నారాయణం పరబ్రహ్మం సర్వ కారణకారణం |
ప్రపద్యే వేంకటేశాఖ్యాం తదేవ కవచం మమ ||
సహస్ర శ్రీర్షా పురుషో వేంకటేశ శ్శిరోవతు|
ప్రాణేశః ప్రాణ నిలయః ప్రాణం రక్షతు మే హరిః ||
ఆకాశరాట్ సుతానాధ ఆత్మానం మే సదా (అ)వతు |
దేవ దేవోత్తమః పాయాద్ దేహం మే వేంకటేశ్వరః ||
సర్వత్ర సర్వ కాలేషు మాంగాంబాజా నిరీశ్వరః |
పాలయే న్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు ||
ఫలశృతి: 💐
య యేతత్ వజ్రకవచ మభేద్యం వేంకటేశశితుః |
సాయం ప్రాతః పఠే న్నిత్యం మృత్యుం తరతి నిర్భయః!!
మృత్యుం తరతి నిర్భయః
మృత్యుం తరతి నిర్భయః
||ఇతి శ్రీ మార్కండేయ కృత వేంకటేశ్వర వజ్రకవచం సంపూర్ణమ్!!
🪷┈┉┅━❀🌀❀┉┅━🪷
"వేంకట వజ్ర కవచస్తోత్రం" మార్కండేయ మహర్షి చెప్పిందని ప్రసిద్ధి.
ఈ స్తోత్రంలో నాల్గు శ్లోకాలు 'నన్ను రక్షించు గాక ' అని అర్ధం వచ్చేవి.
చివరి ఒక్కశ్లోకం "ఫలశృతి" రూపమైనది.
మొత్తం ఐదు శ్లోకాలు.
భావం : 💐
1. శ్రీ వేంకటేశ్వరుడు - సాక్షాన్నారాయణుడు. పరబ్రహ్మ, సర్వకారణాలకూ కారణము తానే అయినవాడు. కనుక అట్టి శ్రీవేంకటేశ్వరుణ్ణి నేను శరణు పొందుతున్నాను. శ్రీవేంకటేశ్వరుని పేరే (ఆ స్వామిని స్మరించుటే) నాకు భద్రకవచమై రక్షించుగాక !
2. వేయి తలలు - అంటే అనంతమైన శిరసులు కల పరమాత్ముడైన వేంకటేశుడు నా శిరస్సును రక్షించుగాక! సకల ప్రాణుల ప్రాణాలకు ప్రభువూ, అందరి ప్రాణాలకు నిలయుడూ అయిన ఆ శ్రీహరి నా ప్రాణాన్ని రక్షించుగాక !
3. ఆకాశరాజుకూతురు పత్మావతికి భర్త అయిన వేకటేశుడు నా ఆత్మను (నన్ను) సదా కాపాడుగాక ! దేవదేవోత్తముడైన వేంకటేశ్వరుడు ఈ నా దేహాన్ని కాపాడుగాక !
4. అలమేలుమంగమ్మపతి అన్నిటికీ ప్రభువూ అయిన వేంకటేశ్వరుడు అన్ని చోట్లా, అన్ని కాలాలలో నా సత్కర్మల నన్నింటిని రక్షించి వాటిని సఫలం చేయుగాక !
ఫలశృతి భావం: 🕉️
ఈ వేంకటేశ్వరవజ్రకవచ స్తోత్రం అభేద్యమైనది. ఉదయం, సాయంకాలం ప్రతిదినమూ భక్తితో పఠించేవాళ్ళు మృత్యుభయం లేకుండా ఆనందంగా ఉంటారు.
లఘు వివరణ: 💐
కవచమంటే శరీరాన్ని రక్షించే సాధనం. అది వజ్రంతో తయారయిందంటే ఇక దేనిచేతనూ దెబ్బతినకుండా కాపాడుతుంది. ఈ వేంకటేశ్వర వజ్రకవచస్తోత్రం భక్తులపాలిటికి వజ్రకవచమై వాళ్ళను కాపాడుతుంది.
శ్రీస్వామివారిని శరణు పొంది, ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో, శ్రద్ధతో పఠించే వాళ్ళు అన్ని ఆపదలనుండీ, శారీరకంగానూ, మానసికంగానూ రక్షింపబడతారు. మృత్యుభయం లేకుండా హాయిగా వుంటారు (మృత్యువు కంటే మృత్యు భయం గొప్పది).
🙏 ,సర్వం శ్రీ వేంకటేశ్వారార్పణమస్తు! 💐
🙏 ఆ ఏడుకొండలవాడు, ఆపదమోక్కులవాడి కరుణ కటాక్షములు మీ మీద ఉండాలని కోరుతూ.....
🙏 ||ఓం నమో వేంకటేశాయ|| 🙏
❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
No comments:
Post a Comment