Thursday, March 19, 2020

శీతలాష్టకం

అస్య శ్రీశీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః| అనుష్టుప్ చందః| శీతలా దేవతా| లక్ష్మీర్బీజం | భవానీ శక్తిః| సర్వవిస్ఫోటకనివృత్యర్థే జపే వినియోగః ||

ఈశ్వర ఉవాచ-
వన్దేఽహం శీతలాం దేవీం రాసభస్థాం దిగంబరాం |
మార్జనీకలశోపేతాం శూర్పాలంకృతమస్తకామ్ || ౧ ||

వన్దేఽహం శీతలాం దేవీం సర్వరోగభయాపహాం |
యామాసాద్య నివర్తేత విస్ఫోటకభయం మహత్ || ౨ ||

శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహపీడితః |
విస్ఫోటకభయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి || ౩ ||

యస్త్వాముదకమధ్యే తు ధ్యాత్వా సంపూజయేన్నరః |
విస్ఫోటకభయం ఘోరం గృహే తస్య న జాయతే || ౪ ||

శీతలే జ్వరదగ్ధస్య పూతిగంధయుతస్య చ |
ప్రనష్టచక్షుషః పుంసః త్వామాహుర్జీవనౌషధమ్ || ౫ ||

శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్ |
విస్ఫోటకవిదీర్ణానాం త్వమేకాఽమృతవర్షిణీ || ౬ ||

గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణాం |
త్వదనుధ్యానమాత్రేణ శీతలే యాంతి సంక్షయమ్ || ౭ ||

న మన్త్రో నౌషధం తస్య పాపరోగస్య విద్యతే |
త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్ || ౮ ||

మృణాలతన్తుసదృశీం నాభిహృన్మధ్యసంస్థితాం |
యస్త్వాం సంచింతయేద్దేవి తస్య మృత్యుర్న జాయతే || ౯ ||

అష్టకం శీతలాదేవ్యా యో నరః ప్రపఠేత్సదా |
విస్ఫోటకభయం ఘోరం గృహే తస్య న జాయతే || ౧౦ ||

శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తిసమన్వితైః |
ఉపసర్గవినాశాయ పరం స్వస్త్యయనం మహత్ || ౧౧ ||

శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా |
శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమో నమః || ౧౨ ||

రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనందనః |
శీతలావాహనశ్చైవ దూర్వాకందనికృంతనః || ౧౩ ||

ఏతాని ఖరనామాని శీతలాగ్రే తు యః పఠేత్ |
తస్య గేహే శిశూనాం చ శీతలా రుఙ్న జాయతే || ౧౪ ||

శీతలాష్టకమేవేదం న దేయం యస్యకస్యచిత్ |
దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధాభక్తియుతాయ వై || ౧౫ ||

ఇతి శ్రీస్కాందపురాణే శీతలాష్టకం ||

Thursday, March 12, 2020

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

లోకంలో చిన్న చిన్న పనులు చేసే వారిని ఆవిష్కర్తలుగా మనం పిలుస్తూ ఉంటాం.

ఆ కోవలో చూస్తే.. శివుడు ఎన్నో విషయాలను ఈ ప్రపంచానికి అందించిన ఆద్యంతరహితుడు.

 "ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్‌’’ ..అని చెప్పింది ఈశావాస్యోపనిషత్‌!

ఈ జగత్తులో సర్వం ఈశ్వరునిచే ఆవృతమై ఉందని ఉపనిషత్‌ వాక్యానికి అర్థం.

సమస్త చరాచర ప్రపంచమూ ఈశ్వరమయం. మానవుల్లోని సృజనశక్తికి, భావవ్యక్తీకరణకు ఆధారం భాష.

అలాంటి భారతీయ భాషలకు మూలమైన 14 మహేశ్వర సూత్రాలు పరమశివుడు తన డమరు నాదం నుండి సృష్టించాడు.

 శివపార్వతుల కల్యాణ సమయంలో హిమవంతుడు.. శివుడి ప్రవర అడిగినప్పుడు ‘నాదం శివమయం’ అని సాక్షాత్తూ నారదుడు హిమవంతుడికి చెప్పాడు.

