కార్తీక మాసంలో కార్తీక స్నానాలు, దీపాలు, క్షేత్ర దర్శనం, ఆహార నియమం, దానాలు, దీప దానం, నిత్యా దైవ నామ స్మరణ విశేష ఫలితం ఇస్తుంది.
కార్తీక మాసం శివ కేశవులకు ఇరువురి కి విశేషం .కార్తీక మాసంలో సోమవారాలు శివారాధన, శనివారం విష్ణు ఆరాధన, నాగులు చవితి , కార్తీక పౌర్ణమి, ముఖ్యంగా కార్తీక మాసంలో ఆదివారం.. చేసే పూజలు చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది..ఆదివారం మాంసం తినకుండా కులదేవతను ఉపాసించాలి రోజు సూర్యుడికి నమస్కారం చేయాలి ఆదివారం రాత్రి అన్నం తినకుండా ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు.
- జాతకంలో ఎవరికి ఏ దోషం ఉంటే వాళ్ళు ఈ మాసం అంతా దానికి సంబంధించిన స్త్రోత్రాన్ని ఆ దేవతను ఆరాధించడం వల్ల విశేష మైన ఫలితం ఉంటుంది.
- కుజ దోషం ఉన్న వాళ్ళు , వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు ఈ మాసమంతా సుబ్రహ్మణ్య స్త్రోత్రం చదవాలి,
- ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం తో బాధపడే వాళ్ళు, బైద్యనాద్ స్త్రోత్రం,ఆదిత్య హృదయం పఠించాలి,
- వ్యాపారం లో నష్టాలు, కుటుంబ కలహాలు, అప్పులు ,కోర్ట్ కేసుల్, అపనిందలు , రాహు గ్రహ దోషాలు ఉన్న వారు మంగళ చండికా స్త్రోత్రం చదవాలి,
- మంత్ర సాధన చేస్తున్న వాళ్ళు, కొత్తగా దీక్ష తీసుకుని ఉపాసన చేస్తున్న వాళ్ళు చర్మ వ్యాధులు, అధిక రక్తపోటు మధుమేహ వ్యాధి ఉన్న వారు ఈ మాసం మొత్తం మనసా దేవీ స్త్రోత్రం చదవాలి,
- నేత్ర వ్యాధులు, ఏదైనా మీపైన ప్రయోగం జరిగింది అని అనుమానం ఉన్న వాళ్ళు, ఎంత కష్టపడ్డా ఎదుగుదల గుర్తింపు లేని వారు గరుడ ప్రయోగ మంత్రం చదవాలి..
- శత్రు బాధలు ఉన్నవారు దుర్గా స్త్రోత్రం ,
- శుభకార్యము జరగాలి అని కోరుకునే వారు లలితా సహస్త్ర నామం,
- కొత్త ఇల్లు కొనాలి అనుకునే వారు మణిద్వీప వర్ణన,
- భూమి అమ్మాలి అనుకునే వాళ్ళు గణేశ ప్రార్థన, భూమి కొనాలి అనుకునే వాళ్ళు లక్ష్మీ వరాహ స్వామి ప్రార్థన శ్లోకం,
- ఉద్యోగం ,ప్రమోషన్ కోరుకునే వాళ్ళు కనకధార స్త్రోత్రం,
- రాజకీయ నాయకులు, పోలీసు శాఖ వాళ్ళు, క్రీడా రంగం వాళ్ళు, వారాహి కవచం,
- నాటక రంగంలో ఉన్నవాళ్లు వైద్య వృత్తిలో వారు ప్రత్యంగిరి, నరసింహ స్త్రోత్రలు ఈ మాసంలో నియంగా నెల మొత్తం పారాయనఁ చేస్తుండాలి..
- విద్యార్థుల సర్వస్వతీ , హాయగ్రీవ, వినాయక స్త్రోత్రలు చదవాలి
- అన్ని విధాలా భయాలను తొలగించి కార్యసిద్ధి కలిగించే హనుమంతుడి స్త్రోత్రం ఇక్కడ ఇస్తాను గమనించండి అది వద్దు అనుకునే వాళ్ళు హనుమాన్ చాలీసా చదువుకోండి.
- ఆధ్యాత్మిక జ్ఞానం, దైవనుగ్రహం కోసం ఈ మాసం మొత్తం దామోదర అష్టకం ప్రతి రోజూ చదవాలి .
