Wednesday, November 29, 2017

చాగంటి కోటేశ్వర రావు గారి గూర్చి చాలామందికి తెలియని కొన్ని సంగతులు

చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు.  ఆయనకు ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు.  తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు.  వారికి ఆస్తిపాస్తులు లేవు.  నిరుపేద కుటుంబం.  సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు.  పాఠశాల స్థాయినుంచి ఆయన విద్యాబుద్ధులు వికసించాయి.  వేదగ్రణి ఆయన రసన మీద తిష్టవేసుకుని కూర్చున్నది.  ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు. 

ఇక ఆయన ఇవాళ చెప్పే ప్రవచనాల వెనుక ఆయనేదో వేదవేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఆపోసన పట్టారని చాలామంది పొరపడతారు.  ఆయన కృషి పెద్దగా లేదు. అవన్నీ ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించినవి అంటే మనం ఆశ్చర్యపోవాలి.  ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప ఈ జన్మకృషి కాదు.  అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు.  ఎంతచదివినా ధారణాశక్తి అనేది ప్రధానం.  ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది.  ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు.  వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం. 

 ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు.  అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానె  తన సంపాదనతో వివాహాలు చేశారు.  కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు.  తనకంటూ ఈరోజు వరకు బ్యాంకు బాలన్స్ లేదంటే నమ్ముతారా? 

అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు.  ఎన్నడూ పట్టణం దాటి ఎరుగరు.  ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు.  ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి.  అభిమానులు పెరిగారు. 

పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు.  "మీ గురించి ఎంతో విన్నాను.  మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి.  ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం.  ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను.  ఏమైనా అడగండి.  చేసిపెడతాను"  అన్నారు పీవీ. 

చాగంటి వారు నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు.  మీ సహృదయానికి కృతజ్ఞతలు.  నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు. 

ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం రెండు మూడు ధోవతులు, నాలుగు పంచెలు, నాలుగు జతల ఆఫీస్ బట్టలు!! 

 
చాగంటివారిని చూసి ఆయన ఎన్నో ఏళ్ళనుంచి ప్రవచనాలు ఇస్తున్నారని, లక్షలు సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తుంటారు.  ఆయన బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998  లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు.  ఎందుకంటే చాగంటి సోదరులలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది.  ఈ తరంలో ఆ శారదాకృప చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది.  ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు

Monday, November 27, 2017

గోమాత_జననం గురించి ఒక్కసారి చదవండి ...

ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు. ఆ సమయములో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్షప్రజాపతి దానికి ‘సురభి’అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు.

 ఋగ్వేదంలో వేదంలో 4వ కాండలో 12వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది. శ్రీసూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతోపాటు గోసూక్తం కూడా చెప్పబడింది. గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది.

 ఋగ్వేదంలో ఆవును ‘‘అఘణ్య’’ అన్నారు.
సముద్ర మధనము నుండి దేవతల కార్యసిద్ధికై, సాక్షాత్తు సురభి బయల్వెడలినది. సంతోషముగా ఉన్నది, కపిల వర్ణముగలది, పొదుగు బరువు చేత నెమ్మది, నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్పకాంతిగల ఆ ఆవుపై పుష్పములు కురిపించిరి. అపుడు అనేక విధములు వాధ్యములు, తూర్యములు మ్రోగింపబడినవి. లోకములో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం. ఆ సురభి రోమకూపాలనుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతి వృషభాలు.

.‘‘గావః విశ్వస్య మాతరః గవా మాంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ’’

ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది. గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది. అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం.

క్షీర సాగరమధన సమయంలో నంది, శుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్యపురాణం తెలియజేస్తుంది. వీటినే కామధేనువులు అంటారు.
వంద గోవుల చేత కూడివున్న ఆ ధేనువు, సురభిని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చిరి. ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణములోను, బభ్రు వర్ణములోను, శ్యామ వర్ణములోనూ, ఎరుపు రంగు, పింగళ (చిత్ర) వర్ణములోనూ ఉండినవి. - స్కాంద పురాణము.

గోశబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకును, వజ్రాయుధమునకును, దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, భూమికిని, నీళ్ళకును పేరు.
‘‘ధేనునా మస్మి కామధుక్’’ అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు. గోవు లక్ష్మీ స్వరూపం. దీనికి ఒక పురాణ గాధ ఉంది. దేవతలందరూ వచ్చి గోవుతో తల్లీ మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికి భాగం ఇవ్వడం జరిగింది.

సురభి ఒక్కసారి తపస్సునారంభించనది. బ్రహ్మ దేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు. సురభికి అమరత్వమును ప్రసాదించారు. త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు. దీనిని స్వర్గ గోలోకమనే పేరుతొ పిలుస్తారు. గోలోకములో సురభి నిత్యమూ నివసిస్తుంది, ఈమె కన్యలు, సుకన్యలు భూలోకములో నివసిస్తారు. ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీ కృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ‘గోప్రేమికుడు’ అని అంతటా ప్రాచుర్యమైనదే!
స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. ప్రతి దినమూ స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడౌతాడు.
గోమయములో లక్ష్మీ దేవి, గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు. గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్ఠము అవుతుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన యెడల ఆ భస్మమే విభూతి యగును.
ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత చేసిన పుణ్యం వస్తుంది.

‘‘ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25వేల మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు. మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితోపాటు కొంత సమయం గడపటంవల్ల, మన శరీరంలో వున్న అనారోగ్యాన్ని, ఆ గోవు ముక్కులోవున్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని, అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడంవల్ల మన వ్యాధి నయం అవుతుంది. గోమాత - కీర్తనం శ్రవణం దానం, ధర్మం, గోరక్షణం, గోరక్షణ ప్రోత్సాహం, గోరక్షణ ప్రోత్సాహక ప్రేరణం… అన్నీ పుణ్యప్రదమైనవే..

       జై గోమాత జైజై గోమాత
 గోమాత పాదాలకు శతకోటి వందనాలు🙏

Sunday, November 26, 2017

Facts about King KarthaviryaArjuna

Source: Quora

Kartavirya Arjuna also known as Sahastra Arjuna was a legendary king of an ancient Haihayas kingdom (Kalchuri Rajputs) with capital at Mahishmati which is on the banks of Narmada River in the current state of Madhya Pradesh. 

Kartavirya was son of Kritavirya, king of the Haihayas. This is his patronymic, by which he is best known; his real name was Kartaviryarjuna. He is described as having a thousand hands and a great devotee of god Dattatreya. Vayu Purana mentions that he ruled for 88,000 years with unbroken health, prosperity, strength, and valour.

As per Mahabharata, KartaViryarjun's father didnt have son for long time. So Kritavirya and his wife Padmini goes to forest and did penance for 10,000 years towards Lord Vishnu. But he doesn't appear before them.

Worried Padmini went to nearby hermitage where Anusuya, a very chaste wife lives. She enquired Anusuya for a ritual to beget a son. As per her request, she advised her to follow Padmini Ekadasi fasting. 

As per her instruction, the couples followed the fasting strictly and atlast they were blessed by Lord Shri Vishnu to beget a powerful son.

The king (Kartavirya Arjuna's father) was very happy to hear this. Naturally he asked for the son he had desired for so long:

'O master of the universe, O killer of the Madhu demon, kindly grant me a son who will never be conquered by demigods, human beings, snakes, demons, or hobgoblins, but whom only You can defeat.' The Supreme Lord immediately replied, 'So be it!' and disappeared.

The king became very pleased with his wife and returned to his palace in her company. Padmini soon became pregnant, and the many armed Kartaviryarjuna appeared as her son.

He was the mightiest person in all the three worlds, and thus even tenheaded Ravana could not defeat him in battle. Except for Lord Narayana, who holds a club, a disc, and other symbols in his hands, no one could overcome him. By the merit that resulted from his mother's strict and faithful observance of Padmini Ekadasi, he could defeat even the dreaded Ravana.

