Thursday, January 30, 2020

హిందూ సనాతన ధర్మము లో తమలపాకు యొక్క విశిష్టత.....


హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో..

1. పూలు
2. అక్షింతలు,
3. ఫలాలు,
4. అద్దం,
5. వస్త్రం,
6. తమలపాకు మరియు వక్క,
7. దీపం,
8. కుంకుమ..

..ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు.పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం. భారత దేశం లో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదల లోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.

తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం...

క్షీర సాగర మథనం లో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణం లో చెప్పబడింది. శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు చెబుతున్నాయి . తమలపాకు యొక్క మొదటి భాగం లో కీర్తి, చివరి భాగం లో ఆయువు, మధ్య భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.

తమలపాకు లోని ఏయే భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాం...

తమలపాకు పైభాగంలో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు. సరస్వతీదేవి మధ్యభాగంలో ఉంటుంది. తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది. జ్యేష్టా దేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.

విష్ణుమూర్తి తమలపాకులో ఉంటాడు. శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగంలో ఉంటారు. తమలపాకు లోని ఎడమ వైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు. భూమాత తమలపాకుకి కుడిభాగంలో ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు.

తమలపాకులోని అద్భుతమైన ఆయుర్వేద గుణాలు...

తమలపాకు నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిపుండ్లు, నోటిపూత వంటి వ్యాధులను తగ్గిస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది. అరుగుదలకు తమలపాకు ఎంతగానో సహకరిస్తుంది కనుకనే భోజనానంతరం తాంబూల సేవనాన్ని చేస్తారు.

తమలపాకు 'ఎ' మరియు 'సి' విటమిన్లకు నిలయం. తమలపాకులలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల అనేక వ్యాధులు నిర్మూలించబడతాయి. తాంబూలం లో వేసుకునే ఇతర సుగంధ ద్రవ్యాలైన జాజికాయ, జాపత్రి శ్లేష్మాన్ని, కఫాన్నీ నిర్మూలిస్తాయి. ఏలకులు అసిడిటీ మరియు గ్యాస్ సమస్యలను పోగొడతాయి. నరాల బలహీనత,మూత్ర సంబంధ వ్యాధులు కూడా తమలపాకు వల్ల తొలగుతాయి.

కాన్సర్ నివారణకు తమలపాకు అద్భుతమైన ఔషధం.

శరీరం లో వేడి ఎక్కువగా ఉన్నవారు, తలనొప్పితో బాధపడుతున్న వారు తమలపాకును నుదుటిపై ఉంచడం ద్వారా ఉపశమనం పొందుతారు. చెవిపోటుతో బాధపడుతున్నవారు తమలపాకు నూనెను లేదా రసాన్ని గోరువెచ్చగా చేసి చెవిలో పోయడం ద్వారా చెవిపోటు తగ్గుతుంది. చీము,పుండ్లు వంటివి నశిస్తాయి. తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

తమలపాకు రసం రాయడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి.

పూర్వకాలం లో స్త్రీలు తాంబూల సేవనం శృంగార ప్రేరేపకంగానూ, సౌందర్య వస్తువు గానూ భావించేవారు. తాంబూలం నోటినీ పెదవులనూ ఎర్రగా చేయడం ఇందుకు ప్రధాన కారణం. చేతులకు గోరింటాకు లాగే నోటికి తాంబూలం శోభాకరంగా భావించేవారు. ఆ భావన ఇప్పటికీ కొంసాగుతోంది.

తమలపాకు వాడకంలో తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్తలు...

తమలపాకుని పూజలకు ఉపయోగించేటప్పుడు రంధ్రాలు ఉన్నవి గానీ, వాడిపోయినవి గానీ ఉపయోగించరాదు. అవి తాంబూల సేవనానికి కూడా మంచివికావు. తమలపాకు అతిగా సేవించడం వల్ల రక్తం పలచబడే అవకాశం ఉంది. కాబట్టి భోజనానంతరం ఒకటి లేదా రెండుకు మించి అతిగా తినరాదు.

సంప్రదాయ బద్ధమైన తాంబూల సేవనం మాత్రమే ఆరోగ్యాన్ని ఇస్తుంది. తమలపాకులో హానికారకమైన వస్తువులని కలిపి సేవించడం అనారోగ్యాలకు దారి తీయగలదు...

|| ఓం నమః శివాయ ||

హిందూ సనాతన ధర్మమునకు సంభదిత విషయములు తెలుసుకొనుటకు కొరకు టెలిగ్రామ్ యాప్ వాడే వారు ఈ క్రింది లింక్ ద్వారా మన సమూహం నందు జాయిన్ అవచ్చును.....

Tuesday, January 28, 2020

శివుడు అర్థమైతే సత్యం అర్థమవుతుంది

1. శివ తత్వం లోని కొన్ని విషయాలని పరిశీలిద్దాం.
జ్యోతిర్లింగాలు: శివుడిని 12 జ్యోతిర్లింగ రూపాలలో వున్నాడని నమ్మి కొలుస్తారు. జ్యోతిర్లింగ అంటే చీకటిని (అజ్ఞానాన్ని) చీల్చి వెలుగు( జ్ఞానాన్ని) ప్రసాదించేది.

2. లింగాకారం: శివ లింగం పైకి లింగం కింద పానవట్టం యోని రూపంలో వుంటుంది. అది స్త్రీ పురుషుల ప్రతీక. ఒకటి లేనిది ఇంకొకటి లేదు.అవినాభావ సంబంధం.

3. ప్రళయం: శివుడ్ని ప్రళయ కారకుడు గా నమ్ముతారు. ప్రళయ కారకుడని తెలుసుకుని ఏమిటి ప్రయోజనం? శివుడు మూడు ప్రళయము లకు కారణం. ఒకటి రాత్రి నిద్ర. అన్ని ప్రాపంచిక మాయల నుండి మరపు నిచ్చేది. రెండు శారీరక మరణం.స్థూల (అంగ శరీరం) , సూక్ష్మ ( మనసు), కారణ ( అజ్ఞానం)శరీరాలనుంచి విముక్తి కలుగచేసేది. మూడు : మహాప్రళయం : సమస్తం శివుని లో కలిసిపోవడం. అంతరార్ధం: ఈ మూడు శరీరాలు మాయకల్పితం, అశాశ్వతం కావటం వలన, శివుడు వాటినుంచి విముక్తి కల్పించడం.

4. శివ,విష్ణు,బ్రహ్మ : శివుడి నించి విష్ణువు, విష్ణువు నించి బ్రహ్మ ఆవిర్భవించారంటారు. బ్రహ్మ సృష్టిస్తే, విష్ణువు నడిపించడం, శివుడు అంతం చేయటం అనేవి లోకోక్తి. ( పైన #3 చూడండి. ) అంతరార్ధం : సృష్టి, స్థితి,లయ ఒకచోట నుంచి రావటం, మరలా అందులోకి పోవటం.

5. మరణం ఒక వేడుక : వారణాసిలో ఘాట్లను చూస్తే, ప్రపంచంలో అదొక్కటే స్థలం లో జీవిత చక్రంలోని అన్ని దశలు : జన్మ , పెరగటం, మరణం అన్నీ నది ఒక చివరనుంచి ఇంకో చివరలోపు కనిపిస్తాయి. ఉజ్జయిన్ లో శివునికి జరిగే భస్మ ఆర్తి కి ముందు రోజు ఖననం చేసిన శరీర భస్మాన్ని తెచ్చి వాడతారు. శివుడు తన శరీరమంతా భస్మాన్ని అలుముకుంటాడు.

6. పంచభూత లింగాలు : దక్షిణ భారతం లోనున్న పంచ భూత లింగాలు ( అగ్ని, వాయు, భూమి, ఆకాశం ,జలం ) ఆ అద్వితీయ శక్తి అన్ని ధాతువులలో, భూతాలలో ఉందని రుజువు చేస్తాయి. శివ కానిదింకేమైనా ఉందా ?

