Wednesday, October 7, 2020

బ్రాహ్మణ శాఖలు

 వామ్మో ఇన్ని శాఖలా - ద్రావిడ బ్రాహ్మణ శాఖలు, వైదీక బ్రాహ్మణ శాఖలు, నియోగి బ్రాహ్మణ శాఖలు, వైష్ణవ బ్రాహ్మణ శాఖలు, శివార్చక బ్రాహ్మణ శాఖలు ఉన్నాయి.. వాటి గురుంచి విపులంగా తెలుసుకుందాం..

ద్రావిడ బ్రాహ్మణ శాఖలు..

1) ప్రధమ శాఖ ద్రావిడ

2) ద్రావిడ

3) పేరూరు ద్రావిడ

4) పెద్ద ద్రావిడ

5) దిమిలి ద్రావిడ

6) ఆరామ ద్రావిడ

7) పుదూరు ద్రావిడ

8) కోనసీమ ద్రావిడ

9) ద్రావిడ వైష్ణవులు

10) తుమ్మగంటి ద్రావిడ

11) తుమ్మ ద్రావిడ

వైదీక బ్రాహ్మణ శాఖలు..

1) వెలనాటి వైదీక

2) వెలనాట్లు

3) వెలనాటి పూజారులు

4) వెలనాటి అర్చకులు

5)కాసలనాటి వైదీక

6)కాసలనాట్లు

7)ములకినాట్లు

8) ములకినాటి వైదీక

9) తెలగాణ్యులు

10) వేగనాట్లు

11) వేగనాటి వైదీక

12) ప్రధమ శాఖ వైదీక

13) కరణకమ్మ వైదీక

నియోగి బ్రాహ్మణ శాఖలు..

1) ప్రధమ శాఖ నియోగి

2) ఆరువేల నియోగి

3) నందవరీక నియోగి

4)లింగధారి నియోగి

5)ఉంత్కఖ గౌడ నియోగి

6)ఆరాధ్య నియోగి

7) అద్వైత నియోగి

8) నియోగి వైష్ణవులు

9)పాకనాటి నియోగి

10) ప్రాజ్ఞాటి నియోగి

11) పొంగినాడు నియోగి

12) నియోగి ఆది శైవులు

13) యజ్ఞవల్క్య నియోగి

14) ఆరాధ్యులు

15) వేమనారాధ్యులు

16) తెలగాణ్యు నియోగి

17) కరణకమ్మ నియోగి

18) బడగల కరణకమ్మ నియోగి

19) కరణాలు

20) శిష్ట కరణాలు

వైష్ణవ బ్రాహ్మణ శాఖలు..

1) శ్రీవైష్ణవులు

2) నంబులు

3)గోల్కొండ వ్యాపారులు

4)ఆచార్యులు 

5)మర్ధ్యులు

6) వ్యాపారులు

7) కరణకమ్మ వ్యాపారులు

8)బడగల కరణకమ్మ

9)మెలిజేటి కరణకమ్మ

10)దారుకులు

11) యజ్ఞవల్క్యులు

12)యజుశ్యాఖీయులు

13) బడగ కన్నడలు

14) నంబూద్రి బ్రాహ్మలు

15) వైఖానసులు

16) మధ్వలు

17) కాణ్వులు

18)కాణ్వేయులు

శివార్చక బ్రాహ్మణ శాఖలు..

1)మహారాష్ట్ర చిత్సవనులు

2) లింగార్చకులు

3) ఆది శైవులు

4) శివార్చకులు

5)వీర శైవులు

6)మోనభార్గవ శైవులు

7)కాశ్యప శైవులు

8) శైవులు

9) ప్రధమ శాఖ శైవులు

10)రుద్ర శైవులు

11) పరమ శైవులు

12) శివ పూజారులు

13) శైవ స్మార్తులు

మొత్తం బ్రాహ్మణ ఉప శాఖలు 75 ఉన్నాయి.. మీ బ్రాహ్మణ మిత్రులందరికీ ఈ పోస్ట్ ను షేర్ చెయ్యండి..

