*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!*
*నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* *ఇంద్రుడు పూజించు పాదపద్మములు కలవాడు , పామును యజ్ఞోపవీతముగా దాల్చినవాడు , తలపై చంద్రుని అలంకరించు కున్నవాడు , దయ చూపించువాడు , నారదుడు మొదలైన యోగులచే నమస్కరింప బడువాడు , దిగంబరుడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.* *2) భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం!నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్!* *కాలకాలమమ్బుజాక్షమస్తశూన్యమక్షరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* *కోటిసూర్యులవలే ప్రజ్వలించువాడు , సంసారసముద్రమును దాటించువాడు , ఉత్తముడు , నీలకంఠుడు , కోరికలు తీర్చువాడు , మూడుకన్నులు కలవాడు , యమునికేయముడైనవాడు , పద్మమువంటి కన్నులు కలవాడు , నాశము లేనివాడు , స్థిరమైనవాడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.* *3)శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం!శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్!!* *భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* *శూలము – టంకము – పాశము – దండము అను ఆయుధములను చేతులలో ధరించినవాడు , అన్నిటికీ ఆదికారణ మైనవాడు , నల్లని శరీరము కలవాడు , ఆదిదేవుడు , నాశము లేనివాడు , దోషము లంటనివాడు , భయంకరమైన పరాక్రమము కలవాడు , సమర్థుడు , ఆనందంగా తాండవము చేయువాడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.* *4) భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం! భక్తవత్సలం స్థిరమ్ సమస్తలోకవిగ్రహమ్!!* *నిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* *భుక్తి – ముక్తుల నిచ్చువాడు , ప్రశస్తమైన సుందర శరీరము కలవాడు , భక్తవత్సలుడు , స్థిరమైనవాడు , సమస్త ప్రపంచమునూ నిగ్రహించువాడు , నడుమునందు మోగుచున్న అందమైన బంగారు చిరుగంటలు ధరించినవాడైన శివ రూపమును, , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.* *5) ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం!కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్!!* *స్వర్ణవర్ణకేశపాశశోభితాఙ్గనిర్మలం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* *ధర్మమును రక్షించువాడు , అధర్మమును నాశనం చేయువాడు , కర్మపాశములను విడిపించువాడు , సుఖమునిచ్చువాడు , అంతటా వ్యాపించినవాడు , బంగారు వన్నెకల కేశపాశములతో శోభిల్లు నిర్మలశరీరుడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.* *6)రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం!నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్!!* *మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* *అందమైన పాదములందు రత్నపాదుకలను ధరించినవాడు , నిత్యుడు , అద్వితీయుడు , ఇష్టదైవము , నిరంజనుడు , యముని అహంకారముని నాశనం చేయువాడు , భయంకరమైనకోరలతో ముక్తిని ప్రసాదించువాడు, , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.* *7)అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం!దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్!!* *అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* *బ్రహ్మాండమును ఒక్క గర్జింపుతో బద్దలు చేయువాడు , చూపుతో పాపములను తొలగించువాడు , నైపుణ్యముతో ఉగ్రముగా శాసించువాడు , అష్టసిద్ధులను ప్రసాదించువాడు , కపాలమాల ధరించినవాడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.* *8)భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం!కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్!!* *నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* *భూతనాయకుడు , విశాలమైన కీర్తి కలిగించువాడు , కాశీలో నివసించువారి పుణ్యపాపములను శోధించువాడు , సర్వవ్యాపి , నీతిమార్గపండితుడు , పురాతనుడు , ప్రపంచరక్షకుడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.* *కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం! జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ !* *శోకమోహదైన్యలోభకోపతాపనాశనం! తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రి సన్నిధిం ధ్రువమ్ !!* *మనోహరమైనది, జ్ఞ్యానమును, ముక్తిని కలిగించునది,అనేక పుణ్యములను పెంపొందించునది, శోకము, మోహము, దీనత్వము,కోపము, పాపములను నశింపచేయునది అగు కాలభైరవ అష్టకం పఠించువారు నిశ్చయముగా కాలభైరవ పాద సన్నిధిని చేరెదరు.*These are the articles which I have liked and didnt want to get lost over a period of time and which are collated from various sources include websites, blogs, whatsapp forwarded messages. These are not my original work and just a collation.
