Wednesday, December 13, 2017

72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)
5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)
6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)
7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)
8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
(పెద్దలను సేవించుటవలన)
9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
(అధ్యయనము వలన)
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన
సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల
అసాధుభావము సంభవించును.)
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
( మౄత్యు భయమువలన)
12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ,
అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)
13. భూమికంటె భారమైనది ఏది? (జనని)
14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)
15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)
16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల
ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో
తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో
అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)
17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)
20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
( యజ్ణ్జం చేయుటవలన)
21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)
22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది? (రాయి)
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని
రక్షించక పోవడంవలన)
24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)
26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి
బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి
అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)
28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)
29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)
30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)
31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)
32. మనిషికి ఆత్మ ఎవరు? ( కూమారుడు)
33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)
34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)
35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)
36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)
39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)
40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)
41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి,
ఆకాశములందు)
43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ణ్జానం)
44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)
45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు,
ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం,
క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)
46. తపస్సు అంటే ఏమిటి? ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)
47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)
48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)
49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ
దు:ఖాలను సమంగా ఎంచువాడు)
50. జ్ణ్జానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)
51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)
52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)
53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)
54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం కలిగి ఉండటం)
55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)
56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా
చేసుకోవడం)
57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)
58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)
59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)
60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)
61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం)
62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన
భర్తలో)
64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు;
వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ,
దానం చెయ్యనివాడు)
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)
67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది
గొప్పవాడవుతాడు)
68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?
(సుఖపడతాడు)
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో
తిని తౄప్తి చెందేవాడు)
70. ఏది ఆశ్చర్యం?
(ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే
శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?
(ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని
సమంగా చూసేవాడు)
72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ,
శీతోష్ణాదులందు, కలిమి లేములందూ,
సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై
అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై
ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు)

ఆవు పాలకీ, గేదె పాలకీ తేడా ఏమిటో తెలుసా....?

