Thursday, May 18, 2017

ప్రవర యొక్క అర్ధం..


చతుస్సాగర పర్యంతం
( మానవ పరిభ్రమణానికి నలువైపులా
కల మహాసముద్రాల అంచుల వరకూ )

గో బ్రాహ్మణేభ్య శుభం భవతు
( సర్వాబీష్ట ప్రదాయిణి అగు.. గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ)

భార్గవ చ్యవన ఆప్నోవాన ఔర్వ వైదల పఞ్చర్షేయా  ప్రవరాన్విత..

( మా వంశమునకూ.. మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ.. త్యాగే నైకే అమృతత్త్వ మానశుః అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడనై..

శ్రీ వత్స స గోత్రోద్బవాయ

(మా గోత్రమునకూ..)

ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ
( మా శాఖకూ.. అందలి శాస్త్ర మర్మంబులకు.. )

శ్రీ బ్రహ్మాండం గురునాథ్ శర్మన్

( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో.. వేదాధ్యయనాది వైదిక క్రతువులతో.. 1. స్నానము 2. సంధ్య 3. జపము 4. హోమము 5. స్వాధ్యాయము 6. దేవ పూజ 7. ఆతిధ్యము 8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ.. త్రివిధాగ్నులు 1. కామాగ్ని 2. క్రోధాగ్ని 3. క్షుద్రాగ్ని.. అనే త్రివిధాగ్నులను అదుపులో (సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై.. పేరుకు ముందు శ్రీ అనబడే.. ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన.. గురునాథ్  శర్మా అనబడే సుశ్రోత్రియుడనైన నేను.. జన్మప్రధాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు.. యావత్ ప్రపంచానికే మార్గదర్శకమైన వేదధర్మము ముందు.. నిరాకార నిర్గుణ అవ్యాజ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు..

అహంభో అభివాదయే..

( కేవలం నేనూ అన్నదిలేక.. సర్వం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ భాగ్యమేయన్న అహంకారభావ రహితుడనై.. నిగర్వినై.. త్రికరణ శుద్ధిగా ( మనసా, వాచా, కర్మణా) సాష్టాంగ పూర్వక (మానవశరీరంలోని అత్యంత ప్రాధాన్యమైన ఎనిమిది శరీరాంగములనూ శరణాగత హృదయంచే నేలపై వాల్చి సమర్పిస్తున్న) దండ ప్రణామమిదే.. అన్న పరిపూర్ణమైన ఆత్మపూర్వక వేదపూర్వక హృదయపూర్వక నమస్కార భావమే.. సశాస్త్రీయమైన ఈ ప్రవరలోని.. అర్ధం అంతరార్ధం పరమార్ధం కూడా.
********

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...