వర్ణ సమామ్నాయం అందించిన శివుడికి మానవులు రుణపడి ఉన్నారు. అందుకు కృతజ్ఞతగానే అక్షరాభ్యాసం నాడు మనం మన పిల్లలతో.. ‘‘ఓం నమఃశివాయ సిద్ధం నమః’’ అని మొదటగా రాయిస్తూ ఉంటాం.

అలాగే యోగవిద్యను మొదట పార్వతీదేవికి బోధించి.. స్త్రీలకు బ్రహ్మవిద్యోపదేశానికి మార్గదర్శి అయ్యాడు.

 తంత్రాలను సంస్కరించి అందులోని రహస్యాలను జగత్తుకు అందించాడు.

ప్రపంచంలోని సంగీత విద్యకంతా మూలం సప్తస్వరాలు.

 అందులోని:-

🏵షడ్జమం(నెమలి)
🏵రిషభం (ఎద్దు)
🏵గాంధారం (మేక)
🏵మధ్యమం (గుర్రం)
🏵పంచమం (కోకిల)
🏵దైవతం (కంచరగాడిద)
🏵నిషాదం (ఏనుగు)..

ఈ ఏడింటి ధ్వనుల స్వభావంతో సంగీతవిద్యను శివుడు ఆవిష్కరించాడు.

 ‘శివ తాండవం"తో జగత్తుకు ‘నృత్యవిద్య’ను అందించాడు.

దైవత్వానికి, ఆధ్యాత్మికతకు నిరాడంబర జీవనమే ప్రాతిపదిక అని ప్రపంచానికి తెలిపేందుకు తాను అలాగే జీవించి చూపించాడు.

పార్వతికి సగభాగం ఇచ్చి, గంగను తలపై మోసి స్త్రీకి ఎంత గౌరవం ఇవ్వాలో  నిరూపించాడు. సమాజంలో భేదాలను రూపుమాపేందుకు శివతత్వం ప్రతిపాదించాడు.

 ‘‘ఆత్మగోత్రం పరిత్యజ్య శివగోత్రం పవిశతు’’

స్వాభిమానం కలిగించే గోత్రాలను వదిలిపెట్టి శివగోత్రం స్వీకరించండని ప్రబోధించాడు.

శవాలను ముట్టుకొని శరీరధర్మ విజ్ఞానం తెలిపేందుకే తంత్ర విద్య ప్రవేశపెట్టాడు.
గుణహీనుడని, నిర్గుణుడని నిందించిన దక్ష ప్రజాపతి మాటలు తిట్లుగా భావించకుండా ‘లింగ’ రూపం ధరించి నిర్గుణ స్వభావాన్ని లోకానికి అందించాడు.

ఆ లింగంపై పంచామృతాలతో పాటు ఏది పోసినా ఏవీ నిలబడకుండా చేసి తన దగ్గర ఏదీ ఉంచుకోననే సందేశం అందించాడు.

సగుణ నిర్గుణతత్వానికి ‘శివలింగం’ ప్రతీక అయితే, సంపూర్ణ గురుస్వరూపానికి దక్షిణామూర్తి నిదర్శనం.

ఆ స్వామి ముఖం నుండే సనాతనమైన అచలం వ్యక్తమైంది. అత్యద్భుతమైన మోక్ష విద్యను అందించిన దక్షిణామూర్తి ఆది గురువయ్యాడు.

🙏🙏🙏🙏🙏🙏🙏

ఓం నమః శివాయ-శివాయ ఓం నమః శివాయ🏵

Thursday, February 13, 2020

శివాభిషేకాలు - వాటి ఫలితాలు

1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

Wednesday, February 12, 2020

మరుగున పడుతున్న మన సామెతలు మీకు తెలుసా ...

