Friday, August 23, 2019

అష్టమహిషులు

శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలు

ఈ అష్ట మహిషులే కాక మిగిలిన పదహారు వేల వంద మంది


కృష్ణుడి భార్యలకు కూడా ఆయన తన ప్రేమను పంచగలగటం, దానిని వారు పోటీపడి స్వీకరించటం చాలా గొప్ప విషయం.

అష్ట భార్యలు

1. రు   క్మి   ణి

రుక్మిణీదేవి సందేశాన్ని అందకొని స్వయంవర సమయంలో ఎత్తుకొచ్చి వివాహం చేసుకొన్నాడు.

అన్యాయంగా, బలవంతంగా లాక్కువెళ్ళి పెళ్ళి చేసుకొన్నాడని శిశుపాలుడు ఆరోపించాడు.
ప్రేమవివాహం.


2. స  త్య  భా  మ

సత్రాజిత్తు కుమార్తె. ఈమె భూదేవి అవతారం.

 గోదాదేవిసత్యభామ అవతారం అని అంటారు


3. జాం  బ  వ  తి

జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు. వీణా విద్వాంసురాలు.


4. మి  త్ర  విం  ద

ఆమె కోరిక మేరకే బహిరంగంగా స్వయం వరానికొచ్చి అందులోనే ఇతర రాజకుమారులందరినీ ఓడించి చేపట్టాడు.


5. భ  ద్ర

మేనత్త కేకయ దేశపు రాజు భార్య అయిన శృతకీర్తి కుమార్తె  పెద్దలందరి ముందు పెళ్ళాడాడు.


6. సు  దం  త

నగ్నజిత్తు కృష్ణుడు ఏడు రూపాలను ధరించి ఏడు ఎద్దులను ఒక్కొక్క గుద్దు గుద్ది లొంగదీసుకుని వాటిని తాళ్ళతో బంధించి పెళ్ళి చేసుకున్నాడు.

1.నాగ్నజితి

కోసల దేశాధిపతియైన నాగ్నజిత్తు కుమార్తె. ఈ రాజు నగరంలోని ఏడు వృషభములు ప్రజలకు అపాయము చేయుచున్నవి. రాజ్యంలో ఎవ్వరును వీటిని పట్టలేకపోతారు. రాజు వీటిని పట్టగలవానిని తన కూతురు నిచ్చి వివాహము చేయుదునని ప్రకటించెను.

శ్రీకృష్ణుడు ఆ ప్రకటన విని కౌసల్యకు వెళ్ళి ఆ వృషభాలను వధించి నాగ్నజితిని పరిణయమాడెను.

కా  ళిం  ది
పెద్దలందరి ముందు పెళ్ళాడాడు.

ల  క్ష  ణ

మద్ర దేశపు రాజకుమారి. మత్స్యయంత్ర పరీక్ష. స్వయంవరంలో యంత్రాన్ని పడగొట్టి లక్షణను చేపట్టాడు.

అష్టమహిషుల సంతానం

శ్రీకృష్ణుడికి రుక్మిణి, సత్యభామ తదితర అష్ఠ మహిషులు, పదహారు వేల వంద మంది భార్యలుఉన్నారు.

కృష్ణుడికి ఆ భార్యల వల్ల కలిగిన సంతానం ఎంత?

భార్యలందరితోనూ ఆయనకు ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు.

రుక్మిణి వల్ల

కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు.

 సత్యభామ
వల్ల భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు.

జాంబవతీ
 శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.

నాగ్నజితి,
 కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు.

 కాళింది
వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు.

లక్షణకు,
 శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.

మిత్రవింద,
 కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు.

కృష్ణుడికి భద్ర
 అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు.

ఈ అష్ట మహిషులే కాక మిగిలిన పదహారు వేల వంద మంది కృష్ణుడి భార్యలకు కూడా ఒక్కొక్కరికి పది మంది సంతతి కలిగింది.

