Wednesday, March 18, 2026

ఏ దిక్కు చూస్తూ జపం చేస్తే ఏ ఫలితం

 



గ్రామదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు

 💐 💐గ్రామ దేవతల పేర్లు💐💐


💐గ్రామదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు :-💐


పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం .


ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు అని వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు .వారిలో కొందరు .


1.పాగేలమ్మ

2.ముత్యాలమ్మ

3 .గంగమ్మ

4.గంగానమ్మ

5.బంగారమ్మ

6.గొంతెమ్మ

7.సత్తెమ్మ

8.తాళమ్మ

9.చింతాలమ్మ

10.చిత్తారమ్మ

11.పోలేరమ్మ

12.మావుళ్లమ్మ

13.మారెమ్మ

14.బంగారు బాపనమ్మ

15.పుట్టానమ్మ

16.దాక్షాయణమ్మ

17.పేరంటాలమ్మ

18.రావులమ్మ

19.గండిపోచమ్మ

20.మేగదారమ్మ

21.ఈరినమ్మ

22.దుర్గమ్మ

23.మొదుగులమ్మ

24.నూకాలమ్మ (అనకాపల్లి ,విశాఖజిల్లా )

25.మరిడమ్మ

26.నేరెళ్లమ్మ

27.పుంతలో ముసలమ్మ (మెయ్యెరు ,అత్తిలిదగ్గర ,పశ్చిమగోదావరిజిల్లా )

28.మాచరమ్మోరు

29.మద్ది ఆనాపా అమ్మోరు

30.సొమాలమ్మ

31.పెద్దయింట్లమ్మ

32.గుర్రాలక్క (అంతర్వేది ,తూర్పుగోదావరిజిల్లా గుర్రాలమ్మ )

33 .అంబికాలమ్మ

34.ధనమ్మ

35.మాలక్షమ్మ

36.ఇటకాలమ్మ

37.దానాలమ్మ

38.రాట్నాలమ్మ

39.తలుపులమ్మ

40.పెన్నేరమ్మ

41.వెంకాయమ్మ

42.గుణాళమ్మ

43.ఎల్లమ్మ (విశాఖపట్నం )

44.పెద్దమ్మ

45.మాంటాలమ్మ

46.గంటాలమ్మ

47.సుంకులమ్మ

48.జంబులమ్మ

49.పెరంటాలమ్మ

50.కంటికలమ్మ

51.వణువులమ్మ

52.సుబ్బాలమ్మ

53.అక్కమ్మ

54.గనిగమ్మ

55.ధారాలమ్మ

56.మహాలక్షమ్మ

57.లంకాలమ్మ

58.దోసాలమ్మ

59.పళ్ళాలమ్మ (వానపల్లి ,తూర్పుగోదావరిజిల్లా )

60.అంకాళమ్మ .

61.జోగులమ్మ

62.పైడితల్లమ్మ

63.చెంగాళమ్మ

64.రావులమ్మ

65.బూరుగులమ్మ

66.కనకమహాలక్ష్మి (విశాఖపట్నం )

67.పోలమ్మ

68.కొండాలమ్మ

69.వెర్నిమ్మ

70.దే శిమ్మ

71.గరవాలమ్మా

72.గరగలమ్మ

73.దానెమ్మ

74.మహాంకాళమ్మ

75.వేరులమ్మ

76.మరిడమ్మ

77.ముళ్ళ మాంబిక

78.యలారమ్మ

79.వల్లూరమ్మ

80.నాగులమ్మ

81.వేగులమ్మ

82.ముడియలమ్మ

83.రేణుకమ్మ

84.నంగాలమ్మ

85.చాగాలమ్మ

86.నాంచారమ్మ

87.సమ్మక్క

88.సారలమ్మ

89.మజ్జిగౌరమ్మ

90.కన్నమ్మ -పేరంటాలమ్మ

91.రంగమ్మ -పేరంటాలమ్మ

92.వెంగమ్మ -పేరంటాలమ్మ

93.తిరుపతమ్మ

94.రెడ్డమ్మ

95.పగడాలమ్మ

96.మురుగులమ్మ (బండారులంక ,తూర్పుగోదావరిజిల్లా )

97.కుంచమ్మ విశాఖపట్నంలో

98.ఎరకమ్మ

99.ఊర్లమ్మతల్లి

100.మరిడమ్మ

101.సుంకాలమ్మవ్వ ఉన్నారు .


💐నుసకపల్లి ,పామర్రమండలం తూర్పుదోదావరిజిల్లాలోని గ్రామదేవతలు .


1.నుసకపల్లమ్మ

2.వెలగలమ్మ

3 .ఊర్లమ్మతల్లి (గణపవరం ,కర్లపాలెం మండలం ,గుంటూరుజిల్లా )

4.పైళ్లమ్మతల్లి

5.బల్లమ్మతల్లి

6.లొల్లాలమ్మతల్లి

7.ఊడలమ్మ తల్లి

8.కట్వాలాంబిక

9.నాగాలమ్మ నాంచారమ్మతల్లి

10.సింగమ్మతల్లి

11.ఘట్టమ్మతల్లి

12.అంజారమ్మతల్లి .

13. మంత్రాలమ్మ తల్లి

14.పాతపాటేశ్వరి తల్లి

15.కుంకుళమ్మ ద్వారకా తిరుమల

16.చౌడమ్మ నందవరం కర్నూల్ జిల్లా


అలాగే ఖమ్మం ,నల్గొండ జిల్లాలలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కానవస్తుంది .


💐అమ్మలగన్న అమ్మలు ఆదిపరాశక్తిలు గ్రామదేవతలకు వందనాలు,💐


💐💐మన గ్రామదేవతలు ఎలా వెలిశారు ?💐💐


మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతల నామ విశేషాలేమిటి?


💐గ్రామదేవతా వ్యవస్థ:💐


గ్రామాలలో వెలిసే దేవత...దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను  గ్రామదేవతలని అంటారు.


సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు.


ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు,

ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో,కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే

కుదరకపోవచ్చు.


ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము

సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో

అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు

ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే

తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.


ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త,

ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది.


ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు

అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో

అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా

నియమించారు పూర్వీకులు.


అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు.


దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది

కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము

సరైన మూహూర్తములోనే జ్ వేయబడింది కాబట్టి

గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-


భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు.


అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన

ఆ నెల, ఆ తిథినాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారాఏదైనా లోటు పాట్లు కలిగివుంటే తొలగుతుంది.


💐💐గ్రామదేవతల ఆవిర్భావము:💐💐


పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది.


అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు

గ్రామదేవతలను ఏర్పాటు చేసారు

తొలి దశలో.


💐పృధ్వీ దేవత:💐

మొదటిది పృధ్వీ అంటే నేల,ఇది పంటకి ఆధారము,

కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన

పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు.


గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారము

కాబట్టి ఆపేరుతో గోగులమ్మని యేర్పాటు చేసారు.


జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు.


మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూ వుండడము, దాన్నే సొమ్ముగా

మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ.


పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని

చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి

కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది.


ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో

జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.


💐జల దేవత:💐

రెండవది జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ–గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది.గుడి ఎత్తుగా కట్టినా

తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.


