Sunday, April 11, 2021

దేవతలు వాహనములు

1) విష్ణువు –గరుడుడు

2) లక్ష్మీదేవి –గుడ్ల గూబ

3) రతి మన్మదులు=కీరం(చిలుక)

4) హనుమంతుడు=ఒంటే

5) శివుడు =వృషభం

6) పార్వతి దేవి=సింహం

7) వినాయకుడు=మూషికం

8) కుమారస్వామి=నెమలి

9) బైరవుడు=శునకం

10) బ్రహ్మ=హంస

11) సరస్వతి=హంస

12) అశ్వినినులు=కంచర గాడిదలు

13) రావణుడు=గాడిదలు.

14) లలితాదేవి=వరాహం (కిరిచక్ర రధారూఢ)

15) శీతలా దేవి=గాడిద

16) గంగాదేవి=మకరం

17) యమునాదేవి=కూర్మం

18) అయ్యపస్వామి=పులి

19) కాలునుకి=మహిషం

20) నముచి=ఉచ్చైశ్రవము

21) అలమేలుమంగ అమ్మవారు=చాతకం

22) వాస్తుపురుషుడు=గండభేరుండం

23) కల్కి=గుఱ్ఱం

24) చండి=వరాహం

25) చాముండి=గుడ్లగూబ

26) విశ్వకర్మ=నక్క 

27) మానసా దేవి=సర్పం

28) ఇంద్రుడు=ఐరావతం

29) అగ్ని=మేషం/గొర్రె 

30) యముడికి=మహిషం

31) నైరుతి=శవ వాహనం

32) వరుణుడు=మకరం

33) వాయువు=కృష్ణ మృగం

34) కుబేరుడు=నర వాహనం

35) ఈశానుడు=వృషభం

36) సూర్యుడు=సప్త అనే పేరు గల అశ్వం

37) చంద్రుడు=జింక/10 శ్వేత అశ్వములు 

38) కుజుడు=మేషం

39) బుధుడు=గుఱ్ఱం

40) గురుడు=ఏనుగు

41) శుక్రుడు=గుఱ్ఱం / మకరం

42) శని=కాకి

43) రాహువు=పులి

44) కేతువు=చేప

 సంకలనం:-గొడవర్తి సంపత్కుమార్ అప్పలాచార్య

Friday, April 9, 2021

విద్యలు

విద్య నాలుగు విధములు


1. సాంకేతికము : 

మానవుని జీవితావసరములను తీర్చుచు, తద్ద్వారా సమాజాభివృద్ధికి అవసరమైన వృత్తులకు సంబంధించిన విద్య.


2. శారీరకము : 

శరీర ఆరోగ్యమునకు అవసరమైన వ్యాయామము, ఆహార నియమము, యోగాభ్యాసములకు సంబంధించిన విద్య.


3. నైతికము : 

సమాజము భౌతికముగా ఎంత పురోగమించినను, సంఘములోని వ్యక్తులు శీలవంతులై యుండుట, పురాణేతిహాసములలోని మహానుభావుల జీవితములను ఆదర్శముగా చూపుచు బోధించు విద్య.


4. ఆధ్యాత్మిక విద్య : 

అధి అనగా అత్యధికమైన సత్యము. ఆత్మ అనగా నేనుగా ప్రాకటమైనది. విద్య అనగా తెలుసుకొనవలసినది. ఈ మూడు అర్థములు కలిసినది తనను తాను సత్యస్వరూపమనే బ్రహ్మగా తెలుసు కొనుటకు అవసరమైన బోధ. దివ్యత్వమును గుర్తింపజేసి, పూర్ణానుభవమును అందించునది. అన్ని విద్యలలోకెల్లా గొప్పది. అన్ని విద్యలకు పునాది వంటిది. వివేకము, అర్పణ, కర్తవ్యములను మేళవించి, శిక్షణతో కూడిన విద్య ఆధ్యాత్మిక విద్య.


విద్య కొఱకు త్రివిధ విచారణ : 

1. పరబ్రహ్మ స్వరూప నిశ్చయము. 2. మాయా స్వరూప నిశ్చయము 3. ధర్మస్వరూప నిశ్చయము.


అన్వీక్షకీ విద్య : 

తర్క వేదాంతమునకు సంబంధించిన విద్య.


విద్యకు శత్రువులు : 

పెద్దల సేవ చేయకుండుట, తొందరపాటు, రజో గుణము, ఆత్మ స్తుతి, పరనింద - ఇవన్నీ విద్యార్జనకు ప్రతిబంధకములు, శత్రువులు.


వార్త : అర్థ, అనర్థములను బోధించు విద్యను వార్త అందురు. వార్త అనగా శ్రమ, వ్యవసాయము, ఉపాయములను అవలంబించి, సత్ఫలితమును సాధించుటను తెలియజేయు విద్య.


భగవద్గీతలోని విద్యలు : 

1. అభయ విద్య 2. సామ్య విద్య 3. బ్రహ్మ విద్య 4. భగవత్‌ విద్య.


విద్య (జ్ఞానము) : జీవుడే ఈశ్వరుడు, జీవుడే పరమాత్మ అనెడి అఖండ, అభిన్న, అద్వితీయ తత్త్వమును బోధించు శబ్దములు, వాక్యములు, వాక్యార్థములు.


వైశ్వానర విద్య : ఛాయా పురుష లక్షణము గురించిన విద్య.


వారుణీ విద్య : వరుణుడు భృగువునకు బోధించిన విద్య


భార్గవీ విద్య : భృగువు వరుణుడి ద్వారా సంపాదించిన విద్య


హార్ద విద్య : ఆత్మ గురించి హృదయ సమీపమునకు చేర్చబడిన విద్య


బ్రహ్మ విద్య : 1. బ్రహ్మ పరమాత్మ నుండి సంపాదించిన విద్య 2. బ్రహ్మ నుండి అధ్వరుడికి, అతడి నుండి సర్వులకు చేరిన విద్య 3. బ్రహ్మము గురించిన విద్య 4. శ్రేష్ఠమైనది, గొప్ప దానికంటే గొప్పదైన విద్య - అని నాలుగు అర్థములు.


