Sunday, August 12, 2018

పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాలు..

పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణం లో వివరణ దొరుకుతుంది. రామ రావణ యుద్దము నందు, రావణుడు మహీరావణుడి సాయం కోరుతాడు, పాతాళానికి అధిపతి మహీరావణుడు.

ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల సయనమందిరము ( తోకతో ఏర్పాటు చేసినది) నుండి రామ లక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. అది తెలుసుకొన్న ఆంజనేయుడు శ్రీ రామ లక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్తాడు.పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి విచ్చిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకొన్న పవనుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు.

అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగ, గరుడ, వరాహ, హయగ్రీవ, నరసింహాదులు కలసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్చినం చేసి (ఆర్పి) శ్రీరామ లక్ష్మణులను కాపాడుకొంటాడు.

పంచముఖాలు ఐదు దిక్కులు వాటి వివరాలు !
హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు, హనుమంతుడు భక్తసులభుడు, హనుమంతుడి కరుణాకటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు అని వేదపండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఆంజనేయస్వామి నవ అవతారాలలో దర్శనం ఇస్తాడు.

ఆంజనేయస్వామి నవావతరాలు :

  • ప్రసన్నాంజనేయస్వామి
  • వీరాంజనేయస్వామి
  • వింశతి భుజ ఆంజనేయస్వామి
  • పంచముఖ ఆంజనేయస్వామి
  • అష్టాదశ భుజ ఆంజనేయస్వామి
  • సువర్చల ఆంజనేయస్వామి
  • చతుర్భుజ ఆంజనేయస్వామి
  • ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి మరియు
  • వానరాకార ఆంజనేయస్వామి


ఆంజనేయస్వామి నవావతారాలలో పంచముఖ ఆంజనేయస్వామి శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించాడు. పంచముఖాలు ఐదు దిక్కులను దృష్టిని సారించి ఉండగా ఆ ముఖాలలోని వివరాలు ఈ విధంగా చెప్పబడ్డాయి.
 
తూర్పుముఖముగా హనుమంతుడు:
తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు. ఆంజనేయ స్వామి, తూర్పునకు అభిముఖుడై, బాధలు కష్టాలనుండి రక్షించేవాడు
 
దక్షిణముఖంగా
దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.నరసింహ, దక్షిణాభిముఖుడు, దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు.
 
పడమర ముఖంగా
పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు. గరుడు, పడమటి దిక్కు వైపు ఆసీనుడై, ఆయుర్దాయ కాలాన్ని
ఊర్ధ్వంగా
ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.
 
శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి..
ఇక.. శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి.
 
"శ్రీరామజయం" అనే మంత్రాన్ని 108 సార్లు
అలాగే ఆంజనేయ స్వామికి 'శ్రీరామజయం' అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు. 

Saturday, August 4, 2018

సౌరశక్తి

ఈ వ్యాసం లో సంవత్సరంలోని ఈ సమయంలో, ఉత్తరార్థగోళంలో సూర్యుని ప్రభావం ఎలా ఉంటుందో, సౌరశక్తి మన శ్రేయస్సునీ, చైతన్యాన్ని ఎలా పెంపొందిస్తుందో చెప్తున్నారు. ప్రాణికోటిలో ఏదైనా సరే చెట్ల నుంచి, జంతువుల నుంచి మానవుల వరకు - ఇవి సుసంపన్నం అవ్వాలంటే ప్రకృతితో అనుసంధానమై ఉండవలసిందేనని చెప్తున్నారు.