ప్రాచీన భారతీయ సంప్రదాయం... గోవుకు అడుగడుగునా ప్రాధాన్యతనిచ్చింది..!
ఆయుర్వేద వైద్యశాస్ర్తంలో గో ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆవు పాలలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేద మందుల్లో పంచగవ్యాలను వాడుతారు.
ఆవుపాలు పసుపుపచ్చగా వుంటాయి.
గేదెపాలు తెల్లగా ఉంటాయి.
ఆవు మూపురంలో స్వర్ణనాడి ఉంటుంది. అందుకే ఈ ఆవుపాలలో స్వభావసిద్ధంగానే బంగారపు తత్వం ఇమిడి ఉంది. ఈ తత్వం మానవులకు అత్యంత మేలు కూర్చే అంశం.
ఆవు దూడ పుట్టిన మూడు రోజులకే గంతులేస్తుంది. అదే గేదె దూడ 30 రోజుల వరకు మత్తుగా పడి ఉంటుంది. ఈ కారణంగానే ఆవు పాలు తో శరీరంలో ఉషారు..స్పూర్ఫ్తి వస్తుందని చెప్పవచ్చు.
అదే గేదె పాలవల్ల అలసత్వం వస్తుంది. 500 పశువుల మధ్యలో విడిచిపెట్టిన ఆవు దూడ తన తల్లి వద్దకు అవలీలగా చేరుకుంటుంది. అదే గేదె దూడ 10-15 గేదెల మధ్యలోనైనా తన తల్లిని గుర్తించలేదు. దీన్ని బట్టి మనం ఆవుపాలు బుద్దిబలం పెంచుతాయని అర్థం చేసుకొనవచ్చు. ఆవులకు గాని, వాటి దూడలకు గాని మనం ఏదైనా పేరు పెట్టి పిలిస్తే వెంటనే అవి ప్రతిస్పందించి పిలుస్తున్నవారి వద్దకు వస్తాయి.
గేదెలకు, వాటి దూడలకు ఈ జ్ఞానం శున్యం. ఆవులు ఎక్కడ విడిచిన పెట్టిన సమయానికి మళ్లీ అవి తమ స్వస్థలానికి చేరుకొంటాయి. గేదెలకు స్థలము, సమయము, గుంపు అన్న గుర్తింపు ఉండదు.
భారతీయ గోవు తీవ్రమైన ఎండను కూడా సహిస్తుంది. అందుకే దీని పాలు రోగరహితము, ఆరోగ్యప్రదము, పౌష్టికమైనవిగా ఉంటాయి. కాని గేదెలు , విదేశీ జాతి జెర్సీ..ఇతర సంకరజాతి ఆవులు ఎండవేడిమిని సహించలేవు. ఆవు పాలు గుండె జబ్బు రోగులకు ప్రత్యేకించి ఉపయోగపడతాయి. గేదె పాలలోని క్రొవ్వు పదార్థం రక్తనాడుల్లో చేరి క్రమంగా హృద్రోగానికి కారణం అవుతాయి.
ఆవు పాలలోని పసుపచ్చని పదార్థం కళ్ళలోని జ్యోతిని వృద్ధి పరుస్తుంది. కళ్ళకలక వస్తే పాలలో తడిసిన గుడ్డుపట్టి కడితే నయం అవుతుంది. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఆవులను పెద్దసంఖ్యలో పెంచుతున్నారు. ఆయా దేశాల్లో గేదెలు ఎక్కువగా జంతు ప్రదర్శనశాలలోనే కనిపిస్తాయి.
చరక సంహిత ప్రకారం జీవన శక్తి అందించే ద్రవ్యాలలో ఆవు పాలు అన్నిటికంటే శ్రేష్ఠమైనవని తెలుస్తుంది. "ధన్వంతరి నిఘంటువు" ప్రకారం ఆవుపాలలో రసాయనము, పథ్యము, బలవర్ధకము, హృదయానికి హితం చేకూర్చేది. మేధస్సును పెంచేది. ఆయుర్యృద్ధి, పుంసత్వం కలిగించేవి. ఇంకా వాత-పిత్త-కఫాలను రూపుమాపే గుణాలు ఆవుపాలలో ఉన్నాయి.
తెల్ల ఆవుపాలు వాతాన్ని నల్ల కపిల ఆవు పాలు పిత్తాన్ని , ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరించివేస్తాయి.
కపిల గోవు ఈ దృష్టిలో ఎంతో ఉపయోగకరమైనది. ఆవుపాలు సర్వరోగ నివారిణి మాత్రమే కాదు. అవి వృద్ధాప్యాన్ని కూడా దూరంగా ఉంచుతాయి. గ్రామాల్లో ఆవు పాలు తాగే 80 ఏళ్ల వృద్ధులు చాలా మంది కళ్ళద్దాలు ఎరుగరు. ఎందుకంటే వారు చిన్నతనం నుంచి ఆవు పాలు మాత్రమే తాగుతూ వస్తున్నారు.
మన దేశీయ ఆవులకు సరియైన మేత, పాలను వృద్ధి చేసే విధానమను శ్రద్ధగా పాటించాల్సిన అవసరం ఉంది. గుజరాత్ లోని గీర్ జాతి ఆవులను ఈ విధంగా శ్రద్ధతో పోషించడంతో...అవి 25 నుంచి 50 లీటర్ల వరకు ప్రతి రోజు పాలు ఇవ్వడం జరుగుతోంది. ఇతర అన్ని పశువుల పాలకంటే ఆవుపాలు అత్యంత శ్రేష్ఠమైనవి. శరీరానికి పుష్టిని కలిగిస్తాయి. బుద్ధి బలము, రసరక్తాది ధాతువులన్నింటిని పోషిస్తాయి. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో అనేక వ్యాధులను నయం చేయవచ్చును.! ఇది ఆయుర్వేద వైద్యులే కాదు...ఆధునిక వైద్యుల మాట కూడా...! ఆవు యొక్క రంగును బట్టి..ఈతలను బట్టి , మేతలను బట్టి ఆవు పాలలో ప్రత్యేక గుణాలు కలిగి ఉంటాయని వైద్యశాస్ర్తం చెబుతోంది.

Sunday, December 10, 2017

బ్రహ్మ కపాలం !!

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
"శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు.
నాలుగు ముఖాలతో మంత్రోఛ్ఛారణ చేస్తున్నాడు కానీ,
ఆయన ఊర్ధ్వ ముఖం పార్వతీదేవీ సౌందర్యానికి మోహపరవశమై చేష్టలుడిగి చూస్తుండిపోయింది.
ఇది గమనించిన పరమశివుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు బుధ్ధి చెప్పాలని చేయిచాచి ఒక దెబ్బ వేశాడు.
మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా.!
దాని ప్రభావనికి బ్రహ్మ ఊర్ద్వముఖం తెగిపోయింది.
కానీ కిందపడలేదు, శివుడి అరచేతికి అతుక్కుపోయింది.
అది ఎంత విదిలించినా అది ఆయన చేతిని వదలలేదు.
క్రమక్రమంగా ఎండి,చివరికది
కపాలంగా మారిపోయింది.

