🙏 నవగ్రహస్తోత్రం 🙏
ఆదిత్యాయ చ సోమాయ
మంగళాయ బుధాయ చ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః!!
꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂
🕉️ 01. రవి (ఆదిత్య): 🙏
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్!
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్!!
భావము: 🌹
దాసనచెట్టుపువ్వు రంగుతో సమానమైన ఎరుపు రంగు కలవాడు, కాశ్యప వంశంలో జన్మించినవాడు, గొప్ప కాంతి కలవాడు, చీకటికి శత్రువు, అన్ని పాపములను పోగొట్టేవాడు అయిన సూర్యభగవానునికి నమస్కరించుచున్నాను.
꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂
🕉️ 02. చంద్ర (సోమ): 🙏
దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవమ్!
నమామి శశినం సోమం శంభోర్-మకుట భూషణమ్!!
భావము: 🌹
పెరుగు, శంఖము, మంచు మొదలైనవాటి తెలుపురంగుతో సమానమైన తెలుపురంగు కలవాడు, పాలసముద్రం నుండి పుట్టినవాడు, శివుని యొక్క కిరీటము నందు అలంకారమైనవాడు, కుందేలు గుర్తుగా కల్గినవాడు, ఉమతో కూడిన శివుని యొక్క మూర్తులలో ఒకడైన (స+ ఉమ=సోమ) సోమునికి నమస్కరించుచున్నాను.
విశేషము: 🌈
చంద్రమా మనసో జాతః...
భగవంతుని మనస్సు చంద్రుడు.. .
శ్రద్ధతో ఈ శ్లోకం చదవటం ద్వారా మనస్సుకు బలం కలుగుతుంది.
꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂
🕉️ 03. కుజ (మంగళ): 🙏
ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్!
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్!!
భావము: 🌹
భూమికి జన్మించినవాడు, మెఱుపు వంటి కాంతి కలవాడు, బాలుడు, శక్తి అనే ఆయుధం హస్తము నందు కలవాడు, శుభములను, క్షేమమును ప్రసాదించే అంగారకుని (కుజుని) కి నమస్కరించుచున్నాను.
విశేషాలు: 🌈
1. శక్తి హస్తమందు కలవాడు.
(1. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి,
2. ఉత్సాహము, ప్రభుత్వము, మంత్రము
3. సత్వము, రజస్సు, తమస్సు
అను శక్తులను తన అధీనమందు కలిగినవాడని తాత్పర్యం.)
2. భూమికి జన్మించినవాడు
మంగళవారానికి అధిపతి అయిన కుజుడు భూమి కుమారుడు. ఏ కొడుకైనా తన తల్లిని బాధ పెట్టాలని భావించడు. అందుకే మంగళవారం నాడు భూమిని తవ్వకూడదు అన్నారు పెద్దలు.
꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂
🕉️ 04. బుధ: 🙏
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్!
సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్.
భావము: 🌹
ప్రేంకణపు చెట్డు అనగా కదంబవృక్షపు మొగ్గ వలె ఆకుపచ్చని రంగు కలిగినవాడు, తన ఆకారములో ఎవరితోనూ సాటిలేని వాడు, సోముడు దేవతగా కలవాడు, సత్వగుణముతో కూడినవాడూ అయిన బుధునికి నేను నమస్కరింతును.
విశేషం: 🌈
✅👉 బుద్ధికి సంబంధించిన ప్రతిబంధకాలను ఈ బుధ స్తోత్రం తొలగిస్తుంది.
꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂
🕉️ 05. గురు: 🙏
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్ |
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||
భావము: 🌹
క్రీడించేవారిని దేవతలంటారు. అటువంటి దేవతలకు; జ్ఞానము యొక్క సారము పొందినవారు ఋషులు. అటువంటి ఋషులకి ; సర్వార్ధములు చెప్పే గురువుకి;
ప్రకాశించేది కాంచనం. అటువంటి బంగారముతో సమానమైన కాంతి కలవానికి; దేనిచేత తెలియబడుతుందో అది బుద్ధి. అటువంటి బుద్ధి కలవారిలో శ్రేష్ఠునికి; మూడు లోకములకు ప్రభువైన; దేవతలు వేదమంత్రములను బృహత్తులు అంటారు. వాటికి ప్రభువు బృహస్పతికి; నమస్కరించుచున్నాను.
