Thursday, September 23, 2021

ఉపవాసం!

ఉపవాసం అనగా ఏమి తినకుండా కేవలం మంచినీరు తాగి ఉండటమే ఉపవాసం. 

దీర్ఘ ఉపవాసం చేయువారు రసాహారము తీసికొనవలెను. కొందరు దేవునికి ఒకపొద్దు ఉంటున్నాం అని ఆ తరువాత అరడజను అరటిపళ్ళు, 10 ఇడ్లిలు, అరకిలో ఉప్మా లాగించేస్తారు. అన్నం మాత్రం తినరు. బహుశా వారి దృష్టిలో ఇదో రకం ఉపవాసం కావొచ్చు. కాని అలా చేయడం ఉపవాసం అనిపించుకోదు.

ఉపవాసం చేయడం వలన ముఖ్య ఉపయోగం: శరీరంలోని మాలిన్యాలను బహిష్కరింపచేసి వ్యాధి నిర్మూలనం అవుతుంది. పొట్ట, కన్ను, వ్రణములు, జ్వరములు, జలుబు మొదలగు వ్యాదులను కనీసం 5 రోజులపాటు ఉపవాసం చేసి వ్యాధి తగ్గించుకోవచ్చు. 

ఏ వ్యాధిలోనైనా ఉపవాసం చేయుట వలన వ్యాధి తొందరగా తగ్గించుకోవచ్చు. లేనిచో ఒకపూట ఉపవాసం ఉండి తరువాత ఆ వ్యాధికి సంబంధించిన పథ్యకరమైన ఆహారం తీసుకోవచ్చు.

ఉపవాసంలో 4రకాలు ఉన్నాయి:

           1 - నిర్జలోపవాసం.

           2 - జలోపవాసం.

           3 - రసోపవాసం.

           4 - ఫలోపవాసం.


1. నిర్జలోపవాసం:

మంచినీరు కూడా ముట్టకుండా చేయు ఉపవాసమును ‘నిర్జలోపవాసం’ అంటారు. ఈ ఉపవాసం ముఖ్యంగా శరీరంలో నీరు ఎక్కువ చేరినప్పుడు అనగా శరీరం వాచినప్పుడు రెండు లేదా మూడు దినములు ఈ ఉపవాసం చేయవలెను.  మూడురోజులకు మించి ఈ ఉపవాసం చేయరాదు.

2. జలోపవాసం:

కేవలం మంచినీరు మాత్రమే తాగి చేయు ఉపవాసమును ‘జలోపవాసం’ అందురు. దీనిని మూడురోజుల నుంచి ఏడు రోజుల వరకు మాత్రమే చేయవలెను. అంతకు మించి చేయరాదు. శరీరంలో మాలిన్యాలు అధికంగా చేరి ఏ రసాహారమును కూడా జీర్ణం చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం మంచినీరు తాగించి ఉపవాసం చేయించవలెను. అనగా సుమారు రెండులీటర్లు మంచినీరు త్రాగించవలెను.

3. రసోపవాసం:

ఈ రసోపవాసమును సాధారణంగా ప్రకృతిచికిత్సాలయాల్లో రసోపవాసం చేయిస్తారు. కేవలం పండ్లరసాలతో చేయు ఉపవాసమును ‘రసోపవాసం’ అంటారు. ఈ ఉపవాసం వారం రోజులు మొదలుకుని నెలరోజులు వరకు కూడా చేయవచ్చు. రసోపవాసంలో ముఖ్యంగా నిమ్మరసం, పలుచని నారింజరసం, బత్తాయిరసం, కమలారసం, తేనెనీరు, కొబ్బరినీరు, బార్లినీరు మొదలగునవి రోజుకు మూడుసార్లు నుండి అయిదుసార్లు లోపలికి తీసుకోవచ్చు.

 4. ఫలోపవాసం:

ఉపవాసం చేయలేనివారు ఫలోపవాసం చేయవచ్చు. కేవలం రసము నిండిన ఫలములు మాత్రమే ఆహారంగా తీసికొనవలెను. అరటిపండు తీసుకోకూడదు. ఎక్కువ బత్తాయి, నారింజ, కమలా, ద్రాక్షా, అనాస, దానిమ్మ, మామిడి, పుచ్ఛ మొదలగు పండ్లు తినవచ్చు .

ఈ ఉపవాసం రోగిని అనుసరించి పది నుంచి నలుబది రోజుల వరకు అనుసరించవచ్చు.

ఉపవాసం చేయుట వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు*

జీర్ణక్రియకు మంచి విశ్రాంతి లభించి అజీర్ణం తొలగిపోయి ఆకలివృద్ధి అగును.*

మలాశయంలో మురికి బహిష్కరింపబడి అజీర్ణం తొలగించబడి క్రిములను, బాక్టీరీయా నాశనం చేయబడును.*

మూత్రపిండాలలోని విషపదార్ధాలు, రాళ్లు బహిష్కరింపబడును.*

ఊపిరితిత్తులలోని నంజు, నీరు బహిష్కరించబడి ఆయాసం నివారించబడును. శ్వాసక్రియ చక్కగా జరుగును.*

గుండెచుట్టు, లోపల చేరిన కొవ్వు, నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును. గుండెజబ్బులలో రసోపవాసం మంచిది.*

లివర్ మరియు స్ప్లీన్ ఆహారం జీర్ణం అగుటకు ఇవి చక్కగా పనిచేయాలి. ఈ ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలోని మాలిన్యం తొలగించబడి జీర్ణక్రియ వృద్ది అగును.*

శరీరంలో రక్తప్రసారం చురుకుగా ఉండును. ఉపవాసం చేయుట వలన రక్తదోషములు నివారించబడును. తిమ్మిర్లు, మంటలు , నొప్పులు కూడా తగ్గును.*

కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు, నీరు, మాంసము వంటి మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును.*

నాడీమండలం శుభ్రపరచబడును.*

జ్ఞానేంద్రియాలలో మాలిన్యాలు అన్ని పోవును.* 

చర్మం కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కటిరంగు వచ్చును.*

మనస్సు ప్రశాంతంగా ఉండి కోపం వంటివి మన అదుపులో ఉండగలవు.*

ఉపవాసం చేయకూడని వారు:*

చాలా బలహీనంగా ఉన్నవారు, గుండెజబ్బులు కలవారు, బాలురకు, వృద్దులకు గర్భిణీస్త్రీలకు, బాలింతలకు, క్షయ మరియు రక్తహీనత కలిగిన రోగులు, మధుమేహంతో ఉన్నవారికి ఎక్కువ రోజులు ఉపవాసం చేయకూడదు.*

 ఉపవాసం చేయదగిన వారు:*

స్థూలకాయులు, ఉబ్బసం, సంధివాతం, రక్తపుపోటు, చర్మవ్యాధులు మొదలగు దీర్ఘకాలిక రోగులకు ఉపవాసం చేయుట మంచిది.

**ఉపవాసం ముగించిన వెంటనే ఘనాహారం తీసుకోకూడదు. ఉపవాసం తరువాత ఎక్కువ ఆహారం తీసుకొకూడదు. క్రమేపి ఆహారాన్ని పెంచుకుంటూ రావలెను. కారం, మసాలా పదార్దాలు, పిండివంటలు పచ్చళ్ళు తినకూడదు. అలా తీసుకున్నచో విరేచనాలు, వాంతులు, కడుపులో మంట, నొప్పి కలుగుతాయి

Wednesday, September 22, 2021

గుమ్మానికి మరియు వాహనాలకు నిమ్మకాయలు & మిరపకాయలు ఎందుకు కడతారో తెలుసా?

 భారతదేశం అంటేనే సంప్రదాయాలకు పెట్టింది పేరు. మన భారతదేశంలో మనం ఎన్నో ఆచారాలను పాటిస్తాం. కొన్ని ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయితే, కొన్ని మాత్రం భారతదేశ వ్యాప్తంగా పాటిస్తాం. అయితే అలా ఎక్కువగా పాటించే ఆచారాల్లో గుమ్మానికి నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి వేలాడదీయడం ఒకటి, మరొకటి వాహనాలకు కట్టడం.

ఆధ్యాత్మిక పరంగా, శాస్త్రపరంగా ఇది ఎందుకు అవసరమో రెండూ తెలుసుకుందాం.

నిమ్మక్కాయలు & మిరపకాయలు ఇంటి గుమ్మానికి కట్టడం వలన ఏమవుతుందంటే...

 


సిరిసంపదలకు అధిదేవత లక్ష్మీదేవి. హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది. అయితే లక్ష్మీదేవికి ఓ అక్క కూడా ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటారు. అది ఉండాలి కూడా.  అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం. ఆమె పేరు అలక్ష్మీ. పాల సముద్రాన్ని మథించినప్పుడు కల్పవృక్షం, ఇంద్రుడి వాహనం ఐరావతం, లక్ష్మీదేవి, హలాహలం, చివరిగా అమృత కలశంతో ధన్వంతరి అవతరించారు. పాల సముద్రం నుంచి పుట్టిన లక్ష్మీని తాను వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు. అయితే తన సోదరి వివాహం జరిగిన తర్వాతే వివాహం చేసుకుంటానని లక్ష్మీదేవి తెలిపింది. దీంతో అలక్ష్మీకి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెదికినా ప్రయోజనం ఉండదు. ఆమెను పెళ్లాడటానికి ఎవరూ అంగీకరించరు.


చివరికి ఉద్దాలక మహర్షి ఆమెను వివాహం చేసుకోడానికి ఒప్పకుంటాడు. కల్యాణం తర్వాత ఉద్దాలక మహర్షితో కలిసి అలక్ష్మీ ఆశ్రమానికి చేరుకున్న తర్వాత ఆశ్రమలోపలికి ప్రవేశించడానికి నిరాకరిస్తుంది. దీనికి కారణం ఏంటని ముని అడుగుతాడు. దీనికి అలక్ష్మీ ఇచ్చిన సమాధానం ఏమిటంటే...


లక్ష్మీకి సోదరి అయిన అలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తే...


నిరంతరం కలహాలతో కొట్టుకునే వాళ్లు, పరిశుభ్రత లేనివారు, మతాచారాలకు విరుద్ధంగా ప్రవర్తించేవారి ఇళ్లలో మాత్రమే తాను ప్రవేశిస్తానని తెలిపింది. సూర్యోదయానికి ముందే మేల్కొని, పరిశుభ్రంగా ఉంటూ దైవారాధన చేసేవారి ఇంటిలోకి తనకు ప్రవేశం లేదని అలక్ష్మీ పేర్కొంది. అలాంటి ఇంటిలోనే లక్ష్మీ కొలువుంటుంది.


అలక్ష్మీకి వేడి, పుల్లని పదార్థాలంటే ప్రీతి. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీస్తారు. ఇలా చేయడం వల్ల అలక్ష్మీ మన ఇంటిలోకి ప్రవేశించాలనుకున్నా తనకు ఇష్టమైన ఆహారాన్ని చూసి ఆగిపోతుంది. అలక్ష్మీ ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మీని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు.


ఇక శాస్త్రపరంగా గమనిస్తే


నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయడానికి వెనకాల ఒక సైన్స్ కి సంబంధించిన కారణం ఉంది.


పూర్వం దాదాపుగా అందరూ మట్టి ఇళ్ళలోనే ఉండేవారు. దాంతో పురుగులు, దోమలు వంటివి ఇళ్లల్లోకి ఎక్కువగా వచ్చేవి. అప్పుడు ఇప్పుడు ఉన్నట్టు మస్కిటో కాయిల్స్ లాంటి కెమికల్ పదార్థాలు లేవు. నిమ్మకాయ, మిరపకాయల్లో విటమిన్ సి ఉంటుంది. మిరపకాయలో అయితే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మనం నిమ్మకాయని దారానికి గుచ్చినప్పుడు ఆ దారానికి అంటుకొని ఆ ప్రదేశం మొత్తం వ్యాపిస్తుంది. దాంతో దోమలు, ఈగలు లేదా ఇతర కీటకాలు అక్కడికి రాకుండా ఉంటాయి. ఈ కారణంగానే పూర్వంలో నిమ్మకాయ, పచ్చి మిరపకాయలు దారానికి కలిపి కట్టేవారు. ఇదే పద్ధతిని మనం తరతరాల నుండి ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్నాం.


