Thursday, December 31, 2020

యక్ష ప్రశ్నలు

ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు:

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహాయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయమువలన)

12. జీవన్మృతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తృణం కంటే దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ఞం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కుమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)

Wednesday, December 30, 2020

అయ్యప్ప మాలాధారణ మంత్రం అర్థ వివరణ

మాలా విసర్జన మంత్రం అర్థ వివరణ

ముందు  మంత్రం అనగానేమీ? మంత్రం అనే పదం సంస్కృతం లో నుండి వచ్చినది. మంత్రాన్ని రెండుగా విడదీస్తే   మన్ + త్ర  అవుతుంది. మన్ (మ్నస్సు) అనగ  “చింతన చేయు(నది)ట” అని అర్థం వస్తుంది.  “త్ర” అనగా  ఉపకరణాలు. ఉపయోగపడునవి.  “చింతన సాధనం” - చింతన సాధించుటకు  ఉపయోగపడునది అని స్థూలార్థముగా చెప్పుకోనవచ్చును.

సకల మంత్రాలకు ఆధారమైనది “ప్రణవమంత్రం” గా పిలువబడే బీజాక్షరం “ఓం”  ప్రతి మంత్రం “ఓం”  తోనే ప్రారంభింప బడుతుంది.  ఒక మంత్రాన్ని పదే పదే  ఉచ్చరించటాన్ని “జపం” అని చెప్పవచ్చు. అటువంటి మంత్రాలను “జప మంత్రం”- అని అంటారు. ప్రతి మంత్రానికి అత్యున్నతమైన అర్థం ఉంటుంది. ప్రతి అక్షరం పలుక వలసిన రీతిలో అనగా నిర్ధిష్టమైన స్వరంతో పలికిన , ఆ పలుకు లో నుండి ఉద్భవించు కాంతికిరణాలు (విద్యుత్ అయస్కాంత కిరణాలు) ప్రభావం తప్పక చూపుతుంది. మన ఉచ్ఛారణ లోపాలు , అవగాహన లోపాలతో చెప్పే మంత్రాలు పనిచేయవు. అందుకే జపించ వలసిన పద్దతి గురు ముఖముగా తీసుకోవాలని , పెద్దలు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

ప్రస్తుతానికి మనం అయ్యప్ప దీక్ష తీసుకొనుటకు చెబుతున్న మంత్రం యొక్క  నిఘాడార్థం  తెలుసుకుందాము

అయ్యప్ప మాలను మాలాధారికి  వేయునపుడు గురుస్వాములు ఈ మంత్రమును చెప్పవలెను. మాలాధారితో చెప్పించవలెను. వారికి వ్రత నియమములతో పాటు , ఈ మంత్రార్థమును కూడా వివరించవలెను. వ్రత నియమము ఆచరించుటకు , మంత్రార్థం వ్రతము యొక్క విశిష్టతను తెలుపుటకు , అందువల్ల ఈ వ్రతమాచరించగా కలుగు శుభములను వివరించుట కొరకు , వారికి చెప్పవలెను.

జ్ఞానముద్రాం శాస్తృముద్రాం గురుముద్రాం నమామ్యహం |

వనముద్రాం శుద్దముద్రాం రుద్రముద్రాం నమామ్యహం |

శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం |

శభర్యాశ్రమ సత్యేన ముద్రాం పాతు సదాపిమే!!

గురుదక్షిణయాపూర్వం తస్యానుగ్రహకారిణే |

శరణాగత ముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహం |

చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం !

శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమోనమః |

అష్టాదశం మహాసారం శాస్త్రుదర్శనకారణం |

విదితం శుద్దముత్కృష్టం సన్నిధానం నమామ్యహం |

ఊరుజం వాపురం చైవ భైరవ ద్వన్న సేవితం |

విష్ణుమాయాన్వితం శాస్తృ పరివారం నమామ్యహం ||

ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ||

గురుస్వామి ఈ మంత్రాన్ని తాను చెబుతూ మాలాధారితో కూడా చెప్పించవలెను. ఒక రకంగా గురువు ద్వారా మంత్రాన్ని గ్రహించుట అగును. అయ్యప్ప మాలా ధారుడు ముందుగా గురువు గారి ద్వారా మంత్రం యొక్క స్థూలార్థం తెలుసుకోవాలి. ఈ మంత్రాన్ని ఎందుకు చెపుతున్నాము అని తెలుసుకోవాలి. అప్పుడే వ్రత దీక్ష యొక్క మహత్వం తెలుస్తుంది. యేదో గురువు గారు చెప్పారు , నేను తిరిగి పలికాను , ఆయన మాల వేశారు , నేను వేయించుకున్నాను అని మనం నేడు చేస్తున్నాము. అది చాలా తప్పు.