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
5. అనువు గాని చోట అధికులమనరాదు
6. అభ్యాసం కూసు విద్య
7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం
9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
12. ఇంట గెలిచి రచ్చ గెలువు
13. ఇల్లు పీకి పందిరేసినట్టు
14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు
15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు
17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
19. కోటి విద్యలూ కూటి కొరకే
20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
22. పిట్ట కొంచెం కూత ఘనం
23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
29. ఆది లొనే హంస పాదు
30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
32. ఆకాశానికి హద్దే లేదు
33. ఆలస్యం అమృతం విషం
34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ
35. ఆరోగ్యమే మహాభాగ్యము
36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
41. ఏ ఎండకు ఆ గొడుగు
42. అగ్నికి వాయువు తోడైనట్లు
43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట
45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
48. అప్పు చేసి పప్పు కూడు
49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
51. బతికుంటే బలుసాకు తినవచ్చు
52. భక్తి లేని పూజ పత్రి చేటు
53. బూడిదలో పోసిన పన్నీరు
54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు
55. చాప కింద నీరులా
56. చచ్చినవాని కండ్లు చారెడు
57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
58. విద్య లేని వాడు వింత పశువు
59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
61. చక్కనమ్మ చిక్కినా అందమే
62. చెడపకురా చెడేవు
63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు
64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
65. చింత చచ్చినా పులుపు చావ లేదు
66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
67. చిలికి చిలికి గాలివాన అయినట్లు
68. డబ్బుకు లోకం దాసోహం
69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
71. దాసుని తప్పు దండంతో సరి
72. దెయ్యాలు వేదాలు పలికినట్లు
73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
75. దొంగకు తేలు కుట్టినట్లు
76. దూరపు కొండలు నునుపు
77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
78. దురాశ దుఃఖమునకు చెటు
79. ఈతకు మించిన లోతే లేదు
80. ఎవరికి వారే యమునా తీరే
81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
83. గాజుల బేరం భోజనానికి సరి
84. గంతకు తగ్గ బొంత
85. గతి లేనమ్మకు గంజే పానకం
86 గోరు చుట్టు మీద రోకలి పోటు
87. గొంతెమ్మ కోరికలు
88. గుడ్డి కన్నా మెల్ల మేలు
89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు
90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
93. గుడ్ల మీద కోడిపెట్ట వలే
94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు
97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
100. ఇంటికన్న గుడి పదిలం
101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ
102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
105. కాకి ముక్కుకు దొండ పండు
106. కాకి పిల్ల కాకికి ముద్దు
107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
109. కాసుంటే మార్గముంటుంది
110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును
112. కలి మి లేములు కావడి కుండలు
113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
114. కంచే చేను మేసినట్లు
115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
1

16. కందకు కత్తి పీట లోకువ
117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
118. కీడెంచి మేలెంచమన్నారు
119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు
122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా
123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
124. కూటికి పేదైతే కులానికి పేదా
125. కొరివితో తల గోక్కున్నట్లే
126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
127. కొత్తొక వింత పాతొక రోత
128. కోటిి విద్యలు కూటి కొరకే
129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
131. కృషితో నాస్తి దుర్భిక్షం
132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
135. ఉన్న లోభి కంటే లేని దాత నయం
136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక
137. మెరిసేదంతా బంగారం కాదు
138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
141. మనిషి మర్మము.. మాను చేవ...
బయటకు తెలియవు
142. మనిషి పేద అయితే మాటకు పేదా
143. మనిషికి మాటే అలంకారం
144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ
145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా
148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
149. మొక్కై వంగనిది మానై వంగునా
150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు
151. మొసేవానికి తెలుసు కావడి బరువు
152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు
157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
159. నవ్వు నాలుగు విధాలా చేటు
160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
161. నిదానమే ప్రధానము
162. నిజం నిప్పు లాంటిది
163. నిమ్మకు నీరెత్తినట్లు
164. నిండు కుండ తొణకదు
165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు
166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి
167. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
172. ఊరు మొహం గోడలు చెపుతాయి
173. పనమ్మాయితొ సరసం కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
174. పాము కాళ్ళు పామునకెరుక
175. పానకంలో పుడక
176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు
178. పండిత పుత్రః పరమశుంఠః
179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట
182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
183. పెళ్ళంటే నూరేళ్ళ పంట
184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట
186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది
187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
188. పిచ్చోడి చేతిలో రాయిలా
189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
191. పిండి కొద్దీ రొట్టె
192. పిట్ట కొంచెము కూత ఘనము
193. పోరు నష్టము పొందు లాభము
194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు
195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట
196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
199. రామాయణంలో పిడకల వేట
200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు
203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
204. రౌతు కొద్దీ గుర్రము
205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
207. సంతొషమే సగం బలం
208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే
209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు
210. శుభం పలకరా వెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!

