మాఘ శుద్ధ సప్తమినే రధ సప్తమి అంటారు. 2020వ సంవత్సరంలో రధ సప్తమి ఫిబ్రవరి 1 శనివారం నాడు వస్తుంది. అంటే, సూర్య భగవానుడి పుట్టిన రోజు. సూర్యుడు ఏకచక్ర రధము , ఆరు ఆకులూ, ఏడూ అశ్వాలు తో కూడిన వాహనము పై ప్రయాణిస్తాడు. చక్రం అంటే ఒక సంవత్సరం. ఆరు ఆకులూ అంటే ఆరు ఋతువులు, ఏడూ అశ్వాలు అంటే ఏడూ కిరణాలూ. సూర్య భగవానుడు ఉదయం పూట బ్రహ్మ స్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరుడులాగా మధ్యాహ్నము తన కిరణాల ద్వారా దైవిక వికారాలను రూపుమాపి, సాయంకాలము, విష్ణురూపంలో భాసిల్లే కిరణాలను మనో రంజకముగా ప్రసరింప చేస్తూ ఆనందింపచేస్తాడు.
మన పురాణాలలో సూర్యుడి గురించి అనేక కధలు, ఆయన ఉపాసనా విధానాలు వున్నాయి. మాఘ మాసంలోనే వచ్చే రధ సప్తమి. ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ పుట్టిన రోజు. సూర్యుణ్ణి మనం ప్రత్యక్ష దైవంగా భావిస్తాము. నిత్య జీవితంలో మనకాయన అనేక విధాల సహాయ పడతాడు. అంధకారం తొలగించి, మనకు వెలుగుని ప్రసాదించి, మన చుట్టూ ఏం వున్నదో చూసే అవకాశం ఇస్తున్నాడు. వర్షాలను కురిపించి మన దప్పిక తీర్చటమేగాక, జీవనాధారమైన పంటలు పండటానికి సహకరిస్తాడు. అంతేకాదు .. మనం కాలాన్ని గుర్తించేది .. సూర్య గమనాన్ననుసరించే. ఒక పగలు, ఒక రాత్రి ఒక రోజుగా లెక్కిస్తాము కదా. అన్నింటికన్నా ముఖ్యమైనది .. భూమి మీద వున్న అనేక మలినాలను నాశనం చేసి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
రధ సప్తమి నాడు చేసే స్నానానికి ఒక విశిష్టత వుంది. ఆ రోజు శిరస్సుపై ఏడూ జిల్లేడు ఆకులను పెట్టుకొని నీటితో తల స్నానం చెయ్యాలి. ఇలా చెయ్యడం వలన ఏడూ జన్మలనుంచి వస్త్తున్న సమస్త పాపములు నశిస్తాయని పెద్దలు చెపుతారు.
రథ సప్తమి నాడు శిరస్నానం చేసేవేళ పఠించవలసిన మంత్రం
యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు,
తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి
జన్మ జన్మాంతారాల్లో మనోవాక్కాయాలతో, తెలిసీ, తెలియక చేసిన సప్తవిధ పాపాలవల్ల ఏర్పడిన రోగం, శోకం, మున్నగునవన్నీ ఓ లక్ష్మీకరమైన మకర రాశిలోని సప్తమి ఈ స్నానంతో నశించుగాక అని దీనర్ధం. తల్లిదండ్రులు లేని వారు ఈరోజు పెద్దలకు తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశం లో నక్షత్ర కూటమి రధం ఆకారంలో ఉంటుంది.
స్నానానంతరం సూర్యుని కిరణాలూ పడే చోట, లేక తులసి చెట్టు వున్న చోట, ఒక పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి, ముగ్గులుపెట్టి, సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. గంధం మరియు కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి. ఏడూ చిక్కుడు కాయలను తీసుకొని, కొబ్బరి పుల్లల సహాయముతో రథముగా చేసి, సూర్యుని రథముగా భావించి పూజ చెయ్యాలి. సూర్యునికి నేతితో దీపం వెలిగించాలి.
గోమయంతో చేసిన పిడకలని తీసుకొని పొయ్యి మీద ఇత్తడిపాత్రలో ఆవుపాలును పోసి కర్పూరముతో వెలిగించాలి. పాలు పొంగుతున్న సమయములో, కొత్త బియ్యం, బెల్లం వేసి, చెరుకు గడతో తిప్పుతూ పరామాన్నం తయారు చెయ్యాలి. ఈ పరామాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యనారాయణ మూర్తికి నైవైద్యంగా సమర్పించాలి. ప్రసాద వితరణ కూడా చిక్కుడు ఆకుల్లోనే చెయ్యాలి.
పాలు పొంగించడమంటే, ఇంటి అభివృద్ధికి సంకేతం. ఆ చిక్కుడు ఆకుల్లో, మన కుల దేవతతో పాటు, సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలకు, గణపతికి, నైవేద్యం పెట్టాలి. అందులో కొంచెం చలిమిడి, వడపప్పు పెట్టాలి. అలాగే ఏడూ రేగుపళ్ళుని, ఏడూ చిన్న చెరుకు ముక్కలను నైవేద్యముగా పెట్టాలి. ముందుగా గణపతిని, తరువాత కులదేవతను తరువాత సూర్య భగవానుడుని ఎర్రటి పూలతో పూజించాలి. ఈ రోజు, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదవాలి. పూజ అనంతరం, సత్ బ్రాహ్మణుడికి , నువ్వులు, స్వయంపాకం లేదా పెరుగు దానం ఇవ్వాలి.
No comments:
Post a Comment