Friday, July 2, 2021

కర్మ ఎలా పనిచేస్తుంది

ఒక రాజు..తన ఆస్థానంలో ఉన్న ముగ్గురు మంత్రులను పిలిపించి..వారికి ఒక్కొక్క ఖాళీ గోనె బస్తాలను చేతికిచ్చి..అరణ్యంలోనికెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు, ఫలాలను అందులో నింపి..సాయంత్రం లోపు తీసుకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు.

ముగ్గురూ అరణ్యం లోనికెళ్లారు..

మొదటి మంత్రి ఆలోచించాడు..

రాజు గారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండిఉండాలి,కనుక మంచి పండ్లు తీసుకు వెళ్ళాలి,

అనుకుంటూ అరణ్యం అంతా తిరుగుతూ పండ్లు నింపసాగాడు.

రెండో మంత్రి ఆలోచన 

రాజు గారికి పండ్లకి కొదవ లేదు..

అయినా మాకు పంపారు..

సరే ఏదోలా బస్తా నింపేస్తే చాలు.

.అనుకుంటూ కంటికి కనిపించిన పండ్లు తాజా,వాడిన,పుచ్చిన భేదభావం లేకుండా నింపసాగాడు.

ఇక మూడో మంత్రిచాలా చతురంగాఆలోచించాడు..

రాజు గారికి చాలా పనులు..

పండ్ల అవసరం అతనికి లేదు.,

పై పైన చూస్తే చూడొచ్చు.బస్తా ఖాళీచేసి చూసే సమయం కూడా ఉండదు..

చూడనిదానికి కష్టపడి అడివంతా తిరగాల్సిన అవసరం ఏముంది..

అనుకుంటూ ఆకులు అలములతో బస్తానింపి..పైన కొన్ని పండ్లతో అలంకరించేసాడు..

సాయంత్రం ముగ్గురూ పండ్ల బస్తాలు తీసుకుని రాజుగారి ముందు హాజరయ్యారు.


మూడో మంత్రి ఊహించినట్లే..

రాజు గారు చాలా పనుల్లో తలమునకలై ఉన్నారు..

కనీసం బస్తాలు వంక చూడనైనా చూడకుండా సైనికులను ఆదేశించారు.


"ఈ ముగ్గురినీ చెరసాలలో నెల రోజుల పాటు వారి పండ్ల బస్తాలతో పాటు బంధించండి.

తినడానికి ఏమి ఇయ్యరాదు..

వారు తెచ్చిన పండ్లే వారికి ఆహారం"

ముగ్గురిని చెరసాలలో బంధించారు..

మొదటి మంత్రి..చక్కని తాజా పండ్లు మూలంగా ఎలాంటి ఆకలిబాధలు లేకుండా శిక్షాకాలం పూర్తిచేసి తిరిగి ఆస్థానానికి చేరుకున్నాడు.

రెండవ మంత్రి..కొన్నిరోజుల వరకు బాగానే తిన్నా..కుళ్ళిన,వాడిన పండ్లు మిగతా రోజుల్లో తిని తీవ్ర అస్వస్థతకు గురై మంచాన పడ్డాడు..శాశ్వతంగా.

మూడవ మంత్రి..పైపైన అలంకరించిన పండ్లతో 2 రోజులు గడిపి..ఆకులు,

అలములు తో మరో వారం పాటు మాత్రమే గడిపి..పైలోక యాత్రకు వెళ్ళిపోయాడు శిక్షాకాలం ముగిసే లోపే*..


కర్మ :మనం చేసిన పనులకు తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది..

*మంచి కర్మలకి మంచి,

చెడు/పాప కర్మలకు చెడు పర్యవసానాలు తప్పవు*. 

1000 గోవుల మంద ఉన్నా..

దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరికి ఎలా పోగలదో..

మంచి,చెడు కర్మలు కూడా అలానే మనల్ని వెదుక్కుంటూ వచ్చేస్తాయి.

కర్మ సిద్ధాంతం పనిచేసే తీరు ఇదే..