💐అగ్ని దేవత:💐

మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ,రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. ( చిత్తూరు పున్నమ్మ గుడిలో హారతి సమయంలో పంబల్లు వాయిస్తారు అది ఉంటూ హారతి చూస్తే అమ్మవారు ఆనందంతో వెలిగిపోతున్నట్టు కనిపిస్తోంది, ఎప్పుడూ అదే కొనసాగుతోందా తెలియదు).


సూరమ్మను ప్రతి అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమినాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు.


ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళలమ్మ (సూర్య,చంద్రుల కళ వున్న అమ్మ).


💐వాయు దేవత:💐

నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి.

కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.


💐ఆకాశ దేవత:💐

ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను

ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు,గాలివాన. ఇలాంటి వాటి నుండి

రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.


💐గ్రామదేవతా నామ విశేషాలు:💐


మనం రకరకాల పేర్లతో పిలిచే  ప్రతి గ్రామదేవత

పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది 


సొంతవూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల

రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో

వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది.


ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.


ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి

'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట.

ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు

రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది.


ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే

ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల

(ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేసే+అమ్మ=

కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది.


స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో (స్వచ్ఛమని)సు+అచ్చ= స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది.


సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది.

'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో

ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే

క్రమముగా అది మావుళ్ళమ్మ' అయింది.


ప్రజల మనసులో పుట్టే ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన. వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా 'తలుపులమ్మ'గా మారింది.ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటపుడు తల్లికి

లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.


శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో

అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా

అంకగళమ్మ, అంకాళమ్మ గా మారిపోయింది.


పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ.

ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి.

తన గ్రామములోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత

పిశాచ గణాలను గ్రామములోనికి రాకుండా

వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతే.


పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి.

అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో

పాలు పోస్తారు. ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ'

అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు.


సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=

సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ.


గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా

ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ. 


అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న) అమ్మ పుల్లమ్మ.

ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది

కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.


ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే

చోటవున్న తల్లి అర్పణ+అమ్మ =అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది.


బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు

బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ=అప్పలమ్మ అన్నారు.


అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది

బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ

అయినది పెంటి (బాల)+అమ్మ=పెంటమ్మ.


భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో

బోనముల (భోజనమనే పదానికి వికృతి)+అమ్మ=

బోనాలమ్మ.


అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి

ఈమెను 'అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల

పిలుస్తారు.


లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది

కాబట్టి గుర్రాల+అమ్మ=గుర్రాలమ్మ అయినది.


ఊరు పేరుని బట్టి పీల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోల+అంబ='సోమపోలమాంబ'

అన్నారు.సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట..!!


పేర్లు ఏవైతేనేమి,

ఆ తల్లి ఎప్పుడూ

మనకు తోడుగా,

అండగా నిలిచి

మనందరినీ

కంటికి రెప్పలా

కాపాడుతుంది...

శుభం 

శ్రీ మాత్రే నమః

మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు

మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాను..మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి.

( 1867, 1927,1987,): ప్రభవ

(1868,1928,1988): విభవ

(1869,1929,1989): శుక్ల

(1870,1930,1990): ప్రమోదూత

(1871,1931,1991): ప్రజోత్పత్తి

(1872,1932,1992): అంగీరస

*(1873,1933,1993)*శ్రీముఖ

(1874,1934,1994): భావ

(1875,1935,1995): యువ

(1876,1936,1996): ధాత

(1877,1937,1997):  ఈశ్వర

(1878,1938,1998): బహుధాన్య

(1879,1939,1999): ప్రమాది

(1880,1940,2000): విక్రమ

(1881,1941,2001): వృష

(1882,1942,2002): చిత్రభాను

(1883,1943,2003): స్వభాను

(1884,1944,2004): తారణ

(1885,1945,2005): పార్థివ

(1886,1946,2006):  వ్యయ

(1887,1947,2007): సర్వజిత్

(1888,1948,2008): సర్వదారి

(1889,1949,2009): విరోది

(1890,1950,2010): వికృతి

(1891,1951,2011): ఖర

(1892,1952,2012):  నందన

(1893,1953,2013): విజయ

(1894,1954,2014): జయ

(1895,1955,2015): మన్మద

(1896,1956,2016): దుర్ముఖి

(1897,1957,2017): హేవిళంబి

(1898,1958,2018): విళంబి

(1899,1959,2019): వికారి

(1900,1960,2020): శార్వరి

(1901,1961,2021): ప్లవ

(1902,1962,2022): శుభకృత్

(1903,1963,2023): శోభకృత్

(1904,1964,2024): క్రోది

(1905,1965,2025): విశ్వావసు

(1906,1966,2026): పరాభవ

(1907,1967,2027): ప్లవంగ

(1908,1968,2028): కీలక

(1909,1969,2029): సౌమ్య

(1910,1970,2030):  సాదారణ

(1911,1971,2031): విరోదికృత్

(1912,1972,2032): పరీదావి

(1913,1973,2033): ప్రమాది

(1914,1974,2034): ఆనంద

(1915,1975,2035): రాక్షస

(1916,1976,2036): నల

(1917,1977,2037): పింగళ

(1918,1978,2038): కాళయుక్తి

(1919,1979,2039): సిద్దార్థి

(1920,1980,2040): రౌద్రి

(1921,1981,2041): దుర్మతి

(1922,1982,2042): దుందుభి

(1923,1983,2043): రుదిరోద్గారి

(1924,1984,2044): రక్తాక్షి

(1925,1985,2045): క్రోదన

(1926,1986,2046): అక్షయ

Friday, March 13, 2026

గోవుకు ఏ ఆహారo పెడితే ఏ ఫ‌లితo

🙏🐂ఈ 22 ఆహారాల్లో గోమాత‌కు ఎలాంటి ఆహారాన్ని పెడితే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా.............!!

🙏🐂1. గోమాత‌ల‌కు నాన‌బెట్టిన శ‌న‌గ‌ల‌ను తినిపిస్తే ఆధ్యాత్మిక చింత‌న ల‌భిస్తుంద‌ట‌. స‌న్మార్గంలో న‌డ‌వ‌వచ్చ‌ట‌. దైవ చింత‌న పెరుగుతుంద‌ట‌.

🙏🐂2. మీకు ఎవ‌రైనా శ‌త్రువులు ఉంటే గోమాత‌ల‌కు దోస‌కాయ‌ల‌ను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శ‌త్రు నివార‌ణ జ‌రుగుతుంది.

🙏🐂3. గోమాత‌ల‌కు బెండ‌కాయ‌ల‌ను తినిపిస్తే మ‌నోస్థైర్యం పెరుగుతుంది. ఏ ప‌ని చేయ‌డానికైనా కావ‌ల్సినంత ధైర్యం వ‌స్తుంది.

🙏🐂4. బాగా అప్పులు ఉన్న వారు నాన‌బెట్టిన కందుల‌ను గోమాత‌కు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు.

🙏🐂5. కుటుంబంలో క‌ల‌హాలు ఉన్న వారు, అస్త‌మానం కుటుంబంలో స‌భ్యుల‌తో గొడ‌వలు ప‌డుతూ ఉండేవారు గోమాత‌ల‌కు నాన‌బెట్టిన ప‌చ్చి శ‌న‌గ‌ల‌ను తినిపిస్తే ఫ‌లితం ఉంటుంది.

🙏🐂6. పిల్ల‌లు విద్యారంగంలో ఎద‌గాలంటే వారి త‌ల్లిదండ్రులు గోమాత‌ల‌కు నానబెట్టిన పొట్టు పెస‌ర ప‌ప్పును తినిపించాల్సి ఉంటుంది.

