Wednesday, January 24, 2018

రథసప్తమి రోజున చదవాల్సిన మంత్రము ...



రథసప్తమి విశిష్టత:

రథసప్తమి:

సకల చరాచర జగత్తుకు వెలుగులు ప్రసాదిస్తాడు సూర్యభగవానుడు. మాఘశుద్ధ సప్తమి నాడు అదితి, కశ్యపులకు సూర్యుడు జన్మించాడు. ఆ రోజునే సప్తాశ్వా రథారూఢుడై ప్రపంచానికి దర్శనమివ్వడంతో రథసప్తమిగా వేడుకలను జరుపుకొంటాం. రథంలోని భాగాలు సమయాన్ని, రుతువులను పేర్కొంటాయి. ఉత్తరదిశవైపు సూర్యుడి ప్రయాణం ప్రారంభమవుతుంది. దైవారాధనలో సూర్యుని ఆరాధనకు విశిష్టమైన స్థానముంది. ప్రత్యక్షంగా సూర్యుడు దర్శనమిస్తాడు. సూర్యుని వెలుగులు లేని ప్రపంచం చీకటితో భీతావహంగా ఉంటుంది. వ్యవసాయానికి, మానవులకు, జంతువులకు, ఇతర జీవజాలానికి సూర్యుని కిరణాలే ఆధారం. సూర్యురశ్మి లేని ప్రపంచాన్ని తలచుకుంటే భయంతో వణికిపోతాం. సూర్యనమస్కారాలు చేయడం ఆరోగ్యరీత్యా కూడా మంచిదని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయాన్ని అగస్త్యమహర్షి అనుగ్రహం చేత పొంది రావణ సంహారం చేసినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. మహాభారతంలో మహాబలుడిగా పేరొందిన కర్ణుడు సూర్యానుగ్రహం చేత కుంతికి జన్మించాడు. మణులలో విశిష్టమైన శమంతకమణిని సత్రాజిత్తు సూర్యుని ఆరాధనతో పొందాడు. వైవస్వత మన్వంతరంలో మొదటి తిథి రథసప్తమి.

నర్మదా జయంతి 

నర్మదా నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మధ్యప్రదేశ్- ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో ఉన్నఅమరకంటక్ లో  ఆవిర్భవిస్తున్నది. మాఘ శుద్ధ సప్తమి రోజున నర్మద భూతలమున కాలిడినట్లు ఐతిహ్యం. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో నర్మదా జయంతికు హెచ్చు ప్రాశస్త్యం ఉన్నది

గంగాదేవి నర్మదా స్నానం: లక్షలాది మంది భక్తులు తమ పాపాలను తొలగించుకోవడానికై గంగానదిలో మునుగుతారు. అయితే వారి పాపాలు మూటగట్టుకొన్న గంగ నర్మదానదిలో స్నానమాచరించి పునీతురాలవుతుందని ఐతిహ్యం


No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...