Wednesday, February 14, 2018

ఆచమనం - ఉపయోగము

అన్ని కార్యక్రమములు ఆచమనం తోనే మొదలవుతాయి.
"ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా" అనే మూడు నామాలకు ఒకొక్క పర్యాయం ఆచమనం చేస్తాము. అలా కేవలం ఆ మూడు నామాలనే చెపుతూ ఎందుకు నీటీని తీసుకోవాలి? మిగిలిన నామాలు కూడా భగవంతునివే కదా( ఓం రామాయ స్వాహా అంటూ అచమనము చేయము కదా?)?

ఆచమనం అన్ని దేవ, పితృ, బ్రహ్మ ఇత్యాది కార్యములందు తప్పక చేయాలి. అలా చేస్తూ మొదట "ఓం కేశవాయ స్వాహా" అంటూ ఆచమనం (నీటిని త్రాగుట) వలన స్వరపెఠిక నీటితో శుద్ధి చేయబడి శబ్ధం స్పస్టముగ వస్తుంది( కావాలంటే "క" అని పలుకుతూ మెడ దగ్గర కొంచం ఎత్తుగా ఉండే చోట వేలితో తాకితే తెలుస్తుంది)

రెండవ నామం " ఓం నారాయణాయ స్వాహా" అంటూ నీటిని తీసుకోవటం వలన, ('న' పలుకుట వలన) నాలుక అంగీలికి తగిలి శక్తి కలుగుటెగాక, నోరు- దవడలు సున్నితంగా కదలటానికి వీలవుతుంది( అంటే lubrication చేసినట్టు).

మూడవ నామం " ఓం మాధవాయా స్వాహా" అంటూ తీసుకోవటం వలన పేదలు తడి తగిలి పదాలు పలకటానికి వీలుగా మారుతాయి ( "మ" అని పెదవులు కలపకుండా పలకలేము)

ఇలా ముమ్మారు నామాలు పలికీనపుడు పెదవులు, అంగలీ, స్వర పెఠిక నీటితో శుధ్దిచేయబడి ఆనుస్తానానికి, ఇతర దిన చేర్యకీ వీలుగా మార్చేందుకే అలా ఆ నామాలతోనే, ఒక సారి త్రాగిన నీరు నాభి స్టానం చేరిన తదుపరి ఆచమనం చేయాలి. .

అలాగే మిగిలిన నామాలకి ఇటువంటి ప్రయోజనాలు ఉన్నాయి.

No comments:

Post a Comment

నవగ్రహ స్తోత్రములు (తాత్పర్య సహితము)

🙏 నవగ్రహస్తోత్రం 🙏 ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః!! ꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂ 🕉️ 01. రవి (ఆదిత్య): 🙏 ...