Wednesday, March 22, 2017

Know the Telugu Year you born


( 1867, 1927,1987,): ప్రభవ
(1868,1928,1988): విభవ
(1869,1929,1989): శుక్ల
(1870,1930,1990): ప్రమోదూత
(1871,1931,1991): ప్రజోత్పత్తి
(1872,1932,1992): అంగీరస
(1873,1933,1993)శ్రీముఖ
(1874,1934,1994): భావ
(1875,1935,1995): యువ
(1876,1936,1996): ధాత
(1877,1937,1997):  ఈశ్వర
(1878,1938,1998): బహుధాన్య
(1879,1939,1999): ప్రమాది
(1880,1940,2000): విక్రమ
(1881,1941,2001): వృష
(1882,1942,2002): చిత్రభాను
(1883,1943,2003): స్వభాను
(1884,1944,2004): తారణ
(1885,1945,2005): పార్థివ
(1886,1946,2006):  వ్యయ
(1887,1947,2007): సర్వజిత్
(1888,1948,2008): సర్వదారి
(1889,1949,2009): విరోది
(1890,1950,2010): వికృతి
(1891,1951,2011): ఖర
(1892,1952,2012):  నందన
(1893,1953,2013): విజయ
(1894,1954,2014): జయ
(1895,1955,2015): మన్మద
(1896,1956,2016): దుర్ముఖి
(1897,1957,2017): హేవిళంబి
(1898,1958,2018): విళంబి
(1899,1959,2019): వికారి
(1900,1960,2020): శార్వరి
(1901,1961,2021): ప్లవ
(1902,1962,2022): శుభకృత్
(1903,1963,2023): శోభకృత్
(1904,1964,2024): క్రోది
(1905,1965,2025): విశ్వావసు
(1906,1966,2026): పరాభవ
(1907,1967,2027): ప్లవంగ
(1908,1968,2028): కీలక
(1909,1969,2029): సౌమ్య
(1910,1970,2030):  సాదారణ
(1911,1971,2031): విరోదికృత్
(1912,1972,2032): పరీదావి
(1913,1973,2033): ప్రమాది
(1914,1974,2034): ఆనంద
(1915,1975,2035): రాక్షస
(1916,1976,2036): నల
(1917,1977,2037): పింగళ
(1918,1978,2038): కాళయుక్తి
(1919,1979,2039): సిద్దార్థి
(1920,1980,2040): రౌద్రి
(1921,1981,2041): దుర్మతి
(1922,1982,2042): దుందుభి
(1923,1983,2043): రుదిరోద్గారి
(1924,1984,2044): రక్తాక్షి
(1925,1985,2045): క్రోదన
(1926,1986,2046): అక్షయ

