Monday, January 23, 2017

నక్షత్ర - వృక్షాలు - వాటి ప్రయోజనాలు

This is one of the very good articles I found in Google Groups:

జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు
జ్యోతిష్య శాస్త్రం లో 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు , అధిదేవతలు ఉన్నట్లుగానే , వాటికి సంబంధించిన వృక్షాలు/చెట్లు కూడా ఉన్నాయి. చాలామందికి నక్షత్రాలకి వృక్షాలు ఉంటాయన్న సంగతి తెలియదు. మరికొందరు చెట్లని పెంచడం లో వాటిని కాపాడడం లో ఎంతో ఆసక్తి ని చూపుతుంటారు, తెలిసో తెలియకో వారు, వారి నక్షత్రాలకి సంబందించిన చెట్లని పెంచడం వలన, ఆరోగ్య, ఆర్దిక మరియు ఎన్నో అంశాలను చక్కగా ఆనందిస్తుంటారు. దీన్ని తెలుసుకొని వారికి సంబందించిన వృక్షాల/చెట్లు ను పెంచడం ద్వారా, వృక్షాలు/చెట్లలో దాగిన గొప్ప శక్తుల వలన , ఆరోగ్య, ఆర్దిక పరిస్థితులను మెరుగు పరుచుకోవడమే కాకుండా ,అనుకోని సమస్యల నుండి బయటపడడానికి ఎంతో ఉపకరిస్తాయి . మరియు ఇతరులకు వారికి సంబందించిన వృక్షాలను బహుమతులుగా ఇవ్వడం ద్వారా, వారు అబివృద్ది చెందడమే గాక పర్యావరణాన్ని కూడా ఎంతో మేలుచేసిన వారవుతారు.

భారతీయ సంస్కృతి లో పూజించడానికి అర్హతగలిగినవేన్నో ఉన్నాయి. ప్రతి సంస్కృతీ లోను వారి నమ్మకాలని బట్టి వాటిని ఆచరిస్తుంటారు . వాటిలో ముఖ్యమైనవి చెట్లు. చెట్ల వలన ఉపయోగాలని ప్రత్యేకం గా వివరించాల్సిన అవసరం లేదు. పర్యావరణ రక్షణ లో ఇవి ఎంతో కీలకమైనవి, ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు, పర్యావరణపరిరక్షణవేత్తలు స్పష్టం గా ధృవీకరించారు. మనం పుట్టినప్పుడు , గ్రహాలూ, నక్షత్రాలు, రాశులు వాటి మహార్దశల, దశల ప్రభావం వలన ఆయా కర్మలను మనం మంచి చెడ్డల రూపం లో అనుభవిస్తుంటాం. మనకి కేవలం మంచి మటుకే జరిగితే ఇవన్ని పెద్దగా పట్టించుకోమేమో , అదే మనకి ఏదైనా తట్టుకోలేని, పరిష్కరించుకోలేని, భరించలేని సమస్యలు వస్తే వాటి నుండి బయటపడడానికి జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ఎన్నో విధానాలను, మార్గాలను వెతుక్కొంటాం. వాటిని అనుసరించే విధానం లో ఆర్దిక విషయాలతో ముడిపడినదైతే అందరికి అనుసరించడానికి కొంచం కష్టతరమనే చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో మన పరిధి లో ఉన్నది మనకే కాక, భూమి కి పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేయగలిగినటువంటి పరిష్కార మార్గమే, జ్యోతిష్యశాస్త్రాన్ని అనుసరించి నక్షత్ర చెట్లని పెంచడం.
జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు తెలుసుకుందాం :