7. Einstein శక్తి సూత్రం : శక్తి ఒక రూపంనుంచి ఇంకో రూపానికి మారవచ్చు కానీ శక్తి తయారు కాబడదు. నాశనం కాబడదు. అద్వైతాన్ని ఇంతకంటే స్పష్టంగా సరళంగా చెప్పగలమా? ఒక జీవి, చెట్టు, రాయి, జాలం లోని ఆ పరబ్రహ్మం ఒకటే. పై తొడుగులు వేరు, అశాశ్వతం.

8. రుద్రం : శివుని పూజించే పద్దతులలో రుద్రం మొదటిది. రుద్రం లో ఏం వుంది ? మహాన్యాసం, నమకం ,చమకం. మహాన్యాసం అంటే: చేసేది శివుడే , నీవు శివుడవేనని నిర్ధారణ చేస్తుంది. ఆ తరవాతే మిగతావన్నీ. చమకమ్ లో ఏం వుంది? సమస్తమూ శివమే — దొంగ, నురుగు, జీవులు అంతా ( అద్వైతం )

9. శివుని ధ్యానముద్ర: నీ నిజస్థితి తెలుసుకోవటానికి సాధనం — శ్రవణ ,మనన, నిధి,ధ్యాసాలు (ధ్యానం) .

10. అద్వైతం : అద్వైతం తెలిపిన శంకరుల పేరు శివుని పేరు కావడం యాదృచ్చికమా ? జన్మ,స్థితి, మరణం -ఈ చక్రం మాయలో భాగం, అసత్యం. ఉన్నదొక్క బ్రహ్మమేనన్నదే సత్యం. తత్వమసి, శివోహం, అహం బ్రహ్మాస్మి అనే తత్వ వాక్యాలు చెప్పే సత్యం ఇదే.

Saturday, January 25, 2020

మహాతేజం రథసప్తమి : అంటే ఏమిటి, ఎందుకు?

రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ.మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు.రథసప్తమి మహా తేజం.మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.

సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.

1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'
2. వైశాఖంలో అర్యముడు,
3. జ్యేష్టం-మిత్రుడు,
4. ఆషాఢం-వరుణుడు,
5. శ్రావణంలో ఇంద్రుడు,
6. భాద్రపదం-వివస్వంతుడు,
7. ఆశ్వయుజం-త్వష్ణ,
8. కార్తీకం-విష్ణువు,
9. మార్గశిరం- అంశుమంతుడు,
10. పుష్యం-భగుడు,
11. మాఘం-పూషుడు,
12. ఫాల్గుణం-పర్జజన్యుడు.

ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.
భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు.అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కధనం ప్రకారం
బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట.అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని 'యుగ సహస్ర యోజన పరాభాను' అని తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసాలో చెబుతారు.

దీన్ని లెక్క కడితే 'యుగం.. 12000 ఏళ్లు, సహస్రం 1000, యోజనం 8 మైళ్లు, మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది.సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే

ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.
ఆ ఏడు గుర్రాల పేర్లు
1. గాయత్రి,
2. త్రిష్ణుప్పు,
3. అనుష్టుప్పు,
4. జగతి,
5. పంక్తి,
6. బృహతి,
7. ఉష్ణిక్కు
వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.
రామ రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని 'ఆదిత్య హృదయం' ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది.
ఇందులో 30 శ్లోకాలున్నాయి.వీటి స్మరణ వల్ల శారీరక,మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.
సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది.
అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.
-ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.
ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది.జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.


☘ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:☘

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!

పూజ విదానం:-

చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి,ఒక్కొక్క దళం చొప్పున రవి,భాను, వివస్వత,భాస్కర, సవిత,అర్క,సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.
ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి.ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి.దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.
జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, రాగిపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.
మనం చేసే పూజలు, వ్రతాలు అన్ని పుణ్యసంపాదన కొరకే.శివ కేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది.
ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే!
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ -ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు. ఈ మహా పర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తీ శ్రద్ధ లతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాం.
చదుకొవలిసిన స్తోత్రాలు
ఆదిత్యహృదయం, సూర్య స్తోత్రం, నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణ చేయడం సకల శ్రేయోదయకమని గురు వాక్యం.
మాఘ శుద్ద షష్టి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో ఉన్న నది, చెరువు దగ్గర స్నానం చేయాలి. ఈ రోజు అంటే మాఘ శుద్ధ షష్టి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిధిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానం చేయాలి.
సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, ఇబ్బందులు తొలగుతాయని శాస్త్రవచనం.

1.ఈ జన్మలో చేసిన
2.గత జన్మలో చేసిన
3. మనస్సుతో
4. మాటతో
5. శరీరంతో
6. తెలిసీ
7. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉన్నది.
ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశం లో నక్షత్ర కూటమి రధం ఆకారం లో ఉంటుంది.
రోగ నివారణ / సంతాన ప్రాప్తి కోసం - రధ సప్తమి వ్రత విధానం
స్నానాతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాలి. అష్టదల పద్మం ముగ్గు (బియ్యం పిండి తో ) వేసి అందులో సూర్య నామాలు చెప్తూ 7 రంగులు నింపాలి . అష్ట దళ పద్మ మద్య లో శివ పార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దానిమీద సూర్యుడు రధాని (7 గుర్రాలు) నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు
చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి.
సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చెస్తునామొ లేదా ఎవరికీ సంతానం కలగాలని చెస్తునామొ వారి పేరు గోత్రనామలు చెప్పుకొని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు దానం ఇవ్వాలి . తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సర కాలం నియమంగా నిష్టగా ఉండాలి.సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవాలి ఇలా శక్తి ఆసక్తి కలిగిన వారు చేసినచో వారికి సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది.

'గోత్రం' అంటే

'గోత్రం' అంటే ఏమిటో తెలుసా!

'గో అంటే గోవులు, 'త్ర' అంటే రక్షించుట

గోత్రము అంటే గోవులను రక్షించువారు అని అర్ధము. సముద్రమధనంలో 5 గోవులు కామధేనువు రూపంలో అవతరించాయి. ఒక్కొక్క గోవును ఒక్కొక్క మహర్షి తీసుకెళ్ళి పెంచి వాటిని, వాటి సంతతిని కాపాడుతూ వృద్ధి చేసి యితర మహర్షుల ద్వారా సమాజములోని అందరికీ వాటిని అందజేశారు.

గోవులను కాపాడిన అయా ఋషుల పేర్లతో మనకు గోత్రాలు ఏర్పడినాయి. హిందువులందరికీ అంటే అన్ని వర్ణములవారికి గోత్రాలు ఉంటాయి. అంటే అందరూ గోవులను రక్షించేవారేనని
అర్థం

Wednesday, January 22, 2020

క్షౌర కర్మ

క్షౌర కర్మను గురించి  శాస్త్రము  ఒక  క్రమ  పద్దతిని  నిర్దిష్టించినది .

(a) శ్మశ్రూణ్యగ్రే  వాపయతే  అథోపకక్షావథ  కేశానాథ లోమాన్యథ నాఖాని |   .

(b) అథైతన్మనుర్వప్త్రే   మిథునమపశ్యత్  |
స శ్మశ్రూణ్యగ్రే అవపత్  |
అథోపకక్షౌ అథకేశాన్.

తాత్పర్యము:

ముందుగా  గడ్డమును  కుడి  ప్రక్కనుండి  ప్రారంభించి  పూర్తి  చేయవలెను . పిమ్మట   మీసములను , కక్షము  (చంకలు) , పిదప  తల  వెంట్రుకలను  కత్తిరించ వలయును  చివరగా  గోళ్ళను  కత్తిరించుకొనవలెనని  విధానము  చెప్పబడినది .