Saturday, February 1, 2020

రధ సప్తమి విశేషాలు పూజా విధానం



మాఘ శుద్ధ సప్తమినే రధ సప్తమి అంటారు. 2020వ సంవత్సరంలో రధ సప్తమి  ఫిబ్రవరి 1 శనివారం నాడు వస్తుంది. అంటే, సూర్య భగవానుడి పుట్టిన రోజు. సూర్యుడు ఏకచక్ర రధము , ఆరు ఆకులూ, ఏడూ అశ్వాలు తో కూడిన వాహనము పై ప్రయాణిస్తాడు. చక్రం అంటే ఒక సంవత్సరం. ఆరు ఆకులూ అంటే ఆరు ఋతువులు, ఏడూ అశ్వాలు అంటే ఏడూ కిరణాలూ. సూర్య భగవానుడు ఉదయం పూట బ్రహ్మ స్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరుడులాగా మధ్యాహ్నము తన కిరణాల ద్వారా దైవిక వికారాలను రూపుమాపి, సాయంకాలము, విష్ణురూపంలో భాసిల్లే కిరణాలను మనో రంజకముగా ప్రసరింప చేస్తూ ఆనందింపచేస్తాడు.

మన పురాణాలలో సూర్యుడి గురించి అనేక కధలు, ఆయన ఉపాసనా విధానాలు వున్నాయి.   మాఘ మాసంలోనే వచ్చే రధ సప్తమి. ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ పుట్టిన రోజు.  సూర్యుణ్ణి మనం ప్రత్యక్ష దైవంగా భావిస్తాము.  నిత్య జీవితంలో మనకాయన అనేక విధాల సహాయ పడతాడు.  అంధకారం తొలగించి, మనకు వెలుగుని ప్రసాదించి, మన చుట్టూ ఏం వున్నదో చూసే అవకాశం ఇస్తున్నాడు.  వర్షాలను కురిపించి మన దప్పిక తీర్చటమేగాక, జీవనాధారమైన పంటలు పండటానికి సహకరిస్తాడు.  అంతేకాదు .. మనం కాలాన్ని గుర్తించేది .. సూర్య గమనాన్ననుసరించే.  ఒక పగలు, ఒక రాత్రి ఒక రోజుగా లెక్కిస్తాము కదా.  అన్నింటికన్నా ముఖ్యమైనది .. భూమి మీద వున్న అనేక మలినాలను నాశనం చేసి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు.  ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.

రధ సప్తమి నాడు చేసే స్నానానికి ఒక విశిష్టత వుంది. ఆ రోజు శిరస్సుపై ఏడూ జిల్లేడు ఆకులను పెట్టుకొని నీటితో తల స్నానం చెయ్యాలి. ఇలా చెయ్యడం వలన ఏడూ జన్మలనుంచి వస్త్తున్న సమస్త పాపములు నశిస్తాయని పెద్దలు చెపుతారు.

రథ సప్తమి నాడు శిరస్నానం  చేసేవేళ పఠించవలసిన మంత్రం
యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు,
తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి

జన్మ జన్మాంతారాల్లో  మనోవాక్కాయాలతో, తెలిసీ, తెలియక చేసిన సప్తవిధ పాపాలవల్ల ఏర్పడిన రోగం, శోకం, మున్నగునవన్నీ ఓ లక్ష్మీకరమైన మకర రాశిలోని సప్తమి ఈ స్నానంతో నశించుగాక  అని దీనర్ధం. తల్లిదండ్రులు లేని వారు ఈరోజు పెద్దలకు తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశం లో నక్షత్ర కూటమి రధం ఆకారంలో ఉంటుంది.

