Thursday, February 18, 2021

ఆదిత్యుని అనుగ్రహం

 ప్ర: ఆదిత్యుని అనుగ్రహం పొందడానికి తేలికైన మార్గాలు తెలియజేయగలరు.

జ: ఆదిత్యుని అనుగ్రహం పొందడానికి శాస్త్రాలు చాలా మార్గాలు చెప్పాయి. తేలికైన మార్గాలతోనే సూర్యానుగ్రహం పొందవచ్చు. 

ప్రతీరోజు సూర్యోదయాత్ పూర్వమే స్నానాదులు పూర్తిచేసుకుని సూర్యునికి నమస్కారం చేసుకోవడం ప్రతీవారి విధి. సూర్యానుగ్రహం పొందాలనుకునే వారు ముఖ్యంగా ఈ విధిని ఆచరించాలి. సూర్యానుగ్రహం పొందడానికి శాస్త్రాలు చాలా మార్గాలు చెప్పాయి. బ్రహ్మ పురాణంలో చెప్పిన కొన్ని మార్గాలు -

● మాఘశుద్ధ షష్టి లేదా సప్తమి నాడైనా ఏక భుక్తంతో వ్రతనియమాలను పాటిస్తూ సూర్యుని పూజించినవారు అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందుతారు.

● సప్తమినాడు ఉపవాస నియమంతో భాస్కరుని పూజించినవారు పరమోత్కృష్ట గతులను పొందుతారు.

● శుక్లసప్తమినాడు ఉపవాసం చేసి తెల్లని రంగు ద్రవ్యాలతో సూర్యుని పూజించినవారు సకలపాపములనుండి విడివడినవారై సూర్యలోకాన్ని చేరుకుంటారు. 

● శుక్లసప్తమి ఆదివారం కలిసివస్తే దానికి విజయాసప్తమి అని పేరు. ఆ రోజు చేసిన స్నాన, దాన, తప, హోమ, ఉపవాసాదులు మహాపాతకాలను సైతం నశింపజేస్తాయి. 

● చిత్రభానుని అనేకరంగుల సువాసన కలిగిన పువ్వులతో ఉపవాసము చేస్తూ పూజించినవారు అభీష్టసిద్ధులు నెరవేర్చుకోగలరు. 

● ఒక నియమంగా నేతితో లేదా నువ్వులనూనెతో దీపాన్ని వెలిగించి ఆదిత్యుని పూజించినవారికి కంటికి సంబంధించిన అనారోగ్యం కలగదు. 

● ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్యునికి దీపాన్ని సమర్పించినవారు జ్ఞానదీపంతో ప్రకాశిస్తారు.

● ఎర్రచందనంతో కలిపిన ఎర్రటి పుష్పాలతో సూర్యోదయ సమయంలో అర్ఘ్యాన్ని సమర్పించేవారు ఏడాదిలోగా సూర్యానుగ్రహ సిద్ధిని పొందగలరు. 

●పాయసములు, అప్పములు, పండ్లు, కందమూలములు, నేతితో చేసిన వంటకాలు సూర్యునికి అర్పించినవారు అన్ని కోరికలను సాఫల్యం చేసుకోగలరు. 

● సూర్యునికై ధ్వజం, ఛత్రం, చామరాలు, జెండాలు శ్రద్ధగా సమర్పించేవారు ఉత్తమగతులను పొందగలరు.

● సూర్యునికై నేతితో తర్పణాలు ఇస్తే సర్వసిద్ధులు కలుగుతాయి. పాలతో తర్పణాలు చేస్తే మానసికతాపములనుండి విముక్తులవుతారు. పెరుగుతో తర్పణాలు ఆచరిస్తే తలచిన పనులు నెరవేరుతాయి.

● ఆదిత్యునికై భక్తిగా ఏ ఏ ద్రవ్యాలను సమర్పిస్తారో అవన్నీ అసంఖ్యాక పదార్థాలుగా తిరిగి వారికి లభిస్తాయి.

● నియమాచారాలకు భావశుద్ధి కూడా చాలా ప్రధానం. భావశుద్ధితో చేసిన అర్చనాదులకు సరైన ఫలం లభిస్తుంది. 

● తల భూమిని తాకే విధంగా సూర్యునికై నమస్కారం చేసేవారి సకలపాపాలు ఆ క్షణంలోనే నశిస్తాయనడంలో సందేహం లేదు.

● భక్తిప్రపత్తులతో సూర్యునికి (ఆత్మ)ప్రదక్షిణ చేసేవారు సప్తద్వీపములతో కూడిన భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలాన్ని పొందుతారు.

7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన "గురువు."