తూర్పు  కాని  ఉత్తర  ముఖముగా  కూర్చొని  చేయించుకోవలెను 

క్షౌరకర్మ  చేయించుకోకూడని  సమయాలు : (తిథులు)

1) పాడ్యమి

2) షష్టి

3) అష్టమి 

4) నవమి  (శుక్ల పక్షము ) 

5) ఏకాదశి

6) చతుర్దశి 

7) పౌర్ణమి 

8) అమావాస్య 

9) జన్మ  నక్షత్రం  ఉన్న  రోజు 

10) సూర్య  సంక్రమణం  నాడు

11) వ్యతీపాతం 

12) విష్టి  (భద్ర )

(రోజులు  - సమయములు ) - చెయ్యకూడనివి

1) శనివారము

2) ఆదివారము 

3) మంగళవారము 

4) శ్రాద్ధ  దినము  నాడు

5) ప్రయాణము  చేయబోయే  రోజు 

6) అభ్యంగన  స్నానము  చేసిన  తరువాత 

7) భోజనము  చేసిన  తరువాత 

8) సంధ్యా  సమయాల్లో   ( 5 - 7 am ; 11-13 hrs ; 17 - 19 hrs) 

9) రాత్రి  పూట 

10) మంగళ  కార్యాలు  (వ్రతాలు  లాంటివి )  చేయదలచిన  దినము 

11) మంగళ  కరమైన  కట్టుబొట్టు   ఆభరణాలు  అలంకారములు  చేసుకున్న   పిదప ..

12) యుద్దారంభామున 

13) వైధృతి  యందు 

పైన చెప్పిన రోజులు, సమయాల్లో  క్షౌరకర్మ  కూడదు

1) ఆదివారము  క్షౌరము  చేయించుకుంటే  - 1 మాసము  ఆయుక్షీణము 

2) శనివారము  క్షౌరము చేయించుకుంటే  - 7 మాసాలు  ఆయుక్షీణము 

3) మంగళవారము  క్షౌరము చేయించుకుంటే - 8 మాసాలు   ఆయుక్షీణము 

ఆయా  దినములకు  చెందిన  అభిమాన  దేవతలు  ఆయు  క్షీణింపచేయుదురు  .

ఇదే విధముగా ...

1) బుధవారము క్షౌరము చేయించుకుంటే  - 5 మాసాలు  ఆయువృద్ధి 

2) సోమవారము  క్షౌరము చేయించుకుంటే - 7 మాసాలు  ఆయువృద్ధి 

3) గురువారము  క్షౌరము చేయించుకుంటే - 10 మాసాలు  ఆయువృద్ధి

4) శుక్రవారము క్షౌరము చేయించుకుంటే - 11 మాసాలు  ఆయువృద్ధి 

ఆయా  దినములయోక్క  అభిమాన   దేవతలు  ఆయు  వృద్ధి  చేయుదురు .

కొడుకు  పుట్టుక  కోసం  ఆశిస్తున్న  వారు , ఒకే  ఒక్క   కొడుకు  ఉన్నవారు సోమవారము  క్షౌరము  చేయించుకోకూడదు .

అలాగే  విద్య , ఐశ్వర్యం  కోరుకొనే    వారు  గురువారము  క్షౌరము చేయించుకోకూడదు.

*క్షౌరకర్మ  సమయంబున  విష్ణు  నామస్మరణచే  సమస్త  దోషములు  తొలగును  **

అని ఈవిధముగా క్షౌరకర్మను గూర్చి గర్గాది మహర్షులు వారాహి సంహిత యందు వచించినారు .                            🌹సేకరణ:యర్రం పూర్ణ చంద్ర శేఖర్ రావు

Thursday, January 16, 2020

తులసి పూజ ఎలా చేయాలి? తులసి దళాలను ఎలా త్రెంపాలి ?

తులసీ దయాపూర్ణకలశీ - తులసి పూజ, దళచయనం

కార్తీక మాసం కదా? తులసి పూజ, తులసి వివాహం ఈ నెలలో వచ్చిన విశేషమైన పూజలు. తులశమ్మ విశేషాలు కొన్ని తెలుసుకుందాం.

తులసి - స్వయంగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకలసంపదలకు లొంగక, రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు మన సనాతన ధర్మంలో. తులసిలేని ఇల్లు కళావిహీనమని చెప్పారు.

మరి తులసి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టటం మన కనీస ధర్మం. అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలది. మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తులసి పత్రాలు అమృతముతో సమానము

అనన్యదర్శనాః ప్రాతః మే పశ్యంతి తపోధన
జగత్త్రితయ తీర్థాని తైర్దృష్టాని న సంశయః

ఉదయము నిద్రనుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది.

తులసిచెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరిక, మానసిక ఆరోగ్యమునిస్తుంది.

*తులసి పూజ ఎలా చేయాలి?

తులసికోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించాలి. దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాపప్రక్షాళన జరుగుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి.

తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు.

ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి.

నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే!
నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే!
బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ!
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!

ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం
యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్

అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి.

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం

అని చెంబులోని నీళ్లను తులసిచెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి.

తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే

అని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి.

పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః - పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కాందపురణం చెప్పింది.

తులసి చెట్టునుండి దళాలను మంగళ, శుక్ర, ఆది వారములలో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు. ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది.

తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు. ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి.

సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధము వర్తించదు. సాలగ్రామమున్నవారు అన్ని తిథివారములయందు తులసి దళములను త్రెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం. శ్రీమహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలూ వర్తించవు. ఇది ఆహ్నిక సూత్రావళిలో చెప్పబడింది. “స్నానము చేయకుండా మరియు పాద రక్షలు ధరించి” తులసి చెట్టను తాకరాదు, దళములను త్రెంపకూడదు. ఇది పద్మపురాణంలో చెప్పబడింది.

 తులసి దళాలను ఎలా త్రెంపాలి?

తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు. రెండేసి ఆకులు కలిగిన దళముతో కూడిన కొసలను త్రెంపాలి. అన్ని పుష్పాల కన్నా తులసీ మంజరులు (అంతే తులసికి వచ్చే పుష్పాలు) అత్యంత శ్రేష్ఠమని, ఈ మంజరులను కోసేటప్పుడు వాటితోపాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్పింది.

తులసిమొక్కకు ఎదురుగా నిలబడి, రెండు చేతులు జోడించి, కింది మత్రాన్ని చదువుతూ పూజా భావంతో మొక్కను కదిలించకుండా తులసి దళాలను త్రెంపాలి. దీనివలన పూజాఫలం లక్షరెట్లు అధికంగా లభిస్తుంది అని పద్మపురాణం చెప్పింది.

మాతస్తులసి గోవింద హృదయానందకారిణి
నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే

తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియా
చినోమి కేశ్వస్యార్థే వరదా భవ శోభనే

త్వదంగసంభవైః పత్రై పూజయమి యథా హరిం తథా కురు కురు పవిత్రాంగి! కలౌ
మలవినాశిని
(ఆహ్నిక సూత్రావళి)

శ్రీహరికి ఆనందాన్ని కలిగించే తులసీ మాతా! నారాయణుని పూజ కొరకు నీ దళములను కోస్తున్నాను. నీకు నా నమస్కారములు. అమృతమునుండి జన్మించిన, ఎల్లప్పుడు శ్రీహరికి ప్రియమైన తులసీమాతా! ఆ కేశవుని పూజ కొరకు నీ దళాలను త్రెంపుతున్నాను. నాకు అభయమునివ్వు శుభకరీ! నీ శరీరమునుండి జన్మించిన పత్రములతో ఆ శ్రీహరిని పూజిస్తాను. కలియుగంలో సమస్త దోషములు తొలగించే పవిత్రమైన శరీరము కల తల్లీ! నేను తలపెట్టిన హరిపూజను సాఫల్యము చేయుము.