ముక్తి విద్య : పై నాలుగు అర్థములతో ఉన్న బ్రహ్మ విద్య పరంపరగా వచ్చి జీవులకు బంధ విముక్తి కలిగించే విద్య.


నయ విద్య : శాస్త్రము ధర్మము చెప్పువారు 'ఇది ఇంతే' అని ప్రమాణమువలె చెప్పరాదు. ఎంత తెలిసినవాడైనా 'ఇప్పటికి నాకు తెలిసినది ఇంత మాత్రమే' అని చెప్పవలెను. కొన్ని విషయములను ప్రమాణము అని చెప్పినచో అపార్థము, అపకారము జరుగవచ్చును. వినయము, విశిష్ఠత, నేర్పుతో చెప్పగలవానిని నయవిద్య తెలిసినవాడని అందురు.


త్రయీ విద్య : వాయుమధనములో ఊర్థ్వ గతిని ప్రాణగతి అనియు, అధోగతిని అపానగతి అనియు, సమానత్వమును మధ్యగతి అనియు మూడు గతులుగా విభజించి వాయుమధనమును చేయు నేర్పును త్రయీ విద్య అందురు.

         ఈ వాయు మధనమునుండి ఉద్భవించు దానిని అశనము అందురు. అశనమనగా అన్నము. ఈ సాధనతో అశనమును గ్రహించిన ప్రాణుడు బలపడుచున్నాడు. ఇది యోగము.

              త్రయీవిద్య అనగా ధర్మ, అర్థ, కామములనెడి మూడింటిని తెలుసుకొని అర్థ కామములను ధర్మయుతముగా పొందే వివేకము.


పంచాగ్ని విద్య : ఆకాశము, మేఘము, భూమి, పురుషుడు, స్త్రీ అనేవి పంచాగ్నులు. వీటియందు శ్రద్ధా, సోమ, వృష్టి, అన్నము, రేతస్సు అనే పంచ ద్రవ్యములను, లేక పంచ ఆహుతులను హోమము చేయగా రేతో రూప ఆహుతియందు ఉదకములు పురుష రూపము చెందుచున్నవి. జీవుడు శరీర బీజములైన సూక్ష్మ బీజములతో చేరి క్రమముగా ఆకాశమున శ్రద్ధా రూపములో చేరి, వర్ష రూపములో భూమిపైబడి, అన్న రూపములో పురుషునిలోనికి చేరి, రేతస్సు రూపములో స్త్రీ గర్భమందు ప్రవేశించి, అక్కడనుండి పురుషుడుగా వ్యక్తమగుచున్నాడు. శ్రద్ధ అనగా జీవుడు జీవరూపముగా ఉండుటలో గల ధర్మము.


దహర విద్య : బ్రహ్మ రంధ్రమందు చిన్న కమలము, ఆ కమల మధ్యమున సూక్ష్మమైన శూన్య స్థానము, ఆ శూన్యమే దహరాకాశమనబడును. దీనిని తెలుసుకొన్నవాడు బ్రహ్మను తెలుసుకొనును. ఈ తెలుసుకొనే విద్యను దహర విద్య, లేక ప్రాణ విద్య అందురు.


సంవర్గ విద్య - వాయు సంవర్గ విద్య : వాయువు అనగా హిరణ్య గర్భుడు. ఇతడిలోనే ప్రపంచమంతయు పుట్టి, స్థితిని కలిగి, లయించుచున్నది. సంవర్గమనగా ప్రవిలయము. అనగా అతడిలో చేరి యుండుట అని అర్థము. సకల దేవతలు, జీవులు, జడ ప్రకృతి అంతా ప్రలయకాలములో ఈ వాయువును చేరి అవ్యక్తమగుచున్నవి. ఇట్టి వాయు సంవర్గమును ఉపాసన చేయుచు, తానుకూడా లేనివాడుగా అవ్యక్తమగుటను వాయు సంవర్గ విద్య అందురు. వాయువులో చేరి యుండుట వలన వాయువే సంవర్గుడు. కేవలము సంవర్గ విద్య అన్నను అదే.


మధు విద్య : సర్వ దేవతలలో ఉండే దైవత్వమును మధువు అందురు. త్రిగుణాత్మకమైన నామరూప క్రియా నటనలను వదలి, అందలి సారమైనట్టి ఆత్మ చైతన్యమును గ్రహింపజేయునది మధువిద్య. ఆ సారమే దైవత్వము, లేక మధువు లేక అమృతము. మధు విద్యోపాసకులకు బ్రహ్మానందము సిద్ధించును.


అపరవిద్య: గడ్డిపరక మొదలు సృష్టి కర్త వరకు గల ప్రకృతి గుణములను, ధర్మములను వివేకముతో సరిగా గ్రహించి, కార్యసిద్ధి బడయుట, ధర్మాధర్మములను తెలుసుకొనుట - ఈ రెండింటికి సంబంధించిన విద్యను అపరవిద్య అందురు.


పరవిద్య : ఉపాసన, తపస్సు, ఇంద్రియ మనో నిగ్రహము, యోగాభ్యాసము, మొదలగు సాధనలకు సంబంధించి మోక్ష లక్ష్యముగా తెలుపు విద్యను పరవిద్య అందురు.