భారతదేశంలోని ఎన్నో ప్రాంతాల్లో  ఈ రోజున సంవత్సరాదిగా జరుపుకుంటారు. ఇది, వసంత ఋతువుకి ఆరంభానికి సూచనగా  జరుపుకుంటారు. న్యూ ఇయర్ వేడుకలలా కాకుండా  - ఉగాది, యుగాది, గుఢీపడవా అన్నది సూర్యునికి భూమికి ఉన్న సంబంధాన్ని బట్టి, సూర్యుడి స్థానాన్ని బట్టి జరుపుకునేది. భూమిపై ఉన్న ప్రాణికోటి మీద సూర్యుడి ప్రభావం అన్నది ఎంతో ముఖ్యమైనది. ఇది మన మనుగడకు మూలమైనది. మీరు కనుక మీ చైతన్యాన్ని పెంపొందించుకోవాలి అనుకుంటే, సూర్యునితో మీ సంబంధం ఎంతో ముఖ్యం. మీరు ధ్యానం చేసుకోవాలి లేదా మీ పరిమితులను అధిగమించాలి అంటే సూర్యుని స్థానాలు లేదా గ్రహాల స్థానాలు మీకు ఖచ్చితంగా తెలియవలసిన అవసరం లేదు. మీరు కనుక మీ చైతన్యాన్ని పెంపొందించుకుంటూ ఉంటే, మీకు సహజంగానే ఇటువంటి కదలికలు తెలుస్తాయి.

మానవ శరీరం ఇంతకు మించి పరిణామం చెందాలంటే, సౌర వ్యవస్థలో ఎంతో నాటకీయమైన మార్పులు జరగాలి.
నా జీవితంలో ముఖ్య సన్నివేశాలను ఎప్పుడూ కూడా, ముందుగా ఈ విధంగా జరగాలి - అని అనుకోలేదు. కానీ అవి ఎప్పుడూ కూడా సరిగ్గా, అనువైన రోజునే జరుగుతూ ఉంటాయి. కొన్ని విషయాలు వ్యక్తం అవ్వాలంటే, దానికి అనువైన వాతావరణం ఉండాలి. ఇలాంటి అనువైన వాతావరణం నాలో సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఎలా అయితే వసంత ఋతువులో పూలు పుష్పిస్తాయో అలాగన్నమాట. పూలకు ఇప్పుడు పుష్పించాలి అన్న ఉద్దేశ్యంతో వికసించవు.  ప్రకృతి అందుకు అనువుగా ఉంటుంది కాబట్టి, వికసిస్తాయి. కానీ, కొన్ని రకాల మొక్కలు, ఇవి ఎంతో గట్టివి. ఇవి శీతాకాలంలో కూడా  పుష్పించగలవు. అదే విధంగా ఒక మానవుడు కూడా గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ, వాటి ప్రభావాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కొంత వరకు తట్టుకుని నిలబడగలడు. కానీ ఎవరూ కూడా ఈ ప్రక్రియల ప్రభావాల నుంచి పూర్తిగా విముక్తులు కారు.

🌹మానవ వ్యవస్థను నిర్మించినదంతా కూడా - ఈ సౌర చక్రమే.

ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆదియోగి మనకు తెలిపినట్లుగా, ఎన్నో విధాలుగా మానవ వ్యవస్థ అన్నది ఉన్నత స్థాయికి చేరుకున్నది. ఇది శారీరకంగా, న్యూరాలజి పరంగా ఇంకా అనుభూతి చెందడం, తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం అనేటటువంటి సామర్థ్యాల పరంగా ఉన్నత స్థాయిని చేరుకున్నది. ప్రకృతి, మానవ చైతన్యం పరిణామం చెందడానికి తావు ఇస్తూనే ఉంది.