పూజ చేసిన తరువాత ఒక తులసీదళాన్ని "అచ్యుతానంతగోవింద" అని స్మరిస్తూ నోట్లో వేసుకొని తినాలి. ప్రతిరోజు భక్తిభావంతో ఒక తులసిదళాన్ని సేవించటం వలన సకల రోగాలు నశిస్తాయి, రాబోయే రోగాలు నిరోధించబడుతాయి.

తులసి

తులసిని స్త్రీ కోయరాదు. పురుషుడే కోయాలి. పూజ మాత్రం ఇరువురూ చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కలనుంచి తుంచుకోవాలి. కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు.

ఆద్యాత్మిక పరంగా ,ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలననే తులసి భూలోక కల్ప వృక్షం గా దేవతా వృక్షం గా పేరు పొందింది. భగవంతుని పూజకు తులసి అతి ప్రసస్తము .తులసి గా శ్రీ మహాలక్ష్మి ఏ స్వయముగా అవతరించినట్లు పురాణములు చెబుతున్నాయి .
తులసి విష్ణువు ప్రియురాలు కనుక విష్ణువును తులసి దళాలతో పూజించేటప్పుడు పాదాల వద్దనే తులసి దళాలను వుంచవలెను .

పవిత్ర దినములలో తులసి కోయరాదు. , గోళ్ళతో తుంచ రాదు .సూర్యాస్తమయము తర్వాత తులసి కోయరాదు . మిట్ట మద్యాహ్న్నం ,అర్ధ రాత్రి వేల లో గాని తులసిని త్రుంచ రాదు . ఒకవేళ అలా చేస్తే బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుందని  పురాణాలు చెబుతున్నాయి .

ఎవరి గృహములో తులసి మొక్క వుంటుందో ,వారి గృహం తీర్ధ స్వరూపముగా వుంటుంది. తులసి దళా ల తో శివ కేశవులను పూజించిన వానికి మరల జన్మ ఉండదు, ముక్తిని పొందుతాడు.నర్మదా నదిని చూడడం ,గంగా స్నానము చేయడం,తులసి వనాన్ని సేవిచడం ఈ మూడు సమాన ఫలములను ఇస్తాయి .ఆషాడ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక సుద్ధ పౌర్ణమి వరకు చాత్రుమాస దీక్ష కావున ఈ సమయములో తులసి మొక్కను చోటు మార్చి పాత రాదు.

తులసి సన్నిదానము నందు విష్ట్ను మూర్తి ఏకాంతముగా ఉండును కనుక స్త్రీలు దళములు కోయరాదు .పురుషులు మాత్రమె కోయవలెను .

తులసి ఆకును కోసిన లగాయతు ఒకసంవస్త్సరము ,మారేడు మూడు సం. ,తామర పూలు ఏడు రోజుల వరకు పూజకు పనిచేస్తాయి .

తులసి మాల ఎక్కువుగా రాముడికి ,కృష్ణుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది.బుద్ధిని ,మనస్సును ప్రశాంతముగా ఉంచుటకు ఈ మాల ఎంతో ఉపయోగాదాయకం .తులసి మాలను ధరించడం వలన సర్వ పాపాలు నసిస్తాయి.

తులసి చెట్టు ఉన్న మట్టిలోనూ, తులసి చెట్టుమీదా అధికంగా పసుపు,కుంకుమ,అక్షతలు వేయడం వలన అక్కడ ఉన్న పోషకాలు నశించి తులసిచెట్టు ఎక్కువకాలం నిలువదు. కనుక పసుపు, కుంకుమ, అక్షతలు వేయవలసి వచ్చినప్పుడు చెట్టు మొదటిలో కాక, తులసి కోట మొదటిలో వేయడం ఉత్తమం.

స్త్రీలు ఎన్నడూ తులసీ దళాలను కోయరాదు. పురుషులచేతనే కోయించాలి. ఆపురుషులు కూడా బహుళ పక్షంలోని అష్టమీ,చతుర్దశీ, అమావాస్యా తిథులలో గానీ - పౌర్ణమినాడుగానీ – ఉభయ పక్షాలలో ఏకాదశీ,ద్వాదశీ తిథులలోగానీ – ఆది,మంగళ,శుక్రవారాలలో గానీ అస్సలు కోయకూడదు. ద్వాదశినాడు తులసిని తాకకూడదు. తులసీ దళాలను ఒడిలోకి కోయకూడదు. ఆకులోకి కానీ, ఏదైనా పళ్లెంలోకి కానీ కోయాలి. తులసీ దళాలను ఒట్టి నేలమీద ఉంచకూడదు.

Sunday, January 12, 2020

చండీ ఆకర్షణ ప్రయోగం

ఓం హ్రీం రక్ష చాముండే తురు ఆముకీం ( స్త్రీ) క్రం ( పురుష) ( పెర్లు) మాకర్షయ హ్రీం .చాముండే జ్వల ప్రజ్వల స్వాహా ||

ఈ మంత్రాన్ని ఒకటి తర్వాత రెండవది జోడించి చేయవచ్చు . ఆముక తీసేసి చింతిత చేర్చి 50 వేలకు సిద్ది లేక ఓం _ ఐం హ్రీం క్లీం చాముండేజ్వల ప్రజ్వల స్వాహా || చేయవచ్చు .. మంత్రం జపించి ఎవరిని చూస్తే వారు తన వెనుకే రావడం సాధ్యం ??

నోట్ :+

ఈ సాధన ఎవరైనా ఇంటికి రాక _ పోకడ తెలియక రహస్యం గా ఉండే వారిని వారి దగ్గరకు చేర్చడానికి ఉపయోగిస్తే ప్రాణంతో ఉంటే ఎక్కడైనా రాకతప్పదు .. రావాల్సిన వారి ఫోటో చూస్తూ ఆ ఆకారాన్ని మనసు లో నిలిపి వారు వస్తున్నట్టు గా ఊహిస్తూ జపం చేస్తే .. అలాగే ఉద్యోగం .. నియామకం .. ఆర్డర్లు .. ఏమి ఎలా కోరితే అలా అనుకూలిస్తాయి ..


నోట్ :-

తంత్రం అనే విషయం పై అవగాహన కోసం మాత్రమే పోస్ట్ చెయ్యబడింది .. పూర్తి వివరాలు ఇవ్వదల్చలేదు ..

Saturday, January 4, 2020

వేదాల్లో న అణువిజ్ఞాన ఆనవాళ్లు

మంత్రం:-
‘‘ఆయం గౌః పృశ్నిరక్ర మేత్
అసదన్మాతరం పురః పితరంచ ప్రయన్త్వః

ఇతి ఋగ్వేదే సామ వేదే 630- మంత్రం 1376 మంత్రం అధర్వణ వేదే 6వ కాండ, 31 సూక్తం 1వ మంత్రం.

పై శ్లోకంలో ‘గౌః’ అంటే భూమి అని అందరికీ తెలిసిన అర్థమే కాకుండా చంద్రుడనే అర్థం కలదు. విశ్వకోశమనే గ్రంథంలో ‘గౌః, స్వర్గే, వృషభే, రశ్మౌ వజ్రే, చంద్రమసి, స్మృతః’ అని అర్థాలు చెప్పబడ్డాయి. అటులనే నానార్థ రత్నమాలయందు ‘గౌః కతే, వృషభే, చంద్రే’ అని కలదు.