బ్రహ్మ విద్యలు 32 : శ్రీ రామానుజాచార్యుల వారు తెలిపిన బ్రహ్మ విద్యలు 32 రకములు. 1. సద్విద్య 2. శాండిల్య విద్య 3. అంతరాదిత్య విద్య 4. ఆనంద విద్య 5. ప్రాణి విద్య 6. ఇంద్ర ప్రాణ విద్య 7. భూమ విద్య 8. నచికేత విద్య 9. గాయత్రీ జ్యోతిర్విద్య 10. ఆకాశ విద్య 11. అంతర్యామి విద్య 12. దహర విద్య 13. ఉపకోసల విద్య 14. వైశ్వానర విద్య 15. అక్షర విద్య 16. అంగుష్ఠ ప్రమితి విద్య 17. అజా శారీరక విద్య 18. చాలకీ విద్య 19. మైత్రేయీ విద్య 20. మధువిద్య 21. ప్రణవోపాస్య పరమ పురుష విద్య 22.ఆదిత్య స్థామర్మామక విద్య 23. అక్షస్థ ఆహావన్నామ విద్య 24. ఉషక్తి కహోల విద్య 25. గార్లక్ష విద్య 26. వ్యాహృతి శారీరక విద్య 27. పంచాగ్ని విద్య 28. పురుష విద్య 29. సంవర్గ విద్య 30. దేహోపాస్య జ్యోతిర్విద్య 31. ఈశావాస్య విద్య 32. బ్రహ్మ విద్య.


దండనీతి అనే విద్య : మంచి - చెడు, న్యాయము-అన్యాయము, ధర్మము- అధర్మము వీటి గురించియు, మంచి మొదలగు వారికి రక్షణయు, పురస్కారములను మరియు చెడు మొదలగు వాటిని నివారించుటకును, శిక్షించుటకును అవసరమైన నీతిని బోధించే విద్యను దండనీతి అనే విద్య అందురు.


ప్రతిస్మృతి విద్య : ఈ విద్య వలన అధిక తపోవీర్య సంపన్నుడగును. తక్కువ కాలములోనే ఎక్కువ ఫలితమును సాధించును.


పంచాగ్నులు :


1. ఆకాశాగ్ని సోమ రూపము

2. పర్జన్యాగ్ని వృష్టి రూపము

3. పృథివ్యగ్ని వ్రీహ్య రూపము

4. పురుషాగ్ని రేతో రూపము

5. యోషిదగ్ని పురుష రూపము

         జీవుడు తన శరీర పతనము తరువాత సోమ రూపుడై, వృష్టి రూపుడై, వ్రీహ్య (ధాన్య) రూపుడై, రేతో రూపుడై స్త్రీ యోనిలో చేరి, స్త్రీ గర్భమందు పురుషుడుగా మారుచున్నాడు. పంచాగ్నులలో క్రమముగా పరివర్తన చెందుచు పురుషుడగుచున్నాడు.

              యోగులలో భ్రూమధ్యమందు జ్ఞానాగ్నిగా, పాదకములందు కాలాగ్నిగా, నాభిస్థానమందు క్షుదాగ్నిగా, హృదయమందు శీతాగ్నిగా, నేత్రములందు కోపాగ్నిగా ఉండును. ఈ పంచాగ్నులను జ్వలింప జేసుకొనుచూ పరివర్తన చెందుటకు సాధన చేసే యోగి ముక్తుడగును.


త్రేతాగ్నులు :


1. గార్హ పత్యాగ్ని లేదా జఠరాగ్ని : గృహమనగా శరీరము. శరీరానికి పతిగార్హపతి అనగా జీవుడు. జఠరాగ్ని వలన కలిగే ఆకలి బాధ తీర్చుకొను చున్నప్పుడే శరీరము బలముగా, ఆరోగ్యముగా నుండును. జీవుడు తన శరీర పోషణార్థము మాత్రమే ఈ గార్హపత్యాగ్ని ఉన్నదని, తాను మాత్రము సాక్షిగా నుండవలెను.


2. ఆహవనీయాగ్ని : ఆహవనము అనగా అన్ని వైపులా ఉండే వాటిని తనవైపుకు తెచ్చుకొనుట, మరియు వాటిని తన లోపలకు తీసుకొనుట. విషయములను అన్ని వైపులనుండి తెచ్చుకొనుచు, తన మనస్సులోనికి చేర్చుకొనుట. మనస్సే ఆహవనీయాగ్ని. ఈ మనస్సు యొక్క స్వభావమును తెలుసుకొని, తాను మాత్రము సాక్షిగా నుండవలెను.


3. దక్షిణాగ్ని : హృదయములో ఉండే తేజస్సు, దానివలన కలిగే జ్ఞానమును దక్షిణాగ్ని అందురు. దక్షిణాగ్నియే జ్ఞానాగ్ని. హృదయములో కలిగే జ్ఞానానికి కూడా అతీతమైన పరబ్రహ్మగా సిద్ధిని పొందవలెను.


శ్లో||  విద్యాంచా- విద్యాంచ యస్త ద్వేదో-భయం సహ |

       అవిద్యయా మృత్యుం తీర్థ్వా విద్యయా-మృతమస్నుతే ||


తా|| విద్యను, అవిద్యను రెంటిని తెలుసుకొనవలెను. అవిద్యను తెలిసి విడచుట చేత మృత్యువును అధిగమించును. విద్యను తెలియుటచేత అమృతత్వమును సిద్ధింపజేసుకొనును.

Wednesday, April 7, 2021

అయ్యప్ప స్వామి శరణు ఘోష అర్ధ వివరణ

1. స్వామియే శరణం అయ్యప్ప


అయ్యప్ప స్వామి శరణమ్


2. హరిహర సుతనే శరణం అయ్యప్ప


శివకేశవుల యొక్క కుమారుడు


3. ఆపద్బాంధనవే శరణం అయ్యప్ప


ఆపదల నుండి రక్షించే స్వామి


4. అనాధ రక్షకనే శరణం అయ్యప్ప


అనాధలను రక్షించే స్వామి


5. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకనే శరణం అయ్యప్ప


ఈ చరాచర భూమండలానికి బ్రహ్మాండ నాయకుడు


6. అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప


ఎల్లప్పుడు అన్నమును ప్రసాదించుస్వామి


7. అయ్యప్పనే శరణం అయ్యప్ప


అయ్య - అప్పనే (ధర్మశాస్త్ర వారి కారణ నామము)


8. అరియంగావు అయ్యవే శరణం అయ్యప్ప


యుక్తవయస్సు వచ్చిన స్వామి రూపం ఉన్న ప్రదేశం ,  పుష్కర దీవిలో వున్న ఆలయం , పుట్రాలం , చెంగోట్టి మార్గంలో వున్నది.


