Wednesday, December 28, 2016

హైందవ సంస్కృతి లో 8,18 అంకెలకు గల ప్రాధాన్యత

🕉🕉🕉🕉🕉 🕉🕉 🕉 🕉

అష్ట లక్ష్మి: ఆది లక్ష్మి, ధాన్యలక్ష్మి , ధైర్యలక్ష్మి , గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి
💜💜💜💜 💜💜 💜💜 💜

అష్టాదశ పీఠాలు:

1. శ్రీ శాంకరీదేవి ( ఎకోమలి , శ్రీలంక )
2. శ్రీ కామాక్షీదేవి (కంచి, తమిళనాడు)
3. శ్రీ శృంఖలాదేవి ( ప్రదుమ్నం, గుజరాత్)
4. శ్రీ చాముండేశ్వరీదేవి ( మైసూరు,కర్నాటక)
5. శ్రీ జోగులాంబాదేవి (అల్లంపురం, ఆంధ్రప్రదేశ్)
6. శ్రీ భ్రమరాంబాదేవి ( శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్)
7. శ్రీమహాలక్ష్మి దేవి ( కొల్హాపూర్, మహారాష్ట్ర)
8. శ్రీ ఏకవీరాదేవి ( నాందేడ్ , మహారాష్ట్ర )
9. శ్రీమహాకాళీదేవి ( ఉజ్జయినీ, మధ్యప్రదేశ్ )
10. శ్రీ పురుహూతికాదేవి (పీఠాపురం, ఆంధ్రప్రదేశ్ )
11. శ్రీ గిరిజాదేవి ( కటక్, ఒరిస్సా)
12. శ్రీ మానిక్యాంబాదేవి ( ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్)
13. శ్రీ కామరూపిణీదేవి (గౌహతి, అస్సాం)
14. శ్రీ మాధవేశ్వరి దేవి ( ప్రయాగ, ఉత్తరప్రదేశ్)
15. శ్రీ వైష్ణవీదేవి ( జ్వాలాకేతం, హిమాచలప్రదేశ్)
16. శ్రీ మాంగల్య గౌరీదేవి ( గయా, బీహార్)
17. శ్రీ విశాలాక్షీదేవి ( వారణాశి, ఉత్తరప్రదేశ్)
18. శ్రీ సరస్వతీదేవి ( జమ్మూ కాశ్మీర్)
💙💙💙💙 💙💙 💙💙 💙

అష్టా దశ పురాణాలు:

1. బ్రహ్మపురాణం
2. పద్మపురాణం
3. నారద పురాణం
4. మార్కండేయపురాణం
5. విష్ణుపురాణం
6. శివపురాణం
7. భాగవతపురాణం
8. అగ్నిపురాణం
9. భవిష్యపురాణం
10. బ్రహ్మవైవర్త పురాణం
11. లింగపురాణం
12. వరాహపురాణం
13. స్కందపురాణం
14. వామనపురాణం
15. కుర్మపురాణం
16. మత్స్యపురాణం
17. గరుడపురాణం
18. బ్రహ్మాండపురాణం
❤❤❤❤❤ ❤❤ ❤ ❤

అయ్యప్ప స్వామి గుడి మెట్లు:18

1. పొన్నంబలమేడు
2. గౌదేంమల
3. నాగమల
4. సుందరమల
5. చిత్తంబలమల
6. ఖల్గిమల
7. మాతంగమల
8. మైలదుమల
9. శ్రీపదమల
10. దేవరమల
11. నిలక్కలమల
12. తలప్పరమల
13. నీలిమల
14. కరిమల
15. పుతుసేరిమల
16. కలకేట్టిమల
17. ఇంచిప్పరమల
18. శబరిమల
💚💚💚💚💚 💚💚 💚 💚

అష్టదిక్పాలకులు:

1. తూర్పు (ఇంద్రుడు)
2. ఆగ్నేయం (అగ్ని)
3. దక్షిణం (యముడు)
4. నైరుతి (నిరుతి)
5. పశ్చిమం (వరుణుడు)
6. వాయువ్యం (వాయువు)
7. ఉత్తరం (కుబేరుడు)
8. ఈశాన్యం (ఈశానుడు)
💜💜💜💜 💜💜 💜💜 💜