Wednesday, December 11, 2024
Thursday, July 25, 2024
పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి
విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది.
చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు...
ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాము!!...
బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు, అయినా వారికి అంతుపట్టలేదు.
వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు, అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు, ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు.
శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు.
ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది.
ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా మన పురాణాల్లో వర్ణించబడింది.
ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని, గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు.
అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు.
స్మార్త సంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి.
ఉత్తర భాగాన (అనగా ఎడమభాగాన) అమ్మవారి స్వరూపం లేని కేవల శివ స్వరూపం కనుక దానికి ‘దక్షిణామూర్తి’ అని పేరు.
మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు, ఆ స్వామిని ప్రతిపాదించ మంత్రాలలో ఒక మంత్రానికి అధి దేవతామూర్తి మాత్రమే.
అలాగే శ్రీ దత్తాత్రేయుడు, గురుదత్తుడు అనేవారు వేరేవేరే దేవతామూర్తులు కాదు.
ఈ దత్తుడు త్రిమూర్త్యాత్మకుడు. సర్వసంప్రదాయ సమన్వయకర్త.
ఇక దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరేనా అంటే, తత్త్వ దృష్టిలో ఖాయంగా ఒకరే.
వ్యావహారిక దృష్టిలో, ఉపాసనా విధానంలో మాత్రం భిన్నులు.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒకరా? వేరా? అంటే, ఏమి చెబుతామో, ఇక్కడా అలాగే చెప్పుకోవాలి.
ఒక దృష్టితో భిన్నత్వం! మరో దృష్టితో ఏకత్వం!!
శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం.
దక్షిణ అంటే సమర్థత అని అర్ధం, దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం.
అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి.
దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం.
ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.
మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి.
దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది.
అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు.
విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.
*మంత్రశాస్త్రం 16 దక్షిణామూర్తులను ప్రస్తావించింది.*
_ఆ రూపాలు వరుసగా...._
1. శుద్ధ దక్షిణామూర్తి,
2. మేధా దక్షిణామూర్తి,
3. విద్యా దక్షిణామూర్తి,
4. లక్ష్మీ దక్షిణామూర్తి,
5. వాగీశ్వర దక్షిణామూర్తి,
6. వటమూల నివాస దక్షిణామూర్తి,
7. సాంబ దక్షిణామూర్తి¸
8. హంస దక్షిణామూర్తి,
9. లకుట దక్షిణామూర్తి,
10. చిదంబర దక్షిణామూర్తి,
11. వీర దక్షిణామూర్తి,
12. వీరభద్ర దక్షిణామూర్తి¸
13. కీర్తి దక్షిణామూర్తి,
14. బ్రహ్మ దక్షిణామూర్తి¸
15. శక్తి దక్షిణామూర్తి,
16. సిద్ధ దక్షిణామూర్తి.
ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది.
భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు, చంద్రకళాధరుడు, జ్ఞానముద్ర, అక్షమాల, వీణ, పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.
పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.
చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షముకి అధిష్ఠానం అయి ఉంటాడు.
సేకరణ .
Monday, May 27, 2024
విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత
రోజుకు కనీసం ఒక్క సారైనా
విష్ణుసహస్ర నామ పారాయణం చేయండి.
ఉత్తమ ఫలితాలు పొందండి..
మంత్రాల ఘనికి మూల మంత్రం శ్రీ విష్ణుసహస్రనామం
ఓం నమో నారాయణాయ .
ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది...
విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన
అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగును ఆయురారోగ్యము కలుగును,
పాపములు తొలగును.
స్తోత్రము లో ప్రతి నామము అద్భుతం.
మన నిత్య జీవితంలోని అన్నీ సమస్యలకు పరిష్కరాలు ఇందులో వున్నాయి
విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్ర నామపారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు.
అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ.. ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా ఇంటి దేవతా పూజతో, ఇష్టదేవతా పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు.
అయితే విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే..?