Tuesday, March 7, 2017

ద్రాక్షారామం - లింగ ఆరాధన - ఫలితం

ద్రాక్షారామ చుట్టుపక్కల అనేక శివాలయాలు దేవీమందిరాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే.
ఆ ఆలయాలన్నిటిని ఆకాశమార్గాన చూస్తే అన్ని కలిపి ఒక పద్మాకారం లో వుంటాయి. ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాల మందికి ఈ ఆలయాల గురించిన అవగాహన లేదు.
విశేషమేమిటంటే, ప్రతి వ్యక్తి 27 నక్షత్రాలు లో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది
గ్రహదోష నివారణ కోసం అభిషేకాలు చేయ దలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము, లేదా జన్మనక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట .
మేషరాశి నుండి మీనరాశి వరకు అదే క్రమంలో ఆరాధించ వలసిన ఆలయాల సమాచారం.
మేష రాశి
మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాసగంగావరంలో వుంది.
అశ్విని నక్షత్రం
పాదం ----------స్థలం -------- దేవీ దేవతల నామాలు
మొదటి---------బ్రహ్మపురి-------శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి
రెండవ ------- - ఉట్రుమిల్లి -------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భీమశంకర స్వామి
మూడవ------ కుయ్యూరు శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ దుగ్గుదూరు శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
భరణి నక్షత్రం
మొదటి------కోలంక---------శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ-------ఎంజారం-------శ్రీ ఉమా సమేత కృపేశ్వర స్వామి
మూడవ------పల్లిపాలెం------శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
నాలుగవ------ఉప్పంగళ-------శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి
కృత్తికా నక్షత్రం
మొదటి-------నేలపల్లి---------శ్రీ మీనాక్షి దేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి.
వృషభ రాశి
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి తూర్పున వృషభ రాశికి సంబంధించిన ఆలయం విలాసగంగావరం లో ఉన్నది.
కృత్తికా నక్షత్రం
రెండవ------అదంపల్లి------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
మూడవ-----వట్రపూడి------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ-----ఉండూరు------శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామి
రోహిణీ
మొదటి-----తనుమల్ల--------శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
రెండవ-------కాజులూరు-------శ్రీ అన్నపూర్ణేశ్వరీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
మూడవ------ఐతపూడి--------శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
నాలుగవ ----- చీల ---------శ్రీ ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
మృగశిర
మొదటి--------తాళ్ళరేవు------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.
రెండవ---------గురజానపల్లి------శ్రీ ఓం శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి
మిధున రాశి.
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్యమున మిధున రాశికి సంబంధించిన ఆలయం హసనాబాద్ లో ఉన్నది.
మృగశిర
మూడవ-------- అంద్రగ్గి-------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ--------జగన్నాధగిరి------ శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి
ఆరుద్ర
మొదటి-------పనుమళ్ళ------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ--------గొల్లపాలెం------శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామి
మూడవ----వేములవాడ-----శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి
నాలుగవ------కూరాడ----------శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి
పునర్వసు
మొదటి-------గొర్రిపూడి (భీమలింగపాడు)----శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి
రెండవ--------కరప----------శ్రీ పార్వతవర్ధి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
మూడవ------ఆరట్లకట్ల------ శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లీశ్వర స్వామి
కర్కాటక రాశి
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున కర్కాటక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.
పునర్వసు
నాలుగవ------యెనమాడల--------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
పుష్యమి
మొదటి--------కాపవరం-------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
రెండవ---------సిరిపురం-------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
మూడవ-------వేలంగి----------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి
నాలుగవ--------ఓడూరు--------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి
ఆశ్లేష
మొదటి-------- దోమాడ--------శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి
రెండవ---------పెదపూడి-------శ్రీ శ్యామలాంబా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మూడవ-------గండ్రాడు--------శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ-------మామిడాడ-------శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీశ్రీ భీమేశ్వర స్వామి
సింహ రాశి
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున సింహ రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.
మఖ నక్షత్రం
మొదటి------నరసరావుపేట------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
రెండవ--------మెల్లూరు------------శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
మూడవ------అరికిరేవుల----------శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
నాలుగవ------కొత్తూరు------------శ్రీ పార్వతీ సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి
పుబ్బ నక్షత్రం
మొదటి--------చింతపల్లి---------శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
రెండవ---------వెదురుపాక------శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
మూడవ--------తొస్సిపూడి-------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ గోరేశ్వర స్వామి
నాలుగవ--------పొలమూరు-----ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
ఉత్తర నక్షత్రం
మొదటి----------పందలపాక--------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
కన్యా రాశి
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి వాయవ్యమున కన్యా రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం యూరుపల్లిలోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారికి అంకితం చేయబడ్డది.
ఉత్తర నక్షత్రం
రెండవ---------చోడవరం---------శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్త్తేశ్వర స్వామి
మూడవ-----నదురుబాడు--------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ------పసలపూడి---------శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ రాజరాజేశ్వరుడు
