Thursday, September 22, 2022

కొన్ని గోత్రాలు మరియు వాటి ప్రవరలు

1. భరద్వాజ : ఆంగీరస, భార్హస్పత్స్య, భరద్వాజ త్రయా ఋషేయ ప్రవరాణ్విత భారద్వజాస గోత్రస్య 

2. వాథూలస : భార్గవ, వైతాహవ్య, శావేదస త్రయా ఋషేయ ప్రవరాణ్విత వాథూలస గోత్రస్య

3. శ్రీవస్త లేక శ్రీవత్స : భార్గవ, చ్యవన, ఆప్నవాన, ఆర్వ, జామదఘ్నేయ పంచా ఋషేయ ప్రవరాణ్విత శ్రీవత్సస గోత్రస్య

4. శ్యాలంకాయన : విశ్వామిత్ర, ఆఘమర్షన, దేవరత త్రయా ఋషేయ ప్రవరాణ్విత శ్యాలంకాయనస గొత్రస్య

5. షతమర్షన: ఆంగిరస, ఫౌరుకుత్స, త్రాసతస్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత షతమర్షనస గోత్రస్య

6. ఆత్రేయ: ఆత్రేయ, ఆర్చనాస, శ్యావాస్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆత్రేయ గోత్రస్య

7. కౌషిక: విశ్వామిత్ర, ఆఘమర్షన, కౌసిక త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌషిక గొత్రస్య

8. ఖలబొధన/ఖలభవస (రెండు రకాలు)

    1. ఖలబొధన: విశ్వామిత్ర, ఆగమర్షన, ఖలబొధన త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఖలబొధన గోత్రస్య

    2. ఖలభవస: విశ్వామిత్ర, ఆగమర్షన, ఖలభవస త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఖలభవస గొత్రస్య

9. విశ్వామిత్ర: విశ్వామిత్ర, దేవరత, ఔతల త్రయా ఋషేయ ప్రవరాణ్విత  విశ్వామిత్ర గోత్రస్య 

10. కౌండిన్య: వాసిష్త, మైత్రావరుణ, ఖౌందిన్యస త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌండిన్యస గోత్రస్య

11. హరితస: ఆంగిరస, అంబరిష, యువనశ్వ, త్రయా ఋషేయ ప్రవరాణ్విత హరితస గోత్రస్య

12. గౌతమస : ఆంగిరస, ఆయస్య, ఆఔశిద్యస, కాక్షివత, వమదెవ, గ్రిహదుగ్ద, గౌతమస – సప్తా ఋషేయ ప్రవరాణ్విత గౌతమస గోత్రస్య


13.ఔద్గల్య (మూడు రకాలు)

1. ఆంగిరస, భర్మ్యశ్వ, ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య

2. తర్క్ష్య, భార్మ్యశ్వ, మౌద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య

3. ఆంగిరస, ఢవ్య, ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య


14. శందిల్య (మూడు రకాలు)

1. కాశ్యప, అవత్సార, దైవల త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

2. కాశ్యప, ఆవత్సార, శాందిల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

3. కాశ్యప, దైవల, ఆసిత త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య


15. నైత్రువకాశ్యప: కాశ్యప, ఆవత్సర, నైత్రువ త్రయా ఋషేయ ప్రవరాణ్విత నైత్రువకాశ్యపస గోత్రస్య 

16. కౌత్స: ఆంగిరస, మాంధత్ర, కౌత్స త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌత్సస గోత్రస్య


17. కన్వ (రెండు రకాలు)

1. ఆంగిరస, ఆజమీద, కన్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కన్వస గోత్రస్య

2. ఆంగిరస, కౌర, కన్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కన్వస గోత్రస్య


18. పరాసర: వాశిష్త, శాక్త్య, పరాసర త్రయా ఋషేయ ప్రవరాణ్విత పరాసరస గోత్రస్య

19. అగస్త్య: అగస్త్య, తర్ధచ్యుత, శౌమవహ త్రయా ఋషేయ ప్రవరాణ్విత అగస్త్యస గోత్రస్య


20. ఘర్గి (రెండు రకాలు)