9. అచ్చన్ కోవిల్ అరసే శరణం అయ్యప్ప


పర్వతమందలి ఒక ప్రదేశం ఇచ్చట పుష్కలాంబ సమేత -

సంసార రూపునిగా అయ్యప్పస్వామి ఆలయము కలదు.


10.  కుళత్తుపులై బాలకనే శరణం అయ్యప్ప


కుళుత్తపులైలో పసిబాలునిగా స్వామి రూపం ఉన్న ప్రదేశం


11.  ఎరుమేలి శాస్తవే శరణం అయ్యప్ప


మహిషిని సంహరించిన ప్రదేశం , ఆటవికుడిగా స్వామి రూపం.

గరయాతలోనూ శరణఘోషయే శరణ్యం.


12. వావర్ స్వామియే శరణం అయ్యప్ప


ఆటవికుని మార్చి , తన ప్రియ శిష్యునిగా చేసుకొనిన అయ్యప్ప మిత్రుడు-

వావర్ స్వామి. (స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రుడైన శిష్యుడు వావర్ స్వామి) 


13. కన్నిమూల మహా గణపతియే శరణం అయ్యప్ప


పంబలో వున్నటువంటి గణపతి మహరాజు


14. నాగరాజావే శరణం అయ్యప్ప


సుబ్రహ్మణ్యస్వామి అవతారము


15. మాలికా పురత్తులోక దేవిమాతావే శరణం అయ్యప్ప


మహిషి సంహారము అనంతరము స్వామివారిని

వివాహమాడదలచినది. (సాక్షాత్ శక్తి స్వరూపిణి)


16. కరుప్పుస్వామియే శరణం అయ్యప్ప


పదునెట్టాంబడికి కాపలామూర్తిగా ఉండేటటువంటివాడు.