Tuesday, October 6, 2020

హవిర్భాగములు అందుకుంటున్న బ్రాహ్మణేతరులు

బ్రాహ్మణులుగా పూజించబడి .... ఈరోజుకీ పూజింపబడుతూ ........ యజ్ఞయాగాలలో నేటికీ హవిర్భాగములు కూడా అందుకుంటున్న  బ్రాహ్మణేతరులు .. 


( వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 


1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.


2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.


3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు 


4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.


5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమ పవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 


6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.


7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీ వశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తు న్నారు. ప్రతి పూజలోనూ హిందువుల చేత .. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందు కుంటున్నారు. 


వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 


8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.


9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.


ఇంకా.... ..

1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు


2.  ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)


3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.


ఉన్నతవంశాలలో పుట్టిన వారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్క రించారు ... వారిలో కొందరు:


1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.


2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..


3. రఘువంశ మూల పురుషుడైన రఘు మహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు


4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.


5. విశ్వామిత్రుడు క్షత్రియుడు. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.


6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణు పురాణం 4.1.14)


7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది  ( విష్ణుపురాణం 4.1.13). 


8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశ బ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణు పురాణం 4.3.5).


9. శౌనక మహర్షి కుమారులు .. 4 వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).


10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.


వీరిలో చాలామంది .. వేదమంత్రాలు కూడా రచించినవారు ఉన్నారు.


హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నది కానీ, జన్మం మీద కాదు.  


ఇప్పుడు వీళ్ళు జ్ఞానాన్ని విడిచి పెట్టి, జననం ను అనుసరించి పదవులు  సంప్రాప్తిoప జేయి చున్నారు.  అదే దేశ అధోగతి కి దోహదం చేయుచున్నది.

అగ్ని దేవుడు

బుద్ధి మంతుడగుపురుషుడు నిర్వాణాది దీక్షలలో నలబది యోనిమిది సంస్కారములు చేసి కొనవలెను. ఆసంస్కారములను గూర్చి వినుము. వీటిచే మనుష్యుడు దేవతా తుల్యుడగును. మొట్ట మొదటయోనిలో , గర్భా ధానము. పిమ్మట 