ఇక వాహనాల విషయానికి వస్తే జ్యోతిష్య శాస్త్రపరంగా గమనిస్తే విషయ అవగాహనమవుతుంది

 

సాధారణంగా హనుమంతుని ఆలయంలో వాహన పూజలు జరిపిస్తుంటారు. దేవుళ్లకు నివేదించిన నిమ్మకాయలను వాహనాలకు కడుతుంటారు. అంతే కాకుండా దిష్టి తీసి వాహన చక్రాలతో తొక్కిస్తారు. ఇలా చేస్తే మేలు జరుగుతుందని ఆశిస్తారు. పులుపుగా ఉండే నిమ్మకాయ, కారం నిండి ఉండే పచ్చిమిర్చిలను వాహనాలకు, దుకాణాల మధ్య వేలాడదీస్తారు. 

 

గ్రహాలలో ఎర్రని, ఉద్రత్వం కలిగినది కుజగ్రహం. కుజుడు ప్రమాద కారకుడని శాస్త్రం నమ్మకం. కుజునికి ఆదిదేవుడు హనుమంతుడు. అలానే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. కారం విగ్రహానికి సంబంధించినది. అధికారానికి రవి కారకుడు. వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుకుంటూ వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయాలు కడతారు.

Friday, September 17, 2021

చనిపోయిన వ్యక్తికి తద్దినం ఎందుకు?

ఈ విషయం తెలుసుకునే ముందు కాలం గురుంచి తెలుసుకుంటే మనకు చక్కగా అర్థం అవుతుంది, మరి ప్రారంభిద్దామా...


మహాభారతంలో ఒక కధ ఉంది... 

కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి రేవతి అనే అందమైన కూతు రు ఉండేది.  అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.


ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.


దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ...


ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం...


ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రం లో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు. కూతురంటే అతనికి ప్రాణం. 


ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు. తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో.  అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.


అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా.  వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు.   అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం.  నాలుగవ డైమెన్షన్ కాలం.


అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట. అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట.  అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు.  అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.


ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.


ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు.  అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు.  ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో  సమానం.


పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కధగానే తీసుకుంటాం. కాని ఆ కధలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే  "సమయ విస్ఫారణం"(Time dilation), "కృష్ణ బిలం (Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది.


అందుకే స్వామీ వివేకానంద అన్నారు.. "సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.


ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం.  పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం.  కాని, స్వర్గం ఉండేది భూమిపై కాదు.   మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది.  నాక్కుడా వచ్చింది.


పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి.  హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట. అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది.


మన హిందూ సనాతన ధర్మము ప్రకారం, మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు.  ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు.  ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు.


ఎందుకో తెలుసా, చనిపోయిన 11 – 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు.  అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం.  ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరు కోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం.  ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం.  అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజు కొకసారి పెట్టినట్టు.  ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు.  అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం.


ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి.  ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం.


ఇట్లానే.. బ్రహ్మ దేవుఁడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు.


ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు మానవాళికి ఉపయోగపడేవి ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం, మన సంస్కృతిని తక్కువగా అంచనా వేస్తూ పరమత ఆచారాలు, సంస్కృతిని గొప్పగా భావిస్తూ అవే జీవితానికి ఒక అర్థం చూపించగలవని నమ్ముతూ పరిగెడుతున్నారు...మన సంస్కృతి లోతుపాతుల్లోకి వెళితే ఇంక మరి జన్మ అవసరం లేని స్థితికి చేరుకుంటాం...మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఆ భవిష్యత్తు భావితరాలకు ఆదర్శమార్గం అవ్వాలని ఆశిస్తున్నాను మిత్రులారా 


కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి.  కనీసం చదువుకున్న వాళ్లకు అర్థం అవుతుంది.


|| ఓం నమః శివాయ ||

Thursday, September 16, 2021

ప్రమధ గణాలు

 ఆదిదేవుని ప్రమధ గణాలు ఎవరు!!

ప్రమథ గణాలు మొదట శివుని నుండి ఉద్భవించిన వారు. కేవలం శివుని మాత్రమే కొలిచే వారు. తదుపరి ఎంతో మంది శివ భక్తులు ప్రమథులలో చేరారు.

'ప్రమథ' అంటే బాగా మథించ గలిగె వారని అర్థం. వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి గలవారు. దేవతలను కూడా శిక్షించ గలవారు. వీరంటే దేవతలకు భయము, మరియు భక్తి. దేవతలు తప్పు ద్రోవ పడితే వారిని నిగ్రహించే వారు ప్రమథులు. వీరు విశ్వమంతా వ్యాపించే నిగ్రహ శక్తులై సంచరిస్తాడు.

రుద్ర సూక్తం లోని ఏకాదశ అనువాకంలో

సహస్రాణి సహస్రశో యే రుద్రా అది భూమ్యాం ..

అంటే వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు. కోట్లకొలది గణాలు ఉంటారు. మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్ర గణాలుగా ఉండి పోతారని ప్రతీతి.

అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులు:

వీరభద్రుడు: దక్షయజ్ఞంలో శివాపచారం చేసిన దక్షుణ్ణి, విష్ణ్వాది దేవతలను శిక్షించిన శివ జటోధ్భవుడు. తిరుగు లేని పరాక్రమవంతుడు. సాక్షాత్ శివస్వరుపంగా పోగడబడే వాడు. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి.

ఆది వృషభం: ధర్మదేవత. శివున్ని మోయ గలిగె వరం పొంది, అతని సమీపంలో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి. విష్ణు బ్రహ్మాదుల సృష్టికి పూర్వమే శివుడు ద్వితీయ శంభునిగా ధర్మ దేవతను వృషభ రూపంలో సృష్టిస్తాడు.


నందీశ్వరుడు: శిలాదుని పుత్రుడు. అది వృషభం యొక్క అవతారం. శివునికి రక్షగా, ఆంతరంగికునిగా ఉండే గణ మూర్తి. కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితే గానీ శివదర్శనం లభించదు.


భృంగి: శివుని యొక్క పరమ భక్తుడు. భ్రమరము లాగా శివుని చుట్టూ ప్రదక్షణం చేయడం పనిగా ఉన్న వాడు కాబట్టి భృంగి అని పిలవబడ్డాడు. కేవలం శివున్ని ఆరాధిస్తూ పార్వతీ దేవిని విస్మరించి శాపగస్తుడై తల్లి వల్ల వచ్చే రక్త, మాంసములను కోల్పోయి పడిపోతే శివుడు మూడవ కాలు ప్రసాదించాడు. stability కోసం.. tripod లాగా.


స్కందుడు: కుమారస్వామి శివకుమారుడు. దేవసేనాధిపతి. బ్రహ్మజ్ఞాని.


పై ఐదుగురు వీరమహేశ్వర గురువులు. వారి గోత్ర పురుషులు. నేటికీ వీరశైవులు ఈ గోత్రములతో ఉన్నారు.


రేణుక, దారుక, ఘంటకర్ణ, విశ్వకర్ణ, ధేనుకర్ణ: శివుని పంచముఖాల నుండి ఉద్భవించిన గణశ్రేష్ఠులు. భూమిపైకి అయోనిజులై లింగమునుంది వచ్చి పంచ మఠములను స్థాపించి, శివాద్వైతాన్ని బోధించారు. మరల లింగైక్యు లయ్యారు.


కాలాగ్నిరుద్రుడు లేదా కాలభైరవుడు: బ్రహ్మ ఐదవ తలను తీసేసిన రుద్రుడు. కపాల హస్తుడు. కాశీ పురాధీశుడు


రిటి: ఉద్దాలకుని పుత్రుడు. శివకృప చేత పరమ జ్ఞానిగా మారి శివ గణములలో చేరాడు.


బాణుడు: శివుని పరమభక్తుడు. శివునితోనే యుద్ధం కోరాడు. తత్సముడైన వానితో నీ అభీష్టం నెరవేరుతుందని వరం పొందాడు. శ్రీ కృష్ణునితోయుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు. నర్మదా నదిలో బాణలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణ లింగాలని పిలువ బడతాయి.


చండీశుడు: ఒక గోప బాలుడు. శివపూజకు గుడిలో అనుమతించరు అని, గొర్రె పెంటికను శివలింగంగా భావించి గొర్రె పాలతో పూజించాడు. భక్తి తన్మయత్వంలో ఆ పెంటిక శివలింగంపై పడబోతున్న తన తండ్రి కాలినే నరికేసాడు. కైలాసం నుండి శివుడు పరుగున వచ్చి ఆ బాలునికి గణ ఆధిపత్యాన్ని, శివ ఉచ్చిష్టంపై అధికారాన్ని కలిగించాడు. శివ నింద చేసేవారికి అతడు చండశాసనుడు.


ఇలా ఎందరో ప్రమథ నాయకులు.


దదీచి, అగస్త్యుడు, ఉపమన్యుడు, పప్పిలాదుడు, దుర్వాసుడు మొదలైన అనేక మంది ఋషులు కూడా శాంభవ దీక్ష స్వీకరించి గణములలో స్థానం పొందినారు.


అంతే గాక విభూతి, రుద్రాక్షలు, శివలింగాన్ని ధరించి శాంభవ దీక్షలో ఉంటూ సంచరిస్తూ ఉండే ఎంతో మంది శివయోగులు కూడా ప్రమథ కులము వారే. బ్రహ్మ సృష్టి పరంపరలో వచ్చే వర్ణాశ్రమ ధర్మములకు, అగ్నిష్టోమాది క్రతువులకు వీరు అతీతులు. కేవలం శివకర్మ మాత్రమే విధిగా సంచరిస్తారు. అనన్యశివభక్తి ఉన్నవారు అందరూ సమానులని వీరి విశ్వాసము. ఈనాటికీ వీరు వీరమాహేశ్వరులని, జంగమదేవతలని పిలువబడతారు.


ఇక జంగమలు గురుపరంపరలో ఉంటే, శిష్య పరంపర చెందిన శివశరణలు కూడా గణములలో స్థానం పొందారు. ఎంతో మంది స్త్రీలు శరణలయ్యారు. అక్క మహాదేవి, హేమరెడ్డి మల్లమ్మ వంటి వారు. 12వ శతాబ్దానికి చెందిన బసవ, అల్లమ ప్రభు, చెన్నబసవ, సిద్ధరామ ఇత్యాది శరణలెళ్లరు శివగణాల అవతారాలు అని బసవ పురాణం చెబుతుంది.


గణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తుంది. కొందరు శివ సారూప్యం తో ఉంటారు, కొందరు ఇచ్చాధార రూపాలతో ఉంటారు.రకరకాల ముఖాలతో, రక రకాల శరీరాలతో, అవయవాలలో వింతగా ఉంటారు ప్రమథ గణాలు. వీరి శక్తుల, లీలల గురించి తెలుసుకోవాలంటే పాల్కురికి సోమనాథుని బసవ పురాణం చదవాల్సిందే!!

వీరి పేర్లు తలచుకోవడమే మహా ప్రసాదము.

సర్వం శివమయం.. హరహర మహాదేవ శంభోశంకరా...

సోమస్కందమూర్తి

ఈ ఫోటో ఇంట్లో పెట్టి పూజించమని పెద్దలు చెబుతారు.