17. సేవిప్పవర్కు ఆనందమూర్తియే శరణం అయ్యప్ప


ఆరాధించు భక్తులకు ఆనందమొసగిడు స్వామి


18. కాశీ వాసియే శరణం అయ్యప్ప


కాశీలో ఉన్నటువంటి స్వామి


19. హరిద్వార్ నివాసియే శరణం అయ్యప్ప


హరిద్వార్ లో ఉన్నటువంటి స్వామి


20. శ్రీరంగ పట్టణ వాసియే శరణం అయ్యప్ప


శ్రీరంగపట్నంలో ఉన్నటువంటి స్వామి


21. కరుప్పత్తూర్ వాసియే శరణం అయ్యప్ప


కరుప్పత్తూర్ లో ఉన్నటువంటి స్వామి


22. గొల్లపూడి శ్రీ ధర్మశాస్తావే  శరణం అయ్యప్ప


గొల్లపూడి పట్టణంలో వెలసి ఉన్నస్వామి


23.  సద్గురు నాధనే శరణం అయ్యప్ప


గురువులలో శ్రేష్టమైన స్వామి


24. విల్లాళి వీరనే శరణం అయ్యప్ప


విల్లంబులు ధరించిన స్వామి


25. వీరమణికంఠనే శరణం అయ్యప్ప


మహిషి సంహారమునకై అవతరించిన వీర మణికంఠుడు


26. శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప


శాస్త్ర ధర్మములును శాసించే సకల ధర్మస్వరూపుడైన స్వామి


27. శరణ ఘోష ప్రియనే శరణం అయ్యప్ప


తన శరణముల ప్రవాహషోషతో ఉప్పోంగు స్వామి


28. కాంతమలై వాసనే శరణం అయ్యప్ప


కాంతమల అనే కొండ మీద ఉన్న స్వామి


29.  పొన్నంబల వాసనే శరణం అయ్యప్ప


పొన్నంబల అనే కొండమీద కొలువైన స్వామి


30. పంబాశిశువే శరణం అయ్యప్ప


పంబానది ఒడ్డున శిశువునిగా దొరికిన స్వామి


31.  పందళరాజకుమారనే శరణం అయ్యప్ప


పందళరాజుకు కుమారుడైన స్వామి


32. వావరితోళనే శరణం అయ్యప్ప


వావరు , స్వామికి శిష్య సహచరుడు


33.  మోహినీ సుతనే శరణం అయ్యప్ప


విష్ణుమూర్తి మోహినీ అవతారమెత్తగా జన్మించిన స్వామి


34. కణకండ్ దైవమే శరణం అయ్యప్ప


మంచి దయార్థ ధృష్టి కలిగి తలచినంతనే పలికే దైవం స్వామి


35. కలియుగ వరదనే శరణం అయ్యప్ప


కలియుగంలో కోరగానే వరమిచ్చు స్వామి


36. సర్వరోగ నివారణ ధన్యంతర మూర్తియే శరణం అయ్యప్ప


అన్ని రోగములు తగ్గించే ధన్వంతరి రూపుడయిన స్వామి


37.  మహిషి మర్ధననే శరణం అయ్యప్ప


మహిషిని వధించిన స్వామి


38.  పూర్ణ పుష్కల నాధనే శరణం అయ్యప్ప


పూర్ణ పుష్కలాంబలను పెండ్లాడిన స్వామి


39.  వన్పులి వాహననే శరణం అయ్యప్ప


పులిని వాహనము చేసుకున్న స్వామి


40. భక్తవత్సలనే శరణం అయ్యప్ప


భక్తులను కాపాడే అయ్యప్ప స్వామి


41. భూలోకనాధనే శరణం అయ్యప్ప


భూలోక మంతటని రక్షించే నాధుడు స్వామి


42.  అయిందుమలై వాసననే శరణం అయ్యప్ప


అయిదు కొండలయందు ఉన్నటువంటి స్వామి

కరిమల , నీలిమల , శబరిమల , పొన్నంబల , కాంతిమల


43.  శబరి గిరీశనే శరణం అయ్యప్ప


శబరి కొండమీద కొలువై వున్న స్వామి


44.  ఇరుముడి ప్రియనే శరణం అయ్యప్ప


ఇరుముడిలో స్వామివారి అభిషేకం నెయ్యి , తేనె , పన్నీరు ,

చందనాలు ఒక ముడిగాను , దారిలో ఆహారం ,

తినుబండారాలు ఒక ముడిగాను వున్న రెండు మూటల సంచి


45. అభిషేక ప్రియనే శరణం అయ్యప్ప


అభిషేకము అంటే స్వామికి ఎంతో యిష్టం


46. వేదప్పొరుళే శరణం అయ్యప్ప


వేదరూపుడైయిన స్వామి


47. శుద్ధ బ్రహ్మ చారియే శరణం అయ్యప్ప


నిత్య బ్రహ్మచారిగా దర్శనమిచ్చే స్వామి


48. సర్వమంగళదాయకనే శరణం అయ్యప్ప


సర్వమంగళాలను అనుగ్రహించు స్వామి


49. వీరాధివీరనే శరణం అయ్యప్ప


వీరులలో గొప్పవాడైన స్వామి


50. ఓంకారప్పొరుళే శరణం అయ్యప్ప


ఓంకారరూపుడైన స్వామి


51. ఆనందరూపనే శరణం అయ్యప్ప


ఆనందరూపుడైన స్వామి


52. భక్తచిత్తాదివాసనే శరణం అయ్యప్ప


భక్తుల మనస్సులలో కొలువైనటువంటి స్వామి


53. ఆశ్రిత వత్సలనే శరణం అయ్యప్ప


ఆశ్రయించిన వారిని అనుగ్రహించు స్వామి


54. భూతగణాధిపతయే శరణం అయ్యప్ప

భూత , ప్రేత , పిశాచగణాలకు అధిపతియైన స్వామి


55. శక్తిరూపనే శరణం అయ్యప్ప


శక్తిరూపుడైన స్వామి


56. శాంతమూర్తియే శరణం అయ్యప్ప


శాంతమే తన స్వరూపంగా వున్న స్వామి


57. పదునెట్టాంబడికి అధిపతియే శరణం అయ్యప్ప


పరశురామునిచే ప్రతిష్టించబడిన పావన 18 మెట్లకు అధిపతి


58. ఉత్తమపురుషనే శరణం అయ్యప్ప


పురుషోత్తముడు అయిన స్వామి


59. ఋషికుల రక్షకనే శరణం అయ్యప్ప


ఋషులను రక్షించిన స్వామి


60. వేదప్రియనే శరణం అయ్యప్ప


వేదములంటే యిష్టపడే స్వామి


61. ఉత్తర నక్షత్ర జాతకనే శరణం అయ్యప్ప


ఉత్తర నక్షత్రంలో జన్మించినస్వామి ,

(మకర జ్యోతి దర్శనమునకు ముందు ఉత్తర నక్షత్రం వస్తుంది)


