These are the articles which I have liked and didnt want to get lost over a period of time and which are collated from various sources include websites, blogs, whatsapp forwarded messages. These are not my original work and just a collation.
Sunday, October 15, 2017
Saturday, October 14, 2017
గోచారములో గురుడు పన్నెండు రాశులలో సంచరించునపుడు కలుగు ఫలితములు ..
గోచారం ప్రకారం గురువు 2 5 7 9 11 రాశులలో ఉన్నప్పుడు శుభ ఫలితములు కలుగజేయును.
గోచారరీత్యా గురువు తులా రాశిలో సంచారం చేస్తున్నప్పుడు కావేరి పుష్కరాలు ప్రారంభం అగును. గురువు కన్యా రాశి నుండి తులా రాశిలోకి 12-09-2017 న ప్రవేశిస్తున్నాడు.
మేషరాశి వారికి సప్తమ స్ధాన ఫలితాలను, వృషభరాశి వారికి షష్టమ స్ధాన ఫలితాలను, మిధునరాశి వారికి పంచమ స్ధాన ఫలితాలను, కర్కాటకరాశి వారికి చతుర్ధ స్ధాన ఫలితాలను, సింహరాశి వారికి త్రుతీయ స్ధాన ఫలితాలను, కన్యారాశి వారికి ద్వితీయ స్ధాన ఫలితాలను, తులారాశికి జన్మ స్ధాన ఫలితాలను, వృశ్చికరాశి వారికి వ్యయ స్ధాన ఫలితాలను, ధనస్సు రాశి వారికి లాభ స్ధాన ఫలితాలను, మకర రాశి వారికి దశమ స్ధాన ఫలితాలను, కుంభరాశి వారికి నవమ స్ధాన ఫలితాలను, మీనరాశి వారికి అష్టమ స్ధాన ఫలితాలను కలుగజేస్తాడు.
గోచార రీత్యా గురువుకు శుభా అశుభ స్ధానాలు
గురుడు : దేశ త్యాగం , విత్తం లాభం అనర్ధం ధన నాశనం
సంపద , క్లేశం , ఆరోగ్యం , ధన హానిం ,ధనాగమం
పీడనం లాభ నష్టంచా క్రమేణ కురుతే గురుః
తాత్పర్యము : గురుడు ద్వాదశ రాశులలో సంచరించు సమయములో 1 దేశ త్యాగము 2 ధన లాభము ౩ కార్య హాని 4 ధన నాశనము 5 సంపద 6 దుఃఖము 7 ఆరోగ్యము 8 ధన హాని 9 ధనాగమము 10 ఆయాసము 11 లాభములను 12 నష్టములను కల్గించు చున్నాడు .
శ్లోకం : రాజకోపో యశోహానీ రుద్యోగస్య విరోధకం І
బుద్ధిభ్రంశో భాగ్యహాని ర్భయంతను గతే గురౌ ІІ
జన్మ రాశిలో గురుడు సంచరించు నపుడు ప్రభుత్వ అధికారుల కోపమునకు గురియగుదురు . పేరు ప్రఖ్యాతలకు నష్టము కలుగును . చేయు వృత్తి , వ్యాపారములలో ఇబ్బందులు ఎదురగును . బుద్ది గతి తప్పును . సంపద నశించును . భయముగా ఉండును .
శ్లోకం : మనస్సౌఖ్యం యశోవృద్ధి స్సౌభాగ్యంచ ధనాగమః І
ధర్మ వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్తానగేగురౌІІ
రెండవ రాశిలో గురు సంచార వేళలో మనస్సున సౌఖ్యము కలుగును , గృహమునందు శుభ కార్యములు జరుగును . కీర్తి ప్రతిష్టలు పెరుగును . ధన రాబడి బాగుంటుంది . తీర్ధ యాత్రలు చేయడము , ధర్మ బద్దమైన కార్య క్రమములలో పాల్గొనడము జరుగుతుంది . సంతోషముగా ఉంటుంది . కుటుంబ సౌఖ్యము కలుగును .