1. ఆంగిరస, బర్హస్పత్య, భారద్వజ, ఉపాధ్యయ త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగిరసస గోత్రస్య

2. ఆంగిరస, శైన్య, గార్గ్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగిరసస గోత్రస్య


21. బాదరాయణ: ఆంగిరస, ఫార్షదశ్వ, ఋతితర త్రయా ఋషేయ ప్రవరాణ్విత బాదరాయణ గోత్రస్య


22. కశ్యప (మూడు రకాలు)

1. కాశ్యప, ఆవత్సార, దైవల త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

2. కాశ్యప, ఆవత్సార, నైదృవ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

3. కాశ్యప, ఆవత్సార, నైదృవ, రేభ, రైభ , శాందిల, శాందిల్య సప్తా ఋషేయ ప్రవరాణ్విత కాశ్య్పస గోత్రస్య


23. సుంక్రితి లేదా  శాంక్రిత్య గోథ్ర (రెండు విధాలు)

1. ఆంగిరస, కౌరవిధ, శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య

2. శధ్య ,కౌరవిధ, శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య


24. ఆంగీరస : ఆంగీరస, ఫురుకుత్స్య, ఠ్రాసదస్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగీరస గోత్రస్య

25. గౌతం/గౌతమస  : అంగీరస, ఆయస్య, గౌతమస త్రయా ఋషేయ ప్రవరాణ్విత గౌతమస గోత్రస్య

26. అగ్నివైవశ్వత: ఆంగీరస, భార్హస్పత్స్య, భారద్వాజ, శ్రుక్వ, ఆగ్నివైవశ్వత పంచాఋషేయ ప్రవరాణ్విత అగిన్వైవశ్వత గోత్రస్య

27. శాంఖ్యాయన: విశ్వామిత్ర, ఆఘమర్షన, దేవవ్రథ శాంఖ్యాయన త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాంఖ్యాయన గోత్రస్య

28. విశ్వామిత్ర: శ్రౌమిత, ఖామకయన, దేవతరస, దేవరత,పంచా ఋషేయ ప్రవరాణ్విత విశ్వామిత్ర 

29. కపి: ఆంగీరస, అమాహైయ, ఔరుక్షయ, త్రయా ఋషేయ ప్రవరాణ్విత కపిస గోత్రస్య.


Thursday, August 18, 2022

హనుమాన్ చాలీసా మహత్యం…!

ఉత్తరభారతదేశంలో క్రీ||శ||16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయభాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన ‘రామచరితమానస్’ సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు.

తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ బాదుషాకు తరచుగా పిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.

ఇదిఇలావుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడు అయిన గృహస్టు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యేష్టి జరగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకోన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరచి ‘దీర్ఘసుమంగళీభవః’ అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్నా శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ ‘తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు!’ అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.

ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభాక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలంతా ఢిల్లీకి

వెళ్ళి బాదుషాకు స్వయముగా వవరించి తగిన చర్య తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.

పాదుషా: తులసీదాస్ జీ! మీరు రామనామం అన్నింటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట!

తులసీదాస్: అవును ప్రభూ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?

పాదుషా: అలాగా! రామానామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు, నిజమేనా?

తులసీదాస్: అవును ప్రభూ! రామనామానికి మించినదేమి లేదు.

పాదుషా: సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.

తులసీదాస్: క్షమించండి ప్రభూ! ప్రతి జీవి జనన మనరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుతుతాయి. మానవమాత్రులు మార్చలేరు.

పాదుషా: తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సుభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి!

తులసీదాస్: క్షమించండి! నేను చెప్పేది నిజం!

పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, ‘తులసీ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!’ అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్ధించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంటే! ఇక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హాటాత్ సంఘటనతో అదరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.