Tuesday, June 29, 2021

మన సమస్యలకి సుందరకాండ చూపుతున్న పరిష్కారాలు

సుందరకాండ అద్భుతమైన పారాయణం, ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు.. 

ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం కాండం మొత్తం పారాయణ చేయలేరు, అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది. పారాయణ నియమాలతో ఉంటుంది. 

ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.


1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి..

శ్లోకం.ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్

 లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||

21 దినములు, 108 సార్లు, శక్తి  కొలది తమలపాకులు, అరటిపళ్ళు నివేదన చేయాలి.


2. విద్యాప్రాప్తికి.

ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను . 

3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన


3. భూతబాధ  నివారణకు.

3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 30 దినములు పారాయణ చేయవలెను . 

1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన


4. సర్వ కార్య సిద్దికి.

64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు 40 దినములు పారాయణ చేయవలెను

శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను


5. శత్రు నాశనముకు.

51 వ సర్గ అతినిష్ఠతో 2 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. 

శక్తి  కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను.


6. వాహనప్రాప్తికి.

8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు 27 దినములు పారాయణ చేయవలెను. 

శక్తి  కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.


7. మనశాంతికి.

11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. 

అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.


8. స్వగృహం కోరువారికి.

7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి 40 దినములు పారాయణ చేయవలెను.  

అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను.


9. యోగక్షేమాలకు.

13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 27 దినములు పారాయణ చేయవలెను. 

శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.


10. ఉద్యోగప్రాప్తికి.

63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను . 

శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.


11. రోగ నివారణకు.

34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము, 21 దినములు పఠించవలెను. 

శక్తి  కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను.


12. దుఃఖనివృత్తికి.

67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. 

శక్తి కొలది అరటిపళ్ళు,ఖర్జూరము నివేదన చేయవలెను.


13. దుస్వప్న నాశనానికి

27వ సర్గ ఏకాగ్రతతో 1 సారి ప్రతిదినము పఠించవలెను

శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.


14. దూరముగా ఉన్న ఆప్తులు క్షేమమునకు.

33 నుండి 40 వ సర్గ వరకు 1 సారి , 21 దినములు నిష్ఠతో పఠించవలెను . 

శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.


15. ధనప్రాప్తికి.

15వ సర్గ ఏకాగ్రతతో 1 సారి  40 దినములు పఠించవలెను. 

అరటిపళ్ళు, పటిక బెల్లం , మరియు  రామాయణం లో అయోధ్యకాండలో యాత్రాదానము 32 వ సర్గ 1 సారి, 40 దినములు పఠించవలెను. 

శక్తి  కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను . ( అగస్త్య , పరాశర , ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).


16. దైవాపచారా ప్రాయశ్చిత్తం.

38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు 27 దినములు పఠించవలెను. 

శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను.


17. బ్రహ్మజ్ఞానము కలుగుటకు.

19 వ సర్గ అతినిష్ఠతో రోజుకు ఒకసారి 1 సంవత్సరము పఠించవలెను. 

శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.


18. ఏలిననాటి శనీ దోష పరిహారమునకు.

సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో 1సారి 

68 రోజులు చదువవలెను. 

నివేదన రోజూ కొబ్బరికాయ సత్ఫాలితమునిచ్చును.


19. కన్యా వివాహమునకు.

9 దినములలో ఒకసారి పూర్తిగా 68 దినాలలో పఠించవలెను. సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు 

ప్రతిరోజు పఠించవలెను.  

అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయవలెను.


20. విదేశీ యానమునకు.

1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5  సార్లు 30 దినములు పఠించవలెను. 

శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.


21. ధననష్ట నివృత్తికి.

55వ సర్గ నిష్ఠతో 3  సార్లు 30 దినములు పఠించవలెను . 

శక్తి  కొలది అరటిపళ్ళు,పనస నివేదన చేయవలెను.


22. వ్యాజ్యములో విజయమునకు.

42 సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు, 21 దినములు పఠించవలెను. 

శక్తి  కొలది అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయవలెను.