He is described as having a thousand hands and a great devotee of god Dattatreya. As a result of his devotion to Lord Dattatreya he obtained various boons such as 1000 arms, a golden chariot which can carry him across the world wherever he wants to, power of restraining wrong by justice, invincibility by enemies, conquest of world etc.,


The Puranas recount that Kartavirya Arjuna and his army visited a rishi named Jamadagni, who fed his guest and the whole army with offerings from his divine cow Kamadhenu. The king demanded the cow for the betterment of his subjects. Jamadagni refused because he needed the cow for his religious ceremonies. 

King Kartavirya Arjuna sent his soldiers to take the cow. As the conflict developed among the Jamadagni and the King, Kartavirya Arjuna lost his cool and chopped off the head of Jamadagni . 


When Parashurama (Jamadagni's son and one of the Daśāvatāras of Vishnu) returned to the hermitage, he was informed of the context by his mother. In revenge, Parashurama chopped off his 1000 arms and killed him and the entire clan of Kartavirya Arjuna with a battleaxe given to him by Shiva, thus conquering the entire earth, which he gave to Brahmanas. Also he gets back the divine cow with him.

Kartavirya's power is popularly told in the Ramayana. He was the contemporary of Ravana. The story goes that once when Kartavirya Arjuna was having a bath in the River Narmada along with his wives, he stopped the force of the river with his thousand arms from both the sides. Dasagriva (Ravana), who was singing the hymns of Shiva and praying to him, made him lose his concentration. 

Enraged, he challenged the former for a combat. Ravana was defeated and was put to humiliation.Then on request of his paternal grandfather Pulastya the great emperor Kartaviryarjuna released Ravana.

Few more facts
Kartivirya Arjuna was ruling Haihaya Dynasty in Satyayuga (Kritayuga).


6th Chandravanshi King Shahastrajit (eldest son of King Yadu) was founder of Haihaya Dynasty (few parts of present Madhya Pradesha, Maharashtra, Gujarat).


King Yadu had devided his kingdom in two parts.
Krosht became king of Vraja & Mathura. (they called Yadava)
Shahastrajit became king of Haihaya. (they called Haihaya)
Kartivirya Arjuna born 28 generation after King Yadu.


Kartivirya Arjuna was son of King Kritvirya who was contemporary to 32nd generation Ikshvakuvanshi King Sumana (King Sudhanava of Harivansha Purana).


King Sumana was also known by King Vasumaan and King Paajirter.


Kartivirya Arjuna was Great Grand Son of King Kanak/Dhanak who was contemporary of 30th generation Ikshvakuvanshi King Prushadashva (mensioned in Vishnu Puran).


King Prushadashva was son of King Anaranya (who was defeated by Ravan).
King Anaranya was born 5 generation after Chakravarti Samrat (Universal Ruler) Mandhata.


Kartivirya Arjuna had 05 son
(1) Vrushabha
(2) Madhu
(3) Urjeet
(4) Jayadratha
(5) Soorsena


All were killed by God Parashurama.


Talajangha was son of King Jayadratha (son of Kritavirya Arjuna).
Vitihotra was son of King Talajangha.
Madhu was son of King Vitihotra.
Vrushni was son of King Madhu.


Kartivirya Arjuna and his 03 generation (Jayadratha, Talajangha, Vitihotra) were killed by God Parashurama.


Haihaya Dynasty ended  after 07 generation of King Vitihotra by 50th Ikshvakuvanshi King Sagara who was Chakravartin Samrat (Universal Ruler).


King Vitihotra was contemporary of King Rohita (son of Satyavadi King Harischandra).


Shahashtra Bahu Kartivirya Arjuna was contemporary to Following Kings.
(1) King Dushyant (husband of Shakuntala, father of King Bharat)
(2) King Ghadi (father of Rajarshi Vishvamitra)
(3) Tridhanvan (Great Grand Father of King Tri Shanku or King Satyavrata who is father of Satyavadi King Harischandra).