1. అదృష్టం
2. ఆర్థిక ఇబ్బందులు వుండవు
3. గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం
4. కోరిన కోరికలు నెరవేరుతాయి
5. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది
విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చేయాలి. ఆపై పూజగదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్ర నామం నుంచి వెలువడే శబ్ధం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది. అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు వుంటాయి. అలాగే తులసీ మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు.
అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను
108 మార్లు జపించవలెను.
పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:
1. విద్యాభివృద్ధికి :-
14వ శ్లోకం.
సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||
2. ఉదర రోగ నివృత్తికి:-
16వ శ్లోకం.
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||
3. ఉత్సాహమునకు:-
18వ శ్లోకం.
వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||
4. మేధాసంపత్తికి:-
19వ శ్లోకం.
మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |
అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||
5. కంటి చూపునకు:-
24వ శ్లోకం.
అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |
సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ ||
6. కోరికలిడేరుటకు:-
27వ శ్లోకం.
అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |
సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||
7. వివాహ ప్రాప్తికి:-
32వ శ్లోకం.
భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |
కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||
8. అభివృద్ధికి:-
42వ శ్లోకం.
వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |
పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||
9. మరణ భీతి తొలగుటకు:-
44వ శ్లోకం.
వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||
10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:-
46వ శ్లోకం.
విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం |
అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||
11. జ్ఞానాభివ్రుద్ధికి:-
48వ శ్లోకం.
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |
సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||
12. క్షేమాభివ్రుధ్ధికి:-
64వ శ్లోకం
అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |
శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||
13. నిరంతర దైవ చింతనకు:-
65వ శ్లోకం.
శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||
14. దుఃఖ నివారణకు:-
67వ శ్లోకం.
ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |
భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||
15. జన్మ రాహిత్యమునకు:-
75వ శ్లోకం.
సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||
16. విద్యా ప్రాప్తి కి :-
80వ శ్లోకం.
అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|
సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః||
17. శత్రువుల జయించుటకు:-
88వ శ్లోకం.
సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !
న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః ||
18. భయ నాశనమునకు:-
89వ శ్లోకం.
సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |
అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||
19. సంతాన ప్రాప్తి కి :-
90వ శ్లోకం.
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్|
అధృత స్స్వధృత స్య్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః||
20. మంగళ ప్రాప్తికి:-
96వ శ్లోకం.
సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |
స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||
21. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు:-
97 & 98వ శ్లోకం.
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |
శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||
22. దుస్వప్న నాశనమునకు:-
99వ శ్లోకం.
ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |
వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||
23. పాపక్షయమునకు:-
106వ శ్లోకం.
ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |
దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాసనః ||
24.సర్వ రోగ నివారణకు:-
103వ శ్లోకం.
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః
తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః||
25. సుఖ ప్రసవమునకు:-
107వ శ్లోకం.
శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|
రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః||
శ్రీ స్సర్వ ప్రహరణాయుధ ఓమ్ నమ ఇతి
విష్ణు సహస్ర నామము మొత్తం చదివిన తదుపరి మీకు ఇందులో కావలసిన శ్లోకం 108 సార్లు పఠించవలెను.
Thursday, February 29, 2024
శివాభిషేకము
1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును
4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును
8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును
17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.
శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18.ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 .ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 .నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21.కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 .నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 .మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 .పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు. -
దేవాలయాలు - అపూర్వమైన ఆధ్యాత్మిక సంపద , వారసత్వ సంపద
సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:
1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం, కడప జిల్లా.
నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:
1. మహానంది
2. జంబుకేశ్వర్
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా
నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,
3. మంజునాథ్.
శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్
సముద్రమే వెనక్కివెళ్లే
1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్,
2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.
స్త్రీవలె నెలసరి అయ్యే
1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,
2. కేరళ దుర్గామాత.
రంగులు మారే ఆలయం.
1. ఉత్తరాయణం, దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.
నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు
1. కాణిపాకం,
2. యాగంటి బసవన్న,
3. కాశీ తిలభండేశ్వర్,
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి
స్వయంభువుగా
సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.
ఆరునెలలకు ఒకసారి తెరిచే
1. బదరీనాథ్,
2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
3. గుహ్యకాళీమందిరం.
సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు
హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.
12 ఏళ్లకు ఒకసారి
పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.
స్వయంగా ప్రసాదం
1. తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం
ఒంటి స్తంభంతో
యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.
రూపాలు మారే
ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.
నీటితో దీపం వెలిగించే ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.
మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు
1. హేమాచల నరసింహ స్వామి.
2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి
మనిషి వలె గుటకలు
వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.
అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.
ఛాయా విశేషం
1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
2. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
3. బృహదీశ్వరాలయం
నీటిలో తేలే విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ), నేపాల్
ఇంకా...
తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్, కంచి,
చిలుకూరి బాలాజీ, పండరినాథ్, భద్రాచలం, అన్నవరం లాంటి మహా పుణ్యక్షేత్రాలు .....
పూరీ
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం.
ఇవి మన అపూర్వమైన ఆధ్యాత్మిక సంపద , వారసత్వ సంపద .......
Sunday, February 18, 2024
రథసప్తమి: అంటే ఏమిటి, ఎందుకు?
రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.
సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.
1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'
2. వైశాఖంలో అర్యముడు,
3. జ్యేష్టం-మిత్రుడు,
4. ఆషాఢం-వరుణుడు,
5. శ్రావణంలో ఇంద్రుడు,
6. భాద్రపదం-వివస్వంతుడు,
7. ఆశ్వయుజం-త్వష్ణ,
8. కార్తీకం-విష్ణువు,
9. మార్గశిరం- అంశుమంతుడు,
10. పుష్యం-భగుడు,
11. మాఘం-పూషుడు,
12. ఫాల్గుణం-పర్జజన్యుడు.
ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.
భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కధనం ప్రకారం
బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట.అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని 'యుగ సహస్ర యోజన పరాభాను' అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు.
దీన్ని లెక్క కడితే 'యుగం.. 12000 ఏళ్లు, సహస్రం 1000, యోజనం 8 మైళ్లు, మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే
ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.
ఆ ఏడు గుర్రాల పేర్లు
1. గాయత్రి,
2. త్రిష్ణుప్పు,
3. అనుష్టుప్పు,
4. జగతి,
5. పంక్తి,
6. బృహతి,
7. ఉష్ణిక్కు
వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.
రామ రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని 'ఆదిత్య హృదయం' ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది.
ఇందులో 30 శ్లోకాలున్నాయి.వీటి స్మరణ వల్ల శారీరక,మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.
సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.
ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.
ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది.జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:
నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!
పూజ విదానం:- చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి,ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.
ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి.ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి.దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.
జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, రాగిపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.
మనం చేసే పూజలు, వ్రతాలు అన్ని పుణ్యసంపాదన కొరకే. శివ కేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది.
ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే!
ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా చేయాలట….
ఏటా మాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజు 'రథసప్తమి' జరుపుకుంటారు. ఆరోగ్య ప్రధాత అయిన సూర్యుడిని ఈ రోజు ఎలా పూజించాలి, ఏం నివేదించాలి, నిత్యం సూర్యుడికి చేసే పూజకి, రథసప్తమి రోజు పూజకి వ్యత్యాసం ఏంటి..
భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. అందుకే భానుడిని ప్రత్యక్షదైవం అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి రోజు జరుపుకునే రథసప్తమి మరింత విశేషమైనదని చెబుతారు. ఆదిత్యుడితి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజు ఏఏ నియమాలు పాటించాలి...
రథ సప్తమి రోజు ఏం చేస్తే మంచిది .. ఎలాంటి ఫలితం ఉంటుంది
సూర్యుడిని ఆరోగ్యప్రాధాతగా కోలుస్తారు. రథసప్తమి రోజున ప్రాతఃకాల సమయంలో గంగలో స్నానాలు, సూర్యోపాసనల వలన మృత్యుభయం పోతుందని విశ్వాసం. ఈ రోజు నదీ తీరంలో స్నానం ఆచరించాలి. తలమీద 7 జిల్లేడు ఆకులను, రేగు పళ్ళను ఉంచుకుని స్నానం చేయాలి. జిల్లేడు ఆకుని అర్కపత్రం అంటారు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం , ఏడు జన్మల్లో చేసిన పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశింపజేస్తాయంటారు.
