Thursday, February 22, 2018

Why only Coconut and Banana ?? Why Temple visits ??

Why only Coconut and Banana 🍌are offered in the temples ?

Everybody should read!

Coconut and Banana are the only two fruits which are considered to be the "Sacred fruits". All other fruits are tainted fruits ( partially eaten fruits), meaning other fruits have seeds and which have the capacity to reproduce !

But in the case of coconut, if you eat coconut and throw its outer shell, nothing will grow out of it. If you want to grow a coconut tree, you have to sow the entire coconut itself.

Similarly Banana. If you eat a banana and throw its out sleeves, nothing will grow out of it. Banana tree is grown on its own when a banana plant start giving fruits.

The outer shell of coconut is the Ahamkara or ego, which one has to break. Once the ego is shed the mind will be as pure as the white tender coconut inside. The Bhavaavesha or Bhakthi will pour like the sweet water in it. The 3 eyes on the top they explain as Satwa, Raja and Tama or Past , Present and Future or Sthoola, Sukshma and Karana Sareera or body etc

Our ancestors had found this reality long ago and they had made it as a system which is till followed religiously.!

WHY ONE SHOULD VISIT TEMPLES REGULARLY...?

Here is the scientific Reason. Must read and share...

There are hundreds of temples all over India in different size, shape and locations but not all of them are considered to be in the Vedic way.

Generally, the temples are located in a place where earth's magnetic waves pass through.

In simple terms, these temples are located strategically at a place where the positive energy is abundantly available from the magnetic wave distribution of north/ south pole thrust.

Because of its location, where high magnetic values are available, the Main Idol is placed in the center, and also because they place a copper plate written with some Vedic scripts, which is buried, beneath the Main Idol's placement known as "Garbhagriha" or Moolasthan, the copper absorbs the earth’s magnetic waves and radiates to the surroundings.

Thus a person who regularly visits a temple and makes clockwise pradakshina of the Main Idol's placement, automatically receives the beamed magnetic waves which get absorbed by his body.

This is very slow and a regular visit will make him absorb more energy, known as positive energy.

In addition, the Sanctum Sanctorum is completely enclosed on three sides.

The effect of all energies is very high in here.

The lamp that is lit radiates the heat and light energy.

The ringing of the bells and the chanting of prayers gives sound energy.

The fragrance from the flowers, the burning of camphor give out chemical energy.

The effect of all these energies is activated by the positive energy that comes out of the idol.

This is in addition to the north/south pole magnetic energy that is absorbed by the copper plate and utensils that are kept in the Moolasthan.

The water used for the Pooja is mixed with Cardamom, Benzoin, Holy Basil (Tulsi), Clove, etc is the "Theertham".
This water becomes more energized because it receives the positive-ness of all these energies combined.

When people go to the temple for Deepaaraadhana, and when the doors open up, the positive energy gushes out onto the persons who are there.

The water that is sprinkled onto the people passes on the energy to all.

That is the reason why, men are not allowed to wear shirts to the temple and ladies have to wear more ornaments because it is through these jewels (metal) that positive energy is absorbed in ladies.

It is proved that Theertham is a very good blood purifier, as it is highly energized.

In addition, temples offer holy water (about three spoons).

This water is mainly a source of magneto therapy as they place the copper water vessel at the Garbhagriha.

It also contains cardamom, clove, saffron, etc to add taste and Tulsi (holy Basil) leaves are put into the water to increase its medicinal value..!

The clove essence protects one from tooth decay, the saffron & Tulsi leave essence protects one from common cold and cough, cardamom and benzoine known as Pachha Karpuram, acts as a mouth refreshing agents.

This way, one's health too is protected, by regularly visiting Temples.. !

Tuesday, February 20, 2018

నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశించి , మరణ అనంతరం పుణ్య లోకాలు పొందుతాము ...


💠 గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !!
💠 శివాష్టకం - శివ అనుగ్రహం !!
💠 ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !!
💠శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !!
💠 అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !!
💠 కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !!
💠 దుర్గష్టోత్తర శతనామం - భయహరం !!
💠 విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!
💠 సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !!
💠 హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !!
💠 విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!
💠 శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!
💠 భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !!
💠 శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !!
💠 లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !!
💠 కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !!
💠 ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !!
💠 శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !!
💠 లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !!
💠 శ్యామాల దండకం - వాక్శుద్ధి !!
💠 త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి !!
💠 శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి !!
💠 శని స్తోత్రం - శని పీడ నివారణ !!
💠 మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం !!
💠 అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి !!
💠 కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం !!
💠 కనకధార స్తోత్రం - కనకధారయే !!
💠 శ్రీ సూక్తం - ధన లాభం !!
💠 సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది !!
💠 సుదర్శన మంత్రం - శత్రు నాశనం !!
💠 విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం !!
💠 రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!
💠 దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!
💠 భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు !!
💠 వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!
💠 దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!
💠 లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి !!

