హనుమత్ జయంతిని వైశాఖ బహుళ దశమినాడు జరుపుకుంటాము. ఉత్తర భారతదేశములో మాత్రం చైత్ర పౌర్ణమినాడు హనుమత్ జయంతిగా జరుపుకోగా మనకు ఇక్కడ ఆరోజు హనుమత్ దీక్ష ప్రారంభమౌతుంది. 41రోజులు కొనసాగే ఆ దీక్ష యొక్క ముగింపు దినంనాడు మనం హనుమత్ జయంతిని జరుపుకుంటాము.
హనుమత్ జయంతినాడు భక్తులు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారు. కొందరు రామాయణంలో భాగమైన సుందరకాండ పారాయణ చేస్తారు. అలాగే హనుమత్ దీక్ష చేసినవారు ప్రముఖ హనుమంతుని ఆలయాలను సందర్శించి అక్కడ తమలపాకులతో పూజ, సహస్ర నామ స్తోత్రాలను జరిపిస్తారు. అప్పాలను నైవేద్యముగా సమర్పిస్తారు.
హనుమంతుడు కేసరి, అంజనాదేవిల కుమారుడు. అలాగే వాయు వరప్రసాది. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలనుకొనేవారికి హనుమ జీవితం ఒక సందేశాత్మక గ్రంథం. ఒక గొప్ప కార్యాన్ని మాత్రమే కాదు, నిత్యజీవితంలో మనకి ఎదురయ్యే అనేకానేక సంఘర్షణలలోను, క్లిష్ట పరిస్థితులలోను హనుమ జీవితం మనకు అనుసరణీయం, ఆచరణీయం. ఆయన జీవితం నుండి మనం తెలుసుకోవలసిన విషయాలను ఒకసారి అవలోకనం చేసుకుందాం. ముఖ్యముగా విద్యార్థులకు, జీవితంలో ఎదగాలనుకొనే ప్రతివారికీ హనుమ గుణగణాలు నిత్య పారాయణ గ్రంథం.
ఈనాడు ఉద్యోగాలకు, పోటీపరీక్షలకు వెళ్లేవారికి కమ్యూనికేషన్ స్కిల్స్ పేరిట ప్రత్యేక కోచింగులు ఇస్తున్నారు. కానీ చిన్నప్పటినుండి రామాయణాన్ని, విశేషించి అందులో హనుమ పాత్రని, విశ్లేషించి అధ్యయనం చేయిస్తే ఈనాడు వ్యక్తిత్వ వికాస కోర్సుల అవసరమే ఉండదు.
రామాయణంలోని కిష్కిందకాండ నుండి చివరి వరకూ అడుగడుగునా హనుమంతుని వ్యక్తిత్వం మనకు తేటతెల్లమవుతూనే ఉంటుంది. హనుమంతుని యొక్క పట్టుదల, కార్యదీక్ష, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత, కృత్యములయందు నేర్పు, సంభాషణా చాతుర్యం ఇత్యాదులెన్నో మనకు హనుమంతుని వ్యక్తిత్వము నందు మనకు ప్రస్ఫుటమవుతూనే ఉంటాయి.
సుగ్రీవునకు మంత్రిగా అండదండలు అందిస్తూ, సకల గుణాభిరాముడైన శ్రీరామచంద్రునకు దాసానుదాసుడై, జగన్మాత సీతమ్మతల్లి ఔదార్యానికి పాత్రుడై ‘రామాయణ మహామాలారత్నం’గా విలసిల్లాడు. మన లక్ష్యాన్ని సాధించటానికి పట్టుదల, కార్యదీక్ష మాత్రమే కాదు, ఎక్కడ ఒదిగి ఉండాలో, ఎక్కడ యుక్తిని ప్రయోగించాలో, ఎక్కడ శక్తిని ప్రదర్శించాలో హనుమ ద్వారా వాల్మీకి మహర్షి మనకు తెలియజెప్పారు.
ఒక్కోసారి మనలో దాగియున్న ప్రతిభను, శక్తిని మనం గుర్తించలేము. తగిన సమయం వచ్చినప్పుడు, డీలా పడిపోకుండా లక్ష్యం మీదే దృష్టిని ఉంచితే, మన సంకల్పమే మనలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తుంది. సముద్ర లంఘనానికి ముందు హనుమలోని సంకల్పబలమే, జాంబవంతుడు హనుమ జన్మ వృత్తాంతాన్ని తెలిపి బలపరాక్రమాలని గుర్తు చేయటానికి కారణమయింది.
క్రొత్తవారు లేదా క్రొత్త పరిస్థితులు ఎదురైనప్పుడు నేర్పుగా అవి మనకు ప్రతికూలమా, అనుకూలమా అనేది ఎలా గ్రహించాలో, హనుమ ఋష్యమూక పర్వతమును సమీపించిన రామలక్ష్మణులతో జరిపిన సంభాషణ ద్వారా గ్రహించవచ్చు. వాలి మరణానికి దుఃఖిస్తున్న తారను ఓదార్చి ఆమెను కర్తవ్యోన్ముఖురాలను చేస్తా,డు హనుమ. విషయ తత్వాలను ఎరిగి, కాలధర్మ విశేషములను గుర్తించగలిగినవాడు అయిన హనుమ, హితము, లాభకరము, నీతులతో ఒప్పునది అయిన వాక్యములను పలికి సుగ్రీవుని రామకార్యమునకై సంసిధ్ధం చేసాడు.
