Monday, July 16, 2018

యజ్ఞోపవీతం

కొద్దిగా టైం తీసుకోనైనా తప్పనిసరిగా ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం.                       **
వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’.
దీనినే తెలుగులో ‘జంధ్యం’ అంటాం.

ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు.

ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ, కొందరు ఆచారం మీద మక్కువతోనూ, కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం, మరి
కొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు.

యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు.

 దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.

’సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్
తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్’   బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి.
అదే ఉపవీతం.   అంటే రక్షణ వస్త్రం.

యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి.
యజ్ఞోపవీతం పరమ్ పవిత్రమైనది.
అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’   అనే మంత్రం చెబుతోంది.

యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి.

ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం -

‘ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ
వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ
ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ
తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా
పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః
సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ
సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః’

మొదటి తంతువులో ఓంకారం,
రెండవ తంతువులో అగ్నిదేవుడు,
మూడవ తంతులో నాగదేవత,
నాలుగవ తంతువులో సోమదేవుత,
ఐదవ తంతువులో పితృదేవతలు,
ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు,
ఏడవ తంతువులో వాయుదేవుడు,
ఎనిమిదవ తంతువులో సూర్యుడు,
తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని     ఈ శ్లోకాల్లోని పరమార్థం.

‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది
’.
తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్
కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’
ఈ శ్లోకంలో తాతపర్యం ఇది.

తిథులు 15,
వారాలు 7,
నక్షత్రాలు 27,
తత్త్వాలు 25,
వేదాలు 4,
గుణాలు 3,
కాలాలు 3,
మాసాలు 12     మొత్తం 96  .   అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి 
తిథులలోనూ, వారాలలోనూ,
నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ,
వేదాలలోనూ, గుణాలలోనూ,
కాలాలలోనూ, మాసాలలోను   పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం.

 ‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది.

’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ
తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్’
నాలుగు వేదాల్లోనూ    గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది.
 అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం.

గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. 

కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం.

యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది.

’పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్
తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్
ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్
యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’
అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి.

 దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు.
మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది.
లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది.
మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.
బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి.
వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.

యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి.
 మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు.

అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి.

యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు.
 అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే!

వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సం

రక్షించుకోవాలి.
యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు.

 ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు.
ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి.

Sunday, July 15, 2018

దక్షిణాయనం అంటే ఏమిటి? దక్షిణాయనం లో ఏమి చేయాలి?

భారతీయ ధర్మం సంవత్సర కాలాన్ని రెండు భాగాలుగా విభజించింది. అవి దక్షిణాయనం. ఉత్త్తరాయణం, దక్షిణాయనాన్ని దేవతలకు రాత్రి సమయంగా పరిగణిస్తారు. ఉత్తరాయణాన్ని దేవతలకు పగటి సమయంగా భావిస్తారు. దక్షిణాయనం దేవతలకు రాత్రి అవడం వల్ల ఆ సమయంలో వారు నిద్రిస్తారని అంటారు. అందుకే విష్ణుమూర్త్తి కూడా శయన ఏకాదశి రోజు నుంచి నిద్రపోతాడని చెబుతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యడు ఈ రోజున కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అందువల్ల్ల ఈ రోజును కర్కాటక సంక్రాంతిగా పిలుస్తారు.

దక్షిణాయనంలో సూర్యుడు దక్షిణార్థ గోళం దిశగా పయనిస్తాడు. ఇందుకు భిన్నంగా ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తరార్థ గోళం దిశగా పయనిస్తాడు. దక్షిణాయనం ఇప్పుడు (జులై మధ్య కాలంలో) ప్రారంభవమై జనవరి 14 వరకూ కొనసాగుతుంది.

ముఖ్యంగా దక్షిణాయనంలోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే విశేష శ్రాద్ధాలు, విశేష తర్పణాలు తీసుకునేం దుకు భూమి పైకి వస్తారని చెబుతారు. ఈ దక్షిణాయనంతోనే పితృదేవతల ఆరాధనకు సంబంధించిన మహళాయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి వంటివి జరుగుతాయి. శ్రాద్ధాదులు మానివేయడం కూడా సంతానం కలగక పోవడానికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. శ్రాద్ధాదులు చేయక పోవడమే పిల్లలు లేక పోవడానికి కారణమని భావించి, వాటిని యధావిధిగా చేయడం మొదలు పెట్టి సంతానం పొం దామని చెప్పినవారు కూడా ఉన్నారు.