శ్లోకం : అతిక్లేశం బంధువైరం దారిద్యం దేహపీడనం І
ఉద్యోగ భంగం కలహం తృతీయ స్తానగే గురు: ІІ
మూడవ రాశిలో గురుడు సంచారము చేయు చున్నప్పుడు శారీరక శ్రమ అధికము గా ఉంటుంది . చుట్టములతో విరోధము ఏర్పడుతుంది .దరిద్రమును అనుభవిస్తారు. ఉద్యోగ వ్యాపారములలో నష్టములు కలుగుతాయి . శరీరమునందు భాధలు , అనవసరమైన తగవులు ఏర్పడతాయి .
శ్లోకం : యాచనం బుద్ది చాంచల్యం తేజో హానీం ధన వ్యయం І
దేశ త్యాగంచ కలహం చతుర్ధ స్తానగే గురు: ІІ
నాలుగవ రాశిలో గురుని సంచారము జరుగు చున్నప్పుడు దీన స్థితి కలుగుతుంది . బుద్ది చంచలముగా ఉండును. మర్యాద నశించును . ధన నష్టము కలుగును గొడవలు పెరుగుతాయి . స్థాన నాశనము కలుగుతుంది
శ్లోకం : అర్ధ లాభం తదైశ్వర్యం స్వకర్మ రతి హర్షితం І
సదా స్వజన సౌఖ్యంచ పంచమస్థే భావే ద్గురౌ ІІ
అయిదవ రాశిలో గురుని సంచారము జరుగు చున్నప్పుడు ధన లాభము కల్గుతుంది . స్వయముగా చేపట్టిన పనులు అనుకూలించుటయే కాక విజయము లభించును తన కుటుంబ మరియు బంధు వర్గముల వలన సౌఖ్యమును అనుభవిస్తారు .
శ్లోకం : దారాపుత్ర విరోధశ్చ స్వజనై కలహస్తదా І
చోరాగ్ని నృప భీతిశ్చ షష్టమస్తే భవేద్గురౌ ІІ
బృహస్పతి ఆరవ రాశి సంచారము లో ఉన్నప్పుడు జీవిత భాగస్వామితోనూ , పిల్లలతోనూ విరోధము ఏర్పడును . అసహనము కలుగును , దొంగల వలన నష్టము ఏర్పడును . అగ్ని భయము కలుగును . ప్రభుత్వ సంభందిత వ్యవహారములలో ఇబ్బందులు కలుగును .
శ్లోకం : రాజ దర్శన మారోగ్యం గాంభీర్యం గాత్రపోషణం І
అభీష్ట కార్య సిద్దిశ్చ సప్తమస్తే భవేద్గురౌ ІІ
ఏడవ రాశిలో గురుని సంచారము జరుగు చున్నప్పుడు మంచి ఆరోగ్యముగా ఉంటారు . ప్రభుత్వ పరిపాలకుల తో పరిచయములు ఏర్పడతాయి . తలచిన కార్యములు నెరవేరుతాయి . ప్రతి పని తనకు అనుకూలముగా జరుగుతుంది .
శ్లోకం : చోరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం І
నిష్టురం సాహసం క్రోధం అష్టమస్తే గురౌ భవేత్ ІІ
ఎనిమిదవ రాశిలో బృహస్పతి ఉన్నప్పుడు దొంగల వలన గానీ , అగ్ని వలన గానీ , నష్టము ఏర్పడును , శరీర సౌఖ్యము ఉండదు . నిస్టూరముగా మాట లాడడం , ప్రతి పనిలోనూ తెగింపు , కోపము ఎక్కువగా ఉండడము జరుగుతుంది .
శ్లోకం : అర్ధంచ స్వకులాచారః గృహలాభః సుభోజనం І
నిత్య స్త్రీ జన సంపర్కం నవమస్తే భవేత్ గురౌ ІІ
తొమ్మిదవ రాశిలో గురుని సంచారము ఉన్నప్పుడు సునాయాస ధన లాభము కలుగును . మంచి ఆచార సాంప్రదాయముల ప్రకారము నడచుకొంటారు. గృహము నిర్మించుకొంటారు . ఇరుగు పొరుగు వారితో కలసి మెలసి ఉంటారు . భార్య భర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది .
