Monday, March 21, 2022

ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము

 1. మత్స్యపురాణం

 2. కూర్మపురాణం

 3. వామన పురాణం

 4. వరాహ పురాణం

 5. గరుడ పురాణం

 6. వాయు పురాణం

 7. నారద పురాణం

 8. స్కాంద పురాణం

 9. విష్ణుపురాణం

 10. భాగవత పురాణం

 11.అగ్నిపురాణం

 12. బ్రహ్మపురాణం

 13. పద్మపురాణం

 14. మార్కండేయ పురాణం

 15. బ్రహ్మవైవర్త పురాణం

 16.లింగపురాణం

 17.బ్రహ్మాండ పురాణం 

 18. భవిష్యపురాణం

ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.

మత్స్యపురాణం 

మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.

కూర్మపురాణం 

కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.

వామన పురాణం 

పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, ఋతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.

వరాహపురాణం 

వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.

గరుడ పురాణం 

గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.

వాయుపురాణం 

వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.

అగ్నిపురాణం 

అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.

స్కందపురాణం

కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.

లింగపురాణం 

లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.

నారద పురాణం 

బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.

పద్మపురాణం 

ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.

విష్ణుపురాణం 

పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.

మార్కండేయ పురాణం 

శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.

బ్రహ్మపురాణం 

బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.

భాగవత పురాణం 

విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.

బ్రహ్మాండ పురాణం 

బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.

భవిష్యపురాణం 

సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.

బ్రహ్మావైపర్తపురాణము

ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, *రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి

Friday, March 18, 2022

రుద్రాభిషేకం గురించి వివరణ

శివ.. శివ అంటే చాలు మంగళం, శుభం, సర్వకార్యజయం, సర్వపాపహరం అని వేదార్థాలు. మహాదేవున్ని శివుడని పరమశివుడని పలు పేర్లతో పిలుస్తారు... 

పండితుడు నుంచి పామరుడు వరకు, మహా చక్రవర్తి నుంచి కటిక పేదవాడి వరకు మనఃపూర్వకంగా ఒక్కసారి శివ అంటే చాలు కోరిన కోర్కిలు తీర్చే భోళాశంకరుడు ఆయన. 

శివున్ని అభిషేక ప్రియుడు అంటారు...

శివునికి నిత్యం అభిషేకం చేస్తే చాలు అన్ని ఉన్నట్లే. శివలింగం చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. 

దేశం శాంతిగా ఉంటుందని వేదోక్తి, అయితే శివుడికి అభిషేకాలు చేస్తుంటాం.. 

అయితే అభిషేకాలు ఎన్నిరకాలు ఏ విధంగా శివాభిషేకాలు చేస్తారో తెలుసుకుందాం…!!


శివాభిషేకాలు మంత్రపూర్వకంగా అంటే రుద్రభిషేకాలుగా వర్ణిస్తారు, అదేవిధంగా చేసే ద్రవ్యాలను బట్టి అభిషేకాలకు పేర్లు ఉన్నాయి. 

కానీ శాస్త్రం ప్రకారం రుద్రాభిషేకాలు రకాలనే పరిగణనలోకి తీసుకుంటాం...

పదార్థాలు మన కామ్యాలు అంటే కోరికలు తీరడానికి ఆయా పదర్థాలతో, పుష్పాలతో చేస్తాం...


రుద్రాభిషేకాలు 8 విధములు అవి..


రుద్రం అంటే నమకాలు -11, చమకాలు-11 అనువాకాలుగా (సింపుల్‌గా చెప్పాలంటే 11 స్టాన్జాలు అని ఇంగ్లిష్ మీడియం వారికి) సాధారణంగా రుద్రాభిషేకం అంటే 11 నమకాలను, 11/1 చమకాన్ని చెప్పితే ఒక అభిషేకంగా ఇంట్లో నిత్యం చేసుకునేవారు చేసే పద్ధతి...


ఇక అసలు అభిషేక సంప్రదాయ పరిశీలిస్తే…

1. వారాభిషేకం- నమకం 11 అనువాకాలను చెప్పి చమకంలో ఒక్కొక్క అనువాకం చొప్పున చెప్పవలెను. 

ఆ విధంగా నమకం 11 సార్లు (11X11) చెప్పిన, చమకం 11 అనువాకాలకు పూర్తగును. (నమకం 11సార్లు, చమకం 1 సారి) దీన్ని వారాభిషేకం అంటారు...


2. ఆవృత్తి – నమకం 121 సార్లు, చమకం 11 సార్లు చెప్పితే ఆవృత్తి అంటారు...