అష్టమూర్తులు:

1. భూమి
2. ఆకాశం
3. వాయువు
4. జలము
5. అగ్ని
6. సూర్యుడు
7. చంద్రుడు
8. యజ్గ్యము చేసిన పురుషుడు.
💙💙💙 💙💙 💙💙 💙💙

అష్టఐశ్వర్యాలు:

1. ధనము
2. ధాన్యము
3. వాహనాలు
4. బంధువులు
5. మిత్రులు
6. బృత్యులు
7. పుత్రసంతానం
8. దాసిజనపరివారము
💛💛💛 💛💛 💛💛 💛💛

అష్టకష్టాలు:

1. అప్పు
2. యాచన
3. ముసలితనం
4. వ్యభిచారం
5. చోరత్వం
6. దారిద్యం
7. రోగం
8. ఎంగిలి భోజనం
❤❤❤ ❤❤ ❤❤ ❤❤

అష్టఆవరణాలు:

1. విభూది
2. రుద్రాక్ష
3. మంత్రము
4. గురువు
5. లింగము
6. జంగమ మాహేశ్వరుడు
7. తీర్థము
8. ప్రసాదము
💜💜💜 💜💜 💜💜 💜💜

అష్టవిధ వివాహములు:

1. బ్రాహ్మం
2. దైవం
3. ఆర్షం
4. ప్రాజాపత్యం
5. ఆసురం
6. గాంధర్వం
7. రాక్షసం
8. ఫైశాచం
💚💚💚💚💚 💚💚 💚 💚

అష్టభోగాలు:

1. గంధం
2. తాంబూలం
3. పుష్పం
4. భోజనం
5. వస్త్రం
6. సతి
7. స్నానం
8. సంయోగం
💙💙💙💙 💙💙 💙💙 💙

అష్టాంగ యోగములు:

1. యమము
2. నియమము
3. ఆసనము
4. ప్రాణాయామము
5. ప్రత్యాహారము
6. ధారణ
7. ద్యానము
8. సమాధి
☸☸☸ ☸☸ ☸☸ ☸☸
జయతు     హిందూ     సంస్కృతి
జయతు     భారతీయ  సంస్కృతి
🕉🕉🕉 🕉🕉 🕉🕉 🕉🕉🙏

అన్నం పరబ్రహ్మస్వరూపం" అని ఎందుకు అంటారంటే.......

ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఎప్పుడన్నా అన్నం వదిలేస్తే పెద్దవాళ్ళు అన్నం అలా పారవేయకూడదు, "అన్నం పరబ్రహ్మస్వరూపం" అని అంటారు.

అలా ఎందుకు అంటారు అని ఎప్పుడన్నా పెద్దవాళ్ళను అడిగినా చిన్నపిల్లలు 100శాతం నమ్మేలా కారణం చెప్పరు. నిజానికి ప్రతి జీవి పుట్టకముందే ఆ జీవికి కావలసిన ఆహారపదార్ధాలు ఈ భూమి మీద పుట్టిస్తాడు ఆ భగవంతుడు.అందుకే ఏ జీవి ఈ నేల మీద పడ్డా నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దవాళ్ళు అంటారు.

అంటే మనము ఈ భూమి మీద పడకమునుపే మనకు ఇంత ఆహారం అనీ, ఇన్ని నీళ్ళు అని ఆ భగవంతుడు మన పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల లెక్కలు వేసి ఆహారాన్ని, నీళ్ళను, మనము ఎవరికి పుట్టాలో కూడా నిర్ణయించి ఈ భూమి మీదకు పంపుతాడు.

ఎప్పుడైతే ఒక జీవికి ఆయన ప్రసాదించిన నీళ్ళు, ఆహారం అయిపొతాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లి ఆ జీవికి ఆయువు పూర్తి అయిపోతుంది.