మీరు ఈ మానవ వ్యవస్థ మీద పూర్తి నియంతృత్వం సాధించాలి అనుకుంటే, అందుకు 108 విషయాల మీద, మీరు పని చేయవలసి ఉంటుంది.
మానవ శరీరం ఇంతకు మించి పరిణామం చెందాలంటే, సౌర వ్యవస్థలో ఎంతో నాటకీయమైన మార్పులు జరగాలి. ఈ గ్రహ వ్యవస్థలోని ప్రస్తుత భౌతిక ధర్మాలు లేదా నియమాలు మానవ భౌతికత ఇంతకు మించి పరిణామం చెందేందుకు అనుమతించవు. మానవ దేహంలోని 114 చక్రాలలో రెండు శారీరిక పరిమితికి ఆవల ఉన్నాయి. మిగిలిన 112 చక్రాలలో మీరు 108 చక్రాలను ఉత్తేజితం చేయగలిగితే, మిగిలిన నాలుగూ సహజంగానే తెరుచుకుంటాయి. నిజానికి, మనం ప్రభావితం చేయగలిగింది 108 చక్రాలను మాత్రమే. అందుకే, సాంప్రదాయ పరంగా మనకి ఏదైనా మాలలో 108 పూసలు ఉంటాయి, 108 సార్లు మిమ్మల్ని ఏదైనా మంత్రం చదవమంటారు. ఏవైనా శక్తి స్థానాలలో 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేయడం అంతా కూడా – ఈ మానవ వ్యవస్థలోని 108 విషయాలలో మీరు పూర్తి నియంతృత్వం సాధించడానికే..! మీరు ఈ మానవ వ్యవస్థ మీద పూర్తి నియంతృత్వం సాధించాలి అనుకుంటే, అందుకు 108 విషయాల మీద, మీరు పని చేయవలసి ఉంటుంది.

మన గ్రహాలు అమర్చబడిన తీరులో ఇది  ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడి వ్యాసం, భూమి వ్యాసానికి 108 రెట్లు పెద్దది. సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం, సూర్యుడి వ్యాసాన్ని 108తో గుణిస్తే వస్తుంది. భూమికి చంద్రుడికీ మధ్య ఉన్న దూరం, చంద్రుడి వ్యాసాన్ని 108తో గుణిస్తే వస్తుంది. ఒక సంవత్సరంలో భూమి కక్ష్యను 108 పాదాలుగా విభజించవచ్చు.  అంటే, భూమి సూర్యుడి చుట్టూ 108 పూసలుగా, తనను తానే ఏర్పాటు చేసుకుంటోంది.   అలానే మీరు వేసుకునే మాలలో కూడా 108 పూసలు ఉంటాయి, భారత సంస్కృతిలో మన జీవితంలోని ఎన్నో అంశాలు -  గ్రహ వ్యవస్థకూ మానవ వ్యవస్థకూ మధ్య ఉన్న సంబంధం తెలుసుకొని, అవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకొని, ఆ మార్పులను మనం ప్రతీక్షణం, ప్రతీరోజూ ఎలా ఉపయోగించుకోవచ్చో, ఆ విధంగానే ఏర్పరచారు.

మీ వాతావరణంలో జరుగుతున్న మార్పులను గమనించి వాటికి అనుగుణంగా మీలో జరుగుతున్న మార్పులను గమనించండి.
ఈ ఆధునిక సాంకేతిక కాలంలో, మీరు ఎల్లప్పుడూ మీ సెల్ ఫోన్ కో, టీవి కో లేదా కంప్యూటర్ కో అలా అతుక్కొని కూర్చొని చూస్తూ ఉండిపోకండి. మీరు బయటికి వెళ్ళండి. మీ వాతావరణంలో జరుగుతున్న మార్పులను గమనించి వాటికి అనుగుణంగా మీలో జరుగుతున్న మార్పులను గమనించండి. ప్రాణికోటిలో ఏదైనా సరే - చెట్లు, జంతువుల నుండి మానవుల వరకు - అవి ప్రకృతితో అనుసంధానమై ఉన్నప్పుడు మాత్రమే సుసంపన్నం అవ్వగలవు. వచ్చే మూడు వారాలలో మానవ శక్తి మీద, మానవ చైతన్యం మీద సూర్యుని ప్రభావం ఎంతగానో ఉంటుంది.