మంత్రార్థము: 

మనకు కనబడుతున్న చంద్రుడు భూమికి ఉపగ్రహమగుట చేత మాతృభూతురాలగు భూమికి ద్రక్షిణం చేయుచు, భూమితో కలిసి సర్వలోక పోషకుడై, స్వయం ప్రకాశ మానుడైన పితృస్థానీయుడగు సూర్యుని చుట్టూ తిరుగుచున్నాడని వేదములు చెప్తున్నాయి. ఇదే విషయాన్ని సూర్య సిద్ధాంతాది జ్యోతిష్య గ్రంథములను చెప్పుచున్నవి. ఈ విధంగా అనేక అద్భుత గ్రంథములతో కూడిన శాస్త్ర వాఙ్మయాన్ని వదిలిపెట్టి భారతీయ విద్యా గంధమేమాత్రము లేని పాశ్చాత్య భావజాలానికి పూర్తిగా దాసులైన మన వారే గెలీలియో చెప్పేవరకూ మనవారికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని తెలియదనుకొంటున్నారు.
సనాతన ధర్మంలో భారతీయ మహర్షులందించిన సత్వాలు, నవీన విజ్ఞానానికి కూడ ప్రామాణికమని వ్యవహారిక ఆధారాలతో నిరూపితమయ్యాయి. అట్టి సత్యాలు వేదాలతో, కాలానుగుణంగా మహర్షులందించిన శాస్త్రాలలో నిక్షిప్తం చేయబడ్డాయి.

సకలము భగవంతుని స్వరూపమేనని, అట్టి భగవంతుడు ‘సత్ చిత్ ఆనందమయుడని వారు భావించారు. సత్ అంటే ఎప్పటికీ వుండేదని, ఒకప్పుడుండి ఇంకొకప్పుడు లేనిది సత్యమనబడదు. అట్లే ‘చిత్’ అంటే జ్ఞానం, నిరంతర జ్ఞానంతో కూడిన ఆనంద స్వరూపుడే పరమాత్మ. అనుభవపూర్వకంగా ఇట్టి విషయాన్ని తెలుసుకున్న మహర్షులు ప్రతిపాదించిన సత్యాలు మాత్రమే మానవాళికి నిజమైన శుభ పరిణామాన్ని ఇవ్వగలవు. అట్లుకాక ఇంద్రియ జన్యమైన జ్ఞానాన్ని తాత్కాలిక విషయాలను ఆధారం చేసుకుని రూపొందించే ప్రతిపాదనలు ఆవిష్కరణలు కాలక్రమంలో విధ్వంసానికి దారి తీస్తాయి. పర్యావరణాన్ని మానవ జీవితాల్ని, జీవరాశి మనుగడను విషతుల్యం చేస్తాయి. వినాశనం చేస్తాయి.

‘డాల్టన్ జాన్’ అనే ఆంగ్లేయ శాస్తజ్ఞ్రుడు క్రీ.శ. 18-19 శతామ్దాలకు చెందినవాడు. ఈయన అణు సిద్ధాంతమును కనిపెట్టెనట. ఇది కడు విడ్డూరమనిపిస్తుంది. ఎందుచేతనంటే వేల వేల సంవత్సరాలకు ముందే భారతీయ మహర్షులు, వేదాలలో ఉపనిషత్తులలో, శాస్త్రాలలో అణువు యొక్క స్వరూప స్వభావాలు చెప్పబడ్డాయి.

ప్రాచీన భారతీయ ఋషులు కంటికి కనబడేవాటిలో అతి సూక్ష్మ కణములు, కంటకి కనబడని అతి సూక్ష్మ పదార్థ విభాగములులనే కాక మనసుకు కూడా అందని అతి సూక్ష్మ పదార్థమును కూడా వివరించారు.

ఉపనిషత్తులలో కొన్ని ఉదాహరణకు చూడండి-
‘‘అణీయాన్ హ్యతర్కః మణు ప్రమాణాత్’’ ఇతి కగోపనిషత్.. అణోరణీయా సహమేవతద్వత్’ ఇతి కైవల్యోపనిషత్. ‘అణోరప్యణ్వ సంధ్యాత్వా’ ఇతి మైత్రాయణీయోపనిషత్

ఈ ‘అణోరణీయాన్ మహతో మహీయాన్’ ఇట్లనే ప్రమాణములు కలవు. లక్షలాది సంవత్సరాములకు పూర్వమే గౌతమ మహర్షి తన న్యాయ దర్శనము నందు ఈ బ్రహ్మాండ సృష్టికి స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతటికి అణువులే మూలాధారమని నిరూపించెను. అందుచేతనే గౌతమ మహర్షి ‘న్యాయ దర్శనమను శాస్త్రమునకు’ అణువాద శాస్త్ర మరియు పిఠగపాక వాదమనియు పేర్లు వచ్చాయి. కంటికి అగుపించని అణువును పరిశీలించుటకుగాను మైక్రోస్కోపు లను గురించి కూడా చెప్పారు చూడండి.

Wednesday, January 1, 2020

108 రూపాలలో శ్రీ గణపతి


1.  ఏకాక్షర గణపతి
 ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోక
దావానలం గణ్విభుం వరకుంజరాస్యమ్
అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం
ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య

2. మహా గణపతి
భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం
భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం
గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక:
శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో  మహాన్

3. బాల గణపతి
కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం
బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం

4. తరుణ గణపతి
పాశాంకుశాపూస కపిత్ధ జంబూ
ఫలం తిలాం చేక్షు మపిసవ హసై:
ధత్తే సదాయ స్తరుణారుణాంభ:
పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ:

5. విఘ్నరాజ గణపతి
విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే
మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక:

6. సిద్ది గణపతి
ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్
అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్

7. బుద్ధి గణపతి
త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే
బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ |
నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే
నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ ||

8. లక్ష్మీ గణపతి
బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్
పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోత్సస్సరో నిస్సర:
శ్యామో రక్త సరోరుహేణ సహితో  దేవీ చ యస్యాంతికే
గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్

9. సంతాన లక్ష్మీ గణపతి
శరణం భవదేవేశ సంతతిం సుదృఢాంకురు |
భవిష్యంతియే పుత్రామత్కులే గణనాయక: ||

10. దుర్గా గణపతి
తప్తకాంచన సంకాశం శ్చాష్ట్ట్ట మహత్తను: |
దీప్తాంకుశం శరం చాక్షం దంతం దక్షే వహన్కరై: ||

11. సర్వశక్తి గణపతి
ఆలింగ్య దేవీం హరితాం నిషణ్ణాం
పరస్పరాశ్లిష్టకటీ నివేశం
సంధ్యారుణం పాశసృణీం వహస్తం
భయాపహం శక్తి గణేశ మీఢే

12. విరివిరి గణపతి
సుసిద్ధాదం భక్తిజనస్యదేవ సకామిదా మామిహ సౌఖ్యదంతం |
అకా మికాగాం భవబంధహరం గజాననం భక్తియుతం భజామ ||

13.  క్షిప్ర గణపతి
దంతం కల్పలతా పాశ రత్నకుంభోప శోభితం
బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం

14. హేరంబ గణపతి
అభయ వరద హస్త: పాశదంతాక్షమాల:
పరశుమధ త్రిశీర్షం ముద్గరం మోదకం చ
విదధతు నరసింహ: పంచమాతంగ వక్త్ర:
కనక రుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా

15. నిధి గణపతి
విచిత్ర రత్నై: ఖచితం సువర్ణ సమ్బూతకంగుహ్యమయా ప్రదత్తమం |
తధాంగులీష్పంగులికం గణేశ చిత్తేన సంశోభయ తత్పరేశ

16. వక్రతుండ గణపతి
స్వర్ణవర్ణ చతుర్బాహుం | పాశాంకుశధరం విభుం |
ఆమ్రపాత్ర స్వదంతంచ | శక్తియుతం విచింతయేత్