శ్రీరాముడు, వానరులందరిలోను శ్రేష్ఠుడైన హనుమ యొక్క కార్యసాధకత్వం విశ్వసించి, తన అంగుళీయకాన్ని సీతకు ఇవ్వమని హనుమకే ఇచ్చాడు. స్వామికార్యమునే స్వకార్యముగా భావించి సీతాన్వేషణకై బయలుదేరాడు. తన బలపరాక్రమాలు ఎరిగి, సముద్రలంఘనం చేసి, లంకా దహనం చేసి అద్వితీయమైన కార్యాన్ని సాధించినప్పటికీ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమనే తత్వముతో రాముడు విడిచిన బాణమే తాను అని తనను తాను అభివర్ణించుకున్నాడు.
హనుమ సీతాన్వేషణ ప్రయాణములో అనేక ప్రమాదాలు, ప్రలోభాలు ఎదురవుతాయి. వాటిని హనుమ ఎదుర్కొన్న తీరు ఈనాటికీ ఆచరణీయం, అనుసరణీయం. మన కార్యసాధనలో మనకి అనేకరకాలైన పరీక్షలు ఎదురవుతాయి. కొన్నిసార్లు మనకి సహాయసహకారాలని అందించేవాళ్లే మన కార్యసాధనకు అవరోధాలవుతారు. సముద్రలంఘనం సమయములో మైనాకుని వృత్తాంతం ఇదే విషయాన్ని తెలుపుతోంది. అప్పుడు హనుమ సున్నితముగానే తన కార్యాన్ని గూర్చి తెలిపి, రామకార్యములో విరామం కూడదని ముందుకు సాగిపోతాడు. కొన్నిసార్లు మన శక్తియుక్తులని, కార్యసాధనలోని అంతిమలక్ష్యానికే తప్ప స్వల్పవిషయాలకు వృథా చేయకూడదని సురస వృత్తాంతం చెప్తుంది. ఇక సింహిక వృత్తాంతం తనను తన లక్ష్యమునుండి దూరముగా పంపివేసే ప్రతికూలశక్తులను ప్రయత్నపూర్వకంగా తొలగించుకోవాలి అని తెలుపుతుంది.
ప్రమాదాల తరువాత ఎదురైనవి ప్రలోభాలు. సీతాన్వేషణలో ఉన్న హనుమకు రాక్షసస్త్రీలు, అప్సరాంగనల రూపములో అనేక ప్రలోభాలు, భ్రమలు ఈమె సీతేనేమో అన్నట్లుగా కలిగాయి. వాటన్నింటినీ ఆయన తార్కిక జ్ఞానముతో తొలగించుకొని స్థిరచిత్తముతో ఉన్నాడు. ఒకానొక దశలో సీతను కనుగొనలేనేమో, రామకార్యాన్ని సాధించలేనేమో అన్న నిరాశానిస్పృహలకు లోనయి, ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ మనోబలంతో తనకు తానే ధైర్యం తెచ్చుకొని, తిరిగి పట్టుదలతో ప్రయత్నించాడు. ఈనాడు చిన్న పరీక్ష తప్పితేనే జీవితాన్ని అంతం చేసేసుకుందామనే ఆలోచన చేసే విద్యార్థులందరూ హనుమ నుండి నేర్చుకోవాల్సింది ఇదే. శత్రుస్థావరములో అత్యంత దయనీయమైన స్థితిలో ఏది చూసినా రావణుని మాయే అనే అనుమానంతో ఉన్న సీతకు, రామలక్ష్మణులు వస్తారనే ధైర్యాన్ని తిరిగి కల్పించడానికి ఏమిచేస్తే ఆమె తనను రామబంటు అని నమ్ముతుందో, ఆ రామకథాగానమే చేస్తూ ఆమెకు సంతోషాన్ని కలిగించాడు. ఇదే హనుమ నుండి మనం నేర్చుకోవాల్సిన కమ్యూనికేషన్ స్కిల్. మనం ఏదైనా కార్యాన్ని సాధించడానికి కేవలం పట్టుదల, కార్యదీక్ష మాత్రమే కాదు, సరియైన కమ్యూనికేషన్ కూడా అవసరం.
లంకాదహనం కూడా రావణాసురునికి తనవర్గం వారి శక్తియుక్తులు తెలపడానికి, శత్రువర్గం వారి బలాబలాలు తెలుసుకోవడానికే హనుమ చేసాడు. ఇదే ఈనాడు మేనేజ్మెంట్ పాఠాలలో చెప్పే SWOT (Strength, Weakness, Opportunities, Threat) analysis.
స్వశక్తిని నమ్ముకుంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చని సంజీవినీ పర్వతం తేవడం ద్వారా నిరూపించాడు. ఇలా ప్రతి దశ లోనూ హనుమ జీవితం మనకి ఆదర్శమే. మనం ఇకనుండీ హనుమ గుణగణాలని చిన్నారులకి చెప్పి, వారిని బలమైన వ్యక్తిత్వం గలవారిగా తీర్చిదిద్దుదాం.
జై హనుమాన్!!

No comments:
Post a Comment