస్తాం.

రుద్రాభిషేకాలు 8 విధములు అవి....

రుద్రం అంటే నమకాలు -11, చమకాలు-11 అనువాకాలుగా (సింపుల్‌గా చెప్పాలంటే 11 స్టాన్జాలు అని ఇంగ్లిష్ మీడియం వారికి) సాధారణంగా రుద్రాభిషేకం అంటే 11 నమకాలను, 11/1 చమకాన్ని చెప్పితే ఒక అభిషేకంగా ఇంట్లో నిత్యం చేసుకునేవారు చేసే పద్ధతి. 

ఇక అసలు అభిషేక సంప్రదాయ పరిశీలిస్తే…

1. వారాభిషేకం- నమకం 11 అనువాకాలను చెప్పి చమకంలో ఒక్కొక్క అనువాకం చొప్పున చెప్పవలెను. ఆ విధంగా నమకం 11 సార్లు (11X11) చెప్పిన, చమకం 11 అనువాకాలకు పూర్తగును. (నమకం 11సార్లు, చమకం 1 సారి) దీన్ని వారాభిషేకం అంటారు.

2. ఆవృత్తి – నమకం 121 సార్లు, చమకం 11 సార్లు చెప్పితే ఆవృత్తి అంటారు.

3. రుద్రం- నమకం 121 సార్లు, చమకం – 11 సార్లు

4. ఏకాదశ రుద్రం- నమకం 14,641 సార్లు, చమకం-1331 సార్లు

5. శతరుద్రం- నమకం 1,61,051 సార్లు,చమకం 14,641 సార్లు

6. లఘురుద్రం- నమకం 17,71,561 సార్లు, చమకం- 1,61,051 సార్లు

7. మహారుద్రం- నమకం 1,94,87,171 సార్లు, చమకం- 17,71,561 సార్లు

8. అతిరుద్రం- నమకం 21,43,58,881 సార్లు, చమకం -1,94,87,171 సార్లు

ఇలా 8 రకాలుగా రుద్రాభిషేకాలను చేస్తారు.

ఓం నమః శివాయ🙏

Tuesday, December 8, 2020

Gotra Vs Gene

Do you know why every time you sit in a puja the priest asks you for you Gotra ?_❓

Science behind Gotra (GENETICS) is nothing but what is today popularly known as GENE ~ MAPPING

What is Gotra system ?

Why do we have this system ? Why do we consider this to be so important to decide  marriages ?

Why should sons carry the gotra of father, why not daughter ?

How/why does gotra of a daughter change after she gets married ? What is the logic ?

Infact this is an amazing genetic science we follow.Let's see the SCIENCE of GENETICS behind our great GOTRA systems.

The word GOTRA formed from two sanskrit words GAU (means cow) and Trahi (means shed).

Gotra means cowshed.

Gotra is like cowshed protecting a particular male lineage. We identify our male lineage / gotra by considering to be descendants of the 8 great Rishi (Sapta rishi + Bharadwaj rishi). All the other gotra evolved from these only.

Biologically, human body has 23 pairs of chromosomes (one from father and one from mother) on these 23 pairs, there is one pair called sex chromosomes which decides the gender of person.

During conception if the resultant cell is XX chromosomes then the child will be girl, if it is XY then it is boy.

In XY - X is from mother and Y is from father.

In this Y is unique and it doesn't mix. So in XY, Y will supress the X and son will get Y chromosomes. Y is the only chromosome which gets passed down only between male lineage. (Father to Son and to Grandson).

Women never gets Y. Hence Y plays a crucial role in genetics in identifying the genealogy. Since women never get Y the Gotra of the woman is said to be of her husband.

They are 8 different Y chromosomes from 8 Rishis. If we are from Same Gotra then it means we are from same root ancestor.

Marriages between same Gotra will increase the risk of causing genetic disorders as same Gotra Y chromosomes cannot have crossover and it will activate the defective cells.

If this continues, it will reduce the size and strength of Y chromosome which is crucial for the creation of male.

If no Y chromosome is present in this world, then it will cause males to become extinct.

So Gotra system is a method to avoid genetic disorders and attempt to protect Y chromosome.

Amazing bio-science by our Maharishis. Our Heritage is unarguably THE GREATEST.