అందుకే మీకు పెట్టిన ఆహారం కానీ, నీళ్ళు కానీ వృధా చేయకుండా, నీకు అక్కరలేదు అనిపించినప్పుడు ఎవరికన్న దానం ఇవ్వడం వలన నీకు పుణ్యఫలం పెరిగి, నీకు ఇచ్చిన ఆహారం కానీ నీళ్ళు కానీ మరి కొంచం పెరిగి ఆయుష్మంతుడవు అవుతావు

లేదా నీకు అని ఆ దేవదేవుడు ఇచ్చిన ఆహారాన్ని నేలపాలు చేస్తే నీకు లెక్కగా ఇచ్చిన ఆహారం తరిగి నీ ఆయువు తరిగిపోతుంది.

ఏ తల్లి అయినా చూస్తూ చూస్తూ బిడ్డ ఆయువు తరిగిపోవడం చూడలేక అన్నం పారవేయకు అని పదిసార్లు చెబుతుంది, అవసరమైతే దండిస్తుంది. ఇదంతా మీకు వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మస్వరూపం పారవేయవద్దు అని మాత్రమే చెబుతారు.

అందుకే అన్ని దానాలలోకి అన్నందానం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ఈ భూమి మీద ఉన్న ఏ జీవికైనా ఆహారం పెడితే కడుపునిండా తిని
నిండు మనస్సుతో పెట్టినవారిని ఆశీర్వదిస్తారు.

అన్నదాత సుఖీభవ!!!

{ ఆహారాన్ని వృధా చేయకండి, ఏ ఆసరా లేని అనాథ వృద్ధుల, అభాగ్యుల ఆకలి తీర్చండి}

జయతు     భారతీయ  సంస్కృతి.

స్త్రీ విరోధి కాదు

మనుధర్మ శాస్త్రం ఒక పరిశీలన -7

శోచంతి జామయో యత్ర నినశ్యత్యాశు తత్కులమ్
న శోచంతి తు యత్రైతా వర్థతే తద్ది సర్వదా

వ్యభిచారులు, అత్యాచారులు, దుర్మార్గులైన పురుషుల వలన శోకించి ధుఃఖించే స్త్రీలు ఉన్న ఇల్లు, లేదా వంశం నశిస్తుంది. ఉత్తమ పురుషులతో ప్రసన్నంగా స్త్రీలు ఉన్న ఇల్లు లేదా వంశం ఎప్పుడూ అభివృద్ది చెందుతూ ఉంటుంది.

అరక్షితా గృహే రుద్దాః పురుషైరాప్తకారిభిః
ఆత్మానమాత్మనాయాస్తు రక్షేయుస్తాః సురక్షితాః

గృహంలో తండ్రీ, భర్త మొదలైన పురుషులున్నా కూడా స్త్రీలు ఎవరైతే తమను తాము రక్షించుకుంటారో వారే సురక్షితంగా ఉంటారు.

సువాసినీః కూమారీశ్చ రోగిణీ గర్బీణీః స్త్రియః
అదతిభ్యో 2గ్రేవైతాన్ భోజయే దవిచారయన్

నూతన వధూవరులకు, అల్పవయస్సుగల కన్యలకు, రోగగ్రస్తులైన స్త్రీలకు, గర్భవతులైన స్త్రీలకు, వీరికి అతిధులకంటే ముందు గా భోజనం పెట్టాలి.

పై శ్లోకాల వల్ల మనకు అర్థంకావలసింది ఒక్కటే మనువు స్త్రీ విరోధి కాదు. ముందు పోస్ట్ లలో మనుమహర్షి ఆస్తి విషయం లో స్త్రీలకు ఎలాంటి రక్షణ కల్పించాడో చూద్దాం.

అభిషేకము

ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము చాలా విశేషము.

"ఓం నమఃశివాయః, నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీ మన్మహాదేవాయ నమః".

అని చెప్పుకుంటూ ఇంట్లో కూడా ఆ సదాశివునికి జలముతో అభిషేకము చేయవచ్చు.   లేక
 "ఓం నమఃశివాయః" అనుచూ 108 సార్లు జపము చేసిన మంచిది.

