Wednesday, December 28, 2016

స్త్రీ విరోధి కాదు

మనుధర్మ శాస్త్రం ఒక పరిశీలన -7

శోచంతి జామయో యత్ర నినశ్యత్యాశు తత్కులమ్
న శోచంతి తు యత్రైతా వర్థతే తద్ది సర్వదా

వ్యభిచారులు, అత్యాచారులు, దుర్మార్గులైన పురుషుల వలన శోకించి ధుఃఖించే స్త్రీలు ఉన్న ఇల్లు, లేదా వంశం నశిస్తుంది. ఉత్తమ పురుషులతో ప్రసన్నంగా స్త్రీలు ఉన్న ఇల్లు లేదా వంశం ఎప్పుడూ అభివృద్ది చెందుతూ ఉంటుంది.

అరక్షితా గృహే రుద్దాః పురుషైరాప్తకారిభిః
ఆత్మానమాత్మనాయాస్తు రక్షేయుస్తాః సురక్షితాః

గృహంలో తండ్రీ, భర్త మొదలైన పురుషులున్నా కూడా స్త్రీలు ఎవరైతే తమను తాము రక్షించుకుంటారో వారే సురక్షితంగా ఉంటారు.

సువాసినీః కూమారీశ్చ రోగిణీ గర్బీణీః స్త్రియః
అదతిభ్యో 2గ్రేవైతాన్ భోజయే దవిచారయన్

నూతన వధూవరులకు, అల్పవయస్సుగల కన్యలకు, రోగగ్రస్తులైన స్త్రీలకు, గర్భవతులైన స్త్రీలకు, వీరికి అతిధులకంటే ముందు గా భోజనం పెట్టాలి.

పై శ్లోకాల వల్ల మనకు అర్థంకావలసింది ఒక్కటే మనువు స్త్రీ విరోధి కాదు. ముందు పోస్ట్ లలో మనుమహర్షి ఆస్తి విషయం లో స్త్రీలకు ఎలాంటి రక్షణ కల్పించాడో చూద్దాం.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...