Our Rishis had the "GENE MAPPING" sorted out thousands of years ago...

Monday, December 7, 2020

తీక్షణదంష్ట్ర కాలభైరవ అష్టకం (మహా కాల భైరవాష్టకం)

అవమానాలు అపనిందల తో బాధలతో నలిగి పోతున్నప్పు డు, జీవనం సమస్యలుగా సాగుతున్నప్పుడు, అగమ్య మార్గాలలో అశాంతి వచ్చిన ప్పుడు, అనవసర భయాలు మిమ్మల్ని చుట్టిముట్టి నప్పు డు ఈ తీక్షణదంష్ట్ర కాలభైర వాష్టకం నిత్యపఠనం సర్వరక్షా కరమై, సర్వ దోషాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

ఓం యంయంయం యక్షరూపం దశదిశివిదితం భూమికం పాయమానం

సంసంసం సంహారమూర్తిం శిరముకుటజటా శేఖరం చంద్రబింబం ।

దందందం దీర్ఘకాయం విక్రితనఖ ముఖం చోర్ధ్వరోమం కరాలం

పంపంపం పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్

గోవు-గోపూజ

గోవు పాదాల యందు - పితృదేవతలు ఉంటారు. 

కాళ్ళ యందు - సమస్త పర్వతములు ఉంటాయి.

భ్రూమధ్యమున - గంధర్వులు ఉంటారు.

గోవు దంతముల యందు - గణపతి ఉంటాడు.

ముక్కున - శివుడు ఉంటాడు.

ముఖమున - జ్యేష్ఠాదేవి ఉంటుంది.

కళ్ళయందు - సూర్యుడు ఉంటాడు.

గోవు చెవుల యందు - శంఖు చక్రములు ఉంటాయి.

కంఠమునందు - విష్ణుమూర్తి ఉంటాడు.

భుజమున - సరస్వతి ఉంటుంది.

రొమ్మున - నవ గ్రహములు కొలువై ఉంటాయి.

వెన్నులో - వరుణ దేవుడు , అగ్ని దేవుడు ఉంటారు.

తోక యందు - చంద్రుడు ఉంటాడు.

చర్మమున - ప్రజాపతి ఉంటారు.

గోవు రోమాల్లో- త్రిలోకాల్లోఉన్న దేవతలు ఉంటారు.

అందుకే గోవుని ఎక్కడా కొట్టకూడదు, గోపూజ చేసుకుంటే పాపాలు పోతాయి అని పురాణాల్లో కూడా తెలిపారు.. ఏ సమయంలో అయినా గోవులకు తృప్తిగా ఆహారము పెడితే సమస్త దేవతలకు ఆహారము పెట్టినంత పుణ్యఫలము కలుగుతుంది

నవగ్రహాల అనుకూల స్తితి

గ్రహాలు అనుకూలించాలి అంటే పరిహార ప్రక్రియలు చేసుకోలేని వారికి ఈ విధంగా చేస్తే గ్రహాలు కొంత వరకు  అనుకూలిస్తాయి. 

రవిచంద్రులు అనుకూలించాలి అంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి. తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి.

గురు బలం కావాలంటే ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి. లేకుంటే రోజు పసుపును పాలతో కలిపి నుదుటన బొట్టు పెట్టుకోవాలి. ఆడవారు అయితే ముఖానికి పసుపు రాసుకోవాలి.

శుక్ర గ్రహం అనుకూలించాలి అంటే ఇంటి ఆడ పిల్లలను గౌరవించాలి. ఆదరించాలి అలా చేస్తే శుక్ర గ్రహము వందకు రెండు వందల శాతం అనుగ్రహం ఇస్తుంది. ఒకవేళ ఇంటిలో ఆడపిల్లలు లేకుంటే మేనత్తను గౌరవించాలి. అత్త కూడా లేకుంటే కన్నతల్లిని గౌరవించాలి. కన్నతల్లి కి శుక్రవారం రోజు తాంబూలం ఇచ్చి పాద నమస్కారం చేసుకోవాలి. 

కుజుడు అనుభవించాలంటే సోదర వర్గాన్ని ఆదరించాలి. సోదరి బాగా చూసుకోవాలి. కార్తీకమాసం వచ్చిన భగినీహస్తభోజనం శుద్ధ విదియ నాడు వస్తుంది. ఆడపిల్ల ఇంటికి వెళ్ళి  భోజనం చేసి బట్టలు పెట్టి  రావాలి.  