62. తపోధననే శరణం అయ్యప్ప


తపస్సుతో మహిమాన్వితుడైన స్వామి


63. ఎంగళ్ కులదైవమే శరణం అయ్యప్ప


నా కులదైవమైన స్వామి


64.  జగన్మోహననే శరణం అయ్యప్ప


జగత్తునంతటిని ఆకర్షించు స్వామి


65. మోహనరూపనే శరణం అయ్యప్ప


అందమైన రూపము కలవాడు


66. మాధవసుతనే శరణం అయ్యప్ప


విష్ణుమూర్తి యొక్క కుమారుడు


67. యదుకుల వీరనే శరణం అయ్యప్ప


యదువంశ సంభూతుడు అయిన స్వామి


68. మామలైవాసనే శరణం అయ్యప్ప


అయిదు కొండలయందు కొలువైన స్వామి -

కరిమల , నీలిమల , శబరిమల , పొన్నాంబల , కాంతిమల


69.  షణ్ముఖసోదరనే శరణం అయ్యప్ప


సుబ్రహ్మణ్యస్వామికి తమ్ముడు


70. శంకరసుతనే శరణం అయ్యప్ప


శివుని యొక్క కుమారుడు


71. వేదాంతరూపనే శరణం అయ్యప్ప


సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపుడయిన స్వామి


72. శత్రు సంహారనే శరణం అయ్యప్ప


మన అంతర్ శత్రువులను సంహరించే స్వామి


73. సద్గుణ మూర్తియే శరణం అయ్యప్ప


సద్గుణరూపుడయిన స్వామి


74. పరాశక్తియే శరణం అయ్యప్ప


ఆదిపరాశక్తి 

స్వరూపుడయిన స్వామి


75. పరాత్పరనే శరణం అయ్యప్ప


పరబ్రహ్మస్వరూపుడయి , నిరాకార రూపుడయిన స్వామి


76. పరంజ్యోతియే శరణం అయ్యప్ప


జ్యోతియై ప్రకాశించు స్వామి


77. హోమ ప్రియనే శరణం అయ్యప్ప


హోమములను ప్రేమతో స్వీకరించు స్వామి


78. గణపతి సోదరనే శరణం అయ్యప్ప


వినాయకుని తమ్ముడు


79. కట్టాళవేషధారియే శరణం అయ్యప్ప


ఆటవిక వేషములో ఉన్నటువంటి స్వామి


80. విష్ణుసుతనే శరణం అయ్యప్ప


విష్ణు మూర్తి యొక్క కుమారుడు


81. సకలకళా వల్లభనే శరణం అయ్యప్ప


సమస్తకళలకు నిలయుడైన స్వామి


82) లోకరక్షకనే శరణం అయ్యప్ప


లోకాలంతటిని రక్షించే స్వామి


83. అమితగుణాకరనే శరణం అయ్యప్ప


లెక్కలేనన్ని సద్గుణాలతో శోభిల్లు స్వామి


84. అలంకార ప్రియనే శరణం అయ్యప్ప


అలంకారమనిన మిక్కిలి ఇష్టపడు స్వామి


85. కన్నిమారైకాప్పవనే శరణం అయ్యప్ప


కన్ని అయప్పలను కాపాడు స్వామి


86.  భువనేశ్వరనే శరణం అయ్యప్ప


చతుర్దశ భువనాలను రక్షించే స్వామి


87. మాతా పితా గురు దైవమే శరణం అయ్యప్ప


తల్లి , తండ్రి , గురువు , దైవమైన స్వామి


88. స్వామియిన్ పుంగావనమే శరణం అయ్యప్ప


అయ్యప్పస్వామి ఎరుమేలినుంచి శబరిమల వరకు నడిచిన ప్రదేశం

(వనయాత్ర చేయు ప్రదేశం)


89. అళుదానదియే శరణం అయ్యప్ప


మహిషి మరణసమయమున పశ్చాతాప కంటినీరు అళుద నది


90. అలుదామేడే శరణం అయ్యప్ప


అళుద నది ప్రక్కన ఉన్న కొండ


91.  కళ్ళాడుంకుండ్రే శరణం అయ్యప్ప


పశ్చాతాపంతో సేద తీరిన మనస్సుతో తిరిగి పాప ప్రవృత్తి

తిరిగి లేవకుండా అళుదా నదిలో నుంచి తీసి ఉంచే

రాళ్ళ ప్రదేశం


92. కరిమలై ఏట్రమే శరణం అయ్యప్ప


కరిమలకొండ ఎక్కడం (ఏనుగులు సంచరించే ప్రదేశం)


93. కరిమలై ఎరక్కమే శరణం అయ్యప్ప


కరిమలకొండ దిగడం


94. పెరియాన వట్టమే శరణం అయ్యప్ప


పెరియాన అను విశాల ప్రదేశం (పెద్ద గుంపులతో ఏనుగులు

ఉండు ప్రదేశం)


95. చెరియాన వట్టమే శరణం అయ్యప్ప


చెరియాన అను చిన్న ప్రదేశం (చిన్నగుంపులుగా ఏనుగులు

ఉండు ప్రదేశం)


96.  పంబానదియే శరణం అయ్యప్ప


పాపముల హరించు పంబా నదియే శరణం


97. పంబయల్ విళక్కెశరణం అయ్యప్ప


పంబనదిలో వెలిగించే దీపం


98.  నీలిమల యేట్రమే శరణం అయ్యప్ప


నీలిమలకొండ ఎక్కడం


99. అప్పాచిమేడే శరణం అయ్యప్ప


అప్పాచికొండ


100. శబరిపీఠమే శరణం అయ్యప్ప


శబరి పీఠమ్ వద్ద జ్యోతి దర్శనం తర్వాత ,

మహిషి కన్నెస్వాములు వచ్చినారా అని చూసే స్థలము


101.  శరంగుత్తిఆలే శరణం అయ్యప్ప


స్వామివారు , పరివారములు ఆయుధములు ఉంచిన

గుచ్చే ప్రదేశం


102.  భస్మకుళమే శరణం అయ్యప్ప


వృక్షము అదియే నేటి శరంగుత్తి (కన్నెస్వాములు శరములను

స్వామివారి భస్మకుళము ఇది మాలికాపురత్తమ్మ గుడికి ఉత్తరమున కలదు.

అశ్వద్ధ)

(పూర్వము అభిషేక

జలం ఇచ్చటనే కొలనుగా వుండేది)


103.  పదునెట్టాంబడియే శరణం అయ్యప్ప


శబరిమల సన్నిధానం ముందు వుండే పద్దెనిమిది మెట్లు.


104. నెయ్యాభిషేక ప్రియనే శరణం అయ్యప్ప


నెయ్యితో అభిషేకం స్వామికి ఇష్టం


105. కర్పూరజ్యోతి స్వరూపనే శరణం అయ్యప్ప


కర్పూరజ్యోతి స్వరూపునిగా వెలుగొందు స్వామి


106.  జ్యోతి స్వరూపనే శరణం అయ్యప్ప


జ్యోతి రూపంలో దర్శనం యిచ్చే స్వామి


107. మకరజ్యోతియే శరణం అయ్యప్ప


మకర సంక్రాంతినాడు దర్శనం యిచ్చే స్వామి


108. ఓం శ్రీహరిహర సుతన్ అనందచిత్తన్ అయ్యన్ అయ్యప్ప

స్వామియే శరణం అయ్యప్ప


శివకేశవుల సంతానమైన ఆనంద రూపుడైన అయ్య

అయ్యప్పస్వామి🙏


కలియుగవరదన్ అయ్యప్ప | Telegram


https://t.me/kaliyugavaradhan_ayyappa_18


హరిహర


శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ


ఓం ️శ్రీ స్వామియే శరణం అయ్యప్ప


శ్రీ ధర్మశాస్తవే శరణం అయ్యప్ప


అఖిలాండ కోటి బ్రహామ్మండ నాయకనే శరణం అయ్యప్ప


హర హర మహాదేవ్., జై శ్రీ రామ్ 


లోకాః సమస్తా సుఖినోభవంతు

Tuesday, April 6, 2021

యంత్రం


ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్న పరాశక్తిని కూడా దర్శించగలిగారు మన మహర్షులు. వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి. అయినా వేటికి అవి ప్రత్యేక పని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులన్నమాట. మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము, పని ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశించి ఉన్నాయి.

ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే అట్టి దేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు. వేదమునకు మూలము నాదము. దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి, మంత్రములుగా శక్తిని సంతరించుకున్నాయి.

యంత్రమంటే ఏమిటి...

యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క (శక్తి) స్వరూపమే. ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి మూడు రకాలుగా భావించారు.. అవి..

1) ఇచ్ఛాశక్తి,

2) జ్ఞానశక్తి

3) క్రియాశక్తి.

ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే 'ఇచ్ఛ' (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే.

ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే.

నేటి శాస్త్రజ్ఞులు కూడా, ఏ పదార్థమైనా శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు. నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తుజాలమంతా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరమే.

విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే 'ప్రకృతి' అని, 'పరాశక్తి' అని, 'అవ్యక్తం', 'శుద్ధమాయ' అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి వారికి అందిస్తోంది.

శ్రీ చక్ర ఆవిర్భావం...

ఉండేది బ్రహ్మమొక్కటే. ఈ బ్రహ్మం సత్‌, చిత్‌, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది, నిశ్చలమైనదైనప్పటికి, చేతనం అనే బీజం కలిగి ఉండుటం దానిలోని విశేషం. కేవలం కాంతి (ప్రకాశ) రూపముగానున్న బ్రహ్మము నందు ఏర్పడిన మొదటి కదలికను 'విమర్శ' (ఆలోచన) అన్నారు. తాంత్రికులు కాంతిని పరమ శివుడు గాను, విమర్శను పరాశక్తి గాను భావించారు. కాంతి (ప్రకాశ) స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలిక వల్ల నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది. ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు.

దీనినే "పరాబిందువు" అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి. దీనికే సర్వానందమయ చక్రమని పేరు. ఈ బిందువే శ్రీ చక్రమునకు ఆధారము. ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది. సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము (గింజ) లో రెండు పప్పులు (బద్దలు) ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈ పరాబిందువు నందు శివశక్తులొకటిగా ఉంటాయి.

శ్రీ చక్రం - పరాశక్తి వేర్వేరు కాదు. అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి..

1) శివశక్తులొకటిగా నున్న 'బిందువు',

2) అచేతనంగా ఉన్న 'శివుడు',

3) 'చేతనా స్వరూపమైన శక్తి'.

..ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వరతత్వాన్ని సూచిస్తోంది.

మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేం, కనీసం ఊహించలేం. కనుక శక్తి మాత తన మొదటి రూపంగా శ్రీ చక్రాన్ని నిర్మించింది. తదుపరి అనేక దేవీ రూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీ చక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థము లకు సమన్వయం కలుగుచున్నది.

పరాశక్తికి శ్రీ చక్రానికి ఏ మాత్రం భేదం లేదు. శ్రీ దేవియే శ్రీచక్రము. శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.

శ్రీ చక్రం నందు లలితా దేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది. ఇటువంటి శ్రీవిద్యను, శ్రీచక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుమంది, పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవ తంత్రము తెలుపుచున్నది.

|| ఓం నమః శివాయ ||

హిందూ సనాతన ధర్మమునకు సంభదిత విషయములు తెలుసుకొనుటకు కొరకు టెలిగ్రామ్ యాప్ వాడే వారు ఈ క్రింది లింక్ ద్వారా మన సమూహం నందు జాయిన్ అవచ్చును.....

Monday, April 5, 2021

ముక్తినిచ్చే ఏడు ముఖ్య స్థలాలు

 'అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికాపురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః’- ఈ శ్లోకం జగత్‌ ప్రసిద్ధం.... 

దీని అర్థం: అయోధ్యా , మధుర , మాయ ( హరిద్వార్) , కాశీ , కాంచీపురం, అవంతిక (ఉజ్జయిని), ద్వారక ... ఈ ఏడు ముక్తినిచ్చే స్థలాలు ( నగరాలు). ఈ ఏడు ముక్తి క్షేత్రాల గురించి క్లుప్తంగా తెలిసికుందాం.

1) అయోధ్య:-

అయోధ్య అంటే శత్రువులు చొరబడటానికి వీలులేని సురక్షిత స్థానం అని అర్థం. ఇది మానవోత్తముడు, మర్యాదాపురుషోత్తముడూ అయిన శ్రీరాముడి జన్మభూమి. సరయూ నదీతీరంలో వెలసిన ఈ మోక్షధామం దర్శనమాత్రంగా జన్మను చరితార్థం చేస్తుందంటారు.

2) మధుర:-

మాధుర అంటే తీయనైన అని అర్థం. పూర్ణావతార పురుషుడైన శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్రస్థానం.

3)మాయ:-

దీనినే హరిద్వార్‌ అని పిలుస్తారు. విష్ణువు సన్నిధికి చేర్చే ముఖద్వారం ఈ పుణ్యస్థలం. హిమవత్పర్వతాల నుంచి ప్రవహించే గంగానది మొట్టమొదట నేలపై అడుగు మోపే విశిష్ట పుణ్యక్షేత్రం ఈ మాయానగరం.

4)కాశీ:-

భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం పవిత్ర గంగానదీ తీరంలో వెలసిన పరమ శివసన్నిధానం. వరుణ, అసి అనే రెండు నదులు ఇక్కడే గంగా నదిలో సంగమించడం వల్ల ఈ పట్టణానికి వారణాసి అని కూడా పేరు.

5) కాంచీపురం:-

దక్షిణ భారతంలోని పవిత్ర నగరం ఇది. కంచి, కాంచీపురం, కాంజీపురం అనే పేర్లతో అలరారే ఈ పుణ్యధామం శివుడికి, విష్ణువుకు, శక్తికి నెలవు. అద్వైత తత్త్వాన్ని ప్రవచించిన ఆదిశంకరులు స్థాపించిన కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మోక్షం సంప్రాప్తి స్తుందని ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్న విశ్వాసం.

6)అవంతిక:-

భారత భూమిలోని మధ్యప్రదేశంలో విరాజిల్లే ఉజ్జయినీ నగరానికే అవంతిక అనిప్రాచీననామం. శిప్రా నదీతీరంలో వెలుగొందే ఈ పట్టణం మహాకాళనాథు డైన శివుడికి నిలయం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఈ నగరాన్ని గురించి మహాకవి కాళిదాసు ఎంతో అద్భుతంగా వర్ణించాడు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి.