మంత్రంలో ప్రతి చరణంలోనూ “ముద్రాం”  --  “ముద్రాం”  అని పలుకుతున్నాం. “ముద్ర” అనగా భక్తుల యొక్క భవ భోధలను పోగోట్టుటకు ఒక నియమం. శ్రీ శాస్తా వారు పట్టబంధనం తో యోగ ముద్ర లో(ధ్యాన) వుంటారు. అనగా ఒక నియమ పద్దతిలో అమరి ఉండుట. అది యోగానికి అత్యవసరమైన అమరిక. అట్లే ఈ మంత్రం లో “నమాంమ్యహం” అని ప్రతి ముద్ర చివరన పలుకుతాము.  అనగా నాయొక్క మనస్ఫూర్తిగా , వినయముగా , భక్తి శ్రద్దలతో నేను ఆచరింతును అని ప్రతిజ్ఞ చేయటం అని తెలుసుకోవాలి. 

అయ్యప్ప స్వామి మూల మంత్రము “ఓం స్వామియే శరణం అయ్యప్ప” అనునది కూడా ఒక మంత్రమే. ఎవరి నోటి నుండి ఈ వాక్కు ( ఈ మంత్రం)  వెలువడునో , వారు శ్రీమంతులు , దయాళులు , విధ్యావంతులు , వినయవంతులు గా మారి పోతారు. ఈ కలియుగంలో – నీటిలో చేపలా నిలకడ లేక సదా చంచల చిత్తులై , అలమటించు వారికి , చిత్త శుద్ది కలిగించుటకు అలనాటి ఋషోత్తములు , మహత్వం నిండిన ఈ మహా మంత్రమును మనకు ఉపదేశించి వున్నారు. “ఓం స్వామియే శరణం అయ్యప్పా” అను మంత్రం ,    నాభికమలమునుండి బయలుదేరు ప్రాణ వాయువును , హృదయ మార్గము ద్వారా పయనింప చేసి నాలుకపై శబ్దముగా తాండవింప చేయవలయును. మనః పూర్వకముగా పలుకవలెను. పలుకునపుడు చిత్త శుద్ది వుండవలెను. 

 కలౌ కల్మష చిత్తానాం పాప ద్రవ్యోప జీవినామ్ ! 

 వీధి క్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తినమ్!! 

ఈ కలికాలంలో కల్మష చిత్తులైన వారు , పాప కృత సంపాదనతో జీవించువారు , విధితమైన వృత్తులను మాని ప్రవర్తించు వారు ,  సద్గతి పొందుటకు భగవన్నామ సంకీర్తన ఒక్కటియే చక్కని మార్గం అని పై శ్లోకం అర్థం. 

 1.జ్ణాణముద్రాం  

శాస్త్ర జ్ణాణము వలన బ్రహ్మమును (పరమేశ్వరుని) తెలుసుకొను జ్ణానము. గురువు ద్వారా ఆయనను ఆశ్రయించి పొందు శాస్త్ర జ్ణాణము , ఈ మాల ద్వారా నాకు కలగాలి. 

 2.శాస్త్ర ముద్రాం , 

 3.గురుముద్రాం

పరమ పూజ్యులైన నా ఈ గురుస్వామి , మాలవేసి మాహా శాస్త్ర వ్రత దీక్షనోసంగి , నన్ను సన్మార్గమున పయనింప , శాస్త్ర యొక్క కరుణా కటాక్షములు నాపై ప్రసరింపచేయ , నాచే నాకు గురు ప్రసాదముగా ఇచ్చిన ఈ వ్రతం నా గురు ఆగ్నేగా స్వీకరించి , శాస్త్రా వ్రతమును నిర్వర్తించేదను.

4.వనముద్రాం: 

సంసారం అనబడు ఈ వనం (అడవి) నుండి బయల్పడి , భగవత్సాక్షాత్కారము (బ్రహ్మ జ్ణానము) పొందుట.  జనన , మరణ , జరాభయాయుతము , ధుఃఖదాయకమైన , సంసార వనము (కాననము) దాటి మోక్షం , ఈ మాల ద్వారా నాకు కలగాలి.

5. శుద్దముద్రాం 

నేను ఈ మాలాధారణచే , నిరంతర సాధనచే , బ్రహ్మ జ్ణానినై , శుద్ద సత్యస్వరూపానంద చిత్తుడై , ఆచరించి , తరించెదను .              

6. రుద్రముద్రాం 

స్వాత్వానంద చిత్తుడై , జ్ణానినై , జనన మరణ దుఃఖ రహితుడనై , ముక్తి పథము నేను  పొందాలి. 

7. శాంతముద్రాం

8. సత్యముద్రాం

9. వ్రతముద్రాం

మాల ధారణ చేసి , నేను నియమిత జీవన వ్రతమాచరించి శాంత చిత్తుడనై, ఆ పరమేశ్వరుడిని (అనగా శ్రీ ధర్మ శాస్తా వారిని) ధ్యానించి , సత్యము , నిత్యము అయిన అ భగవంతుని అనుగ్రహము పొందవలేను. నిరంతర సాధనచే , పంచేంద్రియాలను నిగ్రహింప చేసి , కళ్ళెము లేని అశ్వము వలె పరుగిడు నా మనస్సు స్థిరముగా నుండవలెను. స్థిర చిత్తుడనై అరిషడ్వర్గములను సాధించి , శుద్ద సత్యము , సత్యమ సత్యము , అయిన బ్రహ్మమును గాంచవలెను. 