- ఈ నెల మొత్తం గడపలో దీపాలు పెట్టాలి తులసి కోటలో దీపం పెట్టాలి, ఉదయం సూర్యోదయానికి ముందు పెట్టె దీపాలు విష్ణు మూర్తికి చేoదుతుంది, సంధ్యకాలం ఆరు పైన పెట్టే దీపాలు శివయ్యకు చేoదుతుంది.. అకండ దీపారాధన చేసే వాళ్లకు ఈ మాసం చాలా విశేషం
కొన్ని శ్లోకాలు ఇక్కడ ఇస్తాను గమనించండి.
శ్రీ దామోదరాష్టాకం
నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రాజమానం |
యశోదాభియోలూఖలాద్దావమానం పరామృష్టమత్యంతతో ద్రుత్య గోప్యా ||
రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం |
ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠస్థితగ్రైవ-దామోదరం భక్తి బద్ధమ్ ||
ఇతిదృక్ స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతమ్ |
తదీయేషితాశ్లేషు భకెర్జితత్వం పునః ప్రేమతస్తం శతావృత్తి వందే ||
వరం దేవ మోక్షం న మోక్షావధిం వా న చాన్యం వృణ్నేహం వరేషాదపీహ |
ఇదం తే వపుర్నాథ గోపాలబాలం సదా మే మనస్యావిరాస్తాం కిమన్యెః ||
ఇదం తే ముఖాంభోజమత్యంతనీలైర్వృతం కుంతలైః స్నిగ్ద -రకైశ్చ గోప్యా |
ముహుశ్చుంబితం బింబరక్త ధరం మే మనస్యావిరాస్తాం అలం లక్షలాభైః ||
నమో దేవ దామోదరానంత విష్ణో ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్దిమగ్నం |
కృపాదృష్టివృష్ట్యాతి దీనం బతాను - గృహాణేశ మాం అజ్ఞమేధ్యక్షిదృశ్యః ||
కువేరాత్మజౌ బద్దమూర్వైవ యద్వత్ త్వయా మోచితా భక్తిభాజౌ కృతా చ |
తథా ప్రేమభక్తిం స్వకం మే ప్రయచ్చ న మోక్షే గ్రహో మేపి దా మోదరేహ ||
నమస్తేస్తు దామ్నే స్ఫురదీప్తిధామ్నే త్వదీయోదరాయాథ విశ్వస్య ధామ్నే |
నమో రాధికాయై త్వదీయప్రియాయై నమో నంతలీలాయ దేవాయ తుభ్యం ||
ఇతి శ్రీమద్పద్మపురాణే శ్రీ దామోదరాష్టాకం సాంపూర్ణం ||
లక్ష్మీ కటాక్షం
"ఓం, ఐం, హ్రీం, శ్రియైనమౌ
భగవతి మమ సంరుద్ధౌ జ్వల
జ్వల మా సర్వ సంపదం దేహిదేహి
మమ అలక్ష్మీ నాశయ హుం ఫట్ స్వాహీ''
ఈ మంత్రాన్ని మీ శక్తిని బట్టి పఠించండి. రోజూ 108 సార్లు మాత్రం తప్పకుండా జపించాలి. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ధనం రావటం మొదలవుతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నైతిక కార్యాల్లో విజయం లభిస్తుంది
ఇంద్ర కృత మానసా దేవి స్తోత్రం
దేవీ త్వాం స్తోతు మిచ్చామి స్వాధీనం ప్రవరామ్ వరామ్ |
పారత్‌పారాం ప చ పరమాం నహి స్టోతుం క్షమో ధూనా ||
స్తోత్రానామ్ లక్షణం వేదే స్వభావాఖ్యాన తత్ప రమ్ |
న క్షమః ప్రకృతేవక్తూమ్ గుణానామ్ గణనం తవ ||
సుద్దసత్వ స్వరూపా త్వమ్ కోపహింసా వివర్జితా |
న చ శక్తో మునిస్తేన త్యక్తుo యాం చ కృతా యతః ||
త్వం మయా పూజితా సాద్వి జననీ మేయథో ధీతహ |
దయారూపా చ భగినీ క్షమా రూపా యథా ప్రసూమ్ ||
త్వయా మే రక్షితా ప్రాణాః పుత్ర దారాః సురేశ్వరీ |
అహం కరోమి త్వత్పూజామ్ ప్రీతిశ్చ వర్ధతాం సదా ||
నిత్యా యధ్యపి పూజ్యా త్వం సర్వత్ర జగదంబికే |
తథాపి తవ పూజాం చ వర్ధయా మి సురేశ్వరీ ||
యే త్వా మాషాడ సంక్రాంత్యామ్ పూజ యిష్యంతి భక్తితహ |
పంచమ్యాం మానసాఖ్యాయ మాసాంతే వా దినే దినే ||
పుత్రపౌత్రాదయః తేషామ్ వర్దితే చ ధనాని వై |