బ్రహ్మ అపరాధం చేశాడు.దానికి ఆదిదేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది. అయితే , అది సరాసరి
బ్రహ్మ హత్యగా పరిణమించి, ఆ పాపం అంతటి మహాదేవుడుకీ అంటింది.
జగద్గురువు , మహాతపస్వి ఆయనకూ ఆ పాప ఫలం తప్పలేదు.
దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగింది చెప్పి, తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గమేమిటో సూచించమన్నాడు.

'దేవాదిదేవా ! పరమజ్ఞామివి.
నీకు తెలియని ధర్మం లేదు.
ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి .
శాసించగలవాడివి.
అయినా, మాపై క్రుపతో ఒక సలహా ఇవ్వమని కోరావు.
కనుక, మా జ్ఞాన పరిమితికి తోచింది చెబుతున్నాము…
ఈ కపాలాన్నే భిక్ష పాత్రగా భావించి ఇంటింటికీ తిరుగుతూ ప్రతిచోటా నీ పాపమేమిటో చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్ళూ కొంత కాలానికి ఆ పాపం తరిగిపోయు ఈ కపాలం రాలిపోవచ్చు అన్నారు దేవతలు.

పరమశివుడికి అది ఉచితమనిపించింది. భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుతూ
మళ్ళీ తన వివాహం జరిగిన చోటుకే చేరాడు. హిమాలయ పర్వతాల్లో తాను పూర్వం కేదారేశ్వరుడిగా అవతరించి ఉన్నాడు. అందుకే సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాల్లోని శిఖరాలను, నదులను ఆయనకు కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడి దగ్గరకు వచ్చి పరమశివా, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలున్నాయి కదా !
ఈ బదరీవనంతో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా ? అని అడిగాడు.

నారాయణుడంతటివాడు అడిగితే తానెలా ఇవ్వకుండా ఉండగలడు.?
పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు.
అప్పటినుంచి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు.
ఆ తరువాత శివుడు ఆయన దగ్గరకే భిక్షకు బయలుదేరాడు.
ఈ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు.
'పరమశివుడే నా దగ్గరకు భిక్షకు వస్తున్నాడు. వాస్తవంగా ఇది ఆయన ఇల్లు .
ఆయన తన ఇంటికే భిక్షకై వస్తున్నాడంటే - అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట . ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్దితంగా మార్చాలి. ఇది శివక్షేత్రం. ఇందులో నేను (విష్ణువును) ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు. ఈ కపాలం బ్రహ్మదేవుడి ఊర్ధ్వ ముఖానిది.
అంటే అది అధోలోకాలను, ఊర్ధ్వ లోకాలను అనుసంధానం చేసే ముఖం.
చిరకాల శివహస్త స్పర్శవల్ల దానిలోని దుర్భావనలన్నీ నశించిపోయాయి. ఇప్పుడది పరమ పవిత్రం.
దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి.
దానికితోడు నాశక్తి , శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి.'
అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు. అంతే ! ఆ కపాలం కాస్తా ఊడి కిందపడి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది.

అప్పటి నుంచి బదరీనారాయణ స్వామి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారియైన బ్రహ్మకపాలం మహాక్షేత్రమైంది.
తమ పిత్రుదేవతలను పునరావ్రుతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి రాజమార్గమై నిలచింది.!!!……

"ఓం నమఃశ్శివాయ"!!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Saturday, December 9, 2017

Gayatri Mantra


అపుత్రస్య గతిర్నాస్తి : మధ్వాచార్యుల తాత్పర్య నిర్ణయం ...

పిల్లలు లేని వారికి పున్నామనరక ప్రాప్తి అని అందరూ అంటుంటారు. వంశోద్ధారం చేసే కొడుకు లేకపోతే తమ గతేమిటి అని, పితృకార్యాలు ఆగిపోతాయని వ్యధ పడుతూ ఉంటారు. దీనికి సంబంధించి భాగవతాది గ్రంధాలు ఏమి చెబుతున్నాయి. శాస్త్ర నిర్ణయం ఏమిటి, వ్యాసుని మనోభావం ఏమిటి అన్న విషయం శ్రీ మధ్వాచార్యులు శ్రీమహాభారత తాత్పర్య నిర్ణయంలో విశదీకరిస్తారు.

