Friday, January 29, 2021

గాయత్రి శాప విమోచన మంత్రాలు

గాయత్రి జపం సాధనకు ముందుగా శాప విమోచన మంత్రం జపించి గాయత్రి జప సాధన చేయాలి.. అది నియమం. 

అది తెలియక కొందరు కొన్ని లక్షల్లో జపం చేస్తూ ఉంటారు.. ఆ శాప మంత్రాలు ఇక్కడ ఇస్తాను మీరు అనుభవం గల గాయత్రి ఉపాసకులను కలిసి ఈ శాప విముక్తి విధానం. కూడా గ్రహించి ఆ విధంగా ముందు ఈ శాంతి జపము చేసి తర్వాత గాయత్రి చేయండి ఆ తల్లి మంత్ర శక్తి ఏంటో అనుభవ పూర్వకంగా చూడండి..

1.బ్రహ్మశాప విమోచన మంత్రములు

అస్య శ్రీ బ్రహ్మశాపవిమోచన మంత్రస్య నిగ్రహాను గ్రహకర్తా . ప్రజాపతి ఋషిః | కామదుఘా గాయత్రీ ఛందః | బ్రహ్మశాప విమోచనీయ గాయత్రీశక్తి:ప్రజా సవితాదేవతా | బ్రహ్మ శాపవిమోచనార్దే జపే వినియోగః

మంత్రము : 

సవితుర్భహ్మామేత్యుపాసనా తద్ర్బహ్మ విదో విదుస్తా ప్రయతంతి ధీరాః | సుమనసా వాచాయ మాగ్రతః బ్రహ్మశాసాద్విముక్తాభవ.

2. విశ్వామిత్ర శాప విమోచన మంత్రము

అస్య శ్రీ విశ్వామిత్ర శాపవిమోచన మంత్రస్య నూతన సృష్టికర్తా విశ్వామిత్ర ఋషిః వాగ్గుఘాగాయత్రీఛందః | భుక్తిముక్తి ప్రదావిశ్వామిత్రానుగృహీతా గాయత్రీ శక్తిః | సవితా దేవతా | విశ్వామిత్రశాపవిమోచనార్దే జపే వినియోగః ||

మంత్రము :

తత్వాని చాంగేష్వగ్ని చితోధియాంసః | త్రిగర్భాం యదుద్భవాం దేవాశ్శోచిరే ఎవ్వసృష్టించాం కళ్యాణీం సృష్టికరీం ప్రపత్యయమ్మ ఖాన్నిసృతో వేదగర్భః || ఓం గాయత్రీత్వం విశ్వామిత్ర శాపాద్విముక్తాభవ ||

3.వసిష్ట శాప విమోచన మంత్రము

వసిష్ట శాపవిమోచన మంత్రస్య, వసిష్ఠఋషిః

విశ్వోద్భవా గాయత్రీ ఛందః |

వశిష్టాను గ్రహీతా గాయత్రీశక్తిః | సవితాదేవతా | వసిష్ఠ శాప విమోచనార్దే జపే : వినియోగః 

మంత్రము : 

తత్వానిచాంగేష్యగ్ని చితోధియాంసః, ధ్యాయనివిష్ణోరా యుధానిబిభ్రతే  జనానతో శో పరమంచశశ్వత్ | గాయత్రీ మాపాచ్చుర సుత్త మంచధామ | ఓం గాయత్రి  వసిష్ట  శాపాద్విముక్తాభవ 

'అహ మార్కం మహజ్యోతి రర్కజ్యోతి రహం శివః | 

ఆత్మజ్యోతిహం శుక్తం శుక్ల జ్యోతిర సోహమోం | 

'అహో విష్ణు మహేశేశే దివ్యసిద్దే సరస్వతి |

'అజరే అమరేచైవ దివ్యయోనే నమోస్తుతే ||


ఈ బ్రహ్మశాప, విశ్వామిత్రశాప, వసిష్ఠ శాప మంత్రములను ముందుగా జపము చేసి, శాపనివృత్తమైన పిమ్మట గాయత్రీ మంత్రమును యధాశాస్త్రీయముగా పురశ్చరణము చేసిన యెడల గాయత్రీ మంత్ర యంత్రములు తప్పక సిద్దించును. పూర్వమొకప్పుడు గాయత్రీదేవి మంత్రమునకు బ్రహ్మ, విశ్వామిత్రుడు, వసిష్టుడు శాపము నిచ్చియున్నారు. 

కనుక ఈ శాపవిమోచన మంత్రములను జపము చేయకుండా గాయత్రీ మంత్రమును

"శత లక్షం ప్రజాస్వాపి గాయత్రీ నచసిద్ధ్యతి” 

అను న్యాయాను సారము నూరు లక్షల జపించినను ఫలించదు అను రహస్యమును అందరూ తెలుసుకోవాలి..

Thursday, January 28, 2021

ధ‌ర్మం అంటే ఏమిటి.?

ధర్మం అనే పదానికి చాలా విస్తృతమైన, గంభీరమైన అర్థాలున్నాయి. ధర్మం అనే పదానికి పుణ్యం, న్యాయం, స్వభావం, ఆచారం, వేదోక్త విధి, ఉపనిషత్తు, యజ్ఞం, విల్లు, సత్కర్మ, నీతి మొదలైన అర్థాలు నిఘంటువులో ఉన్నాయి. మరో రకంగా చూస్తే ధరించేది కాబట్టి ధర్మం అవుతుంది. ధర్మమే ప్రజలను ధరిస్తూ ఉంది. ఏది సంఘాన్ని కట్టుబాట్లలో నిలుపుతుందో అదే ధర్మమని పెద్దలు నిశ్చయించారు.