సంతానం అనుగ్రహించే సోమస్కంద మూర్తులు

సంతానం కలగాలని కోరుకునే దంపతులు 

శ్రీ సోమస్కంద మూర్తి చిత్రపటం గానీ, విగ్రహం కానీ ఇంట్లో పెట్టుకుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వలన,  సుబ్రహ్మణ్యుని వంటి తేజోమూర్తి అయిన సుపుత్రుడు జన్మిస్తాడు అని శాస్త్ర వచనం. అంతే కాదు పిల్లలు ఉన్నవారైనా సరే, ఈ సోమస్కంద మూర్తిని ఆరాధిస్తే, పిల్లలు చక్కని తెలివితేటలు, బుద్ధి కుశలత, చురుకుదనం, తేజస్సు పొందుతారు. అందుకే తమిళనాట సోమస్కంద మూర్తి ఆరాధన విశేషంగా చేస్తుంటారు ...

తమిళనాడులో ఈ మూర్తి ప్రతి శివాలయమున ఉంటారు ...

మన ఆంధ్రరాష్ట్రమున కపిలతీర్థం మరియు శ్రీ కాళహస్తీ దేవాలయాల్లో మాత్రమే మనకు కనిపిస్తారు ...

ఒక్కసారి ఈ సోమస్కంద మూర్తిని గమనించండి ...

పార్వతి పరమేశ్వరుల మధ్యలో చిన్న బాలుడుగా  ఆడుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి వారు ...    

సో- ఉమా- స్కంద మూర్తి ...    

సోముడు అనగా శివుడు , 

ఉమా దేవి అనగా పార్వతి దేవి, 

స్కందుడు అనగా సుబ్రహ్మణ్యస్వామి వారు, వీళ్ళ ముగ్గురూ కలసి ఉన్న మూర్తినే సోమస్కంద మూర్తి అంటారు,చాలా విశేషమైన మూర్తి.

స్మశాన నారాయణుడు

పితృ దోషాలు తొలగించే మహామహిమాన్వితమైన క్షేత్రం స్మశాన నారాయణుని దర్శనం మనకు లభిస్తున్న అద్భుత వరం  అందరూ తెలుసకోవాలి ఈ దివ్యక్షేత్రం గురించి.

పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం..

పితృదోషం మన తాతలు తండ్రులు 

సంపాదించిన ఆస్తిపాస్తులను 

వంశపారంపర్యంగా అనుభవించటానికి 

మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ...

అలాగే... 

తాతలు తండ్రులు చేసిన 

పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.

మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.

అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు..

మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే. అదే పితృదోషం

పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.

ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.

వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.

పితృదోషం వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని...

 చిన్న వారు అకాలమరణం పొందడం, శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం, అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం, మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం, మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం

ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం.

దీని నుండి విముక్తి పొందడానికి ఒక పరిష్కారం ఏమిటంటే, స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే ...

అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.

1. కాశీ

2. పాపనాశి ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)

అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.

విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు .

అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.

స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే....

పాలు అన్నముతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నేయి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ! ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు . 

స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.

ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును ) 

అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.

ఈ ఆలయ ప్రాముఖ్యము తంత్ర గురు "వేణు మాధవ నంబూద్రి " ద్వారా తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !

ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు . అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం..


చేరుకొనే విధానం:

అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం "

ఇంకొక ముఖ్య విషయం : స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి!

పంచక్రియలు

జీవితం ప్రశాంతంగా... ఆనందంగా... హాయిగా సాగిపోవాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటూ వుంటారు. పవిత్రమైన మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడే అలాంటి జీవితం సాధ్యమవుతుంది. ఆ పవిత్రత అనేది కేవలం ఆధ్యాత్మిక భావాల వలన మాత్రమే కలుగుతుంది. ఆధ్యాత్మిక పరమైన అలాంటి జీవితాన్ని ఆదర్శవంతంగా కొనసాగించడానికి 'పంచక్రియలను' అనుసరించ వలసి ఉంటుందని శాస్త్రం చెబుతోంది.

ఉపాసన ... ఉత్సవం ... అహింస ... తీర్థయాత్ర ... సంస్కారం అనేవి పంచక్రియలుగా చెప్పబడుతున్నాయి.

నియమ నిష్ఠలను పాటిస్తూ... సంప్రదాయాన్ని గౌరవిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో అనుదినం భగవంతుడిని ఆరాధించాలని 'ఉపాసన' చెబుతోంది.

చక్కని కుటుంబ వాతావరణాన్ని కలిగి వుండి, పండుగ సందర్భాల్లో జరిగే వేడుకల్లోను ... దైవ సంబంధమైన ఉత్సవాల్లోను భక్తితో పాల్గొనాలని 'ఉత్సవం' స్పష్టం చేస్తోంది.

ఇక ఇతరులకు ఏ విధంగాను కష్టాన్ని కలిగించకుండా ... ఎలాంటి కారణం చేతను వాళ్లను హింసించకుండా నడచుకోవాలని 'అహింసా' విధానం తెలియజేస్తోంది.

బరువు బాధ్యతల పేరుతో భగవంతుడిని దర్శించడం ... సేవించడం మరిచిపోకూడదని చెప్పడానికే 'తీర్థయాత్రలు' ఉద్దేశించబడ్డాయి. తీర్థయాత్రలు ... ప్రతి ఒక్కరి మనసుని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. భగవంతుడి సన్నిధిలో గడపడం వలన కలిగే ఆనందానుభూతులు ఎలా ఉంటాయో తెలియజేస్తాయి.

ఇక పుట్టుక నుంచి మరణం వరకూ ఆచారవ్యవహారాల పేరుతో పూర్వీకుల నుంచి సంక్రమించిన పద్ధతులను పాటించడమే 'సంస్కారం' గా చెప్పబడుతోంది. తరతరాలుగా వస్తోన్న ఆచారవ్యవహారాలను పాటిస్తూ .. సంప్రదాయాలను గౌరవిస్తూ ... ఇతరులను ప్రేమిస్తూ ... భగవంతుడిని సేవిస్తూ ... పుణ్య క్షేత్రాలను దర్శించమనే 'పంచక్రియలు' చెబుతున్నాయి. వీటిని అనుసరించడం వలన విశేషమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి...

Sunday, September 12, 2021

శ్రీ సూర్య పంజర స్తోత్రం




1)ఓం ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం|సకలభువననేత్రం రత్నరజ్జూపమేయమ్ |  తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాం|సురవరమభివంద్యం సుందరం విశ్వదీపమ్ ||

2)ఓం శిఖాయాం భాస్కరాయ నమః |లలాటే సూర్యాయ నమః |   భ్రూమధ్యే భానవే నమః |కర్ణయోః దివాకరాయ నమః |  నాసికాయాం భానవే నమః |నేత్రయోః సవిత్రే నమః |  ముఖే భాస్కరాయ నమః |ఓష్ఠయోః పర్జన్యాయ నమః | పాదయోః ప్రభాకరాయ నమః ||

3)ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః |  ఓం హంసాం హంసీం హంసూం హంసైం హంసౌం హంసః || 

4)ఓం సత్యతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా | ఓం స్థితిరూపకకారణాయ పూర్వాదిగ్భాగే మాం రక్షతు || 

5)ఓం బ్రహ్మతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          ఓం తారకబ్రహ్మరూపాయ పరయంత్ర-పరతంత్ర-పరమంత్ర-సర్వోపద్రవనాశనార్థం దక్షిణదిగ్భాగే మాం రక్షతు ||

6)ఓం విష్ణుతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          ఓం ప్రచండమార్తాండ ఉగ్రతేజోరూపిణే ముకురవర్ణాయ తేజోవర్ణాయ మమ సర్వరాజస్త్రీపురుష-వశీకరణార్థం పశ్చిమదిగ్భాగే మాం రక్షతు ||

6)ఓం రుద్రతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          ఓం భవాయ రుద్రరూపిణే ఉత్తరదిగ్భాగే సర్వమృత్యోపశమనార్థం మాం రక్షతు || 

7)ఓం అగ్నితేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          ఓం తిమిరతేజసే సర్వరోగనివారణాయ ఊర్ధ్వదిగ్భాగే మాం రక్షతు || 

8)ఓం సర్వతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          ఓం నమస్కారప్రియాయ శ్రీసూర్యనారాయణాయ అధోదిగ్భాగే సర్వాభీష్టసిద్ధ్యర్థం మాం రక్షతు ||

9)మార్తాండాయ నమః భానవే నమః హంసాయ నమః సూర్యాయ నమః దివాకరాయ నమః తపనాయ నమః భాస్కరాయ నమః మాం రక్షతు || 

10)మిత్ర-రవి-సూర్య-భాను-ఖగపూష-హిరణ్యగర్భ- మరీచ్యాదిత్య-సవిత్రర్క-భాస్కరేభ్యో నమః శిరస్థానే మాం రక్షతు ||  సూర్యాది నవగ్రహేభ్యో నమః లలాటస్థానే మాం రక్షతు ||

11)ధరాయ నమః ధృవాయ నమః సోమాయ నమః అథర్వాయ నమః అనిలాయ నమః అనలాయ నమః ప్రత్యూషాయ నమః ప్రతాపాయ నమః మూర్ధ్నిస్థానే మాం రక్షతు || 

12)వీరభద్రాయ నమః గిరీశాయ నమః

శంభవే నమః అజైకపదే నమః అహిర్బుధ్నే నమః పినాకినే నమః భువనాధీశ్వరాయ నమః దిశాంతపతయే నమః పశుపతయే నమః స్థాణవే నమః భవాయ నమః లలాటస్థానే మాం రక్షతు || 

13)ధాత్రే నమః అంశుమతే నమః పూష్ణే నమః పర్జన్యాయ నమః విష్ణవే నమః నేత్రస్థానే మాం రక్షతు || 

14)అరుణాయ నమః సూర్యాయ నమః ఇంద్రాయ నమః రవయే నమః సువర్ణరేతసే నమః యమాయ నమః దివాకరాయ నమః కర్ణస్థానే మాం రక్షతు || 

15)అసితాంగభైరవాయ నమః రురుభైరవాయ నమః  చండభైరవాయ నమః క్రోధభైరవాయ నమః  ఉన్మత్తభైరవాయ నమః భీషణభైరవాయ నమః కాలభైరవాయ నమః సంహారభైరవాయ నమః  ముఖస్థానే మాం రక్షతు ||

16)బ్రాహ్మ్యై నమః మహేశ్వర్యై నమః కౌమార్యై నమః వైష్ణవ్యై నమః వరాహ్యై నమః ఇంద్రాణ్యై నమః చాముండాయై నమః కంఠస్థానే మాం రక్షతు ||

17)ఇంద్రాయ నమః అగ్నయే నమః|యమాయ నమః నిర్‍ఋతయే నమః|వరుణాయ నమః వాయవే నమః|కుబేరాయ నమః ఈశానాయ నమః|బాహుస్థానే మాం రక్షతు || 

17)మేషాదిద్వాదశరాశిభ్యో నమః| హృదయస్థానే మాం రక్షతు ||

18)వజ్రాయుధాయ నమః శక్త్యాయుధాయ నమః|దండాయుధాయ నమః ఖడ్గాయుధాయ నమః|పాశాయుధాయ నమః|అంకుశాయుధాయ నమః|గదాయుధాయ నమః త్రిశూలాయుధాయ నమః|పద్మాయుధాయ నమః చక్రాయుధాయ నమః|   కటిస్థానే మాం రక్షతు ||