10. శబర్యాశ్రమ సత్యేన ముద్రాం పాతు  సదాపిమే

సత్యము, నిత్యము, శాస్వితము అయిన ఈ శబరీషుని వ్రత నియమమును స్వీకరించి , సదా నా కర్మేంద్రియాలను (వాక్కు , పాణి , పాదం , వాయువు , ఉపస్త), నా జ్ణానేంద్రియాలను (చర్మం , కన్ను , నాలుక , చెవి , ముక్కు) అదుపులో నుంచుకొని వ్రత దీక్షను కోనసాగింతును. 

11. గురుద్ధక్షిణయా పూర్వం తస్యానుగ్రహ  కారిణే

తల్లి , తండ్రి తరువాత , మూడవ స్థానాన్ని అలంకరించిన మహోన్నతమైన వ్యక్తి  గురువు. వీరు ముగ్గురికి ధక్షిణగా ఏమి ఇచ్చినా రుణము పది జన్మలకైనా తీర్చలేము. వారు మనవద్ద నుండి ఏమి కోరరు , కేవలం మన సత్ప్రవర్తన తప్ప. అదే వారికి మనమొసంగు అపూర్వ ధక్షిణ.  నేను నియమ  , నిష్టలతో పరిపూర్ణ భక్తిశ్రద్దలతో మీ అనుగ్రహాన్ని సంప్రాప్తచేసుకొనుటకు , గురు మూలముగా లభించిన ఈ అవకాశం సద్వినియోగ పరచుకుందును.     

12. శరణాగత ముధ్రాఖ్యం  త్వన్ముద్రాం ధారయామ్యహం

ఈ మయా జగత్తు లో ఏమీ తెలియని అజ్ణానుడిని , నీ పాదాలే నాకు శరణం. అందుకే ఈ వ్రత దీక్ష సంకేత ముద్రను దాల్చి , ఈ ముద్ర తమరు నిర్దేశించిన ముద్రగా నెంచి , ఈ  మహోన్నతమైన ముద్ర ధారియై , మీ పదాలు పలుకుచూ , మీ పాదాలు శరణుజొచ్చు చున్నాను.

13. చిన్ముద్రాం

స్థిర చిత్తుడై , నిరంతర సాధన చేయు వాడినై ,  శాస్తా భక్తుడనై  త్రీగుణ రహితుడనై ( సత్వ , రాజ , తమో గుణములు), విశ్వవ్యాప్తుడై యున్న ఆ శాస్తా యందు లీనమై , అధ్వైతమయుడనై , ముక్తిని పొందుదునుగాక !  

14. ఖేచరీముద్రాం

ఈ మాలాధారణ ముద్రతో సాధన గావించి , కాకివలే ప్రాపంచిక విషయ వాంచలను , దానిచే చిక్కుపడిన మనస్సును , నా పంచేంద్రియములను అదుపులో నుంచుకొని , ఆత్మ స్వరూప పరబ్రహ్మను ( శ్రీ ధర్మశాస్తాను) దర్శించి ,  పరవశించెదెను.

15. భద్రముద్రాం

జీవన కాలమందు యమయాతన దుర్భర జీవితం , జనన మరణముల భాధలు పొందక , శాశ్విత భద్రత కలిగిన జీవితమును పొందవలెనన్న , స్థిర చిత్తుడనై ,  గురువు యొక్క అనుగ్రహం పొంది , ఆయన చూపించే సన్మార్గమున పయనించి , భద్ర చిత్తుడై , చిత్తమును ఆత్మ సంధానం గావించి ఆనందమయడనుగుటకు , నాకు ఈ మాలే ఆధారం.

16. శబర్యాచల ముద్రాయై: 

ఈ పుణ్య పంబా , శబరిమల దర్శన కారకమైన ఈ పవిత్ర ముద్ర మాలధారినై , అరుదెంచి మీ దివ్య పాద దర్శనం గావించుకొనెదను. మీకు  నా వినయ భక్తి ప్రవృత్తుల ప్రణామాలు.  దీన రక్షకా మీకు నమోన్నమః !

17. అష్టాదశం మహాసారం శాస్త్రుదర్శనకారణం

విదితం శుద్దముత్కృష్టం సన్నిధానం నమామ్యహం* 

18 ధశల అనగా 18 అష్టాదశ శక్తుల పీఠం పై అమరి వున్న జగథ్విఖ్యాత వేదవేదాంగ సార గ్రహీతుడైన స్వామి ధర్శనంచే అతి మహోత్కృష్టమైన ఈ సన్నిధానం ప్రభావముచే పుణీతుడను గా  అగుతాకు ,  నేను మీ శరణాగతి కోరుతూ నమస్కరించి ప్రార్థిస్తున్నాను. 