శని భగవానుడు  అనుకూలించాలి అంటే ఇంట్లో పని మనుషుల పై చికాకు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పనిచేసే వారికి తగినంత జీతం ఇవ్వాలి. ఇంట్లో పని వారు లేకుంటే బీద సాద లను వికలాంగులను ఆదరించాలి. 

బుధుడు అనుగ్రహించాలంటే మేనమామను ఆదరించాల బాగా చూసుకోవాలి. యోగక్షేమములు బాగా చూసుకోవాలి. 

ఓం నమో నారాయణాయ నమః

పూరీలో జగన్నాథునికి నివేదించే నైవేద్యాలు ఇవే

పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అని కూడా అంటారు. ఇక్కడ వెలసిన జగన్నాథుడిని నీలమాధవుడి ఆరాధిస్తారు. స్వామి వారికి 56 నుండి 64 రకాల పిండి వంటలను నివేదిస్తారు. ఇక్కడ వంటను సాక్షాత్‌ మహాలక్ష్మీదేవి అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తుంటుందట, అందుకే అన్న ప్రసాదాలు అంత రుచికరంగా ఉంటాయని అక్కడి వారి విశ్వాసం. గంగ, యమున బావుల్లోని నీటిని ప్రసాదాల తయారీకి వాడతారు. జగన్నాథునికి ఛప్పన్న (56) ప్రసాదాలను, రోజుకు ఆరుసార్లు నివేదిస్తారు. పూరీలో జగన్నాథ స్వామికి నివేదించే ఛప్పన్న బోగాలేమిటి వాటి తయారీకి ఉపయోగించే పదార్థాలు:

1. అన్నం

2. కనికా (బియ్యం, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు)

3. దొహి పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు)

4. ఒద్దా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు)

5. తీపి కిచిడీ (బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు)

6. నేతి అన్నం 7. కిచిడీ

8. మిఠా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు)

9. ఒరియా పొఖాళొ (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు)

10. కాజా 

11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి)

12. లడ్డు 

13. మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు)

14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు)

15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి)

16. ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు)

17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు)

18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు)

19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)

20. లుణి ఖురుమా (గొధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు)

21. సువార్‌ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)

22. చొడెయి లొడా (గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు)

23. ఝిలి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)

24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)

25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)

26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)

27. పూరీ 28. లుచి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)

29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు)

30. దొహిబొరా (పెరుగు గారెలు)

31. అరిసె 32. త్రిపురి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)

33. రొసాపాయిక (గోధుమలతో చేస్తారు) 34. ఖిరి (పాయసం)

35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు)

36. కోవా 37. రొసాబొళి (పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు)

38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు)

39. ఛెనాఖాయి (తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు)

40. బపుడి ఖొజా (పాలమీగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు)

41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)

42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి)

43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు) 

44. ముగొడల్లి (పెసరపప్పు వంటకం) 

45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు) 

46. ఉరద్‌ డల్లి (మినప్పప్పు వంటకం)

47. దాల్మా (కందిపప్పు, కాయగూరలు కలిపి చేసే వంటకం)

48. మవుర్‌ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం)

49. బేసొరొ (కలగూర వంటకం) 50. సగొ (తోటకూర వంటకం)

51. పొటొలొ రొసా (పొటల్స్‌/పర్వల్‌ కూర)

52. గొటి బైగొణొ (గుత్తివంకాయ కూర)

53. ఖొటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం)

54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు)

55. పిఠా (గోధుమపిండితో చేసే తీపిరొట్టె)

56. బైగని (వంకాయలతో చేసే వంటకం)