పురుషార్థాలు నాలుగు ఉన్నాయి. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటికి సనాతన ధర్మంలో ఉన్నత స్థానమిచ్చారు. ఇవి వేర్వేరుగా ఉన్నా ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. మొదటిదైన ధర్మంతోనే మిగతా మూడింటిని లగింపు చేసుకోవాలని పెద్దలు అంటారు. ధర్మాలు పాటించటమే కాక అర్థ సంపాదన ధర్మంగా ఉండాలని, కామం ధర్మ బద్ధమైనదే అయి ఉండాలని, ధర్మం గానే మోక్ష సాధ నకు కృషి చేయాలన్నది దీనిలో అంతర్గతంగా ఉన్న మరో అర్థమని వారు చెబు తుంటారు. ధర్మా చరణ అంటేనే అన్ని పనులు ధర్మబద్ధంగా చేయడమని మరి కొందరు చెబుతుంటారు. ఇక పురుషార్థాలలో ధర్మం గురించి మరింత విపులంగా తెలుసుకుందాం.

ధర్మం…

ధర్మం అనే పదానికి చాలా విస్తృ తమైన, గంభీరమైన అర్థాలున్నాయి. ధర్మం అనే పదానికి పుణ్యం, న్యాయం, స్వభావం, ఆచా రం, వేదోక్త విధి, ఉపనిషత్తు, యజ్ఞం, విల్లు, సత్కర్మ, నీతి మొదలైన అర్థాలు నిఘంటువులో ఉన్నాయి. మరో రకంగా చూస్తే ధరించేది కాబట్టి ధర్మం అవుతుంది. ధర్మమే ప్రజలను ధరిస్తూ ఉంది. ఏది సంఘాన్ని కట్టుబాట్లలో నిలుపుతుందో అదే ధర్మమని పెద్దలు నిశ్చయించారు.

వేదం మానవుణ్ని ఏది చేయమని ఆజ్ఞాపిస్తుందో అది ధర్మమని జైమిని మహర్షి మంత్రపూర్వకంగా తెలి పారు. వేదం సమస్త ధర్మాలకు మూలం, ప్రమాణమన్నది మనుస్మృతి. అహింసా పరమో ధర్మ: (ఏ ప్రాణిని హింసించక పోవడమే శ్రేష్ఠమైన ధర్మం. ధర్మ శబ్దం పది లక్షణాలతో కూడుకున్నదని మనుస్మృతికారుడు మరొక చోట విశేష వివ రణ ఇచ్చాడు.

దశ లక్షణాలు…

ధృతి..

ఎల్ల్లప్పుడూ ధైర్యంగా ఉండడం. ధర్మ కార్యాలను ఆచరించేటపుడు కలిగే కష్ట నిష్ఠురాలను సహిస్తూ వెనుకంజ వేయక ఆయా కార్యాలను పూర్తి చేయడం ధృతి అనబడుతుంది.

క్షమ..

ఓర్పు కలిగి ఉండడం. సుఖ దు:ఖాల్లో, లాభనష్టాల్లో మానావ మానాల్లో సహన శీలుడై సమ భావంతో ఉండటం క్షమ అనబడు తుంది.

దమము..

ఇంద్రియ నిగ్రహంతో ఉండటం

అస్తేయం..

దొంగతనం చేయకుండడం. ఇతరుల వస్తువులను వారి అనుమతిలేకుండా తీసుకోకూడదనే భావన.

శౌచము..

పవిత్ర భావాలు, భగవత్ప్రసాద బుద్ధి. దైవేచ్ఛ అనే ప్రపత్తి.

శమము..

మనో నిగ్రహం కలిగి ఉండడం.

ధీ..

ధీ అంటే బుద్ధి. బుద్ధిని మందగింపజేసే పనులు అనగా మాదక ద్రవ్య సేవనం, దుష్ట సాంగత్యం, సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండటం. మంచి బుద్ధి కలిగి ఉండడం.

విద్య..

పరమేశ్వర పర్యంతం పదార్థాల జ్ఞానం కలిగి వాని నుంచి ఉపకారం పొందడం విద్య. ఆత్మనందు ఉన్నట్టు మనస్సులో తలచడం, మనస్సులో తలచినది వాణి (మాట) ద్వారా పలకడం, వాణి మేరకే కర్మలయందు ప్రవర్తించడం విద్య.

సత్యం..

ఉన్నది ఉన్నట్టు చెప్పడం, వినడం, ఆచరించడం, సత్యమనబడుతుంది. సత్యం చెప్పాలిగాని ఇంపుగా చెప్పాలి. సత్యాన్ని అప్రియం అంటే కష్టం కలిగేట్లు చెప్పరాదు. ఇంపుగా ఉంటుంది గదా అని అబద్ధం చెప్పకూడదు. ఇది అనాదిగా వస్తున్న ధర్మం. ఉదాహరణకు అంగవైకల్యం కల వారిని అంగవైకల్యంతో సంబోధించరాదు.

అక్రోధం..

పరులకు కష్టాన్ని, హానిని కలిగించే కోపాన్ని విడిచి , శాంతం సౌమ్యం మొదలైన గుణాలను గ్రహించడం అక్రోధం అవుతుంది. ఈ పది లక్షణాలతో కూడిన పక్షపాతరహిత న్యాయాచరణమనే ధర్మాన్ని బ్రహ్మచారులు, గృహస్థులు, వాన ప్రస్థులు, సన్యాసులు అందరూ సేవించాలి. ఇది ధర్మం అనే పదానికి మనువు చెప్పిన నిర్వచనం. ధర్మాన్ని ఆచరించడం వల్ల అర్థకామాలు లభ్యమవుతాయని వ్యాస మహర్షి వచనం. అర్థాన్ని, కామాన్ని (కోరికలను) ధర్మంతో ముడిపెట్టి ఆచరించేవారికి మోక్ష మార్గం అప్రయత్నంగా లభిస్తుంది.