(2) పుంసవన సంస్కారము చేయ వలెను పిమ్మట

(3) సీమంతో న్నయనము, 

(4) జాత కర్మ 

(5) నామకరణము 

(6) అన్నప్రాశనము 

(7) చూడా కర్మ 

(8) బ్రహ్మచర్యము 

(9) వైష్ణవి 

(10) పార్థి

(11) భౌతిక 

(12) శ్రౌతికి అను నాలుగు బ్రహ్మచర్య వ్రతములు, 

(13) గోదానము

(14) సమావర్తనము 

(15) అష్టక

(16) అన్వష్టక 

(17) పార్వణ శ్రాద్ధము 

(18) శ్రావణి 

(19)ఆగ్రహాయణి 

(20) చైత్రి 

(21) ఆశ్యయుజి అను ఏడు పాక యజ్ఞములు, 

(22) ఆధానము 

(23) అగ్ని హోత్రము 

(24) దర్శము 

(25) పౌర్ణ మాసము 

(26) చాతుర్మాస్యము

(27) పశు బంధము 

(28) సౌత్రామణి అను ఏడు హవిర్యజ్ఞములు 

(29) యజ్ఞము లలో శ్రేష్ఠమైన దగు అగ్నిష్టోమము 

(30) అత్యగ్నిష్టోమము 

(31) ఉక్థ్యము 

(32) షోడశి

(33) వాజపేయము 

(34) అతిరాత్రము 

(35) అప్తోర్యామముఅను ఏడు సోమ సంస్థలు ,

(36) హిరణ్యాంఘ్రి 

(37) హిరణ్యాక్షము 

(38) హిరణ్య మిత్రము 

(39) హిరణ్య పాణి 

(40) హేమాక్షము

(41) హేమాంగము 

(42) హేమ సూత్రము 

(43) హిరణ్యాస్యము

(44) హిరణ్యాంగము 

(45) హేమజిహ్వము 

(46) హిరణ్యవత్తు 

(47) అన్నియజ్ఞములకును అధిపతి యైన అశ్వ మేధము అను సహస్రేశ యజ్ఞములు , సర్వ భూతదయ , క్షమ , ఋజుత్వము , శౌచము , అనాయాసము , మంగళము , అకార్పణ్యము , అస్పృహఅను ఎనిమిది గుణములు. ఈ సంస్కారములను చేయ వలెను. ఇష్ట దేవతా మూల మంత్రమును నూరు ఆహుతు లివ్వ వలెను. సౌర , శాక్త , వైష్ణవ , శైవ దీక్షలలో అన్నింటి యందును ఇవి సమానమే. ఈ సంస్కారములచే సంస్కృతు డగు పురుషుడుభోగములను, మోక్షమును కూడ పొందును. సమస్త రోగములచేవిముక్తుడై దేవతా పురుషుడు వలె నుండును. మునుష్యునకు ఇష్ట దేవతా మంత్ర జప , హోమ , పూజా , ధ్యానములచే అభీష్ట ప్రాప్తి కలుగును.


జమ్మిచెట్టుకి ఎందుకంత ప్రాధాన్యత?

దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది జమ్మిచెట్టు. దసరా సాయంత్రం వేళ జమ్మికొట్టి, ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు. చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో తరచూ కనిపించేదే! కానీ ఈ దసరా రోజుకీ జమ్మి చెట్టుకీ మధ్య అనుబంధం ఏమిటి అన్న ప్రశ్నకు చాలా సమాధానాలే కనిపిస్తాయి.

కాస్త జమ్మి గురించి...

జమ్మి భారతీయులకు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే భారత ఉపఖండంలోనే ఈ వృక్షం ఉద్భవించిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకనే రుగ్వేదకాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు. మనం పురాణాలలోనూ, వేదాలలోనూ తరచూ వినే ‘అరణి’ని ఈ జమ్మితోనే రూపొందించేవారు. జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వరత్వరగా పెరిగేస్తుంది. నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం బతికేస్తుంది. అందుకే ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ వరకు పొడి ప్రాంతాలలోని ప్రజలకు జమ్మి జీవనాధారంగా నిలుస్తోంది.

పట్నం వాసులకు జమ్మి ప్రయోజనాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రైతులకు, గ్రామీణ ప్రాంతాలవారికీ జమ్మి అంటే ప్రాణం. దీని కొమ్మలు, ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి; దీని వేళ్లు భూసారాన్ని పట్టి ఉంచుతాయి; ఈ చెట్టులోని ప్రతిభాగాన్నీ నాటువైద్యంలో ఔషధాలుగా వాడతారు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా, దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం. అందుకే వినాయక చవినినాడు పూజించే ఏకవింశతి పత్రాలలో శమీపత్రాన్ని కూడా చేర్చారు.

దసరా- జమ్మిచెట్టు

ఏడాదిపాటు అజ్ఞానవాసానికి బయల్దేరిన పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట. తిరిగి అదే విజయదశమినాడు వారు జమ్మిచెట్టు రూపంలో ఉన్న అపరాజితా దేవిని పూజించి, తమ ఆయుధాలను తీసుకున్నారు. అలా పాండవులకు అపరాజితా దేవి ఆశీస్సులు ఉండబట్టే, వారు యుద్ధంలో గెలిచారని నమ్ముతారు. కేవలం పాండవులే కాదు, రామునికి సైతం జమ్మిచెట్టు ప్రీతికరమైనది చెబుతారు (రామస్య ప్రియదర్శనీ). పైగా జమ్మిచెట్టుని స్త్రీస్వరూపంగా (శక్తిగా) భావిస్తారు. ఆ శక్తి అనుగ్రహం కూడా రాములవారికి లభించబట్టే, ఆయన రావణునితో జరిగిన సంగ్రామంలో గెలుపొందారట.