హస్త
మొదటి------సోమేశ్వరం--------శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ-------పడపర్తి------------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరుడు
మూడవ------పులగుర్త-----------శ్రీ పార్వతీసమేత శ్రీ వీరేశ్వర స్వామి
నాలుగవ------మాచవరం-------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
చిత్త నక్షత్రం
మొదటి-------కొప్పవరం--------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
రెండవ--------అర్థమూరు-------శ్రీ పార్వతీ సమేతశ్రీ అగస్తేశ్వర స్వామి
తుల రాశి
ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపుపేట లో తులారాశికి సంబంధించిన ఆలయం ఉన్నది.
చిత్త నక్షత్రం
మూడవ-------చల్లూరు------------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
నాలుగవ-------కాలేరు--------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
స్వాతి నక్షత్రం
మొదటి--------మారేడుబాక---శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
రెండవ---------మండపేట------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామి
మూడవ-------గుమ్మిలూరు----శ్రీ ఉమాసమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
నాలుగవ------వెంటూరు-------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
విశాఖ నక్షత్రం
మొదటి-----దూళ్ళ-------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
రెండవ------నర్సిపూడి----శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి
మూడవ-----నవాబుపేట----శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి
వృశ్చిక రాశి
ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపుపేట లో వృశ్చికరాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరునికి అంకితం.
విశాఖ నక్షత్రం
నాలుగవ-------కూర్మపురం------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
అనూరాధా నక్షత్రం
మొదటి------పనికేరు--------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి
రెండవ-------చింతలూరు-----శ్రీ పార్వతీ సమేత శ్రీ పృధ్వీశ్వర స్వామి
మూడవ-----పినపల్ల---------శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
నాలుగవ-----పెదపల్ల-------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
జ్యేష్టా నక్షత్రం
మొదటి------వడ్లమూరు------శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
రెండవ--------నల్లూరు---------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మూడవ------వెదురుమూడి---శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ----- తేకి--------------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామి
ధనుస్సు రాశి
ధనుస్సు రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి నైఋతి లోఉన్నది. నేలపర్తిపాడులోని శ్రీ అన్నపూర్నాసమేత కాశివిశ్వేశ్వర స్వామికి అంకితం
మూల నక్షత్రం
మొదటి---------యెండగండి-------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ----------పామర్రు-----------శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మూడవ--------అముజూరు--------శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ--------పానంగిపల్లి--------శ్రీ లలితాంబికా సమేత శ్రీ ఉత్తరేశ్వర స్వామి
పూర్వాషాఢ
మొదటి---------అంగర-----------శ్రీ పార్వతీ సమేత శ్రీ కనకలింగేశ్వర స్వామి
రెండవ---------కోరుమిళ్ళ--------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మూడవ-------కుళ్ళ-------------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ-------వాకతిప్ప--------శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి
ఉత్తరాషాఢ
మొదటి-------తాతపూడి---------శ్రీ పార్వతీసమేత శ్రీ మల్లేశ్వర స్వామి
మకర రాశి
మకర రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.
ఉత్తరాషాడ నక్షత్రం
రెండవ---------మచర--------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
మూడవ-------సత్యవాడ------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ-------సుందరపల్లి----శ్రీ ఉమాసమేత శ్రీ సోమేశ్వర స్వామి
శ్రవణ నక్షత్రం
 మొదటి-------వానపల్లి-------శ్రీ ఉమాసమేత శ్రీ వైద్యనాధీశ్వర స్వామి
రెండవ--------మాదిపల్లి (మాడుపల్లి)--- శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి
మూడవ------వాడపాలెం-------శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ వీరేశ్వర స్వామి
నాలుగవ------ వీరపల్లిపాలెం----శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
ధనిష్ట
మొదటి--------వెల్వలపల్లి-------శ్రీ మహిషాసురమర్ధనీ సమేత శ్రీ రాజరాజనరేంద్ర స్వామి
రెండవ---------అయినవెల్లి-------శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
కుంభ రాశి
కుంభ రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం లోఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.
ధనిష్ట
మూడవ-------మసకపల్లి------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి
నాలుగవ-------కుందూరు------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
శతభష
మొదటి--------కోటిపల్లి---------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ--------కోటిపల్లి-------- శ్రీ పార్వతీ సమేత శ్రీ కోటేశ్వర స్వామి
మూడవ------తొట్టరమూడి-----శ్రీ భ్రమరాంబా సమేత శ్రీమూల్లేశ్వర స్వామి
నాలుగవ------పాతకోట--------శ్రీ లోపాముద్రా సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
పూర్వాభాద్ర
మొదటి--------ముక్తేశ్వరం-----శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి
రెండవ---------శాసనపల్లి లంక----శ్రీ భ్రమరాంబా సమేత శ్రీశ్రీ చౌడేశ్వర స్వామి
మూడవ--------తానెలంక-----------శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి
మీన రాశి
మీనరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈఆలయం.
పూర్వాభాద్ర
నాలుగవ---------ఎర్రపోతవరం------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి
ఉత్తరాభాద్ర
మొదటి-------డంగేరు-----------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ------- కుడుపూరు------- శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
మూడవ------గుడిగళ్ళ---------శ్రీ ఉమాదేవీ సమేత శ్రీ మార్కండేయ స్వామి
నాలుగవ-----శివల-----------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ త్రిపురాంతక స్వామి
రేవతి
మొదటి----భట్లపాలిక-------శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
రెండవ-----కాపులపాలెం----శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి
మూడవ---- పేకేరు-----------శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
నాలుగవ---- బాలాంత్రం------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