విశేషాలు: 🌈
1. ఇందులోని త్రిలోకేశ పదం - జాగ్రత్, స్వప్న సుషుప్తావస్థలను సూచిస్తుంది. ఈ మూడు దశలలోను బుద్దిని సరిగా ఉంచుటకు గురు గ్రహ ప్రార్ధన ఉపయోగపడుతుంది.
꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂
🕉️ 06. శుక్ర: 🙏
హిమ కుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుమ్ |
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||
భావము: 🌹
చల్లని మంచులా, మొల్ల పుష్పము వలె, తామరతూడువలె పోలిక కలిగినవాడు, రాక్షసులకు పరమశ్రేష్ఠుడైన గురువు, అన్ని శాస్త్రములను చక్కగానెరిగినవాడు అయిన శుక్రునికి నేను నమస్కరించుచున్నాను.
విశేషాలు: 🌈
1) ఈ శుక్ర గ్రహ స్తోత్రం బలాన్ని, ఉత్సాహాన్ని కలుగచేస్తుంది.
2) శుక్రమనగా తేజస్సు. అది కలవాడు శుక్రుడు.
꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂
🕉️ 07. శని: 🙏
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం|
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం||
భావము: 🌹
నల్లటి కాటుక రూపంలో ఉండేటటువంటి వాడు, సూర్యభగవానుడి పుత్రుడు, యముడికి సోదరుడు, ఛాయా దేవికి మార్తాండుడికి అంటే సూర్య భగవానుడికి జన్మించిన వాడైనటువంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను.
విశేషములు: 🌈
మనం ఎప్పుడు కూడా శని శని శని అని పిలిచి భయపడక్కర్లేదు. నిజానికి ఆయన నామం శనైశ్చరుడు. ఒక విశేషం గమనించండి. ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఉంటుంది.
ఈశ్వరుడు అనేటటువంటి శబ్దం రావడం చేత ఈ శనైశ్చరుడు కూడా శివుడిలాగా, వేంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు అని శాస్త్రాలు ఖచ్చితంగా చెబుతున్నాయి.
కనుక, ఎటువంటి భయాలకు పోకుండా ముక్కోటి దేవతలలో ఒకరైన శనైశ్చరుడిని త్రికరణ శుద్ధిగా పూజిస్తే అంతా శుభమే. శని అని ఏలినాటి శని అని ఎవరన్నా చెబితే భయపడకండి చక్కగా అతన్ని స్మరించండి చాలు ఆయన అదుపులో వున్న అన్ని సమస్యలనుండి బయటపడేస్తాడు. అంతేకాని జాతకాల పేరిట మోసం చేసావారికి దూరంగా వుండండి.
꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂
🕉️ 08. రాహువు:
అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనమ్ |
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||
భావము: 🌹
సగము శరీరము కలవాడు; మహావీరుడు; చంద్రుడిని సూర్యుడిని కబళించి, విడచువాడు; సింహిక - హిరణ్య కశిపుని చెల్లెలు. ఆమె కొడుకు; అయిన రాహు గ్రహమునకు ; నేను నమస్కరింతును.;
విశేషాలు: 🌈
👉 రాహుగ్రహదశ 18 సంవత్సరాలు.
👉 రాహువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించిన అవయవము చెడిపోవటానికి సహాయం చేస్తాడు. విషాహారం తినుట, పాముకాటు, తేలుకాటు, కుష్ఠు, కాన్సర్ మొదలైన వాటిని కలిగిస్తాడు.
👉 మోహిని అవతారంలో విష్ణు మూర్తి రాహు కేతువుల శిరస్సును చక్రా యుధంతో ఖండించాడు. అప్పటికే గొంతు వరకూ దిగిన అమృతం వలన వారి శిరస్సులు చిరాయువు అయ్యాయి. సగం శరీరం కలవారు అనగా అర్థ కాయులయ్యారు.
꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂
🕉️ 09. కేతు: 🙏
ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్||
భావము: 🌹
మోదుగ పువ్వుతో సమానమైన పోలిక కలవాడు; నక్షత్రాలకు, గ్రహాలకు శిరస్సు వలె ఉండునది; భయంకరమైనది; తీక్షణతతో కూడినది; భయం కలిగించేది అయిన; ఆ కేతుగ్రహమునకు; నేను నమస్కరింతును;
విశేషాలు: 🌈
👉 పుష్పములతో మాంసమును తినుదానివలె ఉండేదానిని సంస్కృతంలో 'పలాశము' అంటారు.
🙏 *సర్వేజనాః సుఖినోభవంతు
🙏🌹🌹🌹🌹🕉️🌹🌹🌹🌹🙏
No comments:
Post a Comment