1) అశ్వని నక్షత్రం - వారు విషముష్టి లేదా జీడిమామిడిని పెంచడం, పూజించడం వలన జననేంద్రియాల, మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కలుగుతుంది. అలాగే, అన్ని విషయాలలోనూ సూటి గా వ్యవహరించడం, సమయాన్ని వృదా చేయకుండా అన్ని పనులను సమర్ధవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది.
2) భరణి నక్షత్రం - వారు ఉసిరి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యము , పైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువ గా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది
3) కృత్తిక నక్షత్రం - వారు అత్తి/మేడి చెట్టును పెంచడం పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షింపబడతారు, అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.
4) రోహిణి నక్షత్రం - వారు నేరేడు చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా చక్కెర వ్యాధి మరియు నేత్ర సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం , సత్ప్రవర్తన ఎక్కువ గా కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది
5) మృగశిర నక్షత్రం - వారు మారేడు లేదా చండ్ర చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్ మరియు అజీర్తి సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.
6) ఆరుద్ర నక్షత్రం - వారు చింత చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుండి బయటపడతారు, అంతే కాకుండా విషజంతువుల బాధ కుడా వీరికి కలగదు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది
7) పునర్వసు నక్షత్రం - వారు వెదురు లేదా గన్నేరు చెట్టు ను పెంచడం , మరియు పూజించడం ద్వారా ఊపిరితిత్తుల కి సంబందించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుండి, మరియు రొమ్ము క్యాన్సర్ నుండి ఉపశమనం పొందుతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యం గా పాల కి లోటు ఉండదని చెప్పవచ్చు. పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా , చక్కటి చాకచక్యం తో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.
8) పుష్యమి నక్షత్రం - వారు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచడం, పూజించడం వలన నరాల సంబంధిత బాధలు నుండి విముక్తి పొందుతారు. అలాగే శత్రువుల బారి నుండి రక్షణ కలుగుతుంది. రోగ, రుణ భాధల నుండి విముక్తి లభిస్తుంది . స్త్రీలు సంతానవతులవుతారు.
9) ఆశ్లేష నక్షత్రం - వారు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం , పూజించడం వల్ల శ్వేతకుష్ఠు మరియు చర్మ సంబంధిత వ్యాదుల నుండి రక్షణ పొందగలరు అలాగే ముందు చూపు తో వ్యవహరించి జీవితం లో ముందుకు సాగడానికి ఎంతటి విషమ పరిస్థితుల్లోనైన తట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది.
10) మఖ నక్షత్రం - వారు మర్రి చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా ఎముకల సంబంధిత మరియు అనుకోని వ్యాదుల నుండి రక్షింపబడతారు. అలాగే భార్య భర్తలు ఎంతో అన్యోన్యం గా ఉండడానికి, తల్లితండ్రులకు, సంతానానికి కూడా మేలు జరుగుతుంది. జీవితం లో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి
11) పుబ్బ నక్షత్రం - వారు మోదుగ చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా సంతానలేమి సమస్యల నుండి బయటపడతారు. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు .ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.
12) ఉత్తర నక్షత్రం – వారు జువ్వి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నుండి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలని వారి చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది
13) హస్త నక్షత్రం - వారు సన్నజాజి , కుంకుడు చెట్లను పెంచడం, పూజించడం వలన ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి . దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.
14) చిత్త నక్షత్రం - వారు మారేడు లేదా తాళ చెట్టు ను పెంచడం, పూజించడం ద్వారా పేగులు, అల్సర్ మరియు జననాంగ సమస్యల నుండి బయటపడగలరు. ఎవరిని నొప్పించకుండా వారి తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన నైపుణ్యం కలగడానికి ఉపయోగపడుతుంది.
15) స్వాతి నక్షత్రం - వారు మద్ది చెట్టు ను పెంచడం, పూజించడం ద్వారా స్త్రీలు గర్భసంచి సమస్యల నుండి బయట పడగలరు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. అన్ని రకములైన విద్యలలోను రాణిస్తారు, ఆత్మవిశ్వాసం అధికం గా ఉంటుంది. భావోద్వేగాలు అధికం గా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.
16) విశాఖ నక్షత్రం - వారు వెలగ , మొగలి చెట్లను పెంచడం ద్వారా జీర్ణసంబంధిత సమస్యల నుండి బయటపడతారు. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.
17) అనురాధ నక్షత్రం - వారు పొగడ చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. పదిమంది లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.
18) జ్యేష్ఠ నక్షత్రం - వారు విష్టి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. చిన్నతనం నుండే బరువు భాద్యతలు సమర్దవంతం గా మొయగలగడానికి. ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది.
19) మూల నక్షత్రం - వారు వేగి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా పళ్ళ కి సంబంధించిన , మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపు లో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణ లో ఉంటుంది. శాస్త్ర ప్రవీణం, మంచి వ్యక్తిత్వము, ఔన్నత్యం కలగడానికి, సంతానం వల్ల జీవితం లో ఆనందాన్ని ఆనందం పొందడానికి ఉపయోగపడుతుంది.
20) పూర్వాషాడ నక్షత్రం - వారు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచడం, పూజించడం ద్వారా కీళ్ళు, సెగగడ్డలు , వాతపు నొప్పులు మరియు జననేంద్రియ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దాపరికం లేకుండా వ్యవహరించడానికి పరోపకార బుద్ది . వినయవిదేతలు కలగడానికి ఉపయోగపడుతుంది.
21) ఉత్తరాషాడ నక్షత్రం - వారు పనస చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరి చేరవు. అలాగే ఆర్దికం గా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు. భూముల కి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అబివృద్ది లోకి రావడానికి ఉపయోగపడుతుంది.
22) శ్రవణం నక్షత్రం - వారు జిల్లేడు చెట్టును పెంచడం, పూజించడం ద్వారా మానసిక సమస్యలు దూరమవుతాయి. అలాగే ధనపరమైన సమస్యలు తొలగుతాయి న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.
23) ధనిష్ఠ నక్షత్రం - వారు జమ్మి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా మెదడు కి సంబంధించిన సమస్యలు రావు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, కుటుంబ సభ్యుల అండదండల కొరకు, సంతానాబివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.
24) శతభిషం నక్షత్రం - వారు కడిమి చెట్టు లేదా అరటి చెట్టు ను పెంచడం ద్వారా శరీర పెరుగుదల కి సంబంధిచిన , మోకాళ్ళ సమస్యల నుండి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం , చక్కటి ఉద్యోగం కొరకు, జీవితం లో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.
25) పూర్వాభాద్ర నక్షత్రం - వారు మామిడి చెట్టు ని పెంచడం ద్వారా కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు రావు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితి ని పొందడానికి . కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాల లో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాల లో రాణించడానికి ఉపయోగపడుతుంది.
26) ఉత్తరాభాద్ర నక్షత్రం - వారు వేప చెట్టు ని పెంచడం ద్వారా శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యల ను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందం గా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.
27) రేవతి నక్షత్రం - వారు విప్ప చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపు లో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి.

Thursday, January 19, 2017

Ancient science on Human Behaviour !

Tirukkural  by Tiruvalluvar (a Tamil  poet/writer) was written more than 5,000 yrs ago. It’s one of the ancient science on Human Behaviour, which has not changed in spite of modern education  & technology!

SOME GOLDEN THOUGHTS OF THIRUKKURAL:

1. If your child lies to you often, it is because you over-react too harshly to their inappropriate behaviour.

2. If your child is not taught to confide in you about their mistakes, you’ve lost them.

3. If your child had poor self-esteem, it is because you advice them more than you encourage them.

4. If your child does not stand up for themselves, it is because from a young age you have disciplined them regularly in public.

5. If your child takes things that do not belong to them, it is because when you buy them things, you don’t let them chose what they want.

6. If your child is cowardly, it is because you help them too quickly.

7. If your child does not respect other people’s feelings, it is because instead of speaking to your child, you order & command them.
 
8. If your child is too quick to anger, it is because you give too much attention to misbehaviour & you give little attention to good behaviour.

9. If your child is excessively jealous, it is because you only congratulate them when they successfully complete something & not when they improve at something even if they don’t successfully complete it.

10. If your child intentionally disturbs you, it is because you are not physically affectionate enough.

11. If your child is openly defiant, it is because you openly threaten to do something but don’t follow through.

12. If your child is secretive, it is because they don’t trust that you won’t blow things out of proportion.

13. If your child talks back to you, it is because they watch you do it to others & think its normal behaviour.

14. If your child doesn’t listen to you but listens to others, it is because you are too quick to jump to conclusions

15. If your child rebels it is because they know you care more about what others think than what is right

Pls fwd this to Parents who care to read this!
IT MAY GUIDE OUR MODERN  PARENTING!
Positive Parenting!

Friday, January 13, 2017

ప్రత్యేక శంఖు

మంగళగిరి నరసింహ స్వామి గుడి లో
ఎంతో ప్రత్యేకత కలిగిన శంఖుతో  తీర్ధం ఇస్తారు .
ఓంకార శభ్దాన్ని పలికే పురాతన దక్షణావ్రుత శంఖము
బంగారు తొడుగు లో ఉంటుంది. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే ఉపయోగిస్తారు


MAKARA SANKRANTI or PONGAL

MAKARA SANKRANTI or PONGAL Is lord sun festival also known as lord Suryanarayan.