🙏🐂7. గోమాత‌కు నాన‌బెట్టిన ఛాయ పెస‌ర‌ప‌ప్పు పెడితే ఇంద్రియ నిగ్ర‌హం క‌లుగుతుంది.

🙏🐂8. ఉద్యోగం రాకుండా ఉన్న‌వారు, దాని కోసం విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్న‌వారు గోమాత‌కు గోధుమ‌పిండి, బెల్లం క‌లిపి పెట్టాలి.

🙏🐂9. ధ‌నం బాగా సంపాదించాల‌నుకునే వారు గోమాత‌కు మిన‌ప‌పిండి, బెల్లం క‌లిపి పెట్టాలి.

🙏🐂10. మాన‌సిక ప్ర‌శాంత‌త కావాల‌నుకునే వారు గోమాత‌కు దొండ‌కాయ‌లు పెట్టాలి.

🙏🐂11. గోమాత‌కు అర‌టి పండ్లు తినిపిస్తే ఉన్న‌త ప‌ద‌వి పొందుతారు.

🙏🐂12. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాత‌కు వంకాయ‌ల‌ను తినిపిస్తే ఫ‌లితం టుంది.

🙏🐂13. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునే వారు గోమాత‌కు క్యారెట్ల‌ను పెట్టాలి.

🙏🐂14. న‌ర ఘోష ఉన్న వారు గోమాత‌కు బంగాళా దుంప‌ల‌ను తినిపించాలి.

🙏🐂15. వివాహం కాని వారు గోమాత‌కు ట‌మాటాల‌ను పెట్టాలి.

🙏🐂16. గోమాత‌కు బీట్ రూట్‌, పాల‌కూర తినిపించినా ధ‌నవంతులు అవుతారు. ఐశ్వ‌ర్య ప్రాప్తి క‌లుగుతుంది.

🙏🐂17. గోమాత‌కు నాన‌బెట్టిన మినుములు పెడితే ఆత్మ విశ్వాసం ల‌భిస్తుంది.

🙏🐂18. గోమాత‌కు నానబెట్టిన కందులు పెడితే కోపం త‌గ్గుతుంది.

🙏🐂19. తోట కూర‌, బెల్లం క‌లిపి గోమాత‌కు పెట్టినా మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను పొంద‌వ‌చ్చు.

🙏🐂20. గోమాత‌కు నాన‌బెట్టిన గోధుమ‌లు పెడితే కీర్తి, ప‌ట్టుద‌ల ల‌భిస్తాయి.

🙏🐂21. నాన‌బెట్టిన బొబ్బ‌ట్లను గోమాత‌కు పెడితే ధ‌నాభివృద్ధి జ‌రుగుతుంది.

🙏🐂22. గోమాత‌కు నాన‌బెట్టిన ఉల‌వ‌లు పెడితే వృత్తిలో నిల‌క‌డ ల‌భిస్తుంది.

Thursday, February 12, 2026

పంచ గయలు

 మన దేశంలో మొత్తం 5 గయలు ఉన్నాయని చెబుతారు. 

1. శిరోగయ, 2. నాభిగయ, 3. పాదగయ, 4. మాతృగయ, 5. పితృగయ. 

1. శిరోగయ : బిహార్ రాష్ట్రంలో ఫల్గుణీ నదీ తీరంలో “శిరోగయ” గా వెలసింది. దీనినే బుద్ధగయ అని కూడా అంటారు.

 2. నాభిగయ : జాజాపూర్, ఒరిస్సా రాష్ట్రంలో వైతరణి నదీ తీరంలో వున్న ప్రదేశంను “నాభిగయ” అని అంటారు.

 3. పాదగయ : పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్‌లో గయని పాదాలుండటం వలన అవి వున్న ప్రదేశం పిఠాపురాన్ని “పాదగయ” అంటారు.

 4. మాతృగయ : గుజరాత్ రాష్ట్రంలో మహేషన జిల్లాలో సరస్వతీ నదీ తీరంలో గల ప్రాంతాన్ని “మాతృగయ” అని అంటారు. బిందు సరోవరమనే మరో పేరు కూడా కలదు. అహమ్మదాబాదుకు 32 కి||మి|| దూరంలో గల మాతృగయలో మాతృవంశం వారికి పిండప్రదానం మరింత ముఖ్యం. ఒరిస్సాలోని భువనేశ్వర్‌కి 33 కి||మి|| దూరంలో వున్న బిందు సరోవరం వద్ద కూడా పిండ ప్రదానాలు చేస్తారు.

5. పితృగయ : బధరీనాథ్, ఉత్తర ప్రదేశ్‌లోని అలకనందా నదీ తీరంలో గల “బ్రహ్మకపాలం” అనే ప్రదేశాన్ని “పితృగయ” అంటారు

Friday, February 6, 2026

కేశవ నామాలు - వాటి విశిష్టత

ఈ రోజు మొదటి నామం

-------------------------------------------------------------

మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముందుగా ఆచమనము చేస్తూ

కేశవాయ నమః! నారాయణాయ నమః! మాధవాయ నమః!

అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని మూడు సార్లు తీర్థము తీసుకుని, తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము. ఈ 24 కేశవ నామాలు  చెప్పడంలో విశిష్టత ఏమి?

దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది. ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే  ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో దానిపైన పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది. ప్రీతితో కార్యము చేస్తాము.

కేశవ నామాలు (24 చతుర్వింశతి నామాలు) విష్ణువు యొక్క వివిధ రూపాలను సూచిస్తాయి,  ఈ నామాలు శరీర శుద్ధిని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని నమ్ముతారు, ముఖ్యంగా కేశవ, నారాయణ, మాధవ నామాలు త్రివిధ తాపాలను నివారిస్తాయి.

కేశవ నామాలలో మొదటి నామం అయిన కేశవ రూపంలో స్వామి వారికి కుడివైపు ఉన్న రెండు చేతులతో పద్మము, శంఖము… ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో గద, చక్రం పట్టుకుని కనిపిస్తాడు.


 01. ఓం కేశవాయనమః (శంఖం-చక్రం-గద-పద్మం)

“కేశవాయ నమః” అని మనం నమస్కరిస్తున్నప్పుడు, అది కేవలం ఒక నామస్మరణ కాదు —

అది సర్వాత్ముడైన శ్రీమన్నారాయణునికి సంపూర్ణ శరణాగతి. కేశవుడు అంటే ఎవరు?  కేశి అనే దుష్ట అసురుణ్ని సంహరించినవాడు, అలాగే బ్రహ్మ (క), విష్ణు (ఈశ), శివ (వ) ఈ మూడు తత్త్వాల సమన్వయ స్వరూపుడు. అందుకే “కేశవ” నామం సృష్టి–స్థితి–లయలకు అధిపతి అయిన పరమేశ్వరుని సూచిస్తుంది. “నమః” అన్న మాటలో అహంకారానికి స్థానం లేదు. “నా బలం కాదు, నా జ్ఞానం కాదు, అన్నీ నీ కృపే స్వామీ” అనే వినయ భావం ఉంది. భక్తితో “కేశవాయ నమః” అని స్మరిస్తే —మన అహంకారం కరిగిపోతుంది, మనస్సు స్థిరపడుతుంది, హృదయంలో భక్తి వేర్లు వేస్తుంది. ఈ నామం ఏమి చెబుతుంది? కేశవుడే రక్షకుడు, కేశవుడే కర్త, కేశవుడే శరణ్యం. అందుకే ప్రతి కార్యం ప్రారంభంలో ఈ నామాన్ని స్మరించితే ఆ కార్యం మంగళమయమవుతుంది.