ఆ స్త్రోతంతో ప్రసన్నుడైన హనుమంతుడు ‘తులసీ! నీ స్త్రోత్రంతో మాకు చాల ఆనందమైంది. ఏమీకావాలో కోరుకో!’ అన్నాడు. అందుకు తులసీదాస్ ‘తండ్రీ! నా కేమి కావాలి! నేను చేసిన నీ స్త్రోత్రం లోక క్షేమం కొఱకు ఉపయోగపడితే చాలు, నా జన్మ చరితార్థమవుతుంది. నా ఈ స్త్రోతంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ! అని కోరుకున్నాడు.

ఆమాటలతో మరింతప్రీతిచెందిన హనుమంతుడు ‘తులసీ! ఈస్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమేం వహిస్తాము’ అని వాగ్దానం చేశారు. అప్పట్నుండి ఇప్పటివరకు ‘హనుమాన్ చాలీసా’ కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.

అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక ‘హనుమాన్ చాలీసా’. దాదాపు 500 ఏళ్ల తరువాత కూడా ప్రతి ఇంతా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది.

కేశవ నామాలు-గణిత భూమిక

విష్ణుమూర్తికి 24 పేర్లున్నాయి. వాటిని కేశవ నామాలంటారని మనకు తెలుసు. ఇవి 24మాత్రమే ఎందుకు ఉన్నాయి?వీటికి కాలచక్రానికి, గణితానికి ఏమైనా సంబంధం వున్నదా?

ఈ *24 కు గణిత పరమైన భూమిక ఏమిటి?

విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటాం. అంటే నాలుగు చేతులు గలవాడని కదా. ఈ నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మాలను ధరించి మనకు దర్శనమిస్తాడు.

నిశితంగా పరిశీలిస్తే, ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలలో వచ్చే మార్పుల వల్ల ఖచ్చితంగా 24 వేరువేరు రూపాలు విష్ణువునకు ఏర్పడతాయి. ఈ 24 రూపాలనే కేశవనామాలంటారు.

1. కేశవ నామాలలో మొదటి నామం ‘కేశవ’.

కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో ‘పద్మము, శంఖము’ ధరించి ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో ‘గద, చక్రం’ధరించి ఉంటాడు.

2. విష్ణువు యొక్క మరొక నామము ‘మాధవ’.

ఈ రూపంలో కుడి వైపు రెండు చేతులతో ‘గద, చక్రం’ ధరించి, ఎడమవైపు ఉన్న రెండు చేతులతో ‘పద్మము, శంఖము’ ధరించి ఉంటాడు.

3. ‘మధుసూధన’ రూపంలో… 

కుడివైపు చేతులతో ‘చక్రం, శంఖము’ మరియు ఎడమవైపు చేతులతో ‘గద, పద్మము’ ధరించి ఉంటాడు.

ఈవిధంగా ప్రతి పదిహేను రోజులకు (పక్షానికొకసారి) - ’పౌర్ణమికి, అమావాస్య కు’ తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు శ్రీ మహా విష్ణువు.

ఈ మార్పులు లేదా అమరికలను మనం గణిత శాస్త్ర పరిభాషలో ప్రస్తారాలు(permutations) అంటాం.

అనగా 4 వస్తువులను 4 (4 factorial) విధాలుగా అమర్చవచ్చు.

 4! = 4×3×2×1=24.

శంఖాన్ని 'శ' తోను,

చక్రాన్ని 'చ' తోను,

గదను 'గ' తోను,

పద్మాన్ని ' ప'తోను సూచిస్తే,


ఆ 24 అమరికలు క్రింది విధంగా వుంటాయి.


1) శచగప 2) శచపగ

3) శపచగ 4) శపగచ

5)శగచప 6)శగపచ

7)చపగశ 8)చపశగ

9)చగపశ 10)చగశప

11)చశగప 12)చశపగ

13)గపశచ 14)గపచశ

15)గచశప 16)గచపశ

17)గశపచ 18)గశచప

19)పచగశ 20)పతశగ

21)పశగచ 22)పశచగ

23)పగశచ 24)పగచశ.

[పైవన్నీ ఒక క్రమంలో ఉన్నట్లు పరిశీలించి ఉంటారు.] 