ఈశాలో, ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందించే “ఆదియోగి“ ని - మానవాళికి అంకితం చేయడం జరిగింది.   మనమందరం కూడా ఈ సమయాన్నీ, ప్రకృతి సహజమైన ప్రభావాలనూ - మానవ చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలి. వచ్చే 21 రోజులు సూర్యుని శక్తి మన గోళం మీద ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటుంది. మీ సౌర శక్తిని పునరుత్తేజితం చేసుకోండి. ఇది మీ శ్రేయస్సుని, సుభిక్షతను సుసంపన్నం చేస్తుంది.

Friday, August 3, 2018

వేదాల్లోకి వెళ్దాం !

ఈ ప్రపంచంలో ‘మతం’ అనేదే లేని చోటు ఒకటి ఉండేది. అది వేద కాలపు భారత(ప్ర)దేశం. ‘భా’ అంటే ‘కాంతి’ లేదా ‘ప్రకాశం’ అనీ, ‘రత’ అంటే ‘అంకితమైన’, ‘ఆసక్తి కల’ అనీ అర్థాలు. భగవంతుడు కాంతి రూపుడు. భారతం’ అంటే ‘భగవంతుడికి అంకితమైనది’ లేదా ‘భగవంతుడిపై ఆసక్తి కలది’ అని భావం. అలాంటి భారతదేశంలో మతం లేని భగవత్‌ చింతన మాత్రమే ఉండేది. అది వేద ప్రతిపాదితం. వేదంలో మతం లేదు. మతం లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవించేవారు. మహర్షుల ఉపదేశాలూ, సందేశాలూ, పరిశీలనలూ, ప్రతిపాదనలూ వేదం అయినాయి.

🌹మొదట మూడు! తరువాత నాలుగు!!

‘వేదం’ అంటే విద్య లేదా జ్ఞానం అని అర్థాలు. తొలి దశలో వేదం ఒకటే. ఆపై మూడు విభాగాలై ‘త్రయీ విద్య’ అయింది. ‘ఋక్‌’, ‘యజుర్‌’, ‘సామ’ అని ఆ విభాగాలకు పేర్లు. మహాభారత కాలానికి కూడా వేదం త్రయీ విద్య గానే ఉండేది. అటు తరువాత ‘అథర్వ’ అన్న మరొకదానితో వేదం నాలుగు విభాగాలు లేదా శాఖలయింది. వేదం అన్నది నైతిక మార్గదర్శకాల, కర్మ కాండల, ప్రవర్తనా సూత్రాల క్రోడీకరణ కూడా! దైనందిన జీవనానికీ, అధ్యాత్మిక అభ్యాసానికీ మహర్షులు పలువురి సమష్టి ప్రయత్నమే వేద సంపుటి. ‘వేద యతి యతో ధర్మాధర్మ ఇతి వేదః’- ధర్మా ధర్మాలను తెలియజేసేది వేదం.

🌹మంత్రాలు... బ్రాహ్మణాలు... ఆరణ్యకాలు... ఉపనిషత్తులు!

వేదం నాలుగు భాగాలుగా ఉంటుంది. మంత్రం, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్‌ అనేవి. మంత్ర భాగాన్ని ‘సంహిత’ అని కూడా అంటారు. ఈ సంహితలు అయిదు. అవి ఋక్‌ సంహిత, కృష్ణ యజుస్సంహిత, శుక్ల యజుస్సంహిత, సామ యజుస్సంహిత, అథర్వ సంహిత. ఇక, బ్రాహ్మణాలు అయిదు. అవి ఐతరేయ బ్రాహ్మణం, తైత్తిరీయ బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం, షడ్వింశ బ్రాహ్మణం, గోపథ బ్రాహ్మణం. మంత్రం అన్నదానికి పలు అర్థాలున్నాయి. యజ్ఞం చేసే వాళ్లు పలికే శబ్ద సమూహం మంత్రాలే. మంత్రాలను ‘ఋక్‌, యజుస్‌, సామ’లని అన్నారు. ఋక్‌లు అంటే స్తుతులు, దైవప్రార్థనలు. వీటిని ‘సూక్తాలు’ అనీ అన్నారు. వేద సాహిత్యమంతా మంత్రాలే. మంత్రం లేదా సంహిత భాగానికి వివరణలు బ్రాహ్మణాలు. యజ్ఞాలను నిర్వహించే తీరును బ్రాహ్మణాలు వివరిస్తాయి.