Tuesday, August 20, 2019

అష్టాక్షరీ మంత్ర మహిమ

” ఓం నమో నారాయణాయ ” అను ఎనిమిది అక్షరముల యొక్క మంత్ర స్మరణము అనంత పుణ్యప్రదం, అనంత పాప రాశి ని ద్వంసం చేయగల శక్తి కలిగినది.ఇట్టి అష్టాక్షరి మంత్ర అధిష్టాన పురుషోత్తముడే శ్రీ మన్నారాయణుడు స్థితి కారకుడై అష్ట ఐశ్వర్యములను ప్రసాదించునప్పుడు లక్ష్మీనారాయణునిగా, విధ్యజ్ఞానము ప్రసాదించునపుడు లక్ష్మీ హయగ్రీవునిగా, ఆరోగ్య ప్రధాతగా నిలిచిన సమయాన ధన్వంతరిగా, సంకల్ప దీక్ష నొసగు లక్ష్మీ నారసింహునిగా, సమస్త మానసిక రుగ్మతలు తొలగించు లక్ష్మీ సుదర్శనునిగా, భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించు అనఘ దత్తత్రేయునిగా, సర్వ మంగళకరుడగు శ్రీ వేంకటనాయకుడైన వేంకటేశ్వరునిగా భక్తులకు సుఖ శాంతులను ప్రసాదించుచున్నాడు

మానవాళిని తరింపచేసే ఓ పవిత్ర మంత్రం గురించి ప్రత్యేకంగా వివరిస్తోంది నరసింహ పురాణం పదిహేడో అధ్యాయం.

వ్యాసభగవానుడు తన కుమారుడైన శుక మహర్షికి ఆ మంత్రాన్ని గురించి వివరించాడు. సంసారబంధాల నుంచి విముక్తులు కావటానికి, మానవాళి జపించాల్సిన మంత్రం ఓంనమో నారాయణాయ అనేది. ఇది అష్టాక్షరి. అంటే ఎనిమిది అక్షరాలతో కూడుకొని ఉంటుంది. మంత్రాలన్నింటిలోకి ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం. నిత్యం దీన్ని జపిస్తే ముక్తి లభిస్తుంది. ఈ అష్టాక్షరిని జపించేటప్పుడు శ్రీమహావిష్ణువును మనసులో ధ్యానిస్తుండాలి. అలాగే పవిత్ర నదీప్రాంతాలలో, ఏకాంత ప్రదేశాలలో, జలాశయాల దగ్గర శ్రీమహావిష్ణు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని అష్టాక్షరిని జపించటం మేలు.

అష్టాక్షరిలో ఉండే ఒక్కొక్క అక్షరానికి ఒక్కో ప్రత్యేక వర్ణం ఉంది. వరుసగా

"ఓం" కారం శుక్ల (తెలుపు) వర్ణం,
"న" కారం రక్త (ఎరుపు) వర్ణం,
"మో" అనే అక్షరం కృష్ణ (నలుపు),
"నా" అనే అక్షరం ఎర్రగానూ,
"రా" అనే అక్షరం కుంకుమరంగులోనూ,
"య" అనే అక్షరం పసుపుపచ్చని రంగులోనూ,
"ణా" అనే అక్షరం కాటుకరంగులోనూ ఉంటుంది.

ఓంనమోనారాయణాయ అనే ఈ మంత్రం ఇన్ని వర్ణాలతో విడివిడిగా ఉంటూ అన్ని వర్ణాల సమ్మిళితమైన తెల్లని రంగులో చివరకు కనిపించటం సత్వగుణ ప్రాధాన్యతను తెలుపుతుంది. ఈ మంత్ర ప్రభావం వల్ల స్వర్గ, మోక్ష ఫలాలతోపాటు కోరిన కోర్కెలు కూడా సిద్ధిస్తుంటాయి. దీనిలో సకల వేదార్థాలు నిండి ఉన్నాయని పండితులు విశ్లేషించి చెబుతుంటారు. ఈ మంత్రాన్ని స్నానం చేసి శుచి అయిన తర్వాత పవిత్ర ప్రదేశంలో కూర్చొని జపించాలి.