17. నవనీత గణపతి
దానాయ నానావిధ రూపకాంస్తే గృహాణ దత్తాన్మనసామయావై|
పదార్ధ భూతాన్ స్థిర జంగమాంశ్చ హేరమ్నమాం తారయ మోహభావాత్ || 

18.  ఉచ్ఛిష్గ్ట గణపతి
లీలాబ్జం దాడిమం వీణాశాలి గుంజాక్ష సూత్రకం
దధ దుచ్ఛిష్ట నామాయం గణేశ: పాతు మేచక:

19. హరిద్రా గణపతి
హరిద్రాభం చతుర్బాహుం హరిద్రా వదనం ప్రభుమ్
పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ
భక్తాభయ ప్రదాతాం వందే విఘ్న వినాశనమ్

20. మోదక గణపతి
నాదబిందు కళాత్మకం వరనారదాది సుపూజితం |
మోదక ఫలదాయకం ప్రమోదవదన వినాయకం ||

21.మేధా గణపతి
సకలభాగ్య వశంకరం వర సాధు సజ్జన సంహితం
అఖిలదేవ ప్రదాయకం  మమ ఆత్మరక్ష వినాయకం

22.మోహన గణపతి
రక్ష రక్ష గణాధ్యక్ష రక్షత్రైలోక్య రక్షక
భక్తానాం అభయంకర్తా త్రాతాభవ భవార్ణవాన్

23.త్రైలోక్య మోహన గణపతి
గదా బీజాపూరే ధను: శూలచక్రే సరోజతృలే
పాశాధాన్య ప్రదంతారి కరై: సందధానం
స్వశుండాగ్ర రాజం | మణి కుంభ
మంగాధి రూఢం స పత్న్యా ||

24.  వీర గణపతి
భేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ
ఖట్వాంగ ముద్గర గధాంకుశ ముద్వహస్తం
వీరం గణేశ మరుణం సతతం స్మరామి

25.  ద్విజ గణపతి
యం పుస్తకాక్ష గుణ దండకమండలు
శ్రీవిద్యోతమాన కరభూషణమిందు వర్ణం
స్తంబేర మానన చతుష్టయ శోభమానం
త్వాం య: స్మరే ద్ద్విజ గణాధిపతే సధన్య: ||

26. ఋణవిమోచన గణపతి
సృష్ట్యా బ్రహ్మణా సమ్యక్ పూజిత: ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్ర: ఋణనాశం కరోతుమే

27.  సంకష్టహర గణపతి
ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యంమాయుష్కారమార్ధ సిద్ధయే

28.  గురు గణపతి 
ప్రవరం సర్వదేవానాం సిద్ధినాం యోగినాం గురుం |
సర్వస్వరూపం సర్వేశం జ్ఞానరాశి స్వరూపిణమ్ ||
అవ్యక్తమక్షరం నిత్యంసత్యమాత్మ స్వరూపిణం |
వాయుతుల్యంచ నిర్లిప్తం చాక్షతం సర్వసాక్షిణం ||

29. స్వర్ణ గణపతి         
వందే వందారుమందార, మిందు భూషణ నందనం |
అమందానంద సందోహ, బంధురం సింధురాననమ్ ||

30.  అర్క గణపతి         
మూషారూఢం లంబసూత్రం సర్పయజ్ఞోపవీతినల|
విషాణం పాష కమలం మోదకంచ కరైధృతం ||

31.   కుక్షి గణపతి         
సరోజన్మన భూషాణాం భరణోజ్వలహస్త తన్వ్యా సమా
లింగితాంగాం | కరీంద్రాననాం చంద్ర చూడం త్రినేత్రం రక్తకాంతిం భజేత్తం ||

32.   పుష్టి గణపతి         
ఏకదంతం మహాకాయం లంబోదరం గజాననం |
విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం ||

33.  వామన గణపతి         
లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం |
అర్ధచంద్రధరం దేవం విఘ్నప్యూహం వినాశనం ||

34.  యోగ గణపతి         
యోగరూఢో యోగ పట్టాభిరామో
బాలార్కభశ్చేంద్ర నీలాంశుకాఢ్య:
పాశాక్ష్వక్షాన్ యోగదండం దధానో
పాయాన్నిత్యం యోగ విఘ్నేశ్వరో న:

35.   నృత్య గణపతి         
పాశాంకుశాపూప కుఠార దన్త చంచత్కరం వచరుతరాంగుళీయం
పీతప్రభం కల్పతరో రధస్ధం భజామి నృత్తైక పదం గణేశం

36.  దూర్వా గణపతి         
దూర్వాంకురాన్వై మనసా ప్రదత్తాం స్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన్ |
గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాంశ్చ సర్వోపరి వక్రతుండ ||

37.    అభీష్టవరద గణపతి
నమస్తే వేద విదుషే నమస్తే వేద కారిణే |
కమన్యం శరణం యామ: కోను న: స్వాద్భయాపహ: ||

38. లంబోదర గణపతి           
లంబోదరావతారో వైక్రోధాసుర నిబర్హణ:
శక్తిబ్రహ్మ ఖగ: సద్యత్ తస్యధారక ఉచ్యతౌ ||   

39.విద్యా గణపతి           
భక్త ప్రియాయ దేవాయ నమో జ్ణాన స్వరూపిణే |
నమో విశ్వస్యకర్త్రేతే నమస్తత్పాలకాయచ ||

40.  సరస్వతీ గణపతి         
వాగీశాద్యా స్సుమనస: సర్వార్ధానాముపక్రమే
యంనత్వాకృత కృత్వాస్స్యు: తం నమామి గజాననమ్ ||

41.  సంపత్ గణపతి         
పక్వచూత ఫలపుష్ప మంజరీచేక్షుదండ తిలమోదకైస్సహ
ఉద్వహన్ పరశుమస్తుతే నమ: శ్రీ సమృద్ధియత హేమపింగళ:

42.  సూర్య గణపతి         
హిరణ్యగర్భం జగదీశితారరమృషిం పురాణం మండలస్థం |
గజాననం యం ప్రవిశన్తిసంతస్తత్కాలయోగైస్త మహం ప్రపద్యే ||

43. విజయ గణపతి           
శంఖేక్షు చాప కుసుమేఘ కుఠారదంత
పాశాంకుశై: కళమమంజరికా సనైధై:
పాణిస్థితై: పరిసమావృత భూషణ శ్రీ:

44. పంచముఖ గణపతి           
గణేశాయ ధామ్నే పరేశాయ తుభ్యం సదానంద రూపాయ సర్వార్తిగాయ|
అపారస్వరూపాయ దేవాధిదేవ నమస్తే ప్రభో భక్త సంరక్షకాయ ||

45. నీలకంఠ గణపతి           
వినాయకం నాయకమౌక్తికం త్రయీ హారావళే రావళితం భుజంగమై: |
పినాకిజం నాకిజనేడ్య మంహసాం నివారణం వారణ్వక్త్ర మాశ్రయే ||

46.   గాయత్రి గణపతి         
యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాధ భూతం |
భావేనదత్తం గణనాథతత్వం గృహాణ భక్తోద్దృతి కారణాయ ||

47.     చింతామణి గణపతి       
కల్పద్రుమాధ: స్థితకామధేయం |
చింతామణిం దక్షిణపాణి శుండమ్ |
బిభ్రాణ మత్యద్భుత చిత్రరూపం |
య: పూజయేత్తస్య సమస్త సిద్ధి: ||

48. ఏకదంత గణపతి           
అగజానన పద్మార్కమ్ గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే

49.    వికట గణపతి       
వికటోనామ విఖ్యాత: కామాసుర విదాహక: |
మయూర వాహనశ్చాయం సౌరబ్రహ్మధర: స్మ్రత: ||

50.   వరద గణపతి         
వరదాభయ హస్తాయ నమ: పరశుధారిణే |
నమస్తే సృణిహస్తాయ నాభివిశేషాయతే నమ: ||

