Friday, June 30, 2017

పురుషార్థములు

తత్వబోధ వేదాంతానికి చెందుతుంది. అది సంస్కృతంలో శంకరాచార్యచే లిఖించబడిన ముఖ్యమైన, ప్రాధమిక వచన కావ్యం. ఇందులో సాధారణంగా మన శాస్త్రాల్లో వాడే ముఖ్యమైన పదాలన్నీ వస్తాయి. మన శాస్త్రాలని ` అది భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ పురాణాలు కానీ, రామాయణం కానీ చదవాలంటే ఈ పదాల అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనాఉంది. ముఖ్యంగా వేదాంత శాస్రాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ఈ పదాలని క్షుణ్ణంగా అర్థంచేసుకోవాలి.

 ఈతత్త్వబోధలో ఉన్న అంశాలన్నింటి గురించి కొన్ని ప్రసంగాల పరంపర చూద్దాం. ఇందులోని అంశాలన్నింటినీ వివరించటమే కాక, కొన్ని కొత్త అంశాలను కూడా చూద్దాం. అద్వైత వేదాంతం బాగా అర్థం చేసుకోటానికి ముందుగా పురుషార్థాలంటే ఏమిటో చూద్దాం. మనుష్య లక్ష్యాలు:` పురుషార్థాలన్న పదాన్ని మనం మన శాస్త్రాల్లో తరచు చూస్తాం. అందుకని దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. పురుషార్థాలంటే మనుష్య లక్ష్యాలు. పురుష: అంటే మనుష్యుడు స్త్రీ గాని,పురుషుడు గాని. అందుకని దీన్ని మనుష్యార్థాలుగా అనువదించవచ్చు.అర్థ: అంటే సంస్కృతంలో అనేక అర్థాలున్నాయి. అర్థ: కి ఒక అర్థం, అర్థమే, అర్థ: అంటే *ఐశ్వర్యం కూడా.ఈ సందర్భంలో అర్థ: అంటే ఒక లక్ష్యం, ఒక గమ్యం.

  అర్థ్యతే సర్వైహి మనుష్యైహి ప్రార్థ్యతే ఇతి అర్థ:

  దేన్నైతే ప్రతి మానవుడు కోరుతాడో అది అర్థ: ప్రతి మనుష్యుడూ దేన్ని కోరుతాడు? రకరకాల లక్ష్యాలుంటాయి ఒక్కొక్కరికీ. కాబట్టి ఏ మానవ లక్ష్యాన్నైనా అర్థ: అంటారు. ఈ రెండు పదాలనీ కలిపితే మానవలక్ష్యాలు అని అర్థం.

  శాస్త్రంలో పురుషార్థంకి ఇంకో అర్థం కూడా ఉంది. ఒక సందర్భంలో పురుషార్థం అంటే ఇచ్ఛ. ఇంకో సందర్భంలో పురుషార్థం అంటే ఎన్నుకోవటం. ఇంకో సందర్భంలో ప్రయత్నం అని కూడా వస్తుంది. అంటే ఇచ్ఛ, ఎన్నుకోవటం, ప్రయత్నం  పురుషార్థంకి ద్వితీయ అర్థం. ప్రాథమిక అర్థం  మానవ లక్ష్యం లేదా మానవ గమ్యం. ఈ లక్ష్యాల మనుష్యులుగా సాధించాల్సినవే. జంతువులకో, వృక్షాలకో ఇది సాధ్యం కాదు. ఈ పురుషార్థాలు అందుబాటులో ఉండటం వల్ల మనుష్యుడు జంతువులు లేదా చెట్ల నుంచి విభిన్నంగా ఉన్నాడు. వీటివల్లే తక్కిన అన్ని జీవరాసుల కన్నా ఉన్నతంగా ఉన్నాడు.

అద్వైత వేదాంత పరిచయం

మనుష్యుల ప్రత్యేకత :

  మనుష్యులకి మాత్రమే ఎందుకు ఉన్నాయి ఈ పురుషార్థాలు? మనిషిలోని ఏ శక్తి ఈ ప్రత్యేక అవకాశాన్ని యిచ్చింది, పురుషార్థాలు కోరుకోవటానికి?మనుష్యులు ఎన్నో అంశాలలో జంతువులని, చెట్లని పోలి ఉన్నారని శాస్త్రాలు పలుకుతున్నాయి. తక్కిన జీవరాశులకీ మనుష్యులకీ మధ్య సాధర్మ ్యం ఉంది. కాని మనిషి మాత్రమే వాడగల ఒక ప్రత్యేక లక్షణం
ఉంది

పురుషార్థాలు ఆ విషయం ఒక అందమైన శ్లోకంలో చెప్పబడిరది.

