Thursday, August 24, 2017

బ్రాహ్మణుడుగా బతకడం మనచేతిలోనే ఉన్నది ...

84 లక్షల జీవరాసులలో, నరజన్మ, అందునా బ్రాహ్మణజన్మ రావడంఅనేది ఎన్నో జన్మలపుణ్యఫలం.

బ్రాహ్మణుడుగా పుట్టడం అనేది, మనచేతిలోలేదు, కానీ బ్రాహ్మణుడుగా బతకడం అనేది కేవలము మనచేతిలోనే ఉన్నది.

ఒక బ్రహ్మణునిగా ఆచరించవలసిన కనీస ధర్మమైన సంధ్యనాచరించక పోవడం ఖచ్చితంగా భగవంతుని పట్ల మనముచేసే అపరాధమే

నిత్య సంధ్యనాచరించనివాడు బ్రాహ్మణుడనని చెప్పుకోవడానికి అనర్హుడు. అలాచెప్పుకుంటే, భగవదపరాధ దోషంతోపాటు, అసత్యదోషంకూడా తప్పదు.

దీనికి శిక్ష మూడువిధాలుగా ఉంటుంది.:
1. ఈజన్మలో అనారోగ్య, అవమానాది శిక్షననుభవించడము;
2. మరణానంతరము, సూక్ష్మ యాతనాశరీరంతో నరకయాతనకు గురవడము;
3. మరజన్మలలో నీఛయోనులలో జన్మించి నికృష్టతననుభవించడం.

కనుక, కనీసము నిత్యసంధ్యనాచరినచి, బ్రాహ్మణజన్మ సార్ధకతపొందండి.

నేను నిత్య సంధ్యనాచరించని బ్రాహ్మణుని ముఖంచూసిననాడు, ఎంతో వ్యాకులతననుభవిస్తాను.

- కంచి పరమాచార్యుల అనుగ్రహభాష్య ఝురి నుండి సేకరణ.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...