19)మిత్రాయ నమః దక్షిణహస్తే మాం రక్షతు |  రవయే నమః వామహస్తే మాం రక్షతు |సూర్యాయ నమః హృదయే మాం రక్షతు |  భానవే నమః మూర్ధ్నిస్థానే మాం రక్షతు |  ఖగాయ నమః దక్షిణపాదే మాం రక్షతు |  పూష్ణే నమః వామపాదే మాం రక్షతు |హిరణ్యగర్భాయ నమః నాభిస్థానే మాం రక్షతు |మరీచయే నమః కంఠస్థానే మాం రక్షతు |  ఆదిత్యాయ నమః దక్షిణచక్షూషి మాం రక్షతు |  సవిత్రే నమః వామచక్షుషి మాం రక్షతు |భాస్కరాయ నమః హస్తే మాం రక్షతు |అర్కాయ నమః కవచే మాం రక్షతు ||

20)ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతి కరాయ ధీమహి | తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ||

 || ఇతి శ్రీ సూర్య పంజర స్తోత్రమ్ ||

Saturday, September 11, 2021

108 రూపాలలో మహా గణపతులు

1. ఏకాక్షర గణపతి

ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోక

దావానలం గణ్విభుం వరకుంజరాస్యమ్

అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం

ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య


2. మహా గణపతి

భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం

భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం

గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక:

శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో మహాన్


3. బాల గణపతి

కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం

బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం


4. తరుణ గణపతి

పాశాంకుశాపూస కపిత్ధ జంబూ

ఫలం తిలాం చేక్షు మపిసవ హసై:

ధత్తే సదాయ స్తరుణారుణాంభ:

పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ:


5. విఘ్నరాజ గణపతి

విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే 

మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక:


6. సిద్ది గణపతి

ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్

అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్


7. బుద్ధి గణపతి

త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే

బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ |

నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే

నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ ||


8. లక్ష్మీ గణపతి

బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్

పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోత్సస్సరో నిస్సర:

శ్యామో రక్త సరోరుహేణ సహితో దేవీ చ యస్యాంతికే

గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్


9. సంతాన లక్ష్మీ గణపతి

శరణం భవదేవేశ సంతతిం సుదృఢాంకురు |

భవిష్యంతియే పుత్రామత్కులే గణనాయక: ||


10. దుర్గా గణపతి

తప్తకాంచన సంకాశం శ్చాష్ట్ట్ట మహత్తను: |

దీప్తాంకుశం శరం చాక్షం దంతం దక్షే వహన్కరై: ||


11. సర్వశక్తి గణపతి

ఆలింగ్య దేవీం హరితాం నిషణ్ణాం

పరస్పరాశ్లిష్టకటీ నివేశం

సంధ్యారుణం పాశసృణీం వహస్తం 

భయాపహం శక్తి గణేశ మీఢే


12. విరివిరి గణపతి

సుసిద్ధాదం భక్తిజనస్యదేవ సకామిదా మామిహ సౌఖ్యదంతం |

అకా మికాగాం భవబంధహరం గజాననం భక్తియుతం భజామ ||


13. క్షిప్ర గణపతి

దంతం కల్పలతా పాశ రత్నకుంభోప శోభితం

బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం


14. హేరంబ గణపతి

అభయ వరద హస్త: పాశదంతాక్షమాల:

పరశుమధ త్రిశీర్షం ముద్గరం మోదకం చ

విదధతు నరసింహ: పంచమాతంగ వక్త్ర:

కనక రుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా


15. నిధి గణపతి

విచిత్ర రత్నై: ఖచితం సువర్ణ సమ్బూతకంగుహ్యమయా ప్రదత్తమం |

తధాంగులీష్పంగులికం గణేశ చిత్తేన సంశోభయ తత్పరేశ


16. వక్రతుండ గణపతి

స్వర్ణవర్ణ చతుర్బాహుం | పాశాంకుశధరం విభుం |

ఆమ్రపాత్ర స్వదంతంచ | శక్తియుతం విచింతయేత్


17. నవనీత గణపతి

దానాయ నానావిధ రూపకాంస్తే గృహాణ దత్తాన్మనసామయావై|

పదార్ధ భూతాన్ స్థిర జంగమాంశ్చ హేరమ్నమాం తారయ మోహభావాత్ ||


18. ఉచ్ఛిష్గ్ట గణపతి

లీలాబ్జం దాడిమం వీణాశాలి గుంజాక్ష సూత్రకం

దధ దుచ్ఛిష్ట నామాయం గణేశ: పాతు మేచక:


19. హరిద్రా గణపతి

హరిద్రాభం చతుర్బాహుం హరిద్రా వదనం ప్రభుమ్

పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ

భక్తాభయ ప్రదాతాం వందే విఘ్న వినాశనమ్


20. మోదక గణపతి

నాదబిందు కళాత్మకం వరనారదాది సుపూజితం |

మోదక ఫలదాయకం ప్రమోదవదన వినాయకం ||


21.మేధా గణపతి

సకలభాగ్య వశంకరం వర సాధు సజ్జన సంహితం 

అఖిలదేవ ప్రదాయకం మమ ఆత్మరక్ష వినాయకం


22.మోహన గణపతి

రక్ష రక్ష గణాధ్యక్ష రక్షత్రైలోక్య రక్షక 

భక్తానాం అభయంకర్తా త్రాతాభవ భవార్ణవాన్


23.త్రైలోక్య మోహన గణపతి

గదా బీజాపూరే ధను: శూలచక్రే సరోజతృలే

పాశాధాన్య ప్రదంతారి కరై: సందధానం

స్వశుండాగ్ర రాజం | మణి కుంభ

మంగాధి రూఢం స పత్న్యా ||


24. వీర గణపతి

భేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ

ఖట్వాంగ ముద్గర గధాంకుశ ముద్వహస్తం

వీరం గణేశ మరుణం సతతం స్మరామి


25. ద్విజ గణపతి

యం పుస్తకాక్ష గుణ దండకమండలు

శ్రీవిద్యోతమాన కరభూషణమిందు వర్ణం

స్తంబేర మానన చతుష్టయ శోభమానం

త్వాం య: స్మరే ద్ద్విజ గణాధిపతే సధన్య: ||


26. ఋణవిమోచన గణపతి

సృష్ట్యా బ్రహ్మణా సమ్యక్ పూజిత: ఫలసిద్ధయే

సదైవ పార్వతీపుత్ర: ఋణనాశం కరోతుమే


27. సంకష్టహర గణపతి

ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం

భక్తావాసం స్మరేన్నిత్యంమాయుష్కారమార్ధ సిద్ధయే


28. గురు గణపతి 

ప్రవరం సర్వదేవానాం సిద్ధినాం యోగినాం గురుం |

సర్వస్వరూపం సర్వేశం జ్ఞానరాశి స్వరూపిణమ్ ||

అవ్యక్తమక్షరం నిత్యంసత్యమాత్మ స్వరూపిణం |

వాయుతుల్యంచ నిర్లిప్తం చాక్షతం సర్వసాక్షిణం ||


29. స్వర్ణ గణపతి 

వందే వందారుమందార, మిందు భూషణ నందనం |

అమందానంద సందోహ, బంధురం సింధురాననమ్ ||


30. అర్క గణపతి 

మూషారూఢం లంబసూత్రం సర్పయజ్ఞోపవీతినల|

విషాణం పాష కమలం మోదకంచ కరైధృతం ||


31. కుక్షి గణపతి 

సరోజన్మన భూషాణాం భరణోజ్వలహస్త తన్వ్యా సమా

లింగితాంగాం | కరీంద్రాననాం చంద్ర చూడం త్రినేత్రం రక్తకాంతిం భజేత్తం ||


32. పుష్టి గణపతి 

ఏకదంతం మహాకాయం లంబోదరం గజాననం |

విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం ||


33. వామన గణపతి 

లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం |

అర్ధచంద్రధరం దేవం విఘ్నప్యూహం వినాశనం ||


34. యోగ గణపతి 

యోగరూఢో యోగ పట్టాభిరామో

బాలార్కభశ్చేంద్ర నీలాంశుకాఢ్య:

పాశాక్ష్వక్షాన్ యోగదండం దధానో

పాయాన్నిత్యం యోగ విఘ్నేశ్వరో న:


35. నృత్య గణపతి 

పాశాంకుశాపూప కుఠార దన్త చంచత్కరం వచరుతరాంగుళీయం

పీతప్రభం కల్పతరో రధస్ధం భజామి నృత్తైక పదం గణేశం


36. దూర్వా గణపతి 

దూర్వాంకురాన్వై మనసా ప్రదత్తాం స్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన్ |

గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాంశ్చ సర్వోపరి వక్రతుండ ||


37. అభీష్టవరద గణపతి

నమస్తే వేద విదుషే నమస్తే వేద కారిణే |

కమన్యం శరణం యామ: కోను న: స్వాద్భయాపహ: ||


38. లంబోదర గణపతి 

లంబోదరావతారో వైక్రోధాసుర నిబర్హణ:

శక్తిబ్రహ్మ ఖగ: సద్యత్ తస్యధారక ఉచ్యతౌ ||


39.విద్యా గణపతి 

భక్త ప్రియాయ దేవాయ నమో జ్ణాన స్వరూపిణే |

నమో విశ్వస్యకర్త్రేతే నమస్తత్పాలకాయచ ||


40. సరస్వతీ గణపతి 

వాగీశాద్యా స్సుమనస: సర్వార్ధానాముపక్రమే

యంనత్వాకృత కృత్వాస్స్యు: తం నమామి గజాననమ్ ||


41. సంపత్ గణపతి 

పక్వచూత ఫలపుష్ప మంజరీచేక్షుదండ తిలమోదకైస్సహ

ఉద్వహన్ పరశుమస్తుతే నమ: శ్రీ సమృద్ధియత హేమపింగళ:


42. సూర్య గణపతి 

హిరణ్యగర్భం జగదీశితారరమృషిం పురాణం మండలస్థం |

గజాననం యం ప్రవిశన్తిసంతస్తత్కాలయోగైస్త మహం ప్రపద్యే ||


43. విజయ గణపతి 

శంఖేక్షు చాప కుసుమేఘ కుఠారదంత

పాశాంకుశై: కళమమంజరికా సనైధై:

పాణిస్థితై: పరిసమావృత భూషణ శ్రీ:


44. పంచముఖ గణపతి 

గణేశాయ ధామ్నే పరేశాయ తుభ్యం సదానంద రూపాయ సర్వార్తిగాయ|

అపారస్వరూపాయ దేవాధిదేవ నమస్తే ప్రభో భక్త సంరక్షకాయ ||


45. నీలకంఠ గణపతి 

వినాయకం నాయకమౌక్తికం త్రయీ హారావళే రావళితం భుజంగమై: |

పినాకిజం నాకిజనేడ్య మంహసాం నివారణం వారణ్వక్త్ర మాశ్రయే ||


46. గాయత్రి గణపతి 

యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాధ భూతం |

భావేనదత్తం గణనాథతత్వం గృహాణ భక్తోద్దృతి కారణాయ ||


47. చింతామణి గణపతి 

కల్పద్రుమాధ: స్థితకామధేయం |

చింతామణిం దక్షిణపాణి శుండమ్ |

బిభ్రాణ మత్యద్భుత చిత్రరూపం |

య: పూజయేత్తస్య సమస్త సిద్ధి: ||


48. ఏకదంత గణపతి 

అగజానన పద్మార్కమ్ గజానన మహర్నిశం

అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే


49. వికట గణపతి 

వికటోనామ విఖ్యాత: కామాసుర విదాహక: |

మయూర వాహనశ్చాయం సౌరబ్రహ్మధర: స్మ్రత: ||


50. వరద గణపతి 

వరదాభయ హస్తాయ నమ: పరశుధారిణే |

నమస్తే సృణిహస్తాయ నాభివిశేషాయతే నమ: ||


51. వశ్య గణపతి 

విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వన్దే జనైర్మాగధకై: స్మృతాని |