  ఆహార నిద్ర భయ మైథునం చ
  సామాన్య మేతత్‌ పశుభిర్‌ నరాణామ్‌
  బుద్ధి: తేషామ్‌ అధికో విశేష
  బుద్ధ్య విహీన: పశుభిర్‌ సమాన:

  మనుష్యులకూ, తక్కిన జీవరాశులకూ కొన్ని అంశాలలో పోలికలున్నాయి. అందరూ ఆహారం కోరతారు.పుట్టినప్పటినుంచి ఆహారం కోసం వెతుకులాట మొదలౌతుంది. అలాగే నిద్ర,భయం,వంశాభివృద్ధి కూడా అందరికీ ఉంటుంది. కాని ఆలోచనా శక్తి, విచక్షణాశక్తి, అర్థం చేసుకునే శక్తి భవిష్యత్తును ఊహించే శక్తి, ముందుచూపు లాంటివి ఉండటం వల్ల మనిషి తక్కిన జీవరాశులకన్నా ఉన్నతుడయ్యాడు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయటం, భవిష్యత్తు బాగుండాలని కష్టపడటం అంతా విచక్షణాశక్తి కింద వస్తుంది.దాన్నే మనం బుద్ధి

అంటాం.బుద్ధిర్‌ తేషాం

అధికో విశేష: ఇదీ మనకున్న అధిక శక్తి. కేవలం బుద్ధి వల్లే మనిషి తక్కిన వాటికన్నా ఉన్నతుడయ్యాడు. బుద్ధ్యా విహీన:` బుద్ధి లేకపోతే లేదా దాన్ని వాడకపోతే, పశువుతో సమానం.అందువల్ల విచక్షణాశక్తి మనుష్యులకి విశేషంగా ఉంది.ఈ ప్రత్యేకమైన శక్తివల్లే మనం స్వయం ప్రతిభ,స్వయం నిర్ణయం చేసుకోగలుగుతున్నాం.తక్కిన వారితో మనని పోల్చుకోగలుగుతున్నాం. ఇవి పశుపక్ష్యాదులు చేయలేవు.

  ఒక డాగ్‌షోలో ఏ కుక్కకి బాగా తర్ఫీదు నిచ్చారో పరిశీలిస్తారు. కుక్కల చేత అనేక గారడీలు చేయించి వాటికి బంగారు, వెండి, రజత పతకాలిస్తారు. ఒలింపిక్స్‌లోలాగా వాటిని ప్రత్యేక స్థానంలో, ప్రత్యేక మెట్లమీద నిలబెట్టవచ్చు కూడా. ఆ కుక్కల భావాలెలా ఉంటాయి? వాటికి బంగారు పతకం వచ్చినా అవి పొంగిపోవు. రాకపోయినా కృంగిపోవు. అవి నాలుక బయటకి చాచి, అభావంగా యిటూ, అటూ చూస్తాయి అంతే. నిజానికి ఏం జరుగుతుందో వాటికేం అర్థంకాదు. కాని, ఆ కుక్కల యజమానికి మాత్రం కాంప్లెక్స్‌ ఉంటుంది. అందువల్ల మనకి బుద్ధి ఈ విశేష లక్షణమైన కాంప్లెక్సును పెంచి స్వయం నిర్ణయం, తోటివారితో పోల్చుకోవటం కలుగ
చేస్తుంది
అద్వైత వేదాంత పరిచయం

Wednesday, June 28, 2017

Bhagavad Gita

Today (28-Jun-2017) is Bhagavad Gita Jayanti. Which means today is the day when Bhagvad Gita was spoken by Lord Shri Krishna to his very first deciple in the form of human i.e. Arjun. Tomorrow Bhagavad Gita will complete 5151 years.
🔹Few facts of Bhagavad Gita please read :
🚩What is the Bhagavad-Gita?