ఓం కేశవాయ నమః!!

Wednesday, February 4, 2026

మీ గోత్రం యొక్క నిజమైన శక్తిని మీకు తెలుసా?

ఇది ఒక ఆచారం కాదు. మూఢనమ్మకం కాదు. ఇది మీ ప్రాచీన కోడ్. ఈ థ్రెడ్‌ను పూర్తిగా చదవండి… ఇది మీ గతాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అవసరం.


1. గోత్రం అనేది మీ ఇంటి పేరు కాదు. ఇది మీ ఆత్మిక DNA.


అవును, చాలా మందికి తమ గోత్రం కూడా తెలియదు. పూజలో పండితుడు ఏదో చెబుతాడు అని అనుకుంటాం. కానీ ఇది అంత తేలిక కాదు.


మీ గోత్రం అంటే - మీరు ఏ ఋషి యొక్క మనస్సుకు, ఆలోచనలకు, శక్తికి, జ్ఞానానికి అనుసంధానమయ్యారు అన్నదే.


ప్రతి హిందువును ఒక ఋషి వరకు ఆధ్యాత్మికంగా అనుసంధానించవచ్చు. ఆ ఋషి మీ రక్త సంబంధి కాకపోయినా, ఆత్మ సంబంధి.


2. గోత్రం అనేది కులం కాదు.


ఇప్పటి కాలంలో ఇది ఎక్కువగా గందరగోళంగా మారింది. గోత్రం అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్య, శూద్రుడు అన్న భావన తప్పు భావన.


గోత్ర వ్యవస్థ కులాలకు ముందే ఉంది. ఇది ఒక విద్యాపరమైన గుర్తింపు. ఋషులు తమ విద్యార్ధులకు గోత్రం ఇచ్చేవారు – అది విద్య ద్వారా సంపాదించేది.


అందువల్ల, గోత్రం అనేది శక్తి గుర్తింపు కాదు – జ్ఞానం గుర్తింపు.


3. ప్రతి గోత్రం ఒక మహాఋషి నుండి వస్తుంది


మీరు వశిష్ఠ గోత్రానికి చెందినవారై ఉంటే – మీరు వశిష్ఠ మహర్షి మానసిక వారసత్వాన్ని కలిగి ఉన్నవారు. ఆయన రాముడి గురువు, దశరథుడి సలహాదారు కూడా.


భరద్వాజ గోత్రం అంటే – వేదాల రచనలో భాగం, యుద్ధ విద్యలో నిపుణులైన ఋషి వారసత్వం.


మొత్తం 49 ప్రధాన గోత్రాలు ఉన్నాయి – ప్రతి గోత్రం ఒక విశిష్ట రంగంలో నిపుణులైన ఋషికి సంబంధించినది.


4. ఎందుకు పెద్దలు ఒకే గోత్రం మధ్య వివాహాన్ని నిషేధించారు?


ఇది జనరల్ స్కూల్లో చెప్పే విషయం కాదు.


గోత్రం వంశ పరంపరలో పురుషుల ద్వారా వెళ్తుంది. అంటే, ఇద్దరూ ఒకే గోత్రానికి చెందినవారైతే, వారు జన్యుపరంగా దగ్గర బంధువులే. దీని వల్ల పిల్లల్లో శారీరక, మానసిక లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది.


గోత్ర వ్యవస్థ = ప్రాచీన భారతీయ జన్యుపరమైన విజ్ఞాన శాస్త్రం.


5. గోత్రం = మీ మానసిక ప్రోగ్రామింగ్


కొంతమంది జన్మతః తత్త్వవేత్తలు. కొంతమందికి ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ. కొంతమంది సహజంగా ధైర్యవంతులు. ఇదంతా ఎందుకు?


మీ గోత్ర ఋషి యొక్క మానసిక ఫ్రీక్వెన్సీ ఇంకా మీలో పనిచేస్తోంది. ఋషి యోధుడైతే, మీలో ధైర్యం ఉంటుంది. ఔషధ ఋషి అయితే, ఆయుర్వేదం అంటే మక్కువ ఉంటుంది...


6. విద్యను కూడా గోత్రాన్ని బట్టి తీసుకునే వారు


ప్రాచీన గురుకులాల్లో విద్యార్ధికి మొదటి ప్రశ్నే: "బేటా, నీ గోత్రం ఏంటి?"


ఎందుకంటే అది విద్యార్ధి నేర్చుకునే శైలిని, ఇతని బలాల్ని తెలిపేది. అత్రి గోత్రం వారు ధ్యానం, మంత్రాల్లో శ్రేష్ఠత పొందేవారు. కశ్యప గోత్రం వారు ఔషధ విజ్ఞానంలో.


7. బ్రిటిష్ తక్కువగా చూశారు. బాలీవుడ్ నవ్వించింది. మనం మర్చిపోయాం.


బ్రిటిష్‌లు వచ్చాక గోత్రం వ్యవస్థను అర్థం చేయక పోయారు. దాన్ని మూఢనమ్మకం అని పేర్కొన్నారు. బాలీవుడ్ దాన్ని సరదాగా తీసుకుంది. ఇలా మనం పిల్లలకు చెప్పడం మానేశాం. 10,000 సంవత్సరాల వ్యవస్థ 100 ఏళ్లలో కరిగిపోతుంది.


8. మీ గోత్రం తెలియకపోతే – మీరు ఆత్మిక మ్యాప్‌ను కోల్పోతారు


ఇది మీ ఆధ్యాత్మిక GPS.

– సరైన మంత్రం

– సరైన పూజా విధానం

– సరైన ధ్యానం

– సరైన వివాహం

– సరైన ఆధ్యాత్మిక మార్గం


ఇవి అన్నీ గోత్రం ఆధారంగా తెలుసుకోవచ్చును.


9. పూజలో గోత్రం చెబుతారు అంటే – అది ఒక శక్తివంతమైన కాల్.


పూజ ప్రారంభంలో “సంకల్పం”లో మీ గోత్రాన్ని చెప్పడం వల్ల మీ ఋషి యొక్క ఆత్మశక్తి పూజలో చేరుతుంది.

అదే వాక్యం: “భరద్వాజ గోత్రాన్విత శ్రీనివాసుడిగా నేను ఈ పూజను శ్రద్ధతో చేయుచున్నాను.”


10. ఆలస్యం కాకమునుపే మీ గోత్రాన్ని పునరుద్ధరించండి


– తల్లిదండ్రులను అడగండి

– తాతమామల వద్ద తెలుసుకోండి

– రీసెర్చ్ చేయండి

– మీ పిల్లలకు చెప్పండి

– గర్వంగా ఉంచండి


మీరు పుట్టింది 1990లో కావచ్చు. కానీ మీలో ప్రవహిస్తున్న జ్ఞానం కృతయుగం నాటి ఋషులది.


11. గోత్రం = మీ ఆత్మకు పాస్‌వర్డ్


మనం Wi-Fi పాస్‌వర్డ్లు గుర్తుపెట్టుకుంటాం. కానీ మన ఆత్మ పాస్‌వర్డ్ అయిన గోత్రాన్ని మర్చిపోతాం


మీ మనశ్శక్తి, కర్మ, జ్ఞానం – ఇవన్నీ గోత్రంతో అనుసంధానంగా ఉంటాయి.


