Wednesday, August 30, 2023

శ్రీహయగ్రీవ జయంతి

జ్ఞానానంద మయం దేవం నిర్మల స్పటికాకృతిమ్ 

ఆధారం సర్వ విద్యానామ్ హాయగ్రీవం ఉపాస్మహే 


సింహే శ్రవణ సంజాతం విద్యా నామాధిమం గురుం

జ్ఞానానంద ప్రధాతారం హాయగ్రీవం ఉపాస్మహే


సర్వవిద్యా స్వరూపాయ లక్ష్మీ సంశ్లిష్ఠ వక్షసే

మధుపాసన లక్ష్యాయ హయగ్రీవాయ మంగళం


శ్రీమతే రామానుజాయ నమ:

శ్రీ సుబ్రహ్మణ్య ద్వాదశ నామ స్తోత్రం

 ప్రథమం షణ్ముఖంచ  

ద్వితీయం గజాననానుజం

త్రుతీయం వల్లీవల్లభంచ 

చతుర్ధం క్రౌంచభేదకం

పంచమం దేవసేనానీంశ్ఛ 

షష్ఠం తారకభంజనం

సప్తమం ద్వైమాతురంచ 

అష్టమం జ్ఞానబోధకం

నవమం భక్తవరదంచ 

దశమం మోక్షదాయకం

ఏకాదశం శక్తిహస్తంచ 

ద్వాదశం అగ్నితేజసం

Tuesday, August 22, 2023

మజ్జిగ

ఈనాడు దాదాపు నూటికి 90% మంది ప్రజలు తమ ఆహారంలో మజ్జిగను పూర్తిగా మానేశారు. రెండు పూటలా పెరుగును మాత్రమే వాడుతున్నారు.

పెరుగు ఆయుక్షీణం. రాత్రి సమయంలో అసలు తినకూడదు.

మజ్జిగ  5 రకాలు

1. మధితము:
పెరుగులో నీరు కలపకుండా చిలికి చేసిన మజ్జిగ చిక్కగా ఉంటుంది. ఈ మజ్జిగను ఆహారంలో తీసుకుంటే నీరసం, ఉదర రోగాలు, పైత్యము, వాతము, రుచి తెలియక పోవడం, నీళ్ళ విరోచనాలు మొదలైనవి పోయి శరీరానికి బలం కలుగుతుంది.

2. మిళితము:
పెరుగు ఒక వంతులో నీళ్లు మూడు వంతులు పోసి చిలికి తయారు చేసిన మజ్జిగ అరుచిని, అతిసార విరోచనాన్ని, రక్తంలో చేరిన వాతాన్ని ఇంకా అనేక రోగాలను పోగొడుతుంది.

3. గోళము:
ఒక వంతు పెరుగు, ఒకటిన్నర వంతు నీళ్లు కలిపి తయారు చేసిన మజ్జిగ శరీరానికి మంచి కాంతి వస్తుంది. కంటికి మేలు చేస్తుంది. ఉదరములో మందాగ్ని, విష దోషాలు, కఫము, ఆమరోగములను పోగొడుతుంది.

4. షాడభము:
ఒక వంతు పెరుగు, అయిదు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసిన మజ్జిగ శ్లేష్మరోగాలను, రక్తమూల వ్యాధిని
పోగొడుతుంది. ఈ మజ్జిగ తేలికగా ఉండి ఉదరములో జఠరాగ్నిని పెంచి శరీరానికి కాంతినిస్తుంది.

5. కాలశేయము:
ఒకవంతు పెరుగు, రెండు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసిన ఈ మజ్జిగ బంక విరోచనాలు, విషములను, ఉబ్బులను, మంటను, వాతమును, మూలవ్యాధిని పోగొట్టి శరీరం త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది. పడిన ముడతలను కూడా తీసి వేస్తుంది.

మజ్జిగ ఆహారంలో తీసుకోవటం అన్ని కాలాలలో, అన్ని వయసుల వారికి మంచిది

Tuesday, August 8, 2023

యక్ష_ప్రశ్నలు....

ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు.... వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు..:


1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)


2. సూర్యుని చుట్టూ తిరుగు వారెవరు? (దేవతలు)


3. సూర్యుని అస్తమింప చేయునది ఏది? (ధర్మం)


4. సూర్యుడు దేని ఆధారంగా నిలచి యున్నాడు? (సత్యం)


5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)


6. దేని వలన మహత్తును పొందును? (తపస్సు)


7. మానవునికి సహాయపడునది ఏది? (ధైర్యం)


8. మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)


9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? (అధ్యయనము వలన)


10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సు వలన సాధు భావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధు భావము సంభవించును.)


11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయము వలన)


12. జీవన్మృతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)


13. భూమికంటె భారమైనది ఏది? (జనని)


14. ఆకాశం కంటే పొడవైనది ఏది? (తండ్రి)


15. గాలి కంటె వేగమైనది ఏది? (మనస్సు)


16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)


17. తృణం కంటే దట్టమైనది ఏది? (చింత)


18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)


19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్య చే)


20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ఞం చేయుట వలన)


21. జన్మించియు ప్రాణం లేనిది (గుడ్డు)


22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? (రాయి)


23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడం వలన)


24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)


25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)


26. బాటసారికి, రోగికి, గృహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)


27. ధర్మానికి ఆధారమేది? (దయ, దాక్షిణ్యం)


28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)


29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)


30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)


31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)


32. మనిషికి ఆత్మ ఎవరు? ( కుమారుడు)


33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)


34. మనిషి దేని వల్ల సంతసించును? (దానం)


35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)


36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)


37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)


38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)


39. ఎవరితో సంధి శిథిలమవదు? (సజ్జనులతో)


40. ఎల్లప్పుడూ తృప్తిగా పడి యుండునదేది? (యాగ కర్మ)


41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)


42. అన్నోదకాలు వేని యందు ఉద్భవిస్తాయి? (భూమి, ఆకాశము లందు)


43. లోకాన్ని కప్పి వున్నది ఏది? (అజ్ఞానం)


44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)


45. మనిషి దేనిని విడచి సర్వజన ఆదరణీయుడు, శోక రహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో)


46. తపస్సు అంటే ఏమిటి? ( తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం)


47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)


48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)


49. సర్వ ధనియ అనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)


50. జ్ఞానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించగలగడం)


51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)


52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)


53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)


54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ఞానం కలిగి ఉండటం)


55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)


56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)


57. దానం అంటే ఏమిటి? ( సమస్త ప్రాణుల్ని రక్షించడం)


58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)


59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు)


60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)


61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ఞానం)


62. డంభం అంటే ఏమిటి? (తన గొప్ప తానే చెప్పుకోవటం)


63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)


64. నరకం అనుభవించే వారెవరు? (ఆశ పెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు)


65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)


66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)


67. ఆలోచించి పని చేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు)


68. ఎక్కువ మంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)


69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)


70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)


71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ, అప్రియమూ, సుఖమూ, దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)


72. స్ధితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందూ, కలిమి లేములందూ, సుఖ దు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్ధి కలవాడుగా ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు)

సర్వేజనాసుఖినోభవంతు

కాశి ఆలయ చరిత్ర

 👉 కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం. 

👉 కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.

👉 క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం

👉 క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన

👉 క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం

👉 క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన  గుజరాతి వర్తకులు

👉 క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి

👉 క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్

👉 క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం

👉 క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు

👉 శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి

👉 క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు

👉 క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం

👉 క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం

👉 క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు

👉 క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్

👉 కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం

👉 ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు

👉 కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం

👉 184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన. 

👉 12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.

👉 కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.

👉 మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.

👉 కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.

👉 విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.

👉 ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.

👉 ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.

👉 2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి యుగపురుషుడు హిందువులందరికీ ఆరాధ్య మైనవాడు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...