Saturday, December 5, 2020

ముస్లింలు మరియు బ్రిటిష్ వారి బానిసత్వం నుండి స్వేచ్ఛ

బానిస రాజవంశం

 1 = 1193 ముహమ్మద్ ఘోరి

 2 = 1206 కుతుబుద్దీన్ ఐబాక్

 3 = 1210 అరామ్ షా

 4 = 1211 ఇల్టుట్మిష్

 5 = 1236 రుక్నుద్దీన్ ఫిరోజ్ షా

 6 = 1236 రజియా సుల్తాన్

 7 = 1240 ముయిజుద్దీన్ బహ్రమ్ షా

 8 = 1242 అల్లావుద్దీన్ మసూద్ షా

 9 = 1246 నాసిరుద్దీన్ మెహమూద్

 10 = 1266 గియాసుడిన్ బల్బన్

 11 = 1286 కై ఖుష్రో

 12 = 1287 ముయిజుద్దీన్ కైకుబాద్

 13 = 1290 షాముద్దీన్ కామర్స్

 1290 బానిస రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 97 సం.)

ఖిల్జీ రాజవంశం

 1 = 1290 జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ

 2 = 1296 అల్లాదీన్ ఖిల్జీ

 4 = 1316 సహబుద్దీన్ ఒమర్ షా

 5 = 1316 కుతుబుద్దీన్ ముబారక్ షా

 6 = 1320 నాసిరుదిన్ ఖుస్రో షా

 7 = 1320 ఖిల్జీ రాజవంశం ముగిసింది

 (ప్రభుత్వ కాలం - సుమారు 30 సం.)

తుగ్లక్ రాజవంశం

 1 = 1320 గయాసుద్దీన్ తుగ్లక్ I.

 2 = 1325 ముహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ

 3 = 1351 ఫిరోజ్ షా తుగ్లక్

 4 = 1388 గయాసుద్దీన్ తుగ్లక్ రెండవ

 5 = 1389 అబూబకర్ షా

 6 = 1389 ముహమ్మద్ తుగ్లక్ మూడవ

 7 = 1394 సికందర్ షా మొదటి

 8 = 1394 నాసిరుదిన్ షా దుస్రా

 9 = 1395 నస్రత్ షా

 10 = 1399 నాసిరుద్దీన్ మహమ్మద్ షా వెంటాడే రెండవ స్థానంలో ఉన్నారు

 11 = 1413 డోలత్ షా

 1414 తుగ్లక్ రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 94 సం.)

సయ్యిద్ రాజవంశం

 1 = 1414 ఖిజ్ర్ ఖాన్

 2 = 1421 ముయిజుద్దీన్ ముబారక్ షా రెండవ

 3 = 1434 ముహమ్మద్ షా నాల్గవ

 4 = 1445 అల్లావుద్దీన్ ఆలం షా

 1451 సయీద్ రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 37 సం.)

* అలోడి రాజవంశం *

 1 = 1451 బహ్లోల్ లోడి

 2 = 1489 అలెగ్జాండర్ లోడి రెండవది

 3 = 1517 ఇబ్రహీం లోడి

 1526 లోడి రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 75 సం.)

మొఘల్ రాజవంశం

 1 = 1526 జహ్రుదిన్ బాబర్

 2 = 1530 హుమయూన్

 1539 మొఘల్ రాజవంశం సమయం ముగిసింది

సూరి రాజవంశం

 1 = 1539 షేర్ షా సూరి

 2 = 1545 ఇస్లాం షా సూరి

 3 = 1552 మహమూద్ షా సూరి

 4 = 1553 ఇబ్రహీం సూరి

 5 = 1554 ఫిరుజ్ షా సూరి

 6 = 1554 ముబారక్ ఖాన్ సూరి

 7 = 1555 అలెగ్జాండర్ సూరి

 సూరి రాజవంశం ముగుస్తుంది, (పాలన -16 సంవత్సరాలు సుమారు)

మొఘల్ రాజవంశం పున ప్రారంభించబడింది

 1 = 1555 హుమాయు మళ్ళీ గడ్డిపై

 2 = 1556 జలాలుద్దీన్ అక్బర్

 3 = 1605 జహంగీర్ సలీం

 4 = 1628 షాజహాన్

 5 = 1659 u రంగజేబు

 6 = 1707 షా ఆలం మొదట

 7 = 1712 జహదర్ షా

 8 = 1713 ఫరూఖ్సియార్

 9 = 1719 రైఫుడు రజత్

 10 = 1719 రైఫుడ్ దౌలా

 11 = 1719 నెకుషియార్

 12 = 1719 మహమూద్ షా

 13 = 1748 అహ్మద్ షా

 14 = 1754 అలమ్‌గీర్

 15 = 1759 షా ఆలం

 16 = 1806 అక్బర్ షా

 17 = 1837 బహదూర్ షా జాఫర్

 1857 మొఘల్ రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 315 సంవత్సరాలు.)