స్నానానంతరం సూర్యుని కిరణాలూ పడే చోట, లేక తులసి చెట్టు వున్న చోట, ఒక పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి, ముగ్గులుపెట్టి, సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. గంధం మరియు కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి. ఏడూ చిక్కుడు కాయలను తీసుకొని, కొబ్బరి పుల్లల సహాయముతో రథముగా చేసి, సూర్యుని రథముగా భావించి పూజ చెయ్యాలి. సూర్యునికి నేతితో దీపం వెలిగించాలి.

గోమయంతో చేసిన పిడకలని తీసుకొని పొయ్యి మీద ఇత్తడిపాత్రలో ఆవుపాలును పోసి కర్పూరముతో వెలిగించాలి. పాలు పొంగుతున్న సమయములో, కొత్త బియ్యం, బెల్లం వేసి, చెరుకు గడతో తిప్పుతూ పరామాన్నం తయారు చెయ్యాలి. ఈ పరామాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యనారాయణ మూర్తికి  నైవైద్యంగా సమర్పించాలి. ప్రసాద వితరణ కూడా చిక్కుడు ఆకుల్లోనే చెయ్యాలి.


పాలు పొంగించడమంటే, ఇంటి అభివృద్ధికి సంకేతం. ఆ చిక్కుడు ఆకుల్లో, మన కుల దేవతతో పాటు, సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలకు, గణపతికి, నైవేద్యం పెట్టాలి. అందులో కొంచెం చలిమిడి, వడపప్పు పెట్టాలి. అలాగే ఏడూ రేగుపళ్ళుని, ఏడూ చిన్న చెరుకు ముక్కలను నైవేద్యముగా పెట్టాలి. ముందుగా గణపతిని, తరువాత కులదేవతను తరువాత సూర్య భగవానుడుని ఎర్రటి పూలతో పూజించాలి. ఈ రోజు, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదవాలి. పూజ అనంతరం, సత్ బ్రాహ్మణుడికి , నువ్వులు, స్వయంపాకం లేదా పెరుగు దానం ఇవ్వాలి.

Thursday, January 30, 2020

హిందూ సనాతన ధర్మము లో తమలపాకు యొక్క విశిష్టత.....


హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో..

1. పూలు
2. అక్షింతలు,
3. ఫలాలు,
4. అద్దం,
5. వస్త్రం,
6. తమలపాకు మరియు వక్క,
7. దీపం,
8. కుంకుమ..

..ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు.పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం. భారత దేశం లో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదల లోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.

తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం...

క్షీర సాగర మథనం లో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణం లో చెప్పబడింది. శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు చెబుతున్నాయి . తమలపాకు యొక్క మొదటి భాగం లో కీర్తి, చివరి భాగం లో ఆయువు, మధ్య భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.

తమలపాకు లోని ఏయే భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాం...

తమలపాకు పైభాగంలో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు. సరస్వతీదేవి మధ్యభాగంలో ఉంటుంది. తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది. జ్యేష్టా దేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.

విష్ణుమూర్తి తమలపాకులో ఉంటాడు. శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగంలో ఉంటారు. తమలపాకు లోని ఎడమ వైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు. భూమాత తమలపాకుకి కుడిభాగంలో ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు.

తమలపాకులోని అద్భుతమైన ఆయుర్వేద గుణాలు...

తమలపాకు నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిపుండ్లు, నోటిపూత వంటి వ్యాధులను తగ్గిస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది. అరుగుదలకు తమలపాకు ఎంతగానో సహకరిస్తుంది కనుకనే భోజనానంతరం తాంబూల సేవనాన్ని చేస్తారు.

తమలపాకు 'ఎ' మరియు 'సి' విటమిన్లకు నిలయం. తమలపాకులలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల అనేక వ్యాధులు నిర్మూలించబడతాయి. తాంబూలం లో వేసుకునే ఇతర సుగంధ ద్రవ్యాలైన జాజికాయ, జాపత్రి శ్లేష్మాన్ని, కఫాన్నీ నిర్మూలిస్తాయి. ఏలకులు అసిడిటీ మరియు గ్యాస్ సమస్యలను పోగొడతాయి. నరాల బలహీనత,మూత్ర సంబంధ వ్యాధులు కూడా తమలపాకు వల్ల తొలగుతాయి.

