Wednesday, January 31, 2018

🌝 చంద్ర గ్రహణం - వివరాలు 🌝

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

⭕👉 చంద్ర గ్రహణం ఎప్పుడు కలదు ?

  మాఘ శుధ్ధ పౌర్ణమి అనగా తేది : 31 - 01 - 2018 ( as of writing ) , బుధవారము రోజు.

⭕👉 చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుందా ?

మాఘ శుద్ధ పౌర్ణమి అనగా జనవరి 31 , బుధవారమున గల చంద్ర గ్రహణము...గ్రస్తోదితము,ఖగ్రాస చంద్ర గ్రహణము.అనగా సంపూర్ణ చంద్ర గ్రహణం కలదు.ఈ గ్రహణము మన దేశములో కనిపిస్తుంది.కావున ఇట్టి చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుంది.గ్రహణ నియమాలను తప్పక ఆచరించాలి.

⭕👉 గ్రహణ సమయ వివరాలు :-

గ్రహణ స్పర్శ కాలము   — సాయంత్రం 05 : 18 ని॥లకు
గ్రహణ మధ్య కాలము — రాత్రి            07 : 00 గం॥లు
గ్రహణ మోక్ష కాలము   — రాత్రి            08 : 42 ని॥లకు

అంటే చంద్ర గ్రహణము సాయంత్రం 05 : 18 ని॥లకు ప్రారంభమయ్యి , రాత్రి 08 : 42 ని॥లకు ముగుస్తుంది.

ఇట్టి చంద్ర గ్రహణ పుణ్య కాలము మొత్తం 03 : 24 ని॥లు కలదు.

⭕👉 గ్రహణ నియమాలు ఏ సమయం నుండి పాటించాలి ?

గ్రహణ స్పర్శ కాలమునకు 9 గంటల ముందు నుండి గ్రహణ ప్రభావము ప్రారంభమవుతుంది.గ్రహణ స్పర్శ కాలం సాయంత్రం 05 : 18 ని॥లకు ప్రారంభమవుతుంది.దీనికి 9 గంటల ముందు అంటే ఉదయం 08 : 18 ని॥ల నుండి గ్రహణ నియమాలను పాటించాలి.

వృద్ధులు , పిల్లలు , గర్భిణీ స్త్రీలు మరియు వ్యాధి గ్రస్థులు.... గ్రహణ స్పర్శ కాలానికి 6 గంటల ముందు అనగా మధ్యాహ్నం 12 : 18 ని॥ల నుండి గ్రహణ నియమాలను పాటించాలి.

వయస్సు రీత్యా , వ్యాధి తీవ్రత రీత్యా వృద్ధులు , ఆరోగ్య రీత్యా గర్భిణీ స్త్రీలు అన్ని గంటల పాటు గ్రహణ నియమాలను పాటించలేని, గత్యంతరము లేని స్థితి ఉన్నప్పుడు మాత్రము గ్రహణ స్పర్శ కాలము నుండి గ్రహణ మోక్ష కాలము వరకైనా గ్రహణ నియమాలను పాటించాలి.

⭕👉 ఇట్టి చంద్ర గ్రహణం...ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలం కలదు ?

వృషభ , కన్యా , తులా , కుంభ రాశుల వారికి          👉🏻 శుభ ఫలం
మిథున , వృశ్చిక , మకర , మీన రాశుల వారికి         👉🏻 మిశ్రమ ఫలం
మేష , కర్కాటక , సింహ , ధనుస్సు రాశుల వారికి    👉🏻 అశుభ ఫలం సూచిస్తున్నది.

⭕👉 గ్రహణాన్ని ఎవరు వీక్షించకూడదు ?

మేష , కర్కాటక , సింహ , ధనుస్సు రాశి వారు  మరియు గర్భవతులు గ్రహణాన్ని వీక్షించకూడదు.

చంద్ర గ్రహణం పుష్యమి నక్షత్రంలో ప్రారంభమై ఆశ్లేషా నక్షత్రములో ముగుస్తున్నందున పుష్యమి నక్షత్రము మరియు ఆశ్లేషా నక్షత్రములను జన్మ నక్షత్రములుగా కలిగిన వారు కూడా ఇట్టి చంద్ర గ్రహణాన్ని వీక్షించకూడదు.

⭕👉 గ్రహణ దోష నివారణకు ఎవరు , ఏ దానాలు చేయాలి ?

గ్రహణ మిశ్రమ ఫలం గలవారు అనగా మిథున , వృశ్చిక , మకర , మీన రాశుల వారు , గ్రహణ అశుభ ఫలం కలిగిన వారు అనగా మేష , కర్కాటక , సింహ , ధనుస్సు రాశుల వారు మరియు పుష్యమి , ఆశ్లేషా నక్షత్రం కలిగిన వారు ఒక నూతన కాంస్య పాత్రలో నిండుగా ఆవు నెయ్యి వేసి అందులో వెండితో తయారు చేసిన చంద్రుని ప్రతిమ మరియు నాగ విగ్రహము వేసి పూజించి గ్రహణ మోక్ష కాలం తర్వాత గ్రహణ స్నానమాచరించి సద్భ్రాహ్మణుడికి దక్షిణా సమేతంగా సంకల్పయుక్తంగా దానము ఇవ్వ వలెను.

అపాత్ర దానం శూన్య ఫలాన్నిస్తుంది.కావున మీ మీ ప్రాంతాలలో ఉన్న సదాచార సంపన్నులు , నిష్ఠా గరిష్ఠులు , నిత్య జపతప హోమ యాగ క్రతువులు , నిత్య దేవతార్చన చేయువారు, వేదాధ్యయనము చేసిన పండితులకు దానము ఈయవలెను.అప్పుడే దాన ఫలితము లభించును.

⭕👉 అందరూ క్రింది చంద్ర గాయత్రిని గ్రహణ సమయములో జపము చేసుకోవచ్చు.

ఓం క్షీర పుత్రాయ విద్మహే , అమృత తత్వాయ ధీమహి
తన్నో చంద్ర ప్రచోదయాత్ .

⭕👉  గ్రహణ సమయంలో నదీ స్నానం చేసి , నదీ తీరములో అనుష్ఠానము చేసుకోవడము సంపూర్ణ ఫల ప్రదము , పుణ్య ప్రదము.

 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...