పిల్లలు లేకపోతే నరకం అన్నది నిజం కాదు. వేదోక్త కర్మలు చేసేవారు, జ్ఞాన సంపాదన చేసేవారు ధార్మికంగా బతికి శాస్త్రోక్త పద్ధతిలో విధి నిషేధాలు పాటిస్తూ సాధన చేసేవారూ, పిల్లలున్నా, లేకున్నా వారి వారి సత్కర్మల వాళ్ళ ఉద్ధారం అవుతారు. పాపులు, దుష్కర్మలు చేసినవారు, వారికి పుణ్యం లేకపోతే వారి పిల్లల పుణ్యంతోనో, వారి పిల్లలు ఇచ్చిన ధర్మోదకాలతోనో, శ్రాద్ధ కర్మలతోనో, పిన్దప్రదానాలతోనో ఉద్ధారం అయ్యే అవకాశం వుంది. అంతే తప్ప పిల్లలు లేరని నరకం లేదు. మనకు భగవద్భక్తి లేక సాధన చేయకపోతే దానికి తోడు పితరుల సద్గతి కోసం పాటుపడే పిల్లలు లేకపోతే నరకమే. తన జ్ఞానం వల్లనే తను చేసిన విహిత కార్యాల వల్లనే సాధన వల్లనే సద్గతి- అదే శాస్త్రం.

శాస్త్రం 12 రకాల పుత్రుల గురించి చర్చిస్తుంది. పుత్రులు ఆరు రకాలు. 1. ఔరసుడు, 2. దత్తకుడు, 3. కృత్రిముడు, 4. గూఢోత్పన్నుడు, 5. అపవిధ్ధుడు, 6. క్షేత్రజుడు. వీరికి రాజ్యములో కాని ఆస్తిలో కాని భాగం ఉంటుంది. ఇంకొక రకమైన పుత్రులు ఆరుగురు ఉన్నారు. వారు 1. కానీనుడు, 2. సహోఢుడు, 3. క్రీతుడు, 4. పౌనర్భవుడు, 5. స్వయందత్తుడు, 6. జ్ఞాతుడు. వీరు కూడా పుత్ర సమానులే కాని, వీరికి రజ్యాధికారము కాని, ఆస్తిలో భాగము కాని లేదు. మనుమడు, కూతురు కొడుకు కూడా పుత్రుల లెక్కలోకి వస్తారు. అందుకే మన తర్పణ విధులలో ఇటు తండ్రి వైపు మూడు తరాల వారికి, అటు తల్లి వైపు మూడు తరాల వారికి పిండాలు పెడతాము, తర్పణాలు వదులుతాము. కాబట్టి ఒకరికి కొడుకు లేదు అని బాధ పడవలదు. యోగ్యులైన కూతురు కొడుకులు తర్పణాలు విడిచినా అవి ఆ తండ్రికి అందుతాయి.

కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్!
చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!

శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు అవివేకులు ఈ ప్రాపంచిక జీవనమును జీవనప్రవృత్తిననుసరించి ఆలోచింతురు. తమకు పరలోకమున ఉత్తమగతులు లభించుటకు పుత్రులు కావలయుననుకొందరు. తమకు పుత్రులు కలగనివారు అయ్యో మాకు పుత్రులు కలుగలేదు, మాకు ఎట్లు ఉత్తమగతులు కలుగును అని ఏద్చుచుందురు. కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుమంది పుత్రులు కలిగినను వారి మూలమున అతడు ఏ ఉత్తమలోకములు పొందగలిగెను? బ్రహ్మచారిగనే యుండి సంతతియే లేకున్న శుకునకు దుర్గతి ఏమయిన కలిగెనా? కనుక పుత్రులు లేనివానికి మోక్షపదము లభించక పోదు. పుత్రులు కలవారికి ఉత్తమగతులు కాని మోక్షము కాని సిధ్ధించక పోవచ్చును. పుత్రులు లేనివరికిని అవి రెండును సిద్దించను వచ్చును.

కావున కొడుకులు లేరు అని ఎవరూ బాధ పడవలదు. మన పుణ్యం మనం సంపాదించుకోవాలి. మన ఉద్ధారం కోసం మనమే పాటు పడాలి. మనకు ఆ వేంకటేశుని దయవలన ఉత్తమసాధన చేసే అవకాశం సద్వినియోగమై మనం  ఉత్తమగతులు సాధించుగాక.