శ్లోకం : ధాన్య నాశో ధనచ్చేదః వృధా సంచరణం భయం І
స్వజనై దూషనః చైవ దశమష్తో యదా గురు: ІІ
బృహస్పతి పదవ రాశిలో సంచరించు చున్నప్పుడు ధనమునకు నాశనము కలుగును , అనవసర ఖర్చులు పెరుగుతాయి . బ్రతుకు భయముగా సాగుతుంది . ఇతరులచే దూషించ బడతారు .
శ్లోకం : యశో వృద్ధి బలం తేజ స్సర్వత్ర విజయ స్సుఖం І
శత్రు నాశో మంత్రం సిద్ధి రేకాదశ గతే గురౌ ІІ
పదకొండవ రాశి లో గురుడు సంచారము చేయుచున్నప్పుడు మంచి పేరును సంపాదిస్తారు . తేజస్సు , పలుకుబడి పెరుగుతుంది . శత్రువులు నాశనమవుతారు ,అన్నివిధాలా లాభమును పొందుతారు .
శ్లోకం : శుభ మూలో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దూషణం І
స్థాన భ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్తానగే గురౌ ІІ
పన్నెండవ రాశిలో గురుడు సంచారము జరిగేటప్పుడు ఇంటిలో శుభ కార్యములు జరుపుట వలన ధనము ఖర్చగును . ఆస్తులను అమ్ముకొంటారు . దరిద్రమును అనుభవించుట , స్థానమును మారుట మొదలగు ఫలితములను కలుగచేయును.
పదవి గురించి భీష్ముడు చెప్పిన కథ .. గొప్ప వారు చెప్పిన గొప్ప నీతి
ఉన్నత పదవులలో ఎలాంటివారిని నియమించాలి? అన్న అనుమానం వచ్చింది ధర్మరాజుకి. దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ ఆయన భీష్ముని కోరాడు. అప్పుడు భీష్ముడు ఓ కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు.
‘‘పూర్వం ఒక అడవిలో ఓ ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓ కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని, దానిని తన చెంత ఉండనిచ్చేవాడు. వీరి అనుబంధం ఇలా కొనసాగుతుండటా ఓరోజు ఆ కుక్క ఓ పులి కంటపడింది. అంతే! ఆ పులి తన పంజా విసురుతూ కుక్కని బలిగొనబోయింది.
‘‘వెంటనే ఆ కుక్క పరుగుపరుగున పోయి మునీశ్వరుని వెనుక నక్కింది. తనను నమ్ముకున్న కుక్క ఆ పులికంటే బలహీనంగా ఉండటం వల్లే కదా, దానికి ఆపద కలిగింది- అనుకున్నాడు మునీశ్వరుడు. దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు. ఆ ఘటనను చూసిన పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది. కానీ పులిగా మారిన కుక్క జీవితం అక్కడి నుంచి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే మరోసారి దాని మీదకి ఓ ఏనుగు దూసుకువచ్చింది. యథాప్రకారం పులిరూపంలో ఉన్న కుక్కను ఏనుగులా మార్చివేశాడు ఆ మునివర్యుడు.
‘‘ఇలా ఏ జంతువు దాడి చేసినా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ముని. అలా బెబ్బులిలా మారిన కుక్క ఓ రోజు బోర విరుచుకుని అడవిలో తిరగసాగింది. ఇక తన మీద దాడి చేసేంతటి శక్తి మరో జంతువుకి లేదన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది. కానీ అలా తిరుగుతుండగా దాని మనసులో ఓ ఆలోచన మొదలైంది- ‘మునివర్యులు నా మీద జాలిచూపారు కాబట్టి, నన్ను అన్నింటికంటే శక్తిమంతమైన జంతువుగా మార్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ రేపు మరో జంతువు ఏదన్నా మునీంద్రుని శరణువేడితే నా పరిస్థితి ఏంటి? అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తలవంచాల్సిందే కదా!’ అనుకుంది. ‘అసలు ఆ మునీశ్వరుని చంపిపారేస్తే, అతను మరో జంతువు మీద జాలి చూపే అవకాశం ఉండదు,’ అని పన్నాగం పన్నింది.
‘‘కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు యోచనలు చేస్తూ ఏమీ ఎరగనట్లు ముని ముందరకి వచ్చి కూర్చుంది. కానీ కుక్కను బెబ్బులిగా మార్చినవాడు, దాని మనసులో ఏముందో గ్రహించలేడా! మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోని దురాలోచనను పసిగట్టాడో వెంటనే తిరిగి దానిని కుక్కగా మార్చేశాడు! అది పూర్వంలాగే కుక్కబతుకుని గడపసాగింది.