శ్రుత్వాసమత్తిష్ఠ గజానన త్వం బ్రహ్మేజగన్మంగళకం కురుష్వ ||


52. కుల గణపతి 

శుండావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహేంణ |

రత్నైశ్చయుక్తం మనసామయాయ ద్ధతం ప్రభోతత్సఫలం కురుష్వ ||


53. కుబేర గణపతి 

రత్నై: సువర్ణేన కృతాని గృహాణచత్వారి మయాప్రకల్ప్య |

సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు వ్యాజ విఘ్నహారిన్ |


54. రత్నగర్భ గణపతి 

హేరంబతే రత్నసువర్ణయుక్తే సునూపుర మంజీరకే తథైవ|

సు కింకిణీ నాద యుతే సుబుద్ధ్యా సుపాదయో: శోభమయే ప్రదత్తే ||


55. కుమార గణపతి 

మాత్రే పిత్రేచ సర్వేషాం హేరంబాయ నమో నమ:

అనాదయేచ విఘ్నేశ విఘ్నకర్తే నమోనమ:


56. సర్వసిద్ధి గణపతి 

పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |

విఘ్నవిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం |

సురాసురేంద్ర్యై: సిద్ధేంద్ర్యై: స్తుతం స్తౌమి పరాత్పరం |

సురపద్మచినేశంచ గణేశం మంగళాయనం ||


57. భక్త గణపతి 

నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం

శరచ్ఛశాంక సదృశం భజే భక్తగణాధిపమ్


58. విఘ్న గణపతి 

పాశాంకుశం ధరన్నామ ఫలాశీ చాఖవాహన:

విఘ్నం నిహస్తు న: సర్వ రక్తవర్ణో వినాయక:


59. ఊర్ధ్వ గణపతి 

కల్హారిశాలి కణిశేక్షుక చాపబాణ,

దంత ప్రరోహ కబర: కనకోజ్జ్వలాంగ:,

ఆలింగనోద్యత కర: తటిదాభకట్యా

దేయాత్స శతృభయ మూర్థ్వ గణేశ్వరస్తే


60. వర గణపతి 

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన

ఈప్సితం మేం వరం దేహి పరత్రా చ పరాంగతిమ్


61. త్ర్యక్ష్యర గణపతి 

సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితం

సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్


62. క్షిప్రప్రసాద గణపతి 

యక్షకిన్నర గంధర్వ సిద్ధవిద్యా ధరైస్సదా

స్తూయమానం మహాబాహుం వందే హం గణనాయకమ్


63. సృష్టి గణపతి 

ప్రాతర్నమామి చతురానన వన్ద్యమానం

ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్

తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం

పుత్రం విలాస చతురం శివయో: శివాయ


64. ఉద్దండ గణపతి 

ప్రాత:స్మరామి గణనాథమనాథ బంధుం

సిందూరపూర పరిశోభితగండయుగ్మం

ఉద్ధండవిఘ్న పరిఖండన చండదండం

అఖండలాది సురనాయక బృందవంద్యమ్


65. డుండి గణపతి 

అక్షమాలాం కుఠారంచ రత్నపాత్ర స్వదంతకమ్

ధతైకరైర్విఘ్నరాజో డుంఢినామా మదేస్తున:


66.ద్విముఖ గణపతి 

స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్దదానో హరినీలగాత్ర:

రత్నాంశుకో రత్న కిరీటమాలీ భూత్యై సదామే ద్విముఖో గణేశ:


67. త్రిముఖ గణపతి 

శ్రీమత్తీక్షణ శిఖాం కుశాక్ష వరదాన్ దక్షే దదానం కరై:

పాశాంచామృత పూర్ణకుంభమయం వామే దదానోముదా

పీఠే స్వర్ణమయారవింద విలసత్సత్కర్ణికాభాసురే

స్వాసీనస్త్రిముఖ: పరశురుచిరో నాగనన: పాతున:


68. సింహ గణపతి 

వీణాం కల్పలతా మరించ వరదం దక్షేవిధత్తేకరై:

వేణే తామరసం చ రత్న కలశం సన్మంజరీం చా భయం

శుండాదండలసన్ మృగేంద్ర వందన: శంఖేందు గౌర: శుభో

దీప్యద్రత్న నిభాంకుశో గణపతి: పాయా దపాయాత్సన:


69. గజానన గణపతి 

సదా సుఖానందమయం జలేచ సముద్రేన ఇక్షురసే నివాసం|

ద్వంద్వ స్థయానేనచ నాళరూపం గజాననం భక్తియుతం భజామ||


70. మహోదర గణపతి 

మహోదర ఇతిఖ్యాతో జ్ఞానబ్రహ్మ ప్రకాశక:

మోహాసుర నిహంతావై ఆఖువాహన ఏవచ ||


71. భువన గణపతి 

విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయతే |

నమో నమస్తే సత్యాయ సత్య పూర్ణాయ శుండినే ||


72. ధూమ్రవర్ణ గణపతి 

ధూమ్రవర్ణావతారశ్చాభి మానాసుర నాశక:

ఆఖువాహన ఏవాసౌ శివాత్మేతి స ఉచ్యతౌ


73. శ్వేతార్క గణపతి 

ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే

శ్వేతార్కమూలనివాసాయ

వాసుదేవ ప్రియాయ, దక్ష ప్రజాపతి రక్షకాయ

సూర్యవరదాయ కుమారగురవే


74. ఆధార గణపతి 

నాదం బాలసహస్ర భాను సదృశం నాగేంద్ర

వక్త్రాన్వితం | హస్తాభ్యాం చషకం పవిత్ర కలశం

హస్యంచ వృత్తాండవం | నానా చిత్రవిచిత్రయన్

పరగురుం ఆధార విద్యా స్థితిం | ఓంకార

ప్రణవాకృతిం గణపతిం నిత్యం భజేహం ప్రభో ||


75. భూతరోగ నివారణ గణపతి 

ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణ పాశమంకుశం |

అభయం వరదం సాస్మృర్భధానం మూషిక ధ్వజం |


76. ప్రసన్న విఘ్నహర గణపతి 

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |

పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||


77. ద్వాదశభుజవీర గణపతి 

సురేంద్రనేన్యం హ్యసురై: సుసేవ్యం సమానభావన విరాజయంతం|

అనంతబాహుం మూషక ధ్వజం తం గజాననం భక్తియుతం భజామ: ||


78. వశీకర గణపతి 

బీజాపూరగదేక్షుకార్ములసచ్చక్రోబ్జ పాశోత్పల|

వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహ: ||

ధ్యేయోవల్లభయా సపద్మకరయాశ్లిష్టోజ్వల- ద్భూషయ

విశ్వోత్పత్తి విపత్తి సంస్తుతికరో విఘ్నో విశిష్టార్ధద: ||


79. అఘౌర గణపతి 

గజవదనమంచింత్యం తీక్ష్ణదంష్టృం త్రినేత్రం

బృహదుదరమశేషం భూతరాజం పురాణం

అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం |

పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి ||


80. విషహర గణపతి 

నాగాననే నాగకృతోత్తరీయే క్రీడారతే, దేవకుమార సంఘై: |

త్వయిక్షణం కాలగతిం విహాయతౌ ప్రాపతు కన్దుకతామినేన్దూ ||


81. భర్గ గణపతి 

బాలార్కకోటి ద్యుతి మప్రమేయం

బాలేందు రేఖా కలితోత్తమాజ్ఞమ్ |

భ్రమద్ద్విరేపావృత గణ్డభాగం భజే భవానీతనయం గణేశమ్ ||


82. సర్వ సమ్మోహన గణపతి 

స్వాంకస్థితాయానిజవల్లభయాముఖామ్భుజాలోకేన లోలనేత్రం |

స్మేరాననాస్యం మదవైభవేన రుద్ధం భజే విశ్వవిమోహనంతం ||


83. ఐశ్వర్య గణపతి 

సహస్ర శీర్షం మనసా మయా త్వం దత్తం కిరీటంతు సువర్ణజంవై |

అనేకరత్నై: ఖచితం గృహాణ బ్రహ్మేశతే మస్తక శోభనాయ ||


84. మాయావల్లభ గణపతి 

సంసారార్ణవ పారేచ మాయాపోతే సుదుర్లభే |

కర్ణధార స్వరూపంచ భక్తానుగ్రహకారకం |

వరం వరేణ్యం వరదం వరదానామపి ఈశ్వరం |

సిద్ధం సిద్ధి స్వరూపంచ సిద్ధిదం సిద్ధి సాధనమ్ ||


85. సౌభాగ్య గణపతి 

తతో హరిద్రామచిరంగులాలం సిన్ధూరకం తేపరికల్పయామి |

సువాసితం వస్తు సువాస భూతై: గృహాణ బ్రహ్మేశ్వర శోభనార్థమ్ ||


86. గౌరి గణపతి 

విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ |

లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |

నాగాసనాయ కృతియజ్ఞ విభూషితాయ |

గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే ||


87. ప్రళయంకర్త గణపతి 

అకాలమేవ ప్రళయ: కథం లబ్ధో జనైరయం |

హా ! గజానన దేవేశ: హాహా విఘ్న హరావ్యయ ||


88. స్కంద గణపతి 

కుమార భుక్తౌ పునరాత్మహేతో: పయోధరే పర్వతరాజ పుత్ర్యా|

ప్రక్షాళయంతం కరశీ కరేణ మౌగ్ధ్యేనతం నాగముఖం భజామి ||


89. మృత్యుంజయ గణపతి 

సరాగలోకదుర్లభం విరాగిలోక పూజితం

సురాసురైర్నమస్కృతం జరాప మృత్యునాశకం ||


90. అశ్వ గణపతి 

రాజోపచారాన్వి విధాన్గృహాణ హస్త్యశ్వఛత్రాధికమాద రాద్వై |

చిత్తేన దత్తాన్గణనాధడుణ్డే హ్యపార సంఖ్యాన్ స్థిరజంగమాంస్తే ||


91. ఓంకార గణపతి 

వందే గణేశం భుజగేంద్ర భూషణం సమస్త భక్తాళికృతాతితోషణం

విశ్వం భరా సంస్థితలోక రక్షణం మదీయ పాపౌఘతమస్సు పూషణమ్ ||


92. బ్రహ్మవిద్యా గణపతి 

బ్రహ్మేభ్యో బ్రహ్మదాత్రేచ గజానన నమోస్తుతే |

ఆదిపూజ్యాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠరాజాయతే నమ: ||


93. శివ అవతార గణపతి 

విఘ్నానాం పతయే తుభ్యం నమో విఘ్న నివారణ |

సర్వాంతర్యామిణే తుభ్యాం నమస్సర్వప్రియంకర ||


94. ఆపద గణపతి 

ఓమ్ నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే |

దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే ||


95. జ్ఞాన గణపతి 

గుణాతీతమౌనం చిదానంద రూపం |

చిదాభాసకం సర్వగం జ్ఞాన గమ్యం |

ముని శ్రేష్ఠమాకాశ రూపం పరేశం |

పరబ్రహ్మ రూపం గణేశం భజేమ ||


96. సౌమ్య గణపతి 

నమస్తే గణనాధాయ గణానాం పతయే నమ: |

భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యో సుఖదాయక ||


97. మహాసిద్ధి గణపతి 

గజవక్త్రం సురశ్రేష్ఠ కర్ణచామర భూషితం |

పాశాంకుశ ధరం దేవం వందే హం గణనాయకం ||


98. గణపతి 

సిందూరాస్త్రినేత్ర: పృథుతర జదరో హస్త పద్మం

దదానం | దంతం పాశాంకుశేష్ట్వానురుతర

విలసద్విజ పూరాభిరామం | బాలేందు ఖ్యాతిమౌళి

కరిపతి వదాన దాన పూర్ణార్థ గంధో | భోగేంద్రై

భూషితాంగోర్జేత్ గణపతిం రక్తస్త్రాంగరాగ: ||


99. కార్యసిద్ధి గణపతి 

యతోబుద్ధి రజ్ఞాననాశో ముముక్షో: |

యత స్సంపదోభక్త సంతోషదాస్సు: |

యతో విఘ్ననాశయత: కార్యసిద్ధి: |

సదాతం గణేశం నమామో భజామ: ||


100. భద్ర గణపతి 

అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయతే నమ:

సుగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయచ ||


101. సులభ గణపతి 

వందే గజేంద్రవదనం – వామాంకారూఢ వల్లభాశ్లిష్టం

కుంకుమపరాగశోణం – క్వులయినీ జారకోరకా పీడమ్ ||


102. నింబ గణపతి 

విఘ్నహర్తే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే |

త్వాదేయ భక్తియోగేన యోగీశాం శాంతిమాగతా: ||


103. శుక్ల గణపతి 

అంతరాయ తిమిరోపశాంతయే

శాంతపావనమచింత్య వైభవం |

తంనరం వపుషికుంజరం ముఖే

మన్మహే కిమపి తుందిలంమహ: ||


104. విష్ణు గణపతి

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే


105. ముక్తి గణపతి

పాశాంకుశౌ భగ్నరథం త్వభీష్టం కరైర్దధానం కరరన్ద్రముక్తై: |

ముక్తాఫలాభై: పృథుశీకరౌఘై: సిఙ్చన్తమఙ్గం శివయోర్భజామి ||


106. సుముఖ గణపతి

ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమోనమ: |

ప్రసన్న జనపాలాయ ప్రణతార్తివినాశినే ||


107. సర్వ గణపతి

చతు: పదార్థా వివిధ ప్రకాశాస్త్త వివ హస్తా: సచతుర్భుజం |

అనాథనాథాంచ మహోదరంచ గజాననం భక్తియుతం భజామ:


108. సిద్ధిబుద్ధి గణపతి

సత్పద్మరాగ మణివర్ణ శరీరకాంతి:

శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీ:

వక్షస్థలే వలయితాతి మనోజ్ఞ శుణ్డో

విఘ్నం మామపహర సిద్ధి వినాయకత్వమ్ ||


Wednesday, September 8, 2021

పంచ సూక్తాలు

ఈ సకల విశ్వం పాంచభౌతికం…సర్వాన్నీ సృష్టించి, నిర్వహించే పరమాత్మను దర్శించడానికి రుషులు తపించారు. మహా పురుషుని అర్థం చేసుకుని ఆరాధించాలని ఆరాటపడ్డారు. ఆ *విరాణ్మూర్తిపై వారి భక్తి ప్రపత్తులు, ప్రాకృతిక శక్తులపై వారి అవగాహనను క్రోడీకరిస్తే సూక్తాలయ్యాయి.* మానవాళికి వేదాంత సూత్రాలయ్యాయి.

*సూక్తం అంటే మంచిమాట. ‘బాగా చెప్పింది’ అనే అర్థం కూడా ఈ పదానికి ఉంది.*

*సమగ్రంగా నిరూపణ చేయడాన్ని కూడా సూక్తం అని అంటారు.*

ఈ అర్థాలన్నిటినీ సమన్వయం చేస్తే మనిషిని తీర్చిదిద్దే సమున్నతమైన మార్గదర్శకత్వ బోధన సూక్తం అని చెప్పొచ్చు. ప్రకృతి పరిణామక్రమం, దానిపై మనిషికి ఉండాల్సిన అవగాహన, చేయాల్సిన పనులు, చేయకూడని చర్యలు, సాధించాల్సిన అద్వైతభావన మొదలైన విషయాలన్నిటినీ వేదాల్లోని సూక్తాలు వివరిస్తాయి. *భక్తుడి మనస్సు ఎప్పుడూ నిశ్చలంగా ఉండడానికి, పరమాత్మ మీద లగ్నం కావటానికి భారతీయ రుషులు ప్రతిపాదించిన ప్రాథమిక సూచన వేద సూక్త పఠనం.*

నిజానికి ఇవి వేదాల్లో ఒకే చోట, ఒకే మంత్రభాగంగా ఉండవు. విభిన్న భాగాల నుంచి గ్రహించిన మంత్రాలతో సూక్తం తయారవుతుంది. వేదంలో చెప్పిన కొన్ని పరమ ప్రామాణికమైన అంశాలు, మనిషికి అత్యవసరంగా అందాల్సిన సందేశాన్ని గ్రహించి మహర్షులు చేసిన క్రోడీకరణే సూక్తాలు. నాలుగు వేదాల్లో వందలాదిగా ఉన్న సూక్తాల్లో *పురుషసూక్తం, శ్రీసూక్తం, నారాయణసూక్తం, భూ సూక్తం, నీలాసూక్తం… పంచసూక్తాలుగా ప్రసిద్ధిపొందాయి.*

*పురుష సూక్తం:-*

‘పురుష’ అనే పదానికి భగవంతుడు అని అర్థం చేసుకోవాలి. విశ్వానికి మూలశక్తి అయిన విరాట్పురుషుడి స్వరూప, స్వభావ వర్ణన, విశ్లేషణ ఈ సూక్తంలో ప్రధానాంశాలుగా ఉంటాయి.  *సాధారణ భావనలో మనం ఊహించుకునే విష్ణుమూర్తి, పురుషసూక్తం ప్రకటించే నారాయణుడు ఇద్దరూ వేర్వేరు.* ఈయన త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణువు కన్నా పూర్వమే ఉన్నాడు. విశ్వం ఆవిర్భావానికి ఇతనే మూలకారణశక్తి.

ఓం తచ్ఛంయో రావృణీమహే

గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే…

అనే ప్రసిద్ధ మంత్రంతో పురుషసూక్తం ప్రారంభమవుతుంది. ఇందులో సకల దేవతల స్వరూపంగా విరాజిల్లే విరాట్పురుషుడి వైభవాన్ని శ్లాఘిస్తారు. భగవంతుడి సంకల్పంతోనే సృష్టి జరుగుతుందని, ఈ సృష్టి కార్యమంతా ఓ యజ్ఞమని చెబుతుంది. *దానికి కారకులైన వారికి, ఈ యజ్ఞాన్ని నిర్వహించేవారికి, ఇందులో భాగం తీసుకున్న ప్రతి ఒక్కరికీ చివరకు పశు పక్ష్యాదులతో సహా ప్రతి ప్రాణికీ శుభం కలగాలని ఆశిస్తూ పురుష సూక్తం ఆరంభమవుతుంది.*

సబ్రహ్మః, సశివః, సహరిః – అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే హరి అంటుంది పురుషసూక్తం. అమ్మవారి ఆలయమైనా, శివాలయమైనా, విష్ణ్వాలయమైనా పూజించే దేవుడు ఎవరైనా సరే అన్ని ఆలయాల్లోనూ మంత్రపుష్పంలో చెప్పే పురుషసూక్త భాగం ఇది. *దైవశక్తి అంతటా నిండి ఉందనే అద్వైతభావాన్ని పురుషసూక్తం ప్రబోధిస్తోంది. విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ చైతన్యం ఒక్కటే. దాన్ని ఎవరు ఏ శక్తిగా భావించి పూజిస్తారో ఆ శక్తిరూపంలోనే ఆ చైతన్యం వ్యక్తమవుతుందనే విషయాన్ని పురుషసూక్తం విస్పష్టంగా ప్రకటిస్తుంది.* అద్వైతభావనకు పురుషసూక్తం పునాదిగా నిలుస్తుంది.

ఎక్కడుంది?

రుగ్వేదం పదోమండలంలో ఈ సూక్తం ఉంది. కృష్ణయజుర్వేదం అరణ్యకం, 3వ ప్రపాఠకంలో, 12వ అనువాకంలో కూడా పురుషసూక్తం కనిపిస్తుంది. యజుర్వేదంలో ‘నారాయణ ఉపస్థాన మంత్రం’, ‘ఉత్తర నారాయణ అనువాకం’ పేర్లతో ఈ సూక్తాన్ని పేర్కొన్నారు.

*నారాయణ సూక్తం:-*

పురుషసూక్తం విశ్వవ్యాప్తమైన విరాట్‌ స్వరూపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, నారాయణుడిగా ప్రకటించింది. నారాయణసూక్తం ఆ పరబ్రహ్మాన్ని నారాయణ స్వరూపంలోనే పూర్తిగా విశదీకరించింది. ఈ సూక్తంలో ప్రధానంగా రెండు భాగాలు కనిపిస్తాయి. మొదటి భాగంలో భగవంతుడి మహిమ ప్రకటితమవుతుంది. రెండో భాగంలో ఆ భగవంతుడిని ఎలా, ఏవిధంగా, ఎక్కడ ధ్యానం చేయాలో, మనస్సును ఎలా లగ్నం చేయాలో వివరణత్మాకంగా ఉంటుంది.

నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః

నారాయణ పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః

నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః

విశ్వమంతా  జ్యోతిస్వరూపంగా నిండి ఉన్నవాడు నారాయణుడే. ఆయనే పరబ్రహ్మ. నారాయణుని ధ్యానం చేసేవారిలో శ్రేష్ఠుడు నారాయణుడే అంటుందీ సూక్తం. సర్వోన్నతమైన ప్రతి అంశంలోనూ నారాయణ అంశను, నారాయణ తత్త్వాన్ని దర్శించడం ఇందులో ప్రధాన విషయం. *ప్రపంచానికి లోపల, బయటా, కనిపించేదీ, వినిపించేదీ కూడా నారాయణుడే.*

సముద్రేంతం విశ్వశంభువం… పద్మకోశ ప్రతీకాశగ్‌ం హృదయంచాప్యధోముఖం..’

సముద్రానికి అవతల భగవంతుడు ఉంటాడని ఈ మంత్రభాగానికి అర్థం. *ఇక్కడ సముద్రమంటే సంసారసాగరం అని అర్థం చేసుకోవాలి.* కోరికలు, భావోద్వేగాలనే అలలతో సంసార సాగరం ఎప్పుడూ కల్లోలంగా ఉంటుంది. సాధకుడు వీటిని అదుపులో ఉంచుకోవాలి. ఇది జరిగితే ధ్యానంలో మనస్సు లగ్నమవుతుంది. *అంతిమంగా ఆ అనంతుడి సాక్షాత్కారాన్ని మనస్సు పొందుతుంది.*

*ఎక్కడుంది?*

కృష్ణయజుర్వేదం అరణ్యకభాగం… నారాయణోపనిషత్తు, 13వ అనువాకంలో…

*శ్రీసూక్తం:-*

శ్రీ అంటే సంపద, లక్ష్మి అనే అర్థాలు ఉన్నాయి. పరమాత్మ అనంతమైన శక్తుల్లో లక్ష్మీశక్తి ఒకటి. జగత్తును పోషించేందుకు ఈ శక్తి చాలా అవసరం.

ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్‌

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ.. శ్రీసూక్తంలో తొలి మంత్రమిది.