18. ఊరుజం వాపురం చైవ భైరవ ద్వన్న సేవితం

విష్ణుమాయాన్వితం శాస్త్ర పరివారం నమామ్యహం: 

స్వామి , తన రెండు మోకాళ్ళను దగ్గరగా చేర్చుకొని తన ఉరువులపై (తొడలపై) నుండి బంధించుకొని “యోగముద్ర”లో కూర్చిని వుంటారు. ఆయన చుట్టూ వున్న భైరవ , భూతగణములైన, కటుశబ్దుడు , వాబరుడు( వావరు కాదు),  కడూరవుడు , కూపకర్ణుడు , ఘంటాకర్ణుడు , కూపనేత్రుడు , సింహనేత్రుడు , మహాబలుడు , వీరభద్రుడు , మరియు ఇతర భూత , భైరవ , శైవ గణములు స్వామిని సేవించుతుంటారు.  అందు స్వామికి ప్రీతిపాత్రులు మహాబలుడు , కడూరవుడు. ఇదంతయు ఆ జగన్నాటక సూత్రధారుడైన విష్ణుమాయ. ఆ మాయనే నిర్ధేశించి ఈ పరివార సేవితుడైన శాస్తా వారికి నా నా యొక్క నమాంమ్యాహం !     

మాలాధారి పైవిధముగా వ్రత దీక్ష తీసుకొనుటకు చేయు పద్దెనిమిది ప్రతిజ్ఞలకు ,  అతడు , అతని జీవితాంతము కట్టుబడి వుండవలెను. నియమ నిష్టలనుండి ,  మాలా విసర్జన చేసిన తరువాత కొంత సడలింపు వుండును కానీ , పూర్తి విమోచన వుండదు.   ఇది గుర్తెరిగి , తన మనఃపూర్వకముగా ఒక స్వామి మాల ధరించ వలెను.  మాలా విసర్జన అయిపోయినది , ఇక నాకు ఏ అడ్డంకులు , ఏ నియమ నిష్టలు , ప్రత్యేక విధులు లేవని తలంచుట మహా ఘోరమైన పాపము. అలా వుండలేని వారు మాల ధరించక పోవటమే ఉత్తమము. 

మాలా విసర్జన మంత్రం అర్థ వివరణ

అపూర్వ మచలా రోగా  ద్ధివ్య  ధర్శన కారణ! 

 శాస్త్ర ముధ్రాధ్మహాధేవ ధేహిమే వ్రతవిమోచనం!!

మహోత్రుష్టమైన మహా మహిమాన్వితమైన , ఆ శబరిమలను అధిరోహించి , ఆ దివ్య స్వరూపుని దర్శనం భాగ్యం కలిగించి అద్దానికి కారణ హేతు భూతమైన , ఈ మహిమాన్విత శాస్త్ర ముద్ర పరివేష్టిత మాల , ఆ మహా దేవ దేవుడైన శ్రీ శాస్తా ను దర్శించుకొనిన నా ఈ  ధేహమును మాత్రము ,  వ్రత దీక్షనుండి తప్పించుగాక. 

అనగా వ్రత దీక్ష నుండి , ఈ  పంచభూత నిర్మితమైనది , ఆశాశ్వితమైనది , కర్మచక్షువులతో నిండినది , ప్రాపంచిక విషయాలపై ఆశక్తి , కొర్కేలు కలదానిని మాత్రం , వ్రత దీక్ష నుండి విరమింప చేయమని ప్రార్థన.  ఈ వ్రత దీక్ష వలన మనం శాశ్విత సన్యాసత్యం పుచ్చుకొనలేదు. కేవలము ఒక మండలకాలము , వ్రత నియమము లో వున్నాము. కానీ మనపై ఆధార పడ్డ వారు , మన సహాయమునకై ఎదురు చూచువారు , మన యొక్క ధనార్జన , సంపాదన పై ఆధారపడ్డ వారికి కూడా మనము మన విధ్యుథ్ధర్మం నిర్వర్తించ వలసిన  విధి మనకున్నది.  అందువలన ఈ భౌతిక ప్రపంచమున మనం చేయవలసిన విధులకు ఈ శరీరాన్ని వినియోగించక తప్పదు. నియమ నిష్టలనుండి బయల్పడక పోతే ఈ కలికాలమున ఏదీ సాధ్యపడదు. అందుకు ఈ దేహాన్ని మాత్రం విడుదల చయమని ప్రార్థిస్తున్నాము.

ఒక ముఖ్య విషయం. 

మనం మాలా విసర్జన చేయునపుడు , మనం ధీక్షా వ్రత నియమాలనుండి దేహమును మాత్రము విడుదల చేసుకొంటున్నాము. మనలో నెలకొని వున్న మన ఇతర వాసములను విడుదల చేయటము  లేదు.  అనగా మన  భౌతిక శరీరమును మాత్రం వ్రత దీక్షనుండి బయల్పడినది. మన అంతఃకరణములు , మన సూక్ష్మ శరీరము ఒకసారి మాల వేసికొనిన మన వూపిరి వున్నంత వరకు వ్రత దీక్ష లోనే వుండును. అది గుర్తెరిగి మాలా విసర్జన చేసుకొని ,  మనం వ్రత దీక్షలోనే ,  ఆత్మ అంతరాత్మ ను కొనసాగించ వలసి వస్తుంది.   వ్రత దీక్ష మనలను వీడి పోదు.

శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ

శ్రీ ధర్మశాస్తవే శరణం అయ్యప్ప

అఖిలాండ కోటి బ్రహామ్మండ నాయకనే శరణం అయ్యప్ప

లోకాః సమస్తా సుఖినోభవంతు

From: కలియుగవరదన్ అయ్యప్ప గ్రూప్

Monday, December 28, 2020

నారాయణ స్తోత్రమ్

నారాయణ నారాయణ జయ గోవింద హరే ‖

నారాయణ నారాయణ జయ గోపాల హరే ‖

కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ ‖ 1 ‖

ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ ‖ 2 ‖

యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ ‖ 3 ‖

పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ ‖ 4 ‖

మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ ‖ 5 ‖

రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ ‖ 6 ‖

మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ ‖ 7 ‖

బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ ‖ 8 ‖

వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ ‖ 9 ‖

జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ ‖ 10 ‖

పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ ‖ 11 ‖

అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ ‖ 12 ‖

హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ ‖ 13 ‖

దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ ‖ 14 ‖

గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ ‖ 15 ‖

సరయుతీరవిహార సజ్జన^^ఋషిమందార నారాయణ ‖ 16 ‖

విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ ‖ 17 ‖

ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ ‖ 18 ‖

జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ ‖ 19 ‖

దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ ‖ 20 ‖

ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ ‖ 21 ‖

వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ ‖ 22 ‖

మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ ‖ 23 ‖

జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ ‖ 24 ‖

తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ ‖ 25 ‖

గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ ‖ 26 ‖

సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ ‖ 27 ‖

అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ ‖ 28 ‖

నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ ‖ 29 ‖

భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ ‖ 30 ‖

Thursday, December 24, 2020

యజ్ఞోపవీత మహిమ

వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. 

దీనినే తెలుగులో ‘జ్యంద్యం’ అంటాం. 

ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. 

ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ, కొందరు ఆచారం మీద మక్కువతోనూ, కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం, మరికొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు. 

యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. 

దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.

’సూచనాత్ బ్రహ్మతత్త్వస్య 

వేదతత్త్వస్య సూచనాత్

తత్సూత్రముపవీతత్వాత్ 

బ్రహ్మసూత్రమితి స్మృతమ్’!!

బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.  

యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. 

అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని

‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’

అనే మంత్రం చెబుతోంది.  

యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి.  ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం - 


‘ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ 

వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ 

ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ

తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా 

పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః

సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ 

సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః’!!


మొదటి తంతువులో ఓంకారం,

 రెండవ తంతువులో అగ్నిదేవుడు, 

మూడవ తంతులో నాగదేవత, 

నాలుగవ తంతువులో సోమదేవుత, 

ఐదవ తంతువులో పితృదేవతలు, 

ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, 

ఏడవ తంతువులో వాయుదేవుడు, 

ఎనిమిదవ తంతువులో సూర్యుడు, 

తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం. 


‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది. 

’తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్

కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’

ఈ శ్లోకంలో తాత్పర్యం ఇది. 

తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. 

అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం.

‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది. 

’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ

తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్’

నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. 

అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. 

గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం. 

యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది. 

’పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్

తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్

ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్

యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’!!

అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. 

దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.

బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.

యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. 

యజ్ఞోపవీతం ధారణ మంత్రం:-

“ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్

ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజః”

ఈ విధంగా జపిస్తూ క్రొత్త జంద్యం వేసుకోవాలి.


యజ్ఞోపవీతం విసర్జన మంత్రం:-

 ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితం విసృజామి యశోబ్రహ్మవర్భో దీర్ఘాయురస్తుమే 

------------------------^--------

ఈ విధంగా జపిస్తూ పాత జంద్యం తీసి వేయాలి.

తీసువేసేటప్పుడు పాదాలకు తగలకుండా

నడుము నుంచి క్రిందకు తీసివేసి ఇంటి చూరుపై గాని చెట్లపై గాని ఎవరూ త్రొక్కకుండా ఉండేవిధంగా కానీ లేక ఏదైనా నదిలో గాని విసర్జన చేయాలి.

యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. 

ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు. 

ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి. 

ఇదే యజ్ఞోపవీత మహిమ!

ఓం తత్సత్......

సర్వేజనా సుఖినోభవంతూ.......

పురాణమంటే అర్థమేమిటో చూద్దాం

 పురాణం అంటాం కదా!

అసలీ పురాణమంటే అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం….