12. వివాహం తర్వాత స్త్రీలు గోత్రం మారతారా?


లేదు. గోత్రం Y-క్రోమోసోమ్ ద్వారా వస్తుంది – అంటే పురుషుల ద్వారా. స్త్రీలు తమ తండ్రి గోత్రాన్నే శ్రాద్ధాదుల్లో ఉంచుతారు.


అందుకే, స్త్రీ గోత్రం మారదు – అది ఆమెలో శాశ్వతంగా ఉంటుంది.


13. దేవతలు కూడా గోత్ర నియమాలను అనుసరించారు


రాముడి వివాహం సమయంలో:

– రాముడు: ఇక్ష్వాకు వంశం, వశిష్ఠ గోత్రం

– సీత: జనకుని కూతురు, కశ్యప గోత్రం


ఇంత పవిత్రమైనది గోత్ర వ్యవస్థ.


14. గోత్రం మరియు ప్రారబ్ధ కర్మ


కొంతమంది పిల్లలు చిన్ననాటి నుంచే ప్రత్యేకమైన అలవాట్లు కలిగి ఉంటారు. ఇది వారి ప్రారబ్ధ కర్మ మరియు గోత్రం వల్ల.


ఋషులు తమకు ప్రత్యేకమైన కర్మ బీజాలు కలిగి ఉన్నారు – మీలోనూ అలాంటి ప్రభావాలు ఉంటాయి.


15. ప్రతి గోత్రానికి ప్రత్యేక మంత్రాలు, దైవాలు ఉంటాయి.


మీ గోత్రానికి సరిపోయే మంత్రాన్ని ఉపయోగించకపోతే, ఫలితం తక్కువగా ఉంటుంది.


సరైన మంత్రం + మీ గోత్ర శక్తి = 10x శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవం.


16. గోత్రం = గందరగోళంలో ఉన్నపుడు ఆత్మదీపం


మీరు దారి తప్పినట్టు అనిపిస్తే, మీ గోత్రం ఋషిపై ధ్యానం చేయండి. ఆ ఋషి ఏ ఆలోచనల్లో జీవించాడో, అదే శక్తి మీలో ఉంది.


17. గొప్ప రాజులు గోత్రాన్ని గౌరవించేవారు


చంద్రగుప్త మౌర్యుడు నుండి శివాజీ మహారాజ్ వరకు


రాజకార్యాలలో కూడా గోత్ర జ్ఞానం ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారు.


గోత్రం లేని పాలన అంటే – రీడులేని శరీరం లాంటిది.


18. గోత్ర వ్యవస్థ = స్త్రీ రక్షణ విధానం


పురాతన కాలంలో – గోత్రం ఆధారంగా స్త్రీలను వారి వంశానికి తిరిగి గుర్తించగలిగేవారు.


దీన్ని మూఢనమ్మకం అనడం కాదు – ఇది ఒక జ్ఞాన శాస్త్రం.


19. ప్రతి గోత్రం = విశ్వంలో ప్రత్యేక పాత్ర


ఋషులు తమ తమ విధులను నిర్వర్తించేవారు:

– ఆరోగ్యాన్ని రక్షించడం

– నక్షత్రాలను పరిశీలించడం

– ధర్మాన్ని స్థాపించడం

– న్యాయాన్ని నిర్మించడం


మీ గోత్రం ఈ పాత్రలలో ఒకదానిని కలిగి ఉంటుంది.


20. ఇది మతం కాదు – ఇది మీ అసలైన గుర్తింపు


మీరు మతసంబంధమైనవారు కాకపోయినా, ఆధ్యాత్మికతను అనుసరించకపోయినా – గోత్రం మీ ఆత్మ సంబంధిత గుర్తింపు.


మీరు నమ్మాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోవాలి.


చివరి మాటలు:

మీ పేరు ఆధునికం కావచ్చు. మీ జీవితం గ్లోబల్ కావచ్చు. కానీ మీ గోత్రం – శాశ్వతం.


మీరు దీన్ని పట్టించుకోకపోతే – మీకు సొంతంగా మీరు ఎవరో తెలియని నదిలా అవుతారు.


గోత్రం అనేది మీ గతం కాదు. అది భవిష్యత్తులో జ్ఞానాన్ని తెరవే పాస్‌వర్డ్...

.

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర: సనాతన ధర్మం యొక్క నాలుగు దిక్కులు, ఒకే తేజస్సు (సమగ్రమైన వ్యాసం - ఐక్యత యొక్క శక్తిని చాటేది, భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలిపేది)"ధర్మం యొక్క సారాంశం సమ్మేళనం, విచ్ఛేదనం కాదు." వేల సంవత్సరాల ప్రస్థానం కలిగిన సనాతన ధర్మం కేవలం జీవన విధానాన్ని నేర్పడమే కాకుండా, ఆత్మలను అనుసంధానించే అద్భుతమైన మార్గాన్ని చూపింది. వర్ణ వ్యవస్థ యొక్క అంతరార్థాన్ని లోతుగా పరిశీలిస్తే - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కేవలం కులాలు కావు, అది సమాజంలోని విభిన్న కర్తవ్యాల యొక్క సుందరమైన అమరిక. ఇది పుట్టుకతో వచ్చినది కాదు, కర్మలతో, స్వభావంతో ముడిపడిన వ్యవస్థ. నలుగురు వర్ణాలు - -ఒకే దేహంలోని భిన్న భాగాలు ఈ నాలుగు వర్ణాలను మన పురాణాలు ఒకే విరాట్ పురుషుని (సమస్త సృష్టికి అధిపతి) శరీరంలోని విభిన్న భాగాలతో పోల్చాయి.


బ్రాహ్మణుడు: విరాట్ పురుషుని ముఖం వంటివాడు - జ్ఞానాన్ని ప్రసరించే మెదడు, వివేకంతో మార్గనిర్దేశం చేసేవాడు. సమాజానికి విద్యాదానం చేసేవారు, ధర్మశాస్త్రాలు బోధించేవారు.


క్షత్రియుడు: విరాట్ పురుషుని భుజాల వంటివాడు - ధర్మాన్ని రక్షించేవి, నీతిని కాపాడే ధీరులు. వీరు సమాజాన్ని దుష్టశక్తుల నుండి రక్షిస్తారు, న్యాయాన్ని పరిపాలిస్తారు.


వైశ్యుడు: విరాట్ పురుషుని ఉదరం వంటివాడు - సమృద్ధిని పెంపొందించేది, వ్యాపారంతో అభివృద్ధిని చేకూర్చేవారు. వీరు సంపదను సృష్టించి, సమాజ శ్రేయస్సు కోసం పంపిణీ చేస్తారు.