ఋక్‌లు, బ్రాహ్మణాలు కర్మకాండకు సంబంధించినవి. మంత్రం, బ్రాహ్మణ శాఖల తరువాత ఆరణ్యకాలు ఉంటాయి. ఆరణ్యకాలు రెండు మాత్రమే కనిపిస్తున్నాయి. అవి ఐతరేయారణ్యకం, తైత్తరీయారణ్యకం. ఆరణ్యకాలు వైరాగ్యాన్ని ఉపదేశిస్తాయి. వానప్రస్థాశ్రమంలో అరణ్యాలలో అధ్యయనం చెయ్యడం వల్ల అవి ‘అరణ్యకాలు’ అని అనిపించుకున్నాయి. చివరి సమన్వయం (సింథసిస్‌) ఉపనిషత్తులలో తెలుస్తుంది. ఉపనిషత్తులు ఆధ్యాత్మికత వైపు నడిపిస్తాయి. అందుకనే వాటిని ‘బ్రహ్మకాండ’ అని అన్నారు. ఉపనిషత్తులు 108 కనిపిస్తున్నా పది ఉపనిషత్తులు మాత్రమే మౌలికమైనవి, ముఖ్యమైనవి. ఆది శంకరాచార్యులు దశోపనిషత్తులకు మాత్రమే భాష్యాలు రాశారు. అవి- ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరి, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకాలు. ఇవన్నీ కలుపుకొంటేనే వేద వాఙ్మయం.

🌹ఏనాటిది ఈ వేదం?

వేదానికి మూలం, కాలం ఇప్పటి వరకూ సరిగ్గా తెలియరాలేదు. అనుకోవడాలూ, అభిప్రాయపడడాలూ, వాదోపవాదాలూ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వేదం జీవనది అయి భారతం నుంచి ప్రపంచంలోకి ప్రవహించింది. జీస్‌సకు పదిహేడు శతాబ్దాల ముందే వేదం అరేబియాకు చేరింది. హీబ్రూ భాషలో ఉన్న పాత టెస్టమెంట్‌లో వేద సాహిత్యపు శైలీ, భావాలూ ఉన్నాయని విన్సెంట్‌ ఎ. స్మిత్‌ అనే పరిశీలకుడు తెలియజేస్తున్నాడు. వేదాన్ని దృష్టిలో పెట్టుకుని మహమ్మద్‌ నబికి కన్నా ముందు ఇప్పటికి 2,400 ఏళ్లకు పూర్వం జీవించిన అరబ్బీ కవి, దార్శనికుడు లబీబ్‌ ఇలా అన్నాడు- ‘‘ఓ ఆశీర్వదించబడిన హిందూ భూమీ, నువ్వు గౌరవించతగిన దానివి. ఎందుకంటే నీలో భగవంతుడు తన నిజమైన జ్ఞానాన్ని ప్రకటించాడు’’. విశ్వ గ్రంథ భాండాగారంలో ప్రథమ గ్రంథం ‘వేదం’ అని పరిశీలకులు నిర్ధారించిన దాన్ని మనం గుర్తుంచుకోవాలి.

🌹ఆధునిక భావాలెన్నో!