బతికుండగా తల్లిదండ్రుల సేవ, మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి, ఎంతో ముఖ్యం, శుభప్రదం. పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం. అంతేకాదు మనను కన్న తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య. ప్రతి దక్షి ణాయనంలో చలి వంటివి పెరగడం వ్ల్లల ఎక్కువగా మర ణాలు కూడా సంభవిస్తాయి. అయితే ఉత్తరాయణాన్ని పుణ్య కాలంగా భావిస్తారు. ఆ సమయంలో మరణించడం మంచిదనే అభిప్రాయం ఉంది. భీష్ముడు స్వచ్ఛంద మరణం వరంగా ఉన్న వాడు కనుక ఉత్తరాయణం వచ్చే వరకూ వేచి ఉండి అప్పుడు ప్రాణం వదిలాడు. ( ఇక్కడ  నా మాట జాగ్రత్తగా ఆకళింపు చేసుకోండి. దక్షిణాయనంలో ఎవరైనా మరణిస్తే   వారిని పాపాత్ములుగా భావించే వారు నేడు అనేకం ఉన్నారు. అలా భావించడమే   మహా పాపం. భీష్ముడు ఉత్తరాయణం కోసం వేచి చూడలేదా ? అని ఇక్కడ ఒక   ఉదాహరణ చెబుతారు. అంతకుముందు మహా మహులు   కురుక్షేత్రం యుద్ధంలో మరణించారు అని   మాత్రం ఆలోచించరు. ద్వాపర యుగానికి కలియుగానికి ధర్మంలో ఎంతో మార్పు చోటుచేసుకుంటుంది. దయచేసి మరణించినవారి గురించి వికారంగా మాట్లాడకండి )
అయితే దక్షిణాయనంలో కూడా చాలా మంది గొప్ప వారు మరణించారు. అంతమాత్రాన వారికి ఉత్తమ గతులు రావని కాదు. మహాత్ముల విషయంలో వారు ఏ అయనంలో మరణించారన్నది ముఖ్యం కాదని, వారు ఉత్తమ లోకాలు పొందేందుకు దక్షిణాయనం అవరోధం కాబోదని అంటారు. మరణం అనేది మానవుల చేతుల్లో ఉన్నది కాదు. అది దైవ నిర్ణయం. కర్మను బట్టి, వారి ఆయుర్దాయాన్ని బట్టి వారు మానవుల మరణాలు ఉంటాయి. మరో విధంగా చూస్తే కాలం చెడ్డది కాదు. సూర్యగమనాన్ని బట్టి కాలాన్ని ఈ విధంగా విభజించారని చెప్పేవారూ ఉన్నారు. నిజానికి దీక్షలు, పండుగలు వంటివి ఉత్తరాయణంలో కంటె దక్షిణాయనంలో ఎక్కువ.

నాలుగు నెలల దీక్ష అయిన చాతుర్మాస్యం దక్షిణాయనం లోనే వస్తుంది. చాతుర్మాస్యం నాలుగు మాసాలూ కూడా ఈ కాలంలోనే ఉండడం వల్ల ఈ సమయంలో విష్ణు మూర్తి ఆరాధన విశేష ఫలాలు ఇస్తుంది. దక్షిణాయనంలో ముఖ్యంగా చేపట్ట్టవలసిన కార్యక్రమాలు కొన్ని పెద్దలు చెబుతారు. వాటిలో కొన్ని ఇవి:

ధ్యానం, మంత్ర జపాలు చేయడం, సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు చేయడం, పిండ ప్రదానాలు, పితృ తర్ఫణాలు వంటివి చేయడం, సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం, అవసరంలో ఉన్న వారకి దానం చేయడం, అన్నదానం, తిల (నువ్వుల ) దానం, వస్త్ర దానం, విష్ణు పూజ, విష్ణు సహస్రనామం చేయడం, సూర్యరాధన, ఆదిత్య హృదయ పారాయణ ఇటువంటివి చేస్తే అవి శరీరానికి, మనస్సుకు మంచి చేస్తాయి. పాపాలు తొలగిపోతాయి.

దక్షిణాయనం దేవతలకాలం కాదు   కనుక ఈ కాలంలో వివాహాలు గృహప్రవేశాలు చేయడం మంచిది కాదు అని   అనుకుంటూ ఉంటారు. అదే కేవలం అపోహ మాత్రమే.