Telugu Numbers in Hinduism

✨☀✨పంచ గంగలు✨
1. గంగ
2. కృష్ణ
3. గోదావరి
4. తుంగభద్ర
5. కావేరి

✨☀✨షడ్గుణాలు✨☀
 హిందూ సాంప్రదాయం ప్రకారం మనలోని 6 గుణాలుంటాయి.
అవి.
1. కామం
2. క్రోధం
3. లోభం
4. మోహం
5. మదం
6. మత్సరం

✨☀✨షట్చక్రాలు✨☀
మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు
1. మూలాధార చక్రము
2. స్వాధిష్ఠాన చక్రము
3. మణిపూరక చక్రము
4. అనాహత చక్రము
5. విశుద్ధ చక్రము
6. ఆజ్ఞా చక్రము

✨☀✨షడ్విధ రసము
 షడ్విధ రసములు
1. ఉప్పు
2. పులుపు
3. కారం
4. తీపి
5. చేదు
6. వగరు

✨☀✨షడృతువులు✨☀షడృతువులు - ఋతువులు 6
అవి
1. వసంత ఋతువు
2. గ్రీష్మ ఋతువు
3. వర్ష ఋతువు
4. శరదృతువు
5. హేమంత ఋతువు
6. శిశిర ఋతువు

✨☀✨సప్త గిరులు✨☀కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ఏడు కొండలు కలవు.వీటినే సప్త గిరులు అని అంటారు.   అవి.
1 శేషాద్రి
2 నీలాద్రి
3 గరుడాద్రి
4 అంజనాద్రి
5 వృషభాద్రి
6 నారాయణాద్రి
7 వేంకటాద్రి

✨☀✨సప్త స్వరాలు✨☀మన భారతీయ సంగీతంలో 7 స్వరాలు కలవు. వీటినే సప్త స్వరాలు అని పిలుస్తారు.
అవి.

1. స = షడ్జమం (నెమలి క్రేంకారం)
2. రి = రిషభం (ఎద్దు రంకె)
3. గ = గాంధర్వం (మేక అరుపు)
4. మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)
5. ప = పంచమం (కోయిల కూత)
6. ధ = ధైవతం (గుర్రం సకిలింత)
7. ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)

✨☀✨సప్త ద్వీపాలు✨☀బ్రహ్మాండ పురాణములోను, మహాభారతంలోను, భాగవతం సప్త ద్వీపాలగురించి ప్రస్తావన ఉంది.   అవి .
1. జంబూద్వీపం - అగ్నీంద్రుడు
2. ప్లక్షద్వీపం - మేధాతిథి
3. శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
4. కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
5. క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
6. శాకద్వీపం - హవ్యుడు
7. పుష్కరద్వీపం - సేవనుడు.

✨☀✨సప్త నదులు✨
1. గంగ
2. యమున
3. సరస్వతి
4. గోదావరి
5. సింధు
6. నర్మద
7. కావేరి

✨☀✨సప్త అధొలోకములు
1. అతలము
2. వితలము
3. సుతలము
4. తలాతలము
5. రసాతలము
6. మహాతలము
7. పాతాళము

✨☀✨సప్త ఋషులు✨1.వశిష్టుడ
2.ఆత్రి
3.గౌతముడు
4.కశ్యపుడు
5.భరద్వాజుడు
6.జమదగ్ని
7.విశ్వామిత్రుడు

✨☀✨పురాణాలలో అష్టదిగ్గజాలు✨☀✨
1. ఐరావతం
2. పుండరీకం
3. వామనం
4. కుముదం
5. అంజనం
6. పుష్పదంతం
7. సార్వభౌమం
8. సుప్రతీకం

✨☀✨అష్ట జన్మలు✨☀1.దేవ జన్మ
2. మనుష్య జన్మ
3. రాక్షస జన్మ
4. పిచాచ జన్మ
5. పశు జన్మ
6. పక్షి జన్మ
7. జలజీవ జన్మ
8. కీటక జన్మ

✨☀✨ అష్ట భార్యలు✨శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలును అష్ట భార్యలు లేదా అష్టమహిషులు అని అంటారు.
వారు
1. రుక్మిణి
2. సత్యభామ
3. జాంబవతి
4. మిత్రవింద
5. భద్ర
6. సుదంత
7. కాళింది
8. లక్షణ

✨☀✨అష్ట కష్టములు✨అష్ట కష్టములు
1. ఋణము
2. యాచన
3. ముసలితనము
4. వ్యభిచారము
5. దొంగతనము
6. దారిద్ర్యము
7. రోగము
8. ఎంగిలి తిని బ్రతుకుట