The Bhagavad-Gita is the eternal message of spiritual wisdom from ancient India. The word Gita means song and the word Bhagavad means God, often the Bhagavad-Gita is called the Song of God.

🚩Why is the Bhagavad-Gita called a song if it is spoken?

Because its rhyming meter is so beautifully harmonic and melodious when spoken perfectly.

🚩What is the name of this rhyming meter?

It is called Anustup and contains 32 syllables in each verse.

🚩Who originally spoke the Bhagavad-Gita?

Lord Krishna originally spoke the Bhagavad-Gita.

🚩Where was the Bhagavad-Gita originally spoken?

In India at the holy land of Kuruksetra.

🚩Why is the land of Kuruksetra so holy?

Because of benedictions given to King Kuru by Brahma that anyone dying in Kuruksetra while performing penance or while fighting in battle will be promoted directly to the heavenly planets.

🚩Where is the Bhagavad-Gita to be found?

In the monumental, historical epic Mahabharata written by Vedavyasa.

🚩What is the historical epic Mahabharta?

The Mahabharata is the most voluminous book the world has ever known. The Mahabharata covers the history of the earth from the time of creation in relation to India. Composed in 100,000 rhyming quatrain couplets the Mahabharata is seven times the size of the Illiad written by Homer.

🚩Who is Vedavyasa?

Vedavyasa is the divine saint and incarnation who authored the Srimad Bhagavatam, Vedanta Sutra, the 108 Puranas, composed and divided the Vedas into the Rik, Yajur, Artharva and Sama Vedas, and wrote the the great historical treatise Mahabharata known as the fifth Veda. His full name is Krishna Dvaipayana Vyasa and he was the son of sage Parasara and mother Satyavati.

🚩Why is the Mahabharata known as the fifth Veda?

Because it is revealed in the Vedic scripture Bhavisya Purana III.VII.II that the fifth Veda written by Vedavyasa is called the Mahabharata.

🚩What are the special characteristics of the Mahabharata?

The Mahabharata has no restrictions of qualification as to who can hear it or read it. Everyone regardless of caste or social position may hear or read it at any time. Vedavyasa wrote it with the view not to exclude all the people in the worlds who are outside of the Vedic culture. He himself has explained that the Mahabharata contains the essence of all the purports of the Vedas. This we see is true and it is also written in a very intriguing and dramatically narrative form.

🚩What about the Aryan invasion theory being the source of the Bhagavad-Gita?

The Aryan invasion theory has been proven in the 1990s not to have a shred of truth in it. Indologists the world over have realized that the Aryans are the Hindus themselves.

🚩What is the size of the Bhagavad-Gita?

The Bhagavad-Gita is composed of 700 Sanskrit verses contained within 18 chapters, divided into three sections each consisting of six chapters. They are Karma Yoga the yoga of actions. Bhakti Yoga the yoga of devotion and Jnana Yoga the yoga of knowledge.

🚩When was the Bhagavad-Gita spoken?

The Mahabharata confirms that Lord Krishna spoke the Bhagavad-Gita to Arjuna at the Battle of Kuruksetra in 3137 B.C.. According to specific astrological references in the Vedic scriptures, the year 3102 B.C. is the beginning of kali yuga which began 35 years after the battle 5000 years ago. If calculated accurately it goes to 5151years from today.

🚩What is the opinion of western scholars from ancient times?

According to the writings of both the Greek and the Romans such as Pliny, Arrian and Solinus as well as Megastathanes who wrote a history of ancient India and who was present as an eyewitness when Alexander the Great arrived in India in 326 B.C. was that before him were 154 kings who ruled back to 6777 B.C. This also follows the Vedic understanding.

🚩When was the Bhagavad-Gita first translated into English?

The first English edition of the Bhagavad-Gita was in 1785 by Charles Wilkins in London, England. This was only 174 years after the translation of the King James Bible in 1611.

🚩Was the Bhagavad-Gita also translated into other languages?

Yes. The Bhagavad-Gita was translated into Latin in 1823 by Schlegel. It was translated into German in 1826 by Von Humbolt. It was translated into French in 1846 by Lassens and it was translated into Greek in 1848 by Galanos to mention but a few.

🚩What was the original language of the Bhagavad-Gita?

The original language of the Bhagavad-Gita was classical Sanskrit from India.