ఈ 24 నామాలు పెద్దలందరికీ తెలిసినా‌...మరోసారి క్రింద ఉదహరిస్తున్నాను.


కేశవ, నారాయణ

మాధవ, గోవింద

విష్ణు, మధుసూధన

త్రివిక్రమ, వామన

శ్రీధర, హృషీకేశ

పద్మనాభ, దామోదర

సంకర్షణ, వాసుదేవ

అనిరుధ్ధ, ప్రద్యుమ్న,

పురుషోత్తమ,vఅధోక్షజ

నారసింహ, అచ్యుత

జనార్ధన, ఉపేంద్ర

హరి, శ్రీకృష్ణ.


ఈ నాలుగు ఆయుధాలను అన్ని విధాలుగాను మార్చుకోవటానికి '24 పక్షాలు' అంటే ‘12 నెలలు’      అనగా ‘ఒక సంవత్సరం’పడుతుంది.

Thursday, July 28, 2022

జయమునిచ్చు మంత్రం

 ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించి స్వామికి ఒక్క కొబ్బరి కాయ పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి ఒక్క సారిగా మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది!!  మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లల కు పానకం వడపప్పు పంచండి చాలు ఉప్పొంగిపోతారు మారుతి! 

ఇది సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్య నూ లక్ష్మణుడు ని సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం ఇది!!


జయత్యతి బలో రామః 

లక్ష్మణస్య మహా బలః !

రాజా జయతి సుగ్రీవో 

రాఘవేణాభి పాలితః !!


దాసోహం కౌసలేంద్రస్య 

రామస్యా క్లిష్ఠ కర్మణః !

హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజః !!


నరావణ సహస్రం మే 

యుధ్ధే ప్రతిబలం భవేత్ !

శిలాభిస్తు ప్రహారతః

పాదపైశ్చ సహస్రశః !!


అర్ధయిత్వాం పురీం లంకాం 

మభివాద్యచ మైథిలీం !

సమృధ్ధార్థ్యో గమిష్యామి 

మిషతాం సర్వ రక్షసాం !!


అర్థం : మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు.

శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుధ్ధ రంగమున రంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశన మొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను.

ఇది పఠించిన వారికి జయం తధ్యం

జయ శ్రీ రామ ..శుభమ్ భూయాత్


Sunday, July 24, 2022

ఏ నక్షత్రానికి ఏ గణపతి స్వరూప ఆరాధన చేయాలి

 1. అశ్విని  -- ద్వి ముఖ గణపతి ‌

2. భరణి -- సిద్ద గణపతి.

3. కృత్తిక - ఉఛ్ఛిష్ఠ  గణపతి .

4. రోహిణి - విఘ్న గణపతి ‌

5. మృగశిర - క్షిప్ర గణపతి.

6. ఆరుద్ర - హేరంబ గణపతి .

7. పునర్వసు - లక్ష్మి గణపతి. 

8. పుష్యమి - మహ గణపతి. 

9. ఆశ్లేష - విజయ గణపతి. 

10. మఖ - నృత్య గణపతి. 

11. పుబ్బ - ఊర్ధ్వ గణపతి. 

12 ఉత్తర - ఏకాక్షర గణపతి. 

13. హస్త - వరద గణపతి .

14. చిత్త -  త్య్రక్షర గణపతి. 

15. స్వాతి - క్షిప్రసాద గణపతి. 

16. విశాఖ - హరిద్ర గణపతి. 

17.అనూరాధ - ఏకదంత గణపతి. 

18. జ్యేష్ఠ - సృష్టి గణపతి .

19 మూల ఉద్దాన గణపతి. 

20.పూర్వషాఢ- ఋణ విమోచన గణపతి. 

21.  ఉత్తరాషాఢ - ధుండి గణపతి. 

22. శ్రవణం - ద్వి ముఖ గణపతి. 

23. ధనిష్ట - త్రిముఖ గణపతి. 

24. శతభిషం - సింహ గణపతి. 

25. పూర్వాభాద్ర - యోగ గణపతి. 

26. ఉత్తరాభాద్ర - దుర్గా గణపతి. 