23. వ్యాపారాభివృద్ధికి.

15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు 21 దినములు పఠించవలెను. 

శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.


24. పుత్ర సంతానానికి.

ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో 68 రోజులు పారాయణ చేయవలెను . 

శక్తి  కొలది అరటిపళ్ళు , కొబ్బరికాయ ,నివేదన చేయవలెను. 

శక్తి  కొలది తమలపాకులతో అర్చన చేయవలెను . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును.


25. ఋణ విముక్తికి.

28 వ సర్గ చాలా నిష్ఠగా రోజుకి 1 సారి 41 రోజులు పఠించవలెను. 

శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

Saturday, June 26, 2021

అసలు పుట్టలో పాలు పోస్తే పిల్లలు పుడతారు అనే దాని వెనక సైన్స్

అసలు పుట్టలో పాలు పోస్తే పిల్లలు ఎలా కలుగుతారనే పెద్ద సంశయము*.

పంచమి/నాగుల చవితి నాడు పుట్టలకు పూజ చేయించడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు.

పాము పుట్టలని పాములు ఎర్పరచవు, చెదలు ఏర్పరుస్తాయి.

వాటిలో ఈ పాములు చేరి వానాకాలములో పిల్లలను పెట్టి, వేరే చోటికి వెళ్తాయి.

చెదపురుగు పుట్ట పెట్టేటప్పుడు దాని నోటి నుంచి ఒక ద్రవము వస్తుంది.

ఆ ద్రవము మెత్తటి మట్టినందు కలిసి అది గట్టి పడుతుంది.

ఎంత గట్టి పడుతుంది అంటే వానలు వచ్చినా ఆ మట్టి కరుగదు.

ఈ మెత్తటి మట్టిలో రాయి రప్పలు ఉండవు. ఇదే దీని విశిష్టము.

వానాకాలములో ఈ పుట్టలందు సంచరించు పాముల నుండి విడుదల అగు రేతస్సు, రజస్సు ఈ మట్టిలో కలిసి ఉంటుంది.

పాము గుడ్లు పెట్టి అది పిల్లలను చేయదు.

ఎండ వేడికి అవి పిల్లలగును. ఇది ప్రకృతి నియమము.

ఈ మట్టిలో కలిసిన ఈ పదార్దములు మనము పోయు పాలు, తేనే, వివిధ రకాల ఫలములు కలిసి సువాసనల వెదజల్లును.

ఆ వాసనలు వలన మన శరీరమునందు తగు హార్మోనులు ఉత్పత్తి అయి పిల్లలు పుట్టుటకు దోహద పడుతుంది 

ఆయుర్వేద శాస్త్రములో నాగు పాము కుబుసములో అరటిపండు కలిపి మందుగా వాడుట ఉంది.

ఇది ప్రయోగశాలలో పరిశీలించడం జరిగింది అదులో తెలిసిన విషయమే  ఏమితంటే చర్మ రోగాలు నయము చేయుటలో ఈ మట్టి ఎంతో ఉపయోగ పడును.

ప్రత్యేకముగా నాగరు అనే చర్మ వ్యాధికి. ఇది ప్రకృతి సిద్ధమైన వైద్య.

రావి చెట్టుకింద ప్రతిష్ఠించబడిన నాగవిగ్రాహాలకి కూడా పూజచేస్తుంటారు.

 ఆయుర్వేద శాస్త్రములో గర్భము నిలువకున్న ఈ చెట్టు వేరుతో తయారు చేసిన మందులు వాడుతారు.

అంతే కాక ఈ వృక్షము అరుణోదయ కాలములో దాని వేళ్ళ నుండి ఘనీభుతమైన అమ్ల జనకములు విడుదల చేస్తాయి.

దీనిని ఒజోన్స్ అంటారు. ఈ ఒజోన్స్ మనోహరమైన వాసనలు మానవుడి ఆరోగ్యం మరియు స్త్రీలమీద మంచి ప్రభావము చూపిస్తాయి.

అందువలన రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేయడం మొదలైన నియమాలు చేసారు.