Shahashtrabahu Kartivirya Arjuna was born in 33rd generation of Chandravansha (Lunar Dynasty).


Shahashtra Bahu Kartivirya Arjuna is belongs from Haihaya Dynasty which is one branch of Chandra Vansh (Lunar Dynasty) and it was reigned at both river Narmada (few parts of modern Madhya Pradesh, Maharashtra and Gujarata).


Shahastra Bahu Kartivirya Arjuna had ruled 88,000 years and it's longest in Sanatan Dharma.


No one can ruled too much long as him.


Chandravanshi King Alerka of Kashi had ruled 66,000 years.
Ikshvakuvanshi King Dasaratha of Ayodhya had ruled 60,000 years.


Kartivirya Arjuna did penance and got boon from "God Dattatreya" therefore he had strength of 1000 Hands. (that's why he called " Shahashtra Bahu").


Kartivrya Arjuna was Chakravartin Samrat (Universal Ruler) and he defeated Ravana in war.


Ravana had defeated only by four persons
(1) Kartivirya Arjuna (2) Vali (3) Dasaratha (4) Sri Ram.

Ravana had already defeated all contempory kings of Kartivirya Arjuna.
Ravana defeated King Dushyant (husbund of Shakuntala, father of King Bharat)
Ravana had defeated King Ghadi (father of Rajarshi Vishvamitra)
Ravana had defeated King Anaranya, King Mandhata of Ikshvakuvansh (Suryansh). 
Sri Rama born 58 generation after King Mandhata. 
So, Ravana lived very very long life span.


Kartivirya Arjuna killed Maharshi Jamad Agni (who was father of God Parashurama) therefore Parashurama fought with army of Kartivirya Arjuna.


God Parashurama defeated and killed Kartivirya Arjuna in war.
God Parashurama had killed 03 generation of Kartivirya Arjuna at interval of every 70 years.


Finally, King Vitihotra who was great grand son of Kartivirya Arjuna defeated by God Parashurama(210 years after death of Kartivirya Arjuna) and he went to Maharshi Kashyapa in very injured position.


Maharshi Kashyapa was Guru of God Parashurama. He succeed to convience God Parashurama to stop killing Kshatriya Kings. God Parashurama killed all unjust, unkind, dishonest, cruel and terror kings 21 times at interval of every 10 years.


Haihaya Dynasty was ended by Chakravartin Sammrat Sagar who was 50th generation king of Ikshavaku Vansh (Suryavansh).
King Bhagiratha born 04 generation after King Sagara and he brings River Ganga on earth by penance 10,000 years long therefore Ganga is called "Bhagirathi"


Chakravartin Samrat Raghu born 28 generation after King Sagar.
Raghav, Raghuvir, Raghukul, Raghuvansh words were origine in honour of King Raghu.
King Raghu was last ruler of Satyayuga and then Tretayuga started.
Sri Ram born 03 generation after King Raghu


Kartivirya Arjuna was killed by God Parashurama.

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
:::::::::::::::::::::::::::::::::::: భాగవతం, మహాభారతం    :::::::::::::::::::::::::::::::::::::::
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

1.   మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్.

2.   నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్.

3.   జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్.

4.   మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్


5.   శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా

6.   పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం

7.   మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా

8.   నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్

9.   వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్

10.   నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

11.   వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్

12.   ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్.

13.   సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర.

14.   హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.

15.   మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.

16.   వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర.

17.   కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్.

18.   మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.

19.   ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్.

20.   గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా.

21.   కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).

22.   పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్.

23.   కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్, గుజరాత్.



24.   శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.

25.   హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.

26.   విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర

27.   కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర

28.   చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.

29.   కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.

30.   ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.

31.   కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.


32.   పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.

33.   కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్.

34.   జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.

35.   కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా.

36.   మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.

37.   విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్

38.   శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం.

39.   ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం.

40.   నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.

41.   జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.


42.   కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్.

43.   బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్.

44.   గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.

 ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
::::::::::::::::::::::::::::::::::::::::::::::  రామాయణం :::::::::::::::::::::::::::::::::::::::::::::
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

1.   భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్

2.   కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్

3.   కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).

4.   రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా

5.   పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
6.   సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్

7.   మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్

8.   కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం

9.   దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.

10.   సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.

11.   ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.

12.   తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్

13.   అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్

14.   కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్

15.   గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
16   దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.

17.   చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.

18.   పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.


19.   కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.

20.   శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.

21.   హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.

22.   ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక

23.   విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.

24.   శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు

25.   రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.

26.   అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక

27.   శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక

28.   సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.

29.   వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.

30.   కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.

31.   లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్

32.   తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్

33.   పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్.

Friday, November 24, 2017

'అరుణాచల ప్రదక్షిణమార్గం' పుణ్య చరిత్ర

ఒకప్పుడు పరమేశ్వరుని అంశతో జన్మించిన దూర్వాస మహాముని నిత్యమూ పరమశివుని అర్చించే నిమత్తం ఒక అందమైన పూలవనం పెంచి, చేరువలో కుటీరం నిర్మించుకుని శివధ్యానంలో కాలం గడుపుతుండేవాడు. ఇలావుండగా ఒకనాడు 'కళాధరుడు', 'కాంతిశాలి' అనే యిరువురు గంధర్వులు ఆకాశమార్గాన దేవవిమానంలో వెళుతూ, ఆపూలవనం చూసి, అబ్బురపడి మనసునిలవక కిందకిదిగి అందులో ప్రవేశించారు. కళాధరుడు యిచ్ఛవచ్చినట్లు పూలనుతుంచి వాసన చూస్తూండగా, కాంతిశాలి ఒళ్ళుమరచి పూలమొక్కల్ని తొక్కుతూ వనమంతా తిరగసాగాడు. అలికిడికి కుటీరంనించి బయటకువచ్చిన దూర్వాసుడు జరుగుతున్నది చూసి కోపంపట్టలేక వారిని జంతువులుగా భూమిపై పుట్టమని శాపంపెట్టాడు. తెలియక జరిగిన తప్పిదమనీ, శాపవిమోచన మీయమనీ గంధర్వులు చేసిన అభ్యర్ధనలకు శాంతించిన దూర్వాసుడు, 'అరుణగిరి' ప్రదక్షిణంతో తిరిగి స్వస్వరూపాలు పొందగలరని విమోచనమార్గం అనుగ్రహించాడు.

ఫలితంగా ఒకరు అరుణగిరిని ఆవరించిన అడవులలో అందమైన పునుగుపిల్లి (కస్తూరిమృగం) గాను, మరొకరు పాండ్యదేశపు రాజధాని మదురై పట్టణంలో చక్కనైన గుర్రంగాను జన్మించారు. ఆదేశపు రాజైన వజ్రాంగదపాండ్యుడు ఆగుర్రపు లక్షణాలకు ముచ్చటపడి దానిని తన రాజాశ్వంగా ఎంచుకున్నాడు. రాజైనవాడు వినోదంకోసం, అప్రమత్తత పెంచుకోవడంకోసం ఒంటరిగా అడవులకు వెళ్ళడం రివాజు. అలా ఒకనాడు వజ్రాంగదుడు మదురై పట్టణానికి చాలా దూరంగా దట్టంగాకమ్మిన అరుణగిరి అరణ్యాలలోకి తన రాజఅశ్వాన్ని అధిరోహించి వేటకు వెళ్ళాడు.