Surya Mandala Ashtkam (సూర్యమండల స్తోత్రం)

The Sun is called Surya and is given the pride of place in Hinduism. He is hailed as Prathyaksha Brahma, the visible Reality,Brahman. So much so, Lord Krishna had the Hymn on Surya in the Sandhyavandan.

The portion in the Sandhyavandan,

Namassvitre Jadadeega Chakshuse, Jagat Prasoothi Stithi Naasa hethave,
Thramayeyaa thrigunaathmadhaarine, virinchi narayana sankaraathmane,
Threyas satha Savitru mandalavvaan Madhyavarthi ….”

was included by Yudhistir at the command of Lord Krishna, when Lord Krishna had the Amavasya, New Moon advanced by a day before the Mahabharata war.

The Surya Mandala Stotra was taught to Arjuna By Lord Krishna(Bhavishya Puran) So important is Surya worship Adi Shankaracharya established Saura as one of the Six systems of Hindu worship,Shanmathas.

Adityahruthaya sloka was taught to Lord Ram by Sage Agastya to help Ram to win the war against Ravana. Suryamandala Ashtakam is not well-known. But they are very effective, especially when one is depressed. It grants the power to tide over crises.

Surya Mandala Ashtkam (సూర్యమండల స్తోత్రం):

నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే |
సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ ||

యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |
దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౨ ||

యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |
తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ ||

యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |
సమస్త తేజోమయ దివ్యరూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౪ ||

యన్మండలం గూఢమతి ప్రబోధం | ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |
యత్సర్వ పాపక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౫ ||

యన్మండలం వ్యాధివినాశదక్షం | యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |
ప్రకాశితం యేన చ భూర్భువః స్వః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౬ ||

యన్మండలం వేదవిదో వదంతి | గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |
యద్యోగినో యోగజుషాం చ సంఘాః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౭ ||

యన్మండలం సర్వజనైశ్చ పూజితం | జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |
యత్కాల కాలాద్యమరాది రూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౮ ||

యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం | యదక్షరం పాపహరం జనానామ్ |
యత్కాలకల్పక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౯ ||

యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం | ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |
యస్మిన్ జగత్సంహరతేఽఖిలం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౦ ||

యన్మండలం సర్వగతస్య విష్ణోః | ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |
సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౧ ||

యన్మండలం వేదవిదోపగీతం | యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |
తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౨ ||

సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |
సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||

ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం ||

Note:
The metre structure of each shloka is:

11 – 11 . —
11 – 11 .. —

where the numbers indicate the number of syllables
and the dashes the relative pause required; a rather
straightforward metre.

Also note the recurring `tatsaviturvareNyam.h’ of
the gAyatri mantra; this is a hymn to the Sun!

How to offer water to Sun God (Lord Surya)

The Lord Surya is considered as the soul of the universe according to Hindu Mythology. The Lord Surya gives knowledge, divinity and performance. According to Hindu astrology Sun is the significator of the soul. That is why the Hindu people in India do offer water to sun. The lord Surya is the lord of all the planets on the heavenly body and the most powerful one. The Sun God gives power, position, authority, glory, name, reputation, force and makes one a ruler or a kingly person. If the planet Sun is posited in a beneficial house in the natal chart, then it will make you an administrator.

As per the science the Lord Sun is also the major source of power, light and energy. It is impossible to lead life without Sun. If the Sun sets for a longer span of time, then the whole world will be glacier and there will be no trace of life on the earth. Similarly, if the lord Surya remains on the sky for 120 hours instead of 12 hours, then the whole world will get extinct.

Our ancient Hindu literature says offering water to Sun God can have miraculous effect on you.

There are certain ways written in our scripture and Hindu mythology to pray and worship Sun God god.

Some recite Surya Sahasranam, while some read Aditya Hriday Stotram.

Most of the Hindu people know how to offer water to sun. There are various places where the people do offer water to sun god. Some offer in the river while taking bath, some others do offer in the pond in the rural geography in India.

Nowadays, the people have started integrating bathroom in their house. Taking bath in the open river and pond is rarely seen these days.

I would like tell you as to how to offer water to sun god.

You need to have some easily available products to offer water to sun that will have miraculous effect on your health, wealth, knowledge, power and position etc.

These products are a copper pot, small pieces of jaggery, pinch of rice and Roli (Puja Sindur) and clean water.

Put all these sacred products in the water available in the pot. Then offer the water to sun god by chanting these mantra till the water gets finished.