⭐⭐⭐ పంచరత్నం - 5 శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ అష్టకం - 8 శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ నవకం - 9 శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ స్తోత్రం - బహు శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ శత నామ స్తోత్రం - 100 నామాలతో స్తోత్రం !!
⭐⭐⭐ సహస్రనామ స్తోత్రం - 1000 నామాలతో స్తోత్రం !!

       పంచపునీతాలు
⭐ వాక్ శుద్ధి
⭐ దేహ శుద్ధి
⭐ భాండ శుద్ధి
⭐ కర్మ శుద్ధి
⭐ మనశ్శుద్ధి

💠 వాక్ శుద్ధి  :
                      వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు .... కాబట్టి  వాక్కును దుర్వినియోగం చేయకూడదు .... పగ , కసి , ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు .... మంచిగా , నెమ్మదిగా , ఆదరణతో పలకరించాలి .... అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి ....

💠 దేహ శుద్ధి :
                    మన శరీరం దేవుని ఆలయం వంటిది .... దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , రెండు పూటలా స్నానం చెయ్యాలి .... చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు ....

💠 భాండ శుద్ధి :
                        శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం .... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి .... స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది ....

💠 కర్మ శుద్ధి :
                     అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు .... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు .... తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు ....

💠 మనశ్శుద్ధి :
                     మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి .... మనస్సు చంచలమైనది .... ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది .... దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి .... దీని వల్ల దుఃఖం చేకూరుతుంది .... కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి ...

⏩ ఆహారంలో భక్తి  ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది !!
⏩ ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది !!
⏩ నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది !!
⏩ యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది !!
⏩ సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది !!
⏩ గృహంలో భక్తి  ప్రవేశిస్తే దేవాలయమౌతుంది !!
⏩ సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది !!
⏩ పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది !!
⏩ భక్తి ప్రవేశిస్తే మనిషి మనీషి  అవుతాడు !!

🌹🙏🌹

Wednesday, February 14, 2018

ఆచమనం - ఉపయోగము

అన్ని కార్యక్రమములు ఆచమనం తోనే మొదలవుతాయి.
"ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా" అనే మూడు నామాలకు ఒకొక్క పర్యాయం ఆచమనం చేస్తాము. అలా కేవలం ఆ మూడు నామాలనే చెపుతూ ఎందుకు నీటీని తీసుకోవాలి? మిగిలిన నామాలు కూడా భగవంతునివే కదా( ఓం రామాయ స్వాహా అంటూ అచమనము చేయము కదా?)?

ఆచమనం అన్ని దేవ, పితృ, బ్రహ్మ ఇత్యాది కార్యములందు తప్పక చేయాలి. అలా చేస్తూ మొదట "ఓం కేశవాయ స్వాహా" అంటూ ఆచమనం (నీటిని త్రాగుట) వలన స్వరపెఠిక నీటితో శుద్ధి చేయబడి శబ్ధం స్పస్టముగ వస్తుంది( కావాలంటే "క" అని పలుకుతూ మెడ దగ్గర కొంచం ఎత్తుగా ఉండే చోట వేలితో తాకితే తెలుస్తుంది)

రెండవ నామం " ఓం నారాయణాయ స్వాహా" అంటూ నీటిని తీసుకోవటం వలన, ('న' పలుకుట వలన) నాలుక అంగీలికి తగిలి శక్తి కలుగుటెగాక, నోరు- దవడలు సున్నితంగా కదలటానికి వీలవుతుంది( అంటే lubrication చేసినట్టు).

మూడవ నామం " ఓం మాధవాయా స్వాహా" అంటూ తీసుకోవటం వలన పేదలు తడి తగిలి పదాలు పలకటానికి వీలుగా మారుతాయి ( "మ" అని పెదవులు కలపకుండా పలకలేము)

ఇలా ముమ్మారు నామాలు పలికీనపుడు పెదవులు, అంగలీ, స్వర పెఠిక నీటితో శుధ్దిచేయబడి ఆనుస్తానానికి, ఇతర దిన చేర్యకీ వీలుగా మార్చేందుకే అలా ఆ నామాలతోనే, ఒక సారి త్రాగిన నీరు నాభి స్టానం చేరిన తదుపరి ఆచమనం చేయాలి. .

