Friday, November 26, 2021

తిథి అంటే ఏమిటి > అధిష్టాన దేవతలెవరు .

తిథి అంటే వేద సమయగణితము ప్రకారము చంద్రమాసములో ఒక రోజును తిథి అంటారు. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావాస్య , అదే సూర్యచంద్రులు ఒకరకొకరు సమానదూరములో వుంటే పౌర్ణమి అవుతుంది, శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు..  తిథులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు. రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది.  

(1) చాంద్రమాసంలో మొదటి తిథి పాడ్యమి.పాడ్యానికి అధిదేవత అగ్ని.

(2) విధియ > బ్రహ్మ

(3) తదియ > గౌరి

(4) చవితి > వినాయకుడు

(5) పంచమి > నాగరాజు

(6) షష్టి > షణ్ముఖుడు

(7) సప్తమి > సూర్యుడు

(8) అష్టమి > రుద్రుడు

(9) నవమి > దుర్గ

(10) దశమి > ఆదిశేషుడు

(11) ఏకాదశి > యమధర్మరాజు

(12) ద్వాదశి > విష్ణు

(13) త్రయోదసి > కాముడు లేదా శివుడు

(14) చతుర్థశి >  కాళికామాత

(15) పౌర్ణమి > చంద్రుడు

(16) అమావాస్య > లక్ష్మి

ఏదెైనా కార్యం తలపెట్టినపుడు ఆ తిథికి సంబంధించిన అధిష్టానదేవుడిని పూజించాలి. పూజకు వీలుకాకపోతే మనసులో స్మరించాలి.

Wednesday, November 24, 2021

ఆగమం

భగవంతుని చేరుకునేందుకు గల మార్గాలను నిర్దేశించినవి ఆగమాలు. భగవంతుడిని ఎలా అర్చించాలి, ఎలా ప్రతిష్ఠించాలి, ఏడాదిలో జరిగే నిత్యం, నైమిత్తికం, కామ్యం అనే ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, కంకణబట్టర్‌ ఎలాంటి అధ్యయనం చేయాలి, ఉత్సవాలు నిర్వహించే యజమానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాలను ఆగమాలు తెలియజేస్తున్నాయి.

వైష్ణవ ఆగమము లలో రెండు రకాలు ఉన్నాయి.

వైఖానశ మునికి విష్ణువు నుండి వచ్చినది 'వైఖానశ ఆగమము'.

గరుత్మంతునికి అయిదు రాత్రులు విష్ణువు వుపదేశించినదే 'పాంచరాత్ర ఆగమము'.

వైఖానస ఆగమం:

శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను, వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంసను నమ్మకుండా, కేవలం పూజాపునస్కారాల పైనే వైఖానసం నడుస్తుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమైన వైఖానస భగవత్ శాస్త్రమే తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం.

పాంచరాత్ర ఆగమం:

పాంచ అంటే ఐదు, రాత్ర అంటే రోజులు అని అర్థం. భగవంతుడు ఐదు రోజుల పాటు నాగరాజు అయిన అనంతుడు, గరుత్మంతుడు, విష్వక్సేనమూర్తి, చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు అనే ఐదుగురికి ఉపదేశించినవి కావున దీనికి పాంచరాత్రం అనే పేరు వచ్చింది. ఇది మనుషుల అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. లోకంలో ప్రతి జీవి పునరావృత్తి రహిత శ్రీవైకుంఠానికి చేరి శాశ్వతమైన ఆనందం పొందేందుకు పాంచరాత్రం దోహదపడుతుంది. ఈ ఆగమంలో భగవంతుని సేవించేందుకు దివ్యము, ఆర్ఘ్యము, దైవము తదితర 108 పూజా విధానాలున్నాయి. శ్రీ పాద్మ సంహిత, శ్రీ ప్రశ్న సంహిత మొదలైన శాస్త్రాల్లో సూచించిన ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్య, నైమిత్తిక, కామ్యోత్సవాలను జరుపుతున్నారు.

పూజలు

నేడు అత్యధిక దేవాలయాలలో పాంచరాత్ర ఆగమానుసారమే పూజలు నిర్వహించబడుతున్నాయి. కానీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో మాత్రం వైఖానశ ఆగమానుసారం పూజలు నిర్వహించబడుతున్నాయి. మిగతా వైఖానశ ఆగమాలను అనుసరించే దేవాలయాలను పాంచరాత్ర ఆగమ విధానం లోనికి మార్చిన రామానుజాచార్యులవారు తిరుమలలో మాత్రం ఆ సాహసం చేయలేక వైఖానశ ఆగమం లోనే పూజలు చేయాలని కట్టడి చేసారు.

ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము

  1. మత్స్యపురాణం

 2. కూర్మపురాణం

 3. వామన పురాణం

 4. వరాహ పురాణం

 5. గరుడ పురాణం

 6. వాయు పురాణం

 7. నారద పురాణం

 8. స్కాంద పురాణం

 9. విష్ణుపురాణం

 10. భాగవత పురాణం

 11.అగ్నిపురాణం

 12. బ్రహ్మపురాణం

 13. పద్మపురాణం

 14. మార్కండేయ పురాణం

 15. బ్రహ్మవైవర్త పురాణం

 16.లింగపురాణం

 17.బ్రహ్మాండ పురాణం 

 18. భవిష్యపురాణం


ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.