Lord sun or suryanarayan radiats ULTRA VOILET RADIATION RAYS TOWADS EARTH.
All chakras are actitvated and Alignment.

ALL MALEFIC PLANETARY EFFECTS [.GRAHA DOSHAMS] ARE NEUTRALIZE .
DOING GOOD KARMA ACTIVITY ON THIS DAY IS HIGHLY RECOMMENDED.

Historically, the special significance attached to the celebration of Makar sankranti, is Kite Flying.The gods who are believed to have slumbered for six long months are now awake and the portals of heaven are thrown open!''

Spiritually, Kite Flying  is a spiritual activity as we focus more on sky ( Aakash tattva ) more for the individual energy transforms and naturally  sublimates upwards.

As (Lalat chakra or forehead chakra) is 40 degrees looking upwards while flying kite  more divine energy's enter into the body from cosmic.

Inner meaning is devas in the chakras are awaken ....
Makar Sankranti Punya Kaal Muhurta 2017
Makara Sankranti Phalam
Punya Kaal Muhurta = 07:50 to 17:41
Duration = 9 Hours 51 Mins
Sankranti Moment = 07:50
Mahapunya Kaal Muhurta = 07:50 to 08:14
Duration = 0 Hours 23 Mins

The time between Makar Sankranti and 40 Ghatis (roughly 16 hours for Indian locations if we consider 1 Ghati duration as 24 minutes) from the time of Makar Sankranti is considered good for auspicious work. This duration of forty Ghatis is known as Punya Kaal. Sankranti activities, like taking bath, offering Naivedhya (food offered to deity) to Lord Surya, offering charity or Dakshina, performing Shraddha rituals and breaking fast or Parana, should be done during Punya Kaal.

Good karma generated during this period multiples into many folds

As energetically Violet rays from lord sun magnifies everything speedly....
It is advice to be joyful and happy throughout the day to bring in new energy in auric system......

Tuesday, January 10, 2017

మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము

ప్రదోష కాలమున (సా: 5.30-7.30)

ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము చాలా విశేషము.

"ఓం నమఃశివాయః,
నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ,
శ్రీ మన్మహాదేవాయ నమః".

అని చెప్పుకుంటూ ఇంట్లో కూడా ఆ సదాశివునికి జలముతో అభిషేకము చేయవచ్చు.  

లేక

 "ఓం నమఃశివాయః" అనుచూ 108 సార్లు జపము చేసిన మంచిది.

మడి అంటే ఏమిటి? మడి ఎలా కట్టుకోవాలి?

మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం.
అదేమిటో తెలియక అది ఒక చాంధస ఆచారం అని ఆడుపోసుకొనే వారూ మనలో లేకపోలేదు.
కాని అది ఒక ఆరోగ్య వంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమే కాని, చాదస్తం ఎంతమాత్రం కాదు.
మన ఆచారాలు మనం పాటించాలి,వాటిని వదిలి వేయరాదు.మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు.
ఆచార హీనాః నపునంతి వేదాః అని ఆర్ష వాక్యం.ఆచార హీనున్ని వేదములు కూడా పవిత్రున్ని చేయలేవు అని దానర్ధం.
అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం.ఒకసారి ఇది సమగ్రంగా చదవండి.
మడికట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకోండి.
(మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండచ్చు.
కాని ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకు పోతున్న నవ యువత కోసం ఈ వివరణ. అంతే.)

మడి అంటే ఏమిటి?

మడి అంటే శారీరక శౌచము. ( ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదములు. ) శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలుగ వలెనన్న ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించి తీరాలి. నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు. కనుక కొద్దిగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాము.

మడి ఎలా కట్టుకోవాలి? :

రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ( 11 లోపు ) ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరవేసినది ఉత్తమం. ఉతికి జాడించి, తరువాత మనము స్నానముచేసి, తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మరల తడిపి, పిండి దండేముల మీద ఇంటిలో గానీ లేక ఆరు బయట గానీ ఎవరూ తాక కుండా ఆర వేయవలెను. ( ఒకవేళ చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల అందనంత ఎత్తులో ఓ గోడకు దండెము వంటి కఱ్ఱలు వ్రేలాడు తూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు. ) మరునాడు ఉదయాన్నే మరలా స్నానము చేసి తడి గుడ్డ తో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టు కోన వలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు. తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట / పూజ చేయ వలెను. మడితో నే సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు. ( ఇది ఉత్తమమైన మడి ) శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చెయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి బట్ట పనికిరాదు.

మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టు బట్ట కట్టుకోవడము మూడో పద్ధతి. పట్టు బట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికి రాదు. ఒక వేళ చేస్తే పట్టు బట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను. పట్టు బట్ట (ఒరిజినల్) ను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాక కుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడు కొనవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలెను. లేక పోతే పట్టుగుడ్డలు మడికి పనికి రావు. ధావళి కట్టుకొని పూజించడము పట్టు బట్ట కంటే శ్రేష్టము. పట్టు బట్టలో కొంత దోషము వున్నది, అదే జీవ హింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున శ్రేష్టము నూలు గుడ్డ. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా కుదరిని చో (స్వచ్ఛమైన ) పట్టు వస్త్రము.

మగ వాళ్ళు పంచను లుంగి లాగ కట్టుకొని గానీ, ఆడ వాళ్ళు చీరను లుంగి లాగ లో పావడా తో గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననే౦ద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కావున మగ వాళ్ళు గానీ, ఆడవాళ్ళూ గానీ గోచీ పోసిమాత్రమే పంచ / చీర కట్ట వలెను. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టవలెను అంటే ఏక వస్త్రముతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించిం, ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికరావు. మడి తో పచ్చళ్ళు, మడితో వడియాలు, మడితో పాలు, పెరుగు, నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలా వరకు నేడు పోయినాయి. కానీ నేటి తరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్ది కొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది. ఆసక్తి కలిగిన వారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శకులము అవ్వాలి. మనల్ని మనము కాపాడు కోవాలి. ఒక్క సారి మడి కట్టి చూడండి దాని లోని ఆనందము, స్వచ్ఛత, పరిశుభ్రత, దైవత్వం అనుభవము లోకి వస్తాయి.

నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

శుభంభూయాత్!

ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు

సాధారణంగా నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేస్తాడు. ఎవరు చేయాలి అంటే యజమాని నిత్యపూజా చేయాలి. సంకల్పంలోనే ఉంది ‘ధర్మపత్నీ సమేతస్య’ అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే పూజామందిరంలోకి వెళ్ళడం ఇంక అంతకన్నా అన్యాయమైన విషయం ఏం ఉంటుంది? ఇంక దానిమీద వ్యాఖ్యానం చేయడం అనవసరం. కాబట్టి అలాగే పూజ చేస్తారు అని మనం భావన చేయాలి.

 పురుషుడు ప్రతిరోజూ పూజ చేస్తాడు. నైమిక్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా ప్రక్కన కూర్చుంటుంది. వినాయక వ్రతంలాంటిది చేసినప్పుడు. వస్త్రధారణా నియమం అన్నప్పుడు ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ వేసుకుంటుంది, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం. కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం.

ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది – ‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ – గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదు; అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు; అంటే ఉత్తరీయం ఒక్కటే  ఉండాలి పురుషుడికి. చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు. దేవాలయంలోనైనా అంతే. కళ్యాణం చేసుకోవడానికి వెళ్తే ఎవరో వచ్చి చిన్నపిల్లలకి చెప్పినట్లు చొక్కా విప్పండి, బనియను విప్పండి అని చెప్పక్కరలేదు. మనంతట మనమే తీసి కూర్చోవాలి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు. నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడు వీడికి, వీడు వాడికి కనపడాలి. ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు.

యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనుకోండి నీయందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు స్వాగతం చెప్పడానికి ఇంటి బయటికి వచ్చిన ఇంటి యజమాని ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. నేను ఎవరి ఇంటికైనా వెళ్ళాను అనుకోండి, ఆయన ఎడమ భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురు వచ్చి స్వాగతం పలికాడు అనుకోండి ఆయన అభ్యున్నతి కొరకు మంచిమాటలు చెప్పవచ్చు. ఆయన అలా రాలేదు అనుకోండి నాపని చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నాకు అయన పెద్దరికం అనడానికి గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి. మీరు గమనించండి కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వు భగవంతుడితో సమన్వయము అవుతున్నావు. ఆయన చేయి చాపాలి, కాళ్ళు చాపాలి, ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై అయి ఉండాలి. ఉత్తరీయం వేసుకుని ఉండాలి.

‘అనుత్తరీయశ్చ, నగ్నశ్చ – వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. ‘అవస్త్రఏవచ’ – మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్నమాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి పూజకు పనికిరాను. గోచీపోసి కట్టే కూర్చోవాలి. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు. దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు. అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు. అవతలి వాడు పదికాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు. అందుకే పీటలమీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజు ఉంటే బయట కుట్టించు. పీటల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో. ఆయుఃకారకం నువ్వు ఇచ్చేది. నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు. ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మనవాళ్ళు పంచెల చాపు పెడతారు.

పరమమంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్ట గోచీ పోసుకుని కట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు. శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పూజ దగ్గరికి వెళితే లాల్చీ, బనియను కూడా పనికిరావు. తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచీ పోసి పంచె కట్టుకుని కూర్చుని పూజ చేయాలి. గోచీ ఎంత బాగా పోయాలి. అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు. ఒక అంచు తీసి నీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు కచ్ఛ ఉన్నట్లే. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణయందు అటువంటి నియమము ఉన్నది. అదేం పెద్ద విశేషమా? అదేం బ్రహ్మవిద్యేం కాదు. పూజయందు ఎప్పుడూ గోచీపోసి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పురుషుడు పూజ చేయవలసి ఉంటుంది.

Monday, January 9, 2017

సాంఖ్య యోగం శ్లోకం



అన్తవన్త యిమే దేహాః
నిత్యస్యోక్తా శరీరిణః
అనాశినో అప్రమేయశ్య
తతో యుద్ధస్వ భారత.

Change Management కొనసాగుతున్నది.యుద్ధం చేస్తే వీళ్ళందరు చచ్చిపోతారని యుద్ధం చేయనంటున్నావు. అసలు పోయేవి ఏవి?శరీరాలు,దేహాలు రావడం పోవడం వాటి ధర్మం.అన్తవన్త ఇమే దేహాః.కాని వాటిలో ఉన్న శరీరి ఉన్నాడే ఆయనకు నాశనంలేదు.అప్రమేయుడు. ఆయనను ఎవరూ ఏమీ చేయలేరు అందువలన యుద్ధంచేయి.                      
Fight (Yuddham) for your Right / Aim. Success follows. That is the meaning of the above Sloka.

Theory of evolution

"Mom, I am a genetic scientist. I am working in the US on the evolution of man. Theory of evolution, Charles Darwin, have you heard of him? " Vasu asked.

His Mother sat down next to him and smiled, "I know about Darwin, Vasu. "But Have you heard of Dashavatar? The ten avatars of Vishnu?"

Vasu replied in no.

"Then let me tell you what you and Mr. Darwin don't know.
Listen carefully-

The first avatar was the Matsya avatar, it means the fish. That is because life began in the water. Is that not right?" Vasu began to listen with a little more attention.

"Then came the Kurma Avatar, which means the tortoise, because life moved from the water to the land. The amphibian. So the Tortoise denoted the evolution from sea to land.

Third was the Varaha, the wild boar, which meant the wild animals with not much intellect, you call them the Dinosaurs, correct? " Vasu nodded wide eyed.

"The fourth avatar was the Narasimha avatar, half man and half animal, the evolution from wild animals to intelligent beings.

Fifth the Waman avatar, the midget or dwarf, who could grow really tall. Do you know why that is? Cause there were two kinds of humans, Homo Erectus and the Homo Sapiens and Homo Sapiens won that battle." Vasu could see that his Mother was in full flow and he was stupefied.

"The Sixth avatar was Parshuram, the man who wielded the axe, the man who was a cave and forest dweller. Angry, and not social.

The seventh avatar was Ram, the first thinking social being, who laid out the laws of society and the basis of all relationships.

The Eighth avatar was Balarama, a true farmer showed  value of agriculture in the life

The Ninth avatar was Krishna, the statesman, the politician, the lover who played the game of society and taught how to live and thrive in the social structure.

And finally, my boy, will come Kalki, the man you are working on. The man who will be genetically supreme."

Vasu looked at his Mother speechless. "This is amazing Mom, how did you.. This makes sense!"

"Yes it does Vasu! We Indians knew some amazing things just didnt know how to pass it on scientifically. So made them into mythological stories.  Mythology makes sense. Its just the way you look at it - Religious or Scientific. Your call.

Wednesday, January 4, 2017

వందేగోమాతరం !!