యశస్వినః కీర్తి మంతో విధ్యావంతో గుణాన్వితాః ||
యే త్వామ్ న పూజాశ్యంతి నిందం త్యజ్ఞాన తో జనాః |
లక్ష్మి హీనా భవిష్యన్తీ తేషామ్ నాగభయం సదా ||
త్వమ్ స్వయం సర్వలక్ష్మీశ్చ వైకుంటే కమలాలయా |
నారాయణాంశో భగవాన్ జరత్కారు మునీశ్వరః ||
తపసా తేజసా వా పిచ మానసా సన్నుతే పివా |
అస్మాకం రక్షణాయైవ తేన త్వమ్ మనసాబిదా ||
మానసాదేవి శక్త్యాత్వమ్ స్వాత్మనా సిద్ధ యోగినీ |
తేన త్వమ్ మానసా దేవీ పూజితా వందితా భవ ||
యే భక్త్యా మానసా దేవ్యాహ్ పూజయం త్య నిశం భృశం |
తేన త్వామ్ మానసా దేవీం ప్రవదంతి మనీషిణః ||
సత్య స్వరూప దేవీ త్వామ్ శశ్వత్ సత్య నిషేవణాత్ |
యో హి త్వామ్ భావయే నిత్యం సత్వామ్ ప్రాప్నోతి తత్పరః ||
శ్రీ మారుతీ బీజమంత్ర స్తోత్రమ్
ఓం నమో భగవతే విచిత్రవీర హనుమతే ప్రలయం కాలానల ప్రభాప్రజ్వలనాయ | ప్రతాప వజ్రదేహాయ | అంజనీగర్భ సంభూతాయ ప్రకట విక్రమ నీరదైత్యదానవ యక్షరక్షోగణ గ్రహబంధనాయ | భూతగ్రహబంధనాయ | ప్రేతగ్రహబంధనాయ | పిశాచ గ్రహబంధనాయ | శాకినీ డాకినీ గ్రహబంధనాయ | చోరగ్రహబంధనాయ | కాకినీ కామినీ గ్రహబంధనాయ | బ్రహ్మగ్రహబంధనాయ | బ్రహ్మరాక్షసగ్రహబంధనాయ | చోరగ్రహబంధనాయ | మారీగ్రహబంధనాయ | ఏహి ఏహి | ఆగచ్ఛ అగచ్ఛ | ఆవేశయ ఆవేశయ | మమహృదయే ప్రవేశయ స్ఫుర స్ఫుత | ప్రస్ఫుర ప్రస్ఫుర | సత్యంకథయ వ్యాఘ్రముఖబంధన సర్పముఖంబరాజముఖంబ నారీముఖబంధన సభాముఖంబ శత్రుముఖం బసర్వముఖంబ లంకాప్రాసాద భంజనం | అముకం మే వశమానయ | క్లీం క్లీం క్లీం హ్రీం సశ్రీం శ్రీం రాజానం వశమానయ | శ్రీం క్లీం క్లీం స్తీ ఆకర్షయ శత్రూన్ మర్దయ మార్దయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే శ్రీ రామచంద్రాజ్ఞయా మమ మమ కార్యసిద్ధిం కురు కురు ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్ర: ఫట్ స్వాహా || విచిత్రవీర హనుమాన్ మమ సర్వ శత్రూన్ భస్మకురు కురు | హన హన హుం ఫట్ స్వాహా || ఏకాదశశతవారం జపిత్వా సర్వశత్రూన్ వశమానయతి నాన్యథా ఇతి ||
||ఇతి మారుతీస్తోత్రమ్ సంపూర్ణం ||
నవగ్రహ పీడాపరిహార స్తోత్ర
గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారక: |
విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే రవి: ||
రోహిణీశ: సుధామూర్తి: సుధాగాత్ర: సుధాశన: |
విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే విధు: ||
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్సదా |
వృష్టికృద్వృష్టిహర్తాచ పీడాం హరతు మే కుజ: ||
ఉత్పాతరూపీ జగతాం చంద్రపుత్రో మహాద్యుతి: |
సూర్యప్రియకరో విద్వాన్పీడాం హరతు మే బుధ: ||
దేవమంత్రీ విశాలాక్ష: సదా లోకహితే రత: |
అనేక శిష్య సంపూర్ణ: పీడాం హరతు మే గురు: ||
దైత్య మంత్రీ గురుస్తేషాం ప్రణవశ్చ మహామతి: |
ప్రభుస్తారాగ్రహణాం చ పీడాం హరతు మే భృగు: ||
సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష: శివప్రియ: |
మందచార: ప్రసన్నాత్మా పీడాం హరతు మే శని: ||
మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబల: |
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ ||