27. రేవతి - సంకట హర గణపతి.           

పై గణపతి ఆరాధన వలన మన పూర్వ జన్మ కర్మల నుండి బయట పడి భగవంతుని అనుగ్రహం పోందుతాము. అలాగే మన ఆత్మ ద్వాదశ జ్యోతిర్లింగాలు కు ముడి పడి వుంది. పై గణపతులు మరియి,నక్షత్రాలు యెక్క అనుబంధం అర్దం చేసుకుంటేనే ద్వాదశ భావాల అర్థం

Friday, July 15, 2022

తెలుగు భాష

 Telugu rani andaru chadivinchukovali.ఒక తమిళ వ్యక్తి రాసిన వ్యాసాన్ని యధాతధంగా.....

నా మాతృ భాష తమిళ భాష. దాని అర్థం ఇతర భాషల ను గురించి తెలియదని కాదు. తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.

తెలుగు మాతృ భాష గా ఎవరికి వున్నదో, తెలుగు భాష ను ఎవరు ప్రేమిస్తున్నారొ, తెలుగు గురించి ఎవరు తెలుసుకుందాము అనుకుంటున్నారో వారి కోసం కొన్ని విషయాలు.

1. తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి  వుంది.

2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది. మొదటి లిపిగ కొరియన్ భాష.

3. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు వుత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలన భాష ల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.

4. శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.

5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.

6.  ఇటాలియన్ భాష లాగానే   తెలుగు భాష లో కూడా  పదాలు హల్లు శబ్దం తో అంతమౌతాయని 16 వ శతాబ్దంలో ఇటలీ కి  చెందిన  నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే  తెలుగు భాషను " ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్". అని అంటారు .

7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు. ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానం ను పొందింది.

8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. హిందూ పురాణాల ప్రకారం  త్రిలింగక్షేత్రాలు నైజం ప్రాంతం లోని కాళేశ్వరం, రాయలసీమ లోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరమ్ ల మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.

9. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాష లో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దం తో పూర్తి అవుతుంది.

10. తెలుగు భాష లో వున్న అన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోన లేవు.

11. తెలుగు భాష ను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.

12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.

13. 200 సం. ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతే.

14. రామాయణ మహభారతాలు లో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాష సాహిత్యం లో కూడా లేదు.

కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన వోకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.

15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగలో వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి తెలుగు ను  తన సామ్రాజ్యం లో అధికార భాష గా చేసాడు.

16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. 

తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకత ను అందిస్తుంది ఆనడం లో ఏమాత్రం సందేహం లేదు.

పై విషయాలు అన్నీ వొక తమిళ వ్యక్తి  ఆంగ్లం లో  తెలియజేసిన విషయాల ను అనువదించారు. కానీ ఇది నిజం. ఇంత గొప్ప మన భాషను మన భవి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరం పై వుంది. తెలుగు భాష ను చంపేసే తరం గా మనం వుండకూడదని నా భావన. 

ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యం, ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో గానీ మనం మాత్రం ఆంగ్ల భాష లో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆపదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇకనుంచి అయినా తెలుగు భాష పై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగు లో మాట్లాడుదాం. 

 ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాష ను బలిచేయనవసరం లేదు. 

తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం. 

అష్టభైరవులు - రూపాలు - మహిమలు

మనుషులుగా ఈ భూమ్మీద జన్మించి కష్టాలు, దుఃఖాలు అనుభవిస్తున్న జీవులు తమ దుఖాలను నివృత్తి చేసుకోవడం కోసం భైరవుడిని సేవించాలి. 

సతీదేవి శరీరత్యాగం చేసిన కారణంతో శివుడు దుఖాన్ని తట్టుకోలేక భైరవ రూపాన్ని ఆశ్రయించాడు.  కనుక భైరవుడిని సేవిస్తే శివున్ని సేవించినట్లే. 

"నేను భైరవ రూపంలో లోకానికి సుఖం చేకూర్చూతాను." అని సదాశివుడి వాక్యం. 