🚩Why is Srimad often written before the Bhagavad-Gita?
The word Srimad is a title of great respect. This is given because the Bhagavad-Gita reveals the essence of all spiritual knowledge.

🚩Is history aware of the greatness of Srimad Bhagavad-Gita?

Historically many very extraordinary people such as Albert Einsten, Mahatma Gandhi, Dr. Albert Schweitzer, Herman Hesse, Ralph Waldo Emerson, Aldous Huxley, Rudolph Steiner and Nikola Tesla to name but a few have read Srimad Bhagavad-Gita and were inspired by its timeless wisdom.

🚩What can be learned by the study of Srimad Bhagavad-Gita?

Accurate, fundamental knowledge about God, the ultimate truth, creation, birth and death, the results of actions, the eternal soul, liberation and the purpose as well as the goal of human existence.

వివిధ స్థానాల్లో మంత్రజప ఫలం

ఇంట్లో చేసే జపం జప సంఖ్యతో సమాన ఫలితాన్నిస్తుంది.
గోశాలలో అయితే జపసంఖ్య కన్నా నూరు రెట్లు ఎక్కువ.
నదీతీరంలో అయితే జపసంఖ్య కన్నా లక్షరెట్లు ఎక్కువ.

సాగర తీరాలు, దేవ జలాశయాలు, పర్వత శిఖరాలు, పవిత్ర ఆశ్రమాలు, శివ సాన్నిధ్యం, సూర్యబింబంలో నారాయణుని దర్శిస్తూ, అగ్నిసన్నిధిలో, దీపం వద్ద, గురుసన్నిధిలో జపం చేయడం వీశేష ఫలప్రదామని లింగ పురాణం చెబుతోంది. అలాగే తులసీవనం, అశ్వద్ధ వృక్షము, ఉసిరి, మారేడు వృక్షములలో చేసే జపం విశేష సిద్ధి ప్రదామని పురాణాలు చెబుతున్నాయి.

జపపూసలు మరియు సంఖ్య

జప సాధనకు జపమాల, దానిలో 108 పూసలుంటాయి. సూర్యులు ద్వాదశాదిత్యులని 12 విష్ణు స్వరూపులు. సూర్యునికి ద్వాదశ రాశులుంతాయి. ఆ సూర్యుడే బ్రహ్మ స్వరూపము. బ్రహ్మ సంఖ్య 9. 12 సంఖ్యలు గల సూర్యునితో బ్రహ్మను గుణిస్తే 108 సంఖ్య అవుతుంది. 108 యోగము 1+8=9 అవుతుంది. నవ సంఖ్య బ్రహ్మకు ప్రతీకము. అందువలననే బ్రహ్మవేత్తలైన సన్యాసులు నామములకు మునుపు బ్రహ్మకు ప్రతినిధిగా 108 అని వ్రాస్తున్నారు.

జపమాలను బొటన వ్రేలితో కలిపి ఎట్టి ప్రస్థితులలోనూ చిటికెన వేలుతో తిప్పరాదు. అది పూర్తిగా నిషిద్ధము. తర్జనివ్రేలు, శత్రువినాశకరమని, అంగుష్టము మోక్షదాయకమని, మధమాంగుఌ ధనదాయకమని, అనామిక శాంతిప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. అతి తప్పనిసరిగా బొటనవ్రేలును ఉపయోగించాలి.

జపమాల జారటం, తెగటం అనేవి జరగకుండా తగు జాగ్రత్త వహించాలి.

తూర్పు ముఖ జపం వశీకరణ కారకం.
దక్షిణ ముఖ జపం అభిచారిక (గారడి) కారకం.
పడమర ముఖ జపం సంపద కారకం.
ఉత్తర ముఖ జపం పౌష్టిక కార్యాలు, శాంతి, మోక్ష కారకం.

మానసిక జపానికి ఎక్కువ నియమాలు లేవు. 'మానసిక జపో నియమోనాస్తి' అని శాస్త్రం చెబుతోంది.