పురాణాలలో సర్వశాస్త్రాలు ఇమిడి ఉన్నాయని పెద్దలంతా చెబుతూ ఉంటారు. అసలీ పురాణమంటే అర్థమేమిటి? పురాణాలు ఎన్ని ఉన్నాయి? వాటన్నిటినీ ఎవరితో పోల్చి చెబుతారు? అనే విషయాలను గురించి వివరించి చెబుతుంది ఈ కథా సందర్భం. పద్మపురాణం ఆది ఖండంలో దీనికి సంబంధించిన వివరణ ఉంది.

పురాణాలు మొత్తం పద్దెనిమిది. వీటికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఈ పురాణాలన్నీ శ్రీ మహావిష్ణువు స్వరూపంతో సరిపోతాయి. అందుకే శ్రీమహావిష్ణువును పురాణ పురుషుడని అంటూ ఉంటారు. ఆ నారాయణుడి యొక్క…..

1) హృదయం - పద్మపురాణం

2) చర్మం - వామన పురాణం

3) తొడలు - భాగవత పురాణం

4) మెదడు - మత్స్యపురాణం

5) పృష్ణభాగం - కూర్మపురాణం

6) కుడికాలు చీలమండ - వరాహ పురాణం

7) బొడ్డు - నారదపురాణం 

8) వెంట్రుకలు - స్కందపురాణం

9) ఎడమ భుజం - శివపురాణం

10) కుడి భుజం - విష్ణుపురాణం

11) ఎడమపాదం - అగ్నిపురాణం

12) కుడిపాదం - మార్కండేయ పురాణం

13) కుడి మోకాలు - భవిష్యపురాణం అని పద్మపురాణంతోపాటు ఇతర పురాణాలు కూడా వివరించి చెబుతున్నాయి.

పురాణానికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఆ లక్షణాలున్నదే పురాణం అవుతుంది. ప్రధానంగా పురాణానికి అయిదు లక్షణాలను పేర్కొన్నారు. కాలక్రమంలో కొంతమంది పది లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పారు.

అయిదు లక్షణాలలో

1) సర్గం

2) ప్రతిసర్గం

3) వంశం

4) మన్వంతరం

5) వంశాను చరితం

పురాణానికి ఈ అయిదు లక్షణాలు ఉంటాయని పురాణాలతోపాటు, నిఘంటువులు కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ అయిదు లక్షణాలు మనకున్న పద్దెనిమిది పురాణాలలో ఒక్కోదానిలో ఒక్కొక్క లక్షణం ఎక్కువగా, మరో లక్షణం తక్కువగా వర్ణితమై కనిపిస్తుంది. ఎక్కువ తక్కువుల మాట ఎలాఉన్నా అయిదు లక్షణాలు మాత్రం ఉండి తీరాల్సిందే.

వీటిలో

1) మొదటిదైన సర్గం అనే దానికి అర్థం సృష్టి అని, ఈ సృష్టి అంతా ఎలా జరిగింది? పంచతన్మాత్రలు, పంచభూతాలు ఎలా ఉద్భవించాయి? అని వివరించటమే సర్గం.

2) రెండో లక్షణం ప్రతిసర్గం . సర్గానికి వ్యతిరేకం ప్రతిసర్గం. అంటే సృష్టి ఎలా లయమవుతుంది? ప్రళయాలు ఎన్ని రకాలు? అవి ఎలా ఏర్పడుతాయి? అని వివరించటమే ప్రతిసర్గం

3) మూడో లక్షణమైన వంశంలో సృష్టి ప్రారంభం నుంచి ఎంతమంది రాజులు, వారి వంశాలు, ఆవిర్భవించాయి. వారి వంశాలు వర్ణనతో పాటు ఋషుల వంశాలకు సంబంధించిన విషయ వివరణలు ఈ లక్షణంలో కనిపిస్తాయి.

4) నాలుగో లక్షణం మన్వంతరం . ఇది కాలగణనాన్ని చెబుతుంది. పద్నాలుగు మన్వంతరాల విషయాలు, వాటి అధిపతులు, వారికి సంబంధించిన విషయాలన్నీ దీనిలో వస్తాయి.

5) అయిదో లక్షణమే వంశాను చరితం . దీనిలో సృష్టి మొదలైన దగ్గర నుంచి పాలించిన రాజులు, చక్రవర్తుల, ఋషుల వంశ చరిత్రలు వర్ణితమవుతాయి.

ఇలా ఈ అయిదు ప్రధాన లక్షణాలు పురాణాలకు ఉంటాయని, ఉండాలని పూర్వం నుంచి అందరూ చెబుతున్న విషయమే. కాలక్రమంలో కొంతమంది ఈ అయిదు లక్షణాలను పది లక్షణాలుగా చేసి అలాంటి పది లక్షణాలు వుంటేనే అది పురాణామని చెప్పారు. సర్గ, విసర్గ, వృత్తి, రక్షణ, అంతరాలు, వంశం, వంశాను చరితం, సంస్థ, హేతువు, అపాశ్రయం అనే పది లక్షణాలను అనంతర కాలంలో వచ్చిన వారు పేర్కొన్నారు.