అప్పటికి 'అరుణగిరి' నానావిధ వృక్షజాతులతో కప్పబడి వన్యప్రాణులకు తప్ప మానవుల దృష్టికి మరుగైవుండేది. అలాంటిప్రాంతంలో ధీరుడైన వజ్రాంగదుడు వేడుక తీర్చుకోవడానికై అడవిమృగాలకోసం  వెదకసాగాడు. ఎప్పటికో మధ్యాహ్నందాటిపోయి, వేసారి వెనుదిరుగుదామనుకున్నంతలో ఒకపొద కదలికల వెనక మిలమిలమెరిసే కళ్ళతోదాగిన పునుగుపిల్లి అతని కంటబడింది. దానిని ప్రాణాలతో పట్టుకోవాలని ఆశించి, రాజు వల విసిరే వ్యవధిలోనే అపాయాన్ని కనిపెట్టిన ఆపిల్లి, నేర్పుగా తప్పించుకుని కనిపించి కనుమరుగౌతూ గిరిని చుట్టుముట్టి పరుగిడ సాగింది. పట్టువదలని రాజు అశ్వంపై దానిని వెంబడించగా, ప్రదక్షిణం పూర్తికావడంతో శాప విమోచనమై అది తూలిపడి తన శరీరాన్ని విడిచింది. విభ్రాంతుడై రాజు అశ్వంపైనించి దిగడంతో అతని గుర్రంకూడా నిలువునా కూలబడి ప్రాణం వదిలింది. మరుక్షణంలో వాటి శరీరాల్లోంచి వెలుగులీనుతూ యిరువురు గంధర్వులు బయటకురాగా అదేక్షణంలో రత్నాలు పొదిగిన దేవవిమానం వారిని తీసుకుపోయే నిమిత్తం ఆకాశం నించి వచ్చి ఆగింది.

ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న రాజు ఆ దివ్యపురుషులను ఆపి, "సంగతేమిటో వివరించి సందేహ నివృత్తి చేయవలసింద"ని ప్రార్ధించగా వారు తమ శాపవృత్తాంతం అంతా చెప్పి, "రాజా! ఈ కనిపిస్తున్న గిరి ఎంతో మహిమాన్వితమైనది. సాక్షాత్తూ ఆదిదేవుడైన పరమేశ్వరుడే ఈ గిరిరూపంగా వెలసివున్నాడు. భక్తితోతప్ప దీని రహస్యాన్ని తెలుసుకోవడం సాధ్యంకాదు. బ్రహ్మాది దేవతలుసైతం రోజూ ఉదయానే చప్పుడు చేయకుండా వచ్చి దీనిని పూజించి వెళ్తుంటారు. అటువంటిగిరిని ప్రదక్షిణంచేసే భాగ్యం మాకు నీకారణంగా కలిగి శాపవిమోచనమైంది" అని అన్నారు. వెంటనే రాజు అంజలి ఘటించి "మహాత్మ్యమైన ఈగిరిని మీతోపాటే ప్రదక్షిణంచేసిన నాకు ఏఫలితమూ కలగని కారణమేమిటి? తెలుపవలసింది" అని వినయంగా అర్దించగా "రాజా! ఈ గిరిప్రదక్షిణాన్ని వాహనంతోగాని, పాదరక్షలతోగాని చేయరాదు. నీవు అశ్వంపై ఉండిపోయావు. అలాకాక దీనిని మనసులో స్మరిస్తూ సవ్యదిశలో కాలినడకన ప్రదక్షిణం చేసినట్లయితే వారు ఏదికోరితేఅది, చివరికి ఇంద్రపదవినయినా పొందగలరు" అని వివరించి, గంధర్వులు సెలవుతీసుకొని విమానం అధిరోహించి తమలోకాలకు వెళ్ళిపోయారు.

ఈ ఘటన బలంగా నాటుకున్న వజ్రాంగదుడు, ఇంద్ర పదవిని కోరుకుని సకల భోగాలను సౌఖ్యాలను తిరస్కరించి, రాజ్యాన్ని తరువాతివారికి ఒప్పజెప్పి, రోజుకు మూడుసార్లు చొప్పున మూడు సంవత్సరాలపాటు తదేక దీక్షతో గిరికి ప్రదక్షిణాలు చేయగా ఒక ముహూర్తాన అరుణగిరినాధుడు ప్రత్యక్షమై ఏంవరం కావాలో కోరుకొమ్మని అడిగాడు. అప్పటికి ఎన్నోరోజులుగా ఆ జ్ఞానతేజస్సును ప్రదక్షిణాలతో ఆరాధిస్తూ వుండడంవల్ల పక్వచిత్తుడైన రాజుకు ఆశలూ భయాలూ ఎండుమట్టల్లా రాలిపోయి, ఇంద్రపదవికూడా గడ్డిపరకలాతోచి, తనకి అహంకార రహిత శాశ్వత సాయుజ్య మీయవలసిందని వేడి అరుణగిరిలో లీనమైపోయాడు.
***********