అలాగే మిగిలిన నామాలకి ఇటువంటి ప్రయోజనాలు ఉన్నాయి.

Tuesday, February 13, 2018

శివరాత్రి కి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి? ఎలాఉండలి?


సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన #మహర్షులు.

శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.

1.ఉపవాసం

శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. #శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.

ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది.  మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.

2. #జీవారాధాన
అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి.

శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.

3. #మౌనవ్రతం
శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.

ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.   

4.అభిషేకం
శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.

5.#జాగరణ
శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.

6.మంత్ర జపం
శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. #శివోహం అనే భావనను కలిగిస్తుంది.

శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.

Sunday, February 11, 2018

కదళీఫలం ..

దుర్వాస మహర్షి తన భార్య అయిన ' కదళి ' తో ఒక పర్ణశాలలో నివశిస్తూ , జపతపాదులు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు కోపం ఎక్కువ .అందువల్ల 'కదళి  ' నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఆయనకోపానికి గురికాకుండా ఉంటుండేది.

ఒక సాయంసంధ్యా కాలంలో దుర్వాసమహర్షి ఎంతో అలసటగా ఉండటాన  పర్ణశాల బయటి అరుగుపై నడుంవాల్చాడు. వెంటనే గాఢనిద్రలోకి జారు కున్నాడు. ఆయన అర్ధాంగి అయిన ' కదళి ' ఎంతో సేపు ఆయన నిద్రలేస్తాడని వేచి ఉండి, సాయం సంధ్య చేయవలసిన సమయం దాటిపోతుందన్న భయంతో , ఆయన్ను లేపడంతన కర్తవ్యంగా భావించి , ఆదమరచి నిద్రిస్తున్న దుర్వాసుని తట్టి నిద్రలేపింది.

నిద్రాభంగం కలిగినందున పరమకోపిష్టి ఐన ఆయన పట్టలేని ఆగ్రహంతో , కళ్ళుతెరచి భార్యను చూశాడు. ఆయన నేత్రాలనుండీ వెలువడిన అగ్నిజ్యాలలకు ఆమె భస్మమైపోయింది. ముందువెనుకలు ఆలోచించక తాను కోపం తెచ్చుకోడం వలన జరిగిన అనర్ధానికి దుర్వాసుడెంతో పశ్చాత్తపపడ్డాడు. చేసేదేంలేక మౌనంగా ఉండిపోయాడు.

ఐతే కొన్నిదినాల తర్వాత దుర్వాసుని మామగారు, తన కుమార్తెను చూసేందుకై ఆశ్రమానికి వచ్చాడు. ఆయన తనకుమార్తె గురించీ అడగ్గా, దుర్వాసుడు మామగారు తనకు శాపమిస్తాడనే భయం తో మెల్లగా జరిగిన విషయమంతా చెప్పి, క్షమించమని కోరి, తన తపోశక్తితో ఆభస్మం నుండీ , ఒకచెట్టును సృష్టించాడుట. అదే కదళీ వృక్షం ,అంటే అరటిచెట్టు.

దుర్వాసుడు తన మామగారితో " మీ కుమార్తె -‘ కదళి -‘అందరికీ ఇష్టురాలై’ కదళీఫలం రూపంలో అన్ని శుభకార్యాలలో భగవంతుని నివేదన కే కాక, మానవులు చేసే అన్ని వ్రతాల్లోనూ , నోముల్లోనూ అన్ని శుభకార్యాల్లోనూ ప్రాముఖ స్థానంలో ఉండి గౌరవం పొందు తుందని వరమిచ్చాడుట!
           
ఆ కదళీ ఫలాన్ని [ అరటి పండును] మనం కడిగి దేవునిముందుంచి కొద్దిగా తొక్క తీసి ' కదళీఫలం సమర్పయామి  ' అంటూ నివేదన చేస్తాం.

🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻

Thursday, February 8, 2018

Why did Krishna not save the Pandavas when they played dice with Duryodhana & Shakuni?

