శని త్రయోదశి అంటే చాలామందికి తెలియదు. ఆ రోజు అభిషేకం చేస్తే ఎంతోమంచిదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి.. ఎలా చేయాలి.. తెలుసుకుందామా...?
త్రయోదశి వ్రతం
త్రయోదశి వ్రతం శనివారంతో కుడిన ఒక శుక్ల / కృష్ణ త్రయోదశితో ప్రారంభించి, ఏడాది పొడుగునా శనివారాలు మాత్రమే పడే త్రయోదశిగానీ లేదా 24 శుక్ల / కృష్ణ పక్ష త్రయోదశులు గానీ ఎన్నుకొని నియమబద్ధంగా చేయవచ్చు.
ప్రదోషకాలంలో శివపూజ, భక్త భోజనం చేయాలి. సూర్యాస్తమయం తర్వాత ఆరు ఘడియలకాలం వరకు త్రయోదశి ఉండాలి. శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం.
నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకంలేని కరుణామూర్తి శనీశ్వరుడు . ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడట.
శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనీశ్వరుడు.
1. ఉదయానే తలస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించేవారు ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8గంటల తరువాత భోజనం చేయాలి.
2. ఆ రోజు మద్యమాంసాలు ముట్టరాదు.
3. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.
4. శనిగ్రహదోషాల వల్ల బాధపడేవారు
నీలాంజన సమభాసం, రవిపుత్రం యమాగ్రజం,
ఛాయా మార్తాండ సంభూతం,తం నమామి శనైశ్చరం
అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠిస్తే మంచిది.
5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ: శివాయ" అనే శివపంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.
6. ఆరోజు ఆకలి గొన్న జీవులకు భోజనం పెడితే మంచిది.
7. ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనె రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శివుని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు.అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు.శని భగవానుడు అంటే నీతి,న్యాయం,ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు.గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.
ఏయే రాశులవారికి ఈ సంవత్సరం శని అనుకూలంగా లేడు ?
వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకరం రాశులవారికి ఈ ఏడాది శనివలన అనుకూలంగా లేదు. కనుక ఈ రాశుల వారు అందరూ శని త్రయోదశికి పూజ చేసుకొని శని బాధలు దూరం చేసుకోవడం మంచిది.

No comments:
Post a Comment