‘‘కాబట్టి ధర్మనందనా! దుర్మార్గులకు ఉన్నతపదవులని ఇస్తే, వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది. అందుకే యోగ్యతని అనుసరించి పదవులను అందించాలి. అలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యాన్నయినా సాధించగలడు,’’ అంటూ ముగించాడు భీష్మపితామహుడు

Treasures of Vedas, Shahstras etc
IIT Kanpur has develped a website on our treasures of Vedas, Shahstras etc. Finally someone from today's science & technology field, is digging into what has already been done many many years ago.
Check it out: https://www.gitasupersite.iitk.ac.in/
No issue of language as IITK smartly put each Sholka in various languages. Most amazingly, commentary on each sholka by various scholars has also been provided. When you click on Hindi translation and select the language as Tamil, it automatically translate everything into Tamil. Good use of technology.

Sunday, October 8, 2017
Friday, October 6, 2017
చంద్రకళలను బట్టి నిత్య దేవతారాధన
దక్ష ప్రజాపతి ఇరువై ఏడుగురు కుమార్తెలను పరిణయమాడిన చంద్రుడు రోహిణిపై ఎందుకో మిక్కిలి ప్రేమ చూపెడివాడు, ఈ విషయమై మందలించిన దక్షుని మాటను మన్నించని చంద్రుని దక్షుడు కోపగించి క్షయ వ్యాధితో బాధపడమని శపించగా, శాపవశాన చంద్రుడు క్షీణించసాగాడు, అమృత కిరణ స్పర్శలేక దేవతలకు అమృతం దొరకడం కష్టమైనది. ఓషదులన్ని క్షీణించినవి, అంత ఇంద్రాది దేవతలు చంద్రుని తోడ్కొని బ్రహ్మదేవుని కడకేగి పరిష్కార మడిగారు. అంత చతుర్ముఖుడు చంద్రునికి మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశించాడు. ప్రభాస తీర్థమున పరమశివునికి దయగల్గి ప్రత్యక్షమవగా చంద్రుడు శాపవిముక్తికై ప్రార్థించెను. అంత పరమేశ్వ రుడు చంద్రుని అనుగ్రహించి కృష్ణపక్షాన కళలు క్షీణించి, శుక్లపక్షమున ప్రవర్ధమానమై పున్నమి నాటికి పూర్ణ కళతో భాసిల్లుమని వరమిచ్చాడు.
కళలు చంద్రునికి సూర్యునికి మధ్య దూరం మీద ఆధారపడి ఉంటుంది. అత్యల్పదూరం అమావాస్య.అత్యధిక దూరం పౌర్ణమి. చంద్రుడు భూమి చుట్టూ భూమి సూర్యునిచుట్టూ పరిభ్రమిస్తూఉంటాయి. 16 కళలు అనివీటినే అంటారు. వాటికి పెర్లు ఉన్నాయి -
చంద్రుని పదహారు కళలు: 1. అమృత, 2. మానద, 3. పూష, 4. తుష్టి, 5. పుష్టి, 6. రతి ధృతి, 7. కామదాయిని, 8. శశిని, 9. చంద్రిక, 10. కాంతి, 11. జ్యోత్స్న, 12. శ్రీ, 13. ప్రీతి, 14. అంగద, 15. పూర్ణ, 16. అపూర్ణ. 15 తిథులకు 16 ఎందుకు అంటే పూర్తి పౌర్ణమి,పూర్తి అమావాస్య ఘడియలు అనేవి స్వల్ప సమయమే ఉంటాయి.