ధర్మ ఏవ హతో హంతి  ధర్మో రక్షతి రక్షిత:

ధర్మాన్ని నశింపజేసే వ్యక్తిని అది నశింపజేస్తుంది. ధర్మాన్ని రక్షించే వారిని అది రక్షిస్తుంది. అందువల్ల ధర్మాన్ని నాశనం చేయకూడదు. మన చేత ధర్మం చంపబడక మనలనది రక్షించుగాక. ధర్మాన్ని ప్రాణాపాయ స్థితిలో కూడా విడవరాదని మనువు అంటాడు.

మహాభారతంలో ధర్మరాజు ధర్మానికి ప్రతీక. భారతం ధర్మంతోనే ముగుస్తుంది. ధర్మం తెలిసిన వారు ధర్మానికి ఇబ్బంది కలిగించే ధర్మాన్ని ధర్మంగా భావించరు. ధర్మమనేది సర్వులకు హితమైనదై ఉండాలి. సమిష్టి ధర్మానికి, వ్యష్టిధర్మానికి వైరుధ్యం కలిగినప్పుడు వ్యష్టి ధర్మాన్ని త్యాగం చేయాలి. భీష్ముడు వ్యష్టి ధర్మాచర ణం కోసం సమిష్టి ధర్మానికి హాని చేయడం వలన మరణించాల్సి వచ్చిందని కొందరి అభిప్రాయం.

ధర్మాత్ములు…

తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ, ఈ ఐదింటిని పూజించేవారు ధర్మాత్ములు అని శాస్త్రం చెబుతోంది. ధర్మం నిత్యం. సుఖ దు:ఖాలు అనిత్యం. అందువల్ల సుఖేచ్ఛ చేత గాని, భయం చేత గాని, లోభం చేత కాని ప్రాణాపాయ స్థితిలో అయినా సరే ధర్మాన్ని విడువకూడదు. జీవుడు నిత్యుడు. అతడు నివసించే ఈ శరీ రం అనిత్యం. అందువల్ల్ల అనిత్యాలైన వాటి కోసం వ్యర్థ ప్రయత్నాలు చేయక నిత్యుడైన జీవుడు నిత్యమైన ధర్మం కోసం యత్నించడం శ్రేయస్కరమవుతుంది.

నారాయణ ఉపనిషత్తు ప్రకారం – ‘ధర్మమే సర్వ జగత్తుకు ఆధారము’. ‘మనుస్మృతి’ ప్రకారం ధైర్యం, క్షమ, సంయమనం, అస్తేయం, శౌచము, ఇంద్రియ నిగ్రహం, విద్య, సత్యం, క్రోధ రాహిత్యం, సంశయం లేకుండా ఉండుట. ఈ పదింటిని జీవితంలో ధరించుటయే(పాటించుటయే) ధర్మం.

తమ ధర్మాన్ని ఎవ్వరైతే పాటిస్తారో వారు ఇహలోకంలోను, పరలోకంలోనూ సుఖశాంతులతో జీవిస్తారు. మరణించిన తరువాత పరలోకంలో భార్యపుత్రులు, బంధువులు మనకు సహాయపడరు. అక్కడ మనం ఆర్జించిన ధర్మమే మనకు సహాయపడుతుంది. అందువల్ల మనుష్యులందరూ ధర్మ బద్దంగా నడుచుకోవాలి మరియు వారి వారి బాధ్యతలను ధర్మ బద్దంగా నిర్వర్తించాలి.

మనం ఆర్జించిన పదార్థాలన్నీ మన శరీర పరిత్యాగంతో దూరమైపోతాయి. ఒక్క ధర్మం మాత్రమే మన వెంట వస్తుంది. మనలను రక్షిస్తుంది.నిజానికి అదే మానవులందరికీ నిజమైన నేస్తం. అందుకే –

ధర్మో రక్షతి రక్షితః అని అన్నారు – అంటే రక్షింపబడిన ధర్మం మనలను రక్షిస్తుంది. సంపాదించన ధర్మం కారణంగానే వ్యక్తి నరకాన్నుండి తనను తాను రక్షించుకొంటాడు. అధర్మం మనలను నాశనం చేస్తుంది.

ఈ శరీరం నీటి బుడగ వలె క్షణభంగురమైనది. ఎప్పుడు అది అంతరిస్తుందో మన మెరుంగం. అందువల్ల మన కళ్యాణానికి, మన ఆత్మలను ఉద్దరించుకోవడానికి మనం విధిగా ధర్మాన్ని పాటించాలి. ధర్మంగా ఉండాలి.

ధర్మం కంటె శ్రేష్టమైనది వేరే ఏది లేదు. ధర్మాచరణ ద్వార నిర్భలుడు కూడ శక్తివంతులపై విజయం సాదించవచ్చు. అందువల్ల తాత్కాలికమైన కోరికల కోసం, దానం కోసం, లోభం కోసం ధర్మాన్ని పరిత్యజించరాదు. ధర్మం శాశ్వతమైనది. సుఖదుఃఖాలు ఆశాశ్వతమైనవి. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. శాశ్వతమైన జీవాత్మను అశాశ్వతమైన పదార్థాల ఆసక్తివైపు మరల్చడం వాళ్ళ మనకే నష్టం జరుగుతుంది.

ధర్మాచరణ ద్వార అధర్మంపట్ల మనం ఆసక్తిని తగ్గించుకోవచ్చు. కుటుంబంలో సద్బుద్దిని పెంచుకోవచ్చు. కుటుంబ సభ్యులతో సత్యపూరితమైన ప్రవర్తనను నిర్మించుకోవచ్చు. మనమంతా తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ధర్మాచరణ ద్వార వ్యక్తి ‘ఆత్మ జ్ఞానాన్ని’ పొందుతాడు. సచ్చిదానందుడగు ఈశ్వరునిలో లీనమవుతాడు. ఈ సందర్భంగా హరిచ్చంద్రుడు, శిబిచక్రవర్తి, రుక్మాంగద మహారాజు, నల చక్రవర్తి, మేఘనాధుడు, తలాధరుడు, ఏకనాధుడు, మణికుండలుడు, మహర్షి దిధీచి వంటి భక్తులు పేర్కొనదగినవారు.