✨☀✨అష్ట కర్మలు✨☀
1. స్నానము
2. సంధ్య
3. జపము
4. హూమము
5. స్వాధ్యాయము
6. దేవ పూజ
7. ఆతిధ్యము
8. వైశ్యదేవము

✨☀✨అష్టభాషలు.✨☀1. సంస్కృతము
2. ప్రాకృతము
3. శౌరసేని
4. మాగధి
5. పైశాచి
6. సూళికోక్తి
7. అపభ్రంశము
8. ఆంధ్రము

✨☀✨నవధాన్యాలు✨☀మన నిత్య జీవితంలో ఉపయోగించే 9 రకాల ధాన్యాలను నవ దాన్యాలు అని పిలుస్తారు అవి -
గోధుమలు ,వడ్లు  ,పెసలు,
శనగలు , కందులు , అలసందలు,
నువ్వులు, మినుములు ,ఉలవలు

✨☀✨నవ రత్నాలు✨1.మౌక్తికం = ముత్యము
2.మాణిక్యం = కెంపు
3.వైఢూర్యం = రత్నం
4.గోమేదికం = పసుపురంగులోని ఒక రత్నం
5.వజ్రం
6.విద్రుమం = పగడం
7.పుష్యరాగం = తెల్లటి మణి
8.మరకతం = పచ్చ
9.నీలమణి

✨☀✨నవధాతువులు
1. బంగారం
2. వెండి
3.ఇత్తడి
4.సీసం
5.రాగి
6.తగరం
7.ఇనుము
8.కంచు
9.కాంతలోహం

✨☀✨నవబ్రహ్మల
1.మరీచి
2.భరద్వాజుడు
3.అంగీరసుడు
4.పులస్త్యుడు
5.పులహుడు
6.క్రతువు
7.దక్షుడు
8.వసిష్టుడు
9.వామదేవుడు

✨☀✨నవ చక్రములు✨మానవ శరీరంలో గల చక్రస్థానాలు.
1. మూలాధార చక్రము
2.స్వాధిష్టాన చక్రము
3.నాభి చక్రము
4.హృదయచక్రము
5.కంఠ చక్రము
6.ఘంటికాచక్రము
7.భ్రూవుచక్రము
8.బ్రహ్మరంధ్రము
9. గగన చక్రము

✨☀✨నవదుర్గలు✨☀
1 శైలపుత్రి దుర్గ
2 బ్రహ్మచారిణి దుర్గ
3 చంద్రఘంట దుర్గ
4 కూష్మాండ దుర్గ
5 స్కందమాత దుర్గ
6 కాత్యాయని దుర్గ
7 కాళరాత్రి దుర్గ
8 మహాగౌరి దుర్గ
9 సిద్ధిధాత్రి దుర్గ

✨☀✨దిశలు✨☀✨
1. తూర్పు
2. ఆగ్నేయం
3. దక్షిణం
4. నైఋతి
5. పడమర
6. వాయువ్యం
7. ఉత్తరం
8. ఈశాన్యం
9.భూమి (క్రింది ప్రక్క)
10.ఆకాశం (పైకి)

✨☀✨దశావతారాలు
1. మత్స్యావతారము
2. కూర్మావతారము
3. వరాహావతారము
4. నృసింహావతారము లేదా నరసింహావతారము
5. వామనావతారము
6. పరశురామావతారము
7. రామావతారము
8. కృష్ణావతారము
9. బుద్ధావతారము
10. కల్క్యావతారము

✨దశవిధ సంస్కారములు✨
1. వివాహము
2. గర్బాదానము
3.పుంసవనము
4.సీమంతము
5.జాతక కర్మ
6.నామకరణము
7.అన్న ప్రాశనము
8.చూడకర్మ
9.ఉపనయనము
10.సమావర్తనము

✨☀✨దశవిధ బలములు
1. విద్యా బలము
2.కులినితా బలము
3.స్నేహ బలము
4.బుద్ది బలము
5.ధన బలము
6.పరివార బలము
7.సత్య బలము
8. సామర్ద్య బలము
9. జ్ఞాన బలము
10. దైవ బలము

వేదం గోప్పదా ????