వేదంలోని మొదటి అక్షరం ‘అ’. భారత భూమిపై వెలసి నెలకొన్న తాత్త్విక, సాత్విక రచనలకన్నిటికీ వేదమే అధారం. ‘ఫిలాసఫీ’ అని మనం ఆ రచనల్ని అనకూడదు. ‘వాస్తవిక విద్యను దర్శించడంలో హేతువునూ, తార్కికతనూ ఉపయోగించడం ‘ఫిలాసఫీ’ అవుతుంది. కానీ మనవి వేద జనిత రచనలు కనుక అవి ఫిలాసఫీ అవవు.
‘వసుధైక కుటుంబకం’ (భూమి ఒక చిన్న కుటుంబం) అన్న విశ్వభావన ప్రపంచ వాఙ్మయంలో తొలిసారి వెలువడింది వేదం నుంచే. శక్తి కేంద్రాల వంటి పలు దేవతలు వేదంలో కనిపిస్తున్నా ‘పరమ పురుషుడు ఒక్కడే’ (తస్మాత్సర్వైరపి పరమేశ్వర ఏవ హూయతే!) అని వేదం తొలిసారిగా మానవాళికి తెలియజేసింది.

‘ఎవరైతే అన్ని ప్రాణులనూ తమలో చూస్తారో, అన్ని ప్రాణులలోనూ తమను చూస్తారో అటువంటి వారికి రోత లేదా విద్వేషం కలగదు’ (యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి, సర్వ భూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే) అని మానవజాతికి తొలిసారి చెప్పి సర్వ జీవ సామరస్యాన్ని నిర్దేశించింది వేదమే. ఎన్నో సార్వకాలిక, సార్వజనీన సత్యాలు వేదం నుంచి పుట్టి ప్రపంచమంతా వ్యాపించాయి.

‘సంఘాన్ని ప్రేమించు గౌరవించు, ఆకలి చేత పీడించబడిన వాళ్లను రక్షించు’ అని వేదం మానవాళికి నేర్పింది. వర్ణ, లింగ వివక్షలు లేని సమాజాన్ని వేదం నిర్దేశించింది. వేదంలో ఒక వధువు, వరుడితో ‘‘నేను ఋక్‌ (సాహిత్యం), నువ్వు సామం (గానం)’’ అని అంటుంది. స్త్రీ,పురుషుల సంబంధం ఎలా ఉండాలో ఇక్కడ చెప్పింది వేదం. మరో చోట ఓ స్త్రీ ‘‘నేను శిరస్సును, నేను జెండా(పతాకం)ను, నేను నిప్పుల మాటలు పలుకుతాను. నా భర్త నన్ను అనుసరించనీ!’’ అంటుంది. ఇక్కడ స్త్రీ స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం, స్త్రీ స్వాభిమానం వ్యక్తమవుతున్నాయి.

‘ఓ నమ్మకమా! మాకు నమ్మకాన్నివ్వు, భయం నుంచి విముక్తి నివ్వు, అంతులేని సంపదలకు మమల్ని అధిపతుల్ని చెయ్యి, శ్రేష్ఠమైన జ్ఞానాన్ని ప్రసాదించు’ అని మనతో పరమాత్మను అడిగిస్తోంది వేదం. అమెరికా దేశపు తత్త్వవేత్త ఆర్‌.డబ్ల్యూ. ఎమస్న్‌ (ఎమర్సన్‌ కాదు) ‘‘వేదంలోని భావం ఉష్ణంపై కాంతిలా ఉన్నతమైనది’’ అని అన్నాడు. ‘‘పరమాత్మ మనల్ని రక్షించాలి, మాకు పోషణనివ్వాలి, మాకు విద్యలలో సామర్థ్యం కలగాలి, తేజస్వులైన మాకు బ్రహ్మవిద్య అవగతం కావాలి, మాలో మాకు విద్వేషాలు కలగకుండా ఉండాలి’’ (ఓం సహనా వవతు సహనౌ భునక్తు, సహవీర్యమ్‌/ కరవావహై, తేజస్వీ నావథీ తమస్తు మా విద్విషా వ హై) అని వేదం మన చేత ప్రార్థన చేయిస్తూంటుంది.