సర్వకాల సర్వావస్థలలోనూ తాను పవిత్రంగా ఉన్నాననుకొన్నప్పుడు భక్తుడు ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు, పని అయిన తర్వాత దీన్ని జపించటం మేలు. ప్రతి నెలలోనూ ద్వాదశినాడు శుచి అయి, ఓంనమోనారాయణాయ అనే ఈ మంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వందసార్లు జపించాలి. అలా జపించిన వారికి మోక్ష స్థితులలోని సామీప్యస్థితి లభిస్తుంది. స్వామిని గంధపుష్పాలతో పూజించి ఈ మంత్రాన్ని జపిస్తే పాపాలు హరించుకుపోతాయి. అష్టాక్షరీ మంత్రజపంలో మొదటి లక్ష పూర్తి కాగానే ఆత్మశుద్ధి కలుగుతుంది. రెండో లక్ష పూర్తి అయ్యేసరికి మనశ్శుద్ధి, మూడో లక్ష పూర్తి అయినప్పుడు స్వర్గలోక అర్హత, నాలుగో లక్ష పూర్తికాగానే శ్రీహరి సామీప్యస్థితికి అర్హతలు లభిస్తాయి. అయిదు లక్షలసార్లు ఈ మంత్రజపం చేసిన వారికి నిర్మలజ్ఞానం కలుగుతుంది. ఆరో లక్షతో విష్ణులోకంలో స్థిర నివాస అర్హత, ఏడో లక్షతో స్వస్వరూప జ్ఞానం. ఎనిమిదో లక్షతో ముక్తి లభిస్తాయి. నిత్యజీవితంలో చేసుకొనే పనులు చేసుకుంటూనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించవచ్చు.

నిత్యం ఈ మంత్రజపం చేసేవారికి దుస్వప్నాలు, పిశాచాలు, సర్పాలు, బ్రహ్మరాక్షసులు, దొంగలు, మోసగాళ్లు, మనోవ్యాధులు, వ్యాధులవల్ల బాధలుండవు.

ఓంకారంతో మొదలయ్యే ఈ అష్టాక్షరీ మంత్రం ఎంతో విశేషమైందని వేదాలు కూడా వివరిస్తున్నాయి. జ్ఞానులు, మునులు, పితృదేవతలు, దేవతలు, సిద్ధులు, రాక్షసులు ఈ మంత్రాన్ని జపించి పరమసిద్ధిని పొందిన సందర్భాలున్నాయి. ప్రాణాన్ని విడిచే సమయంలో ఒక్కసారి ఈ మంత్రాన్ని అనుకున్నా వైకుంఠం లభిస్తుంది. వేదాన్ని మించిన శాస్త్రం, నారాయణుడిని మించిన దైవం లేదన్నట్లు ఈ మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదు. ఒక్కోసారి శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల జయంతులు. పూజలు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఆయా అవతారాలకు సంబంధించిన మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ తెలియనప్పుడు "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రాన్ని నూటఎనిమిది సార్లు జపించినా ఆయా అవతారాల పూజాఫలితం దక్కుతుంది. అని ఇలా నరసింహ పురాణంలో సాక్షాత్తు వ్యాసభగవానుడే ఈ విషయాన్ని తన కుమారుడైన శుకయోగికి వివరించి చెప్పడంతో అష్టాక్షరీ మంత్ర ప్రభావం ఎంతటిదో తెలుస్తోంది.

Saturday, August 10, 2019

అష్టావక్ర మహర్షి


గొప్ప ఋషులలో ఒకరే ఈ అష్టావక్రుడు. తల్లి కడుపులో ఉండగానే ఎన్నో శాస్త్రాలను అలవోకగా నేర్చేసుకున్న మహా జ్ఞాని. జనక మహారాజుకు, యాజ్ఞవల్కుడికి ఈయన గురువు. అష్టావక్రుడు కడుపులో ఉండగానే అష్ట వంకరలతో పుడతావనే శాపాన్ని పొందాడు. ఆ శాపాన్ని ఇచ్చింది కూడా ఎవరో కాదు అతని తండ్రి ఏకపాదుడే. అలాంటి మహర్షికి ఆటను పోయాకా స్వయానా శ్రీకృష్ణుడే అంత్యక్రియలు చేసాడంటే అతని జన్మ ఎంత గొప్పదో మనకి తెలుస్తోంది కదా.