40 రోజుల పాటు ఉదయమునే రావి చెట్టు ఆలింగనము, ప్రదక్షిణాలు చేసిన జననేంద్రియ దోషములు తొలగి, గర్భము ధరించుటకు సహాయకారిగా ఉంటుందని విశ్వసిస్తారు.

నాగుపాము మనిషి వెన్ను పాము ఆకారములో ఉంటుంది.

నాగ ప్రతిమను శాస్త్రోక్తముగా రావి చెట్టు మొదలులో ప్రతిష్ఠిస్తారు.

ప్రతిష్ఠించేసమయంలో పంచరత్నాలు, పంచాపల్లవములు, నవధాన్యములు, గో పంచాకాలతో ప్రతిష్ఠించుతారు.

నాగ ప్రతిమ చేసిన రాయి పురుష జాతిథి అయి ఉండాలి.

రత్నముల ద్వారా చెట్టునుండి విసర్జించబడిన ఒజోన్స్ శిలా ముఖంతరముగా మానవుని శరీరమీద ప్రభావము చూపుతుది.

అందువలన పంచమి/నాగుల చవితి  నాడు నాగంద్రుని పూజించడం మన హిందు సంప్రదాయం.

వీనిని తెలిసి ఆచరించినా, తెలియక ఆచరించినా మంచి ఫలితములు తప్పక పొందవచ్చును.

దేవాలయములో నాగా అష్టోత్తరములు, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.

చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు, రాయి - రప్ప, చెట్టు -చేమ, వాగు-వరద, నీరు -నిప్పు, అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కుతి హిందువులది .

మానవ దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే.

వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానువు.

వాసుకి పమేస్వరుడి కంఠాభరణం.

వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు.

ఈ విధంగా బ్రాహ్మణులూ, ఋషులు, మునులు ... మానవజాతిని సన్మార్గములో పయనించేటట్లు చేసారు.

Thursday, June 24, 2021

పితృదేవతలు ముగ్గుదాటుకుని రాలేరట

ఏ ఇంటిముందు ఉదయాన్నే కళ్లాపిచల్లి ముగ్గుపెట్టి వుంటుందో ఆ ఇంటికి రావడానికే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. ఈ కారణంగానే ఉదయాన్నే వాకిలి శుభ్రంగా ఊడ్చి ఆవుపేడతో కళ్లాపిచల్లి బియ్యపు పిండితో ముగ్గు పెడుతుంటారు. 

ఇక పండుగ రోజుల్లో ఈ ముగ్గు మరింత అందంగా ఉండేలా శ్రద్ధ తీసుకుంటూ వుంటారు. పూర్వకాలం నుంచి కూడా ఇది మన ఆచారవ్యవహారాల్లో ఒక భాగమైపోయింది. 

అయితే ఇంట్లో పితృ కార్యాలు నిర్వహించవలసి వచ్చినప్పుడు, ఇంటిముందు ముగ్గు పెట్టాలా వద్దా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంటుంది. శాస్త్రం మాత్రం పితృ కార్యం నిర్వహించే రోజున ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టకూడదని చెబుతోంది. ముగ్గులేని వాకిట్లోకి రాకుండా లక్ష్మీదేవి ఎలా వెనుదిరిగి పోతుందో, ముగ్గువేసిన వాకిట్లోకి రాకుండా పితృదేవతలు కూడా అలానే వెనుదిరిగిపోతారని అంటోంది

పితృదేవతలు ముగ్గుదాటుకుని రాలేరట. అందువల్లనే పితృకార్యం నిర్వహించే రోజున ముగ్గు పెట్టకూడదని పండితులు అంటున్నారు. వాకిట్లో ముగ్గులేని ఇళ్లలోకి ప్రవేశించడానికి దుష్టశక్తులు సిద్ధంగా ఉంటాయని అంటారు.