శూద్రుడు: విరాట్ పురుషుని పాదాల వంటివాడు - సేవతో అందరినీ నిలిపేవి, శ్రమతో సమాజానికి ఆధారమిచ్చేది. వీరు సమాజానికి అవసరమైన సేవలను అందిస్తూ, అందరికీ అండగా నిలుస్తారు. తల లేకుండా శరీరం నిలువగలదా?భుజాలు లేకుండా శక్తి ఉంటుందా? ఉదరం నిండకుండా జీవం ఉంటుందా? పాదాలు లేకుండా గమ్యం చేరుకోగలమా? లేదు కదా!అదే విధంగా, సనాతన ధర్మంలోని ఈ వర్ణ వ్యవస్థ పరస్పర సహకారం మరియు అవసరాల యొక్క గొప్ప సమన్వయాన్ని తెలుపుతుంది, అంతేకానీ ఇది శ్రేష్ఠతను చూపించే విభజన కాదు. ప్రతి వర్ణం సమాజానికి అత్యవసరం. విద్వేష బీజాలు ఎక్కడ నుండి వచ్చాయి? నేడు సనాతన ధర్మాన్ని వేరు చేసేదిగా చిత్రీకరించేవారు, దాని యొక్క లోతైన అర్థాన్ని గ్రహించలేకపోయారు లేదా స్వార్థపూరిత రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. కొందరు తమను అంబేద్కర్ అనుచరులుగా చెప్పుకుంటూ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు, మరికొందరు మత దురభిమానాన్ని పెంచి పోషిస్తున్నారు. వీరందరూ కలిసి సనాతన ధర్మాన్ని అపఖ్యాతిపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భీమ్‌రావ్ అంబేద్కర్ స్వయంగా రామాయణాన్ని అధ్యయనం చేశారని, భగవద్గీత యొక్క సారాంశాన్ని గ్రహించారని, అందుకే ఆయన ఇస్లాం లేదా క్రైస్తవాన్ని కాకుండా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారని వారు ఎప్పటికీ చెప్పరు. ఆయన సామాజిక న్యాయం కోసం పోరాడారు, కానీ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలని కోరుకోలేదు. ఐక్యతే సనాతన ధర్మం యొక్క జీవనాడి సనాతన ధర్మం ఎల్లప్పుడూ ఐక్యత, ప్రేమ, మరియు సమానత్వాన్ని బోధించింది. మన ఇతిహాసాలు, పురాణాలు దీనికి ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు.


శ్రీరాముడు ఒక శూద్ర మహిళ అయిన శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను ప్రేమతో స్వీకరించాడు - ఇది కేవలం పండ్లు తినడం కాదు, అది కుల భేదాలను తుడిచిపెట్టే ప్రేమ బంధం. భక్తికి, ప్రేమకు కులం, వర్ణం అడ్డు కాదని నిరూపించాడు.


శ్రీకృష్ణుడు, అప్పటి సమాజంలో తక్కువ కులంగా భావించబడిన విదురుని ఇంట్లో ఆనందంగా భోజనం చేశాడు - "న హి వై శూద్ర రాజానం, నైవ వైశ్యం న శూద్రకం" (మహాభారతం) అని చెప్పి, హృదయం శుద్ధంగా ఉంటే ఏ కులమైనా గొప్పదే అని చాటాడు.

మహాభారతంలో విదురుడు ధర్మజ్ఞానానికి ప్రతీకగా నిలిచాడు. ఆయన ధృతరాష్ట్రునికి, పాండవులకు ఇచ్చిన ఉపదేశాలు అద్భుతమైనవి. ఇది పుట్టుకతో కాక, జ్ఞానంతోనే గౌరవం వస్తుందని నిరూపిస్తుంది.


శబరి, గుహుడు వంటి భక్తులను శ్రీరాముడు ఆదరించడం, హనుమంతుడు వంటి వానరుడిని తన అత్యంత ప్రియమైన భక్తునిగా స్వీకరించడం - ఇవన్నీ సనాతన ధర్మంలో మానవత్వం, భక్తి, మరియు సేవలకే ప్రాధాన్యత ఇస్తారని చూపుతాయి.


ఛత్రపతి శివాజీ మహారాజ్ తన రాజ్యంలో బ్రాహ్మణులు, మరాఠాలు, ముస్లింలు మరియు శూద్రులను సమానంగా ఆదరించాడు - సమైక్య పాలనకు ఆదర్శంగా నిలిచాడు. ఆయన సైన్యంలో అన్ని వర్గాల వారికి స్థానం కల్పించారు, వారి సామర్థ్యాలనే పరిగణనలోకి తీసుకున్నారు.


సంత రవిదాస్ (శూద్రుడు), కబీర్ (ముస్లిం నేత), తులసిదాస్ (బ్రాహ్మణుడు), నామ్‌దేవ్ (తెరజిప్ప) , మీరాబాయి (రాజపుత్ర స్త్రీ) వంటి ఎందరో మహానుభావులు "జాతి పాతి పూచే నహి కోయి" (కులమత భేదాలు అడగరు) అని గొంతెత్తి చాటారు - భక్తి మార్గంలో అందరూ ఒక్కటే అని నిరూపించారు. వారి భక్తి ఉద్యమాలు కులాల సరిహద్దులను చెరిపివేశాయి.


ఋషి విశ్వామిత్రుడు ఒక క్షత్రియుడై ఉండి కూడా తన తపస్సు ద్వారా బ్రహ్మజ్ఞానిగా మారాడు. ఇది వర్ణం కర్మను బట్టి మారుతుందని, పుట్టుకను బట్టి కాదని తెలియజేస్తుంది. వాల్మీకి మహర్షి, పుట్టుకతో బోయవాడైనప్పటికీ, తన తపస్సు మరియు జ్ఞానంతో బ్రహ్మఋషిగా మారి, రామాయణం వంటి మహాకావ్యాన్ని రచించాడు. ఇది మానవుని అంతర్గత శక్తికి, పరివర్తనకు గొప్ప ఉదాహరణ. సనాతన ధర్మం యొక్క మహత్తరమైన సూక్తులు: "వసుధైవ కుటుంబకం" - ఈ భూమండలం అంతా ఒకే కుటుంబం. ఇది కేవలం మాట కాదు, మన జీవన విధానానికి మూలం.


 "ఏకం సత్ విప్రాః బహుధా వదంతి" - సత్యం ఒక్కటే, జ్ఞానులు దానిని వివిధ రకాలుగా వివరిస్తారు. ఇది భగవంతుని ఏకత్వాన్ని, మత సామరస్యాన్ని తెలియజేస్తుంది.


"సర్వే జన సుఖినో భవంతు" - అందరూ సుఖంగా ఉండాలి. ఈ భావనే సనాతన ధర్మం యొక్క మూల స్తంభం.


 ముగింపు:

సనాతన ధర్మంలోని నాలుగు వర్ణాలు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్రులు - ఉన్నత లేదా నీచ భావనలను కలిగించే గోడలు కావు, అవి సమాజం యొక్క అభివృద్ధికి నిర్దేశించిన కర్తవ్యాల యొక్క మెట్లు. కాలక్రమేణా వచ్చిన కొన్ని దురాచారాలను సనాతన ధర్మం కాదు, మానవుల స్వార్థం సృష్టించింది. ఈ రోజు మనం ఈ ఐక్యత యొక్క శక్తిని గుర్తించాలి, తప్పుడు ప్రచారం చేసే వారి ఉచ్చు నుండి బయటపడాలి, మరియు గర్వంగా ప్రకటించాలి - "మేము సనాతనులం, మా ధర్మంలో ప్రతి ఒక్కరికీ స్థానం ఉంది!"