భగవంతుడు ప్రాణులను ఏ ప్రయోజనం నిమిత్తం సృస్టించాడో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చడమే వాటి ధర్మం. “ధారణాద్ధర్మ”.

సూతుదు శౌనకాది మునులతో, ‘దేన్నీ ఆచరించడం వాళ్ళ భాగవతుని పట్ల నిష్కామ భక్తీ జనిస్తుందో ,దేనివల్ల అంతరాత్మ సదా ఆనందంగా ఉంటుందో అదే మానవుని యొక్క ఉత్తమ ధర్మం’. అని అన్నాడు. 

వ్యక్తులు జీవితంలో అవలంభించదగినది ధర్మం. పాటించ దగ్గది ధర్మం. భారతీయ వాజ్మయంలో ధర్మానికి వ్యాపకమైన అర్ధమున్నది. వర్ణాశ్రమ ధర్మం, క్షేత్ర ధర్మం, భ్రాత ధర్మం, పాతివ్రత్య ధర్మం, రాజధర్మం, ఆపద్దర్మం మొదలగునవి. ఈ ధర్మ సూత్రాల ఆధారంగానే కురుక్షేత్ర యుద్ద సమయంలో శ్రీకృష్ణుడు అర్జునినికి, అర్జునా! నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని తెలిపినాడు. 

‘ధర్మోహి విశ్వస్య జగతః ప్రతిష్టా’ - నిజానికి ధర్మం ఈ జగత్తునకు ఆధారం. ఈ జగత్తు కీర్తి ప్రతిష్టలు కూడ ధర్మం పైనే ఆధారపడి ఉన్నాయి. అధర్మాచరణము వల్ల ప్రాణులకు దుఃఖాలు కలుగుతాయి. ధర్మాచరణం వల్ల సకల సుఖాలు లభిస్తాయి. ధర్మాచార్ణం వాళ్ళ మనకు మేలు కలుగుతుంది. ఇతరులకు కూడ మేలు కలుగుతుంది. స్వధర్మాన్ని ఆచరించడం చాల శ్రేయస్కరము. సత్పురుషులు స్వయంగా ఏ విధంగా నడుచుకుంటారో, ఇతరులును ఏ విధంగా నడుచుకోమని తెలుపుటారో అది ధర్మం. వారు దేనిని ఆచరించరో, దేనిని నిందిస్తారో అది అధర్మం.

అగ్ని ధర్మం కాల్చుట, నీటి ధర్మం శుద్ధి పరచుట, త్రాగిన వారి ప్రాణరక్షణ చేయుట, వాయువు మనకు ప్రాణశక్తి నోసంగుట. అదేవిధంగా మానవులమైన మనకు కూడ కొన్ని ధర్మాలున్నాయి. వాటిని పాటించడం మన కర్తవ్యం. అహింస, సత్యం, అస్తేయం, ప్రేమ ఇవి మానవులందరి సామాన్య ధర్మాలు. స్వార్ధాన్ని, అభిమానాన్ని విడునాడుట. తన కర్తవ్యాన్ని నెరవేర్చుట, లోపల బయట శుచిగా ఉండుట, ఇంద్రియ నిగ్రహం ,దానం చేయుట. మానసిక సంయమనం కలిగి యుండుట ఇవి అన్నియు కూడ ధర్మపు స్వరూపాలు.

మనుషులందరూ సుఖాన్ని కాంక్షిస్తారు. ధర్మాచరణము వల్లనే సుఖం సాధ్యమవుతుంది. అందువల్ల ప్రతివ్యక్తి తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చాలి. అధర్మానికి మొదట విజయం లభిస్తున్నట్లు కనిపించిన చివరకు దానికి పరాజయమే లభిస్తుంది. భూమిలో విత్తిన గింజవలె పాప ఫలితం వెంటనే కనిపించదు. కాని సరియైన సమయం వచ్చినపుడు చేసిన పాపం పాపాత్మున్ని సమూలంగా నాశనం చేస్తుంది.

శ్రీ మద్భాగవతంలో మహారాజైన శుకదేవుడు ధర్మసంస్థాపన చేయడానికి అధర్మాన్ని నాశనం చేయడానికి సర్వ శక్తిమంతుడైన భగవంతుడు అవతారాన్ని ఎత్తుతాడు అని సెలవిచ్చాడు. ఇదే విషయాన్నీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడ ‘పవిత్రాణాయ సాధునాం, వినాశాయ చ దుష్కృతం | ధర్మ సంస్థాపనార్దాయ సంభవామి యుగే యుగే||’ అని అర్జునితో తెలిపినాడు.

నిరాకర స్వరూపమైన ఆ పరమాత్ముణ్ణి నిరంతరం మనం స్మరించడం వలన మనం ధర్మం పట్ల ఆశక్తిని పెంచుకోవచ్చు. భగవంతుని స్వరూపమే ధర్మం. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుణ్ణి మన మనసులో నిరంతరం స్మరిస్తూ మనం మన జీవితాలను సుఖమయం చేసుకోవచ్చు.

అతిరథ మహారథులు..అంటే..ఎవరు.

యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి. 

ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..

  • రథి, 
  • అతిరథి, 
  • మహారథి, 
  • అతి మహారథి, 
  • మహా మహా రథి.


1) రథి..

ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.

సోమదత్తుడు, 

సుదక్షిణ, 

శకుని, 

శిశుపాల, 

ఉత్తర, 

కౌరవుల్లో 96మంది, 

శిఖండి, 

ఉత్తమౌజులు, 

ద్రౌపది కొడుకులు -

వీరంతా..రథులు.


2) అతి రథి (రథికి 12రెట్లు)..