''కోడి,మేక,లాగా గోవు కూడా జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి'' అని అడ్డంగా వాదిస్తున్న ఓ జనుల్లారా.....

గోవు కూడా జంతువే కానీ....
ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది.
అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ''గోమాత'' అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.

నీ చదువు...
నీ సంస్కారం...
నీ విచక్షణ...
నీ విజ్ఞత...
నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే...
గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా

* ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని..ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని ..
ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని,పాలను,మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.
అలా ఒకరోజు,రెండ్రోజులు కాదు...ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు.
ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ,మూత్రంలోగానీ,పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.

మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?
గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.
మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది.

* ప్రాణవాయువు(Oxygen )ను పీల్చూకుని ప్రాణవాయువు(Oxygen )ను వదిలే ఏకైక ప్రాణి.

* విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.

* వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.

* ఆవునెయ్యి,బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.

* కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.

* గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని.

* గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.

* ఇళ్ళను,వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.

* ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.

*  ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు(Oxygen )ఉత్పత్తి అవుతుంది.

* గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.

''గోరక్షణ వల్లనే మన జాతి,మన ధర్మము రక్షింపబడును.గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు''.
- గాంధీజీ.

''ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది.దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు''.
- మహ్మద్ ప్రవక్త.

''ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే''.
- ఏసుక్రీస్తు.

 ''గో క్షీరము గొప్పమందు.దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని.దాని మాంసము రోగకారకము''.
- హజరత్ మహమ్మద్.

''గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము.ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపుభూములు గొప్పగానుండును.గృహములు ఉన్నతి చెందును.నాగరికత పురోగమించును''.
- బర్మార్డ్ మేక్ ఫెడన్.

''మహ్మదీయుల మత గ్రంధమైన ఖురాన్ లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు''.
- హకీల హజ్మల్ ఖాన్.

''గో హత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం''.
- తోహస్-వి-హింద్ బిజహరు.

భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా?
నువ్వు హిందువైనా, మస్లీమువైనా,క్రిస్టియన్వైనా నాదేశంలో ఉన్నంతవరకూ భారతీయుడివి.
నా దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం.

స్వేచ్ఛంటే....
''నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు''
''నా(నీ,ఈ)దేశం మెచ్చేటట్టు బ్రతకడం''

         ''వందేగోమాతరం''        

తిధుల ప్రాధాన్యత ఏమిటి ?

ఏ తిధి రోజున
ఏ దేవతను పూజ చేయాలి ?
తిధి వ్రతములు
చేయటం వలన లభించే ఫలితాలు ఏమిటి ?

ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది.
అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని
పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి.
తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది.

పాడ్యమి :
అధిదేవత - అగ్ని.
వ్రత ఫలం - సత్ఫల ప్రాప్తి.

విదియ :
అధిదేవత - అశ్విని దేవతలు.
వ్రత ఫలం - ఆరోగ్య వృద్ది.

తదియ :
అధిదేవత - గౌరీ దేవి.
వ్రత ఫలం - సుమంగళీ అనుగ్రహం.

చవితి:
అధిదేవత - వినాయకుడు.
వ్రత ఫలం - కష్టములు తొలగిపోవుట

పంచమి:
అధిదేవత - నాగ దేవత.
 వ్రత ఫలం - వివాహము, వంశ వృద్ది.

షష్టి :
అధిదేవత - సుబ్రహ్మణ్య స్వామి.
వ్రత ఫలం - పుత్ర ప్రాప్తి.

సప్తమి:
అధిదేవత - సూర్య భగవానుడు.
వ్రత ఫలం - ఆయురారోగ్య వృద్ది.

అష్టమి:
అధిదేవత - అష్టమాత్రుకలు.
 వ్రత ఫలం - దుర్గతి నాశనము.

నవమి:
అధిదేవత - దుర్గాదేవి.
వ్రత ఫలం - సంపద ప్రాప్తిస్తుంది.

దశమి:
అధిదేవత - ఇంద్రాది దశ దిక్పాలకులు.
 వ్రత ఫలం - పాపాలు నశిస్తాయి.

ఏకాదశి:
అధిదేవత - కుబేరుడు.
వ్రత ఫలం - ఐశ్వర్యము ప్రాప్తించును.

ద్వాదశి:
అధిదేవత - విష్ణువు.
వ్రత ఫలం - పుణ్య ఫల ప్రాప్తించును.

త్రయోదశి:
అధిదేవత - ధర్ముడు.
వ్రత ఫలం - మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.

చతుర్దశి:
అధిదేవత - రుద్ర.
వ్రత ఫలం - మ్రుత్యున్జయము, శుభప్రదం.

అమావాస్య:
అధిదేవతలు - పితృదేవతలు.
 వ్రత ఫలం - సంతాన సౌఖ్యం.

పౌర్ణమి:
అధిదేవత - చంద్రుడు.
వ్రత ఫలం - ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.

Tuesday, January 3, 2017

క్రైస్తవ మతప్రచారకుని తో జగద్గురువుల సంభాషణ -1973

శ్రీ గురుభ్యో నమః

శ్రీ శ్రీ శృంగేరీ శారదా పీఠము యొక్క 35వ జగద్గురువులైన శ్రీ అభినవ విద్యాతీర్థుల వారి కాలములో [1973] ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది.

గురువుల వద్దకు దర్శనానికి ఒక క్రైస్తవ మత ప్రచారకులు వచ్చినారు. ఆయన ఉద్దేశము, వారి మతము సర్వశ్రేష్ఠమయినది, కాబట్టి తమ మతానికి జనులను ఆకర్షించి వారికి స్వర్గ ప్రాప్తికి మార్గాన్ని చూపించవలెను. అందు కోసము జగద్గురువులను ఒప్పించి జనాలను క్రైస్తవ మతానికి చేర్పించాలని కోరడానికి వచ్చినారు. విషయము తెలిసిన జగద్గురువులు, వారిమతపుగొప్పదనము యేమిటోతెలుసుకోవలెనని ఆదరముతో ఆహ్వానించిసంభాషించారు.

యోగక్షేమాలు, కుశల ప్రశ్నల తర్వాత జగద్గురువులు అడిగినారు,

జగద్గురువులు:" మీరు ఇక్కడికి వచ్చిన కార్యమేమిటి?"

క్రైస్తవ మత ప్రచారకులు [ క్రై. మ. ప్ర. ]: స్వామీ, నేను మీ ఊరిలో, మీ మఠము సమీపములో ఒక క్రైస్తవ సంస్థను తెరవాలనే ఉద్దేశముతో వచ్చినాను."