జమ్మి చెట్టుకి మన పురాణాలలోనూ, జీవితాలలోనూ ఇంతటి సంబంధం ఉండబట్టే దసరానాడున జమ్మిచెట్టుకి పూజలు చేస్తారు. శమీవృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ ఈ క్రింది శ్లోకాలను చదువకుంటారు-

‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.’’

‘’శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,

ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ,

కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,

తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.''

జమ్మి బంగారం

పూజ ముగిసిన తరువాత జమ్మి ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు. ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్నా ఆధ్మాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా కుబేరుడు ఒకనాడు రఘమహారాజుకి భయపడి జమ్మిచెట్లున్న తావున బంగారాన్ని కురిపించాడనే గాథ ఎలాగూ ప్రచారంలో ఉంది. అలాంటి జమ్మి ఆకులను శుభంగా భావించి, జమ్మి కొట్టేందుకు రాలేకపోయిన పెద్దల చేతిలో ఉంచుతారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలనూ సాధించాలని కోరుకోవడమే. పిల్లల మనసులోని ఈ విజయకాంక్షను గ్రహించిన పెద్దలు, వారి మనోకామన నెరవేరాలని తమ దీవెనలను కూడా జతచేస్తారు.

పాలపిట్ట

దసరా రోజున పాలపిట్టను కూడా చూడాలన్న నియమం ఒకటి ఉంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద నుంచి తీసుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా, వారికి పాలపిట్ట కనిపించిందనీ... అప్పటి నుంచీ వారికి సకల విజయాలూ సిద్ధించాయని ఒక నమ్మకం. అందుకనే విజయానికి శుభసూచకంగా పాలపిట్టను దర్శించే ఆనవాయితీ బయల్దేరింది.

కొసమెరుపు

జమ్మిచెట్టుకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’ (UAE) భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మిచెట్టుని నాటమని సూచిస్తోంది. కానీ మనదగ్గర మాత్రం ఉన్న కాసిని జమ్మి చెట్లూ నాశనం అయిపోతున్నాయి. ఇప్పటి పిల్లలైతే జమ్మి చెట్టుని గుర్తిస్తారో లేదో కూడా అనుమానమే! ఇక పాలపిట్ట సంగతి చెప్పనే అక్కర్లేదు. విజయదశమినాడు పంజరాల్లో పాలపిట్టలను తీసుకుని వచ్చి దర్శనం చేయిస్తున్నారంటే... ఇవి అంతరించిపోయేందుకు ఎంతటి సమీపంలో ఉన్నాయో తెలిసిపోతుంది. జమ్మిచెట్టు, పాలపిట్ట తిరిగి మన జీవితాలలో భాగమైనప్పుడే అసలైన విజయదశమి!

పంచమహాపాతకాలను పోగొట్టే పారిజాతపుష్పం

పారిజాత పుష్పాలు 9 రకాలు:

1.ఎర్ర(ముద్ద)పారిజాతం

2.రేకు పారిజాతం

3.తెల్లగా ఎర్ర కాడతో ఉండే పారిజాతం (ఎక్కువగా అందుబాటులో ఉన్నది)

4.పసుపు పారిజాతం

5.నీలం పారిజాతం

6.గన్నేరు రంగు పారిజాతం

7.గులాబీరంగు పారిజాతం

8.తెల్లని పాలరంగు పారిజాతం

9.ఎర్ర రంగు పారిజాతం

ఎరుపు రంగు పారిజాతంతో విష్ణువును ఆరాధించరాదు.

ఎరుపు తమోగుణం, విష్ణువు సత్వగుణం.

పారిజాత పుష్పాలు క్రింద పడిన వాటినే వాడాలి. చెట్టు నుండి కోసి వాడరాదు.

పారిజాత వృక్షం తపస్సు చేసి తన పూలను తాను ఇస్తేనే తప్ప తన నుండి ఎవరూ లాగు కోకూడదని వరం పొందినది.

రంగు,..వైశాల్యం,..గుణం,..దేవతా స్వరూపాన్ని బట్టి దేవతలను ఆరాధించాలి..ఏ పూలను క్రింద పడ్డవి పూజకు వాడరాదు.