మన పూర్వీకులు అందించిన ఈ జ్ఞాన సంపదను కాపాడుకుంటూ, సమైక్య సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేద్దాం...🤗


  హరహర మహా దేవ శంభో శంకరా

┈┉━❀꧁ఓం శివశివా꧂❀━┉┈

         సర్వం శివమయం జగత్

సేకరణ

Tuesday, January 27, 2026

శ్రీశైలం పాదయాత్రకు వెళ్తున్న భక్తులకు కీలక సూచనలు

మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పాదయాత్ర వెళ్ళే భక్తులకు ఫిబ్రవరి నెల 8 నుండి 15 వరకు అడవి మార్గం గుండా వెళ్లడానికి అటవీశాఖ వారు అనుమతులను మంజూరు చేయడమైనది. 

భక్తులు ఈ విషయాన్ని గమనించి అందుకు తగ్గట్టుగా మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకుని మీ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకునీ ఆ శివయ్య ఆశీస్సులను అందుకోగలరని ఆశిస్తున్నాను.

ఈ పాదయాత్ర సందర్భంగా మీరు గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలు: 

1.    ప్లాస్టిక్ వస్తువులు అడవి మార్గంలో నిషేధం 

2.    సిగరెట్ పాన్ గుట్కా తంబాకు మరియు మద్యపానం,లాంటివి పూర్తిగా నిషేధం 

ఆలా తాగి నాట్లు కనిపిస్తే  వారికీ పది వేలు నుంచి ముప్పై వేలు జరిమానా కేసులు కటీ జైలుకు కూడా పంపడం అలాంటివి కూడ  జరుగుతాయి.

3.   ఈ పాదయాత్ర ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి వెంకటాపురం నుండి మొదలవుతుంది. కావున భక్తులు తమ వాహనాలను ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి చెక్పోస్ట్ వరకు తీసుకువెళ్లి అక్కడనుండి కాలినడకన బయలుదేర వలసి ఉంటుంది 

4.   అటవీ మార్గంలో నడుస్తున్నప్పుడు మీకు అవసరమైన మందులు ( అనగా ఒళ్ళునొప్పులకు , కీళ్ల నొప్పులకు , తలనొప్పి , కాళ్ళు బెనకటం)  మీతో పాటుగా తీసుకు వెళ్ళగలరు. 

5.  దారినడకలో ఫోన్ సిగ్నల్ ఉండదు. అందుకు తగ్గట్టుగా మీరు సిద్ధంగా ఉండగలరు. డిజిటల్ పేమెంట్స్ పనిచేయవు. కావున తగినంత చిల్లర ( 20, 50, 100 నోట్లు ) మీతో తీసుకువెళ్ళండి.

6.  కాలినడక దారిలో మధ్యలో అన్నప్రసాద వితరణ జరుగుతుంది ( పూర్తి వివరాలకు కింద జతచేయబడిన ఫోటో చూడగలరు ). దప్పిక ఎక్కువగా ఉంటుంది .. కావున తగినన్ని నీళ్లు మీ వెంట తీసుకెళ్లండి.మధ్యలో నీళ్లు అమ్ముతుంటారు. మీ బాటిల్స్ లో వాటిని నింపుకోవచ్చు.

7.  వైద్య సౌకర్యాలు నియమించబడిన ప్రదేశాలలో అందుబాటులో ఉంటాయి. ఇవి పూర్తిగా ఉచితం.

8.   మీరు వేర్వేరు భూభాగాల ( కొండలు , లోయలు ) గుండా నడుస్తారు. ఇందుకు మీ శరీరం మీకు పూర్తిగా మద్దతు ఇవ్వాలి. అలా నడవలేని వారు దయచేసి ప్రయత్నించకండి. 

9.   టాయిలెట్లు నిర్దేశించబడిన ప్రదేశాలలో అందుబాటులో ఉంటాయి. గమనించగలరు.

10.   విశ్రాంతి కోసం పెద్ద చెరువు దగ్గర ఆగాల్సి ఉంటుంది. అక్కడ పట్టాలు బాడుగకు దొరుకుతాయి. వాటిమీద నిద్రించాల్సి ఉంటుంది.

11.   మీరు శ్రీశైలం వరకు నడిచి వెళ్ళాటానికి, మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.

12.   ఈ ప్రయాణంలో మీవెంట ఆ శివయ్య ఉంటాడని మరచిపోకండి. ఆయన ఆశీస్సులు మనపైన ఎప్పుడూ ఉంటాయి.

ఓం నమః శివాయ

అహోబల క్షేత్రములో నవనారసింహమై తొమ్మిదిమంది నరసింహులుగా ఉన్నాడు

1. జ్వాలానరసింహుడు -- ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపము. మొదటగా వచ్చిన తేజో స్వరూపము. హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న స్వరూపములో ఉంటాడు.

2. అహోబలనరసింహస్వరూపము -- హిరణ్యకశిపుని సంహరించిన తరవాత కూర్చున్న స్వరూపము.

3. మాలోల నరసింహుడు -- లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వస్తే ఆమెని స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చో పెట్టుకున్న స్వరూపము.

4. కరంజ నరసింహుడు అని నాలగవ నరసింహుడు. ఆయన చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉంటాడు.

5. పావన నరసింహుడు -- ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారము చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు. మంగళములను ఇస్తాడు. అందుకని ఆయనని పావన నరసింహుడు అనిపిలుస్తారు.

6. యోగ నరసింహుడు అంటారు. అయ్యప్పస్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్టముకట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు అని చెపుతారు.

7. చత్రవట నరసింహస్వరుపము అంటారు. పెద్ద రావి చెట్టుకింద వీరాసనము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి హూ హ, హా హా అని ఇద్దరు గంధర్వులు శాపవిమోచనము కొరకు నరసింహస్వామి వద్దకి వచ్చి పాటలు పాడి నృత్యము చేసారు. ఆయన తొడమీద చెయ్యి వేసుకుని తాళము వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్న స్వరూపమును చత్రవట నరసింహస్వరూపము అంటారు అక్కడకు వెళ్ళి కొంతమంది పెద్దలు సంగీతము పాడుతుంటారు.

8. భార్గవ నరసింహుడు పరశురాముడు నరసింహ దర్శనము చెయ్యాలని కోరుకుంటే అనుగ్రహించి దర్శనము ఇచ్చిన స్వరూపము

9. వరాహ నరసింహస్వరూపము భూమిని తన దంష్ట్రమీద పెట్టుకుని పైకి ఎత్తినటువంటి స్వరూపము ఆదివరాహస్వామి పక్కన వెలసిన నరసింహస్వరూపము మొదటగా వచ్చిన యజ్ఞ వరాహస్వరూపము, నరసింహ స్వరూపము రెండు ఉంటాయి వరాహ నరసింహము. తొమ్మిది నరసింహస్వరూపములు అహోబలక్షేత్రములో ఉంటాయి

Tuesday, January 20, 2026

తొమ్మిదిమంది నరసింహులు

 అహోబల క్షేత్రములో నవనారసింహమై తొమ్మిదిమంది నరసింహులుగా ఉన్నాడు.


1. జ్వాలానరసింహుడు -- ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపము. మొదటగా వచ్చిన తేజో స్వరూపము. హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న స్వరూపములో ఉంటాడు.


2. అహోబలనరసింహస్వరూపము -- హిరణ్యకశిపుని సంహరించిన తరవాత కూర్చున్న స్వరూపము.


3. మాలోల నరసింహుడు -- లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వస్తే ఆమెని స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చో పెట్టుకున్న స్వరూపము.

4. కరంజ నరసింహుడు అని నాలగవ నరసింహుడు. ఆయన చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉంటాడు.


5. పావన నరసింహుడు -- ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారము చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు. మంగళములను ఇస్తాడు. అందుకని ఆయనని పావన నరసింహుడు అనిపిలుస్తారు.