51.  వశ్య గణపతి         
విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వన్దే జనైర్మాగధకై: స్మృతాని |
శ్రుత్వాసమత్తిష్ఠ గజానన త్వం బ్రహ్మేజగన్మంగళకం కురుష్వ ||

52. కుల గణపతి           
శుండావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహేంణ |
రత్నైశ్చయుక్తం మనసామయాయ ద్ధతం ప్రభోతత్సఫలం కురుష్వ ||

53.  కుబేర గణపతి         
రత్నై: సువర్ణేన కృతాని గృహాణచత్వారి మయాప్రకల్ప్య |
సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు వ్యాజ విఘ్నహారిన్ |

54.  రత్నగర్భ గణపతి         
హేరంబతే రత్నసువర్ణయుక్తే సునూపుర మంజీరకే తథైవ|
సు కింకిణీ నాద యుతే సుబుద్ధ్యా సుపాదయో: శోభమయే ప్రదత్తే ||

55. కుమార గణపతి           
మాత్రే పిత్రేచ సర్వేషాం హేరంబాయ నమో నమ:
అనాదయేచ విఘ్నేశ విఘ్నకర్తే నమోనమ:

56.  సర్వసిద్ధి గణపతి         
పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |
విఘ్నవిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం |
సురాసురేంద్ర్యై: సిద్ధేంద్ర్యై: స్తుతం స్తౌమి పరాత్పరం |
సురపద్మచినేశంచ గణేశం మంగళాయనం ||

57.  భక్త గణపతి         
నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం
శరచ్ఛశాంక సదృశం భజే భక్తగణాధిపమ్

58.    విఘ్న గణపతి       
పాశాంకుశం ధరన్నామ ఫలాశీ చాఖవాహన:
విఘ్నం నిహస్తు న: సర్వ రక్తవర్ణో వినాయక:

59.   ఊర్ధ్వ గణపతి         
కల్హారిశాలి కణిశేక్షుక చాపబాణ,
దంత ప్రరోహ కబర: కనకోజ్జ్వలాంగ:,
ఆలింగనోద్యత కర: తటిదాభకట్యా
దేయాత్స శతృభయ మూర్థ్వ గణేశ్వరస్తే

60.   వర గణపతి         
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన
ఈప్సితం మేం వరం దేహి పరత్రా చ పరాంగతిమ్

61.  త్ర్యక్ష్యర గణపతి         
సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితం
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్

62.    క్షిప్రప్రసాద గణపతి       
యక్షకిన్నర గంధర్వ సిద్ధవిద్యా ధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందే హం గణనాయకమ్

63.  సృష్టి గణపతి         
ప్రాతర్నమామి చతురానన వన్ద్యమానం
ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్
తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం
పుత్రం విలాస చతురం శివయో: శివాయ

64.  ఉద్దండ గణపతి         
ప్రాత:స్మరామి గణనాథమనాథ బంధుం
సిందూరపూర పరిశోభితగండయుగ్మం
ఉద్ధండవిఘ్న పరిఖండన చండదండం
అఖండలాది సురనాయక బృందవంద్యమ్

65.     డుండి గణపతి       
అక్షమాలాం కుఠారంచ రత్నపాత్ర స్వదంతకమ్
ధతైకరైర్విఘ్నరాజో డుంఢినామా మదేస్తున:

66.ద్విముఖ గణపతి           
స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్దదానో హరినీలగాత్ర:
రత్నాంశుకో రత్న కిరీటమాలీ భూత్యై సదామే ద్విముఖో గణేశ:

67.  త్రిముఖ గణపతి         
శ్రీమత్తీక్షణ శిఖాం కుశాక్ష వరదాన్ దక్షే దదానం కరై:
పాశాంచామృత పూర్ణకుంభమయం వామే దదానోముదా
పీఠే స్వర్ణమయారవింద విలసత్సత్కర్ణికాభాసురే
స్వాసీనస్త్రిముఖ: పరశురుచిరో నాగనన: పాతున:

68. సింహ గణపతి           
వీణాం కల్పలతా మరించ వరదం దక్షేవిధత్తేకరై:
వేణే తామరసం చ రత్న కలశం సన్మంజరీం చా భయం
శుండాదండలసన్ మృగేంద్ర వందన: శంఖేందు గౌర: శుభో
దీప్యద్రత్న నిభాంకుశో గణపతి: పాయా దపాయాత్సన:

69.  గజానన గణపతి         
సదా సుఖానందమయం జలేచ సముద్రేన ఇక్షురసే నివాసం|
ద్వంద్వ స్థయానేనచ నాళరూపం గజాననం భక్తియుతం భజామ||

70. మహోదర గణపతి           
మహోదర ఇతిఖ్యాతో జ్ఞానబ్రహ్మ ప్రకాశక:
మోహాసుర నిహంతావై ఆఖువాహన ఏవచ ||

71.   భువన గణపతి         
విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయతే |
నమో నమస్తే సత్యాయ సత్య పూర్ణాయ శుండినే ||

72. ధూమ్రవర్ణ గణపతి           
ధూమ్రవర్ణావతారశ్చాభి మానాసుర నాశక:
ఆఖువాహన ఏవాసౌ శివాత్మేతి స ఉచ్యతౌ

73.  శ్వేతార్క గణపతి       
ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే
శ్వేతార్కమూలనివాసాయ
వాసుదేవ ప్రియాయ, దక్ష ప్రజాపతి రక్షకాయ
సూర్యవరదాయ కుమారగురవే

74.   ఆధార గణపతి         
నాదం బాలసహస్ర భాను సదృశం నాగేంద్ర
వక్త్రాన్వితం | హస్తాభ్యాం చషకం పవిత్ర కలశం
హస్యంచ వృత్తాండవం | నానా చిత్రవిచిత్రయన్
పరగురుం ఆధార విద్యా స్థితిం | ఓంకార
ప్రణవాకృతిం గణపతిం నిత్యం భజేహం ప్రభో ||

75.  భూతరోగ నివారణ గణపతి         
ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణ పాశమంకుశం |
అభయం వరదం సాస్మృర్భధానం మూషిక ధ్వజం |

76. ప్రసన్న విఘ్నహర గణపతి           
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||

77.   ద్వాదశభుజవీర గణపతి         
సురేంద్రనేన్యం హ్యసురై: సుసేవ్యం సమానభావన విరాజయంతం|
అనంతబాహుం మూషక ధ్వజం తం గజాననం భక్తియుతం భజామ: ||

78.  వశీకర గణపతి         
బీజాపూరగదేక్షుకార్ములసచ్చక్రోబ్జ పాశోత్పల|
వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహ: ||
ధ్యేయోవల్లభయా సపద్మకరయాశ్లిష్టోజ్వల- ద్భూషయ
విశ్వోత్పత్తి విపత్తి సంస్తుతికరో విఘ్నో విశిష్టార్ధద: ||

79.  అఘౌర గణపతి         
గజవదనమంచింత్యం తీక్ష్ణదంష్టృం త్రినేత్రం
బృహదుదరమశేషం భూతరాజం పురాణం
అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం |
పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి ||

80. విషహర గణపతి           
నాగాననే నాగకృతోత్తరీయే క్రీడారతే, దేవకుమార సంఘై: |
త్వయిక్షణం కాలగతిం విహాయతౌ ప్రాపతు కన్దుకతామినేన్దూ ||

81. భర్గ గణపతి           
బాలార్కకోటి ద్యుతి మప్రమేయం
బాలేందు రేఖా కలితోత్తమాజ్ఞమ్ |
భ్రమద్ద్విరేపావృత గణ్డభాగం భజే భవానీతనయం గణేశమ్ ||