నదుల దగ్గర స్నానం చేసిన వారు.. నేయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించి.. నీటిలో వదలాలని చెబుతారు.
రథ సప్తమిరోజున ఆవు నేతితో దీపారాధన చెయడం వల ఆ ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతారు.
రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి, సంకాంత్రి రోజున పెట్టిన పిడకలు, గొబ్బెమ్మలతో పొయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగిస్తారు.
పొంగిన పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు.
తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు.
రథసప్తమి రోజు సూర్యుడిని ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది.
రథసప్తమి రోజు బంగారం, వెండి లేదా రాగితో సూర్యుడికి చిన్న రథం చేయించి అందులో ఎర్రరంగు సూర్యుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించి ఆ రథాన్ని పండితులకు దానం ఇస్తే మంచిదంటారు.
రథ సప్తమి రోజు ఉపవాసం ఉండి దైవారాథనలోనే కాలం గడిపితే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుని అనుగ్రహం పొందుతారని విశ్వాసం.
ఈ రోజున ముత్తయిదువులు తమ నోములకు, వ్రతాలకు అంకురార్పణ చేస్తారు.
చిత్రగుప్తుని నోము, ఉదయకుంకుమ నోము , పదహారఫలాల నోము, గ్రామకుంకుమ నోములను ఈ రోజు ప్రారంభిస్తారు.
ఈ రోజు ఏ పుణ్యకార్యం తలపెట్టినా విజయవంతగా పూర్తి అవుతుందని నమ్మకం.
సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు జీవనాధారం అయిన సూర్యుడిని ఈ రోజు పూజిస్తే అప్పుల బాధలు, అనారోగ్యం, శత్రుబాధలు నశిస్తాయని చెబుతారు.
ఓం నమో నారాయణాయ🙏
💥🌅 #ఓం_శ్రీ_సూర్య_నారాయణాయ_నమః 🌅💥
💥🌅 #రథసప్తమికి #జిల్లేడకుకి సంబంధం ఏమిటి?
💥🌅 రథసప్తమినాడు స్నాన సమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి. ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలి? ఏ తమలపాకో చిక్కుడాకో ఎందుకు పెట్టుకోకూడదు అన్నసందేహమూ వస్తుంది.
💥🌅 దీని వెనుక ఒకకథ ఉంది. పూర్వం అగ్నిష్వాత్తులు అనే పండితులు మహానిష్ఠతో చాలా యజ్ఞాలు చేశారు.
💥🌅 ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది, వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవవిమానం పంపించాడు. ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిష్వాత్తులు. ఆ దేవవిమానం చూసిన సంభ్రమంలో వారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు.
💥🌅 అయితే ఆసమయంలో పెద్దగాలిరావడంతో కొంత వేడివేడి నెయ్యి ప్రక్కనే ఉన్న ఒకమేకపై పడింది. ఆ వేడికి మేకచర్మం ఊడిపోయి మరణించి, దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవవిమానంలో కూర్చుంది. ఆచర్మం ప్రక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది.
💥🌅 అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్త్వం మారిపోయి, మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది.
💥🌅 అలా జిల్లేడాకు యజ్ఞంత సమయంలో ఆజ్యధారలు ధరించడంతో పరమపవిత్రం అయ్యింది. జిల్లేడు ఆకును ముట్టుకొంటే మేకచర్మంలా మెత్తగా ఉంటుందందుకే! జరిగిన దానికి అగ్నిష్వాత్తులు బాధపడ్డారు. అప్పుడు ఆకాశవాణి, "మీరు దుఃఖించాల్సిన పనిలేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి, దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది.
💥🌅 ఈ జిల్లేడు మేకచర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారింది" అని పలికింది. ఆ మాట అగ్నిష్వాత్తుల్ని సంతోషపరిచింది. అది మాఘశుద్ధ సప్తమీతిథి.
💥🌅 అప్పటి నుండి రథసప్తమినాడు నెత్తిపై జిల్లేడాకు పెట్టుకుని, సూర్యప్రీతి కోసం స్నానం చేసేవారికి లేశమాత్రం యజ్ఞఫలం లభిస్తోంది. ఏడుజన్మల పాపాలు పోతున్నాయి.