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు !!

పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు ?

ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదాని శాస్త్రం చెప్తుంది.

కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితి లో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత  ఔదార్యానికి తలవంచాలిగా?

కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి, కన్యాదాత మీద పడి అరవాడనికి, విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది?దానం ఇస్తున్నవాడిని ఇంకా ఇంకా కట్నాలు, కానుకలు, లాంచనాలు అవీ ఇవీ అడగచ్చు అని ఎవరు చెఫ్ఫారు నీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా? కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమే. వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు.  అంతకన్నా ఇంకేం కావాలి?

"సీతారాములలా ఉండండి!" అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామకళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. జనక మహారాజు, దశరథ మహారాజుని అడుగుతారు "మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా?" అని. అప్పుడు దశరథ మహారాజు ఏమంటారో తెలుసా? "అయ్యా! ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది" అని. దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్ర ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు.

అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు!

అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది.

తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? "పెళ్ళి బాగా గొప్పగా జరిపించండీ!" అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు.

కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్ళి వాళ్ళ అరుపులు, కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు - ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు.👌 అందరికి పంపించండి🙏🏼🙏🏼

ఎలాంటి భోజనాన్ని చేయాలి? ఎలాంటి భొజనం చేయరాదు ? నియమాలు ఏమిటి ?

• కాకులు ముట్టుకున్నదీ, కుక్కా, ఆవూ వాసన చూసిన భోజనాన్ని తినకూడదు.
• పాలతో భోజనం చేశాక, పెరుగుతో భోజనం చేయకూడదు.
• కాళ్ళు చాపుకుని, జోళ్ళు వేసుకుని భోజనము చేయరాదు.
• భార్యతో కలిసి తిన కూడదు. భర్త భుజించిన తరువాత భార్య తినాలి. కలిసి తినాల్సివస్తే ముందుగా భర్త ఓ ముద్దను తిన్న తర్వాత భార్య భర్తతో కలిసితినవచ్చు.
• భోజనముచేయడానికి ఎడమచేయి ఉపయోగించరాదు. నిలవ వున్న అన్నాన్ని భుజింపకూడదు. చల్లారిన అన్నాన్ని వేడిచేసి తినకూడదు.
• 10-15 పదార్థాలతో భోజనం కన్నా కూర, పప్పు, పచ్చడి, మజ్జిగతో తీసుకునే ఆహారమే అమృతము. నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి ఎంతో శ్రేష్ఠము.
• నిలువ పచ్చళ్ళు వయసులో 2 రోజులకోసారి, మధ్య వయసులో వారానికి 2 సార్లూ, నలభై దాటిన తర్వాత 15 రోజులకొకసారి, యాభై దాటాక నెలకొకసారి తీసుకోవటం ఆరోగ్యకరం.
• గ్రహణం రోజున అనగా సుర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు.
• దూడను కన్న తర్వాత పశువు నుంచి పదిరోజుల వరకూ పాలు సేవించరాదు.
• తడి పాదాలతో భోజనమూ, పొడి పాదాలతో నిద్ర అనారోగ్యాన్ని కలుగ చేస్తాయి. రాత్రి పడుకొనే ముందు కాళ్ళు కడుక్కుని నిద్రకు ఉపక్రమిస్తే సుఖ నిద్ర పడుతుంది.
• అలాగే పడుకునేటప్పుడు తప్పనిసరిగా పక్కనే అందుబాటలో మంచినీరు ఉంచుకొనండి.
• అలాగే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం నిద్ర మధ్యలో శరీర ధర్మం నిర్వర్తించాల్సివస్తే అలా మగతగా నడుస్తూ వెళ్ళకండి.
• ఎక్కువ ప్రమాదాలు జరిగేది ఆ సమయంలోనే. ఓ క్షణం పూర్తిగా ఇహలోకంలోకి వచ్హి ఆపై శరీరధర్మం తీర్చండి.
• ఆచమనం చేసిన తర్వాత తీసుకొవాలి. అన్నమునకు నమస్కరించాలి. అహారపదార్ధాలను చూసి చిరాకు పడరాదు. వండిన వార్ని అభినందించాలి.
• అప్పుడే బలాన్నీ, సామర్ధ్యాన్ని ఇస్తుంది. లేనిచో వికటిస్తుంది.
• భోజనం మధ్యలో లేవటమూ, మాట్లాడటమూ తగదు. ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టరాదు. భార్యకు సహితము పెట్టరాదు. పదార్ధాలు బాగున్నాయని అతిగా తింటే ఆయుష్షు తగ్గుతుంది. భోజనానంతరము కూడా ఆచమనం చేయాలి.
• ఆచమన విధి తెలియనప్పుడు భగవంతుడ్ని స్మరించి ఆపై భుజించాలి. విస్తరిలో ఏమీ మిగల్చరాదు. అవసరమైనంతే వడ్డించుకోవాలి. లేదా వడ్డించమని చెప్పాలి. ఇష్టం లేని పదార్ధాలను ముందుగానే వద్దనాలి.
• రోజుకు రెండుసార్లు భొజనం చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం శెలవిస్తొంది. రెండుసార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకొకపోతే ఉపవాస ఫలం కూడా వస్తుంది.
• భొజనం చేసేటప్పుడు తూర్పు వైపుకి తిరిగి చేయాలి.
• తూర్పు వైపుకి తిరిగి చేయటం వల్ల ఆయుర్ధాయం, అలాగే దక్షిణానికి తిరిగి భొజనం చేస్తే కీర్తి, ఉత్తరం వైపు తిరిగి భొజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి.
• పడమర, దక్షిణం వైపున భొజనం చెయ్యకూడదని వామన పురాణంలోనూ, విష్ణుపురాణం లోనూ ఉంది. కాన తూర్పు వైపు తిరిగి భోజనం చేయటం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా వప్పుకుంటున్నాయి.
• ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చొని భొజనం చెయ్యరాదు.
• ధనాన్ని కోరుకొనే వాడు మఱ్రి, జిల్లేడూ, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భొజనం చేయాలి.
• మోదుగ, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి.
• భొజనానికి ముందూ, తర్వాత అచమనం చెయ్యాలి.
• తినే ముందు అన్నానికి నమస్కరించి తినాలి