3. రుద్రం- నమకం 121 సార్లు, చమకం – 11 సార్లు


4. ఏకాదశ రుద్రం- నమకం 14,641 సార్లు, చమకం-1331 సార్లు..


5. శతరుద్రం- నమకం 1,61,051 సార్లు,చమకం 14,641 సార్లు,


6. లఘురుద్రం- నమకం 17,71,561 సార్లు, చమకం- 1,61,051 సార్లు,


7. మహారుద్రం- నమకం 1,94,87,171 సార్లు, చమకం- 17,71,561 సార్లు,


8. అతిరుద్రం - నమకం 21,43,58,881 సార్లు, చమకం -1,94,87,171 సార్లు,

ఇలా 8 రకాలుగా రుద్రాభిషేకాలను చేస్తారు...


పైనవి మీకుతెలుస్తుంటే మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. 

లేదంటే తెలుసుకొని ఇతరులకు తెలియజేయండి

Thursday, March 17, 2022

సమస్యలు తీర్చే దత్తాత్రేయ మంత్రాలు

 



1.సర్వ బాధ నివారణ మంత్రం.


"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ||

సర్వ భాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే||"


2. సర్వరోగ నివారణ దత్త మంత్రం.


"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో||

సర్వ రోగ ప్రశమనం కురు శాంతిమ ప్రయచ్ఛమే||"


3. సర్వ కష్ట నివారణ దత్త మంత్రం.


"అనసూయాత్రి సమభూతో దత్తాత్రేయో దిగంబర: స్మర్తృగామీ స్వభక్తానాం ఉధ్ధర్తా భవ సంకటాత్||


4.దరిద్ర నివారణ దత్త మంత్రం.


"దరిద్ర విప్రగ్రేహే య: శాకం భుక్త్వోత్తమ శ్రియమ||

దదౌ శ్రీ దత్త దేవ: సదా దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు||"


5.సంతాన భాగ్యం కోసం దత్త మంత్రం.


"దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం||

యో భూదభీష్టదః పాతు సనః సంతాన వృద్ధికృత్||"


6. సౌభాగ్యం కోసం దత్త మంత్రం.


"జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహా||

మృత్యుంజయః స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు||"


7. అప్పులు తీరుటకు, అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కోసం దత్త మంత్రం.


"అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవాన్ ఋణాత్||దత్తాత్రేయం  తమీశానం నమామి ఋణముక్తయే||"


8. సర్వ పాప నివారణ దత్త మంత్రం.


అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః||తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే||


9.దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం.


అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన||

దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ||


10. ఉన్నత విద్య కోసం దత్త మంత్రం.


విద్వత్సుత మవిద్యం య అగతం లోక నిందితం|| భిన్న జిహ్వం బుధం చక్రే శ్రీ దత్తః శరణం మమ||


11. పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించ బడ్డ ధనము లేక వస్తువుల తిరిగి పొందుటకు..


కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్|| తస్య స్మరణ మాత్రేన హృతం నష్టంచ లభ్యతే||


విధానం

ఈ మంత్రాలలో మీ సమస్యకు తగట్టు ఏది అవసరమో ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు లేక సమస్య తీవ్రత బట్టి 1008సార్లు గాని రోజూ ఉదయం జపం చేయాలి.. ఇలా 41 దినములు  చేయాలి ..

జై గురుదత్త

Thursday, March 10, 2022

నవ గోప్యాలు

1 ఆయువు,

2 విత్తము,

3 ఇంటిగుట్టు,

4 మంత్రం,

5 ఔషధం,

6 సంగమం,

7 దానం,

8 మానము,

9 అవమానం

అనే ఈ తొమ్మి దింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచా ల్సినవి.

భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.

1 ఆయువు :- రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. జరిగేది జరగకమానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆయుః ప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు.

2 ధనం ( విత్తం) :- ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగా రంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం.

అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగు తుంది.

3 ఇంటి గుట్టు:- ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్నే ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని.

సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.


4 మంత్రం:-  ‘మననం చేసేది మంత్రం’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.


5 ఔషధం:- ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరిస్తే ఎవ్వరంటేవారు తయారుచేస్తారు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.


6 సంగమం:- సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.


7 దానం:- దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.


 8 శీలం ( మానం ):- మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.


9 అవమానం :- తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవ మానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగు తుంది. దాంతో పగ.. ప్రతీకారాలు.. ఇక వాటికి అంతనేది ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం. 


 ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధను మనం తప్పక ఆచరించాలి.