1.      On Mitraya Namaha
2.      Om Ravaye Namaha
3.      Om Suryaya Namaha
4.      Om Bhanave Namaha
5.      Om Khagaya Namaha
6.      Om Pushne Namaha
7.      Om Hiranya Garbhaya Namaha
8.      Om Marichaye Namaha
9.      Om Adityaya Namaha
10.  Om Savitre Namaha
11.  Om Arkaya Namaha
12.  Om Bhaskaraya Namaha

The best time to offer water to the sun God is between 6 AM to 7 AM. Don’t be too late to offer water to sun god. At best you can offer water to this Supreme God till 8 AM.

Rules to follow for offering water to Sun

1. Don’t see directly to the Lord Surya while offering water.
2. See the rays and Sun in the flow of water that you are creating while reciting mantra.
3. Once you have finished offering the water, pray the Lord to forgive you the mistakes you have done.
4. Pray him to bless you with health, wealth and prosperity.
5. Pray him to make your eyesight powerful.
6. Pray him to make you glorified like him.

ఓం శ్రీ వరహా లక్ష్మి నృసింహాయ నమో నమః


నారసింహో మహాసింహో దివ్యసింహో మహాబలః
ఉగ్రసింహో మహాదేవ స్స్తంభజ శ్చోగ్రలోచనః

కరాళో వికరాళశ్చ వికర్తా సర్వకర్తృకః
శింశుమార స్త్రీలోకాత్మ ఈశ స్సర్వేశ్వరో విభుః

సహస్రబాహు సర్వజ్ఞ స్సర్వసిద్ధిప్రదాయకః
వజ్రదంష్ట్రో వజ్రనఖో మహానందః పరంతపః

వైశాఖ శుక్ల భూతోత్థ శ్శరణాగత వత్సలః
ఉదారకీర్తిః పుణ్యాత్మ మహాత్మా చండవిక్రమః

వేదత్రయ ప్రపూజ్య శ్చ భగవా న్పరమేశ్వరః
శ్రీవత్సాంక శ్శ్రీనివాసో జగద్వ్యాపీ జగన్మయః

ఉద్యోగ ప్రాప్తి కొరకు "శ్రీరామ పట్టాభిషేకం"

అపూజ్యా యత్ర పూజ్యంతే పూజ్యానాం చ విపర్యయః।
త్రీణి తత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయమ్।।
                                                     
అర్ధం ఏమిటి అంటే:-

అపూజ్యులైన వారిని పూజించటం,పూజనీయులను పూజించక పోవటం ... ఈరెండు ఏ రాజ్యంలో జరుగుతాయో అక్కడ దుర్భిక్షం,మరణం,నిత్య భయం అనే మూడు ఉత్పాతాలు తప్పవట.ప్రస్తుత పరిస్థితులలో అదే జరుగుతోంది.

భారతీయ సనాతన సంప్రదాయంలో కాషాయ దండ మాత్రేణ యతిః పూజ్యః" ...అన్నారు.ఒక్కసారి ధర్మాన్ని తప్పక,కాషాయ  వస్త్రాన్ని ధరించి,దండాన్ని చేతధరిస్తే చాలు ఆ సన్యాసి సర్వజనపూజ్యుడౌతాడట.

ఉద్యోగం లేని వాళ్ళు,ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతున్నవారు, ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు, ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు, తమస్ధాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీమద్రామాయణము నందలి బాలకాండము నందు మొదటి సర్గము నందు గల శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 21 సార్లు పఠించాలి.

నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోనఘః |
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ||

ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః |
నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః ||

న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వ చిత్ |
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ||

న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః |
న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా ||

న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా |
నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ ||

నిత్యం ప్రముదితాస్సర్వే యథా కృతయుగే తథా |
అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః ||

గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి |
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ||

రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |
చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||

దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ |
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ||

ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ||

ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః |
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ||

చక్కగా పితృవాక్యపరిపాలనమొనర్చివచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నందిగ్రామమున తనసోదరులను కలిసికొని, జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితోగూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టేను.

శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరును సంతోషముతో పొంగిపోవుచు, ఆయన పాలనలో సుఖఃసౌభాగ్యములతో విలసిల్లుదురు. ప్రభుభక్తితత్పరులై ధర్మమార్గమున ప్రవర్తించుదురు, ఆరోగ్యభాగ్యములతో హాయిగానుందురు, కఱువు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించుచుందురు.