అనేకరూప వర్ణైశ్చ శతశోఽథ సహస్రశ: |
ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమ: ||
|| ఇతి నవగ్రహ పీడాపరిహార స్తొత్రం సంపూర్ణం
హయగ్రీవస్తోత్రం
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః||
ఫలశ్రుతి :
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం||
వారాహీ కవచం
అస్యశ్రీ వారాహీ కవచస్య త్రిలోచన ఋషీః అనుష్టుప్ ఛందః శ్రీ వారాహీ దేవతా
ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః
ధ్యానమ్
ధ్యాత్వేంద్ర నీలవర్ణాభాం చంద్రసూర్యాగ్ని లోచనాం
విధివిష్ణు హరేంద్రాదిమాతృభైరవసేవితామ్ 1
జ్వలన్మణిగణప్రోక్త మకుటామావిలంబితాం
అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ 2
ఏతైస్సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం
పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తి ఫలప్రదమ్ 3
పఠేత్త్రి సంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం
వార్తాళీ మే శిరః పాతు ఘోరాహీ ఫాలముత్తమమ్ 4
నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ
ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంధినీ 5
పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంథమాదరాత్
స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా 6
సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా
నాభిం చ శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి 7
ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ
గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తంభినీ తథా 8
చండోచ్చండ శ్చోరుయుగం జానునీ శత్రుమర్దినీ
జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయో 9
పాదాద్యంగుళిపర్యంతం పాతు చోన్మత్తభైరవీ
సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా. 10
యుక్తాయుక్తా స్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే
సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరమ్. 11
సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే
సర్శశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా. 12
సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేష సంహతిః
వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః. 13
తథావిధం భూతగణా న స్పృశంతి కదాచన
ఆపదశ్శత్రుచోరాది గ్రహదోషాశ్చ సంభవాః. 14
మాతాపుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనం
తథాంగమేవ వారాహీ రక్షా రక్షాతి సర్వదా. 15
కుజదోష నివారణ శ్రీ షణ్ముఖదండకం
