పిల్లలు లేని వారికి పున్నామనరక ప్రాప్తి అని అందరూ అంటుంటారు. వంశోద్ధారం చేసే కొడుకు లేకపోతే తమ గతేమిటి అని, పితృకార్యాలు ఆగిపోతాయని వ్యధ పడుతూ ఉంటారు. దీనికి సంబంధించి భాగవతాది గ్రంధాలు ఏమి చెబుతున్నాయి. శాస్త్ర నిర్ణయం ఏమిటి, వ్యాసుని మనోభావం ఏమిటి అన్న విషయం శ్రీ మధ్వాచార్యులు శ్రీమహాభారత తాత్పర్య నిర్ణయంలో విశదీకరిస్తారు.
పిల్లలు లేకపోతే నరకం అన్నది నిజం కాదు. వేదోక్త కర్మలు చేసేవారు, జ్ఞాన సంపాదన చేసేవారు ధార్మికంగా బతికి శాస్త్రోక్త పద్ధతిలో విధి నిషేధాలు పాటిస్తూ సాధన చేసేవారూ, పిల్లలున్నా, లేకున్నా వారి వారి సత్కర్మల వాళ్ళ ఉద్ధారం అవుతారు. పాపులు, దుష్కర్మలు చేసినవారు, వారికి పుణ్యం లేకపోతే వారి పిల్లల పుణ్యంతోనో, వారి పిల్లలు ఇచ్చిన ధర్మోదకాలతోనో, శ్రాద్ధ కర్మలతోనో, పిన్దప్రదానాలతోనో ఉద్ధారం అయ్యే అవకాశం వుంది. అంతే తప్ప పిల్లలు లేరని నరకం లేదు. మనకు భగవద్భక్తి లేక సాధన చేయకపోతే దానికి తోడు పితరుల సద్గతి కోసం పాటుపడే పిల్లలు లేకపోతే నరకమే. తన జ్ఞానం వల్లనే తను చేసిన విహిత కార్యాల వల్లనే సాధన వల్లనే సద్గతి- అదే శాస్త్రం.
శాస్త్రం 12 రకాల పుత్రుల గురించి చర్చిస్తుంది. పుత్రులు ఆరు రకాలు. 1. ఔరసుడు, 2. దత్తకుడు, 3. కృత్రిముడు, 4. గూఢోత్పన్నుడు, 5. అపవిధ్ధుడు, 6. క్షేత్రజుడు. వీరికి రాజ్యములో కాని ఆస్తిలో కాని భాగం ఉంటుంది. ఇంకొక రకమైన పుత్రులు ఆరుగురు ఉన్నారు. వారు 1. కానీనుడు, 2. సహోఢుడు, 3. క్రీతుడు, 4. పౌనర్భవుడు, 5. స్వయందత్తుడు, 6. జ్ఞాతుడు. వీరు కూడా పుత్ర సమానులే కాని, వీరికి రజ్యాధికారము కాని, ఆస్తిలో భాగము కాని లేదు. మనుమడు, కూతురు కొడుకు కూడా పుత్రుల లెక్కలోకి వస్తారు. అందుకే మన తర్పణ విధులలో ఇటు తండ్రి వైపు మూడు తరాల వారికి, అటు తల్లి వైపు మూడు తరాల వారికి పిండాలు పెడతాము, తర్పణాలు వదులుతాము. కాబట్టి ఒకరికి కొడుకు లేదు అని బాధ పడవలదు. యోగ్యులైన కూతురు కొడుకులు తర్పణాలు విడిచినా అవి ఆ తండ్రికి అందుతాయి.
కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్!
చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు అవివేకులు ఈ ప్రాపంచిక జీవనమును జీవనప్రవృత్తిననుసరించి ఆలోచింతురు. తమకు పరలోకమున ఉత్తమగతులు లభించుటకు పుత్రులు కావలయుననుకొందరు. తమకు పుత్రులు కలగనివారు అయ్యో మాకు పుత్రులు కలుగలేదు, మాకు ఎట్లు ఉత్తమగతులు కలుగును అని ఏద్చుచుందురు. కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుమంది పుత్రులు కలిగినను వారి మూలమున అతడు ఏ ఉత్తమలోకములు పొందగలిగెను? బ్రహ్మచారిగనే యుండి సంతతియే లేకున్న శుకునకు దుర్గతి ఏమయిన కలిగెనా? కనుక పుత్రులు లేనివానికి మోక్షపదము లభించక పోదు. పుత్రులు కలవారికి ఉత్తమగతులు కాని మోక్షము కాని సిధ్ధించక పోవచ్చును. పుత్రులు లేనివరికిని అవి రెండును సిద్దించను వచ్చును.
కావున కొడుకులు లేరు అని ఎవరూ బాధ పడవలదు. మన పుణ్యం మనం సంపాదించుకోవాలి. మన ఉద్ధారం కోసం మనమే పాటు పడాలి. మనకు ఆ వేంకటేశుని దయవలన ఉత్తమసాధన చేసే అవకాశం సద్వినియోగమై మనం ఉత్తమగతులు సాధించుగాక.
!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు !!

No comments:
Post a Comment