Wonderful explanation by Krishna himself:
From his childhood, Uddhava had been with Krishna, charioting him and serving him in many ways.
He never asked for any wish or boon from Sri Krishna.
When Krishna was at the verge of completing His Avatar, he called Uddhava and said,
‘Dear Uddhava, in this avatar of mine, many people have asked and received boons from me; but you never asked me anything.
Why don’t you ask something now? I will give you.
Let me complete this avatar with the satisfaction of doing something good for you also’.
Even though Uddhava did not ask anything for himself, he had been observing Krishna from his childhood.
He had always wondered about the apparent disconnect between Krishna’s teachings and actions, and wanted to understand the reasons for the same.
He asked Krishna, ‘Lord, you taught us to live in one way, but you lived in a different way.
In the drama of Mahabharat, in the role you played, in your actions, I did not understand many things. I am curious to understand the reasons for your actions.
Would you fulfil my desire to know?’
Krishna said, ‘Uddhava, what I told Arjuna during the war of Kurukshetra was Bhagavad Gita.
Today, my responses to you would be known as ‘Uddhava Gita’.
That is why I gave this opportunity to you. Please ask without hesitation.’
Uddhava starts asking – ‘Krishna, first tell me who is a real friend?’
Krishna says, *‘The real friend is one who comes to the help of his friend in need even without being called’.*
Uddhava: ‘Krishna, you were a dear friend of the Pandavas.
They trusted you fully as Apadhbhandava (protector from all difficulties).
*Krishna, you not only know what is happening, but you know what is going to happen. You are a great gyani.*
Just now you gave the definition of a true, close friend.
Then why did you not act as per that definition.
Why did you not stop Dharmaraj (Yudhishtra)
from playing the gambling game?
Ok, you did not do it; why did you not turn the luck in favour of Dharmaraj, by which you would have ensured that dharma wins. You did not do that also.
*You could have at least saved Dharmaraj by stopping the game after he lost his wealth, country and himself.*
You could have released him from the punishment for gambling.
Or, you could have entered the hall when he started betting his brothers.
You did not do that either.
At least when Duryodhana tempted Dharmaraj by offering to return everything he lost if he bet Draupadi (who always brought good fortune to Pandavas), you could have intervened and with your divine power, you could have made the dice roll in a way that is favorable to Dharmaraj.
Instead, you intervened, only when Draupadi almost lost her modesty and now you claim that you gave clothes and saved Draupadi’s modesty;
how can you even claim this – after her being dragged into the hall by a man and disrobed in front of so many people, what modesty is left for a woman?
What have you saved?
*Only when you help a person at the time of crisis, can you be called ‘Apadhbandhava’.*
*If you did not help in the time of crisis, what is the use?*
Is it Dharma?’
As Uddhava posed these questions, tears started rolling from his eyes.
These are not the questions of Uddhava alone.
All of us who have read Mahabharata have these questions.
On behalf of us, Uddhava had already asked Krishna.
Bhagavan Krishna laughed.
‘Dear Uddhava, the law of this world is: *‘only the one who has Viveka (intelligence through discrimination), wins’.*
While Duryodhana had viveka, Dharmaraj lacked it.
That is why Dharmaraj lost’.
Uddhava was lost and confused. Krishna continues :
‘While Duryodhana had lots of money and wealth to gamble, he did not know how to play the game of dice.
That is why he used his Uncle Shakuni to play the game while he placed the bet.
That is viveka.
Dharmaraj also could have thought similarly and offered that I, his cousin, would play on his behalf.
*If Shakuni and I had played the game of dice, who do you think would have won?*
Can he roll the numbers I am calling or would I roll the numbers that he is asking for.
Forget this.
I can forgive the fact that he forgot to include me in the game.
But, without viveka, he did another blunder.
He prayed that I should not come to the hall as he did not want me to know that through ill-fate he was compelled to play this game.
He tied me with his prayers and did not allow me to get into the hall;
I was just outside the hall waiting for someone to call me through their prayers.
Even when Bheema, Arjuna, Nakula and Sahadeva were lost, they were only cursing Duryodhana and brooding over their fate; they forgot to call me.
Even Draupadi did not call me when Dusshasan held her hair and dragged her to fulfil his brother’s order.
She was also arguing in the hall, based on her own abilities.
She never called me.
Finally good sense prevailed; when Dusshasan started disrobing her, she gave up depending on her own strength, and started shouting *‘Hari, Hari, Abhayam Krishna, Abhayam’* and shouted for me.
Only then did I get an opportunity to save her modesty.
I reached as soon as I was called.
I saved her modesty.
What is my mistake in this situation?
‘Wonderful explanation, Kanna, I am impressed.
However, I am not deceived.
Can I ask you another question’, says Uddhava.
Krishna gives him the permission to proceed.
'Does it mean that you will come only when you are called!
Will you not come on your own to help people in crisis, to establish justice?’, asks Uddhava.
Krishna smiles. *‘Uddhava, in this life everyone’s life proceeds based on their own karma.*
*I don’t run it; I don’t interfere in it.*
*I am only a ‘witness’. I stand close to you and keep observing whatever is happening. This is God’s Dharma’.*
‘Wow, very good Krishna. In that case, you will stand close to us, observe all our evil acts; as we keep committing more and more sins, you will keep watching us. You want us to commit more blunders, accumulate sins and suffer’, says Uddhava.
Krishna says. ’Uddhava, please realise the deeper meaning of your statements.
*When you understand & realise that I am standing as witness next to you, how could you do anything wrong or bad. You definitely cannot do anything bad. You forget this and think that you can do things without my knowledge.*
That is when you get into trouble.
Dharmaraj’s ignorance was that he thought he can play the game of gambling without my knowledge.
*If Dharmaraj had realized that I am always present with everyone in the form of ‘Sakshi’ (witness), then wouldn’t the game have finished differently?’*
Uddhava was spellbound and was so very overwhelmed by Bhakti.
He said, *‘What a deep philosophy, Kesava.*
*What a great truth!*
*Even praying and performing pooja and calling Him for help are nothing but our feelings / beliefs.*
*When we start believing that nothing moves without Him, how can we not feel his presence as Witness?*
How can we forget this and act?
Throughout Bhagavad Gita, this is the philosophy Krishna imparted to Arjuna.
He was the charioteer as well as guide for Arjuna, but he did not fight Arjuna's War’:-
*Realize that the Ultimate Sakshi / the one who is the Witness is within & within you!*
And *Merge in that God Consciousness!*
*Discover Thy Higher Self- The Pure Loveful & Blissful Supreme.*