వివరాల్లోకి వెళితే ఒకప్పుడు ఏకపాదుడనే గొప్ప తపస్వి ఒకరు ఉండేవారు. ఆయన భార్య పేరు సుజాత. ఆతను వేదవేదాంగాలు తెలిసినవాడు కావటంవల్ల ఎంతోమంది శిష్యులు అతని దగ్గర వేదాలు నేర్చుకుంటూ ఉండేవారు. కొన్నాళ్ళకు గర్భవతి అయింది సుజాత. కడుపులో ఉన్న బాబు అన్ని వేదాలు తెలిసిన వాడు. అతను ఎప్పుడు చూసినా తండ్రి తన శిష్యులకు చెప్పే శాస్త్రాలను కూడా వింటూ ఉండేవాడు. ఒకరోజు తండ్రి చెప్పే అభ్యాసంలో తప్పు దొర్లటంతో ఆగలేక, నాన్నగారు మీరు తప్పు చెప్తున్నారు, ఇలా చెప్పాలి అని ఎలా చెప్పాలో కూడా వివరిస్తాడు. అంతేకాదు విరామం లేకుండా అంతంత సేపు శిష్యులకి వేదాలు చెప్పకూడదు అని కూడా వివరిస్తాడు. దానితో ఆగ్రహించిన తండ్రి ఇప్పుడే ఇలా ఉంటే పుట్టాకా ఇంకా ఎన్ని తప్పులు ఎంచుతావో అని కోపగించి నువ్వు అష్ట వంకరలతో పుట్టుగాక అని శపిస్తాడు.

ఇంట్లో కావాల్సిన పదార్థాలు లేకపోవటంతో ఒకరోజు సుజాత ఏకపాదుడిని పిలిచి జనక రాజు దగ్గరకి వెళ్లి కావలసినవి అడిగి తెమ్మని చెపుతుంది. ఏకపాదుడు జనకుడి దగ్గరకి వెళ్ళే సమయానికి అక్కడ వరుణుని కొడుకైన వంది ఉంటాడు. వంది నాతో వాదించి గెలిస్తే నీకు ఏది కావాలన్నా ఇస్తాను. ఓడిపోతే మాత్రం జలదిగ్బంధం చేస్తాను అని అంటాడు. ఏకపాదుడు వందితో వాదించి ఓడిపోయి బందీ అయిపోతాడు.

కొన్నాళ్ళకు సుజాత అష్టావక్రుడికి జన్మనిస్తుంది. ఆరుణి అనే గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేసేవాడు ఇతను. కాస్త పెద్దయ్యాకా తన తండ్రి గురించి తెలుసుకున్నఅష్టావక్రుడు జనకుని కొలువుకి వెళ్లి వందిని ఓడించి తన తండ్రిని విడిపించుకుని వస్తాడు. ఆ ఆనందంలో తండ్రి అతనిని అందంగా మారేలా వరమిస్తాడు. అలా అందంగా మారిన అష్టావక్రుడు సదాన్య మహర్షి కూతురు సుప్రభను వివాహం చేసుకుంటాడు.

అష్టావక్రునికి పిల్లలు పుట్టాకా తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్ళిపోతాడు. అతని దగ్గరకి రంభ మొదలైన అప్సరసలు వచ్చి నాట్యం చేస్తారు. వారి నాట్యం చూసిన అష్టావక్రుడు ఏమి వరం కావాలో కోరుకోమంటాడు. అందుకు వాళ్ళు విష్ణుమూర్తిని పొందాలన్న తమ కోరిక తీరేలా చూడమని అడుగుతారు. అందుకు అష్టావక్రుడు ద్వాపర యుగంలో విష్ణుమూర్తి కృష్ణావతారం ఎత్తినపుడు మీ కోరిక తీరుతుంది అని వరమిస్తాడు. ఆ అప్సరసలే ద్వాపరయుగంలో పుట్టిన గోపికలు.