అందువలన పితృకార్యం నిర్వహణ పూర్తి అయిన తరువాత, వెంటనే వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గుపెట్టాలని చెబుతుంటారు. దీనిని బట్టి ముగ్గు అనేది ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాదు, ఇంటికి రక్షణని కూడా ఇస్తుందని గ్రహించాలి.

Tuesday, June 22, 2021

షష్టిపూర్తి అంటే ఏంటీ ? ఎందుకు చేస్తారు ?

మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది. 60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది షష్టిపూర్తి. ప్రతివారికీ మృత్యువు 60 వ యేట ఉగ్రరథుడు అను పేరుతో , 70 వ యేట భీమరథుడు అను పేరుతో , 78 వ యేట విజయరథుడు అనుపేరుతో ఎదురుచూస్తుంటాడు. ఆరోగ్య సమస్యలకు తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.

బృహస్పతి , శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.

మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి.

షష్టిపూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము ఆయుష్కామనయజ్ఞము

పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పధ్ధతిని ఇలా చెప్పారు.

'' తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీచి వాటిమీద అయిదు గీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు. వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం " అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను , 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు.

పక్షములను , తిదులను వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు , చంద్రుడు , అంగారకుడు, బుధుడు , గురువు , శుక్రుడు , శనిని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని , జలము , భూమి , విష్ణువు ఇంద్రుడు , ప్రజాపతి లని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు శివుడు , దుర్గ , కుమారస్వామి , బ్రహ్మ - ఇంకా ఏకాదశ రుద్రులు , నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతో వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు.

అపమృత్యు నివారణార్థం హోమాల్ని , జపాలని కుడా చేస్తారు. తదుపరి బ్రహ్మణులను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు. పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు.

పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక. బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకొనే అపురూప సందర్భం షష్టిపూర్తి. 

Friday, June 18, 2021

భగవద్గీత 101 శ్లోకాల అర్ధాలు

1. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారంశము, భక్తుడైన అర్జునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారతయుద్దము జరుగరాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించెను. కానీ, ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్ధములాయెను. అటుపిమ్మట శ్రీకృష్ణుడు పార్దునకు సారధియై నిలిచెను.

యుద్దరంగమున అర్జునుని కోరిక మేరకు రధమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయం ద్రవించి.

2. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయాము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్భాణము లను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మా...

౩. దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు, శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు.

4. జీవునకు దేహమునందు బాల్యము, యౌవనము, ముసలితనము యేట్లో మరొక దేహమును పొందుటకు కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందరు.

5. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రములను వదలి నూతన వస్త్రములను ధరించునో అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది.


6. ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రములు చేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు అర్పివేయును సమర్ధము కాదు. ఆత్మ నాశనము లేనిది.


7. పుట్టినవానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.


8. యుద్దమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జునా! యుద్దమును చేయు కృతనిశ్చయుడవై లెమ్ము.


9.కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు.


10.దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడును, రాగము, భయము, క్రోధము పాయిన వాడును, స్థితప్రజ్ఞుడని చెప్పబడును.


11.విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాణి యందను రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుద్ద్దిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. 


  

12. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుస్టారము, బ్రహ్మప్రాప్తిసాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు.


13. అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసుకలు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్దిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను, ముక్తి కలుగు చున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది.


14. అన్నము వలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవమగును.  


   

15. పార్దా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమును బట్టి, యెవడు అనుసరింపడో, వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్ధుడు, జ్ఞానీ కానివాడు సదా కర్మల నాచరించుచునే ఉండవలెను.


16. ఉత్తములైన వారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును.


17. అర్జునా! నీ వోనర్చు సమస్త కర్మలనూ నా యందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై, అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్దము చేయుము.


18. చక్కగా అనుస్టింపబడిన పరధర్మము కన్న, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది.


19. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామముచేత జ్ఞానము కప్పబడి యున్నది.


20. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్దినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొఱకు ప్రతీయుగమునా అవతారము దాల్చుచున్నాను.


21. అనురాగము, భయము, క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.


22. ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియ కోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించు చున్నాను కానీ, ఏ ఒక్కనియందు అనురాగాముకాని, ద్వేషముగాని లేవు.


23. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టివానిని పండితులని విద్వాంసులని పల్కుదురు.


24. యగ్నపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము గూడ బ్రహ్మమనియే తలంచవలయును.


25. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును.


26. కర్మ సన్యాసములు రెండునూ మోక్షసోపాన


సాధనములు. అందు కర్మ పరిత్యాగము కన్నా, కర్మానుష్టానమే శ్రేష్ఠమైనది.


27. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పనముగా కర్మల నాచరించునో, అతడు తామరాకుకు నీటిబిందువులు

అంటని రీతిగా పాపమున చిక్కుబడదు.


28. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును జూపును.


29. విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందును శునకము శునక మాంసము వొండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి వుందురు.


౩౦. దేహత్యాగము నకు ముందు యెవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించునో, అట్టివాడు యోగి అనబడును.


31. ఎవడు ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంబిమపజేసి, మనస్సును, బుద్దిని, స్వాధీన మొనర్చుకొని, మోక్షాసక్తుడై యుండునో అట్టివాడే ముక్తుడనబడును.


32. సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగాను, సకల ప్రపంచ నియామకునిగను, నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు.


౩౩. అర్జునా! సన్యాసమని దేనినందురో, దానినే కర్మయోగ మనియు అందురు. అట్టి యెడ సంకల్పత్యాగమొనర్పనివాడు యోగి కాజాలడు.


౩4. యుక్తాహార విహారాదులు, కర్మాచరణము గలవానికి ఆత్మసంయమ యోగము లభ్యము.


35. గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును.


౩6. సకలభూతము లయందూ సమదృష్టి కలిగినవాడు, అన్ని భూతములు తనయందును, అన్ని భూతములయందును చూచుచుండును.


37. అర్జునా! ఎట్టివానికైనను, మనస్సును నిశ్చలముగా నిల్చుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాసవైరాగ్యములచేత నిరోధింప వచ్చును.


38. అర్జునా! పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో ఎవరు సేవించి, భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు.


39. వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ది కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యదార్ధముగా తెలుసుకోన గలుగుచున్నాడు.


40. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి యెనిమిది విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము.


41. అర్జునా! నా కన్నా గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని, మరేదియు ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది.


42. భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, ఏళ్ళ భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము.


43. పార్దా! త్రిగునాత్మకము, దైవసంబందమగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభసాధ్యము.


44. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్నా శ్రయించుచున్నారు.


45. జ్ఞాన సంపంనుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను శరణము నొందుచున్నాడు.


46. ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు.


47. అర్జునా! ఎవడు అభ్యాసయోగాముతో, ఏకాగ్రచిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణపురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువుకన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారమున కన్నా ఇతరుడు.


48. ఇంద్రియగోచరము కాని పరబ్రహ్మపదము శాశ్వతమైనది. పునర్జన్మ రహితమైన ఆ ఉత్తమపదమే పరమపదము.


49. జగత్తునందు శుక్లకృష్ణములనెడి రెండు మార్గములు నిత్యములుగా నున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మ రాహిత్యము, రెండవదాని వలన పునర్జన్మము కలుగుచున్నవి.


5౦. యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యగ్నతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు.


51. పార్దా! ప్రళయకాలమునందు సకల ప్రాణులును, నాయందు లీనమగుచున్నవి, మరల కల్పాదియందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను.


52. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును నన్నే ధ్యానించుచుండునో, అట్టివాని యోగ క్షేమములు నేనే వహించుచున్నాను.


53. ఎవడు భక్తితో నాకు పత్రమైనాను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో, అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.


54. పార్దా! నాయందు మనస్సు లగ్నముచేసి యెల్లకాలము యందు భక్తీ శ్రద్దలతో స్థిరచిత్తుడవై పుజించితినేని నన్నే పొందగలవు.