60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

లవకుశులు, 

కృతవర్మ, 

శల్య, 

కృపాచార్య, 

భూరిశ్రవ, 

ద్రుపద, 

యుయుత్సు, 

విరాట, 

అకంపన, 

సాత్యకి, 

దృష్టద్యుమ్న, 

కుంతిభోజ, 

ఘటోత్కచ, 

ప్రహస్త, 

అంగద, 

దుర్యోధన, 

జయద్రథ, 

దుశ్శాసన, 

వికర్ణ, 

విరాట, 

యుధిష్ఠిర, 

నకుల, 

సహదేవ, 

ప్రద్యుమ్నులు 

వీరంతా..అతిరథులు.


3) మహారథి (అతిరథికి 12రెట్లు).

7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

రాముడు, 

కృష్ణుడు, 

అభిమన్యుడు, 

వాలి, 

అంగద, 

అశ్వత్థామ, 

అతికాయ, 

భీమ, 

కర్ణ, 

అర్జున, 

భీష్మ, 

ద్రోణ, 

కుంభకర్ణ, 

సుగ్రీవ, 

జాంబవంత, 

రావణ, 

భగదత్త, 

నరకాసుర, 

లక్ష్మణ, 

బలరామ, 

జరాసంధులు 

వీరంతా..మహారథులు.


4) అతి మహారథి (మహారథికి 12రెట్లు).

86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.

ఇంద్రజిత్తు, 

పరశురాముడు, 

ఆంజనేయుడు, 

వీరభద్రుడు, 

భైరవుడు - 

వీరు..అతి మహారథులు.

రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు, అటు ఇంద్రజిత్తు - ఇటు ఆంజనేయుడు. 

రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే


5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) .

ఏకకాలంలో 207,360,000

(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, 

దుర్గా దేవి, 

గణపతి మరియు 

సుబ్రహ్మణ్య స్వామి, 

వీరంతా..మహామహారథులు.


మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం 

హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ..యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు. 

అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు.

జై దుర్గా మాత..!!


లోకా సమస్తా సుఖినోభవంతు..!

శ్రీచండీభుజంగస్తోత్రం

 1) చండముండరాక్షసభవ్యసంహారిణీం 

    రక్తబీజాసురహంతశ్రీకాళికాం 

    త్రయీనిత్యసన్నుతతేజఃస్వరూపిణీం 

    భజే చండికాంబాం నవశతీరూపిణీం ||

2) మార్తాండశశికోటిప్రభాభాసురాం 

   ఆసురీశక్తిదమనదివ్యప్రభావాం 

   కాలకాలమనఃస్సరోవరవిహారిణీం 

   భజే చండికాంబాం నవశతీరూపిణీం ||

3) భక్తమార్కండేయవందితాంఘ్రియుగళాం 

    భుక్తిముక్తిదాయకసంసారతారిణీం 

    భక్తజనాళీరక్షకరుణాంతరంగిణీం  

    భజే చండికాంబాం నవశతీరూపిణీం ||

4) హరిద్రాకుంకుమచందనాదిచర్చితాం 

   పరమయోగీంద్రనుతశ్రీనవాక్షరీం 

   రత్నకంచుకాధరజపాకుసుమభాసురాం  

   భజే చండికాంబాం నవశతీరూపిణీం ||

5) త్రిభువనైకపాలకలోకేశ్వరేశ్వరీం 

   రమావాణీసేవితశ్రీమనోన్మనీం 

   దంభదర్పనిలయమహిషాసురమర్దినీం 

   భజే చండికాంబాం నవశతీరూపిణీం ||

సర్వం శ్రీ చండీ దివ్యచరణారవిందార్పణమస్తు

Wednesday, January 20, 2021

ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ?

నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశించి , మరణ అనంతరం పుణ్య లోకాలు పొందుతాము ...

-- గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !!

-- శివాష్టకం - శివ అనుగ్రహం !!

-- ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !!

--శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !!

-- అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !!

-- కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !!

-- దుర్గష్టోత్తర శతనామం - భయహరం !!

-- విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!

-- సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !!

-- హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !!

-- విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!

-- శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!

-- భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !!

-- శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !!

-- లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !!

-- కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !!

-- ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !!

-- శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !!

-- లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !!

-- శ్యామాల దండకం - వాక్శుద్ధి !!

-- త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి !!

-- శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి !!

-- శని స్తోత్రం - శని పీడ నివారణ !!

-- మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం !!

-- అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి !!

-- కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం !!

-- కనకధార స్తోత్రం - కనకధారయే !!

-- శ్రీ సూక్తం - ధన లాభం !!

-- సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది !!

-- సుదర్శన మంత్రం - శత్రు నాశనం !!

-- విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం !!

-- రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!

-- దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!

-- భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు !!

-- వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!

-- దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!

-- లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి !!


⭐⭐⭐ పంచరత్నం - 5 శ్లోకాలతో కూడినది !!

⭐⭐⭐ అష్టకం - 8 శ్లోకాలతో కూడినది !!

⭐⭐⭐ నవకం - 9 శ్లోకాలతో కూడినది !!

⭐⭐⭐ స్తోత్రం - బహు శ్లోకాలతో కూడినది !!

⭐⭐⭐ శత నామ స్తోత్రం - 100 నామాలతో స్తోత్రం !!

⭐⭐⭐ సహస్రనామ స్తోత్రం - 1000 నామాలతో స్తోత్రం !!


పంచపునీతాలు

⭐ వాక్ శుద్ధి 

⭐ దేహ శుద్ధి 

⭐ భాండ శుద్ధి 

⭐ కర్మ శుద్ధి 

⭐ మనశ్శుద్ధి 


-- వాక్ శుద్ధి :

వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు .... కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు .... పగ , కసి , ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు .... మంచిగా , నెమ్మదిగా , ఆదరణతో పలకరించాలి .... అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి .... 


-- దేహ శుద్ధి :

మన శరీరం దేవుని ఆలయం వంటిది .... దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , రెండు పూటలా స్నానం చెయ్యాలి .... చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు ....


-- భాండ శుద్ధి :

శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం .... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి .... స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది ....