*ఇక్కడ లక్ష్మి అంటే మనం చూసే లౌకిక సంపద కాదు. ఎప్పటికీ తొలగిపోని, తరిగిపోని జ్ఞాన సంపదే అసలైన లక్ష్మి.* యజ్ఞానికి ముఖ్యదేవత అగ్ని. ఇతని ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. అగ్ని జ్ఞానానికి సంకేతం. *అగ్ని ద్వారా లక్ష్మిని ఆహ్వానించడం అంటే జ్ఞానసంపదను ఆరాధించడమే.*  ఈ భావాన్ని కొనసాగిస్తూ శ్రీసూక్తంలోని రెండో మంత్రం ‘లక్ష్మీం అనపగామినీం’ అంటుంది. *అంటే ఎప్పటికీ తొలగిపోని లక్ష్మి కావాలని కోరుకుంటాడు భక్తుడు.* ఎప్పటికీ తొలగిపోని సంపద *తత్త్వజ్ఞానం.* తనను తాను తెలుసుకునే ఆత్మజ్ఞానం. ఆ జ్ఞానాన్నివ్వాలని లక్ష్మీస్వరూపంలో ఉన్న ప్రకృతిస్వరూపిణికి భక్తుడు శ్రీసూక్తం ద్వారా విన్నవించుకుంటాడు.

‘అలక్ష్మీర్నాశయామ్యహం..’ అంటుంది శ్రీసూక్తంలోని మరో మంత్రం.

నాలోని అలక్ష్మి నశించిపోవుగాక అని భక్తుడు కోరుకుంటాడు. *అలక్ష్మి అంటే సాధారణ అర్ధంలో సంపద లేకపోవటం, దారిద్య్రాన్ని అనుభవించడం అవుతుంది. కానీ, ఇక్కడ వేరు. మనిషిలో ఉండే దుర్గుణాలన్నీ అలక్ష్మికి ప్రతిరూపాలే. అవన్నీ తొలగిపోవాలని కోరుకుంటాడు భక్తుడు.* ఎప్పుడైతే దుర్గుణాలు తొలగిపోతాయో అప్పుడు మిగిలేది అనంతమైన జ్ఞానలక్ష్మి మాత్రమే. ఈ భావాన్ని కొనసాగిస్తూ శ్రీసూక్తంలో మరో చోట దారిద్య్రాన్ని ధ్వంసం చేయాలని భగవతిని భక్తుడు వేడుకుంటాడు. *భావదారిద్య్రాన్ని కలగకుండా ఉండేలా అనుగ్రహించమని భగవంతుణ్ణి కోరుకోవడం శ్రీసూక్తం ప్రకటిస్తున్న ప్రధానాంశం.*

*ఎక్కడుంది?*

శ్రీ శక్తిని ఆరాధించే ఈ మంత్ర భాగం రుగ్వేదంలో కనిపిస్తుంది.

*భూసూక్తం:-*

మనిషి ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చాడు. ఇక్కడ అతడు నిలబడటానికి భూమి ఆధారంగా నిలిచింది.  ఎదగటానికి అవసరమైన అన్ని పదార్థాలను భూమాతే  ఇచ్చింది. చివరగా భౌతికమైన దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత దాన్ని కూడా తనలోనే కలిపేసుకుంటుంది.  అందుకే *భూమిపై మనిషికి కృతజ్ఞత తప్పనిసరిగా ఉండి తీరాలి.* భూమి చూపిస్తున్న ఉదారతకు, ఆమెను దైవంగా ఆరాధించాలనే భావనను కలిగించే వేద మంత్ర భాగమే భూసూక్తం.

యత్‌ తే మధ్యం పృథివి యచ్చ నభ్యం యాస్త ఊర్జస్తన్వః సంబభూవుః తాసు నోధే హ్యభినః పవస్వ… మాతాభూమిః పుత్రోహం పృథివ్యాః పర్జన్యః పితాన ఉనః పిపర్తు… ’ భూమిని తన తల్లిగా, తనను భూమి పుత్రుడిగా భావించాల్సిన కర్తవ్యాన్ని మనిషికి ఈ మంత్రం సదా గుర్తుచేస్తుంది. వైదిక సంప్రదాయంలో భూమిని కేవలం నివాసయోగ్యతను కలిగించిన జడరూపమైన పదార్థంగా భావించలేదు. భూమితో ఒకవిధమైన అనుబంధాన్ని వేదం మనిషికి కలిగించింది. *ఈ భూమిపై ఉన్న  ప్రతి మట్టికణంలో దివ్యత్వాన్ని దర్శింపచేసుకోవాల్సిన అవసరాన్ని వేదం ప్రకటిస్తుంది.*

*ఎక్కడుంది?*

అధర్వణ వేదంలో, యజుర్వేదంలో ఈ మంత్ర భాగాలు కనిపిస్తాయి.

*నీలాసూక్తం:-*

సామవేదంలో ప్రస్తావించిన ‘స్తోమత్రయస్త్రింశం’ అనే హోమానికి సంబంధించిన మంత్రాలు ఈ సూక్తంలో ప్రధానాంశాలు. ఈ సూక్తంలో ఆకాశానికి సంబంధించిన అంశాలుంటాయి. భూమికి ఊర్ధ్వదిశలో ఉండే నింగి ప్రాణికోటి అవసరాలు ఎన్నిటినో తీరుస్తుంది. భూమికి, ఆకాశానికి మధ్య సంబంధం, సూర్యగమనం, దిక్కులకు సంబంధించిన ప్రస్తావన ఇందులో ఉంది. మన వాతావరణంలో అనేక వాయువులు ఉంటాయి. *వీటిలో ప్రత్యేకించి ‘మాతరిష్వ’ అనే వాయువు గురించి నీలాసూక్తం ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది.* దీనికి దక్షిణ దిక్కు నుంచి వీచేగాలికి మాతరిష్వ అని పేరు. ప్రాణులను సంరక్షించే వాయువనే అర్థం కూడా ఉంది. ఈ సర్వవ్యాపకమైన వాయువును గురించి వివరణ ఇక్కడ కనిపిస్తుంది.

నీలాసూక్తంలో భూమిని విష్ణుపత్నిగా సంబోధిస్తుంది వేదం. ఇక్కడ విష్ణుపత్ని అంటే విష్ణువును పరిపాలకుడిగా కలిగినది అనే అర్థం చేసుకోవాలి. *ప్రకృతిని సంరక్షించుకోవాలనే సందేశం అంతర్లీనంగా ఉంది.*

*ఎక్కడుంది?*

కృష్ణయజుర్వేదం ఒకటో కాండ 7వ పన్నం, 10వ అనువాకంలో కొంతభాగం, 4 కాండ, 4వ పన్నంలో కొంతభాగం కలిపి నీలాసూక్తంగా మహర్షులు పేర్కొన్నారు.


ఇందులో సైన్స్‌ ఉంది…

మనిషికి అంతుచిక్కని రహస్యాల్లో సృష్టి క్రమం ఒకటి. ఈ సృష్టికి ఏది మొదలు? ఇందుకు కారణం ఎవరు? అనే ప్రశ్నలు చాలాకాలంగా మనిషిని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. వీటికి సమాధానాలు చెబుతూ, అందులోని వైజ్ఞానిక కోణాన్ని తట్టిలేపే ప్రయత్నం చేస్తుంది పురుషసూక్తం. సనాతన భారతీయ వేదవ్యవస్థలోని సమున్నతమైన వైజ్ఞానికతకు, తార్కికతకు ఈ సూక్తం చక్కటి ఉదాహరణ.

*పురుషసూక్తం:-*

పురుషసూక్తంలో అత్యంత ప్రసిద్ధిపొందిన మంత్రభాగం ఇది. విశ్వావిర్భావానికి ముందే ఉన్న విరాట్పురుషుడికి వెయ్యి తలలు, వెయ్యి కళ్లు అంటుంది పురుషసూక్తం. ఇక్కడ సహస్రం అంటే వెయ్యి అనే అర్థం ఉన్నా ‘అనంతం’ అనే అర్థాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. అనంతమైన వ్యాపక స్వభావం కలిగిన వాడు పరమాత్మ. నిశ్చలంగా ఉన్న నీటి మీదకు చిన్నరాయి విసిరేస్తే తరంగాలు ఏర్పడతాయి. ఈ తరంగాలకు మొదటి స్థానం బిందువు. రాయి నీటికి తగిలిన చోట బిందువు ఏర్పడి, వ్యాకోచం చెంది తరంగాలుగా మారి, అవి వ్యాపకత్వాన్ని పొంది ఎలాగైతే ఆ నది లేదా తటాకం అంతా విస్తరిస్తాయో అదే క్రమంలో ఈ విశ్వసృష్టి క్రమం ఓ మహాబిందువు కేంద్రంగా జరిగింది. గణితపరంగా చూస్తే వృత్తం మీద ఉండే ప్రతి బిందువూ శీర్షమే. అలాంటి ఎన్నో శీర్షాల కలయికే వృత్తం. అనంతమైన శీర్షాలు కలిగినవాడు పరమ పురుషుడు అనటంలో కూడా ఆ మహానుభావుడి అనంతమైన వ్యాపకత్వ లక్షణం కనిపిస్తుంది. ఇలా ఎన్నో గణిత భావనలు పురుషసూక్తంలో కనిపిస్తాయి.

సహస్రశీర్షా పురుషః..  *భావాన్ని గణితశాస్త్రంలో అన్వయిస్తే శ్రీచక్రం ప్రాథమిక రూపం ఏర్పడుతుంది. శ్రీచక్రం శక్తి స్వరూపం. లలితాదేవికి ప్రతిరూపం. ఈ రెండు భావనల్ని సమన్వయం చేస్తే ఎవరు విరాట్పురుషుడిగా ఉన్న నారాయణుడో ఆయనే దేవీ స్వరూపంలో ఉన్న మహాశక్తి అని అర్థమవుతుంది.*

వినాయక చవితి ముందు రోజు గౌరీపూజ ఎందుకు చేస్తారు ?

శక్తికి మూలం దేవత మరియు మంగళకరం , మంగళప్రదానికి సంకేతంగా గౌరీదేవిని పూజిస్తారు. గౌరీ పండుగను భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు. గౌరీ గణేష్ , గౌరీ చౌతి లేదా గౌరీ పండుగ అని పిలువబడే ఈ పండుగను గణేశ చతుర్థి సందర్భంగా జరుపుకుంటారు. ఈ పండుగ వివాహిత మహిళలకు అంకితం చేయబడింది. హిందూ క్యాలెండర్ ప్రకారం , గౌరీ పండుగను స్వచ్ఛమైన తృతీయ రోజున జరుపుకుంటారు. గౌరీ పండుగ మరుసటి రోజు , భాద్రపద శుద్ద చతుర్థి రోజు నుండి గణేశ చతుర్థి పండుగ పర్వదినాలు ప్రారంభమవుతాయి.

సౌభాగ్యాలను ప్రసాధించే గౌరీ పండుగను వివాహిత మహిళలలకు జరుపుకుంటారు , గౌరీ దేవిని ఆరాధించడం వల్ల సుఖ , సంతోషాలతో పాటు ఆనందం , సంపద మరియు సుదీర్ఘ జీవితాన్ని ఇస్తుందని మరియు తన భర్తను ఆయుష్యును పెంచి ఆశీర్వదిస్తుందని అంటారు. గౌరీ పండుగ వరమహాలక్ష్మి వ్రత మాదిరిగానే ఉంటుంది. తేడా ఏమిటంటే లక్ష్మి స్థానంలో గౌరీదేవిని పూజిస్తారు.

గౌరీ మరియు గణేశ

గౌరీ దేవి / పార్వతీ దేవి ఆమె శరీరానికి లేపనంగా రాసిన పసుపు ముద్ద సహాయంతో గణేషుడిని సృష్టించి. ఆ రోజును గణేశుని పుట్టినరోజుగా భావించారు. ఆ పవిత్ర దినోత్సవాన్ని వినాయక చతుర్థి లేదా గణేశ చతుర్థి అని పిలువబడుతోంది.