వేదాన్ని ‘శ్రుతి’ అని కూడా అంటారు. మనకు తెలుసు గానానికి శ్రుతి ఉంటుందని. గానం శ్రుతిలోనే ఉండాలి. మన జీవన గానాలు శ్రుతిలోనే సాగాలి. మనం శ్రుతిలో కలవాలి. వేదాలలోకి వెళదాం. సత్యాలను ఆస్వాదిద్దాం.

🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻

ఎ ఆవ్ రా బా వా

  ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు తన ఆస్థాన కవులందరికీ ఒక పరీక్ష పెట్టాడు.

    " మీరు ఐదు అక్షరాల పదం ఒకటి రూపొందించాలి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో పుండాలి. ఆ ఒక్కొక్క అక్షరానికి ఆ భాషలో ఏమి అర్థమో మిగిలిన నాలుగు భాషల్లో కూడా అదే అర్థం వుండాలి.
అంతేకాక  ఆ ఐదక్షరాల పదంకూడా
అర్థవంతంగా వుండాలి.

 దీనికి సమాధానం రేపు సభాముఖంగా నాకు చెప్పండి."

 కవులలో కలకలం బయలుదేరింది.
విచిత్రమైన సమస్య అనుకుని ఎవరింటికి వారు బయల్దేరి వెళ్లారు.
మన తెనాలి రామకృష్ణ కు నిద్రపట్టడం లేదు. తన బావమరిది ఇంటికెళ్ళి అక్కడ పశువుల పాకలో మంచంవేసుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు‌. అర్థరాత్రి అయినది. ఆ సమయానికి పశువులశాలలో ఒక ఆవు దూడను ప్రసవించినది. వెంటనే రామ కృష్ణుడు " బావా! బావా! ఆవు ఈనింది‌" అని కేకలు వేశాడు. నిద్రమత్తులో నున్న బావమరిది ఆ మాటలు విని " ఏ ఆవ్ రా బా వా " అని అడిగాడు. రామకృష్ణకు వెంటనే ఏదో స్ఫురించింది. ఎగిరి గంతేసాడు.

   మరునాడు మహారాజు సభ తీర్చాడు.

" అందరూ సిద్ధంగావున్నారా" రాయలవారి మాట విన్న కవులు ఏమీ మాట్లాడలేదు. కాని రామకృష్ణుడు మాత్రం లేచి " నేను సిద్ధమే" అన్నాడు.

మహారాజు: ఏదీ ఆ పదం చెప్పు!

రామకృష్ణుడు: " ఎ ఆవ్ రా బా వా "

'ఏ' అనగా మరాఠీలో 'రా' అని అర్థము.

'ఆవ్ ' అనగా హిందీలో ' రా' అని అర్థము.

'రా' అనగా తెలుగులో 'రా' అనే కదా అర్థము!

'బా' అనగా కన్నడ భాషలో 'రా' అని అర్థము.

' వా' అనగా తమిళంలో  'రా' అని అర్థము.

ఈ అయిదు అక్షరాలూ అయిదు భాషలకు చెందినవి. ఈ అయిదు అక్షరములు కలిసిన పదం " ఏ ఆవ్ రా బా వా" ఇదికూడా అర్థవంతమైన పదమే!

తెనాలి రామకృష్ణుడి వివరణతో మహారాజుకు మహదానందం కలిగింది. రామకృష్ణునికి భూరి బహుమానాలు లభించాయని వేరే చెప్పాలా !

గుడికి ఎందుకు వెళ్ళాలి?

మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.


💐గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.
⛳మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.
🏹భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.
⛳దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.
🌷అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.
ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.
⛳ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.
⛳గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.
🙏మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.
🌷గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.
⛳తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
💐ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.
🌄లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.
🎇భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది.
🙏 కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.🙏🙏 🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి?

హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి.

నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.

'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'
శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం
శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||

అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి ''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు'' అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి.

ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం, శిర స్స్నానం, నేలపడక, సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి. ఆచరణ: భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి.