(from reviewsok.com)
ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే ఆగిపోవడం,
రావలసిన డబ్బులు, ఉద్యోగాలు, లాభాలు చేతిదాకా వచ్చి చేయిదాటిపోవడం
జరుగుతోందా? అయితే అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారం అంటే
ఇప్పుడు చూద్దాము..
- కొబ్బరి నూనెతో విఘ్నేశ్వరుడికి ఒక్కొక్క కుందె లో 3 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. ఇలా కేవలం బుధవారమే కాకుండా రోజు ప్రతి రోజు దీపం పెట్టాలి. ఇలా పెట్టడం ద్వారా విఘ్నేశ్వరుడు మనకి వచ్చిన ఆటంకాలు మరియు విఘ్నాలు తొలగిస్తాడు.
- గణపతికి ఎన్నో రూపాలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాము. అయితే దానిలో విఘ్నరాజాధీపతి అయిన వినాయక రూపం. అయితే మళ్ళి ఆ విఘ్నాలు కలిగించి తొలగించేది కూడా వినాయకుడే అందుకే మన పనిలో ఆటంకాలు పోవడానికి “ఓం శ్రీ వినాయకాయ నమో నమః”
- విఘ్నేశ్వరుడికి ఎర్రని పువ్వులు అంటే ఎంతో ప్రీతికరమైనవి. వినాయకుడికి చాలా ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ, గరికతో గణపతి స్తోత్రం చదివి నైవేద్యంగా బెల్లం పెట్టాలి.
- శివుడు నిరాడంబరుడు అందుకే అయన కోరేది నీరు. అవును మీరు చదివింది నిజమే కార్తిక మాసంలో నిత్యం దీపం, నీరు ఆయనకి సమర్పిస్తే శివుడికి అనుగ్రహం పొంది కోరిన కోరికలు తీరుస్తాడు.
- శివుని ఫోటో లేదా శివలింగం దగ్గర రాగి లేదా వెండి పాత్రలో శుభ్రమైన నీరు ఉంచాలి. అది రోజు పూజకు ముందు మార్చాలి. ఆ నిరుని మనం తీసుకోవచ్చు లేదా మొక్కలకు కూడా పోయచ్చు.
- మంగళవారం పూట దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. మంగళవారం రాహుకాలంలో దుర్గమ్మ తల్లికి దీపమెలిగించే మహిళలు నిష్ఠతో అమ్మవారిని దుర్గాష్టకంతో స్తుతిస్తే ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి. ఇంకా మంగళవారం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా తలస్నానమాచరించి.. ఇంటిని, పూజామందిరమును శుభ్రం చేసుకుని పువ్వులు, ముగ్గులతో అలంకరించుకోవాలి. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 4.30 వరకు ఆలయాల్లో జరిగే రాహుకాల పూజను ముగించుకోవాలి. అనంతరం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో గృహంలో దీపమెలిగించి.. పాయసం నైవేద్యంగా సమర్పించుకోవాలి. దీపమెలిగించే సమయంలో దుర్గా స్తోత్రాన్ని 9 తొమ్మిదిసార్లు పఠిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు.
- ఇంట్లో నుంచి బయటకు వెళ్లేప్పుడు మన శ్వాస ఏ నాసిక నుంచి వస్తుందో చూసుకొని ఆ పాదాన్ని ముందుగా బయటపెట్టి బయటు దేరితే కార్యజయం కలుగుతుంది.
- ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు చాలా మందికి దుశ్శకునాల భయం ఉంటుంది. అలాంటి వారు దేవుడికి పూజ చేసిన పువ్వులను జేబులో లేదా బ్యాగులో దగ్గర ఉంచుకుని బయటకు వెళితే దుశ్శకునాలు బాధించవు.
- దంపతుల మధ్య కలహాలు నివారణ కావాలంటే రాత్రి పడుకోబోయే ముందు భర్త తలదగ్గర కర్పూరం ఉంచి, భార్య తల దగ్గర సింధూరాన్ని చిన్న పోట్లంలో ఉంచుకోవాలి. నిద్రలేచాక కర్పూరాన్ని వెలిగించి, సింధూరాన్ని ఇంట్లో చల్లాలి. ఇలా చేయడం ద్వారా చిన్న.. చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి.
- మానవుడు తన జీవితంలో నిత్యం లక్ష్మిరాక కోసం పోరాడుతూనే ఉంటాడు. ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్దలతో నిత్యం ఉదయం కాని సాయంత్రం గాని చదివితే అన్ని సమస్యలకి పరిష్కారం దొరికి… సుఖసంతోషాలతో జీవిస్తారు. దీనికి నియమాలు ఏమి పెద్దగా లేవు…శుచిగా శుబ్రంగా ఉంటె చాలు. ఈ శ్లోకం వీడియో ఈ క్రిందన ఇవ్వబడింది…
సహస్రదళ పద్మాస్తాం స్వస్తాంచ సుమనోహరం శాంతాంచ శ్రీహారే కాంతామ్ తాం
భాజేత్ జగతాం ప్రసుమ్
- పెద్ద బాల శిక్షప్రకారం:
మండుచున్న నిప్పు, కన్య, సింహాసనం, గుర్రము, అక్షతులు, గంధము, పువ్వులు, ఛత్రము, పల్లకి, ఏనుగు, తేనె, నెయ్యి, పెరుగు, చేప, మాంసము, మద్యము, ఇస్త్రీ బట్టలు, శంఖానాదం, మంగళ వాయిద్యములు, వేదఘోష, ఏడ్పులేని శవము, పూర్ణకుంభము, వేశ్యలు, అద్దములు, మొదలైనవి ఎదురైన మంచి శకునములు.
ఒంటి బ్రాహ్మణుడు, పిచ్చివాడు, చెవిటి, కుంటి, జడధారి, మాలికలు, ఎముకలు, చర్మం, నూనె, ప్రత్తి, కట్టెలు, ఉప్పు, బెల్లం, మజ్జిగ, పాము, కసు, దిగంబరుడు, క్షౌరం చేయించుకున్నవాడు, తల బిరబోసుకున్న వాడు, దీర్ఘరోగి మొదలైనవి ఎదురైన చెడు శకునములు.
- Few more coming ....
No comments:
Post a Comment