55. కశ్యాపాది మహర్షి సప్తకము, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి. పిమ్మట వారివలన ఎల్లలోకమందలి సమస్త భూతములు జన్మించును.


56. పండితులు నాయందు చిత్తముగలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందము ననుభవించు చున్నారు.


57. సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు నాశములకు నేనే కారకుడను.


58. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే.


59. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే.


6౦. లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తెజోభాగము వలననే సంభవములు.


61. పార్దా! దివ్యములై, నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కనులార దర్శింపుము.


62. ప్రభో కృష్ణా! దేవా! ఎల్లదేవతలు, ఎల్లప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకీ మొదలగుగాగల యెల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యుయు నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై, ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నా యందు దయముంచి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణా! ప్రసన్నుడవు కమ్ము.


6౩. అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్దము నకు సిద్దపడినవారిని నీవు చంపకున్ననూ బ్రతుకగల వారిందెవ్వరును లేరు.


64. ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాది యోధ వీరులు నాచే సంహరింప బడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము.


65. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి, కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింప గోరుచున్నాను కృష్ణా.


66. అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు.


67. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు.


68. అభ్యాస యోగము కన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మఫలత్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి, మోక్షప్రాప్తి సంభవించుచున్నది.


69. ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాతరహితుడై, భయమును వీడి, కర్మఫలత్యాగియై నాకు భక్తుడగునో, అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు.


7౦. శత్రుమిత్రుల యందును, మానావ మానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును సమబుద్ది కలిగి సంగరహితుడై, నిత్యసంతుస్టుడై, చలించని మనస్సు గలవాడై, నా యందు భక్తిప్రవత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు.


71. అర్జునా! దేహము క్షేత్రమనియు, దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు.


72. ఆత్మజ్ఞానము నందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గాములనియు, వానికి ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును.


7౩. ప్రకృతిని ‘మాయ’ యని యందురు. 

అది శరీర సుఖ దుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు, ఆ సుఖదుఃఖాదులను అనుభవించు చుండెను.


75. అర్జునా! గుణనాశరహితుడైనవాడు పరమాత్మ, అట్టి పరమాత్మ దేహాంతర్గుడయ్యును. కర్మలనాచారించువాడు కాడు.


76. పార్దా! సుర్యుడోక్కడే యెల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింప జేయుచున్నాడో, ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు ఏళ్ళ దేహములను ప్రకాశింపజేయుచున్నాడు.


77. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీస్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించు చున్నాను.


78. అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్లా చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను తండ్రి వంటివాడను.


79. అర్జునా! త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటంజేసి, సుఖ జ్ఞానాభిలాషల చేత, ఆత్మను దేహమునందు బందించు చున్నది.


8౦. ఓ కౌంతేయా! రజో గుణము కోరికలయందు అభిమానము, అనురాగము పుట్టించి, ఆత్మను బందించుచున్నది.


81. అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము, అది సర్వప్రాణులను మొహింపజేయునది. ఆ గుణం, మనుజుని ఆలస్యముతోను, అజాగ్రత్తతోను, నిద్రతోను బద్దునిజేయును.


82. మానావ మానములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతు డందురు.


8౩. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వర్థవృక్షము అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టిదాని నెరింగినవాడే వేదార్ధసార మెరింగినవాడు.


84. పునరావృత్తి రహితమైన మోక్షపధము, సుర్యచంద్రాద్నుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది.


85. దేహులందు జటరాగ్నిస్వరూపుడనై, వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయు చున్నాను.


86. పార్దా! సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కావరము లేకుండుట మొదలుగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠీనపు మాటలాడుట, అవివేకము, మొదలగు గుణములు రాక్షసాంశమున బుట్టిన వారికుండును.


87. కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశామును చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున, వానిని వదలి వేయవలెను.


88. శాస్త్రవిషయముల ననుసరింపక యిచ్చామార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్దులను పొందజాలడు. పరమపదమునందజాలడు.