నేడు 'అరుణాచల'మని పేరుబడ్డ అరుణగిరిపుణ్యక్షేత్రం తమిళనాడుకు చెందిన తిరువణ్ణామలైలో వుంది. కోరికలీడేర్చే ఈగిరిని దేశ విదేశీయులెందరో అగ్నిలింగంగా భావించి ప్రదక్షిణం చేస్తారు. నేటి ఈ ప్రదక్షిణమార్గపు మొత్తం చుట్టుకొలత 8 మైళ్ళు (సుమారు 14 కి.మీ.). అలనాడు పాండ్యరాజు వజ్రాంగదుడు మూడు సంవత్సరాలపాటు ప్రదక్షిణంగా నడవగా ఏర్పడిన మార్గమిది. ఈదారిలో ఇప్పుడు మనకు కనిపించే దేవాలయాలు, కొలనులు, విశ్రాంతి మంటపాలు మొదలైనవాటిలో కొన్ని ఆకాలంలో అతను నిర్మించినవే. వీటిలో దుర్వాస మహాముని ఆలయంకూడా మనకు కనిపిస్తుంది.
--------------------------------------------------------
ఈ సంవత్సరం కార్తీకదీపోత్సవం ది 02-12-2017న వచ్చినది.

Thursday, November 23, 2017

The beauty of Samskrutam ...

తం భూసుతాముక్తిముదారహాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీః||೧||

శ్రీఃయాదవం భవ్యభతోయ దేవం
సంహారదాముక్తిముతాసుభూతం ||೨||


మొదటి శ్లోకం శ్రీ రాముని స్తుతి .
రెండవ శ్లోకం శ్రీ కృష్ణుని స్తుతి.

అద్భుతం ఏమిటంటే ......

మొదటి శ్లోకాన్ని తిరగేసి చదివితే రెండవ శ్లోకం వస్తుంది .

రెండవ శ్లోకాన్ని తిరగేసి చదివితే మొదటి శ్లోకం వస్తుంది .

Wednesday, November 22, 2017

“లంఖణం పరమౌషధం” అని చెప్పిన మన పూర్వీకులు అనాగరికులా?

నిన్న మొన్నటి వరకు మన పెద్దలు, వైద్యులు చెప్పిన ఉపవాసం గురించి లంఖణం గురించి నేటి వైద్యవిధానం అనుసరించిన ఎందరో వైద్యులు, అభ్యుదయవాదులు ఇదంతా కేవలం అనాగరికం అని, మూర్ఖత్వం అని ఎద్దేవా చేసేవారు. పూర్వం మనకు జ్వరాలు కానీ పెద్ద రుగ్మతలు వచ్చినప్పుడు లంఖణాలు చేయించేవారు. దానివల్ల ఎలాగూ నీరస పడేవారు. అసలది అవసరం లేదని కేవలం అంటిబయోటిక్స్ మాత్రమె మందులని మనకు బాగా తలకేక్కించారు. ఈమధ్య వైద్యంలో ప్రకటించిన నోబెల్ బహుమతి గురించి తెలుసుకుంటే ఒకసారి మనం ఆశ్చర్యపోతాము. జపాన్ సైంటిస్ట్ యోశినోరి ఒహ్సుమి కి ఈ సంవత్సరం నోబెల్ బహుమతి ఆటోఫాగి (AUTOPHAGY) మీద ఆయన చేసిన పరిశోధనకు గాను ఇచ్చారు. ఆటోఫాగి అంటే కణాల రీసైక్లింగ్ పద్ధతి అంటే “స్వయం భక్షం”. ఒక శరీరం ఆహారం తీసుకోకుండా వదిలేసినప్పుడు ఆ శరీరం తన లోపలి కణాలు, ఉపయోగించని ప్రోటీన్లను తిని తన అస్తిత్వం నిలుపుకుంటుంది. ఈ ఆటోఫాగి పద్ధతిని శరీరం కోల్పోతే శరీరం రోగ గ్రస్తం అవుతుంది.