💥🌅 ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః 🌅💥
: రథ సప్తమి విశిష్టత
‘ఆరోగ్యం బాస్కరాధిచ్చేత్’ ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు, సూర్య భగవానున్ని ఆరాదించే పండుగ 'రథ సప్తమి'. చిమ్మ చీకట్లను తరిమి.. చలిని తొలగించి నులు వెచ్చని ఉత్సాహాన్ని, చైతన్యాన్ని కలిగించే కర్మ సాక్షిగా నిలిచే సూర్యభగవానునికి కృతఙ్ఞతా సూచకంగా చేసే పండుగ ఇది. సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈ రోజు పవిత్రమైన రోజుగా భావించి భారతీయులు సూర్యున్ని ఆరాధిస్తారు.
చలికాలము చివర్లో.. వేసని కాలపు ఆరంభం మాఘ మాసమవుతుంది. 'రథసప్తమి' పండుగను మాఘ మాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు. సూర్యుడు దక్షిణాయణం ముగించుకుని, ఉత్తరాయణంలో ప్రవేశించటానికి సూచనగా మనం రెండు పండగలను జరుపుకుంటాము. అందులో ఒకటి సంక్రాంతి. రెండవది రథ సప్తమి. సప్తమి సూర్యుని జన్మ తిధి. ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు, జరుపుకునే రథ సప్తమి సూర్య సంబంధమైన పండుగ.
శ్రీసూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి 6 ఆకులు. రథానికి 7 అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు 6 ఋతువులు. 7 అశ్వాలు 7 కిరణాలు. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసు.. అనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టి యొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు.
ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణువు అనే ఈ 12 మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధారభూతులవుతున్నారని, ఈ 12 నామాలు స్మరిస్తే, దీర్ఘ రోగాలు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణం చెబుతోంది.
ఈ 'రథ సప్తమి' రోజు తిరుమల తిరుపతిలో కూడా శ్రీవారిని ముందుగా సూర్యప్రభ వాహనం మీద ఊరేగింపు చేస్తారు. చివరన చంద్రప్రభ వాహనంపై ఊరేగిస్తారు. మిగతా వాహనాలు హనుమద్వాహన, గరుడ వాహన, పెదసేష వాహన, కల్పవృక్ష వాహన, స్వయం భూపాల వాహనాలపై స్వామివారిని ఊరేగిస్తారు. చక్రస్నానం కూడా ఇదే రోజు చేస్తారు. ఒక్క రోజు బ్రహ్మోత్సవాన్ని కన్నులపండుగగా జరుపుతారు. భక్తులు స్వామి వారిని కనులారా దర్శించుకుని తరిస్తారు.
ఏడు జన్మల పాపాలు నశిస్తాయి
రథ సప్తమికి ముందు రోజున రాత్రి ఉపవాసం చేసి, మరునాడు అంటే రథ సప్తమి అరుణోదయంతోనే స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. స్నానానికి ముందు ప్రమిదలో దీపం వెలిగించి దానిని శిరసుపై నుంచి, సూర్యుని ధ్యానించి, దీపాన్ని నీటిలో వదిలి, స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు, జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు, రేగుపళ్ళు నెత్తిమీద పెట్టుకుని స్నానం చేయాలి.
ఇక స్నానానంతరం.. 'జననీత్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే.. సప్తమ్యా హ్యాదితే దేవి నమస్తే సూర్యమాతృకే'... అంటూ శ్లోకం చదివి, సూర్యునికి అర్ఘ్యమిచ్చి, ధ్యానం చేయాలి. అటు తర్వాత తల్లిదండ్రులు లేని వారైతే, పితృతర్పణం చేసి, చిమ్మిలి దానం చేయాలి.
ఇంకొందరు రథసప్తమి వ్రతం కూడా చేస్తారు. మాఘశుద్ధ షష్టి నాడు, అంటే రథసప్తమికి ముందు రోజు తెల్ల నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. బంధువులతో కలసి నూనె లేని వంటకాలతో భోజనం చేయాలి. రాత్రి ఉపవాసముండాలి. వేద పండితులను పిలిచి, వారినే సూర్య భగవానులుగా తలచి సత్కరించాలి. రాత్రికి నేలపై నిద్రించాలి. గురువుకు ఎరుపు వస్త్రాలు దానం చేయాలి.