1) సర్గ అంటే ఇక్కడ కూడా సృష్టి అనే అర్థం.

2) విసర్గ అంటే జీవుల సృష్టి అని అర్థం చెబుతారు.

3) వృత్తి అనే పదానికి మనిషి తన జీవితాన్ని సాగించటానికి ఏ ఏ వస్తువులను వాడుతారో వాటిని గురించిన విషయాల వివరణ.

4) రక్షణ అంటే భగవంతుడు ధర్మ రక్షణకోసం అవతరించే తీరు అని అర్థం.

5) అంతరాలు అంటే మన్వంతరాల వివరణ.

6) వంశం అంటే రాజుల, ఋషుల, వంశాల వివరణ.

7) వంశాను చరితం అంటే రాజుల, ఋషుల వంశ క్రమంలో ఉన్న అన్ని తరాల చరిత్ర వివరణ. 

8) సంస్థ అంటే ప్రళయానికి సంబంధించిన వివరణ.

9) హేతువు అని అంటే జీవుడి జనన మరణాలకు మధ్యన ఉన్న కర్మ సంబంధమైన విషయం. జీవుడు చేసే కర్మను బట్టే అతడి జీవితమైనా, సృష్టి అయినా అంతమవుతుందని చెప్పే విషయానికి సంబంధించిన వివరణ.

10) అపాశ్రయం అని అంటే పరబ్రహ్మం అని అర్థం. ఆ పరబ్రహ్మ శక్తినే అపాశ్రయ శక్తి అని అంటారు. దానికి సంబంధించిన వివరాలు దీంట్లో ఉంటాయి.

ఈ పది లక్షణాలు భాగవతం ద్వితీయ స్కందంలో మళ్ళీ కొద్దిపాటి తేడాతో కనిపిస్తున్నాయి. సర్గ, ప్రతిసర్గ, స్థానం, పోషణం, ఊతయం, మన్వంతరం, ఈశాను కథ, నిరోధం, ముక్తి, ఆశ్రయం... ఈ పది లక్షణాలు పేర్లలో తేడా ఉన్నా అర్థం మాత్రం ఒకటేనని పురాణజ్ఞులు వివరించి చెబుతున్నారు.

Wednesday, December 23, 2020

గోమాత గొప్పదనం

 ఆవుదూడ పుట్టిన మొదటి రోజునే పేడ వేస్తుంది. అప్పుడే పుట్టిన లేగ దూడ మొదటి సారివేసిన పేడ పదివేల రూపాయలకు కూడ ఎక్కడా దొరకదు. అది బ్లడ్‌ క్యాన్సర్‌కు అత్యుత్తమ ఔషధం. ఫిట్సుకు కూడ ఇది ఉపయోగపడుతుంది. దూడ మొదటిసారి పేడ వేయగానే ఆవు దానిని తినివేస్తుంది. అందువలన అది దొరకుట చాలా కష్టం.

పడక కురుపు, పుండు వున్న ఒక స్త్రీకి ఆవు పిడకల బూడిద (కచ్ఛిక) పొడి పుండుకు పట్టించుట మొదలు పెట్టగా నెల రోజులలో పుండు నయమైనది. ఆ పుండు ఎముక కనిపించేంత లోతైనది

ఆవు పేడతో అగరు వత్తులు తయారవుతాయి. ఆ అగరు వత్తుల బూడిదను ఔషధంగా వాడవచ్చు. పిల్లలకు దెబ్బ తగిలిన, ఆ పొడి రెండు రోజులు వాడిన అది తగ్గుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్థులకు దెబ్బలు, పుండ్లు కూడ ఆవు పేడ బూడిద వ్రాసిన త్వరగా తగ్గుతాయి.

ఏవైనా విష క్రిములు కుట్టినప్పుడు, (తేనెటీగ, కందిరీగ మొదలగునవి) ఈ బూడిద వేసిన 1 నిమిషంలో తగ్గుతుంది.

వరదలు, తుఫానులు వచ్చినప్పుడు, ఇతర సమయాలలో నీరు బురదగా వున్నప్పుడు, నీరు కాచి త్రాగుతారు. ఒక బిందెడు నీటిలో ఆవు పిడకల బూడిద 1 స్పూను కలిపిన ఆ నీటిని కాయవలసిన పనిలేదు. ఆ నీరు 

త్రాగిన వారికి కలరా, తలనొప్పి, జ్వరము, విరేచనములు రావు. కావున వరద సమయాలలో ఆ బూడిదను పంచిన రోగాలు రావు.

ప్రయాణాలు చేసే వారు ఆవు కచ్చికల బూడిదను వెంట తీసుకువెళ్ళి బయట నీరు త్రాగవల్సి వచ్చిన బాటిలు నీటిలో 1 చిటికెడు బూడిద కలిపి వాడిన ఎలాంటి రోగాలు రావు. (అగర వత్తుల భస్మం) సేకరించి వుంచుకోండి. ఆవు పేడతో చేసినవి మాత్రమే.