అశుచిర్యా శుచిర్వాః గచ్ఛం స్తిష్ఠన్ స్వజన్నపి |
మంత్రైక శరణోవిద్వాన్ మన శైవం సదాభ్యసేత్ ||
నదోషో మనసే జాపే సర్వదేశేపి సర్వదా |
జపనిష్టో ద్విజశ్రేష్ఠో జప యజ్ఞఫలం లభ్యత్ ||

పవిత్రునిపై కాని అపవిత్రునిపై కాని, నడచుచూ కాని, నిలబడి కాని, పరుండి కాని మనసులో మంత్రాన్ని జపించవచ్చును. మానవ జపము సర్వకాల, సర్వదేశ, సర్వావస్థల్లో చేయవచ్చు. అట్టివారు సర్వ యజ్ఞ ఫలితాన్ని పొందుతారు.

క్రుష్ణాజిన ఆసనం జ్ఞాన సాధకం.
చిత్రాసనం సర్వార్ధ సాధకం.
కుశాసనం మంత్రసిద్ధి.
వ్యాఘ్రాసనం పురుషార్ధ సాధకం.
జింక చర్మంపై జపం భగందర రోగం నయం.

ఒకరు ఉపయోగించిన ఆసనం వేరొకరు ఉపయోగించరాదు.

నేలపై కూర్చొని చేసే జపం దుఃఖ కారకం.
పీటపై దౌర్భాగ్యం.
వెదురుచాప దరిద్రం.
గడ్డిపై ధన, కీర్తి హాని
చిగురుటాకులు లేక పెద్ద ఆకులూ చిత్తాన్ని చలింపచేస్తాయి.

ఆసనం అంటే -- ఆసనం అంతే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేది. ఆసనం సర్వరోగాలను బాగుపరిచేది
ఆసనం నవ నిధులను ప్రసాదించేది అని అర్థం. జప, తపస్సు, దేవతారాధన మరియు సంధ్యావందనమునకు ఆసనం ప్రధానం.

Tuesday, June 27, 2017

Excerpt from "Shree Vidya", loni Guru parampara Rahasya Mantra vibhagam.....

1. గురువు ను దూషణ గాని పరిహాసము గాని చేయరాదు.
2. గురువును మన ఆలోచనలకు సరిపడ నడవమని చెప్పరాదు.
3. గురువు వద్దనుండి ధనము ఇచ్చి పుచ్చు కోకూడదు.
4. గురువుకు నచ్చనివారితో సహవాసమును చేయరాదు గురు దూషణ కూడ చెవులతో వినరాదు
5. గురువు చెప్పే మాట చేసే పని విరుధ్ధం గా ఉన్నా కూడా వారు చెప్పిన దాన్ని పాటించడమే
6. గురువు కూడా మనలాగ మనిషి అని తెలుసుకుని వారి తప్పులెంచకూడదు
7. గురువే భగవంతుని రూపముగా భావించాలి కాని సందేహం కూడదు.
8. గురువు వద్ద సమర్పణలో ఏరకమైన లోపము లోభము ఉండకూడదు
9. గురు ఆజ్ఞను లోకమునకు భయపడి ఆచరించకుండా ఉండరాదు
10. అందరి ముందు గురువుకు నమస్కారం చేయడానికి సిగ్గు పడకూడదు.
11. గురువును చాలా కాలము చూడకుండా ఉండకూడదు.
12. గురు పాదుక ఇచ్చారు కదా ఇక గురువెందుకు అని నిర్లక్ష్యం చేయకూడదు
13. గురువు నుండి ప్రత్యేక ఫలితంకోసం మంత్రము అడగకూడదు . నాకు ఆమంత్రం ముందే తెలుసు అనకూడదు.
14. గురువు వద్ద నాకు మంత్రం ఓక  విధంగాను వేరొకరికి వేరే విధంగాను ఎందుకు ఇచ్చారని అడగకూడదు. మంత్రం ఇంత చిన్నగా ఉంది అని అడగకూడదు.
15. గురువుతో వేరే శిష్యులు దగ్గరగా చనువుగా ఉండటం గురువు వారికి చేసే ఉపచారాలు ఉపేక్షణలు చూసి అసూయపడకూడదు .
16. గురువు తో వేరొకరు మాటలాడునది ఏమిటి అని తెలుసుకొనుటకు ప్రయత్నించరాదు.                      
గురువు మార్గదర్శి మాత్రమే. సాధన మనమే చేయాలి.

ఓంకారం

ఓంకారం
చాలామంది నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతంగా ఇష్టపడతారు.