ఇవి చదివి తెలుసుకొందాం. .Old cities New names


*
కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) -
కుశార్, పాకిస్తాన్
*
లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) -
లాహోర్, పాకిస్తాన్
*
తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు
నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
*
పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ
కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్
భాగవతం,మహాభారతం
*
మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి
రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
*
నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్
*
జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
*
మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
*
శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై
దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,
*
దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
*
పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి
విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి
తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర
సముద్రతీర ప్రాంతం
*
మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ
ఒరిస్సా
*
నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్
జిల్లా,మధ్యప్రదేశ్
*
వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
*
నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు
బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
*
వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన
చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
*
రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
*
సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-
కురుక్షేత్ర దగ్గర
*
హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
*
మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
*
వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
*
కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) -
గ్వాలియర్
*
మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్
ప్రావిన్స్, పాకిస్తాన్
*
ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
*
గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్,
హర్యానా
*
కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
*
పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
*
కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం -
గిర్నార్,గుజరాత్
*
శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్
*
హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా,
ఉత్తర్ ప్రదేశ్
*
విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) -
విదర్భ, మహరాష్ట్ర
*
కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
*
చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్,
మధ్యప్రదేశ్
*
కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా,
మధ్యప్రదేశ్
*
ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ,
ఢిల్లీ దగ్గర
*
కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
*
పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్
,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
*
కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) -
కంపిల్, ఉత్తర్
*
జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి,
బీహార్
*
కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన
ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా
*
మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి
జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
*
విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్
నగర్,రాజస్థాన్
*
శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
*
ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
*
నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం –
ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
*
జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
*
కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్
*
బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
*
గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్..

Friday, March 3, 2017

Mahalaxmi Mantras

Before chanting following mantras: MahaLakshmi mantras carries weightage & should have guidance to take through GURUs only. Also not to take as it is. Pl. follow for good & be Blessed. Sharing here to document these mantras.

Aries - "Sreem" - 10,008 times
Tauras - "Om Sarvabadhaa Vinirmukto, Dhan Dhaanyah Sutaanvitah, Manushyo Matprasaaden Bhavishyati Na Sanshayah Om"
Gemini - "Om Shring Shriye Namah"
Cancer - "Om Shree Mahalakshmiyai Cha Vidmahe Vishnu Patnayai Cha Deemahi Tanno Lakshmi Prachodayat Om"
Leo - "Om Shreem Maha Lakshmiyei Namaha"
Virgo - "Om Hreem Shreem Kleem Maha Lakshmi Namaha"
Libra - "Om Shreem Shreeaee Namah"
Scorpio - "Om Hreem Shreem Lakshmibhayo Namaha"
Sagittarius - "Om Shreem Hreem Shreem Kamale Kamalalaye Praseed Praseed Om Shreem Hreem Shreem Mahalakshmaye Namah"
Capricorn - "Om Shring Hring Kling Aing Saung Om Hring Ka A Ee la Hring Ha Sa Ka Ha La Hring Sakala Hring Saung Aing Kling Hring Shring Om"
Aquarius - Aeim Hrim Shrim Ashtalakshmiye Hrim Rim Sidhwaye Mam Grihe Aagchagch Namah Swaha"
Pisces - "Om Shreem Hreem Shreem Kamale Kamalalaye Praseed Praseed Om Shreem Hreem Shreem Mahalakshmaye Namah"

Thursday, March 2, 2017

అర్జునుడా..... కర్ణుడా.....


🌻🔘🌻🌿🌻🔘🌻🔘

కర్ణుడి దానగుణాన్ని....
==============
అందరూ పొగుడుతూ ఉంటే.... అర్జునుడు భరించలేక
ఒక రోజు కృష్ణుడి దగ్గరకు వెళ్లి....
👉బావా! నేను కూడా దానాలు చేశాను.
👉అవసరమైతే కర్ణుడి కన్నా ఎక్కువ చేస్తాను.
👉అయినా నన్ను ఎవరూ గుర్తించటం లేదు.
👉అందరూ కర్ణుడి దాన గుణాన్నే పొగుడుతున్నారు.
👉దీని వెనకున్న కారణమేమిటి? అని అడిగాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.