గురువులు: " ఇక్కడ సంస్థను తెరచుటకు కారణము?"
క్రై. మ. ప్ర.: "నేను ప్రజలకు ఇక్కడనుండే ధర్మోపదేశమును ఇవ్వాలని ఆశిస్తున్నాను. "
గురువులు:"మీరు ఉపదేశించునదియేమి?"
క్రై. మ. ప్ర.: "మా మతమును గురించి, దాని శ్రేష్ఠతను గురించీ, జనులకు ఉపదేశము చేసి, వారందరినీ మా మతానికి మార్చుకోవా లనుకొంటున్నాను."

గురువులు:" మీరు జనులకు ఉపదేశము ఇచ్చే ముందు నాకు కూడా మీ మతమును గురించి తెలిపితే, నేను కూడా తెలుసుకుంటాను గదా?"
క్రై. మ. ప్ర.:" అట్లే కానివ్వండి, మీరు నన్ను ప్రశ్నలు అడగండి, నేను వాటికి సూక్త సమాధాన ములనుఇవ్వగలవాడను

గురువులు: "మీ మతము మొదలై ఎన్ని సంవత్సరాలయినది?"
క్రై. మ. ప్ర.:"మా మతము పుట్టి 1973  సంవత్సరా లయినాయి "

గురువులు:"సంతోషము,మీ మతపు ఆరంభమును గుర్తించుటకు ఒక నిర్దిష్టమైన కాలము, సమయము ఉన్నాయని స్పష్టమైంది. మీ మతము పుట్టుటకు ముందుప్రజలు ఉన్నారా లేరా?మీ మతము లేనప్పుడు జనులు జీవిస్తుండేవారా లేదా?"
క్రై. మ. ప్ర.:" జనులే లేకపోతే మేముమతబోధ ఎవరికి చేస్తాము? మేము మా మత విషయములను నేర్చుకొని ప్రచారము చేయుటకు ముందుకూడా ప్రజలు ఉండనే ఉన్నారు.

గురువులు: మీ మతము లోకి జనులు మారితే వారికి కలుగు ప్రయోజన మేమి?"
క్రై. మ. ప్ర.:"మా మతము లో చేరిన వారందరికి మాత్రమే తప్పక స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. నరకము తప్పుతుంది"

గురువులు:" సరే, మీరు మీమతమునుఅనుసరించే వారికి మాత్రము స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అంటున్నారు.ఇతరులకు నరకప్రాప్తి అంటున్నారు. కానివ్వండి, మీ మతము పుట్టుటకు ముందు బ్రతికి జీవించిన కోటానుకోట్ల ప్రజలు స్వర్గానికి వెళుతుండేవారా లేక నరకానికివెళుతుండేవారా?"
క్రై. మ. ప్ర.:" వారంతా నరకానికే వెళుతుండే వారు.మా మత ధర్మాన్ని పాలించనందువల్ల"

గురువులు:" ఇదెక్కడి న్యాయము? ఈ కాలపు ప్రభుత్వాలూ,న్యాయస్థానాలు కూడా ఇటువంటి చట్టాన్ని చేయవు కదా!!, మీరు మీ ధర్మాన్ని, నియమాన్నీ ఏర్పరచక ముందు ఉన్నవారు మీ ధర్మాన్ని పాలించుట లేదు అన్న కారణానికి వారునరకభాజనులవుతారుఅనేదిన్యాయమేనా?ముందెప్పుడో రచించ బోయే నియమాలను ఊహించుకొని వారు అనుసరించుటఎక్కడైనా సాధ్యమా? కాబట్టి, మీరు మీ మతమునకు సంబం ధించిన నియమాలను రచించుటకు ముందే ఉన్నవారు నరకానికే వెళ్ళినారు అని చెప్పుట సమంజసమా?

క్రై. మ. ప్ర:[బిక్కచచ్చి], ఔను స్వాములూ, వారు అందరూ నరకానికి కాదు, స్వర్గానికే వెళ్ళి ఉండాలి"

గురువులు:" ఇది కూడా అన్యాయమే అవుతుంది, ఎందుకంటే మీ మతపు నియమాలను రాయుటకు ముందు పుట్టి పెరిగిన వారందరూ స్వర్గానికే వెళ్ళేవారు కదా?ఇప్పుడు మీరు రచించిన మత నియమాల వల్ల, వాటిని అనుసరించే కొందరుమాత్రమేస్వర్గానికి వెళుతున్నారు. అనుసరించని వారు నరకానికే వెళుతారు అన్నట్లయింది కదా?  అందువల్ల, మీరు మీ మత నియమాలను రచించకుండా ఉండి ఉంటే అందరూ తప్పక స్వర్గానికే వెళ్ళేవారు. ఇప్పుడు మీ నియమాల వల్ల అనేకులకు అన్యాయము జరిగింది కదా?"
క్రై. మ. ప్ర:"[తన మాటల కు తానే చిక్కుకొని గాభరాపడి] స్వామీ!!, మీరు నన్ను ఇటువంటి ప్రశ్నలనుఅడుగుతున్నారే? దయచేసి నన్ను వదిలేయండి" అన్నాడు.

గురువులు:"సరే, అట్లాగే కానివ్వండి, ఆ సంగతి వద్దు. చూడండి, ఈ ప్రపంచములో ప్రజలు అనేక విధములైన దుఃఖ కష్టాలకూ, సుఖ సంతోషా లకూ లోనగుటను చూస్తున్నాము కదా, దానికేమిటి కారణము?"
క్రై. మ. ప్ర:"దీన్నంతటినీ భగవంతుడే చేసినాడు"

గురువులు:" ఒకడికి ముష్టి అడుక్కోవలసిన హీన స్థితినీ, ఇంకొకడికి దానము చేయునట్టి ఉత్తమ స్థితినీ దేవుడు అనాదిగాఇస్తున్నాడంటే, భగవంతుడు తనకు ఇష్టమైనవాడిని సుఖము లోనూ,తనకుఅప్రియమైన వాడిని దుఃఖములోనూ ఉండేటట్టు చేసినాడనే చెప్పవలెను కదా?"
క్రై. మ. ప్ర:"అది భగవంతుని స్వంత ఇఛ్చ,స్వామీజీ,మనమేమీ చేయలేము. ఆయన ఏమికావాలన్నా చేయగలడు.అది ఆయన ఇష్టము."