వేదం గోప్పదా  ?? అదిఏలా ?

అసలు ఈ సాంకేతిక విప్లవం లేని రోజుల్లో పుస్తకాలు లేదా గ్రంధాలు కూడా లేని కాలం నుండి మన వేదం పదిలంగా గురు శిష్య పరంపర ద్వారా కొన్ని కోట్ల తరాలగా సాగుతూ వస్తోంది. అసలు తప్పులు లేకుండా ఎక్కడా కూడా ఒక ఒట్టు, పొల్లు పోకుండా ఎలా వస్తున్నది అని నిరుటి శాస్త్రజ్ఞులు పరిశోధించగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మన పూర్వులు ఒక అద్భుతమైన శాస్త్రీయ పద్ధతిలో విద్యాబోధను చేసేవారు. ప్రతి పదం మెదడులో నిక్షిప్తమయి నోటి ద్వారా ఒకరినుండి మరొకరికి నేర్పబడుతోంది.

వేదాలను శృతి అని అంటారు. అంటే విని మరల మననం చేసి శిష్యులకు సాంప్రదాయంగా నేర్పుతారు. ఒక వేదమంత్రానికి  వర్ణం, స్వరం, మాత్ర(ఎంతసేపు పలకాలో), బలం(ఎక్కడ ఒత్తి పెట్టి పలకాలో), సమం(ఏక పద్ధతి) మరియు సంతాన (ఎక్కడ విరవాలో, ఎక్కడ పోడిగించాలో) అనే 6 ముఖ్య ప్రామాణిక సూత్రాలకు లోబడి వుంటుంది. వీటిలో ఏది మారినా ఆ మంత్రానికి మొత్తం అర్ధం మారిపోతుంది. వాటి వలన అనుకున్న దానికి వ్యతిరిక్త ఫలితాలు రావచ్చును.  ఇది నమ్మబుద్ధి కావడం లేదా.

ఒక ఉదాహరణ తీసుకుని ఆలోచిద్దాం. ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ తీసుకుని చర్చించుకుందాం
“ I never said she stole my money” - నేను   ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు
ఒక వేళ నేను ఒక  పదం మీద ఒత్తి పలికితే ఆ పదానికి వున్న అర్ధం మొత్తం మారిపోతుంది. ఈ పైన చెప్పిన వాక్యంలో ఒకొక్క పదం మీద బలం పెట్టి చూద్దాం

1. “ I” never said she stole my money – నేను   ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు. ( అంటే ఇంకెవరో అన్నారు )

2.  I “never” said she stole my money – నేను “ఎప్పుడూ” ఆ ఆమ్మాయి డబ్బు తీసింది అనలేదు ( ఇది సూటిగా అర్ధమయ్యే వాడుక )

3. I never “said” she stole my money – నేనెప్పుడూ ఆ అమ్మాయి డబ్బు తీసింది “అనలేదు” ( అనలేదు కానీ నాకు అనుమానం వుంది, లేదా నమ్మకం వుంది)

4. I never said “she” stole my money – ఆ అమ్మాయి తీసిందని నేను  అనలేదు ( మరెవ్వరో తీసి వుండ వచ్చును )

5. I never said she “stole” my money – ఆ అమ్మాయి దొంగాలించింది అని నేను అనలేదు ( మామూలుగా తీసుకుని ఉండవచ్చును, చేబదులు లేక మరో రకంగా)

6. I never said she stole “my” money – ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు ( కానీ పక్క వాడి డబ్బు దొంగలించి ఉండవచ్చును, లేక ఆ డబ్బు నాది కాక పోవచ్చును)

7. I never said she stole my “money” – ఆ అమ్మాయి నా “డబ్బు” దొంగాలించలేదు ( కానీ మరోకటేదో దొంగలించి ఉండవచ్చు)

చూసారా ఒకొక్క పదం మీద ఒత్తి పలకడం వలన ఒకొక్క అర్ధం మామూలు మన మాటల్లోనే వస్తున్నది. వేద ప్రోక్తమైన మంత్రాలలో ఉచ్చారణ, స్వర, అనుస్వరం ఎంత ప్రాముఖ్యమో మీకు ఈ పాటికి అర్ధమయి వుంటుంది.