ఈ 16 కళలకు నిత్యం ఆరాధింపవలసిన దేవతలు ఉన్నారు.నిత్యాదేవతలు మొత్తం 16 మంది 15 నిత్యలను త్రికోణంలోని ఒక్కొక్క రేఖ యందు ఐదుగురు చొప్పున పూజించి 16వ దైన లలితా త్రిపుర సుందరీదేవిని బిందువు నందు పూజించాలి.జాతకం ప్రకారం ఎవరు ఏ తిధిన జన్మిస్తే ఆయా దేవతా మంత్రాలను 11 సార్లు జపించాలి.లేదా ఆయా తిధులను బట్టి ఆయా మంత్రాలను ప్రతిరోజు 11 సార్లు పఠించటం మంచిది.అవి
బహుళ పాడ్యమి నాడు పుట్టిన వారు “కామేశ్వరీదేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “కామేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ విదియ నాడు పుట్టిన వారు “భగమాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఆం “భగమాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ తదియ నాడు పుట్టిన వారు “నిత్యక్లిన్నా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఇం “నిత్యక్లిన్నా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ చవితి నాడు పుట్టిన వారు “బేరుండా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఈం “బేరుండా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ పంచమి నాడు పుట్టిన వారు “వహ్నివాసినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఉం “వహ్నివాసినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ షష్ఠి నాడు పుట్టిన వారు “మహావజ్రేశ్వరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఊం “మహావజ్రేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ సప్తమి నాడు పుట్టిన వారు “శివదూతీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఋం “శివదూతీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ అష్టమి నాడు పుట్టిన వారు “త్వరితా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౠం “త్వరితా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ నవమి నాడు పుట్టిన వారు “కులసుందరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఌం “కులసుందరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ దశమి నాడు పుట్టిన వారు “నిత్యా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౡం “నిత్యా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ ఏకాదశి నాడు పుట్టిన వారు “నీలపతాకా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఏం “నీలాపతాకా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ ద్వాదశి నాడు పుట్టిన వారు “విజయా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఐం “విజయా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ త్రయోదశి నాడు పుట్టిన వారు “సర్వమంగళా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఓం “సర్వమంగళా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ చతుర్ధశి నాడు పుట్టిన వారు “జ్వాలామాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఔం “జ్వాలామాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
అమావాస్య నాడు పుట్టిన వారు “చిత్రా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “చిత్రే” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల పాడ్యమి నాడు పుట్టిన వారు “చిత్రా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “చిత్రే” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల విదియ నాడు పుట్టిన వారు “జ్వాలామాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఔం “జ్వాలామాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల తదియ నాడు పుట్టిన వారు “సర్వమంగళా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఓం “సర్వమంగళా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల చవితి నాడు పుట్టిన వారు “విజయా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఐం “విజయా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల పంచమినాడు పుట్టిన వారు “నీలపతాకా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఏం “నీలాపతాకా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల షష్ఠి నాడు పుట్టిన వారు “నిత్యా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౡం “నిత్యా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల సప్తమి నాడు పుట్టిన వారు “కులసుందరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఌం “కులసుందరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల అష్టమి నాడు పుట్టిన వారు “త్వరితా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౠం “త్వరితా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల నవమి నాడు పుట్టిన వారు “శివదూతీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఋం “శివదూతీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల దశమి నాడు పుట్టిన వారు “మహావజ్రేశ్వరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఊం “మహావజ్రేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల ఏకాదశి నాడు పుట్టిన వారు “వహ్నివాసినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఉం “వహ్నివాసినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల ద్వాదశినాడు పుట్టిన వారు “బేరుండా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఈం “బేరుండా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల త్రయోదశి నాడు పుట్టిన వారు “నిత్యక్లిన్నా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఇం “నిత్యక్లిన్నా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల చతుర్ధశి నాడు పుట్టిన వారు “భగమాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఆం “భగమాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
పౌర్ణమి నాడు పుట్టిన వారు “కామేశ్వరీదేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “కామేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

Sunday, October 1, 2017
ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు ...
సాధారణంగా నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేస్తాడు. ఎవరు చేయాలి అంటే యజమాని నిత్యపూజా చేయాలి. సంకల్పంలోనే ఉంది ‘ధర్మపత్నీ సమేతస్య’ అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే పూజామందిరంలోకి వెళ్ళడం ఇంక అంతకన్నా అన్యాయమైన విషయం ఏం ఉంటుంది? ఇంక దానిమీద వ్యాఖ్యానం చేయడం అనవసరం. కాబట్టి అలాగే పూజ చేస్తారు అని మనం భావన చేయాలి.