6. యోగ నరసింహుడు అంటారు. అయ్యప్పస్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్టముకట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు అని చెపుతారు.


7. చత్రవట నరసింహస్వరుపము అంటారు. పెద్ద రావి చెట్టుకింద వీరాసనము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి హూ హ, హా హా అని ఇద్దరు గంధర్వులు శాపవిమోచనము కొరకు నరసింహస్వామి వద్దకి వచ్చి పాటలు పాడి నృత్యము చేసారు. ఆయన తొడమీద చెయ్యి వేసుకుని తాళము వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్న స్వరూపమును చత్రవట నరసింహస్వరూపము అంటారు అక్కడకు వెళ్ళి కొంతమంది పెద్దలు సంగీతము పాడుతుంటారు.


8. భార్గవ నరసింహుడు పరశురాముడు నరసింహ దర్శనము చెయ్యాలని కోరుకుంటే అనుగ్రహించి దర్శనము ఇచ్చిన స్వరూపము


9. వరాహ నరసింహస్వరూపము భూమిని తన దంష్ట్రమీద పెట్టుకుని పైకి ఎత్తినటువంటి స్వరూపము ఆదివరాహస్వామి పక్కన వెలసిన నరసింహస్వరూపము మొదటగా వచ్చిన యజ్ఞ వరాహస్వరూపము, నరసింహ స్వరూపము రెండు ఉంటాయి వరాహ నరసింహము. తొమ్మిది నరసింహస్వరూపములు అహోబలక్షేత్రములో ఉంటాయి

Wednesday, January 14, 2026

ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతి

ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతి గా వుండటం జరుగుతుంది. అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు..వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి.

తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురించి..

పాడ్యమి..

అధిదేవత – అగ్ని. 

వ్రత ఫలం – సత్ఫల ప్రాప్తి.

విదియ :- 

అధిదేవత – అశ్విని దేవతలు. 

వ్రత ఫలం – ఆరోగ్య వృద్ది.

తదియ :- 

అధిదేవత – గౌరీ దేవి. 

వ్రత ఫలం – సుమంగళీ అనుగ్రహం.

చవితి:- 

అధిదేవత – వినాయకుడు. 

వ్రత ఫలం – కష్టములు తొలగిపోవుట.

పంచమి:- 

అధిదేవత – నాగ దేవత. 

వ్రత ఫలం – వివాహము, వంశ వృద్ది.

షష్టి :- 

అధిదేవత – సుబ్రహ్మణ్య స్వామి. 

వ్రత ఫలం – పుత్ర ప్రాప్తి.

సప్తమి:- 

అధిదేవత – సూర్య భగవానుడు. 

వ్రత ఫలం – ఆయురారోగ్య వృద్ది.

అష్టమి:- 

అధిదేవత – అష్టమాత్రుకలు. 

వ్రత ఫలం – దుర్గతి నాశనము.

నవమి:- 

అధిదేవత – దుర్గాదేవి. 

వ్రత ఫలం – సంపద ప్రాప్తిస్తుంది.

దశమి:- 

అధిదేవత – ఇంద్రాది దశ దిక్పాలకులు. 

వ్రత ఫలం – పాపాలు నశిస్తాయి.

ఏకాదశి:- 

అధిదేవత – కుబేరుడు. 

వ్రత ఫలం – ఐశ్వర్యము ప్రాప్తించును.

ద్వాదశి:- 

అధిదేవత – విష్ణువు. 

వ్రత ఫలం – పుణ్య ఫల ప్రాప్తించును.

త్రయోదశి:- 

అధిదేవత – ధర్ముడు. 

వ్రత ఫలం – మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.

చతుర్దశి:- 

అధిదేవత – రుద్ర. 

వ్రత ఫలం – మృత్యుంజయము, శుభప్రదం.

అమావాస్య:- 

అధిదేవతలు – పితృదేవతలు. 

వ్రత ఫలం – సంతాన సౌఖ్యం.

పౌర్ణమి:- 

అధిదేవత – చంద్రుడు. 

వ్రత ఫలం – ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.

Sunday, January 11, 2026

ప్రశ్నలు - సమాధానాలు

- ఆండాళ్ అని ఎవరికి పేరు?

= గోదాదేవి.


- తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?

= సుప్రభాతం బదులుగా.


- ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?

= భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే మంచిరోజు.


- గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?

= శ్రీ విష్ణుచిత్తులు.


- ఆళ్వారులు ఎంతమంది?

= 12మంది.


- గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?

= భూదేవి.


- గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?

= తమిళభాష.


- తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?

= నాలాయిర్ దివ్యప్రబంధము.


- శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?

= 108.


- గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?

= శ్రీవిల్లి పుత్తూరు.


- దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?

= దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.


- శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?

= 196 అడుగులు.


- ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?

= మూడవ పాశురం.


- శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?

= తిరుసాదము.


- శ్రీవిష్ణుచిత్తులు వారు తానకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?

= కోదై (గోదా)


- పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?

= గరుడాంశము.


- తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?

= శ్రీవ్రతము.


- మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?

= పరమాత్మ చేతిలోని శంఖమువలే.


- శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?

= మన్మధుని


- తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?

= సింహం పిల్లవలె.


- తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?

= ధృడమైన కోరిక, పట్టుదల.


- కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?

= మొదటి పాశురం.


- శ్రీకృష్ణుడు యశోద గర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?

= దేవకీ పుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)


- ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?

= రెండవ పాశురం.


- తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?

= వామన అవతారం.


- ఆళ్వార్లకు మరో పేరేమిటి?

= వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.


- నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?

= మూడు.


- మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?

= పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.


- శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమటి?

= ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).


- ‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్న నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?

= యమునా నది.


- మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?

= దానగుణం.


- లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?

= వర్షానికి.


- పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?

= పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.


- విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?

= ఐదవ పాశురం.


- విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= నమ్మళ్వారు.


- తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= బుద్ధివ్రతం.


- గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?

= పిళ్ళాయ్ (పిల్లా).


- తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?

= ఆళ్వార్లతో.


- గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?

= పూదత్తాళ్వారు.


- తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?

= శ్రీ పెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.


- కీచుకీచుమని అరిచే ఏ పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?

= భరద్వాజ (చాతక) పక్షులు.


- తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?

= కులశేఖరాళ్వార్.


- సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?

= విష్ణుపోతము (విష్ణువనే ఓడ)


- పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?

= ఆయన దాసులే గొప్ప.


- ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?

= ఎన్ని జన్మలకైనా అని అర్థము.


- ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?

= అయోధ్య.


- వజ్గం అంటే ఏమిటి?

= ఓడ.


- ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?

= అమృత కలశం.


- ముప్పయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?

= తిజ్గళ్ తిరుముగత్తు- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.


- గోపికల దివ్యాభరణములేవి?

= కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.


- శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?

= అణి పుదువై- ఈ జగత్తుకే మణివంటిది.


- శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?

= పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.


- గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?

= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).


- తిరుప్పావై ఎటువంటి మాల?

= ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.


- శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?

= గోదాదేవి.


- శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?

= గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.


- భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= తొండరపడిప్పొడి యాళ్వార్....స్వస్తి...


ఆండాళ్ తిరువడిగలే శరణం ...జై శ్రీమన్నారాయణ....