మత్స్యపురాణం 

మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.

కూర్మపురాణం 

కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.

వామన పురాణం 

పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, ఋతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.

వరాహపురాణం 

వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.

గరుడ పురాణం 

గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.

వాయుపురాణం 

వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.

అగ్నిపురాణం 

అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.

స్కందపురాణం

కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.

లింగపురాణం 

లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.

నారద పురాణం 

బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.

పద్మపురాణం 

ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.

విష్ణుపురాణం 

పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.

మార్కండేయ పురాణం 

శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.

బ్రహ్మపురాణం 

బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.

భాగవత పురాణం 

విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.

బ్రహ్మాండ పురాణం 

బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.

భవిష్యపురాణం 

సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.

బ్రహ్మావైపర్తపురాణము

ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, *రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి

Friday, November 19, 2021

Mango leaves

 Mango leaves continue to release oxygen for a couple of days at least, after cutting them. That's why they are used in all festivals and functions to keep the air fresh, specifically when there are many people there.

Reason why our Sanatana Dharma encourages us to tie Mango leaves to our doors....  In this video, a mango leaf is cut in a laboratory and kept under a microscope... The bubbles coming out of leaf is oxygen... Our rishis knew this millennia back and made it a part of our culture.



Thursday, November 18, 2021

బ్రహ్మముహూర్తం

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత *బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, *98-48 నిమిషాల మధ్యకాలం ఇది.

నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ

బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి..?

ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది అని చెబుతారు. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది... 

Tuesday, November 2, 2021

నిత్య పూజ ఎవరు చేయాలి

సాధారణంగా నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేస్తాడు. ఎవరు చేయాలి అంటే యజమాని నిత్యపూజ చేయాలి. 

సంకల్పంలోనే ఉంది ‘ధర్మపత్నీ సమేతస్య’ అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. 

పురుషుడు ప్రతిరోజూ పూజ చేస్తాడు. నైమిత్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా ప్రక్కన కూర్చుంటుంది. 'వినాయక వ్రతం' లాంటిది చేసినప్పుడు. 

వస్త్రధారణా నియమం అన్నప్పుడు - ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ వేసుకుంటుంది, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం. కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం. 

ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది – 

‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ – 

గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదు; అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు; అంటే ఉత్తరీయం ఒక్కటే  ఉండాలి పురుషుడికి. చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండ కూడదు పూజ చేసేటప్పుడు.

దేవాలయంలోనైనా అంతే. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు. నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడు వీడికి, వీడు వాడికి కనపడాలి. ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి. 

ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. 

కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది. అమంగళకరుడు. యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. 

అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. 

ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనుకోండి నీయందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు స్వాగతం చెప్పడానికి ఇంటి బయటికి వచ్చిన ఇంటి యజమాని ఎడమభుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. 

నేను ఎవరి ఇంటికైనా వెళ్ళాను అనుకోండి, ఆయన ఎడమ భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురు వచ్చి స్వాగతం పలికాడు అనుకోండి ఆయన అభ్యున్నతి కొరకు మంచిమాటలు చెప్పవచ్చు. ఆయన అలా రాలేదు అనుకోండి నాపని చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నాకు అయన పెద్దరికం అనడానికి గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి. 

మీరు గమనించండి కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వు భగవంతుడితో సమన్వయము అవుతున్నావు ఆయన చేయి చాపాలి, కాళ్ళు చాపాలి, ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై అయి ఉండాలి. ఉత్తరీయం వేసుకుని ఉండాలి. 

అనుత్తరీయశ్చ, నగ్నశ్చ – వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. ‘అవస్త్రఏవచ’ – మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్నమాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి పూజకు పనికిరాను. గోచీపోసి కట్టే కూర్చోవాలి. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు. దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు. 

అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు. అవతలి వాడు పదికాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు.  అందుకే పీటలమీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజు ఉంటే బయట కుట్టించు.  పీటల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో...  ఆయుఃకారకం నువ్వు ఇచ్చేది. నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి. 

ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు. ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మనవాళ్ళు పంచెల చాపు పెడతారు. పరమ మంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్ట గోచీ పోసుకుని కట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు. శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పూజ దగ్గరికి వెళితే లాల్చీ, బనియను కూడా పనికిరావు. తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచీ పోసి పంచె కట్టుకుని కూర్చుని పూజ చేయాలి.  గోచీ ఎంత బాగా పోయాలి. అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు.

ఒక అంచు తీసి నీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు కచ్ఛ ఉన్నట్లే. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్ర ధారణయందు అటువంటి నియమము ఉన్నది. పూజయందు ఎప్పుడూ గోచీపోసి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పురుషుడు పూజ చేయవలసి ఉంటుంది.

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...