అంతేకాదు గంగను భూలోకానికి తేవాలనుకున్న భగీరథుడు చాలా బలహీనంగా ఉండేవాడు. అతనిని బలంగా ఉండేలా చేసి గంగను భూలోకానికి తేవటంలో సహాయం చేసింది కూడా ఈ అష్టావక్ర మహర్షే. ఇలా ఎంతో మందికి కావాల్సిన సహాయాన్ని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. అతనిచే చెప్పబడిన అష్టావక్ర సంహిత రోజూ పారాయణ చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.

అష్టావక్ర మహర్షి చాలా సంవత్సరాలు తపస్సు చేసి ఒకరోజు బృందావనంలో ఉన్న శ్రీకృష్ణుడిని చేరుకొని అతనిని స్తోత్రం చేసి ఆయన పాదాల దగ్గరే ప్రాణాలు విడిచారు. అతనికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే అంత్యక్రియలు చేసాడు. ఇలా జన్మను విడిచిన అష్టావక్రుడు గోలోకానికి వెళ్లి మోక్షాన్ని పొందుతాడు.

Friday, August 9, 2019

శయన నియమాలు

పడుకోవాలంటే పాటించే 15 సూత్రాలు:-

🔹1. నిర్మానుష్యంగా, నిర్జన  గృహంలో, ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు.( మనుస్మృతి)
🔹2. పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగానిద్ర లేపకూడదు ( విష్ణుస్మృతి)
🔹 3. విద్యార్థి, నౌకరు, మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలప వచ్చును.( *చాణక్య నీతి)
🔹4. ఆరోగ్యవంతులు ఆయు రక్ష కోసం బ్రహ్మా ముహూర్తంలో నిద్ర లేవాలి (దేవీ భాగవతము). పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు (పద్మ పురాణము)
🔹5. తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాలతో నిద్రించడం వలన లక్ష్మి (ధనం) ప్రాప్తిస్తుంది. (అత్రి స్మృతి) విరిగిన పడకపై, ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం. (మహాభారతం)
🔹6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు. (గౌతమ ధర్మ సూత్రం)
🔹7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య, పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని, మృత్యువు, ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము,ఆయువు ప్రాప్తిస్తుంది. (ఆచార మయూఖ్)
🔹8. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో  1 ముహూర్తం (48నిమిషాలు)
నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగ హేతువు మరియు ఆయు క్షీణత కలుగ చేస్తుంది)
🔹9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.( *బ్రహ్మా వైవర్తపురాణం)
🔹10. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు 3 గంటల) తరువాతనే పడుకోవాలి
🔹11. ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది.
🔹12. దక్షిణ దిశలో *పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు.యముడు మరియు దుష్ట గ్రహము ల  నివాసము వుంటారు. దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు, మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.
🔹13. గుండెపై చేయి వేసుకుని, చెత్తు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.
🔹14. పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.
15. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసక బారుతుంది.
 🔸ఈ 15 నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి, మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు 🔸

Sunday, August 4, 2019

నక్షత్ర గాయత్రి


1.అశ్విని
🌺ఓం శ్వేతవర్ణై విద్మహే సుధాకరాయై ధిమహి తన్నో అశ్వినేన ప్రచోదయాత్🌺

2.భరణి
🌺ఓం కృష్ణవర్ణై విద్మహే దండధరాయై ధిమహి తన్నో భరణి:ప్రచోదయాత్🌺

3.కృత్తికా
🌺ఓం వణ్ణిదేహాయై విద్మహే మహాతపాయై ధీమహి తన్నో కృత్తికా ప్రచోదయాత్🌺

4.రోహిణి
🌺ప్రజావిరుధ్ధై చ విద్మహే విశ్వరూపాయై ధీమహి తన్నో రోహిణి ప్రచోదయాత్🌺

5.మృగశిరా
🌺ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధిమహి తన్నో మృగశిర:ప్రచోదయాత్🌺