ఆవు పేడతో చేసిన అగరు వత్తులు వాడిన ఆ ధూపము ఇల్లంతా వ్యాపించి, ఆ ఇంటి దారిద్య్రము తొలగిపోతుంది.

ఆవు పిడకల పొడితో పళ్ళపొడి తయారు చేసిన, పంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. పంటినొప్పి, కదులుట తగ్గుతుంది. పళ్ళు గట్టిపడతాయి.

ఆవు పేడతో చేసిన పండ్లపొడిని నోటిలో ఉంచి 5 నిమిషముల తర్వాత పండ్లు వేలితో రుద్దాలి. చిగుళ్ళను వేలితో మర్ధన చేయాలి. బ్రష్‌ను వాడవల్సిన పనిలేదు. వ్రేలితో తోమినప్పుడే పళ్ళు బాగా గట్టిపడతాయి.

ఈ ఆవు పిడకల పొడి క్రిమిసంహారిణి. అందువలన దీనితో చేసిన పండ్లపొడి ప్రపంచంలోనే ఉన్నతమైన శాస్త్రీయమైన పండ్లపొడి. 

నాలుకను టంగ్‌క్లీనర్‌ను వుపయోగించి శుభ్రం చేస్తాము. అలా కాకుండా రెండు వేళ్ళతో బాగా రుద్దిన, గొంతులోని ప్రాతం కూడా శుభ్రపడుతుంది.

ఆవు పేడతో చేసిన సబ్బులు వుపయోగించిన చర్మవ్యాధులు రాకుండా, ఒకవేళ వున్నచో తగ్గుటకు, చెమటలు పట్టుట తగ్గుటకు తోడ్పడుతుంది. ఇతర సబ్బులలో కెమికల్స్‌ కలియుటచే చర్మానికి మంచిది కాదు.

ఆవు పేడ విషనాశకము. విష పదార్థములు తీసుకున్నప్పుడు, ఆవు పేడతో చేసిన బూడిద నీళ్ళలో కలిపి త్రాగిన విషం విరుగుతుంది. నీటిలో బూడిద కలిపి స్నానం చేయించిన విష ప్రభావము తగ్గుతుంది. 

పాముకాటుకు గురైన వ్యక్తి చనిపోయినట్లు డాక్టరు చెప్పగా, ఒక యోగి అతని శరీరానికి పలుమార్లు పూర్తిగా ఆవు పేడ పట్టించగా, లోనవున్న విషమంతా విరిగి రెండోరోజుకు అతను శ్వాస పీల్చుకోవడం జరిగింది. అందువలన ఆవుపేడ అద్భుతమైన విష నాశని.

ఆవు పిడకల పొడిని నీళ్ళలో కలిపి స్నానం చేయాలి. ఒంటికి నలుగు పెట్టవచ్చు. పుల్లటి మజ్జిగలో కలిపి తలకు పట్టించండి. పొడిబారిన చర్మం గల వారు పాలలో కలిపి ఫేస్‌ప్యాక్‌గా వాడవచ్చు. చర్మము స్వచ్ఛమై మృదువుగా తయారవుతుంది. 

దెబ్బతగిలి నొప్పి వున్న చోట, ఇతర నొప్పులకు నీటిలో కలిపి పట్టీ వేయించండి. బాగా అలసినచో, లలాట భాగంలో మందముగా ఆ లేపనాన్ని పూసిన 30 నిమిషాల్లో అది ఆరిపోయి తాజాగా తయారవుతారు.

ఆవు మలం కాదు. దానిని గోమయం అంటారు. దానిని పూజల్లో, యజ్ఞాల్లో, వాకిట్లో కళ్ళాపిగాను, పవిత్ర కార్యాలలోను ఉపయోగిస్తాము. అందువలన అది విశిష్టమైనది.

పొలాల్లో ఆవు పేడను ఎరువుగా ఉపయోగించిన ఆహారపదార్థాలు అద్భుతమైన రుచిని కలిగిస్తాయి. పండ్లు మంచి వాసన కలిగి వుంటాయి. పంజాబ్‌లో రసాయనిక ఎరువులు వాడుట వలన అచట ఎక్కువ మంది క్యాన్సర్‌ వ్యాధికి గురైనారు.

Tuesday, December 22, 2020

Bhagwan SriMahavishnu with SriMahalaksmi


Very rare picture drawn in 1967 seen in Sringeri library Bhagwan SriMahavishnu with SriMahalaksmi kanakavarshini ,see both Bhagwan and SriLakshmi thayar showering gold thru their right thirukaram, SriMahavishnu holding surya in right hand and Chandra in left hand sitting on garuda. Drawing based on sloka of SriVishnupuran.

ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి

 ఇప్పుడు ఎవరు వైదికులు ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి ఈనాడు ఆనాటి వైదీకులు అనేవాళ్ళు ఉన్నారా ఈనాడు అం...