పంచభూతాల్లో శబ్దం ముందు ఉంది. ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. శబ్దానికి ఆధారం ఓంకారమే!

ఓంకారం దేహంలో ఉంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితమవుతుంది. దివ్య ప్రకంపనలు శరీరాన్ని చుట్టుముడతాయి. అప్పుడు శరీరం సహజ ధ్యానంలోకి అత్యంత సహజంగా వెళుతుంది. ఆ తరవాత నిశ్శబ్దంలో ఓలలాడుతుంది.

ఓంకారానికి, ఓంకారానికి మధ్య ఏర్పడుతున్న నిశ్శబ్దాన్ని సాధకుడు గమనించాలి. అక్కడ మనసు ఆగిపోతుంది. ఆ నిశ్చలత్వమే ఓంకారాన్ని ఉద్దీపింపజేస్తుంది. ప్రయత్నపూర్వకంగా ప్రతి రోజూ ఓంకారాన్ని జపిస్తే, కొంతకాలం గడిచాక మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది.

‘ప్రశాంతత కావాల్సినవారు ఓంకార ధ్యానం చేయాలి’ అంటారు ఓషో. నమ్మకం ఉన్నవారైనా, లేనివారైనా ఓంకారాన్ని జపిస్తూ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కారాలు కలిసి ‘ఓంకారం’ అయిందని పండితులు చెబుతారు.

ఔషధాన్ని నమ్మనివారైనా, దాన్ని తీసుకున్నప్పుడు దాని పని అది చేస్తుంది. ఓంకారమూ అంతే! ఆ శబ్దాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టగానే, అది సాధకుల్ని చక్కగా పట్టుకుంటుంది. ఆరోగ్యం కలిగించేవరకు అది విడిచిపెట్టదు- అంటారు యోగ నిపుణులు.

వేదభూమికి ఆధారం ఈశ్వరుడు. ఆయనకు శబ్దరూపం ఓంకారం. ఓంకారంతో ధ్యానంలోకి ప్రవేశిస్తే చాలు. ఆనందం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదని ఉపనిషత్తులు చెబుతున్నాయి.

ఓంకారం అంటే, ఆనంద స్వరూపం. అది ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ కోశాల్ని దాటి వెలుగులీనుతూ ఉంటుంది అది. ఎవరు ఆ ప్రణవ శబ్దం చేస్తారో, వారితో సులువుగా కలుస్తుంది. వారిని తనలో కలుపుతుంది.

నిశ్శబ్దానికి నేపథ్యంగా ఉండేది ఓంకారమే. అది విశ్వంలో ఆత్మగా ఉంది. ఓంకారం- పిలిస్తే పలుకుతుంది. రుషుల చుట్టూ తిరుగుతుంది. ధ్యానుల శరీరాల్ని డమరుకాలు చేస్తుంది. జ్ఞానుల దేహాల్ని పాంచజన్యాలుగా మారుస్తుంది. శ్రీకృష్ణుడి మురళిలోకి ప్రవేశించిన ఓంకారం బృందావనమంతా విహ రించిందని పురాణ గాథలు చెబుతాయి.

ఓంకారం ప్రాణం. చైతన్యం, సత్యం, ఆనందం... అన్నీ ఓంకారమే.

శివుడి మాటలకు భాష ఓంకారం. ఆ శివతాండంలో ఓంకారం ప్రణవ నాదమవుతుంది. ముల్లోకాలూ ఆనంద సాగరంలో తేలియాడేలా చేస్తుంది. ఓంకారమే ప్రకృతిని నడిపిస్తుంది. ఆ ఓంకారాన్ని ఆహ్వానించి, ఆవాహన చేసుకున్న మానవ జన్మ ధన్యమైనట్లే!

ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ... ఇలా ప్రతి నామం ముందూ ఓంకారం భూషణమై వెలుగుతుంది. ప్రతి స్తోత్రమూ ఓంకారంతోనే ప్రారంభమవుతుంది. ప్రతి శ్లోకమూ ఓంకారంతోనే జీవిస్తుంది. ఓంకారంతోనే విశ్వం ప్రారంభమైంది. అది చివరికి ఓంకారంలోనే లీనమవుతుంది. ‘ఓం’ అని ధ్యానిస్తే పరమశివుడికి మోకరిల్లినట్లే!