===================

ఆ సంభాషణ జరిగిన సాయంత్రం...
అలా కృష్ణుడు, అర్జునుడు వాహ్యాళికి వెళ్లారు.
అక్కడ వాళ్లిద్దరికి ఒక బంగారు కొండ కనిపించింది. అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు.
అప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపు చూసి....
ఈ బంగారు కొండను దానం చేయి..... అప్పుడైనా
నీకు కర్ణుడి కన్నా మంచిపేరు వస్తుందేమో...అన్నాడు
====================
అర్జునుడు వెంటనే తన సేవకుల చేత....
చుట్టుపక్కల ఉన్న గ్రామాలవారికి బంగారం దానంగా తీసుకొమ్మని దండోరా వేయించాడు.
అన్ని గ్రామాల ప్రజలు రావటం మొదలుపెట్టారు. అర్జునుడు బంగారాన్ని తవ్వించి చిన్న చిన్న ముక్కలు దానం చేయటం మొదలుపెట్టాడు.
ఎంత మందికి దానం చేసినా బంగారం తరగటం లేదు. జనం సంఖ్య పెరుగుతూనే ఉంది....
ఒక రోజు అయ్యేసరికి అర్జునుడు అలసిపోయాడు....
====================
కృష్ణా....
👉దానం చేయాలంటే చిరాకుగా ఉంది... అన్నాడు... అప్పుడు కృష్ణుడు..నీకు దానం ఎలా చేయాలో చెబుతా.... అని కర్ణుడిని పిలిపించాడు.
ఈ బంగారం కొండలు మాకు కనిపించాయి. వాటిని నువ్వు ఎవరికైనా దానం చేస్తే బావుంటుంది..’’ అన్నాడు
======================
వెంటనే కర్ణుడు- అక్కడున్న ప్రజలందరి వైపు తిరిగి- ఈ కొండలు మీవి. వీటిని తవ్వి తీసుకువెళ్లండి..’’ అన్నాడు. అందరూ తమకు కావల్సిన బంగారం తీసుకెళ్లారు
=======================
అప్పుడు అర్జునుడితో కృష్ణుడు....
👉నీకు మనసులో బంగారంపై ఆశ ఉంది.
👉అందుకే చిన్న చిన్న ముక్కలు పంచిపెట్టావు.
👉కానీ కర్ణుడికి ఆశ లేదు.
👉అందుకే వారికి కొండ అంతా ఇచ్చేశాడు.
========================
🌻🌿🔘దానం చేసేవారి మనసులో....
ఎటువంటి ఆశ ఉండకూడదు....
అప్పుడే ఆ దానం ఫలిస్తుంది....... అని బోధ చేశాడు.

🌿🌻సర్వేజనా సుఖినోభవంతు🌻🌿

7 Interesting facts about the “Holy Cow” and its milk


1. Indian (Desi) cows is the only species of cow on the planet which has a hump along its backbone.

2. The hump has a specific vein called Surya Ketu Nadi (yogis know the nadis are channels in the etheric body), which absorbs the energy from the sun and moon. The solar rays produce golden salts in her blood and are present in the products produced (e.g. milk, ghee, curd, butter), thus giving its golden colour. The other cow by-products (e.g. dung, urine) have medicinal benefits as well acting as naturally producing manure, pesticide and insecticide.

3. Indian (Desi) Cow Urine contains moderate levels of nitrogen (N2) — effect on chemical diseases, calcium (Ca) — blood purifier and germicidal, potassium (K) — cures hereditary rheumatism and removes muscular weakness, magnesium, phosphate (P) — helps in removing stones urinary track, fluoride (F), urea (H2NCONH2) — removes blood abnormalities and toxins, natural stimulant of urinary track and is diuretic, ammonia (NH3), Copper (Cu) — controls build up of unwanted fats, Hydroxide (AuOH) — germicidal and increases immunity power, it highly antibiotic and anti-toxic, etc.

4. Indian Cow Dung has a natural disinfecting effect and reduces pathogenic bacteria. It is a natural anti-septic, anti-radioactive and anti-thermal properties. In Bhopal, India, 20,000 people were killed in the worlds worst industrial disaster from a lethal gas leak, except those villagers who houses were coated in cow dung.

5. Indian Cow Milk has amino acids which makes its proteins easier to digest. Is a rich source of B2, B3, A vitamins which helps immunity. It helps in reducing serum cholesterol. It is one of the best natural anti-oxidants. The highly rich calcium helps protect cells. contains Riboflavin (vitamin B12) and Vitamin B2 which are functional in the production of energy and cardiovascular protection. Also contains iodine in rich quantity which is an integral component of thyroid hormones.

6. Indian Cow milk naturally produces the a2 Protein only, whereas the Jersey cow produces a1 protein which gets broken down into peptides but also creates a new peptide called BCM7 (Beta Caso — Morphine 7)
.
7. The BCM7 peptide from a1 Jersey cows cannot be broken down by the body and is the cause of many diseases, as it is an exogenous opioid which does not occur naturally within the human body and interacts with human digestive system, internal organs and brain system.

* గణపతి‬ ధ్యాన శ్లోకాలు (బహురూప ‪గణపతి‬ ధ్యాన శ్లోకాలు)

Before chanting following mantras: Ganapati mantras carries weightage & should have guidance to take through GURUs only. Also not to take as it is. Pl. follow for good & be Blessed. Sharing here to document these mantras.