-- కర్మ శుద్ధి :

అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు .... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు .... తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు ....


-- మనశ్శుద్ధి :

మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి .... మనస్సు చంచలమైనది .... ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది .... దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి .... దీని వల్ల దుఃఖం చేకూరుతుంది .... కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి ...


-- ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది !!

-- ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది !!

-- నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది !!

-- యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది !!

-- సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది !!

-- గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది !!

-- సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది !!

-- పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది !!

-- భక్తి ప్రవేశిస్తే మనిషి మనీషి అవుతాడు !!

Tuesday, January 19, 2021

వారణాసి (కాశీి) గురించి తెలియని కొన్ని విషయాలు

కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం

1.  కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు.

2.  విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం.

3. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం.

4. స్వయంగా శివుడు నివాసముండె నగరం.

5. ప్రళయ కాలంలో మునుగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు.

6. కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది.

7. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.

8. కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....

9. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు.

10. కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.

11. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....

12. డూండీ గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...

13. కాబట్టే కాశీలో కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

14. కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.

15. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

16. అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.

17. మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

18. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది

19. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

శివుని కాశీలోని కొన్ని వింతలు

1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.

3. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు.

5. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?

6. అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు

7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

8. కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు .

9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

10. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

11. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

12. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

13.  ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.

14. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :

1) దశాశ్వమేధ ఘాట్:

బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్:

ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్:

చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్:

సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.

ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్:

పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్:

ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్:

ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్:

ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్:

గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్:

తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.

11) హనుమాన్ ఘాట్:

ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది

ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్:

పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్:

సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్:

ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది.

ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్:

నారదుడు లింగం స్థాపించాడు.

16)చౌతస్సి ఘాట్:

ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు.

ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్ ఘాట్:

ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.

18)అహిల్యా బాయి ఘాట్

ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ

విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.

కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము.

విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.

అక్కడే శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు

కాశీ స్మరణం మోక్షకారకం!


కాశీ విశ్వనాధాష్టకం


గంగాతరంగ రమణీయ జటా కలాపం,

గౌరీ నిరంతర విభూషిత వామ భాగం;

నారాయణ ప్రియ మదంగ మదాప హారం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||1||


వాచామ గోచర మనేక గుణ స్వరూపం,

వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం;

వామేన విగ్రహవరేణ కళత్ర వంతం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||2||


భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం,

వ్యాగ్రాజిలాం భరధరం జటిలం త్రినేత్రం;

పాశాంకుసాభయ వర ప్రద శూల పాణిం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||3||


సితాంసుశోభిత కిరీట విరాజ మానం,

పాలేక్షణానల విశోసిత పంచ భానం;

నాగాధిపారచిత భాసుర కర్ణ పూరం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||4||


పంచానలం దురిత మత్త మతంగ జానాం,

నాగాంతకం దనుజ పుంగవ పన్న గానాం;

దావానలం మరణ శోక జరాట వీణా,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||5||


తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం,

ఆనంద కంద మపిరాజిత మప్రమేయం;

నాగాత్మకం సకల నిష్కలమాత్మ రూపం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||6||


ఆశాం విహాయ పరిహృత్య పరస్యనింత,

ఉపేరతించ సునివార్య మనఃసమాదౌ;

ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రదేశం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||7||


నాగాధి దోష రహిత స్వజనానురాగం,

వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం;

మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||8||


వారాణసీ పురపతేః స్థవనం శివస్య,

వ్యాసోత్త మిష్ఠక మిదం పఠితా మనుష్య;

విద్యాం శ్రియం విపుల సౌక్య మనంత కీర్తిం,

సంప్రాప్య దేహ నిలయే లభతేచ మోక్షం.||9||


విశ్వనాధాష్టక మిదం యః పఠేచిత శివ సన్నిదౌ,

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ .....  జన్మ జన్మలకు నీతోనే ఉండే భాగ్యం ప్రసాదించు స్వామీ... హర హర మహాదేవ

ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు

(కృష్ణార్జునులు కాదు మేము అడిగేది) నరనారాయణులనగా ఎవరు?

నరనారాయణులనగా జీవుడు, దేవుడు. నరుడంటే నశించని వాడు. నారాయణుడంటే నశించని వాళ్ళందరికీ మూలము అయినటువంటి వాడు. అతని నుంచి అందరూ దిగి వచ్చి, అతని లోకే అందరూ వెడుతూ ఉంటారు. తన యందు, తన ప్రవర్తనము నందు అప్రమత్తుడైనటువంటి వాడు నరుడు. వీరిద్దరు ప్రపంచములో ఎలా ప్రవర్తించాలో నిర్వర్తించి చూపించారు.*

*శ్రీరాముడిని మించిన నరుడు లేడు. సంపూర్ణముగా నరుడిగా దిగివచ్చి, నరత్వమంటే ఏమిటో చూపించాడు. మానవునికి నరుడి దగ్గరనుంచి నేర్చుకోవలసిన కళ్యాణ గుణములు ఉన్నాయి. నారాయణుడు చేసేటటువంటి కార్యములన్నీ అతి మానుషీ కార్యములుగా ఉంటాయి. అదే శ్రీకృష్ణుని జీవితములో గోచరిస్తూ ఉంటుంది. అందుకనే శ్రీకృష్ణుడు చెప్పినట్టు చేయమంటారు. రాముడు నడిచినట్లు నడవమని చెపుతారు.

మోక్షమంటే ఏమి?

