Saturday, January 4, 2020

వేదాల్లో న అణువిజ్ఞాన ఆనవాళ్లు

మంత్రం:-
‘‘ఆయం గౌః పృశ్నిరక్ర మేత్
అసదన్మాతరం పురః పితరంచ ప్రయన్త్వః

ఇతి ఋగ్వేదే సామ వేదే 630- మంత్రం 1376 మంత్రం అధర్వణ వేదే 6వ కాండ, 31 సూక్తం 1వ మంత్రం.

పై శ్లోకంలో ‘గౌః’ అంటే భూమి అని అందరికీ తెలిసిన అర్థమే కాకుండా చంద్రుడనే అర్థం కలదు. విశ్వకోశమనే గ్రంథంలో ‘గౌః, స్వర్గే, వృషభే, రశ్మౌ వజ్రే, చంద్రమసి, స్మృతః’ అని అర్థాలు చెప్పబడ్డాయి. అటులనే నానార్థ రత్నమాలయందు ‘గౌః కతే, వృషభే, చంద్రే’ అని కలదు.

మంత్రార్థము: 

మనకు కనబడుతున్న చంద్రుడు భూమికి ఉపగ్రహమగుట చేత మాతృభూతురాలగు భూమికి ద్రక్షిణం చేయుచు, భూమితో కలిసి సర్వలోక పోషకుడై, స్వయం ప్రకాశ మానుడైన పితృస్థానీయుడగు సూర్యుని చుట్టూ తిరుగుచున్నాడని వేదములు చెప్తున్నాయి. ఇదే విషయాన్ని సూర్య సిద్ధాంతాది జ్యోతిష్య గ్రంథములను చెప్పుచున్నవి. ఈ విధంగా అనేక అద్భుత గ్రంథములతో కూడిన శాస్త్ర వాఙ్మయాన్ని వదిలిపెట్టి భారతీయ విద్యా గంధమేమాత్రము లేని పాశ్చాత్య భావజాలానికి పూర్తిగా దాసులైన మన వారే గెలీలియో చెప్పేవరకూ మనవారికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని తెలియదనుకొంటున్నారు.
సనాతన ధర్మంలో భారతీయ మహర్షులందించిన సత్వాలు, నవీన విజ్ఞానానికి కూడ ప్రామాణికమని వ్యవహారిక ఆధారాలతో నిరూపితమయ్యాయి. అట్టి సత్యాలు వేదాలతో, కాలానుగుణంగా మహర్షులందించిన శాస్త్రాలలో నిక్షిప్తం చేయబడ్డాయి.

సకలము భగవంతుని స్వరూపమేనని, అట్టి భగవంతుడు ‘సత్ చిత్ ఆనందమయుడని వారు భావించారు. సత్ అంటే ఎప్పటికీ వుండేదని, ఒకప్పుడుండి ఇంకొకప్పుడు లేనిది సత్యమనబడదు. అట్లే ‘చిత్’ అంటే జ్ఞానం, నిరంతర జ్ఞానంతో కూడిన ఆనంద స్వరూపుడే పరమాత్మ. అనుభవపూర్వకంగా ఇట్టి విషయాన్ని తెలుసుకున్న మహర్షులు ప్రతిపాదించిన సత్యాలు మాత్రమే మానవాళికి నిజమైన శుభ పరిణామాన్ని ఇవ్వగలవు. అట్లుకాక ఇంద్రియ జన్యమైన జ్ఞానాన్ని తాత్కాలిక విషయాలను ఆధారం చేసుకుని రూపొందించే ప్రతిపాదనలు ఆవిష్కరణలు కాలక్రమంలో విధ్వంసానికి దారి తీస్తాయి. పర్యావరణాన్ని మానవ జీవితాల్ని, జీవరాశి మనుగడను విషతుల్యం చేస్తాయి. వినాశనం చేస్తాయి.

‘డాల్టన్ జాన్’ అనే ఆంగ్లేయ శాస్తజ్ఞ్రుడు క్రీ.శ. 18-19 శతామ్దాలకు చెందినవాడు. ఈయన అణు సిద్ధాంతమును కనిపెట్టెనట. ఇది కడు విడ్డూరమనిపిస్తుంది. ఎందుచేతనంటే వేల వేల సంవత్సరాలకు ముందే భారతీయ మహర్షులు, వేదాలలో ఉపనిషత్తులలో, శాస్త్రాలలో అణువు యొక్క స్వరూప స్వభావాలు చెప్పబడ్డాయి.

ప్రాచీన భారతీయ ఋషులు కంటికి కనబడేవాటిలో అతి సూక్ష్మ కణములు, కంటకి కనబడని అతి సూక్ష్మ పదార్థ విభాగములులనే కాక మనసుకు కూడా అందని అతి సూక్ష్మ పదార్థమును కూడా వివరించారు.

ఉపనిషత్తులలో కొన్ని ఉదాహరణకు చూడండి-
‘‘అణీయాన్ హ్యతర్కః మణు ప్రమాణాత్’’ ఇతి కగోపనిషత్.. అణోరణీయా సహమేవతద్వత్’ ఇతి కైవల్యోపనిషత్. ‘అణోరప్యణ్వ సంధ్యాత్వా’ ఇతి మైత్రాయణీయోపనిషత్

ఈ ‘అణోరణీయాన్ మహతో మహీయాన్’ ఇట్లనే ప్రమాణములు కలవు. లక్షలాది సంవత్సరాములకు పూర్వమే గౌతమ మహర్షి తన న్యాయ దర్శనము నందు ఈ బ్రహ్మాండ సృష్టికి స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతటికి అణువులే మూలాధారమని నిరూపించెను. అందుచేతనే గౌతమ మహర్షి ‘న్యాయ దర్శనమను శాస్త్రమునకు’ అణువాద శాస్త్ర మరియు పిఠగపాక వాదమనియు పేర్లు వచ్చాయి. కంటికి అగుపించని అణువును పరిశీలించుటకుగాను మైక్రోస్కోపు లను గురించి కూడా చెప్పారు చూడండి.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...