కాన్సర్ నివారణకు తమలపాకు అద్భుతమైన ఔషధం.

శరీరం లో వేడి ఎక్కువగా ఉన్నవారు, తలనొప్పితో బాధపడుతున్న వారు తమలపాకును నుదుటిపై ఉంచడం ద్వారా ఉపశమనం పొందుతారు. చెవిపోటుతో బాధపడుతున్నవారు తమలపాకు నూనెను లేదా రసాన్ని గోరువెచ్చగా చేసి చెవిలో పోయడం ద్వారా చెవిపోటు తగ్గుతుంది. చీము,పుండ్లు వంటివి నశిస్తాయి. తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

తమలపాకు రసం రాయడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి.

పూర్వకాలం లో స్త్రీలు తాంబూల సేవనం శృంగార ప్రేరేపకంగానూ, సౌందర్య వస్తువు గానూ భావించేవారు. తాంబూలం నోటినీ పెదవులనూ ఎర్రగా చేయడం ఇందుకు ప్రధాన కారణం. చేతులకు గోరింటాకు లాగే నోటికి తాంబూలం శోభాకరంగా భావించేవారు. ఆ భావన ఇప్పటికీ కొంసాగుతోంది.

తమలపాకు వాడకంలో తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్తలు...

తమలపాకుని పూజలకు ఉపయోగించేటప్పుడు రంధ్రాలు ఉన్నవి గానీ, వాడిపోయినవి గానీ ఉపయోగించరాదు. అవి తాంబూల సేవనానికి కూడా మంచివికావు. తమలపాకు అతిగా సేవించడం వల్ల రక్తం పలచబడే అవకాశం ఉంది. కాబట్టి భోజనానంతరం ఒకటి లేదా రెండుకు మించి అతిగా తినరాదు.

సంప్రదాయ బద్ధమైన తాంబూల సేవనం మాత్రమే ఆరోగ్యాన్ని ఇస్తుంది. తమలపాకులో హానికారకమైన వస్తువులని కలిపి సేవించడం అనారోగ్యాలకు దారి తీయగలదు...

|| ఓం నమః శివాయ ||

హిందూ సనాతన ధర్మమునకు సంభదిత విషయములు తెలుసుకొనుటకు కొరకు టెలిగ్రామ్ యాప్ వాడే వారు ఈ క్రింది లింక్ ద్వారా మన సమూహం నందు జాయిన్ అవచ్చును.....

Tuesday, January 28, 2020

శివుడు అర్థమైతే సత్యం అర్థమవుతుంది

1. శివ తత్వం లోని కొన్ని విషయాలని పరిశీలిద్దాం.
జ్యోతిర్లింగాలు: శివుడిని 12 జ్యోతిర్లింగ రూపాలలో వున్నాడని నమ్మి కొలుస్తారు. జ్యోతిర్లింగ అంటే చీకటిని (అజ్ఞానాన్ని) చీల్చి వెలుగు( జ్ఞానాన్ని) ప్రసాదించేది.

2. లింగాకారం: శివ లింగం పైకి లింగం కింద పానవట్టం యోని రూపంలో వుంటుంది. అది స్త్రీ పురుషుల ప్రతీక. ఒకటి లేనిది ఇంకొకటి లేదు.అవినాభావ సంబంధం.

3. ప్రళయం: శివుడ్ని ప్రళయ కారకుడు గా నమ్ముతారు. ప్రళయ కారకుడని తెలుసుకుని ఏమిటి ప్రయోజనం? శివుడు మూడు ప్రళయము లకు కారణం. ఒకటి రాత్రి నిద్ర. అన్ని ప్రాపంచిక మాయల నుండి మరపు నిచ్చేది. రెండు శారీరక మరణం.స్థూల (అంగ శరీరం) , సూక్ష్మ ( మనసు), కారణ ( అజ్ఞానం)శరీరాలనుంచి విముక్తి కలుగచేసేది. మూడు : మహాప్రళయం : సమస్తం శివుని లో కలిసిపోవడం. అంతరార్ధం: ఈ మూడు శరీరాలు మాయకల్పితం, అశాశ్వతం కావటం వలన, శివుడు వాటినుంచి విముక్తి కల్పించడం.