మోక్షం

ఒక గురువు తన శిష్యులతో అరణ్యమార్గాన వెళ్తుండగా ఒక నదిని దాటవలసి వచ్చింది. అదే సమయంలో నదిని దాట లేక ఒక యవ్వనవతి ఆ శిష్యుల సహాయాన్ని అర్థించింది. అందరూ నిరాకరించినా, ఒక శిష్యుడు మాత్రం ఆమెను ఎత్తుకుని నది దాటించి, కిందకు దించాడు. తర్వాత ఆమె దారిన ఆమె వెళ్లిపోయింది. రాత్రి ఒక అనుకూలమైన చోట విశ్రమించిన తర్వాత శిష్యులంతా ఆ గురువు దగ్గరకు వచ్చి, ‘మనమంతా బ్రహ్మచర్యం పాటిస్తున్నాం కదా, ఆ శిష్యుడు స్త్రీని ఎత్తుకొని నది దాటించాడు..’ అని ఫిర్యాదు చేశారు. దానికి గురువు ‘ఆ శిష్యుడు ఆ స్త్రీని అక్కడే దించి వేశాడు. కానీ, మీరంతా ఇంకా ఆమెను మీ మనసులో మోస్తూనే ఉన్నారు’ అన్నాడు. ‘అష్టావక్ర గీత’లో జనకునితో అష్టావక్రుడు.. ‘ఓ రాజా! దేహం కంటే ఆత్మ వేరని విచారించి తెలుసుకుని, నీ ఆత్మపైనే మనసును ఎల్లవేళలా లగ్నం చేసినట్లయితే నువు సుఖశాంతులను పొందుతావు. ఎంతవరకు నీలోని ‘చిజ్జడగ్రంధి’ నాశనం కాలేదో అంటే పరస్పరా ధ్యాస నాశనం కాలేదో, అంతవరకు బంధమున్నట్లే..’ అన్నాడు. ‘బంధం పెనవేసుకుని ఉండటమే’ మోక్షరాహిత్యం. ‘మోక్ష’మంటే ‘ఈ బంధనాలను అన్నిటినీ వదిలేసుకోవడమే. ‘చిజ్జడగ్రంథి’ శరీరంలోని జీవగ్రంథి కాదు. అదొక మానసిక స్థితి. శరీరం, మనసులవల్ల ‘నేను’, ‘నాది’, ‘నాతో’ అనే కర్తృత్వ భోక్తృత్వాలను అనుభవించడమే ఈ గ్రంథి తత్తం.    

‘మోక్షమనేది స్వర్గంలోనో, లోకాంతరంలోనో ఉండేది కాదు.  ఏదో ఇంటి లోపలగాని, గ్రామంలోగానీ ఉండేదీ కాదు. మనసులోని అజ్ఞానగ్రంథి నాశనమే మోక్షం’. కర్మ నిరంతర ప్రవాహం. అది జరుగకుండా ఆపడం ఎవరివల్లా కాదు. ‘చావు పుట్టుకలతోసహా అనేక విషయాలపై మనకు అధికారం లేనపుడు, మధ్యలోని ఈ జీవితంపై మమకారం ఎందుకు?’ అని ఉపనిషత్తులు, భగవద్గీతాది ధార్మిక సాహిత్యం ప్రశ్నిస్తున్నది. కర్మలను ఆచరిస్తూనే, వాటిపట్ల మానసిక బంధనాలను తుంచి వేసుకోవడమే మోక్షం. అదే అసలు సిసలైన ‘ఆనందమయ స్థితి’. ‘స్వాత్మప్రకాశిక’లో జగద్గురువు ఆదిశంకరులు మోక్షస్థితిని స్పష్టం చేశారు. ‘జ్ఞాని అనేవాడు రాజ్యాన్ని పరిపాలించవచ్చు. బిచ్చమెత్తి జీవించవచ్చు. కలలోని పాపపుణ్యాలు జాగ్రదావస్థలో లేనట్లే, జాగ్రదవస్థలోని పాపపుణ్యాలు నాకు లేవు’ అని అంటారాయన. ‘మేఘాలు ఆకాశంలో వున్నా అవి ఆకాశాన్ని అంటనట్లు, సంసార సుఖదుఃఖాలు నన్ను అంటజాలవు’ అన్నది వారి బోధన. ఆదిశంకరుల ‘వివేక చూడామణి’ ప్రకారం కూడా ‘జీవిత చరమాంకంలో దండ కమండలాలు పట్టుకుని సన్యాసాశ్రమంలో చేరటం మోక్షం కానే కాదు. కష్టించి పనిచేస్తూనే ఫలాధికారాన్ని వదిలి వేయడమే మోక్షం’. 

‘బ్రహ్మభూతస్థితిలో, పరబ్రహ్మతో ఏకీభావ స్థితిలో ఉన్నవాడు దేనికీ శోకింపడు, దేనినీ కాంక్షింపడు. సర్వభూతాలను సమానంగా చూసేవాడు పరాభక్తిని పొందుతాడు’ (భగవద్గీత: మోక్షసన్యాస యోగం). ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలను సాధించడమే మానవ జీవిత లక్ష్యమైనపుడు ధర్మార్థకామాలను భూమిమీదే సాధించి, నాల్గవ దానిని అనంతంలో సాధించాలని అంటే ఎలా? మోక్షమూ భూమిమీదే సాధించాలి. ఈ నాలుగూ నిరంతరంగా సాగే మానవ ధర్మాలు కావాలి. మొత్తంగా ఆత్మతత్త్వాన్ని అర్థం చేసుకోవడమే మానవుడిని ఉత్కృష్టమైన స్థితిలో నిలబెడుతుంది. అదే ‘పరబ్రహ్మ స్థితి’గా చెప్పుకునే ‘బ్రహ్మభూతస్థితి’. దీనినిబట్టి ‘మోక్షం’ అంటే ‘మరణానంతరం పునర్జన్మ లేనటువంటి స్థితి కాదు. జీవించి ఉండగానే కర్మఫలాపేక్ష లేని అత్యున్నతమైన, ఎలాంటి విషయ వాసనలూ లేని, ఆనందభరితమైన మానసిక స్థితి’ అని గ్రహించాలి. ఆ నిశ్చల, నిర్మోహ, నిర్వికార మానసిక ఆనందమే మోక్షం.