ఈ పర్వదినాన బంగారము గాని, వెండిగాని, రాగిగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో అలంకరించి అందులో ఎరుపు రంగు ఉండే సూర్యుని ప్రతిమను ఉంచి, పూజించి గురువునకు ఆ రథమును దానమీయవలెనని, ఆ రోజు ఉపవాసం ఉండి.. సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమంలను చూస్తూ కాలక్షేపం చేయాలి. ఇలా రథసప్తమీ వ్రతముతో సూర్య భగవానుని అనుగ్రహంతో ఆయురారోగ్యాది సకల సంపదలు వచ్చునని శాస్త్ర ప్రబోధము.
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహోద్యుతిం..
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం..
బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నంతు మహేశ్వరం..
సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరం..
వినతాతనయో దేవః కర్మ సాక్షీ సురేశ్వరః..
సప్తాశ్వః సప్తరజ్జుశ్చ అరుణోమే ప్రసీదతు..
ఆదిత్యశ్య నమస్కారం యే కుర్వంతి దినే దినే..
జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే..
ఆ ప్రత్యక్ష భగవానుడి ఆశీర్వాదంతో.. అనుగ్రహంతో అందరూ సదా సర్వదా ఆరోగ్యంతో, ఆనందంతో జీవించాలని కోరుకుంటూ... ముందుగా అందరికీ రథ సప్తమి పర్వదిన శుభాకాంక్షలు.
: రథసప్తమి సందర్భంగా .
* రథసప్తమి మహా తేజం...*
మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం 12 మంది సూర్యులు.
ఏడాదిలోని ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.
1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు ‘ధాత’,
2. వైశాఖంలో అర్యముడు,
3. జ్యేష్టం-మిత్రుడు,
4. ఆషాఢం-వరుణుడు,
5. శ్రావణంలో ఇంద్రుడు,
6. భాద్రపదం-వివస్వంతుడు,
7. ఆశ్వయుజం-త్వష్ణ,
8. కార్తీకం-విష్ణువు,
9. మార్గశిరం- అంశుమంతుడు,
10. పుష్యం-భగుడు,
11. మాఘం-పూషుడు,
12. ఫాల్గుణం-పర్జజన్యుడు.
ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.
భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు.
బాల్యంలో హనుమంతుడు సూర్యుణ్ణి పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని ‘యుగ సహస్ర యోజన పరాభాను’ అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు.
దీన్ని లెక్క కడితే... ‘యుగం.. 12000 ఏళ్లు, సహస్రం.. 1000, యోజనం.. 8 మైళ్లు, మైలు... 1.6 కిలోమీటర్లు వెరసి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది.
సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే,
ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.
ఆ ఏడు గుర్రాల పేర్లు
1. గాయత్రి,
2. త్రిష్ణుప్పు,
3. అనుష్టుప్పు,
4. జగతి,
5. పంక్తి,
6. బృహతి,
7. ఉష్ణిక్కు...
వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.
రామరావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది.
ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.
సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది.
అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.
శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం
*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...
-
1) భగవంతుని ముందు ప్రవర చెప్పేటప్పుడు కుడి చేత్తో కుడి చెవిని, ఎడమ చేత్తో ఎడమ చెవిని పట్టుకొని ముందుకు వంగి చెప్పవలెను. 2) మానవుల ముందు ప్రవ...
-
నివేదనల పేర్లు 1)చూతఫలం=మామిడిపండు 2)ఖర్జూర= ఖర్జూరం. 3)నింబ=వేప 4)నారింగ=నారింజ 5)భల్లాతకీ=జీడిపప్పు 6)బదరీ=రేగు 7)అ...
-
“అశరీరాం వార్తాహారిణి, కర్ణ పిశాచి నమామ్యహం”!! పూర్వం కృష్ణా జిల్లాలో ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరిలో ఒక బ్రాహ్మణ కుటుం...