82.  సర్వ సమ్మోహన గణపతి         
స్వాంకస్థితాయానిజవల్లభయాముఖామ్భుజాలోకేన లోలనేత్రం |
స్మేరాననాస్యం మదవైభవేన రుద్ధం భజే విశ్వవిమోహనంతం ||

83.  ఐశ్వర్య గణపతి         
సహస్ర శీర్షం మనసా మయా త్వం దత్తం కిరీటంతు సువర్ణజంవై |
అనేకరత్నై: ఖచితం గృహాణ బ్రహ్మేశతే మస్తక శోభనాయ ||

84.  మాయావల్లభ గణపతి         
సంసారార్ణవ పారేచ మాయాపోతే సుదుర్లభే |
కర్ణధార స్వరూపంచ భక్తానుగ్రహకారకం |
వరం వరేణ్యం వరదం వరదానామపి ఈశ్వరం |
సిద్ధం సిద్ధి స్వరూపంచ సిద్ధిదం సిద్ధి సాధనమ్ ||

85.  సౌభాగ్య గణపతి         
తతో హరిద్రామచిరంగులాలం సిన్ధూరకం తేపరికల్పయామి |
సువాసితం వస్తు సువాస భూతై: గృహాణ బ్రహ్మేశ్వర శోభనార్థమ్ ||

86.  గౌరి గణపతి         
విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ |
లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |
నాగాసనాయ కృతియజ్ఞ విభూషితాయ |
గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే ||

87.  ప్రళయంకర్త గణపతి         
అకాలమేవ ప్రళయ: కథం లబ్ధో జనైరయం |
హా ! గజానన దేవేశ: హాహా విఘ్న హరావ్యయ ||

88.  స్కంద గణపతి         
కుమార భుక్తౌ పునరాత్మహేతో: పయోధరే పర్వతరాజ పుత్ర్యా|
ప్రక్షాళయంతం కరశీ కరేణ మౌగ్ధ్యేనతం నాగముఖం భజామి ||

89.    మృత్యుంజయ గణపతి       
సరాగలోకదుర్లభం విరాగిలోక పూజితం
సురాసురైర్నమస్కృతం జరాప మృత్యునాశకం ||

90.  అశ్వ గణపతి         
రాజోపచారాన్వి విధాన్గృహాణ హస్త్యశ్వఛత్రాధికమాద రాద్వై |
చిత్తేన దత్తాన్గణనాధడుణ్డే హ్యపార సంఖ్యాన్ స్థిరజంగమాంస్తే ||

91. ఓంకార గణపతి           
వందే గణేశం భుజగేంద్ర భూషణం సమస్త భక్తాళికృతాతితోషణం
విశ్వం భరా సంస్థితలోక రక్షణం మదీయ పాపౌఘతమస్సు పూషణమ్ ||

92.    బ్రహ్మవిద్యా గణపతి       
బ్రహ్మేభ్యో బ్రహ్మదాత్రేచ గజానన నమోస్తుతే |
ఆదిపూజ్యాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠరాజాయతే నమ: ||

93.   శివ అవతార గణపతి         
విఘ్నానాం పతయే తుభ్యం నమో విఘ్న నివారణ |
సర్వాంతర్యామిణే తుభ్యాం నమస్సర్వప్రియంకర ||

94.    ఆపద గణపతి       
ఓమ్ నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే |
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే ||

95.   జ్ఞాన గణపతి         
గుణాతీతమౌనం చిదానంద రూపం |
చిదాభాసకం సర్వగం జ్ఞాన గమ్యం |
ముని శ్రేష్ఠమాకాశ రూపం పరేశం |
పరబ్రహ్మ రూపం గణేశం భజేమ ||

96. సౌమ్య గణపతి           
నమస్తే గణనాధాయ గణానాం పతయే నమ: |
భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యో సుఖదాయక ||

97.   మహాసిద్ధి గణపతి         
గజవక్త్రం సురశ్రేష్ఠ కర్ణచామర భూషితం |
పాశాంకుశ ధరం దేవం వందే హం గణనాయకం ||

98.   గణపతి         
సిందూరాస్త్రినేత్ర: పృథుతర జదరో హస్త పద్మం
దదానం | దంతం పాశాంకుశేష్ట్వానురుతర
విలసద్విజ పూరాభిరామం | బాలేందు ఖ్యాతిమౌళి
కరిపతి వదాన దాన పూర్ణార్థ గంధో | భోగేంద్రై
భూషితాంగోర్జేత్ గణపతిం రక్తస్త్రాంగరాగ: ||

99. కార్యసిద్ధి గణపతి           
యతోబుద్ధి రజ్ఞాననాశో ముముక్షో: |
యత స్సంపదోభక్త సంతోషదాస్సు: |
యతో విఘ్ననాశయత: కార్యసిద్ధి: |
సదాతం గణేశం నమామో భజామ: ||

100.  భద్ర గణపతి     
అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయతే నమ:
సుగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయచ ||

101.   సులభ గణపతి   
వందే గజేంద్రవదనం - వామాంకారూఢ వల్లభాశ్లిష్టం
కుంకుమపరాగశోణం - క్వులయినీ జారకోరకా పీడమ్ ||

102.   నింబ గణపతి   
విఘ్నహర్తే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే |
త్వాదేయ భక్తియోగేన యోగీశాం శాంతిమాగతా: ||

103. శుక్ల గణపతి     
అంతరాయ తిమిరోపశాంతయే
శాంతపావనమచింత్య వైభవం |
తంనరం వపుషికుంజరం ముఖే
మన్మహే కిమపి తుందిలంమహ: ||

104.   విష్ణు గణపతి
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

105.  ముక్తి గణపతి
పాశాంకుశౌ భగ్నరథం త్వభీష్టం కరైర్దధానం కరరన్ద్రముక్తై: |
ముక్తాఫలాభై: పృథుశీకరౌఘై: సిఙ్చన్తమఙ్గం శివయోర్భజామి ||

106.  సుముఖ గణపతి
ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమోనమ: |
ప్రసన్న జనపాలాయ ప్రణతార్తివినాశినే ||

107.  సర్వ గణపతి
చతు: పదార్థా వివిధ ప్రకాశాస్త్త వివ హస్తా: సచతుర్భుజం |
అనాథనాథాంచ మహోదరంచ గజాననం భక్తియుతం భజామ:

108.  సిద్ధిబుద్ధి గణపతి
సత్పద్మరాగ మణివర్ణ శరీరకాంతి:
శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీ:
వక్షస్థలే వలయితాతి మనోజ్ఞ శుణ్డో
విఘ్నం మామపహర సిద్ధి వినాయకత్వమ్ ||

|| ఓం నమః శివాయ ||

పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు

1. నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు.( మనుస్మృతి)

2. పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు. ( విష్ణుస్మృతి)

3. విద్యార్థి,నౌకరు,మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో,వీరిని మేల్కొలపవచ్చును.( చాణక్య నీతి)

4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి.( దేవీ భాగవతము).పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.( పద్మ పురాణము)

5. తడి పాదము లతో నిద్రించవద్దు. పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది.( అత్రి స్మృతి) విరిగిన పడకపై,ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం.( మహాభారతం)

6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు.( గౌతమ ధర్మ సూత్రం)

7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య,పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత,ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని,మృత్యువు,ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించిన చో ధనము,ఆయువు ప్రాప్తిస్తుంది.( ఆచార మయూఖ్)

8. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో 1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగహేతువు,మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది)

9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.( బ్రహ్మా వైవర్తపురాణం)

10.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే పడుకోవాలి

11.ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది.

12.దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు యముడు మరియు దుష్ట గ్రహము ల నివాసము వుంటారు.దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.

13.గుండెపై చేయి వేసుకుని, చెత్తు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.

14.పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.

15. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది.)

ఈ పదహారునియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి,మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...