 శ్రీ బాల గణపతి ధ్యానం కరస్థకదలీచూతపనసేక్షుకమోదకమ్ |
బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపమ్ || ౧ ||

శ్రీ తరుణ గణపతి ధ్యానం పాశాంకుశాపూపకపిద్థజంబూ స్వదంతశాలీక్షుమపి స్వహస్తైః | ధత్తే సదా యస్తరుణారుణాభః పాయాత్స యుష్మాం స్తరుణో గణేశః || ౨ ||

శ్రీ భక్త గణపతి ధ్యానం నాలికేరామ్రకదలీగుడపాయసధారిణమ్ | శరచ్చంద్రాభవపుషం భజే భక్తగణాధిపమ్ || ౩ ||

శ్రీ వీరగణపతి ధ్యానం బేతాలశక్తిశరకార్ముకచక్రఖడ్గ ఖట్వాంగముద్గరగదాంకుశనాగపాశాన్ | శూలం చ కుంతపరశుధ్వజముద్ద్వహంతం వీరం గణేశమరుణం సతతం స్మరామి || ౪ ||

శ్రీ శక్తిగణపతి ధ్యానం ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం పరస్పరాశ్లిష్టకటి ప్రదేశమ్ | సంధ్యారుణం పాశసృణీ వహంతం భయాపహం శక్తిగణేశమీడే || ౫ ||

శ్రీ ద్విజగణపతి ధ్యానం యం పుస్తకాక్ష గుణదండకమండలు శ్రీ విద్యోతమానకరభూషణమిందువర్ణమ్ | స్తంబేరమాననచతుష్టయశోభమానం త్వాం యః స్మరేద్ద్విజగణాధిపతే స ధన్యః || ౬ ||

 శ్రీ సిద్ధగణపతి ధ్యానం పక్వచూతఫలపుష్పమంజరీ ఇక్షుదండతిలమోదకైస్సహ | ఉద్వహన్ పరశుమస్తు తే నమః శ్రీ సమృద్ధియుత హేమపింగళః || ౭ ||

శ్రీ ఉచ్ఛిష్టగణపతి ధ్యానం నీలాబ్జదాడిమీవీణాశాలీ గుంజాక్ష సూత్రకమ్ | దధదుచ్ఛిష్టనా మాయం గణేశః పాతుమేచకః ||
ప్రకాంతరేణ సారీయోనిరసాస్వాదలోలుపం కామమోహితమ్ || ౮ ||

శ్రీ విఘ్నగణపతి ధ్యానం శంఖేక్షుచాపకుసుమేషుకుఠారపాశ చక్రస్వదంతసృణిమంజరి కాశరౌఘైః | పాణిశ్రితైః పరిసమీహితభూషణశ్రీ- -ర్విఘ్నేశ్వరో విజయతే తపనీయగౌరః || ౯ ||

శ్రీ క్షిప్రగణపతి ధ్యానం దంతకల్పలతా పాశరత్న కుంభాంకుశోజ్జ్వలమ్ | బంధూకకమనీయాభం ధ్యాయేత్ క్షిప్రగణాధిపమ్ || ౧౦ ||

శ్రీ హేరంబగణపతి ధ్యానం అభయవరదహస్తః పాశదంతాక్షమాలా సృణిపరశుదధానో ముద్గరం మోదకం చ | ఫలమధిగతసింహః పంచమాతంగవక్త్రో గణపతి రతిగౌరః పాతు హేరంబనామా || ౧౧ ||

 శ్రీ లక్ష్మీగణపతి ధ్యానం బిభ్రాణః శుకబీజపూరకమిలన్మాణిక్యకుంభాకుశాన్ పాశం కల్పలతాం చ ఖడ్గవిలసజ్జ్యోతిస్సుధానిర్ఝరః | శ్యామే నాత్తసరోరుహేణ సహితం దేవీద్వయం చాంతికే గౌరాంగో వరదానహస్తసహితో లక్ష్మీగణేశోఽవతాత్ || ౧౨ ||

శ్రీ మహాగణపతి ధ్యానం హస్త్రీంద్రాననమిందుచూడమరుణచ్ఛాయం త్రినేత్రం రసా- -దాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతమ్ | బీజాపూరగదేక్షుకార్ముకలసచ్ఛక్రాబ్జపాశోత్పల వ్రీహ్యగ్రస్వవిషాణరత్న కలశాన్ హస్తైర్వహంతం భజే || ౧౩ ||

శ్రీ విజయగణపతి ధ్యానం పాశాంకుశస్వదంతామ్రఫలవానాఖువాహనః | విఘ్నం నిహంతు నస్సర్వం రక్తవర్ణో వినాయకః || ౧౪ ||