 బ్రిటిష్ రాజ్ (వైస్రాయ్)

 1 = 1858 లార్డ్ క్యానింగ్

 2 = 1862 లార్డ్ జేమ్స్ బ్రూస్ ఎల్గిన్

 3 = 1864 లార్డ్ జాహోన్ లోరెన్ష్

 4 = 1869 లార్డ్ రిచర్డ్ మాయో

 5 = 1872 లార్డ్ నార్త్‌బుక్

 6 = 1876 లార్డ్ ఎడ్వర్డ్ లాటెన్లార్డ్

 7 = 1880 లార్డ్ జార్జ్ రిపోన్

 8 = 1884 లార్డ్ డఫెరిన్

 9 = 1888 లార్డ్ హన్నీ లాన్స్‌డన్

 10 = 1894 లార్డ్ విక్టర్ బ్రూస్ ఎల్గిన్

 11 = 1899 లార్డ్ జార్జ్ కర్జన్

 12 = 1905 లార్డ్ టివి గిల్బర్ట్ మింటో

 13 = 1910 లార్డ్ చార్లెస్ హార్డింగ్

 14 = 1916 లార్డ్ ఫ్రెడరిక్ సెల్మ్స్ఫోర్డ్

 15 = 1921 లార్డ్ రూక్స్ ఐజాక్ రైడింగ్

 16 = 1926 లార్డ్ ఎడ్వర్డ్ ఇర్విన్

 17 = 1931 లార్డ్ ఫ్రీమాన్ వెల్లింగ్డన్

 18 = 1936 లార్డ్ అలెగ్జాండర్ లిన్లిత్గో

 19 = 1943 లార్డ్ ఆర్కిబాల్డ్ వేవెల్

 20 = 1947 లార్డ్ మౌంట్ బాటన్

బ్రిటిషర్స్ పాలన సుమారు 90 సంవత్సరాలు ముగిసింది.

 * ఆజాద్ ఇండియా, ప్రధాని *

 1 = 1947 జవహర్‌లాల్ నెహ్రూ

 2 = 1964 గుల్జారిలాల్ నందా

 3 = 1964 లాల్ బహదూర్ శాస్త్రి

 4 = 1966 గుల్జారిలాల్ నందా

 5 = 1966 ఇందిరా గాంధీ

 6 = 1977 మొరార్జీ దేశాయ్

 7 = 1979 చరణ్ సింగ్

 8 = 1980 ఇందిరా గాంధీ

 9 = 1984 రాజీవ్ గాంధీ

 10 = 1989 విశ్వనాథ్ ప్రతాప్సింగ్

 11 = 1990 చంద్రశేఖర్

 12 = 1991 పివి నరసింహారావు

 13 = అటల్ బిహారీ వాజ్‌పేయి

 14 = 1996 H.D. దేవేగౌడ

 15 = 1997 ఐకె గుజ్రాల్

 16 = 1998 అటల్ బిహారీ వాజ్‌పేయి

 17 = 2004 డాక్టర్ మన్మోహన్ సింగ్

* 18 = 2014 నుండి నరేంద్ర మోడీ *

764 సంవత్సరాల తరువాత, ముస్లింలు మరియు బ్రిటిష్ వారి బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందబడింది.  ఇది హిందువుల దేశం.  ఇక్కడ మెజారిటీ ఉన్నప్పటికీ, హిందువులు తమ దేశ బానిసలుగా మారుతున్నారు, నేడు ప్రజలు చెబుతున్నారు.  హిందువులు మతతత్వమయ్యారు 

ఈ ముఖ్యమైన సమాచారాన్ని యువకులందరి దృష్టిలో వీలైనన్ని సమూహాలలో పంపండి....

మనం 1000 సంవత్సరాలు కొన్ని కోట్ల మంది పోరాటం ఫలితంగా ఈ దేశం ఇంకా హిందూ దేశంగా మనుగడలో ఉన్నది.

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...