ఒక్క తెల్లగా ఎర్రని కాడతో పారిజాత పూవు తప్ప.

భూ స్పర్శ, మృత్తికా(మట్టి)స్పర్శ, జల స్పర్శ, హస్త స్పర్శ, తరువాత స్వామి స్పర్శ.

ఈ 5 స్పర్శల తోను పంచ మహా పాతకాలను పోగొట్టేదే పారిజాతం.

Monday, October 5, 2020

భోజనం - సదాచార నియమాలు............!!

1. భోజనానికి ముందు,తరువాత తప్పక కాళ్ళు, చేతులు  కడుక్కోవాలి.  తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.

2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు.  అలా చేస్తే అవి ఎంగిలి  అవుతాయి. 

ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. చాలా దోషం.  

4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.

5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.

6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు.  

7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.  ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.  

8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.  

9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.

10. ఉపనయనం అయినవారు తప్పక ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.

11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.

12.  ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే  ఆ పదార్థాలు ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.

13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే  మంచం మీద భోజనం చేయరాదు.  (ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)

14. మాడిన అన్నాన్ని నివేదించరాదు.  అతిథులకు పెట్టరాదు.

15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు. (వెంట్రుకలు కత్తిరించడం)

16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే  మనం తినగా మిగిలినవి పెట్టరాదు. మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి. 

17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు. 

18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.

19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది. 

20. భగవన్నామము తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ  వంట వండడం, భోజనం చేయడం చాలా ఉత్తమం. 

21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానకి  ఇబ్బంది అవ్వచ్చు) 

22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.  

23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు. ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.

24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.

25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.

26. అరటిఆకుల వంటి వాటిలో   భోజనం చేసిన వ్యక్తి  వాటిని మడవకూడదు  (తిన్న విస్తరిని మడవడం అనాచారం).   తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.

27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం. (జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.)    

28.  భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి.  అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి.  నోరు నీటితో పుక్కిలించుకోవాలి.

29.  భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి   మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.)  

30.  స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమము.  పెద్దలు,సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం  చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం.  అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు,

పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం.  అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.

31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు. ద్విపాక దోషం వస్తుంది. 

32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.

ప్రపంచంలోనే విలువైన 8 గొప్ప పాఠాలు

Vivekananda :  నిశ్శబ్దముగా  వుండు.

ఎందుకంటే నాణెము ధ్వణి చేసినంతగా నోట్లు చేయవు, విలువ కలిగినవి అలానే వుంటాయి.

Shakespeare :  ఇతరుల భావాలతో ఆటలాడకు.. అలా చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు గాక కాని ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు.

Napoleon :  ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది. దానికి గల కారణం  అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు మంచి వ్యక్తుల మౌనం.

Einstein :  నేను వారిపట్ల చాలా కృతఙ్ఞడనై వున్నాను. ఎవరయితే నన్ను నిరాకరించారో..వారి వలనే నేను నా అంతట నేనుగా ఎదిగాను.

Abraham Lincoln :  నీలో స్నేహ గుణం అన్నది నీ బలహీనత అయితే, ప్రపంచంలో నువ్వు అందరికన్నా బలమైనవాడివని అర్ధం.

Chralie Chaplin :  నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నవారి జీవితాల్లో 

బాధలు వుండవు అని అనుకోవద్దు. వారి వద్ద వాటిని ఎదుర్కుని నిలబడే శక్తి ఉన్నందునే ఆ విధంగా తారసపడతారు.

William Arthur :   అవకాశాలు సూర్యకిరణాలు వంటివి. అందుకే వాటిని వీలయినంత త్వరగా దొరకబుచ్చుకోవాలి.  ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు.

Hitler :    నువ్వు వెలుగులో వున్నంత కాలం నిన్ను అందరూ అనుసరిస్తారు. అదే నువ్వు చీకట్లో వుంటే నీ నీడ కూడా నీతో రాదు...