శ్రీ నృత్తగణపతి ధ్యానం పాశాంకుశాపూపకుఠారదంత చంచత్కరాక్లుప్తవరాంగులీకమ్ | పీతప్రభం కల్పతరోరధస్థం భజామి నృత్తోపపదం గణేశమ్ || ౧౫ ||

'''''' నమకం విశిష్టత ''''''


🌷నమకం, చమకం 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని "అనువాకం" అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయిదాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.
🌻అనువాకం – 1:
తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.
🌺అనువాకం – 2 :
ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.
💥అనువాకం – 3:
ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారనంకు కూడా చదువుతారు.
🍁అనువాకం – 4:
ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:
🌿అనువాకం – 5:
ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా - సృషి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.
🌲అనువాకం – 6:
ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.
ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షనకు కూడా చదువుతారు.
💧అనువాకం – 7:
నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న ర్ద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.
🌱అనువాకం – 8:
ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.
🍂అనువాకం –9:
ఈ అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ స్కక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.
‌🌹అనువాకం – 10:
ఈ అనువాకంలో మల్ల రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపసమించి, పినాకధారియైనా, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.
🌺అనువాకం – 11:
ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్తి దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు....🌻🌻

🔥సర్వేజనా సుఖినోభవంతు సన్మంగళానిభవంతు🔥

ఓంకార్ స్వామి

🕉 ఓంకార్ స్వామి🔥🔥🔥🔥🔥సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే. అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం. కానీ మనకు తెలీని శివ లింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి, అపురూపమైనవి. ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం. అందుకే వాటి గురించి తెలుసుకుందాం. రకరకాల పదార్ధాలతో రూపొందిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి. ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో చూడండి...

01.🕉 గంధలింగం: రెండు భాగాలు కస్తూరి. నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.

 02.🕉 పుష్పలింగం: నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.

03.🕉 నవనీతలింగం: వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.      

04.🕉 రజోమయలింగం: పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుజ్యాన్ని పొందగలం.

05.🕉 ధాన్యలింగం: యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.

06.🕉 తిలిపిస్టోత్థలింగం: నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.

07.🕉 లవణలింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.

08.🕉 కర్పూరాజ లింగం: ముక్తిప్రదమైనది.

09.🕉 భస్మమయలింగం: భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది.                  
10. 🕉శర్కరామయలింగం: సుఖప్రదం

11.🕉సద్భోత్థలింగం: ప్రీతిని కలిగిస్తుంది.

12. 🕉పాలరాతి లింగం: ఆరోగ్యదాయకం

13. 🕉వంశాకురమయ లింగం: వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.

14. 🕉కేశాస్థిలింగం: వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.        
15. 🕉పిష్టమయలింగం: ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

16. 🕉దధిదుగ్థలింగం: కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది

17.🕉 ఫలోత్థలింగం: ఫలప్రదమైనది

18. 🕉రాత్రిఫలజాతలింగం: ముక్తిప్రదం.

19. 🕉గోమయలింగం: కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. భూమిపై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.

20.🕉 దూర్వాకాండజలింగం: గరికతో తయారుచేయబడిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.

21.🕉 వైడూర్యలింగం: శత్రునాశనం, దృష్టిదోషహరం

22.🕉 ముక్తాలింగం: ముత్యంతో తయారుచేయబడిన ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.

23. 🕉సువర్ణనిర్మితలింగం: బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.

24.🕉 రజతలింగం: సంపదలను కలిగిస్తుంది.

25.🕉 ఇత్తడి - కంచులింగం: ముక్తిని ప్రసాదిస్తుంది.

26. 🕉ఇనుము - సీసపులింగం: శత్రునాశనం చేస్తుంది.    

27.🕉 అష్టథాతులింగం: చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.

28. 🕉 తుష్ణోత్థలింగం: మారణక్రియకు పూజిస్తారు.

29. 🕉స్పటిక లింగం: సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.

30. 🕉సీతాఖండలింగం: పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.

ఓం నమో భగవతే గోమాత్రే నమః

అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన వేదాలని పోగొట్టుకున్న  భారతీయులు అని ప్రపంచం ఇప్పటికే ఉమ్మేసింది. జీవన ధర్మాన్ని భోదించిన గొప్ప శక్తి ఐన భగవద్గీత ని చనిపోయినపుడు
మాత్రమే వినే తెలివి తక్కువ మూర్ఖులు భారతీయులు అని హేళన చేస్తోంది.
ఆయుర్వేదం లో ఉన్న గొప్ప ఆరోగ్యాన్ని ఒదులుకుని ఇంగ్లీష్ మందుల వెంట పడుతున్న అజ్ఞానులు భారతీయులు అని ఈ ప్రపంచం నవ్వుకుంటోంది
నిత్య యవ్వనం గా ఉంచే యోగ శాస్త్రాన్ని కాపాడుకోలేకపోయిన రోగులు
భారతీయులు అని ఈ ప్రపంచం మనని చూసి పరిహాసం ఆడుతోంది
నీ జీవిత పరమార్ధాన్ని వివరించే నీ దేశం లోనే పుట్టిన గొప్ప శక్తి ఐన ధ్యానం ఒదిలేసి ఎందుకురా మా పిచ్చి సంస్కృతి ని ఫాలో అవుతున్నారు రా
తెలివి లేని భారతీయు లారా అని ఈ ప్రపంచం మనల్ని వెక్కిరిస్తోంది.
అణువణువునా శక్తి ని నింపుకుని అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆవుని
కాపాడుకోలేక పోయిన మీకెందుకు రా ఆవేశం అని హేళన చేస్తోంది
ప్రపంచానికే శాంతి ని భోదించిన మీ దేశం లో పుట్టిన బౌద్దాన్ని తరిమి కొట్టిన
పిచ్చి ఎదవలు భారతీయులు అని ఈ ప్రపంచం మనపైన ఉమ్మేస్తోంది
అమెరికన్స్ ఐన మేము మీ వేప చెట్టుని పసుపు ని కొన్ని కోట్లు పోసి కొంటుంటే మీ ఇంటి ముందే ఉన్న ఆ చెట్లని కొట్టేస్తున్న తెలివి తక్కువ
దద్దమ్మల్లారా మీ దేశ గొప్ప తనం మీకే తెలియకుంటే ఎలా రా అని
నిల దీసి మరీ ఈ ప్రపంచం మన మీద జాలి పడుతోంది
వేదాలు తగుల బెట్టుకున్నాము
ఉపనిషత్తులు చెత్తలో వేసుకున్నాము
ఆయుర్వేదాన్ని సమాధి చేసాము
ధ్యానాన్ని మరిచిపోయాము
బౌద్దాన్ని చంపేసాము
ఇప్పుడు ఆవుని కూడా చంపు కుంటున్నాము
నాన్నా ఇంత గొప్ప దేశం లో పుట్టి ఇంత గొప్ప సంస్కృతి ని జీవన ధర్మాన్ని ఎందుకు కాపాడలేకపోయావు నాన్నా అని రేపు మన బిడ్డలు మన మీద
ఉమ్మేయక ముందే జాగ్రత్త పడుదాం.
భారత దేశాన్ని చేజేతులా చంపుకుంటూ
మళ్లీ సిగ్గు లేకుండా
మా దేశం గొప్పది మా సంస్కృతి గొప్పది అని ఎదవ సొల్లు చెప్తూ ఉంటాము.
వేదం లేదు యోగం లేదు ధ్యానం లేదు ఆనందం లేదు ఆరోగ్యం లేదు
ఆవు లేదు ఆయుర్వేదం లేదు బౌద్ధం లేదు శాంతి లేదు ప్రేమ లేదు
ధర్మం లేదు అర్ధం లేదు కామం లేదు మోక్షం లేదు
సత్యం లేదు  సనాతన జీవన ధర్మం లేదు
భారత దేశం అంటేనే ఇవన్ని, వీటి వల్లే భారత దేశం గొప్ప దేశం అయింది
ఇవన్ని చంపేసి మళ్లీ భారత దేశం బతికే ఉంది అంటూ సోది మాట్లాడుతాం.
గోవులున్న ఇల్లు, గ్రామం, రాష్ట్రం, దేశం సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది. సమస్త సృష్టిలోకి పవిత్రమైన గోమాతను రక్షిద్దాము, పూజిద్దాము సకల శుభాలను పొందుదాము….
ఓం నమో భగవతే గోమాత్రే నమః
గోవు ను జాతీయ జంతువు గా ప్రకటించాలి.
గోవు లేకుంటే నాగరికత లేదు
గోమాత ను పూజిద్దాం, రక్షిద్దాం
ఆవు ను కూడా ఆమ్మలా ప్రేమిద్దాం
గోమాత కు మన అండ
గో సంరక్షణ మన జండా
గో సేవ మన అజెండా
ఇది శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్, హైదరాబాదు వారి
' శ్వాస - ధ్యాస.'''------- దయచేసి ఈ సందేశాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకెళ్లండి.🙏🙏🙏.

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...