సకల జీవులూ ఓం తోటలో పూచిన పుష్పాలు. ఓంకార వర్షంతోనే అవి పెరుగుతాయి. ఓంకార కాంతిలోనే అవి హాయిగా జీవిస్తాయి. ఓంకారం వాటికి ప్రాణవాయువు. వాటికి శక్తి, ధైర్యం, శాంతి ఓంకారమే. అందుకే అందరూ ‘ఓం’కారాన్ని శాంతితో జతచేస్తారు. శాంతిలో ‘ఓం’ చూస్తారు.

‘సమస్తం ఓంకారం నుంచే ఉద్భవించింది’ అంటారు కబీర్‌. దైవం ఓంకార ప్రేమ స్వరూపం. ఆయన రూప రహితుడు, నాశన రహితుడు, నిర్గుణుడు. ఆయనతో ఐక్యం కావడానికి యత్నించు. సమస్తమూ ఆయన ఆనందంలోనే ఉంది’ అని చాటిన కబీర్‌ మాటలు అక్షర సత్యాలు!

Tuesday, June 20, 2017

ఇంతకీ మీది ఏ స్నానం...?

                        🔴రుషి స్నానం,
🔴దేవ స్నానం,
🔴మానవ స్నానం,
🔴రాక్షస స్నానం...

ఇంతకీ మీది ఏ స్నానం...?

బారెడు పొద్దెక్కినా నిద్ర లేవ‌కుండా ప‌డుకోవ‌డం ఇపుడు సిటీల‌లోనే కాదు... ప‌ల్లెటూళ్ళ‌లోనూ ఫ్యాష‌న్‌గా మారింది.
అర్థరాత్రి వ‌ర‌కు సినిమాలు, టీవీలు, ఛాటింగుల‌తో గ‌డిపేసి... ఉద‌యం ఎంత‌కీ నిద్ర‌లేవ‌రు.
సూర్యుడు న‌డినెత్తిన చేరిన త‌ర్వాత స్నానం చేస్తుంటారు.
కానీ, ఇది మంచి ప‌ద్ధ‌తి కాదుంటున్నాయి శాస్త్రాలు. అస‌లు స్నానం ఎపుడు చేయాలి...?
దాన్నిబట్టి ఉండే ఫ‌లితాలు ఇవిగో...

🚿తెల్లవారుజామున 3.30 - 4.30 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు.

🚿4.30 నుంచి 5.30 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది కూడా ఉత్తమమే.

🚿 ఇక 5.30 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఇది మధ్యమం

🚿ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు.
ఇది అధమాతి అధమం.

కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం.

🚿ఇక స్నానాల్లోకెల్లా చన్నీటి స్నానం ఉత్తమమైనది.

🚿ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం ఉత్తమోత్తమం.

🚿చెరువులో స్నానం మద్యమం నూతి(బావి) వద్ద స్నానం చెయడం అధమం.

🚿వేయి పనులున్నా వాటిని వదిలి సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

🚿ఒక నదిలో స్నానం చేసినప్పుడు ఇంకో నదిని దూషించకూడదు.

కొన్ని స్పాలలో, ఆయుర్వేదశాలల్లో చాకొలేట్, మట్టి వంటి ఇతర పదార్థాలతో స్నానం చేయటానికి ప్రత్యేక వసతులు ఉంటాయి.
షాంపేనుతో స్నానం చేసిన ఉదాహరణలు అక్కడక్కడా కనిపిస్తాయి. అంతేకాకుండా ఆరుబయట సూర్యుని కిరణాలు శరీరాన్ని తాకేట్టు పరుండటాన్ని కూడా స్నానంగా పరిగణిస్తారు.
ఈ సూర్య స్నానం (సన్ బాతింగ్) ముఖ్యంగా పాశ్చాత్య ప్రజలలో ప్రసిద్ధి చెందినది.

⛱ *పురాణాలలో స్నానం
మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినది జలం, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలుబడదు.
అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.

⛱ మంత్ర స్నానం:
వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది "మంత్ర స్నానం"

⛱ *భౌమ స్నానం
పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్టమన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రాలతో చేసేది "భౌమ స్నానం".