6.ఆర్ద్రా
🌺ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే పశుం తనాయ ధిమహి తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్🌺

7.పునర్వసు
🌺ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే అదితి పుత్రాయ ధిమహి తన్నో పునర్వసు ప్రచోదయాత్🌺

8.పుష్య
🌺ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే మహాదిశాయాయ ధిమహి తన్నో పుష్య:ప్రచోదయాత్🌺

9.ఆశ్లేష
🌺ఓం సర్పరాజాయ విద్మహే మహారోచకాయ ధిమహి తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్🌺

10.మఖ
🌺ఓం మహా అనగాయ విద్మహే పిత్రియాదేవాయ ధిమహి తన్నో మఖ: ప్రచోదయాత్🌺

11.పుబ్బ
🌺ఓం అరియంనాయ విద్మహే పశుదేహాయ ధిమహి తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్🌺

12.ఉత్తరా
🌺మహాబకాయై విద్మహే మహాశ్రేష్ఠాయై ధీమహి తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్🌺

13.హస్త
🌺ఓం ప్రయచ్చతాయై విద్మహే ప్రకృప్రణీతాయై ధీమహి తన్నో హస్తా ప్రచోదయాత్🌺

14.చిత్తా
🌺ఓం మహాదృష్టాయై విద్మహే ప్రజారపాయై ధీమహి తన్నో చైత్రా:ప్రచోదయాత్🌺

15.స్వాతి
🌺ఓం కామసారాయై విద్మహే మహాని ష్ఠాయై ధీమహితన్నో స్వాతి ప్రచోదయాత్🌺

16.విశాఖ
🌺ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే మహాశ్రేష్ఠాయై చ ధీమహీ తన్నో విశాఖ ప్రచోదయాత్🌺

17 అనూరాధ
🌺ఓం మిత్రదేయాయై విద్మహే మహామిత్రాయ ధీమహి తన్నో అనూరాధా ప్రచోదయాత్🌺

18.జ్యేష్ఠా
🌺ఓం జ్యేష్ఠాయై విద్మహే మహాజ్యేష్ఠాయై ధీమహి తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్🌺

19.మూల
🌺ఓం ప్రజాధిపాయై విద్మహే మహాప్రజాధిపాయై ధీమహి తన్నో మూలా ప్రచోదయాత్🌺

20.పూర్వాషాఢ
🌺ఓం సముద్ర కామాయై వి    ఓం ప్రజాధిపాయై విద్మహే మహాప్రజాధిపాయై ధీమహి తన్నో మూలా ప్రచోదయాత్🌺

20.పూర్వాషాఢ
🌺ఓం సముద్ర కామాయై విద్మహే మహాబీజితాయై ధిమహితన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్🌺

21.ఉత్తరాషాఢ
🌺ఓం విశ్వేదేవాయ విద్మహే మహాషాఢాయ ధిమహి తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్🌺

22. శ్రవణ
🌺ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే పుణ్యశ్లోకాయ ధీమహి తన్నో శ్రవణ ప్రచోదయాత్🌺

23.ధనిష్ఠా
🌺ఓం అగ్రనాథాయ విద్మహే వసూప్రితాయ ధీమహి తన్నో శర్విష్ఠా ప్రచోదయాత్🌺

24.శతభిషం
🌺ఓం భేషజాయ విద్మహే వరుణదేహాయ ధీమహి తన్నో శతభిషా ప్రచోదయాత్🌺

25.పూర్వాభాద్ర
🌺ఓం తేజస్కరాయ విద్మహే అజరక పాదాయ ధీమహి తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్🌺

26.ఉత్తరాభాద్ర
🌺ఓం అహిరబుధ్నాయ విద్మహే ప్రతిష్ఠాపనాయ ధీమహి తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్🌺

27.రేవతి
🌺ఓం విశ్వరూపాయ విద్మహే పూష్ణ దేహాయ ధీమహి తన్నో రేవతి ప్రచోదయాత్🌺

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...