గురువులు:"భగవంతుడు ఏమి కావాలన్నా చేయవచ్చుఅన్నట్టయితే, అందరికీ సుఖాన్నే ఇవ్వవచ్చును కదా? ఆ సుఖాన్నికొందరికిమాత్రమే ఎందుకు ఇచ్చాడు?దానికి కారణమేమయి ఉంటుంది?"
క్రై. మ.ప్ర:"[అప్రతిభుడై], అదంతా భగవంతునికి చెందిన విషయము. నేనేమి చెప్పగలను?"

గురువులు: మీవాదానికి ఒక యుక్తి గానీ, తర్కం గానీ ఉన్నట్టేకనిపించుట లేదు.సరే,అదీ ఉండ నివ్వండి, మరొక విషయము!!, చిన్న పిల్లలుగా ఉన్నపుడే కొందరు చనిపోతారు. కొందరేమో వయసయిన తర్వాత.ఇలాగున్నపుడు, చిన్నపిల్లలు చనిపోయాక స్వర్గానికి వెళతారా లేక నరకానికా?"
క్రై. మ. ప్ర.:"చిన్నపిల్లలు పాపముఎలాచేయగలరు?వారు ఒక తప్పును కూడా చేయలేరు.వారింకా చిన్నపిల్లలే కాబట్టి వారికి పాపపుణ్యాల ప్రసక్తే రాదు. వారికి అవి అంటవు"

గురువులు:" అందుకే అడిగినాను,వారు వెళ్ళేది స్వర్గానికా,లేకనరకానికా?"
క్రై. మ. ప్ర.:"చిన్న పిల్లలందరూ స్వర్గానికే వెళతారు"

గురువులు:" అట్లయితే మన తల్లిదండ్రులంతా మన గురించి చాలా పెద్ద తప్పే చేసారనవలెను. మనలనందరినీ చిన్న పిల్లలుగా ఉన్నపుడే చావడానికివదిలేయకుండా పెంచి పోషించి పెద్ద చేసినారు. ఇది చాలా పెద్ద తప్పు కదా? శిశువులను పుట్టగానే చంపి వేసుంటే, మనము పెరిగి పెద్దయి, తప్పు చేసేందుకు అవకాశమే ఉండేది కాదు. మనందరకూ స్వర్గమే దొరికేది? కాదా?"
క్రై. మ. ప్ర.:"[ మరలా చిక్కుకొని], స్వామీ మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేను జవాబివ్వలేను"

గురువులు:" సరే, వదిలేయండి, చనిపోయే వారందరూ స్వర్గానికో లేక నరకానికో వెళతారు తప్పదు కదా, ఎప్పుడు వెళతారు అన్నది చెపుతారా?"
క్రై. మ. ప్ర.:భగవంతునికి ఎప్పుడునిర్ణయించాలనిపిస్తే అప్పుడు నిర్ణయిస్తాడు, అప్పుడే పోతారు

గురువులు:ఇదేమయ్యా ఆశ్చర్యముభగవంతుడు పిచ్చివాడా యేమి!!, తనకిష్టమొచ్చినపుడు న్యాయ నిర్ణయము చేయుటకు?
క్రై. మ. ప్ర.:"అలాగ కాదు,అక్కడఅదంతటికీ ఒక క్రమ విధానము ఉంటుంది"

గురువులు:" సరే, మీ పుస్తకములో అదేమి క్రమ విధానమును వివరించారో కొంచము చెపుతారా? [ఆయన మాట్లాడేందుకు తటపటాయించినాడు; గురువులేకొనసాగించినారు] మీ మతములో ఈ విషయము గురించి ఏమి సిద్ధాంతము ఉందో, దాన్ని నేను చెపుతాను. అది సరియా కాదా మీరే చెప్పండి
క్రై. మ. ప్ర.:"కానివ్వండి స్వామీ, చెప్పండి"

గురువులు:"ఈ ప్రపంచములో ఉన్న వారందరూ చనిపోయిన తరువాత, దేవుడు, ఏదో ఒకరోజు, న్యాయ నిర్ణయ మును చేసి, కొందరికి స్వర్గాన్నీ, కొందరికి నరకాన్నీ ఇస్తాడు.కదా!? సరియేనా?"
క్రై. మ. ప్ర.:"ఔనౌను, తమరు చెప్పింది సరిగ్గా ఉంది"

గురువులు:"ఈ ప్రపంచ ములోనే జరుగుతున్న సంగతిని చూడండి, ఎప్పుడైనా ఎవరైనా ఒక తప్పు చేసినారంటే, విచారణకు మొదట, ఆ తప్పు చేసినవాడిని పోలీసులు కొన్నిరోజులు నిర్బంధములో ఉంచు తారు. దాని తర్వాత కూడా అతడినిపోలీసులు లాకప్లోఉంచాలంటే, దానికి న్యాయాధీశుల అనుజ్ఞను పొందవలసి ఉంటుంది. అలాగ, కారణమూ, అనుమతీ లేకుండా, విచారణ చేయకుండా ఎక్కువ రోజులు ఉంచుటకు వీలు లేదు. న్యాయాధీశులు ఒప్పుకోకుంటే అతడిని పోలీసులు నిర్బంధము నుండీ వదిలివేయవలసి ఉంటుంది.ఇలాగున్నపుడు, ఒకడు మృతుడయిన తరువాత వాడికి, "ఈ ప్రపంచములో ఉన్న వారందరూ చచ్చిపోయే వరకూ, అనగా, కోటి కోటి సంవత్సరాలయ్యేవరకూ జనాలు పుట్టుతూ చస్తూ ఉంటారు కాబట్టి,అదంతా అయ్యే వరకూ, ’నువ్వు విచారణ లేకుండానే కాచుకొని ఉండాలి" అంటూ ఆ భగవంతుడు చెబితే,అది న్యాయమని అపించుకుంటుందా? మీరే చెప్పండి?"