7) ద్వారవతి:-

అంటే ద్వారకానగరం. శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన దివ్యధామం ఇది. కృష్ణుడు నివసించిన ద్వారకానగరం సముద్రంలో కలిసిపోయింది. తీరంలో నూతనంగా నిర్మించిన ఆధునిక ద్వారకానగరం ద్వారకానాథ్‌గా ప్రసిద్ధం. ఇక్కడ ద్వారకాధీశుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి స్వర్గద్వారం ద్వారా ప్రవేశించిన భక్తులు మోక్షద్వారం ద్వారా వెలుపలికి వస్తారు. ఈ కారణంగా ఇది ముక్తిదాయక నగరంగా ప్రసిద్ధి చెందింది.

Saturday, April 3, 2021

రాహు దోషం

జాతక రీత్యా  రాహుదోషం గోచారరిత్యా రాహచెడుప్రభావం అధికమైయిబ్బందులుకల్గుచున్నప్పుడుమానసికరోగాలు,మెదడు,నరాలుకు సంభదించిఅనారోగ్యబాధలు,మానసికరోగాలుతో ఉన్మాదం కల్గినప్పుడూ రాహుకాలంలో దుర్గా దేవి ని తలచుకొని పూజ చేస్తే  తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. ప్రతీరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది. రోజు చేయడం కుదరనివారు, మంగళ / శుక్రవారలలో రాహుకాల సమయంలో పూజ చేయాలి. ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం చాల మంచిది. అలా వీలు కానివారు ఇంట్లోనే శుచిగా  దీపారాధన చేసి, శ్రీ దుర్గా స్తోత్రం చదివి మినపగారెలునైవేద్యం పెట్టాలి. రాహుకాల సమయంలో పసుపు రంగులో నైవేద్యం అంటే, ఓ రోజు నిమ్మకాయ పులిహొర మరొక రోజు అటుకుల పులిహొర నైవేద్యం పెట్టి ఎదైన పని మనసులో అనుకొని రాహుకాలపూజ మొదలుపెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ కార్యక్రమం జరుగుతుంది. కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు కూడా వెలిగిస్తారు. ఇది కూడా చాలా మంచిది. 

రాహుకాల సమయం :

సోమవారం - ఉ 7:30 -9:00

మంగళవారం - మ 3:00 -4:30

బుధవారం - మ 12.00 - 1:30

గురువారం - మ 1:30 - 3:00

శుక్రవారం - ఉ 10:30 - 12:00

శనివారం - ఉ 9:00 - 10:30

ఆదివారం - సా 4:30 - 6:00

Thursday, April 1, 2021

జ‌ప‌మాల ప్రాముఖ్య‌త

జ‌ప‌మాల ప్రాముఖ్య‌త అంద‌రికీ తెలిసిందే. హిందూ ధ‌ర్మంలో పూజ‌ల స‌మ‌యంలో... శ్లోకాలు, మంత్రాలు చ‌దివేట‌ప్పుడు జ‌ప‌మాల‌ను ఉప‌యోగిస్తుంటారు. ఇందులో 108 పూస‌లుంటాయి.

 జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయి ? 

ఇంత‌కూ జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా.. దాని వెన‌క కొన్ని ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. ఒక‌వ్య‌క్తి ఒక‌రోజులో అంటే 24 గంట‌ల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటాడ‌ట‌.

అంటే 12 గంట‌ల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే ఒక మ‌నిషి దేవుడి స్మ‌ర‌ణ‌లో జ‌ప‌మాల చేసేట‌ప్పుడు 10800 సార్లు చేయ‌డం క‌ష్టం కాబ‌ట్టి... చివ‌రి రెండు సున్నాల‌ను తీసేసి 108 ను నిర్ధారించార‌ని చెబుతారు.

108 వెన‌క మ‌రో క‌థ ప్ర‌చారంలో ఉంది. మొత్తం 12 రాశులున్నాయి. ఈరాశుల‌తో తొమ్మిది గ్ర‌హాలున్నాయి. రాశుల సంఖ్య‌ను గ్ర‌హాల‌తో గుణిస్తే వ‌చ్చేది 108. అందుకే జ‌ప‌మాల‌లో 108 పూస‌ల‌ను నిర్థారించార‌ట‌.

ఈ 108 పూస‌లు మొత్తం విశ్వానికి ప్రాతినిధ్యం వ‌హిస్తాయ‌ట‌. జ్యోతిష్య శాస్త్రంలో 27 న‌క్ష‌త్రాలుంటాయ‌ని భావిస్తారు. ఒక్కో న‌క్ష‌త్రానికి 4 పాదాలుంటాయి. అంటే 27 న‌క్ష‌త్రాల‌కు క‌లిపి మొత్తం 108 పాదాల‌వుతాయి.

జ‌ప‌మాల‌లోని ఒక్కో పూస ఒక్కో పాదానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ట‌. అన్నింటికి మించి 108ని అదృష్ట సంఖ్య‌గా భావిస్తారు. హిందూ ధ‌ర్మ శాస్త్ర ప్రకారం 108 సార్లు ఏదైనా స్తోత్రాన్ని చ‌దవాల‌ని చెబుతారు. \

108 సార్లు కొలిస్తే దేవుడి క‌రుణ ఉంటుంద‌ని అంటారు. దానికి అనుగుణంగా 108 పూస‌ల‌ను నిర్ధారించార‌ని ప్ర‌చారంలో ఉంది.

From నారాయణం వెంకటరెడ్డి

జగన్నాథ - రథయాత్ర సంపూర్ణ వివరాలు

 1) పూరి మందిరం పేరు ఏమిటి?( శ్రీ మందిరం ) 2) రథయాత్ర  ప్రారంభమయ్యే తొలితిధి ఏది?( ఆషాడ శుద్ధ విదియ ) 3) పూరీ మందిరాన్ని వదిలి ఈ తొమ్మిది రో...