Wednesday, December 6, 2017

చలికాలంలో బెల్లం కచ్చితంగా తినాల్సిందే ఎందుకంటే?


👉🏼 పాలు... బెల్లం... రెండూ మనకు ఆరోగ్యాన్ని కలిగించేవే.
వీటి వల్ల మనకు కలిగే
పలు అనారోగ్యాలు నయం అవడమే కాదు,
మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు కూడా అందుతాయి.

👉🏼అయితే ముఖ్యంగా బెల్లాన్ని మాత్రం చలికాలంలో కచ్చితంగా తినాలి.

అది కూడా పాలలో కలుపుకుని తాగాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో
 కొద్దిగా బెల్లం కలుపుకుని నిత్యం తాగితే దాంతో మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో
"ఇప్పుడు తెలుసుకుందాం".

👉🏼 వేడి వేడి పాలలో బెల్లం కలుపుకుని తాగితే అధిక బరువు తగ్గుతారు.

బెల్లం, పాలలో ఉండే
పలు రకాల ఔషధ గుణాలు శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గిస్తాయి.

 ద్వారా బరువు తగ్గుతారు.
నిత్యం తాగడం వల్ల వెయిట్ అదుపులో ఉంటుంది.

 👉🏼నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్య
రక్త హీనత, అనీమియా.

దీని వల్ల శరీరంలో రక్తం సరిగ్గా ఉండదు.

ఫలితంగా ఆరోగ్యం చెడిపోతుంది.
పోషకాలు అందవు.
అయితే బెల్లం కలిపిన పాలు తాగుతుంటే రక్త హీనత సమస్య ఇట్టే పోతుంది.
 రక్తం బాగా పడుతుంది.

ప్రధానంగా మహిళలకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.

👉🏼బెల్లం కలిపిన వేడి పాలను తాగడం వల్ల వాటిలో ఉండే పోషకాలు అంది జుట్టు కాంతివంతంగా మారుతుంది. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది, చుండ్రు పోతుంది.

👉🏼 రుతు సమయంలో మహిళలకు వచ్చే వివిధ రకాల సమస్యలు, ప్రధానంగా కడుపునొప్పి తగ్గుతుంది.