89. జీవులకు గల శ్రద్ధ, పూర్వజన్మ వాసనాబలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా నున్నవి.


9౦. సత్వగుణులు దేవతలను, రాజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుచుందురు.


91. ఇతరుల మనస్సుల నొప్పింపనిదియు, ప్రియము, హితములతో కూడిన సత్యభాషనము, వేదాద్యన మొనర్చుట, వాచకతపస్సని చెప్పబడును.


92. జ్యోతిష్టోమాది కర్మల నాచరింప కుండుట సన్యాసమనియు, కర్మఫలము, ఈశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు.


9౩. కర్మములు- ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని మూడు విధములు. కర్మఫలము కోరినవారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నాడు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు.


94. అర్జునా! కర్మమోక్షమార్గముల, కర్తవ్య భయాభయముల, బంధమోక్షముల, ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్వగుణ సముద్భనమని ఎరుగుము.

95. ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయ ముందన్నవాడై, అంత్రగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయు చున్నాడు.    

96. సమస్త కర్మల నాకర్పించి, నన్నే శరణుబొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము. 

97. ఎవడు పరమొత్క్రష్టమైనదియు, పరమ రహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకుపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమున కర్హుడు.

98. ధనంజయా! పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా?

99. కృష్ణా! అచ్యుతా! నా అవివేకము నీ దయవలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నాకు సందేహములన్నియు తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను.  

100. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్దారియగు అర్జునుడు ,ఎచట నుందురో, అచ్చట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి యుండును.

101. గీతాశాస్త్రమును ఎవరు పటింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొందుదురు.

ఆదిత్య హృదయం స్తోత్ర ఫలితం

 రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వస్తాయి.


ఆదిత్య హృదయంలో మెత్తం 30 శ్లోకాలు ఉన్నాయి.


మొదటి రెండు శ్లోకాలు అగస్త్యుడు , శ్రీ రాముడి వద్దకు వచ్చుట

3 నుండి 5 శ్లోకాలు : ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.

6 నుండి 15 శ్లోకాలు : సూర్యుడంటే బయటకు వ్యక్తమవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంత స్వరూపము ఒక్కటే

16 నుండి 20 శ్లోకాలు : మంత్ర జపం

21 నుండి 24 శ్లోకాలు : సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు

25 నుండి 30 శ్లోకాలు : పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయ వలసిన విధానం, సూర్యభగవనుడు శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం


ఆదిత్య హృదయం


తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం 1


దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం

ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః 2


అగస్త్య ఉవాచ:


రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం

యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి 3


ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం

జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం 4


సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం

చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం 5


రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం

పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం 6


సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః

ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః 7


ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః

మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః 8


పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః

వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః 9


ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్

సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః 10


హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్

తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్ 11


హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః

అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్ 12


వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః

ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః 13


ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః

కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః 14


నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః

తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే 15


నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః

జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః 16


జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః

నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః 17


నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః

నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః 18


బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః 19


తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె

కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః 20


తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే

నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే 21


నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 22


ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః

ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం 23


వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ

యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమ ప్రభుః 24


ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ

కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః 25


పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం

ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి 26


అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి

ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం 27


ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా

ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్ 28


ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ 29


రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్

సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్ 30


అథ రవి రవదన్నిరీక్ష్య రామం

ముదితమనాః పరమం ప్రహృష్యమానః

నిశిచరపతి సంక్షయం విదిత్వా

సురగణమధ్యగతో వచస్త్వరేతి.ఓం శనైశ్చరాయనమః

జగన్నాథ - రథయాత్ర సంపూర్ణ వివరాలు

 1) పూరి మందిరం పేరు ఏమిటి?( శ్రీ మందిరం ) 2) రథయాత్ర  ప్రారంభమయ్యే తొలితిధి ఏది?( ఆషాడ శుద్ధ విదియ ) 3) పూరీ మందిరాన్ని వదిలి ఈ తొమ్మిది రో...