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్థూల సూక్ష్మ ప్రదర్శకాయం, ప్రకీర్తి ప్రదాయం, భజేదుర్ధరాయం, భజేహం పవిత్రం, భజే శివతేజం, భజే స్థాపకాయం, భజే ప్రసన్నరూపం, భజే దయామయివటంచున్ ప్రభాతంబు, సాయంత్రం మున్నీదు దివ్యనామ సంకీర్తనల్ జేసినన్, నీ రూపు వర్ణించి, నీ మీదనే దండకం బొక్కటిన్ జేయనూహించి, నీ దివ్యగానంబు కీర్తించి, నీ దాసదాసుండనై శివభక్తుండనై నిన్ను నే గొల్చేదన, నీవు దయాదృష్టిన్ జూచితే వేడుకల్ జేసితే, నా మొరాలించితే, నన్ను రక్షించితే శివపార్వతీ ప్రియపుత్రాయ, నిన్నెంచ నేనెంత వాడన్, కరుణా కటాక్షంబున జూచితే దాతవై బ్రోచితే, తొల్లి షణ్ముఖుండవై, కార్తికేయుండవై, శివాహ్వానాన్ని మన్నించి, కైలాసమునకున్ బోయి దేవసైన్యాధ్యక్షుండవై, కీర్తిమంతుడవై, చిత్ర బర్హణవాహనుండవై, పార్వతీ పరమేశ్వరాశీస్సులన్ బొంది, కార్యసాధకుండవై, నీ వీరపరాక్రమంబులన్ జూపి అమరులకున్ అభయమున్నిచ్చిత్రైలోక్య పూజ్యుండవై, ముప్పది మూడు కోట్ల ద్వతలకున్నిష్ణుండవై, తారకాసుర సంహరివై, శోణిత పురంబువై దండయాత్రన్ ప్రారంభించి పురంబు ముట్టడించి, రణభేరుల్ మ్రోగించ, విశాఖునిన్ రాయబారిగా ఆ యసుర పురంబుజకున్ జంప, తారకాసురుండు రెట్టించి హెచ్చించి నాగ్రహంబుతో నీ మీదకున్ దండెత్త, మ నీవప్పుడే శివపంచాక్షరిన్ జపించి మంత్రించి, నీ దివ్య తేజంబుజన్ జూప తారకాసురుండచ్చెరువంద, అమితోత్సాహుండవై పాశుపతాస్త్రమున్ ప్రయోగింప, దైత్యులంతటన్ కకావికలైపోవన్నట్టి సమయంబునన్, తారకాసురన్, దృంచ, నా దుష్టుడన్ పునర్జీవించి బాధనొందింపగా, నాతని కంఠమునందున్న శివలింగమున్నీవు చ్చేదించి ఆ యసరునిన్ జంప, లోకంబులానందమై యుండ నీ దివ్య తేజంబు సమస్త లోకంబులన్ బ్రసరింప వేల్పులందరున్ వేనోళ్ళ బొగడంగ త్రిమూర్తులన్ హర్షించి, మోదంబునన్ నీకు కళ్యాణమున్ జేయబోవంగ, దేవసేనిన్ బెండ్లాడి సుఖంబునుండన్ నీవు శ్రీ వల్లినిన్ జూచి మోహింప ఉమామహేశ్వరుడన్నది గ్రహించి వైభవోపేతంబుగా శ్రీ వల్లిన్నిచ్చి వివాహంబుజేయ, శ్రీ శివామోదంబుగా నిన్ను నే సేవించి నా కుజ దోష నివారణకున్ నిన్ ప్రార్థింప, ఆమోదంబు దేల్పినన్ బాయవే, అష్టైశ్వర్య సామ్రాజ్యముల్ గల్గవే నీవే సమస్తంబుగా నెంచి యీ దండకంబున్ పఠించుచున్ శివేశ్వరాయంచున్ శివతేజంబుజన్ వేల్గుదువో వీర సుబ్రహ్మణ్యేశ్వరా! నీదు నామంబు స్మరించినంతన్ అంగారక గ్రహదోష నివారణన్ జేసి నీ దివ్య రూపంబునుం జూపి హృదయాంతరంగయటంచున్ నన్నేలు నా స్వామి ఓం సుబ్రహ్మణ్యేశ్వరా! తారకాసుర సంహారా! దేవసే శ్రీ వల్లీస నాథా! నమస్తే నమో కుజదోష నివారకాయ నమస్తే నమస్తే నమ:
మంగళచండికా స్త్రోత్రం
రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే.
హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే.
మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే
సతాం మంగళతె దేవీం సర్వేషామ్ మంగళాలయే
పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే
పూజ్యే మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్
మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని
సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే
ఈ మంగళ చండికా స్త్రోత్రం ప్రతి రోజూ రాహుకాలంలో చదవటం వల్ల రాహు గ్రహ దోషాలు, ఎన్నో ఆటంకాలు సమస్యలు తీరుతుంది
ఈ స్త్రోత్రలు తో పాటు శివ స్ట్రోత్రాలు కూడా పారాయనఁ చేయాలి ఎవరికి ఏది అవసరమో అది నిత్యా పారాయనఁ చేయాలి...అన్ని కూడా పూజ సమయంలో గృహంలో పటించడం మంచిది
శ్రీ మాత్రే నమః
No comments:
Post a Comment