గోపికలు తరువాత విష్ణురూపుడైన ఆ కృష్ణ పరమాత్మతో ఎవరూ పొందలేని సాన్నిహిత్యాన్ని  పొందిన వారు ఎవరు?

పరమాత్మ గురించి, ఆయన అనుగ్రహం గురించి అంతగా తపన పడవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించేవారికి భాగవతం అతి సున్నితమైన సమాధానం ఇస్తుంది. ‘దాహార్తి తీర్చుకునేందుకు నీరు, క్షుద్బాధ తీరడానికి ఆహారం, శరీర తాపం తగ్గడానికి చల్లని గాలి... ఇలా సృష్టిలో ప్రతి అంశానికీ ఒక పరిష్కార మార్గం ఉన్నట్లే ఆధ్యాత్మిక (గత జన్మ వాసనా బలంతో సంక్రమించిన), ఆదిభౌతిక (ఈ జన్మలో చేసిన కర్మ ఫలితం), ఆదిదైవిక (దైవ సంబంధమైన) కష్టాలు తొలగిపోవాలంటే ఒక సరళమైన తరుణోపాయం ఉండాలి. ఆ మార్గమే భగవదన్వేషణ, ఆరాధన.

ఇదే తప్ప అన్య మార్గం లేదు.ఆ పరమాత్ముని మనసా..  వాచా , కర్మణా  కొలిచిన వారిని వాటికి ప్రతిగా సదాచార వర్తనులు, మనోనిగ్రహపరులు, పరిశుద్ధాంతరంగులు అయ్యేటట్లు అనుగ్రహిస్తాడు. 

ఆ దైవానుగ్రహం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది..

విష్ణురూపుడైన ఆ పరమాత్మతో ఎవరూ పొందలేని సాన్నిహిత్యాన్ని సాధారణ గోపాలకులు పొందారు కదా..

కల్మషం లేనివారి స్వచ్ఛమైన మనోభావాలు, ప్రేమానురాగాలే భగవానుడి కృపావర్షానికి కారణాలు.

విలు విద్య ప్రావీణ్యంలో సాక్షాత్తు కోదండరాముడే మెచ్చుకొనే స్థాయిలో  గల వారు ఎవరు?

జగదేక ధానుష్కుడైన రాముడికి తొలుత విల్లు పట్టడం నేర్పిన గురువు కైక. విలువిద్యలో ఆమె గొప్ప ప్రవీణురాలు. ఆ మాటను రాముడే చెప్పాడు. రాక్షస వీరుల్లో ఎవరైనా విలువిద్యలో అమోఘ ప్రదర్శన కనబరిస్తే రాముడి మొహంలో మెచ్చుకోలు కనపడేది. వెంటనే కైక ఆయన ఎదలో మెదిలేది. రెండు మూడు సందర్భాల్లో ‘ఇతడు అద్భుతమైన విలుకాడే గాని, నా పినతల్లి చేతిలాఘవం, ఆమెకు తెలిసిన ఒడుపులు కిటుకులు వీని గురువు ఇతడికి నేర్పలేదు’ అని రాముడు అనుకొనేవాడట. అంటే ఆ విద్యలో కైకేయికి గల నైపుణ్యం, ప్రావీణ్యం సాక్షాత్తు కోదండరాముడే మెచ్చుకొనే స్థాయివి. వారిద్దరి మధ్యగల బంధంలో ఇదొక బలమైన ముడి. రాముడికి ఆమె పట్ల అవ్యాజమైన ప్రేమ. అటు కైకేయికీ అంతే. ఆమాటకొస్తే భరతుడి కన్నా రాముడంటేనే ఆమెకు ఎక్కువ ఇష్టం.

పారవశ్యం అంటే పరులకు వశమైపోవడం అనేది సామాన్యార్థం,పారవశ్యం అంటే సరైన అర్థమేమి?

పారవశ్యం అంటే పరులకు వశమైపోవడం అనేది సామాన్యార్థం. పర అనే పదానికి ‘ఇహం కానిది, పైన ఉండేది’ అనేవి సరైన అర్థాలు.

పరమందు(పైను)న్నవాడు కాబట్టి సర్వాత్మకుణ్ని ‘పరమాత్మ’ అంటారు. ఆయనకు వశమైనవాడు పరవశుడు. అతడు పొందే స్థితి పారవశ్యం. ఆ స్థాయికి చేరుకున్నవారు పొందేది అనురాగ ద్వేషాలకు అతీతమైన నిర్వికార స్థితి. లోక కల్యాణమే వారి ధ్యేయం.

భాగవతాన్ని వ్యాసుడు రచించింది, పోతన అనువదించింది- ఆ స్థితికి చేరుకున్నాకే. అందుకే భాగవతాన్ని చదివే/వినేవారికి సైతం క్రమేపీ నిర్వికార స్థితి కలుగుతుంది.

పారవశ్య ప్రాథమిక దశలు ఆత్మానందం, శరణాగతి

"ఖ్యాతి" ఎవరు?

హిందూ పురాణంలో ఖ్యాతి, దక్ష ప్రజాపతి, ప్రసూతి కుమార్తె. పురాణాల ప్రకారం, దక్షుడు భార్య ప్రసూతి నుండి 24 మంది కుమార్తెలు, అతని మరొక భార్య పంచాజని (విరిణి) నుండి 62 మంది ఉన్నారు. దక్షుడు కుమార్తెలలో ఖ్యాతి ఒక ప్రముఖురాలు. ఈమె శివుని భార్య అయిన సతి సోదరి.

జగన్నాథ - రథయాత్ర సంపూర్ణ వివరాలు

 1) పూరి మందిరం పేరు ఏమిటి?( శ్రీ మందిరం ) 2) రథయాత్ర  ప్రారంభమయ్యే తొలితిధి ఏది?( ఆషాడ శుద్ధ విదియ ) 3) పూరీ మందిరాన్ని వదిలి ఈ తొమ్మిది రో...