ఈ వేదం మంత్రరాశిని కాపాడుకోవడానికి ఎన్నో పద్ధతులను మన ఋషులు వాడారు” వాక్య, పద, క్రమ, జత, మాల, శిఖా, రేఖా, ధ్వజ, దండ, రథ, ఘన” పద్ధతులలో నేర్చుకునేవారు. ఇవన్నీ అత్యంత గుహ్యమైన గొప్ప ఎర్రర్ కర్రెక్టింగ్ కోడ్స్.

క్రమ పాఠంలో 1-2; 2-3; 3-4; 4-5; పద్ధతిలో మంత్రాన్ని పఠిస్తారు. జట లో 1-2-2-1-1-2; 2-3-3-2-2-3;3-4-4-3-3-4; పద్ధతిలో, అదే ఘనంలో 1-2-2-1-1-2-3-3-2-1-1-2-3; 2-3-3-2-2-3-4-4-3-2-2-3-4 పద్ధతిలో పాఠం నేర్చుకుంటారు. దీని వలన ఎక్కడా కూడా ఏ అక్షరం, స్వరం పొల్లు పోకుండా కాపాదబడుతుంది.

ఒక ఘనాపాఠీ కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితను నేర్వాలంటే 2000 పైగా పంచశతి( 1 పంచశతి = 50 పాదాలు  => 109,308 పాదాలు. ప్రతి పాదానికి రమారమి 3 పదాలు => 3,30,000 పదాలు, 1 ఘనం 13 సార్లు ఉచ్చరించడం => 4,290,000 ఉచ్చారణలు పైన చెప్పిన 6 మూల సూత్రాలతో  )  చెప్పుకోవాలి. ఇది గురువుగారి దగ్గర శుశ్రూష చేసి నేర్చుకోవాలంటే రమారమి 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చూడండి వారు ఎంత త్యాగం చేసి శ్రద్ధతో నేర్చుకుంటే వారు ఘనాపాఠీలు అవుతారు. ఇంత క్లిష్టమైన మన సాంప్రదాయాన్ని కొందరు అయోగ్యులు పిలక బ్రాహ్మణులను, వాళ్ళేమి చేసేది, మేము చదివేస్తాము అని డాంబికాలు పలుకుతారు. ముందుగా ఒకరి పని వారిని చేయ్యనివ్వాలి. పక్కవారిని అగౌరవ పరచకూడదు. అందరం ఎవరి పనులు వారు చేసుకుంటూ సమాజోద్ధారణకు పాటు పడాలి. ఒకరి మీద ఒకరికి అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టిపోయారు తెల్లవాళ్ళు.  మనం మన సంస్కృతిని కాపాడుకోవాలి. వేదం నిత్యం బ్రతికి వుండాలి. ఇది మన అందరి కర్తవ్యం. పేద్దల సహకారంతో   ..

!! జై శ్రీమన్నారాయణ్!!

చట్టానికీ న్యాయానికి ధర్మానికీ తేడా ??

ఓ మిత్రుడు ఓ ప్రశ్న వేశాడు.. చట్టానికీ న్యాయానికి
ధర్మానికీ తేడాలేంటీ అని..!
.
.
ఒక వ్యక్తి నువ్వు అడగ్గానే లక్ష రూపాయలు ఎలాంటి
ప్రామిసరీ నోట్లు, గ్యారంటీలు లేకుండా ఇచ్చి నిన్ను నిలబెట్టాడు.

 బాగుపడ్డావు.

ఈలోపు తను దెబ్బతిని చివరకు తనే పోయాడు... ఆయన
భార్యాపిల్లలు బజార్నపడ్డారు...

ఏ కాగితాలూ లేనందున ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిన
అవసరం లేదు
 ... అదీ చట్టం

తప్పకుండా ఆ డబ్బు వడ్డీతో సహా చెల్లించాలి
........ అదీ న్యాయం

డబ్బు, వడ్డీ ఇచ్చి ఆ కుటుంబం నిలదొక్కుకునేదాకా
మద్దతుగా నిలబడాలి
....... అదీ ధర్మం