1వ ప్రశ్న: ప్రపంచంలో ఏది పదునైనది?

జ: చాలా మంది కత్తి అని చెప్పారు. 

గురువు: కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.


2వ ప్రశ్న: మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ?

జ: చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ

గురువు: మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం.

ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము,

ఆ కాలంలోకి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము.


3వ ప్రశ్న: ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది?

జ: చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి ఇలా ఎన్నో అంటారు.

గురువు: ప్రపంచంలో పెద్దది మన పాపమే.


4వ ప్రశ్న: ప్రపంచంలో కఠినంగా,బరువుగా ఉండేది ఏది ?

జ: చాలామంది,వజ్రము ఇనుము,ఏనుగు అని చెప్పారు.

గురువు: కఠినమైనది అనేది "మాట ఇవ్వడం"

మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం.


5వ ప్రశ్న: ప్రపంచంలో తేలికైనది ఏది?

జ: దూది,గాలి,ఆకులు అని చెప్పారు 

గురువు: ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం.


6వ ప్రశ్న: మనకు దగ్గరగా వున్నది ఏది?

జ: తల్లి తండ్రులు, స్నేహితులు,బంధువులు అని చెప్పారు. 

గురువు: మనకు దగ్గరగా ఉండేది మన చావు.

అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం.

అది పుట్టుకతోనే మనవెంట వచ్చింది.


7వ ప్రశ్న: ప్రపంచంలో సులువైనది ఏది ?

జ:తినడం ,పడుకోవడం, తాగడం,తిరగడం 

గురువు: ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం, ఇంతకంటే సులువు ఏదీ లేదు.

Wednesday, February 17, 2021

ద్వైతం - అద్వైతం - విశిష్టాద్వైతం

 1  ద్వైతం అంటే ఏమిటి ?

2. అద్వైతం అంటే ఏమిటి ?

3  విశిష్టాద్వైతం అంటే ఏమిటి ?

.

1. (..ద్వైతం  )


నీవు దైవం ; నేను జీవున్ని ..... నీవు గురువు , నేను శిష్యుణ్ణీ అన్నది ద్వైతం .

మధ్వాచార్యులు ప్రవచించిన మతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది.


సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ.... కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.

.

2    (  అద్వైతం  )

.

నీవు -నేను ఒక్కటే అన్నది అద్వైతం .

.

అద్వైతం అనగా భాషాపరంగా అర్థం "ద్వైతం"కానిది, జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక. ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. శంకరుడు బోధించిన తత్వం "అద్వైతం" - అనగా రెండు కానిది. ఆత్మ, బ్రహ్మము (పరమాత్మ) ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం.

.

3   (  విశిష్టాద్వైతం )

.

నీవు  దేవుడు

నేను  జీవి

ప్రకృతి

పంచభూతాలు 

అన్నవి వేర్వేరు అయినా ఒకదానిలో ఒకటి మిలితమై అంతటా వ్యాపించి ఉంటాయి .

విశిష్టాద్వైతం అనేది 11వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించిన

వేదాంత దర్శనము.


జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు - మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది. 'చిత్' అనబడే జీవునితోను, 'అచిత్' అనబడే ప్రకృతితోను కూడియే ఈశ్వరుడుండును. శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉండును. ఆజ్ఞానవశమున జీవుల సంసారబంధమున చిక్కుకొందురు. భగవదనుగ్రహమువలన, సద్గురుకృప వలన, భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము మోక్షము పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.

శాంతి మంత్రాలు

 శాంతి మంత్రాలన్నీ కూడా చివర్లో ఓం శాంతి ... శాంతి ... శాంతిః అని ముగుస్తాయి . 

ఏదో ఒక సందర్భంలో వేద పండితులు ఈ శాంతి మంత్రాల్ని పఠించడం మనందరం వినే ఉంటాం. మనుషులకు మూడు రకాల ఉపద్రవాలనుండీ ప్రమాదం ముంచుకొస్తుంది

మొదటి "శాంతి" పదం శారీరిక , మానసికపరంగా సంభవించే ఉపద్రవం ( అనారోగ్యం ) నుంచీ ఉపశమనం పొందడానికి . దీన్ని  "ఆధ్యాత్మికం" అంటారు .

రెండవ "శాంతి" పదం ఇతర జీవరాశులనుండీ , మనుష్యులు నుండీ ఏవిధమైన ఆపదలు / ముప్పు సంభవించకుండా సురక్షితంగా ఉండటానికి . దీన్ని  " ఆధిభౌతికము " అంటారు .