Monday, February 14, 2022

శ్రీ సూర్య నమస్కార మంత్రం

 ఉన్నత ఉద్యోగ ప్రాప్తికి : 


శ్రీ సూర్య నమస్కార మంత్రం


ధ్యేయః సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః ।

కేయూరవాన్ మకరకుండల వాన్ కిరీటీహారీ హిరణ్మయ వపుః ధృతశంఖచక్రః ॥


ఓం మిత్రాయ నమః । 1

ఓం రవయే నమః । 2

ఓం సూర్యాయ నమః । 3

ఓం భానవే నమః । 4

ఓం ఖగాయ నమః । 5

ఓం పూష్ణే నమః । 6

ఓం హిరణ్యగర్భాయ నమః 7

ఓం మరీచయే నమః । 8

ఓం ఆదిత్యాయ నమః । 9

ఓం సవిత్రే నమః । 10

ఓం అర్కాయ నమః । 11

ఓం భాస్కరాయ నమః । 12


ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే ।

ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే ॥

Tuesday, February 8, 2022

రథసప్తమిఅంటే ఏమిటి

రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు.

రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.

సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.

1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'

2. వైశాఖంలో అర్యముడు,

3. జ్యేష్టం-మిత్రుడు,

4. ఆషాఢం-వరుణుడు,

5. శ్రావణంలో ఇంద్రుడు,

6. భాద్రపదం-వివస్వంతుడు,

7. ఆశ్వయుజం-త్వష్ణ,

8. కార్తీకం-విష్ణువు,

9. మార్గశిరం- అంశుమంతుడు,

10. పుష్యం-భగుడు,

11. మాఘం-పూషుడు,

12. ఫాల్గుణం-పర్జజన్యుడు.


ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.

భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు.

అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు.

పురాణ కధనం ప్రకారం… బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రని తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట.

అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని 'యుగ సహస్ర యోజన పరాభాను' అని తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసాలో చెబుతారు.

దీన్ని లెక్క కడితే 'యుగం.. 12000 ఏళ్లు, సహస్రం 1000, యోజనం 8 మైళ్లు, (మైలు =1.6 కిలోమీటర్లు) కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. 

ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది.

సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.

ఆ ఏడు గుర్రాల పేర్లు:

1. గాయత్రి,

2. త్రిష్ణుప్పు,

3. అనుష్టుప్పు,

4. జగతి,

5. పంక్తి,

6. బృహతి,

7. ఉష్ణిక్కు


వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.

రామ రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని 'ఆదిత్య హృదయం' ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది.

ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.

సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.

ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. 

సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.

ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది.

జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.

ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి.

ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:

’నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః

అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!

యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!

ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!

మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!

ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!

సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!


*పూజ విదానం:- *

చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి, ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క , సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి.

ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.

ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. 

ఆ క్షీరాన్నాన్ని చెఱుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.

*జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో


భీష్మ తర్పణము

జీవ పితృకులందరు ( తండ్రి ఊన్నవారు కూడా)  నీటితో భీష్మ తర్పణము చేయవలయును

యజ్ఞోపవీతము ( నివీతిగా) దండ లాగా మార్చుకోవాలి


అజీవ పితృకులందరు ( తండ్రి లేనివారు )  తిలలతో భీష్మ తర్పణము చేయవలయును

యజ్ఞోపవీతము ప్రాచీనావీతిగా  మార్చుకోవాలి


ఆచమ్య

శ్రీ పరమేశ్వర ముద్దిశ్య  స్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం  మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణం కరిష్యే


తర్పణము

వైయాఘ్రపాద గోత్రం సాంకృత్య్త్య ప్రవరం గంగాపుత్ర వర్మాణం తర్పయామి తర్పయామి

వైయాఘ్రపాద గోత్రం సాంకృత్య్త్య ప్రవరం అపుత్ర వర్మాణం తర్పయామి తర్పయామి

వైయాఘ్రపాద గోత్రం సాంకృత్య్త్య ప్రవరం భీష్మం మతర్పయామి తర్పయామి

వసూనా మవతారయ శంతనో రాత్మజాయచ

అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే

అనేన భీష్మ తర్పణేన భగవాన్ సర్వాత్మక: శ్రీపరమేశ్వర స్సుప్రీణాతు శ్రీపరమేశ్వరార్పణమస్తు

ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి

 ఇప్పుడు ఎవరు వైదికులు ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి ఈనాడు ఆనాటి వైదీకులు అనేవాళ్ళు ఉన్నారా ఈనాడు అం...