అసితాంగో రురుశ్చండహ్ క్రోధశ్చోన్మత్త భైరవ కపాలీ భీషణశ్చైవ సంహారశ్చాష్టభైరవాహ్!

*కాలభైరువుడికి ఎనిమిది రూపాలు ఉన్నాయి . 1.అసితాంగ భైరవుడు 

2.రురు భైరవుడు.

3. చండ భైరవుడు.

4.క్రోధ భైరవుడు.

5.ఉన్మత్త భైరవుడు.

6.కపాల భైరవుడు.

7. భీషణ భైరవుడు.

8.సంహార భైరవుడు.

ఈ ప్రతి ఒక్క రూపానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.

 

*1. అసితాంగ భైరవుడు : 

 ఈయన నల్లని/బంగారు శరీరఛాయలో, శాంతి రూపంలో , దిగంబర శరీరంతో , మూడూ కళ్ళతో, బ్రహ్మీ శక్తితో కూడి నాలుగు చేతులతో ఉంటాడు. అక్షమాల, ఖడ్గం, కమండలం, పానపాత్ర నాలుగు చేతులలో ధరిస్తాడు. ఈయన హంసవాహనుడు. వరాలనిస్తాడు భూషణాధికారి.

సరస్వతి ఉపాసకులు అసితాంగ భైరవుని అర్చించి సిద్ధి పొందాలి. 

ఆ తరువాతే సరస్వతీ ఉపాసన సిద్ధిస్తుంది. 

ఈయన బ్రహ్మ స్వరూపుడు. మహా సరస్వతికి క్షేత్రపాలకుడు . ఈయన తూర్పు దిశకు అధిపతి. 


*2. రురు భైరవుడు :  

ఈయన స్వచ్చమైన స్పటికంలాగ తెల్లని శరీర ఛాయతో, మూడు కళ్లతో, నాలుగు చేతులతో, దిగంబర శరీరంతో, చిరునవ్వుతో  మహేశ్వరి శక్తి తో కూడిన కుమారరూపంతో వృషభ వాహనుడిగా ఉంటాడు.

నాలుగు చేతుల్లో కత్తి, టంకము, పాత్రను, లేడిని ధరించి ఉంటాడు. శ్యామల, ప్రత్యంగిర,  దశమహావిద్యలు మొదలగు ఉపాసకులు ముందు ఈయనని ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతోనే అమ్మవారి ఉపాసనలు సిద్ధిస్తాయి. ఈయన రుద్ర స్వరూపుడు.  రుద్రాణికి క్షేత్రపాలకుడు  ఈయన ఆగ్నేయ దిశకు అధిపతి.

 

*3 . చండ భైరవుడు : 

 ఈయన తెల్లని శరీర ఛాయతో, మూడు కళ్ళతో, నాలుగు చేతులతో, దిగంబరంగా, కౌమారి శక్తితో, శాంత కుమార రూపంలో నెమలి వాహనంతో ఉంటాడు. సుబ్రమణ్య ఉపాసకులు, కన్యకాపరమేశ్వరి ఉపాసకులు ముందుగా ఈయన ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతోనే ఈ ఉపాసనలు సిద్దిస్తాయి. ఈయన సుబ్రమణ్య స్వరూపుడు. సర్పదోషాలు ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు ఈయన్ని ఉపాసించాలి. ఈయన దక్షిణ దిశకు అధిపతి. 

 

*4. క్రోధ భైరవుడు:  

 ఈయన నీలి శరీర ఛాయతో, మూడు కళ్ళతో, నాలుగు చేతులతో, దిగంబర శరీరంతో,  వైష్ణవి శక్తితో కూడిన శాంత రూపంతో గరుడ వాహనారూడుడై ఉంటాడు. నాలుగు చేతుల్లో గద, చక్రం, పానపాత్ర, శంఖం ధరించి ఉంటాడు. వైష్ణవ ఉపాసకులు అంటే గరుడ, హనుమ, సుదర్శన, నారసింహ, వరాహ, కృష్ణ ఉపాసకులు ముందుగా ఈయన ఉపాసన చేయాలి. ఈయన విష్ణు స్వరూపుడు. నైరుతి దిశకు అధిపతి. 