జగద్గురువుల ఈమాటను విని ఆ క్రైస్తవ మత ప్రచారకుడుదిక్కుతోచని వాడైనాడు. అప్పుడు గురువులు ఆతనికి సమాధనము చెబుతూ,

మీకుమీ మతమేగొప్పది. మీరు దానిని అత్యంత శ్రద్ధతోఅనుసరించవలెను.అంతే కానీ, ఇతరులతో, ’మా మతమే శ్రేష్ఠమైనది, దానినే అందరూ అనుస రించవలెను, అలాగ ఏమైనా మీరు మా మతాన్ని అనుసరించక పోతే మీకు, నరకమూ, దుఃఖమే గతి అని చెప్పుట సాధువైనది కాదు. మీకు మీ తల్లి పూజనీయురాలు. ఇతరు లకు వారి వారి తల్లులు పూజనీయులు.’మా తల్లి మాత్రమేపూజనీయురాలు,ఇతరుల తల్లులు కాదు అంటూ మీరు చెప్పితే అది మీ మూఢత్వమే అవుతుంది. నా తల్లి కూడా ఇతరుల తల్లుల వలె సమానముగా పూజనీయురాలు అని తెలుసుకున్నపుడే మనలను ప్రపంచము ఆదరిస్తుంది. లేకుంటే ఛీత్కరిస్తుంది. అని ఉపదేశించినారు. ఆతడినివీడ్కొనునప్పుడు ఆతనికి జగద్గురువు లు ఎప్పటివలెనే ఫలమునిచ్చి సత్కరించి నారు. అతడు దానిని ఆదరముతో స్వీకరించి వెళ్ళిపోయినాడు.

ఆ తరువాత గురువులు భక్తులను ఉద్దేశించి ,

సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః|
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽత్తిష్వ కామధుక్||

"మొదట యజ్ఞములతో పాటు ప్రజలను సృష్టించి ప్రజాపతి,’ఈ యజ్ఞములు మీకు కామధేనువులగు గాక ’యని అంటాడు. బ్రహ్మ దేవుడు, జగత్తును సృష్టి చేయునపుడే అది సరిగ్గా నడుస్తూ ఉండుటకు అవసరమైన విధి-నియమములను రచించినాడు. ఇది మన మతపు గొప్పతనము. మన సనాతన ధర్మపు సిద్ధాంతము ప్రకారము, భగవంతుడు అనాది యైనవాడు. అలాగే ఈ ప్రపంచమూ,మనధర్మమూ కూడా అనాదిగా ఉన్నవి. జీవరాశులకు వాటి వాటి కర్మలకు తగినట్లు ఫలము ప్రాప్తిస్తుంది. దుష్టులకు దుష్టఫలము,సత్కర్ములకు మంచి ఫలము. కర్మలు అచేతనమైనవి-అంటే జడమైనవి.ఫలము నిచ్చేది భగవంతుడే.

భగవంతుడు దయాళువు అనునది దిటమైనమాట.. తప్పుచేసినవాడు తన తప్పునుప్రామాణికముగా ఒప్పుకొని క్షమాభిక్ష వేడితే న్యాయాధీశులు శిక్షను తగ్గిస్తారు కదా? కానీ ఇతడు పదే పదే తప్పులు చేస్తూ ప్రతిసారీ క్షమాభిక్షను కోరితే న్యాయాధీశుడుక్షమిస్తాడా? భగవంతుడు కూడా అట్లే.ప్రామాణికులైనవారిని క్షమిస్తాడు. కానీ పదే పదే తప్పుచేసే వాడిని ఖచ్చితముగాక్షమించడు. మన శాస్త్రములు శ్రద్ధతో పాటూ వివేకము కూడా ఉండవలెనని బోధిస్తాయి.ఇతరమతాలు శ్రద్ధ ఒక్కటీ ఉంటే చాలని చెబుతాయి. మత ధర్మములలో భావుకత మాత్రమే కాక విచారము చేయు ప్రవృత్తి కూడా ఉండవలెను.

శ్రీరామచంద్రుడు,శ్రీకృష్ణుడు వంటి అవతారాలు మన ధర్మములోమాత్రమే కనిపిస్తాయి.మనధర్మము వారివల్ల యేదో కొత్తగా స్థాపించబడినది కాదు. మన ధర్మము, అటువంటివారిని ఈ జగత్తుకు ప్రసాదించింది. ఇంతటిమహాత్మ్యమున్న సనాతన ధర్మములో మనందరమూజన్మించాము. ఈ సనాతనధర్మపు బోధనలను పాటించి మనమందరమూ శ్రేయస్సుకుతగినవారము కావలెను. అని ఉపదేశించినారు.

{శ్రీ శృంగేరీ శారదాపీఠము వారు కన్నడ భాషలో ప్రచురించిన *శృం
గేరీ పుణ్యక్షేత్రము* పుస్తకము నుండీ అనువాదము}

--: అరుణాచలేశ్వరుడు :--

మనకి" అష్టమూర్తి తత్త్వము" అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు.

అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు,

 సాకారోపాసన(రూపముతో) శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు.

 కంచిలో పృథివీ లింగం,

 జంబుకేశ్వరంలో జలలింగం,

 అరుణాచలంలో అగ్నిలింగం,

 చిదంబరంలో ఆకాశలింగం,

 శ్రీకాళహస్తిలో వాయులింగం,

 కోణార్కలో సూర్యలింగం,

 సీతగుండంలో చంద్రలింగం,

 ఖాట్మండులో యాజమాన లింగం –

 ఈ ఎనిమిది అష్టమూర్తులు.

 ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే.

 కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం.

అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు.

 అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు.

అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది.

 అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది.

ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర.

 అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు.

 అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది.

 కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు.

 అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి.

 అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది.

 అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు.

 అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు.

 అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు.

దర్శనాత్ అభ్రశదసి
 జననాత్ కమలాలే
 స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది.

మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు.

కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం.

ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది.

 అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది.

దాని పేరే అరుణాచలం.

 అచలము అంటే కొండ.

 దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది.

ఆకొండ అంతా శివుడే.

 అక్కడ కొండే శివుడు.

 కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు.

 అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు.

 అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి.

గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి.

 ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గుడి  ఉంటుంది.

అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు.

 అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం.

 దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది.

ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి.

 ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి.

 అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది.

 అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి.

ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు.

 అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగస్థానం.

 కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు.

 అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది.

 అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది.

 అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు.

 అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం.

ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు.

ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి.

 అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది.

అప్పటికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు.

 ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను.

 నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని, చందా ఇవ్వమని అడిగేది.

 ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది.

అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు.

అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది.

తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది.

 రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు.

ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది.

 అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది.

 తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది.

ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు.

 అటువంటి పరమ పావనమయిన క్షేత్రం.

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు.

 దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది.

 అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది.

అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది.

ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది.

ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది.

 పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.

అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది.

 ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు.

 లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.

అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు.

శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు.

 అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది.

ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు.

సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము.

స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే.

 అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రమించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు.

 అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ.

అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ.

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...