రామరాజ్యమున పుత్రమరణములు లేకుండును, స్త్రీలు పాతివ్రత్యధర్మములను పాటించుచు నిత్యసుమంగళులై వర్థిల్లుచు ఉందురు. అగ్నిప్రమాదములు గాని, జలప్రమాద(మరణ)ములు గాని, వాయు భయములుగాని లేకుండును. జ్వరాదిబాధలు, అట్లే ఆకలిదప్పుల బాధలు, చోరభయములు మచ్చుకైనను ఉండవు - (ఆధ్యాత్మిక - ఆధిదైవిక - ఆధి భౌతిక బాధలు లేకుండును). రాజ్యములోని నగరములు, ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడిపంటలతో తులతూగుచుండును. జనులు కృతయుగమునందువలె ఎల్లవేళల సుఖశాంతులటో వర్థిల్లుచుందురు.

అనేకములైన అశ్వమేథాదిక్రతువులను, సువర్ణ్క యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్లకొలది గోవులను దానము చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమొనర్చి, వాసికెక్కును.

రాఘవుడు క్షత్రియవంశములను నూరురెట్లు వృద్థిపఱచును. నాలుగు వర్ణములవారిని ఈ లోకమున తమతమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు పదునొకండువేల సంవత్సరములకాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి, అనంతరము వైకుంఠమునకు చేరును.

ఈ శ్రీరామచరితము అంతఃకరణమును పవిత్రమొనర్చును, సర్వపాపములను రూపుమాపును, పుణ్యసాధనము, వేదార్థమును ప్రతిపాదించునదియు గావున ఇది సర్వవేదసారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించువారి పాపములు అన్నియును పటాపంచలై పోవును, ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును, వారిపుత్త్రపౌత్త్రులకును, పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును. మఱియు అంత్యకాలమున మోక్షప్రాప్తియు కలుగును.

మారేడు

లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు.
అందుకే
ఆ చెట్టుకు పండిన కాయను
‘శ్రీఫలము’
అని పిలుస్తారు.
సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. ●
అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.●
మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి●●● దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. ●
మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది. ●
ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది.●
అందుకే
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!
అని
తలుస్తాము.
దళములు దళములుగా ఉన్నవాటినే కోసి
పూజ చేస్తారు.
ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది.
అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది.
అది మూడు,
తొమ్మిది కూడా ఉంటాయి. ●
పుష్పములను
పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి.
కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా
ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. ◆
మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు.●
అందులో
మారేడు దళము ఒకటి.●
మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె
శివలింగమునకు తగిలితే
ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.◆
అందుకే
ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా,
పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా●●●
మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు. ●
శివుడిని మారేడు దళంతో పూజ చేయగనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట.◆
‘బాల్యం,
యౌవనం,
కౌమారం
ఈ మూడింటిని నీవు చూస్తావు’
అని ఆశీర్వదిస్తాడుట.◆
కాబట్టి
ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. ◆
శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు.●
మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే●●● జ్ఞానం సిద్ధిస్తుంది.
ఇంత శక్తి కలిగినది కాబట్టే
దానికి "శ్రీసూక్తం"లో
‘అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’
(అమ్మా అలక్ష్మిని= దరిద్రమును పోగొట్టెదవుగాక)
అని
చెప్తాము.
మనిషికి మూడు గుణములు,
మూడు అవస్థలు ఉంటాయి.●
నాల్గవదానిలోకి వెళ్ళడు.
నాల్గవది తురీయము.●
తురీయమే జ్ఞానావస్థ.◆
అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.◆
మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే
మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ●
ఇంట్లో మారేడు చెట్టు ఉంటె >>
ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా>> అపారమయిన సిద్ధి కలుగుతుంది.◆
యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు
ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి >>పీట వేసి >>ఆయనను అక్కడ కూర్చోపెట్టి >>
భోజనం పెడితే >>
అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.◆
శాస్త్రము మనకు లఘువులు నేర్పింది.●
మారేడు చెట్టు అంత గొప్పది.◆
మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.●
అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.◆
‘మా-రేడు’
తెలుగులో
రాజు ప్రకృతి,
రేడు వికృతి. ◆
మారేడు అంటే మా రాజు. ◆
ఆ చెట్టు పరిపాలకురాలు.●
అన్నిటినీ
ఇవ్వగలదు.◆
ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు.◆
అది పువ్వు పూయవలసిన అవసరం లేదు.◆
ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా >>>
మారేడు
పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. ●
అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.◆
అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా >>మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి.●
అందులో
1●మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం,
2● రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట,
3● మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట. ●
ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.