గణేశ చతుర్థి

సిరిసంపదలు సమృద్ధిగా , జ్ఞానం , గొప్పతనం , దీర్ఘాయువు , ఆరోగ్యం వంటి మంగళప్రదాలను ప్రసాదించే వారు గణేశుడు. హిందూ పంచాగం ప్రకారం , పండుగ భాద్రపద మాసంలో వస్తుంది. అన్నివేలలా కరుణ కలిగి , ఎల్లప్పుడు ఆశీష్యులను ప్రసాధించే గణేష్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు గణేశ చతుర్థిని జరుపుకుంటారు. ఈ పండుగను ఇంటి సాంప్రదాయాల ప్రకారం , ఒక రోజు , మూడు రోజులు , ఏడు రోజులు , పది రోజులు జరుపుకుంటారు. కొంతమంది గౌరీ , గణేశుడి విగ్రహాన్ని గౌరీ ఇంటికి తీసుకువస్తారు, మరో ఇద్దరు గౌరీ విగ్రహాలను కూడా తెచ్చి గణేశుని సోదరీమణులుగా ఆరాధిస్తారు.

పశ్చిమ బెంగాల్‌లో లక్ష్మీ , సరస్వతిని గణేశుడి సోదరీమణులుగా

పశ్చిమ బెంగాల్‌లో లక్ష్మీ , సరస్వతిని గణేశుడి సోదరీమణులుగా పూజిస్తారు. వారు దుర్గాదేవి పిల్లలుగా భావిస్తారు. కొందరు లక్ష్మీ , సరస్వతి గణేశుల ఇద్దరు భార్యలు. రిద్ధి మరియు సిద్ధి. ఇది తరచుగా అనేక అపోహలకు కారణమని చెప్పవచ్చు. ఈ కారణాలన్నింటికీ ఈ పండుగను గౌరీ గణేష పండుగా పిలువబడుతున్నది.

గౌరీ గణేష్ పండుగ యొక్క పురాణం గాథ

పురాణాల ప్రకారం , ఒక రోజు శివుడి నివాసమైన కైలాసంలో గౌరీకి దగ్గరగా కాలకేయులు , ఆప్తులు వంటి వారు ఎవరూ లేరు. ఆ సమయంలో విసుగు చెందిన పార్వతి దేవి స్నానం చేయాలనుకున్నారు. ఎవరైనా ఇంటి తలుపు వద్ద కూర్చొండి బెట్టి స్నానానికి వెల్లాని అనుకుంటుంది. కానీ ఎవరూ లేరని ఆమె బాధపడింది. అప్పుడు ఆమె తన శరీరానికి అతుక్కుపోయిన పసుపు నుండి ఒక విగ్రహాన్ని తయారు చేసి ప్రాణం పోస్తుంది

ఆమెకు విగ్రహం చూడగానే చాలా ఇష్టపడుతుంది. ఆ ఇష్టంతోనే ఆమె ఆ విగ్రహమూర్తికి గణేశ అని పేరు పెట్టింది. తర్వాత ఆమె పరిస్థితిని గణేశునికి వివరించి , ఇప్పుడు నేను స్నానం చేయబోతున్నాను. ఎవరినీ లోపలికి రానివ్వకండి అని చెబుతుంది. అంగీకరించిన గణేష్ ద్వారపాలకుడిగా తల్లికి కాపలా కాస్తూ నిలబడుతాడు. అంతలో ఆ పరమేశ్వరుడు రానే వస్తాడు , లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించగా గణేశుడు ఆ పరమేశ్వరుడిని అడ్డుకుంటాడు. కానీ తల్లి ఆజ్ఞను పాటిస్తున్న గణేశుడు శివుడిని లోపలికి వెళ్ళడానికి అనుమంతించకుండా ఆపుతాడు.

శివుడు పార్వతి దేవి పతిదేవుడనే విషయం గణేశుడికి , గణేశుడు పార్వతి దేవి సృష్టించి కుమారుడని శివుడికి తెలియదు. ఈ కారణంగానే ఇద్దరి మద్య వాద వివాదాలు జరుగుతాయి. ప్రవేశ ద్వారం వద్ద తండ్రి అడ్డుకున్న గణేశడు తన కుమారుడే అని గుర్తించిన ఆ పరమేశ్వరుడు ఆగ్రహావేశాలకు గురి అయ్యై గణేశుడి తలను నరికివేస్తాడు.

బాలుని హాహాకారాలు విన్న పార్వతీ దేవీ

బాలుని హాహాకారాలు విన్న పార్వతీ దేవీ పరుగున వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న కుమారుని చూచి నిశ్చేష్టురాలైంది. భర్తతో వాదులాడింది. జరిగిన తప్పు తెలుసుకున్న కైలాసనాథుడు పశ్చాత్తాపపడ్డాడు. బాలునికి ప్రాణం పోస్తానని మాట ఇచ్చాడు.

ఇది తేలిసిన పార్వతి ఆగ్రహించి ఎలాగైనా వినాయకుడిని బ్రతికించాలి అని కోరుకుంటుంది. చనిపోయిన వ్యక్తికి ఉత్తరాన ఉన్న తలను పెట్టాలి అని శివుడు చెప్తాడు కావున భటులు ఉత్తర దిక్కున్న పడుకున్న వ్యక్తి తలా కోసం వేటుకుతారు అయినప్పటికీ చివరిగా వారికి ఒక్క ఏనుగు తలా మాత్రమే దొరుకుతుంది. శివ శిశువు మీద ఏనుగు తలను స్థిరపెట్టి , అతనికి తిరిగి జీవానికి తీసుకువచ్చాడు.

గౌరీ చతుర్థి ఆచారం

మహిళలు చతుర్తికి ముందు రోజు ఈ దేవిని పూజించడం ఆచారంగా వస్తోంది. అమ్మ విగ్రహాన్ని పసుపుతో అలంకరించి బియ్యం లేదా ధాన్యాల కలశం ఉంచడం జరగుతుంది. పూలు , పండ్లు సమర్పించి పూజిస్తారు. మరుసటి రోజు గణేశుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు.

Tuesday, September 7, 2021

అష్ట దిక్కుల ప్రాదాన్యత!


మనకు ఎనిమిది దిక్కులు ఉన్నాయి. 

వాటిని 'అష్ట దిక్కులు' అంటాము. 

వాటిని పాలించే వారిని 'దిక్పాలకులు' అంటారు.

దిక్కులు: తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణములను 'దిక్కులు' అంటారు.


👉విదిక్కులు: ఈ నాలుగింటితో పాటు ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము అను నాలుగు విదిక్కులు కూడా కలవు. అన్నింటిని కలిపి అష్టదిక్కులు అంటాము.


👉1) తూర్పు: తూర్పు దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత ఇంద్రుడు. ఇంద్రుని భార్య శచీదేవి. ఆయన వాహనము ఏనుగు. నివసించే పట్టణము 'అమరావతి.' ఇంద్రుడు ధరించే ఆయుధము వజ్రాయుధము. ఈయన పురుష సంతాన కారకుడు. అధికారం కలుగజేయువాడు. సూర్య గ్రహం ప్రాదాన్యత వహించే ఈ దిక్కు దోషం వలన అనారోగ్య సమస్యలు, అదికారుల బాధలు ఉంటాయి.


👉2) ఆగ్నేయ మూల: ఆగ్నేయ దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత అగ్నిహోత్రుడు. అగ్ని భార్య స్వాహాదేవి. వాహనము పొట్టేలు. అగ్నిహోత్రుడు నివసించే పట్టణము తేజోవతి. ధరించే ఆయుధము శక్తి. ఈయన కోపం,అహంకారం ప్రసాదించే వాడు. ఆగ్నేయం శుక్రుడు ప్రాదాన్యత వహిస్తాడు. ఆగ్నేయం వంటకు సంబందించిన దిక్కు. వంట స్త్రీలకు సంభందించినది కాబట్టి ఈ దిక్కు దోషం వలన స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి.


👉3) దక్షిణము: దక్షిణ దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత యమధర్మరాజు. ఈయనకు దండపాణి అని మరో నామధేయమున్నది. యముని భార్య శ్యామలాదేవి. యముని యొక్క వాహనము మహిషము (దున్నపోతు). నివసించే పట్టణము సంయమని. యముడు ధరించే ఆయుధము దండము. దండమును ఆయుధముగా కలవాడు కాబట్టి ఈయనను 'దండపాణి' అని కూడా అంటారు. యముడు వినాశనం, రోగం ప్రసాదించేవాడు. కుజుడు ఆదిపత్యం వహించే దక్షిణ దిక్కు లోపం వలన తరచు వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి.


👉4) నైరుతి మూల: నైరుతి దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత నివృత్తి అనే రాక్షసుడు. ఇతని భార్య దీర్ఘాదేవి. వాహనము నరుడు. ఇతడు నివసించే పట్టణము కృష్ణాంగన. నైరుతి ధరించే ఆయుధము కుంతము. వంశ నాశకుడు నైరుతి. నైరుతి దిక్కు రాహుగ్రహ ప్రాదాన్యత ఉంటుంది కాబట్టి ఈ దిక్కు దోషం వలన కుటుంబంలో ఎప్పుడు మానసికమైన చికాకులు అధికం


👉5) పడమర: పడమర దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత వరుణుడు. వరుణుని భార్య కాళికాదేవి. వాహనము మకరము (మొసలి). ఇతడు నివసించే పట్టణము శ్రద్ధావతి. ధరించే ఆయుధము పాశము. సర్వ శుభములను ప్రసాదించేవాడు. పడమర దిక్కు శనిగ్రహ ప్రాదాన్యత వలన ఈ దిక్కు దోషం వలన పనులు జాప్యం కలుగుతాయి.


👉6) వాయువ్య మూల: వాయువ్య దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత వాయువు. అనగా వాయుదేవుడు. ఈయన భార్య అంజనాదేవి. వాహనము లేడి. నివసించే పట్టణము గంధవతి. ధరించే ఆయుధము ధ్వజము. పుత్ర సంతానమును ప్రసాదించువాడు. వాయువ్య దిక్కు చంద్రుడు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన ఒడిదుడుకులు ఉంటాయి.


👉7) ఉత్తరము: ఉత్తర దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత కుబేరుడు. ఇతని భార్య చిత్రలేఖ. వాహనము గుర్రము. కుబేరుడు నివసించే పట్టణము అలకాపురి. కుబేరుడు ధరించు ఆయుధము ఖడ్గము. విద్య, ఆదాయము, సంతానము, పలుకుబడి ప్రసాదించువాడు. బుధుడు ఉత్తరదిక్కు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన వ్యాపారం, విద్యా సంబంద విషయాలలో ఇబ్బందులు వస్తాయి.


👉 8.)ఈశాన్య మూల: ఈశాన్య దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత శివుడు. శివుని భార్య పార్వతీదేవి. శివుని వాహనము వృషభము(ఎద్దు). నివసించు ప్రదేశం కైలాసం. శివుడు ధరించు ఆయుధం త్రిశూలం. గంగాధరుడు శివుడు అష్టైశ్వర్యాలు, భక్తి జ్ఞానములు, ఉన్నత ఉద్యోగములను ప్రసాదించేవాడు. ఈశాన్య దిక్కు గురుగ్రహ ఆదిపత్యం ఉంటుంది.ఈశాన్య దిక్కు లోపం ఉంటే సంతాన విషయంలో ఇబ్బందులు ఎర్పడతాయి.


👉ఈ విధంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది దిక్పాలురు ఉండి మానవు లను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు.దిక్కులేని వారు అనేవారు లేకుండా దిక్కుగా, దిక్సూచిగా కాపాడుతూ ఉంటారు.

దిక్పాలకులకు కూడా సర్వాధికారి శ్రీ మహా విష్ణువు. అష్ట దిక్కులకు వారిని నియమించి, విధి విధానాలను, నియ మాలను, ధర్మాలను ఆజ్ఞాపించు వాడు, నడి పించు వాడు, అధి(పతి)కారి శ్రీ మహా విష్ణువే సకల దేవతల చక్రవర్తి శ్రీ మహావిష్ణువు.

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...