పురుషుడు ప్రతిరోజూ పూజ చేస్తాడు. నైమిక్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా ప్రక్కన కూర్చుంటుంది. వినాయక వ్రతంలాంటిది చేసినప్పుడు. వస్త్రధారణా నియమం అన్నప్పుడు ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ వేసుకుంటుంది, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం. కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం.
ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది – ‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ – గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదు; అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు; అంటే ఉత్తరీయం ఒక్కటే ఉండాలి పురుషుడికి.
చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు. దేవాలయంలోనైనా అంతే. కళ్యాణం చేసుకోవడానికి వెళ్తే ఎవరో వచ్చి చిన్నపిల్లలకి చెప్పినట్లు చొక్కా విప్పండి, బనియను విప్పండి అని చెప్పక్కరలేదు. మనంతట మనమే తీసి కూర్చోవాలి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు. నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడు వీడికి, వీడు వాడికి కనపడాలి. ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు.
యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనుకోండి నీయందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు స్వాగతం చెప్పడానికి ఇంటి బయటికి వచ్చిన ఇంటి యజమాని ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. నేను ఎవరి ఇంటికైనా వెళ్ళాను అనుకోండి, ఆయన ఎడమ భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురు వచ్చి స్వాగతం పలికాడు అనుకోండి ఆయన అభ్యున్నతి కొరకు మంచిమాటలు చెప్పవచ్చు.
ఆయన అలా రాలేదు అనుకోండి నాపని చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నాకు అయన పెద్దరికం అనడానికి గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి.
మీరు గమనించండి కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వు భగవంతుడితో సమన్వయము అవుతున్నావు. ఆయన చేయి చాపాలి, కాళ్ళు చాపాలి, ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై అయి ఉండాలి. ఉత్తరీయం వేసుకుని ఉండాలి.
‘అనుత్తరీయశ్చ, నగ్నశ్చ – వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. ‘అవస్త్రఏవచ’ – మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్నమాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి పూజకు పనికిరాను. గోచీపోసి కట్టే కూర్చోవాలి. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు.
దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు. అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు. అవతలి వాడు పదికాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు. అందుకే పీటలమీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజు ఉంటే బయట కుట్టించు. పీటల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో. ఆయుఃకారకం నువ్వు ఇచ్చేది. నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు. ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మనవాళ్ళు పంచెల చాపు పెడతారు.
పరమమంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్ట గోచీ పోసుకుని కట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు. శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పూజ దగ్గరికి వెళితే లాల్చీ, బనియను కూడా పనికిరావు. తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచీ పోసి పంచె కట్టుకుని కూర్చుని పూజ చేయాలి. గోచీ ఎంత బాగా పోయాలి. అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు. ఒక అంచు తీసి నీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు కచ్ఛ ఉన్నట్లే. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణయందు అటువంటి నియమము ఉన్నది. అదేం పెద్ద విశేషమా? అదేం బ్రహ్మవిద్యేం కాదు. పూజయందు ఎప్పుడూ గోచీపోసి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పురుషుడు పూజ చేయవలసి ఉంటుంది.

Subscribe to:
Posts (Atom)
ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి
ఇప్పుడు ఎవరు వైదికులు ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి ఈనాడు ఆనాటి వైదీకులు అనేవాళ్ళు ఉన్నారా ఈనాడు అం...
-
The Complete Digest written by Sahasra Sai "Rudra" is a name of Lord Shiva whereas "Aksha" means tears. The ...
-
1) విష్ణువు –గరుడుడు 2) లక్ష్మీదేవి –గుడ్ల గూబ 3) రతి మన్మదులు=కీరం(చిలుక) 4) హనుమంతుడు=ఒంటే 5) శివుడు =వృషభం 6) పార్వతి దేవి=సింహం 7) వినాయ...
-
నివేదనల పేర్లు 1)చూతఫలం=మామిడిపండు 2)ఖర్జూర= ఖర్జూరం. 3)నింబ=వేప 4)నారింగ=నారింజ 5)భల్లాతకీ=జీడిపప్పు 6)బదరీ=రేగు 7)అ...