 

*5. ఉన్మత్త భైరవుడు: 

 ఉన్మత్త భైరవస్వామి బంగారం లాగ పచ్చని శరీర ఛాయతో, మూడు కండ్లతో, నాలుగు చేతులతో, దిగంబరుడిగా, వారాహి శక్తితో కూడిన శాంత రూపంలో, అశ్వరూడుడై ఉంటాడు. నాలుగు చేతుల్లో రోకలి, కత్తి, కపాలము, వేటకత్తి ధరించి ఉంటాడు. వారాహి, కుబేర ఉపాసకులు ఈయన్ని ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతోనే ఈ ఉపాసనలు సిద్ధిస్తాయి. ఈయన వారాహి స్వరూపుడు . పశ్చిమ దిక్కుకి అధిపతి . 


*6 . కపాల భైరవుడు :  ఈయన ఎర్రని దేహకాంతితో , మూడు కళ్ళతో , నాలుగు చేతులు , దిగంబర శరీరంతో , ఇంద్రాణీ శక్తితో కూడిన శాంతమైన బలరూపంతో గజవాహనుడై ఉంటాడు . నాలుగు చేతుల్లో వజ్రం , ఖడ్గం , పానపాత్ర , పాశం ధరించి ఉంటాడు . భౌతిక సుఖ సంపదలు కావాల్సిన వారు ఈయన ఉపాసన చేయాలి . ఈ ఉపాసనతో ఈ లోకంలోనూ , స్వర్గలోకంలోను సుఖాలు సిద్ధిస్తాయి . ఈయన దేవరాజు ఇంద్ర స్వరూపుడు . స్వర్గ క్షేత్రపాలకుడు . ఈయన వాయువ్య దిశకు అధిపతి. 


*7. భీషణ భైరవుడు:  ఈయన ఎర్రని శరీర ఛాయతో , మూడు కళ్ళతో , నాలుగు చేతులతో , దిగంబర శరీరంతో , చాముండా శక్తితో , శాంత బాలరూపంతో , సింహ వాహనారూడుడై ఉంటాడు . నాలుగు చేతుల్లో శూలం , ఖడ్గం , కపాలము , ముద్గరం ధరించి ఉంటాడు . చండి , చాముండా ఉపాసకులు ఈయన్ని ఉపాసన చేయాలి . ఈయన అనుగ్రహంతో చండీ సప్తసతి సిద్ధిస్తుంది . ఈయన చాముండాకు క్షేత్ర పాలకుడు . ఈయన ఉత్తర దిశకు అధిపతి . 


*8 . సంహార భైరవుడు :  సంహార భైరవుడు మూడు కళ్లు , పది చేతులు కలవాడై , నాగ యజ్ఞోపవీతం ధరించి , దిగంబరంగా , బాల రూపంతో , కోరలు గల భయంకర వదనంతో , కుక్క వాహనంగా గలవాడై ఉంటాడు . చేతుల్లో శూలం , చక్రం , గద , ఖడ్గం , అంకుశం , పాత్ర , శంఖం , డమరుకం , వేటకత్తి , పాశం ధరించి ఉంటాడు . తాంత్రికులు కాపాలికులు, యామలులు, ముందుగా ఈయన్ని ఉపాసించాలి . ఈయన దయవల్లే తాంత్రిక షట్కర్మలు సిద్ధిసిద్ధించి ఫలవంతమౌతాయి. ఈయన సర్వశక్తి స్వరూపుడు . తంత్ర క్షేత్రపాలకుడు . ఈయన ఈశాన్య దిశకు అధిపతి. 


"దిగంబరాయ విద్మహే కాశీక్షేత్రపాలాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్"🙏


 లోకా సమస్తా సుఖినోభవంతు.

ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి

 ఇప్పుడు ఎవరు వైదికులు ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి ఈనాడు ఆనాటి వైదీకులు అనేవాళ్ళు ఉన్నారా ఈనాడు అం...