👉🏼 బెల్లం కలిపిన వేడి పాలలో సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్‌,
యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి.
అందువల్ల అవి అనారోగ్యాలను
కలిగించే వైరస్‌లు,
బాక్టీరియాల భరతం
 పడతాయి

దీంతో ఈ కాలంలో వచ్చే పలు ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

👉🏼వృద్ధాప్యంలో చాలా మందికి కీళ్ల నొప్పుల సమస్యలు వస్తుంటాయి.
అయితే అలాంటి వారు రోజూ వేడి పాలలో బెల్లం కలుపుకుని తాగితే దాంతో ఆయా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, కీళ్లు దృఢంగా మారుతాయి.

👉🏼బెల్లం కలిపిన వేడి పాలను తాగుతుంటే దాంతో జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం, అజీర్ణం వంటి ఇబ్బందులు తొలగిపోతాయి.

👉🏼 బెల్లం, పాలలో అద్భుతమైన పోషకాలు, మినరల్స్ ఉంటాయి.
 కాబట్టి కచ్చితంగా ప్రతి రోజూ వీటి కాంబినేషన్ తీసుకుంటే మంచిదని అధ్యయనాలు నిరూపించాయి.

👉🏼 ప్రతిరోజూ తీసుకుంటే కచ్చితంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చు🌞

👉🏼సర్వేజనాః శుఖినోభవంతు💐

Saturday, December 2, 2017

ఇవి కాపీ చేస్కుని భద్రపరుచుకోండి .. మీకు కావాల్సిన వాటిపైన క్లిక్ చేస్తే సమాచారం క్షణాల్లో ఓపెన్ అవుతుంది ..

దేవాలయాలలో వసతి సౌకర్యం కోసం  : https://goo.gl/gDaGJ4
ఎ పి లో   జిల్లాల వారి దేవాలయాల వివరాలు   : https://goo.gl/Qzhzis
రాష్ట్రాల వారీగా దేవాలయాల సమాచారం  : https://goo.gl/VnNaj5
జ్యోతిర్లింగాల క్షేత్రాల వివరాలు  : https://goo.gl/X9NBUe
శక్తిపీఠాలు సమాచారం  : https://goo.gl/LtvStS
గ్రూప్ టెంపుల్స్  : https://goo.gl/N9xD8M
ఆరుపడైవీడు క్షేత్రాల కోసం  : https://goo.gl/HqGR8P
పంచారామ క్షేత్రాల వివరాలు  : https://goo.gl/ygX5hW
పంచభూత క్షేత్రాల వివరాలు  : https://goo.gl/pqtgxj
తిరుమల గురించి  : https://goo.gl/mb2DGD
శ్రీకాళహస్తి గురించి : https://goo.gl/UJbxmF
కాశి గురించి  : https://goo.gl/DZzKa1
రామేశ్వరం గురించి  : https://goo.gl/yyH424
అరుణాచలం గురించి  : https://goo.gl/eFbKNE
మదురై గురించి : https://goo.gl/1Ntthd
శ్రీశైలం గురించి  : https://goo.gl/ZUfFHo
కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి  : https://goo.gl/A5UU7v
ప్రసిద్ధ శైవ క్షేత్రాలు  : https://goo.gl/mn2K3y
మహాభారతం పుస్తకాలూ  : https://goo.gl/v1XuqV
భాగవతం పుస్తకాలూ  : https://goo.gl/9fMcDp
టెంపుల్ క్విజ్ ఆడండి  : https://goo.gl/nrhsBK

BHAGWAD GITA in one sentence per chapter...

Chapter 1

Wrong thinking is the only problem in life

Chapter 2

Right knowledge is the ultimate solution to all our problems

Chapter 3

Selflessness is the only way to progress & prosperity

Chapter 4

Every act can be an act of prayer

Chapter 5

Renounce the ego of individuality & rejoice in the bliss of infinity

Chapter 6

Connect to the Higher consciousness daily

Chapter 7

Live what you learn

Chapter 8

Never give up on yourself

Chapter 9

 Value your blessings

Chapter 10

See divinity all around

Chapter 11

Have enough surrender to see the Truth as it is

Chapter 12

Absorb your mind in the Higher

Chapter 13

Detach from Maya & attach to Divine

Chapter 14

Live a lifestyle that matches your vision

Chapter 15

Give priority to Divinity

Chapter 16

Being good is a reward in itself

Chapter 17

Choosing the right over the pleasant is a sign of power

Chapter 18

Let Go, Lets move to union with God.

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...