Friday, February 2, 2018

వాక్శుద్ధికీ వాక్సిద్ధికీ ఇవిగో నాల్గు పద్యాలు !

టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి
ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో
త్కటపటహాదినిస్వన  వియత్తలదిక్తటతాటితార్భటో
ద్భట పటుతాండవాటన, "ట"కారనుత బసవేశ పాహిమాం!

డమరుగజాత డండడమృడండ
మృడండ మృడండ మృండమృం
డమృణ మృడండడండ మృణడండడ
డండ మృడం డమృం డమృం
డమృణ మృడండడంకృతి
విడంబిత ఘూ(ghoo)ర్ణిత విస్ఫురజ్జగ
త్ర్పమథన తాండవాటన
"డ"కారనుత బసవేశ పాహిమాం!

ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢం
మృణఢంమృణ ఢంఢణోద్ధణం
ధణనటన త్వదీయడమరూత్థ
మదార్భట ఢంకృతి ప్రజృం
భణ త్రుటితాభ్రతార గణరాజ
దినేశముఖగ్రహప్రఘ(gha)ర్
క్షణగుణతాండవాటన
"ఢ"కారనుత బసవేశ పాహిమాం!

ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణ
ణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ
ణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖ
విక్రమ జృంభణ సంచలన్నభో
ణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణ
ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ స్వన
ణ్ణ ణ్మృణ తాండవాటన
"ణ"కారనుత బసవేశ పాహిమాం!

                                 -మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు
                                    "అక్షరాంకపద్యముల" నుండి సేకరణ.

ఈ నాలుగు పద్యాలు మొదటి ప్రయత్నంలోనే తప్పులు లేకుండా చదువగలిగితే మీరు ఉత్తములు.ఓ నాలుగు సార్లు ప్రయత్నించి తప్పులు లేకుండా చదువగలిగితే మధ్యములు. ఎన్ని సార్లు ప్రయత్నించినా తప్పులు లేకుండా చదువలేకపోతున్నారంటే మీరిక ఈజన్మలో తెలుగుభాషను స్పష్టంగా స్వచ్ఛంగా మాట్లాడలేరని హెచ్చరించేవారు మా గురుదేవులు.మీరు కూడా ఓసారి చదవండి.మీ పిల్లలతో వీటిని చదివించండి.మీరందరూ "ఉత్తమ"స్థానంలోనే నిలబడాలని మా కోరిక. (శ్రీశివయోగపీఠం)

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...