4. శివ,విష్ణు,బ్రహ్మ : శివుడి నించి విష్ణువు, విష్ణువు నించి బ్రహ్మ ఆవిర్భవించారంటారు. బ్రహ్మ సృష్టిస్తే, విష్ణువు నడిపించడం, శివుడు అంతం చేయటం అనేవి లోకోక్తి. ( పైన #3 చూడండి. ) అంతరార్ధం : సృష్టి, స్థితి,లయ ఒకచోట నుంచి రావటం, మరలా అందులోకి పోవటం.

5. మరణం ఒక వేడుక : వారణాసిలో ఘాట్లను చూస్తే, ప్రపంచంలో అదొక్కటే స్థలం లో జీవిత చక్రంలోని అన్ని దశలు : జన్మ , పెరగటం, మరణం అన్నీ నది ఒక చివరనుంచి ఇంకో చివరలోపు కనిపిస్తాయి. ఉజ్జయిన్ లో శివునికి జరిగే భస్మ ఆర్తి కి ముందు రోజు ఖననం చేసిన శరీర భస్మాన్ని తెచ్చి వాడతారు. శివుడు తన శరీరమంతా భస్మాన్ని అలుముకుంటాడు.

6. పంచభూత లింగాలు : దక్షిణ భారతం లోనున్న పంచ భూత లింగాలు ( అగ్ని, వాయు, భూమి, ఆకాశం ,జలం ) ఆ అద్వితీయ శక్తి అన్ని ధాతువులలో, భూతాలలో ఉందని రుజువు చేస్తాయి. శివ కానిదింకేమైనా ఉందా ?

7. Einstein శక్తి సూత్రం : శక్తి ఒక రూపంనుంచి ఇంకో రూపానికి మారవచ్చు కానీ శక్తి తయారు కాబడదు. నాశనం కాబడదు. అద్వైతాన్ని ఇంతకంటే స్పష్టంగా సరళంగా చెప్పగలమా? ఒక జీవి, చెట్టు, రాయి, జాలం లోని ఆ పరబ్రహ్మం ఒకటే. పై తొడుగులు వేరు, అశాశ్వతం.

8. రుద్రం : శివుని పూజించే పద్దతులలో రుద్రం మొదటిది. రుద్రం లో ఏం వుంది ? మహాన్యాసం, నమకం ,చమకం. మహాన్యాసం అంటే: చేసేది శివుడే , నీవు శివుడవేనని నిర్ధారణ చేస్తుంది. ఆ తరవాతే మిగతావన్నీ. చమకమ్ లో ఏం వుంది? సమస్తమూ శివమే — దొంగ, నురుగు, జీవులు అంతా ( అద్వైతం )

9. శివుని ధ్యానముద్ర: నీ నిజస్థితి తెలుసుకోవటానికి సాధనం — శ్రవణ ,మనన, నిధి,ధ్యాసాలు (ధ్యానం) .

10. అద్వైతం : అద్వైతం తెలిపిన శంకరుల పేరు శివుని పేరు కావడం యాదృచ్చికమా ? జన్మ,స్థితి, మరణం -ఈ చక్రం మాయలో భాగం, అసత్యం. ఉన్నదొక్క బ్రహ్మమేనన్నదే సత్యం. తత్వమసి, శివోహం, అహం బ్రహ్మాస్మి అనే తత్వ వాక్యాలు చెప్పే సత్యం ఇదే.

జగన్నాథ - రథయాత్ర సంపూర్ణ వివరాలు

 1) పూరి మందిరం పేరు ఏమిటి?( శ్రీ మందిరం ) 2) రథయాత్ర  ప్రారంభమయ్యే తొలితిధి ఏది?( ఆషాడ శుద్ధ విదియ ) 3) పూరీ మందిరాన్ని వదిలి ఈ తొమ్మిది రో...