⛱ ఆగ్నేయ స్నానం:
సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును మంత్ర సహితంగా లేదా శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేసేది "ఆగ్నేయ స్నానం"

⛱ వాయువ్య స్నానం: ముప్పది మూడు కోట్ల దేవతులు నివశించు గోమాత పాద ధూళి చేత చేసేది "వాయువ్య స్నానం"

⛱ దివ్య స్నానం:
లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం "దివ్య స్నానం".
ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.

⛱ వారుణ స్నానం:
పుణ్య నదులలో స్నానం ఆచరించడం
"వారుణ స్నానం".

⛱ *మానస స్నానం
నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం
"మానస స్నానం".
ఇది మహత్తర స్నానం.
మహా ఋషులచేత ఆచరింప బడుతుంది. ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి.

🎊 స్నానాలు రకాలు

🌧 మానస స్నానం:
దైవాన్ని స్మరిస్తూ, మనసును నిలిపి చేయు స్నానం.

🌧 క్రియాంగ స్నానం:
జపం, మంత్రతర్పణ చేయుటకు చేసే స్నానం.

🌧 దైవ స్నానం:
ఉదయం 4-5 గంటల మధ్య చేయు స్నానం.

🌧 మంత్ర స్నానం:
వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానం.

🌧 రుషి స్నానం:
ఉదయం 5-6 గంటల మధ్య చేయు స్నానం.

🌧 మానవ స్నానం:
ఉదయం 6-7 గంటల మధ్య చేయు స్నానం.

🌧 రాక్షస స్నానం:
ఉదయం 7 గంటల తరవాత చేసే స్నానం.

🌧 ఆతప స్నానం:
ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకునే స్నానం.

🌧 *మలాపకర్షణ స్నానం:
మాలిన్యం పోవుటకు చేయు స్నానం.

Sunday, June 18, 2017

మనకు తిరుమలలో వసతి దొరకు ప్రదేశములు మరియు వాటి యొక్క ఫోను నెంబర్లు


Some one shared the list of accommodation in Tirumala.

This is very useful if you find it hard to find a room in TTD.

MUTT (TIRUMALA)

Mool Mutt Ph:0877-2277499.

Pushpa Mantapam Ph:0877-2277301.

Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317.

Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187.

Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.

Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302.

Sri Vaykhanasa Divya Siddanta

Vivardhini Sabha Ph:0877-2277282.

Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370.

Sri Pushpagiri Mutt Ph-0877-2277419.

Sri Uuttaradi Mutt Ph-0877-2277397.

Udupi Mutt Ph-0877-2277305.

Sri Rangam Srimad Andavan Ashramam Ph:0877-2277826.

Sri Parakala Swamy Mutt Ph:0877-2270597,2277383.

Sri Tirupati Srimannarayana Ramanuja

Jeeyar Mutt Ph:0877-2277301.

Sri Sringari Saradha Mutt Ph:0877-2277269,2279435.

Sri Ahobita Mutt Ph:0877-2279440.

Sri Tirumala Kashi Mutt phone : 222 77316

Udipi Mutt Ph:0877 222 77305

Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph:0877 222 77301)

Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph:0877 222 77370)

Sri Vallabhacharya Mutt phone : 222 77317

Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph:0877 222 77302

Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph:0877 222 77436

Srirangam Srimad Andavan Ashram Ph:0877 222 77826

Sri Vaikhanasa Ashram Ph:0877 222 77282

Sri Ahobila Mutt Ph:0877-2279440

Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph:0877 222 77269

Sri Vyasaraja Mutt

Motilal Bansilal Dharmasala Ph:0877 222 77445

Hotel Nilarama Choultry Ph:0877 222 77784

Sri Srinivasa Choultry Ph:0877 222 77883

Sri Hathiramji Mutt Ph:0877 222 77240

Karnataka Guest House Ph:0877 222 77238

Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph:0877 222 77245

Sri Sringeri Sankara Nilayam Ph:0877 222 79435

Sri Swamy Hathiramji muttam Ph:0877-2220015

అందరికీ   ఎంతో  ఉపయోగ  పడే  Message.

మీరు  Save  చేసుకోండి .

పదిమందికి పనికి వస్తుందనుకున్తే Share  చెయ్యండి .

ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి

 ఇప్పుడు ఎవరు వైదికులు ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి ఈనాడు ఆనాటి వైదీకులు అనేవాళ్ళు ఉన్నారా ఈనాడు అం...