మూడవ " శాంతి " పదం ప్రకృతి పరంగా సంభవించే ( భూకంపాలు / అగ్నిప్రమాదాలు / వరదలు / తుఫాన్లు మొదలగునవి ) ఉపద్రవాలు వలన ఏవిధమైన ఆపదలు / ముప్పు కలగకుండా ఉండటానికి . దీన్ని " ఆధిదైవికము " అంటారు.

ఈ మూడు ఉపద్రవాలనుండీ రక్షించమని వేడుకుంటూ  

" శాంతి " మంత్రం చివర్లో " శాంతి " పదాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తారు

Tuesday, February 16, 2021

షోడశ సంస్కారాలు

సంస్కారములు హిందూ సాంప్రదాయములో ఆగమ సంబంధమయిన క్రియలు. ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుపబడతాయి. స్త్రీ, పురుష సమాగమము మొదలుకొని, జననము, మరణము, తదనంతరము ఆత్మ పరలోక శాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును.






సంస్కారములు మొత్తము పదహారు. వీటినే షోడశ సంస్కారములు అని కూడా వ్యవహరించెదరు. ఈ పదహారు సంస్కారములను తిరిగి రెండు విభాగములగా క్రింద విభజించారు. అవి...

1) జనన పూర్వ సంస్కారములు (పుట్టుకకు ముందు)

2) జననానంతర సంస్కారములు (పుట్టిన తరువాత).

మొదటి మూడు సంస్కారములు జనన పూర్వ సంస్కారములు, ఆపై పదమూడు సంస్కారములు జననానంతర సంస్కారములు.











వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో జరిపే సంస్కారాలు...

1) గర్భాదానం

2) పుంసవనం

3) సీమంతం

4) జాతకర్మ

5) నామకరణం

6) నిష్క్రమణ

7) అన్నప్రాశన

8) చూడాకరణ

9) కర్ణవేధ

10) అక్షరాభ్యాసం

11) ఉపనయనం

12) వేదారంభం

13) కేశాంత

14) సమావర్తన

15) వివాహం

16) అంత్యేష్టి...

Thursday, February 11, 2021

రాశికొక జ్యోతిర్లింగం

మేషరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం రామేశ్వరం. మేషరాశి కుజునికి స్వగృహం. చరరాశి వారికి పదకొండవ రాశ్యాధిపతి శని బాధకుడు. గ్రహపీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర, సుత్రామ పర్ణీ జరరాషి యోగే, నిబధ్య సెతుం విశిఖైర సంఖ్యె శ్రీరామ చంద్రేన సమర్పితం త, రామేశ్వరాఖ్యం నియతం నమామి అనె శ్లోకం రోజూ చదువుకొవాలి. శ్రీరామచంద్రుడు శని బాధానివారణార్థం రామేశ్వర లింగాన్ని స్థాపించాడని ప్రతీతి.

వృషభరాశి వారి పూజాలింగం సోమనాథ జ్యోతిర్లింగం. ఈ రాశి శుక్రునికి స్వగృహం, చంద్రునికి ఉచ్ఛ రాశి. సోమనాథ జ్యోతిర్లింగం శ్రీకృష్ణుడు స్థాపించిన మహాలింగం. ఈ రాశివారు శనిదోష శాంతికి సోమనాథ దేవాలయ దర్శనం, సౌరాష్ట్ర దేశే విదేశేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం, భక్తి ప్రాదానాయ క్రుపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకధ్యానం చేయడం శుభప్రదం. ఈ రాశివారు జన్మ నక్షత్రంలో సోమనాథంలో రుద్రాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు పొందగలరు.

మిధునరాశి వారి జ్యోతిర్లింగం నాగేశ్వర లింగం. ఈ రాశి బుధునికి స్వగృహం. గ్రహదోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, రోజూ యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భోగై, సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పఠించడం, ఈ రాశిలో శని సంచారకాలంలో కైలాసయంత్రప్రస్తార మహాలింగార్చన జరిపిస్తే విశేష ఫలితాలు ఉంటాయి.

కర్కాటకరాశి వారికి ఓంకారేశ్వరలింగం పూజనీయ జ్యోతిర్లింగం. ఈ రాశి చంద్రునికి స్వగృహం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, రోజూ కావేరికా నర్మదాయో పవిత్రే, సమాగమే సజ్జన తారణాయ, సడైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే అనే శ్లోకం పఠించడం, జన్మనక్షత్రం ఉన్న రోజు ఓంకార బీజాక్షరం జపించడం శుభకరం.

సింహరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘృష్ణేశ్వర  జ్యోతిర్లిగం దర్శనం, ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతం చ జగద్వ రేణ్యం, వందే మహాదారాతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని నిత్యం పఠించడం ద్వారా సర్వదోషాల నుండి విముక్తులు కావచ్చు.

కన్యారాశి వారికి శ్రీశైల జ్యోతిర్లింగం పూజాలింగం. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరు అన్నిరకాల బాధల నుండి ఉపశమనం పొందడానికి శ్రీశైల మల్లికార్జున దర్శనం, భ్రమరాంబకు కుంకుమ జన్మనక్షత్రం రోజున చండీ హోమం చేసుకోవాలి. శ్రీశైల శృంగే విభుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం, తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.

తులారాశి వారికి పూజాలింగం మహాకాళేశ్వర లింగం. ఈ రాశికి శుక్రుడు అధిపతి. మహాకాళేశ్వర దర్శనం, శుక్రవారపు సూర్యోదయ సమయంలో ఆవన్తికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం, అకాల మ్రుత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని గ్రహదోషాల నుండి, బాధల నుండి విముక్తి పొందవచ్చు.

వృశ్చికరాశి వారికి వైద్యనాథేశ్వర లింగం పూజాలింగం. ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్రచికిత్సలకి కారణభూతమైన రాశి. వైద్యనాథేశ్వరుని దర్శించడం, పూజించడం, మంగళవారం పూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే, సాదావసంతం గిరిజాసమేతం, నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాదం తమహం నమామి అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.

విశ్వేశ్వరలింగం ధనూరాశివారి పూజాలింగం. ఈ రాశి వారికి గురుడు అధిపతి, సానందవనే వసంతం. ఆనందకందం హతపాపబృందం వారణాసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, కాశీ క్షేత్ర దర్శనం, గురువారం రోజున, శనగల దానం ద్వారా శని, గురూ గ్రహదోషాల నుండి విముక్తి పొందవచ్చు.

భీమశంకర లింగం మకరం వారి పూజాలింగం. ఈ రాశి అధిపతి శని. ఇది గురునికి నీచ, కుజునికి ఉచ్ఛ, తెలిసో, తెలియకో చేసిన దోషాల నుంచి విముక్తికిగాను భీమశంకర దర్శనం, యం ఢాకినీ శాకినికాసమాజైః నిషేమ్యమాణం పిశితశనైశ్చ, సదైవ భీమాదిపద ప్రసిద్ధం, తం శంకరం భూతహితం నమామి అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, శనివారం నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం ఈవాడం, అవిటివారికి ముసలివారికి వస్త్ర దానం చేయడం మంచిది.

కుంభరాశి వారికి కేదారేశ్వర లింగం శేయోలింగం. ఈ రాశికి శని అధిపతి. గ్రహపీడలు, శత్రుబాధలు, ఇతర దోషాల విముక్తికిగాను ఈ రాశివారు కేదారేశ్వర దర్శనం. నిత్యం మహాద్రి పార్శ్వేచ మునీంద్రైః సురాసురై ర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేక మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయాలి.శనివారం రుద్రాభిషేకం చేస్తే మంచిది.

త్ర్యంబకేశ్వర లింగం మీనరాశి వారి జ్యోతిర్లింగం. ఈ రాశి అధిపతి గురుడు. త్ర్యంబకేశరుడు ఎప్పుడూ నీటి మద్యలో ఉంటాడు. త్ర్యంబకేశ్వర దర్శనం, స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచుకోవడం, నిత్యం సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే, యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తం త్ర్యంబక మీశ మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయటం సకల శుభాలను కలిగిస్తుంది.

సేకరణ

Wednesday, February 10, 2021

విష్ణు సహస్రనామం ఎవరూ రాసుకోలేదు .. మనకెలా అందింది ?

 భీష్మపితామహ విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు, ధర్మరాజుతో సహా. కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?

అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తినీ అక్కడున్న వారినందిరినీ వుద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది" అని అడిగారు. 

ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?"

ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"  

స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"

మళ్ళీ నిశబ్దం.

స్వామివారు చెప్పడం మొదలుపెట్ట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, అందరూ కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని యుదిష్టురుడిగాడు. 

"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.  

శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.  

"అదేలా" అని అందరూ అడిగారు. 

శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. 

శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస మహర్షి వ్రాసిపెట్టాడు. 

ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.

జయ జయ శంకర !  హర హర శంకర !! గురుభ్యో నమ:

ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి

 ఇప్పుడు ఎవరు వైదికులు ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి ఈనాడు ఆనాటి వైదీకులు అనేవాళ్ళు ఉన్నారా ఈనాడు అం...