మనకు ఏకాదశి, కార్తీక సోమవారం లాంటి ఎన్నో పద్ధతుల ద్వారా శరీరానికి ఉపవాసం చేయించే పద్ధతి ఉంది. ప్రతీ 15 రోజులకు వచ్చే ఏకాదశి నాడు పూర్తిగా నిరాహారంగా వుండడం అనేది మనవారు ఎప్పటినుండో అనుసరిస్తూ వస్తున్న పద్ధతి. దైవచింతనతో ఉపవాసాలతో ఆరోజును చెయ్యడం మన ఆధ్యాత్మిక పురోగతికి చెప్పిన ఒక పద్ధతి. ఈ పద్ధతి ద్వారా ఆటోఫాగి అన్న ప్రక్రియను మనం ఉపయోగించుకుని తద్వారా శారీరక సౌఖ్యాన్ని పొందుతూ వచ్చారు మన పూర్వీకులు. దీనిద్వారా హానికర కణాలను ప్రక్షాళన చేసుకుని, శారీరక సౌఖ్యాన్ని పెంచి, ఉపయోగించని ప్రోటీన్స్ ను కొవ్వును కరిగించుకుని శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచుకునేవారు. ఎప్పుడెప్పుడు నేటి సైన్సు కొత్త విషయం కనుక్కుంటూ ఉంటె దానికి మన పూర్వపు పద్ధతులకు ఒక లంకె కనబడుతుంది. పక్షంలో ఒక్క రోజు దేవుని స్మరిస్తూ ఆయన గురించి చింతిస్తూ ఉపవాసం చేస్తూ ఆధ్యాత్మిక, శారీరక ఉన్నతిని పొందేవారు.


ఇంతేకాదు వరుసగా మూడు రోజులు నిరాహారంగా ఉండడం వలన శరీరం కొత్త స్టెమ్ సెల్స్ తయారు చేసి తద్వారా తేల్లకణాలను సృష్టించి  రోగ నిరోధక శక్తిని అమితంగా పెంచుతుంది అని సథరన్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మనకు పూర్వం మూడు రోజుల లంఖణాలు చేయించేవారు. ఎంతమందికి గుర్తుందో లేదో కానీ చేసిన నాకు అనుభవం ఇది. శరీరం నీరసబడ్డా రోగం, రోగానికి కారణం అయిన ఆ రోగ సెల్స్ సగమై, తెల్లకణాలు ఇతోధికంగా పెరగడం వలను ఆ రోగం నయం అవుతుంది.

కేవలం ఉపవాసం చేస్తే ఎప్పుడూ ఆహారం మీద దృష్టి ఉంటుంది కాబట్టి మనస్సుకు ఆలంబనగా భక్తి అనే పరమ ఔషధాన్ని జత చేసి మనస్సు దేవుని మీద లగ్నం చేయించి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించారు. నిస్సందేహంగా మన పూర్వీకులు, ఋషులు మానసిక, ఆధ్యాత్మిక, శారీరక సంపూర్ణ వైద్యాన్ని నిర్దేశించడానికి ఇటువంటి పద్ధతులను అనుసరించేవారు. మనకు పూర్తి అవగాహన లేక చాలా వాటిని కోల్పోయాము. వారికి త్రికరణశుద్ధిగా తల వంచి పాదాభివందనం చేసి వారు చూపిన బాటలో పయనించడం మన తక్షణ కర్తవ్యంగా భావిస్తూ
శ్రీకంఠం రమణయ్య

!! ఓం నమో వేంకటేశాయ !!

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...